Salman Ali Agha Run Out Vs Bangladesh: ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో వివాదాస్పదంగా మారిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభించాయి. ఢాకా వేదికగా పాక్, బంగ్లా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఏం జరిగిందంటే?
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో వన్డేలో పాక్ కెప్టెన్ రనౌట్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తావిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అలా 39వ ఓవర్‌లో..
వైరల్ అయిన వీడియో ప్రకారం.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ జరిగింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ మీరాజ్ చేసిన కన్ఫూజన్ కారణంగా అతడు రనౌట్ అయినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలర్ వైపు స్ట్రైట్ షాట్ కొట్టాడు. అయితే ఈ క్రమంలో రన్నర్‌గా ఉన్న కెప్టెన్ సల్మాన్.. క్రీజ్ నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగాడు. బంతి బౌలర్ చేతికి అందుకునే క్రమంలో బౌలర్ అడ్డుగా తగిలాడు. దీంతో సల్మాన్ క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు వీలు కుదరలేదు. అది గమనించిన బౌలర్ వెంటనే బంతిని అందుకొని స్టంప్ చేశాడు. దీంతో అది ఔట్ గా రివ్యూలో తేలింది. దీంతో చేసేదేమి లేక తిట్టుకుంటూ పాక్ కెప్టెన్ డకౌట్ చేరుకున్నాడు.
అయితే ఈ వీడియోలో బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ చేసిన చర్యలపై క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. అయితే ఈ రనౌట్ విషయంలో పాక్, బంగ్లా కెప్టెన్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాదన మధ్య వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా చేరినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లు వాళ్లిద్దర్ని శాంతింపజేశారు. అయితే సల్మాన్ అలీ అఘా 62 బంతుల్లో 64 పరుగులు రాబట్టి రనౌట్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆధిపత్యం చూపించిన పాకిస్థాన్ జట్టు 50 ఓవర్లు చేరకముందే ఆలౌట్ అయ్యింది. 47.3 ఓవర్లలో 274 పరుగులకి కుప్పకూలిపోయింది. ప్రస్తుతం వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ జాప్యం కలిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. బంగ్లాదేశ్ గెలుపుకోసం మరో 216 రన్స్ చేస్తే సరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Rupee Hits All-Time Low: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి మళ్లీ భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో గణనీయంగా పడిపోయి రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. రోజంతా జరిగిన మారకద్రవ్య లావాదేవీల అనంతరం రూపాయి విలువ డాలర్‌కు 92.45 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు రూపాయి విలువ డాలర్‌కు 92.33 వద్ద ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న సమయంలో క్రమంగా బలహీనపడుతూ డాలర్‌కు 92.47 వరకు పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. చివరకు రోజు ముగిసే సమయానికి రూపాయి 92.45 వద్ద స్థిరపడింది. ముందు రోజు కూడా రూపాయి 24 పైసలు పడిపోయి 92.25 వద్ద ముగిసింది.
విశ్లేషకుల ప్రకారం ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాక్ జలాల్లో చమురు ట్యాంకర్లపై దాడుల సమాచారం వెలువడిన తర్వాత ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది.
చమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత్ పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకునే దేశం. ధరలు పెరిగితే దిగుమతి ఖర్చులు పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ఇంధన సంస్థ అయిన ఇంటర్నేషన్ ఎనర్జీ ఏజెన్సీ అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంయుక్త విడుదలగా భావిస్తున్నారు.
మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా రూపాయి బలహీనతకు కారణమైంది. ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ పనితీరును అంచనా వేసే అమెరికా డాలర్ ఇండెక్స్ 0.43 శాతం పెరిగి 100.17 స్థాయికి చేరుకుంది. ఇక విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనాన్ని వేగవంతం చేసింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఒకే రోజు దాదాపు రూ. 7,000 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు.
రూపాయి బలహీనత స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్సీ 1,470 పాయింట్లకు పైగా పడిపోయి 74,563 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 50 కూడా దాదాపు 488 పాయింట్లు పడిపోయి 23,151 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అధికంగా కొనసాగితే మరియు గ్లోబల్ ఉద్రిక్తతలు తగ్గకపోతే రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి 92.10 నుంచి 92.80 మధ్య ట్రేడింగ్ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
SVSN Varma vs Pawan Kalyan: తనను ఎమ్మెల్యే కాకుండా టికెట్ తన్నుకుని వెళ్లి గెలిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంతో పిఠాపురంలో తన ఉనికికే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి అలిగారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్మ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. సొంత టీడీపీ నాయకులపైనే విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఫొటో విషయమై రచ్చకు దారి తీయగా.. అధికారులు, కూటమి నాయకులపై మండిపడ్డారు.
Also Read: Harish Rao: గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సూటిగా 8 ప్రశ్నలు
కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన మున్సిపల్ సమావేశం నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశంలో ఏర్పాటుచేసిన బ్యానర్‌లో సీఎం చంద్రబాబు ఫొటో చిన్నగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో పెద్దగా ముద్రించడంతో వివాదం రాజుకుంది. ఆ బ్యానర్‌ను చూసిన వర్మ స్టేజీపైకి ఎక్కకుండా కిందనే ఉన్నారు. అధికారులు సీఎం చంద్రబాబును అవమానించారని.. ఇది సరైన వైఖరి కాదని వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులపై, కూటమి నాయకుల తీరుపై మండిపడ్డారు.
