Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Hero Roshan: భక్తుల్లో ఒకడిలా తిరుమలలో హీరో రోషన్‌

PPINEWZ
Mar 13, 2026 14:55:44
Young Hero Roshan Visits Tirumala Temple On His Birthday Occasion
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 13, 2026 15:26:58
Hyderabad, Telangana:

Salman Ali Agha Run Out Vs Bangladesh: ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో వివాదాస్పదంగా మారిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభించాయి. ఢాకా వేదికగా పాక్, బంగ్లా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

ఏం జరిగిందంటే? 
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో వన్డేలో పాక్ కెప్టెన్ రనౌట్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తావిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అలా 39వ ఓవర్‌లో.. 
వైరల్ అయిన వీడియో ప్రకారం.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ జరిగింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ మీరాజ్ చేసిన కన్ఫూజన్ కారణంగా అతడు రనౌట్ అయినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలర్ వైపు స్ట్రైట్ షాట్ కొట్టాడు. అయితే ఈ క్రమంలో రన్నర్‌గా ఉన్న కెప్టెన్ సల్మాన్.. క్రీజ్ నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగాడు. బంతి బౌలర్ చేతికి అందుకునే క్రమంలో బౌలర్ అడ్డుగా తగిలాడు. దీంతో సల్మాన్ క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు వీలు కుదరలేదు. అది గమనించిన బౌలర్ వెంటనే బంతిని అందుకొని స్టంప్ చేశాడు. దీంతో అది ఔట్ గా రివ్యూలో తేలింది. దీంతో చేసేదేమి లేక తిట్టుకుంటూ పాక్ కెప్టెన్ డకౌట్ చేరుకున్నాడు. 

అయితే ఈ వీడియోలో బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ చేసిన చర్యలపై క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. అయితే ఈ రనౌట్ విషయంలో పాక్, బంగ్లా కెప్టెన్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాదన మధ్య వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా చేరినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లు వాళ్లిద్దర్ని శాంతింపజేశారు. అయితే సల్మాన్ అలీ అఘా 62 బంతుల్లో 64 పరుగులు రాబట్టి రనౌట్‌గా నిలిచాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆధిపత్యం చూపించిన పాకిస్థాన్ జట్టు 50 ఓవర్లు చేరకముందే ఆలౌట్‌ అయ్యింది. 47.3 ఓవర్లలో 274 పరుగులకి కుప్పకూలిపోయింది. ప్రస్తుతం వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ జాప్యం కలిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. బంగ్లాదేశ్ గెలుపుకోసం మరో 216 రన్స్ చేస్తే సరిపోతుంది.

Also Read; Sadhvi Prachi Monalisa: "మోనాలిసా 35 ముక్కలుగా మారిపోతుంది..జాగ్రత్త!" 'లవ్ జిహాద్' పై సాధ్వీ ప్రాచీ కీలక వ్యాఖ్యలు!

Also Read: LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

193
comment0
Report
BBhoomi
Mar 13, 2026 14:04:23
Secunderabad, Telangana:

Rupee Hits All-Time Low: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు..  మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో భారత కరెన్సీ  రూపాయి మళ్లీ భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో గణనీయంగా పడిపోయి రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. రోజంతా జరిగిన మారకద్రవ్య లావాదేవీల అనంతరం రూపాయి విలువ డాలర్‌కు 92.45 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు రూపాయి విలువ డాలర్‌కు 92.33 వద్ద ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న సమయంలో క్రమంగా బలహీనపడుతూ డాలర్‌కు 92.47 వరకు పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. చివరకు రోజు ముగిసే సమయానికి రూపాయి 92.45 వద్ద స్థిరపడింది. ముందు రోజు కూడా రూపాయి 24 పైసలు పడిపోయి 92.25 వద్ద ముగిసింది.

విశ్లేషకుల ప్రకారం ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాక్ జలాల్లో చమురు ట్యాంకర్లపై దాడుల సమాచారం వెలువడిన తర్వాత ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది.

చమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత్ పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకునే దేశం. ధరలు పెరిగితే దిగుమతి ఖర్చులు పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ఇంధన సంస్థ అయిన ఇంటర్నేషన్ ఎనర్జీ ఏజెన్సీ అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంయుక్త విడుదలగా భావిస్తున్నారు.

Also Read: Solar Stove: గ్యాస్ సిలిండర్ కోసం కంగారుపడాల్సిన అవసరం లేదు.. రూపాయి ఖర్చు లేకుండా ఎండలో మండే స్టవ్..!!  

మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా రూపాయి బలహీనతకు కారణమైంది. ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ పనితీరును అంచనా వేసే అమెరికా డాలర్ ఇండెక్స్  0.43 శాతం పెరిగి 100.17 స్థాయికి చేరుకుంది. ఇక విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనాన్ని వేగవంతం చేసింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఒకే రోజు దాదాపు రూ. 7,000 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు.

రూపాయి బలహీనత స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్సీ 1,470 పాయింట్లకు పైగా పడిపోయి 74,563 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 50 కూడా దాదాపు 488 పాయింట్లు పడిపోయి 23,151 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అధికంగా కొనసాగితే మరియు గ్లోబల్ ఉద్రిక్తతలు తగ్గకపోతే రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి 92.10 నుంచి 92.80 మధ్య ట్రేడింగ్ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read:  Russia Oil Revenue: అమెరికా జేబుకు చిల్లు..రష్యాకు డబ్బే డబ్బు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ ట్రంప్?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

119
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 13, 2026 13:25:38
Pithapuram, Andhra Pradesh:

SVSN Varma vs Pawan Kalyan: తనను ఎమ్మెల్యే కాకుండా టికెట్‌ తన్నుకుని వెళ్లి గెలిచిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంతో పిఠాపురంలో తన ఉనికికే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మరోసారి అలిగారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్మ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. సొంత టీడీపీ నాయకులపైనే విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ ఫొటో విషయమై రచ్చకు దారి తీయగా.. అధికారులు, కూటమి నాయకులపై మండిపడ్డారు.

Also Read: Harish Rao: గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సూటిగా 8 ప్రశ్నలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన మున్సిపల్ సమావేశం నిర్వహించగా..  మాజీ ఎమ్మెల్యే హోదాలో ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశంలో ఏర్పాటుచేసిన బ్యానర్‌లో సీఎం చంద్రబాబు ఫొటో చిన్నగా.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటో పెద్దగా ముద్రించడంతో వివాదం రాజుకుంది. ఆ బ్యానర్‌ను చూసిన వర్మ స్టేజీపైకి ఎక్కకుండా కిందనే ఉన్నారు. అధికారులు సీఎం చంద్రబాబును అవమానించారని.. ఇది సరైన వైఖరి కాదని వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులపై, కూటమి నాయకుల తీరుపై మండిపడ్డారు.

Also Read: Allu Cinemas: లారీ ఎక్కి వెళ్లి నేను సినిమాలు చూసేవాడిని: రేవంత్‌ రెడ్డి

వేదికపై పవన్ కల్యాణ్ ఫోటో పెద్దదిగా ఉంచి చంద్రబాబు ఫొటో చిన్నదిగా ఉంచడాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఖండించారు. చంద్రబాబుకు గౌరవం లేని చోట తాను కూర్చోలేను అంటూ వేదిక మీదకు వెళ్లకుండా కింద కుర్చీలో కూర్చున్నారు. అధికారులు, కూటమి నాయకులు ఎంత బతిమిలాడినా కూడా వర్మ స్టేజీ ఎక్కలేదు. అలా ఎలా పెడతారని అధికారులను ప్రశ్నించారు. ఎంతకీ వెనక్కి తగ్గని వర్మ.. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారు.

Also Read: Gas Cylinder Shortage: మళ్లీ కట్టెల పొయ్యి.. హాస్టల్స్‌, హోటళ్లలో సంప్రదాయ వంట పద్ధతి

సమావేశం మందిరం నుంచి బయటకు వచ్చాక స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ స్థానిక నేతలపై ఆగ్రహం. 'ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బొమ్మ లేకుంటే చూసుకోవడం తెలియదా? అంటూ టీడీపీ నాయకులపై వర్మ మండిపడ్డారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండనంటూ వర్మ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పిఠాపురంలో టీడీపీ వర్సెస్‌ జనసేనగా రాజకీయం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం రచ్చరచ్చగా ఉంది. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం వచ్చాక వర్మకు ప్రాధాన్యం లభించడం లేదు. ఇక అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తనకు ఎలాంటి పదవి లభించలేదు. మాజీ ఎమ్మెల్యేగా తప్ప ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వర్మలో అసంతృప్తి రగులుతోంది. కొన్నాళ్లలో వర్మ అసంతృప్తి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

106
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 13:15:58
Hyderabad, Telangana:

Chaturgrahi Yoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనం మానవ జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం మార్చి నెలలో ఒక అరుదైన అత్యంత శుభప్రదమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. మార్చి 18వ తేదీన బృహస్పతి అధిపతిగా వ్యవహరించే మీనరాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. ఈ సమయంలో చంద్రుడితో పాటు శని, శుక్రుడు, సూర్యుడు వంటి గ్రహాల సంయోగం జరుగుతుంది. దీంతో ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 21వ తేదీ వరకు ఈ యోగ ప్రభావం కొనసాగుతుంది. అప్పటివరకు మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
వృషభరాశి 
ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి ఆదాయ మార్గాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి కాస్త విముక్తి కూడా కలుగుతుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ధనయోగం ఉంది. వీరికి క్షేత్రస్థాయిలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్లో పెద్దపెద్ద మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో విచక్షణతో వ్యవహరించడం చాలా మంచిది. లేదంటే ఈ సమయంలో విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
మీన రాశి వారికి చతుర్గ్రాహి యోగం ప్రభావంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. జీవితంలో అనుకున్న శిఖరాలకు చేరేందుకు ముందడుగు వేసే అవకాశాలున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

133
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 11:14:22
Hyderabad, Telangana:

Sadhvi Prachi On Monalisa Marriage: ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా పూసలమ్మే అమ్మాయి ఫొటో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. మోనాలిసా భోంస్లే అని పేరుతో ఫొటోలు తెగ వైరల్ చేశారు. ఆ యువతి తాజాగా కేరళలోని ఓ ముస్లిం బాయ్‌ఫ్రెండ్‌ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడింది. అయితే ఈ ప్రేమ పెళ్లిపై పలువురు 'లవ్ జిహాద్' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది లవ్ జిహాద్ కాదని వారిద్దరూ మీడియాకి స్పష్టం చేశారు. 

ఇదే విషయంపై ప్రముఖ హిందుత్వవాది సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పథ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వీ ప్రాచీ.. మోనాలీసా మతాంతర వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి 'లవ్ జిహాద్' అంటూ అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత మోనాలిసా భోంస్లే పరిస్థితి ఎంతో దారుణంగా ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు. 

ఇదే మాదిరిగా గతంలో శ్రద్ధా వాకర్, నికితా తోమర్‌ల హత్యలు జరిగాయని సాధ్వీ ప్రాచీ గుర్తుచేశారు. అదే పరిస్థితి ఇప్పుడు మోనాలిసా ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం శ్రద్ధావాకర్ అనే యువతిని తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కోవలో 'లవ్ జిహాద్'కు తెగబడ్డ మోనాలిసా కూడా రాబోయే రోజుల్లో 35 ముక్కలుగా ఫ్రిజ్‌లో దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు. 

అందుకు బదులుగా మోనాలిసాను పెళ్లాడిన ఫర్మాన్ ఓ హిందువుగా మారి ఉంటే ఈ పెళ్లిని తాము అంగీకరించేవారమని సాధ్వీ ప్రాచీ చెప్పుకొచ్చారు. ఇది మోసపూరితమైన లవ్ జిహాద్ అంటూ ఆమె పునరద్ఘాటించారు. హిందువులు తమ పిల్లల మెడల్లో పంది దంతాలను కట్టాలని అలా చేయడం వల్ల ఇతర మతస్తులు తమ పిల్లల దరిదాపుల్లోకి రారని ఆమె సూచించింది.

Also Read: LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!

Also Read: Kamakshi Bhaskarla Photos: మనశ్శాంతి కోసం శ్మశానానికి వెళ్లే హీరోయిన్..అక్కడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

133
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 13, 2026 10:05:37
Hyderabad, Telangana:

Musi Gandhi Sarovar Project: మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్ రెడ్డి సాగిస్తున్న దమనకాండ, దౌర్జన్యాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. డీపీఆర్‌ లేకుండానే మూసీ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఏడీబీ ఇంకా రుణం కూడా చెల్లించలేదు కానీ పేదల ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన అసెంబ్లీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించాడని.. పేదల ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని నిలదీశారు.

Also Read: Allu Cinemas: లారీ ఎక్కి వెళ్లి నేను సినిమాలు చూసేవాడిని: రేవంత్‌ రెడ్డి

మూసీ గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుపై హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డికి కీలకమైన 8 సూటి ప్రశ్నలు వేశారు. వాటిలో రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం, బుల్డోజర్‌ పాలనపై ప్రశ్నలు వేసి రేవంత్ రెడ్డిని నిలదీశారు. వాటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటికితోడు బీజేపీ నాయకత్వానికి కూడా మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నలు వేశారు.

Also Read: Gas Cylinder Shortage: మళ్లీ కట్టెల పొయ్యి.. హాస్టల్స్‌, హోటళ్లలో సంప్రదాయ వంట పద్ధతి

హరీశ్‌ రావు 8 ప్రశ్నలు

  1. అసెంబ్లీ వేదికగా జనవరిలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాధానం ప్రకారం హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది చెప్పారు. మరి డీపీఆర్‌ రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చావు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతామని గెజిట్ ఎట్లా ఇచ్చావు?
  2. మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? మూసీ ప్రక్షాళననా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు?
  3. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు? ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసీ నుంచి ఎలా కొలుస్తారు?
  4. ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేశారా? చేస్తే బయట పెట్టండి.
  5. జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి ఏడీబీ లోన్ రూ.4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి అంగీకరించి మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23, 2026 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం రుణం మంజూరు చేయలేదు అని చెప్పింది. నిన్న గాక మొన్న మార్చి 11వ తేదీన ఇచ్చిన లేఖలో మేం ఇంకా రుణం మంజూరు చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్దం చెప్పాడు. ఇలా అబద్దాలు చెప్పే రేవంత్‌ రెడ్డి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన అసెంబ్లీనే రేవంత్‌ రెడ్డి తప్పు తోవ పట్టించాడు. రుణం మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించావా స్పష్టం చేయాలి? లేదంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. అబద్దాలు మాట్లాడే రేవంత్ రెడ్డి శాపగ్రస్తుడు.
  6. ఇప్పటికే చాదర్‌ఘాట్‌లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు పంపావు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పాలి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తావని ప్రజలు ఎలా నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్‌వాసులు నిన్ను ఎలా నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్‌ది అయితే.. మాట తప్పడమే రేవంత్‌ రెడ్డి నైజం అని పేరు తెచ్చుకున్నాడు.
  7. మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్‌వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తాననడం సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నావు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో  నిధులు జమ చేస్తావా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తావా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.  
  8. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలి.

Also Read: Gas Cylinder Shortage: ఎల్పీజీ గ్యాస్‌ కొరతపై కేంద్రానికి కేటీఆర్‌ లేఖ.. గ్యాస్‌ అందించాలని విజ్ఞప్తి

బీజేపీకి సూటి ప్రశ్న
'మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానిస్తాం అంటున్నారు. మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బిజేపీ సహకరిస్తుందా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్ధిస్తుందా? సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. 'కిషన్ రెడ్డి బస్తీ నిద్ర అని ప్రచారం చేశారు. అందులో చిత్తశుద్ది లేదా? మూసీ పేరిట జరుగుతున్న చేస్తున్న రేవంత్ దోపిడీ ఎందుకు అడ్డుపడటం లేదు. సమాధానం చెప్పాలి' అని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

163
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 09:32:22
Hyderabad, Telangana:

LPG Cylinder Shortage: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ దేశంలో ఇంధన కొరత ఏర్పడుతున్న విషయం అందరికి తెలిసింది. ఆ యుద్ద ప్రభావం ఇప్పుడు వంటగదిపై చూపిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా అవసరమైన పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ కూడా కొరత ఏర్పడుతుందని వార్తలు ఇప్పుడు సామాన్యుడి కంటిపై కనుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ దందా మొదలయ్యి.. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ను వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ వాడకాన్ని తక్కువ చేసేలాగా కొన్ని చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

నేటితరంలో ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌నే ఉపయోగిస్తున్నారు. కట్టెల పొయ్యి వాడకం కూడా గ్రామస్థాయిలో దాదాపుగా తగ్గిపోయింది. ఈ క్రమంలో మళ్లీ కట్టెల పొయ్యిపై ఆధారపడాల్సిన పనే లేకుండా ఉన్న గ్యాస్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంది. కొందరు నిపుణులు చెబుతున్న చిట్కాలు పాటించడం ద్వారా మీ గ్యాస్ ను 20 నుంచి 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.  అయితే అందుకు మీరు మీ వంటగదిలో చేయాల్సింది కొన్ని చిన్నచిన్న మార్పులే. 

1) ఇంట్లో గ్యాస్ ఆదా చేసుకునేందుకు మొదటి ఉపాయం ప్రెషర్ కుక్కర్ వాడకం. ఇందులో ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో తక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. కుక్కర్‌లో బియ్యం, పప్పులు, కూరగాయలు, బంగాళదుంపలు వంటి వాటిని ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. మామూలు అల్యూమినియం గిన్నెల్లో వంట చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. 

2) మనలో చాలామంది వంట గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మిగిలిన సామాన్లు వెతకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వంటకు సంబంధించిన అన్ని సామాన్లను గ్యాస్ మండించక ముందే రెడీ చేసుకోవడం ఉత్తమం. కూరగాయలు కట్ చేయడం, మసాలా ప్రిపరేషన్ వంటివి ముందుగానే రెడీ చేయడం వల్ల వంట మధ్య హడావుడి లేకుండా తక్కువ గ్యాస్ ఖర్చుతో పని పూర్తవుతుంది. 

3) సాధారణంగా వంట చేసే ప్రక్రియలో చాలా మంది గిన్నెలపై మూతలు లేకుండా వంట చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల ఆహారం తొందరగా ఉడకదు. ఇలా చేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. మూత పెట్టి వంట చేయడం వల్ల వంట గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా పాత్ర పరిమాణం బట్టి మంటను అడ్జెస్ట్ చేయడం గ్యాస్ వృథా అవ్వదు. అదే విధంగా అల్యూమినియం బదులుగా కాపర్ పూత ఉన్న స్టీల్ పాత్రలను వంటకు వినియోగించడం ఎంతో మేలు.

4) ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, కూరగాయలు ఉడికిస్తున్నప్పుడు మొదటి విజిల్ తర్వాత మంటను తగ్గించండి. ఇలా చేస్తే ఆహారం ఉడికించే క్రమంలో గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ఎక్కువ మంట పెట్టడం వల్ల ఆహారంలోని నీరు ఆవిరైపోతుంది కానీ, ఆహారం ఉడకదు. కాబట్టి సన్నని మంటపై ఆహారాన్ని ఉడకబెట్టడం వల్ల గ్యాస్ ఆదా చేయోచ్చు. 

వంటగదిలో ఈ చిట్కాలు..
గ్యాస్ వినియోగదారులు నిత్యం గ్యాస్‌ను శుభ్రపరుకుంటే మేలు. ముఖ్యంగా బర్నర్లను క్లీన్ చేయడం ద్వారా గ్యాస్ వినియోగానికి ఆటంకం ఉండదు. నీలిరంగు మంట బదులు ఆరెంజ్ లేదా పసుపు రంగులో మంట వస్తే బర్నల్ రంధ్రాలు పూడుకుపోయాయని అర్థం. వెంటనే వాటిని క్లీన్ చేయాలి. 

మరోవైపు ఫ్రిజ్ లో నుంచి తీసిన పదార్థాలను వెంటనే వండొద్దు. అలా చేయడం వల్ల ఆహారం ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫ్రిజ్ లో నుంచి కూరగాయలు, పాలు, మాసాలాలు చల్లదనం తగ్గిన తర్వాత మాత్రమే వంటలో వినియోగించండి. 

గమనిక: మరీ ముఖ్యంగా గ్యాస్ పైపు‌లో లీకేజీ ఉంటే గ్యాస్ వృథాగా పోవడమే కాకుండా గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం ఉంది. మీకు ఏమైనా లీక్ అనుమానం వస్తే గ్యాస్ నిపుణులను సంప్రదించి పరిష్కారం తెలుసుకోవడం ఉత్తమం.

Also Read: Fee Reimbursement Latest News: కాలేజీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు..ఎట్టకేలకు అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు!

Also Read: Currency Notes Bleed Lines: 100, 200 నోట్లపై ఈ నల్లని గీతలను ఎప్పుడైనా గమనించారా? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

123
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 13, 2026 09:22:57
Hyderabad, Telangana:

Shani Astamayam 2026 Effect On Zodiac Telugu: ఖగోళంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. న్యాయదేవుడు, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు మార్చి 13వ తేదిన మీన రాశిలో అస్తమించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మీన రాశిలో ఆస్తమించి.. ఏప్రిల్‌ 22వ తేదిన సక్రమ మార్గంలోకి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా శని గ్రహం ఏదైన ఒక రాశిలో దాదాపు సుమారు రెండున్నర ఏళ్ల పాటు ఉంటుంది. అయితే, శని గ్రహం అస్తమించడం వల్ల మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొందరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, శని ప్రభావంతో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అదృష్టం పొందే రాశులు:
వృషభ రాశి:
శని ప్రభావంతో ఈ రోజు నుంచి వృషభ రాశివారికి సానుకూల కాలం ప్రారంభమవుతుంది. వీరికి గత కొంత కాలంగా నిలిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. వ్యక్తిగత సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. 

సింహ రాశి:
శని గ్రహం అస్తమించడం వల్ల సింహ రాశివారికి కెరీర్‌ పరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. దీంతో పాటు వేతనలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కార్యాలయాల్లో పైఅధికారుల ప్రశంసలు కూడా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్తుల నుంచి పాత వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు చాలా అద్భుతంగా  ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నవారికి భారీ మొత్తంలో లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన వారు అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. దీంతో పాటు తల్లిదండ్రుల సపోర్ట్‌ లభించి.. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

185
comment0
Report
RGRenuka Godugu
Mar 13, 2026 09:09:56
Hyderabad, Telangana:

Psycho Husband Video Record While Wife Hangs: భార్య ఆత్మహత్యను ఫోన్లో చిత్రీకరించిన ఘటన రాజంపేట బోయిన్‌పల్లిలో జరిగింది. ఉరేసుకుంటూ ఉంటే కాపాడాల్సిన భర్త నవ్వుతూ వీడియో చిత్రీకరించాడు. రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాసులు చేసిన ఈ బాగోతం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. రాజంపేట కొత్త బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న శ్రీరామ్ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆయన భార్య కృష్ణవేణితో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెని కాపాడకుండా నవ్వుతూ వీడియో చిత్రీకరించాడు. కిటికీ బయట నిలబడి ఆ దృశ్యాన్ని మొబైల్‌లో బంధించాడు. దీంతో పైశాచికంగా ఈయన ప్రవర్తించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డోరు పగుల కొట్టి ఓపెన్ చేశారు. అప్పటికే కృష్ణవేణి మృతి చెంది ఉంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ వీడియో వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు ప్రేరేపించాడా? అని దర్యాప్తు కొనసాగుతుంది. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
 

103
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 08:51:14
Velgapudi, Andhra Pradesh:

AP Fee Reimbursement Latest News: కాలేజీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీపికబురును అందించింది. ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేస్తూనే అందులో ఎలాంటి కోతలు ఉండవని స్పష్టం చేసింది. ఎన్నో రోజులుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ఉన్నత విద్యామండలిపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కాలేజీ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

తొలుత ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసే ప్రక్రియలో వడ్డీ మినహాయింపు కారణంగా నెల రోజులుగా ఆలస్యం అయినట్లు తెలిసిన విషయమే. ఇదే విషయమైన కాలేజీ మేనేజ్‌మెంట్స్ యూనియన్ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ విద్యార్థులకు ఎలాంటి కోత విధించకుండా నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ఎన్నో రోజులగా ఎదురుచూపులకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. 

ఏం జరిగిందంటే?
2024-25 ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్ల మేర విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన నిధులు వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కాలేజీ యాజమాన్యాలు భావించాయి. అయితే అంతలోనే ఉన్నత విద్యామండలి ఇందులో ట్విస్ట్ ఇచ్చింది.  

గవర్నమెంట్ వద్ద నిధులు లేకపోయినా రుణాలు తెచ్చిమరీ బకాయిలు ఇస్తున్నందున అందుకు సంబంధించిన రుణంపై 7.5 శాతం వడ్డీని కట్టాలని ప్రతిపాదించారు. ఇదే అంశంలో కాలేజీ యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అయినా వడ్డీ కట్టేందుకు కాలేజీ యాజమాన్యాలు అందుకు ససేమీరా అన్నాయి. దీంతో నిధుల  విడుదలను నిలిపేస్తూ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.1,200 కోట్లపై వడ్డీ చెల్లిస్తే తాము రూ.90 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యాలు వాపోయాయి. ఇదే విషయమై సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఏకంగా 250 మెయిల్స్ ద్వారా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి కాలేజీ మేనేజ్‌మెంట్స్ తీసుకెళ్లాయి. కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను అడిగితే వడ్డీ కట్టమని అంటున్నారని, ఇదేమి న్యాయం అని యాజమాన్యాలు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. 

ఈ సమస్యపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు, వడ్డీ ప్రతిపాదన విషయంలో ఉన్నత విద్యామండలి అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు సాంఘిక సంక్షేమ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. తొలుత రూ.300 కోట్లను బీసీ-డి కేటగిరీ విద్యార్ధుల ఫీజును విడుదల చేయగా.. ఉగాది నాటికి మిగిలిన రూ.900 కోట్లను కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో జమ చేస్తామని తెలియజేశారు. ఈ విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మిగిలిన బకాయిలు అతి త్వరలోనే కాలేజీ బ్యాంకు అకౌంట్లలో జమకానున్నాయని అధికారులు చెబుతున్నారు.

Also Read: Currency Notes Bleed Lines: 100, 200 నోట్లపై ఈ నల్లని గీతలను ఎప్పుడైనా గమనించారా? 99 శాతం మందికి తెలియని రహస్యం ఇది!

Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్‌డేట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top