Also Read: Allu Cinemas: లారీ ఎక్కి వెళ్లి నేను సినిమాలు చూసేవాడిని: రేవంత్ రెడ్డి
వేదికపై పవన్ కల్యాణ్ ఫోటో పెద్దదిగా ఉంచి చంద్రబాబు ఫొటో చిన్నదిగా ఉంచడాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఖండించారు. చంద్రబాబుకు గౌరవం లేని చోట తాను కూర్చోలేను అంటూ వేదిక మీదకు వెళ్లకుండా కింద కుర్చీలో కూర్చున్నారు. అధికారులు, కూటమి నాయకులు ఎంత బతిమిలాడినా కూడా వర్మ స్టేజీ ఎక్కలేదు. అలా ఎలా పెడతారని అధికారులను ప్రశ్నించారు. ఎంతకీ వెనక్కి తగ్గని వర్మ.. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారు.
Also Read: Gas Cylinder Shortage: మళ్లీ కట్టెల పొయ్యి.. హాస్టల్స్, హోటళ్లలో సంప్రదాయ వంట పద్ధతి
సమావేశం మందిరం నుంచి బయటకు వచ్చాక స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ స్థానిక నేతలపై ఆగ్రహం. 'ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బొమ్మ లేకుంటే చూసుకోవడం తెలియదా? అంటూ టీడీపీ నాయకులపై వర్మ మండిపడ్డారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండనంటూ వర్మ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం రచ్చరచ్చగా ఉంది. పవన్ కల్యాణ్ పిఠాపురం వచ్చాక వర్మకు ప్రాధాన్యం లభించడం లేదు. ఇక అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తనకు ఎలాంటి పదవి లభించలేదు. మాజీ ఎమ్మెల్యేగా తప్ప ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వర్మలో అసంతృప్తి రగులుతోంది. కొన్నాళ్లలో వర్మ అసంతృప్తి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Chaturgrahi Yoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనం మానవ జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం మార్చి నెలలో ఒక అరుదైన అత్యంత శుభప్రదమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. మార్చి 18వ తేదీన బృహస్పతి అధిపతిగా వ్యవహరించే మీనరాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. ఈ సమయంలో చంద్రుడితో పాటు శని, శుక్రుడు, సూర్యుడు వంటి గ్రహాల సంయోగం జరుగుతుంది. దీంతో ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 21వ తేదీ వరకు ఈ యోగ ప్రభావం కొనసాగుతుంది. అప్పటివరకు మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
వృషభరాశి
ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి ఆదాయ మార్గాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి కాస్త విముక్తి కూడా కలుగుతుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ధనయోగం ఉంది. వీరికి క్షేత్రస్థాయిలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్లో పెద్దపెద్ద మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో విచక్షణతో వ్యవహరించడం చాలా మంచిది. లేదంటే ఈ సమయంలో విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మీన రాశి
మీన రాశి వారికి చతుర్గ్రాహి యోగం ప్రభావంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. జీవితంలో అనుకున్న శిఖరాలకు చేరేందుకు ముందడుగు వేసే అవకాశాలున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sadhvi Prachi On Monalisa Marriage: ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా పూసలమ్మే అమ్మాయి ఫొటో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. మోనాలిసా భోంస్లే అని పేరుతో ఫొటోలు తెగ వైరల్ చేశారు. ఆ యువతి తాజాగా కేరళలోని ఓ ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడింది. అయితే ఈ ప్రేమ పెళ్లిపై పలువురు 'లవ్ జిహాద్' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది లవ్ జిహాద్ కాదని వారిద్దరూ మీడియాకి స్పష్టం చేశారు.
ఇదే విషయంపై ప్రముఖ హిందుత్వవాది సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పథ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వీ ప్రాచీ.. మోనాలీసా మతాంతర వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి 'లవ్ జిహాద్' అంటూ అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత మోనాలిసా భోంస్లే పరిస్థితి ఎంతో దారుణంగా ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు.
ఇదే మాదిరిగా గతంలో శ్రద్ధా వాకర్, నికితా తోమర్‌ల హత్యలు జరిగాయని సాధ్వీ ప్రాచీ గుర్తుచేశారు. అదే పరిస్థితి ఇప్పుడు మోనాలిసా ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం శ్రద్ధావాకర్ అనే యువతిని తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కోవలో 'లవ్ జిహాద్'కు తెగబడ్డ మోనాలిసా కూడా రాబోయే రోజుల్లో 35 ముక్కలుగా ఫ్రిజ్‌లో దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు.
అందుకు బదులుగా మోనాలిసాను పెళ్లాడిన ఫర్మాన్ ఓ హిందువుగా మారి ఉంటే ఈ పెళ్లిని తాము అంగీకరించేవారమని సాధ్వీ ప్రాచీ చెప్పుకొచ్చారు. ఇది మోసపూరితమైన లవ్ జిహాద్ అంటూ ఆమె పునరద్ఘాటించారు. హిందువులు తమ పిల్లల మెడల్లో పంది దంతాలను కట్టాలని అలా చేయడం వల్ల ఇతర మతస్తులు తమ పిల్లల దరిదాపుల్లోకి రారని ఆమె సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook