Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500035

సరూర్ నగర్: పక్కాగా శానిటేషన్ నిర్వహణ చేపట్టాలి

Jul 05, 2024 11:56:34
Hyderabad, Telangana
సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలో పక్కాగా శానిటేషన్ నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు, సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 08, 2026 11:39:52
Hyderabad, Telangana:

Peddi Second Single Release Date: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పాట 'చికిరి చికిరి' సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఇప్పుడు సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి సెకండ్ సాంగ్ విడుదలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి 14న రిలీజ్?
సినిమా వర్గాల సమాచారం ప్రకారం..ఫిబ్రవరి 14న (ప్రేమికుల దినోత్సవం) కానుకగా ఈ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొదటి పాట మెలోడీ టచ్‌తో అలరించగా, ఈ రెండో పాట మాత్రం పక్కా మాస్ సాంగ్‌ అని, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో పాటపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు దిగ్గజ నటులు నటిస్తున్నారు.  కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరవనున్నారు. రత్నవేలు (సినిమాటోగ్రఫీ), నవీన్ నూలి (ఎడిటింగ్) వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: India Vs Pakistan Revenue: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆగిపోతే ఎంత నష్టమో తెలుసా? వేల కోట్ల ఆదాయానికి గండి!

Also Read: Tirumala Laddu Issue: "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడుంది? నిరూపిస్తే దేనికైనా సిద్ధమే" వైసీపీ నేత వెల్లంపల్లి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 11:03:38
Hyderabad, Telangana:

India Vs Pakistan Match Revenue: ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ పోరుపై సందిగ్ధత కొనసాగుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తన పట్టు వీడకపోవడంతో, క్రికెట్ ప్రపంచంలో అత్యంత విలువైన ఈ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ (ICC)కి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎంత నష్టం వాటిల్లుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడమే కాకుండా, ఐసీసీకి అధికారికంగా లేఖ రాస్తూ 'ఫోర్స్ మేజర్' క్లాజ్‌ను తెరపైకి తెచ్చింది.

'ఫోర్స్ మేజర్' అంటే ఏమిటి?
ఇది ఒక చట్టపరమైన నిబంధన. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు లేదా ప్రభుత్వ ఆదేశాల వంటి అనివార్య కారణాల వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు దీనిని ఉపయోగిస్తారు. కేవలం భారత్‌తో మ్యాచ్‌కే ఈ నిబంధన ఎలా వర్తిస్తుందని ఐసీసీ ప్రశ్నిస్తోంది. మిగతా జట్లతో ఆడుతున్నప్పుడు లేని 'అనివార్య పరిస్థితి' భారత్‌తోనే ఎందుకు వస్తుందని పీసీబీని నిలదీసింది.

ఆర్థికంగా ఎవరికి ఎంత నష్టం?
ఈ ఒక్క మ్యాచ్ రద్దయితే కలిగే నష్టం ఊహాతీతం.  భారత్-పాక్ మ్యాచ్ ద్వారా సుమారు రూ.2,200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మ్యాచ్‌లో కేవలం 10 సెకన్ల యాడ్ కోసం రూ.40 లక్షల వరకు వెచ్చిస్తారు. మ్యాచ్ లేకపోతే దాదాపు రూ.250 కోట్ల ప్రకటనల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఐసీసీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న జియోస్టార్ (JioStar) వంటి సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బ. ఒకవేళ ఐసీసీ దీన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తే, పాకిస్థాన్‌కు అందాల్సిన వార్షిక నిధులపై కోత విధించడమే కాకుండా భారీ జరిమానా వేసే అవకాశం ఉంది.

రాజకీయ రంగు..చర్చల పర్వం
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా బహిష్కరణను సమర్థించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఐసీసీ-పీసీబీ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఘర్షణ వైఖరి కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐసీసీ మొగ్గు చూపుతోంది.

టీమ్ ఇండియా ప్లాన్ ఏంటి?
భారత జట్టు షెడ్యూల్ ప్రకారమే కొలంబోకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15న భారత ఆటగాళ్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియానికి చేరుకుంటారు. ఒకవేళ నిర్ణీత సమయానికి పాక్ జట్టు రాకపోతే, అంపైర్లు, మ్యాచ్ రిఫరీ పరిశీలించి భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనివల్ల భారత్‌కు పాయింట్లు లభిస్తాయి కానీ అభిమానులు మాత్రం నిరాశ చెందుతారు.

వాణిజ్య ప్రయోజనాలు, క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుంటే పాక్ చివరి నిమిషంలో మనసు మార్చుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఫిబ్రవరి 15న టాస్ పడుతుందా లేదా అనేది ఇప్పుడు కోట్లాది మంది ఎదురుచూస్తున్న ప్రశ్న.

Also Read: Tirumala Laddu Issue: "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడుంది? నిరూపిస్తే దేనికైనా సిద్ధమే" వైసీపీ నేత వెల్లంపల్లి!

Also Read: India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 10:27:58
Hyderabad, Telangana:

Telangana RTC Employees: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడితే ఆ కుటుంబం తీవ్ర కష్టాల్లో పడకుండా ఆర్థిక ఊరట కలిగించేలా ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి పరిహారం దక్కుతోంది. తాజాగా ఓ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించింది. సంస్థ సిబ్బందికి యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ చాలా మేలు చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ ఆర్టీసీ అండగా నిలిచింది. ప్రమాదంలో మృత్యువాత పడిన ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్స్ కుటుంబాలకు  ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగూడ, ఉప్పల్ డిపోలకు చెందిన డ్రైవర్స్ వెంకటేశ్, డీఆర్ గౌడ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమ కుటుంబానికి ఆధారమైన వారు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఆర్టీసీ గతంలో తీసుకున్న యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు భారీ ప్రయోజనం కల్పించింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండడంతో ఉచిత ప్రమాద బీమా పథకం ఆ ఉద్యోగులకు వర్తించింది.

Also Read: YS Jagan: మూడేళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే.. ఎవరినీ వదలి పెట్టబోం: వైఎస్‌ జగన్‌

సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ బ్యాంకు అకౌంట్‌తో ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండడంతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించింది. ప్రమాదాలకు గురయిన వారికి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ.కోటి అందుతోంది. దీంతో ఆ ఇద్దరు కుటుంబాలక రూ. కోటి చొప్పున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ అమ్రేష్ ప్రసాద్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి అందించారు.

Also Read: Bandi Sanjay: కాంగ్రెస్‌ ఓడిపోతుందని రేవంత్‌ రెడ్డి పారిపోయాడు: బండి సంజయ్‌

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యమిస్తోందని.. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబసభ్యులకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో భరోసా కల్పిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి పుష్ఫకుమారి, ఉషాదేవి, యూబీఐ అధికారులు చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్ర బాబు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:18:13
Hyderabad, Telangana:

Honor X80 Specifications Leak News: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హానర్ అత్యంత తక్కువ ధరలోని ఎంతో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ హానర్ X80 పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 10,000 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇటీవల సోషల్ మీడియాలో మీకైనా ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హానర్ X80 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన హానర్ X70 స్థానంలో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన 6.79-అంగుళాల 1.5K డిస్‌ప్లే కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే, చైనా మార్కెట్లో విడుదలైన.. స్మార్ట్ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులోని హైఎండ్  256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. 

అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా MagicOS 9.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది అదనంగా 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ Honor X80 స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 8,300mAh బ్యాటరీ 80W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 512GB వేరియంట్ 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ మాత్రం 10,000mAh బ్యాటరీలతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చాలా ప్రత్యేకమైన బ్లూటూత్, వై-ఫై, NFC కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎన్నో రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ మోడల్స్ కంటే ఇందులో అద్భుతమైన కొత్త కలర్ ఆప్షన్స్‌లో తీసుకురాబోతోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Feb 08, 2026 10:03:06
1
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:01:41
Hyderabad, Telangana:

Nagamani Stone Video Watch Here: పాముల గురించి సమాజంలో ఉన్న అనేక అపోహాల్లో నాగమణి కూడా ఒకటి.. ఈ నాగమణి నాగుపాముల తలపై పెరుగుతుందని.. ఇది ఎంతో విలువైనదని చాలా వరకు పల్లె ప్రాంతాల్లో ఉండే కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని.. ఊళ్లో జనాలను నమ్మించి వారికి విక్రయిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇటీవలే ఒక స్నేక్ క్యాచర్ తన వీడియో ద్వారా సమాజానికి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.

ఈ వైరల్ అవుతున్న వీడియోలు స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. నాగుపాముల తల మీద అరుదైన వజ్రం ఉంటుందనేది కేవలం ఒక భ్రమ అని స్నేక్ క్యాచర్ కొట్టిపారేశారు. కొంతమంది గిరిజనుల్లో స్వార్ధపరులు అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి వేల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వారు పాములను హింసిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పాము తలపై ఒక కత్తితో గాయం చేసి అందులో ఆ రాయిని ఉంచి.. జనాలను రత్నంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ పామును వీడియోలో చూపిస్తూ.. తెలిపారు.

అంతేకాకుండా ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ మున్నా నాగమణి నాటకం కోసం కొంతమంది పాములను ఎంతగా హింసిస్తున్నారో కూడా వివరించారు. పాముల తల వెనుక భాగాన్ని కట్ చేసి.. అందులో  ఆ నలుపు రంగు రాళ్ళను ఉంచి.. ఒక రసాయన పదార్థంతో మళ్లీ ఆ గాయాన్ని మూసేసి.. కుట్లు వేస్తున్నారని తెలిపారు.. దీనివల్ల పాములు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురై చనిపోతున్నాయని వారు తెలిపారు.. డబ్బు కోసం ఇలాంటి మూడవ నమ్మకాలను ప్రచారం చేస్తూ పాములను బలి తీసుకుంటున్నారని ఆయన వీడియోలో వెల్లడించారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఈ వీడియోలో జనాలకు అవగాహన కల్పించడమే కాకుండా.. మున్నా తను పట్టుకున్న ప్రమాదకరమైన మూడు భారీ పాములను సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టడం మీరు చూడొచ్చు. ఇలా ప్రకృతి కోసం అతను దాదాపు రోజులోనే మూడు నుంచి నాలుగు పాములను పట్టుకుంటున్నారని వీడియోలో తెలిపారు. ఈ ప్రమాదకరమైన పాములు పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని.. వాటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 09:19:11
Sadashivpet, Telangana:

Harish Rao vs Revanth Reddy: రెండేళ్లలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. హామీల పేరుతో జనాలకు 'సున్నం' పెట్టిన రేవంత్ రెడ్డి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి.. చెత్త సేకరణ కూడా చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు 5 ఎకరాల చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం శ్మశాన వాటికలు ఇచ్చింది' అని గుర్తుచేశారు. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలని ప్రజలను అడిగారు. బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని రేవంత్‌ రెడ్డి పాలనను తీసిపడేశారు.

Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వతాతకు రేవంత్‌ రెడ్డి రూ.52,000 బాకీ పడ్డాడు. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ కు ఓటేద్దామా? లేక హామీల పేరుతో మోసం చేసి ప్రజలకు సున్నం పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేద్దామా?' అని ప్రజలను మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలని కోరగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని.. భార్యకు ఫ్రీ టికెట్ అని, భర్తకు డబల్ రేట్లు బాదుతున్నారని గుర్తుచేశారు.

Also Read: World Cup 2026: చిచ్చరపిడుగులా చిరుతపులుల్లా.. అండర్‌ 19 ప్రపంచకప్‌ చాంపియన్‌ భారత్‌

'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2000 పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52,000 బాకీ పడింది. ఆ డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ లక్ష ఇస్తే.. తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్కరికైనా ఇచ్చాడా?' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. సదాశివపేటలో కేసీఆర్‌ ప్రభుత్వం మొత్తం రూ.284 కోట్లతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు.

Also Read: YS Jagan: మూడేళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే.. ఎవరినీ వదలి పెట్టబోం: వైఎస్‌ జగన్‌

'హామీల గురించి అడిగితే.. లాగుల తొండలు వదులుతా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి చెత్త సేకరణ కూడా చేతకాని అసమర్థుడు. కేవలం మురికి మాటలు, చెత్త మాటలే. ఈ బూతుల ముఖ్యమంత్రికి 11వ తారీఖున పోలింగ్ బూత్‌లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలి' అని సదాశివపేట ప్రజలకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 'బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు  కట్టింది కేసీఆర్. సంగారెడ్డిలో రూ.20 కోట్లతో మైనార్టీ స్కూల్  ఏర్పాటు చేసింది కేసీఆర్. షాదీ ముబారక్, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా బంద్ చేశాడు. ముస్లింలకు రూ. 4000 కోట్లు ఇస్తానని మోసం చేశాడు' అని తెలిపారు.

'సదాశివపేటలో హిందువులకు 5 ఎకరాలు, ముస్లింలకు 5 ఎకరాలు, క్రిస్టియన్లకు 5 ఎకరాల భూమిని శ్మశాన వాటికల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.50 కోట్లు ఉంటుంది. అన్ని వర్గాలను ఆదరించింది కేసీఆర్‌ ప్రభుత్వమే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు ప్రకటించారు. 'కాంగ్రెస్ వాళ్లు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేవి కావు. అవి మీ హక్కు' అని స్పష్టం చేశారు.

'రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి రాగానే చేప పిల్లలు బంద్, బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్.. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి' అని ఓటర్లకు మాజీ మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 07:59:51
Nunna, Vijayawada, Andhra Pradesh:

Vellampalli Srinivas On Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నిరూపించగలరా? అంటూ ఆయన ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.

విజయవాడలో మీడియాలో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీబీఐ, సిట్ విచారణలో నిజాలు బయటపడినా ప్రభుత్వం ఇంకా బుకాయిస్తోందని ఆయన ఆరోపించారు.

రిపోర్టులపై క్లారిటీ ఏది?
సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదికల్లో ఎక్కడా జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని తేలిందని వెల్లంపల్లి పేర్కొన్నారు. "చార్జ్ షీట్‌లో కూడా యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టంగా ఉన్నప్పుడు, పవన్ కల్యాణ్ ఎందుకు అంత యాగీ చేశారు?" అని ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.

కొత్త నాటకానికి తెరతీశారా?
జంతువుల కొవ్వు అంటే ప్రజలు నమ్మడం లేదని గ్రహించి, ఇప్పుడు లడ్డూలో యాసిడ్లు కలిపారంటూ కొత్త ప్రచారానికి తెరతీశారని వెల్లంపల్లి మండిపడ్డారు. "తినే పదార్థాల్లో యాసిడ్లు కలిపితే ఏమవుతుందో మీకే తెలియాలి" అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఇలాంటి 'డైవర్షన్' రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అయోధ్య లడ్డూల గందరగోళం
అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపారని ఆరోపించిన పవన్ కళ్యాణ్‌పై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ లడ్డూలను ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి పంపారు? అనే కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడి అపహాస్యం పాలయ్యారని విమర్శించారు. వైసీపీ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, అవే ట్యాంకర్లు మళ్లీ లోపలికి వెళ్లాయని వెల్లంపల్లి ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం మంచిది కాదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు ఆపి, పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.

తప్పు ఒప్పుకున్న టీటీడీ మాజీ ఛైర్మన్..!
వైసీపీ అధికారంలో చేపట్టిన తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ కల్తీని నిర్ధారించిన.. వైసీపీ అధినేత దగ్గర నుంచి స్థానిక నేతల వరకు కూటమి ప్రభుత్వాన్ని బుకాయించడం కొసమెరుపు.

Also REad: India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!

Also REad: Pawan Kalyan Surender Reddy Movie: పవన్ కల్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..సురేందర్ రెడ్డి సినిమాతో మరో బ్లాక్‌బాస్టర్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 05:43:50
Hyderabad, Telangana:

Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే చంద్రుడు తులా రాశిలోకి సంచరించడం.. బుధుడు ఈ రోజే కదలికలు జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన సిద్ధియోగం ఏర్పడింది. అన్ని యోగాలతో పోలిస్తే.. దీనిని ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి దీని ప్రభావం మొత్తం అన్ని  రాశుల వారిపై పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే సమయంలో సర్వార్ధ సిద్ధ యోగంతో పాటు ఎంతో శక్తివంతమైన రవి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
మేషరాశి 
ఈ ఆదివారం నుంచి మేష రాశి వారికి అంతా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి నైపుణ్యం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని విశేషమైన ప్రతిభ కనబరిచితారు.. అలాగే స్నేహితులతో పాటు సహుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన చాలావరకు ఆదాయాన్ని పొందుతారు. ప్రేమ జీవితం కూడా ఎంతో లాభసాటిగా మారుతుంది. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహకాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా ఆనందంగా కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మిథున రాశి 
ఈ ఆదివారం నుంచి మిథున రాశి వారికి ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్ నైపుణ్యం విపరీతంగా పెరిగి సమాజంలో కీర్తి, ప్రతిష్ట లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలాకాలం పరిష్కారం కాని పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. పిల్లలతో సమయం గడపడం వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇతర విలాసవంతాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

మకర రాశి 
మకర రాశి వారికి ఈ సమయంలో విపరీతంగా గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే కెరీర్ పరంగా అదృష్టం కూడా సహకరించబోతోంది. తెలివితేటలు విపరీతంగా పెరగడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఎలాంటి కోరికలు కోరుకున్నప్పటికీ ఈ సమయంలో అవి నెరవేర్చుకునే దిశగా పనులు చేయగలుగుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా లాభసాటిగా మారుతుంది. అద్భుతమైన పనులు చేసిన ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా కూడా చాలావరకు మెరుగుపడబోతోంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
AMAruna Maharaju
Feb 08, 2026 04:10:49
Hyderabad, Telangana:

PM Narendra Modi Malaysia Tour: ప్రధాని మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం, ఫిబ్రవరి 8 రెండవ రోజు  పర్యటనలో భాగంగా.. కౌలాలంపూర్‌లో ప్రధాని మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మంత్రులు, రెండు దేశాల ప్రతినిధులతో పెర్దానా పుత్ర భవనంలో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీకి గౌరవ గార్డుతో స్వాగతం పలికారు. తన పర్యటన మొదటి రోజున మోదీ రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు నన్ను, నా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన తీరుకు, ఈ కొన్ని గంటల్లో సాంప్రదాయ ఆచారాలను పక్కనపెట్టి మలేషియా జీవితాన్ని చాలా అందంగా ప్రదర్శించిన తీరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీరు నిర్వహించిన అద్భుతమైన విధానం ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో నిలిచి ఉంటుందని.. దీనికి నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు.

అలాగే కౌలాలంపూర్‌లో వేలాది మంది భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. భారతదేశం-మలేషియా సంబంధాలు నమ్మకం, సంస్కృతి, ఆర్థిక ఆశయాల ద్వారా నడిచే కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు. భారతీయ ప్రవాసులను సజీవ వారధిగా ఆయన అభివర్ణించారు. శతాబ్దాల నాటి తమిళ మూలాలు, ఉమ్మడి సంప్రదాయాలు, సాంస్కృతిక కొనసాగింపుపై మలేషియా ప్రధాని మంత్రి అన్వర్ ఇబ్రహీంను మోదీ ప్రశంసించారు.

మలేషియా పర్యటనలో ద్వైపాక్షిక సహకారానికి మార్గనిర్దేశం చేసే ఇంపాక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వాణిజ్యం, స్టార్టప్‌ల నుండి రక్షణ, సాంకేతికత వరకు, భారతదేశ పురోగతి మలేషియా విజయంతో విడదీయరానిదని మోదీ అభివర్ణించారు. 800 మందికి పైగా నృత్యకారులు ప్రదర్శించిన ఈ రికార్డు స్థాయి సాంస్కృతిక ప్రదర్శన రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోతుందని ప్రధానమంత్రి సాంస్కృతిక ప్రదర్శనను ప్రశంసించారు. కళాకారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, తాను ప్రధానమంత్రి కాకముందు నుండే స్నేహితులమని మోదీ అన్నారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సంస్కరణలపై దృష్టి పెట్టడం, ఆయన అద్భుతమైన అవగాహన, ఆసియాన్ 2025కు ఆయన సమర్థ అధ్యక్షత వహించడం పట్ల మోదీ ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాని ప్రధాని మోదీ, త్వరలో మలేషియాను సందర్శిస్తానని హామీ ఇచ్చానని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్నారు.  

Also Read: Chandra Mangal Yoga: చంద్ర మంగళ యోగం వల్ల ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..

Also Read: Shani Shukra Yuti: మీనరాశిలో శనిదేవుడి, శుక్ర గ్రహాల సంయోగంతో ఈ 3 రాశుల వారికి ఉజ్వల భవిష్యత్తు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 07, 2026 17:14:44
Hyderabad, Telangana:

India Vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు యూఏఎస్ గట్టి పోటీని ఇచ్చినా.. చివరికి విజయం భారత్‌ను వరించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

కానీ, టీమ్ఇండియా లాంటి బలమైన జట్టుతో యూఎస్ఏ పోరాడిన విధానానికి ప్రేక్షకుల నుంచి ఆదారాభిమానాలు లభించాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ఒకింత విజయం సాధించారు. అయితే టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు. 

162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్‌కు ఆదిలోనే భారత బౌలర్ల రూపంలో అడ్డు తగిలింది. గౌస్ (6), ఎస్ఆర్ ముక్కమల్ల (2), ఎండీ పటేల్ (0) (కెప్టెన్) వెంటనే వెనుదిరిగినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మిలింద్ కుమార్ (34), కృష్ణమూర్తి (37) పోరాడి పెవిలీయన్ చేరారు.  ఆ తర్వాత వచ్చిన శుభమ్ (37) చివర్లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించినా అప్పటికే అమెరికా ఓటమికి చేరువైంది. 

యూఎస్ఏపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. సిరాజ్ 3 వికెట్లు.. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ వరుణ్ 1 వికెట్‌ పడగొట్టాడు.

భారత ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్‌ఇండియాకు తొలి మ్యాచ్‌లోనే అమెరికా (USA) గట్టి పోటీని ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

తొలి మ్యాచ్‌లోనే భారత టాపార్డర్ తడబడటంతో బాధ్యత తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ (84)* మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన స్కై, వరుసగా 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) పర్వాలేదనిపించారు.

సూర్య ఒకవైపు నిలకడగా ఆడినా, మిగిలిన బ్యాటర్లు అమెరికా బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే ఇద్దరూ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేసింది. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5), అర్ష్‌దీప్ సింగ్ (4) వంటి ఫినిషర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. చివరి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌట్ అవ్వడంతో భారత్ 9 వికెట్లు కోల్పోయింది.

పసికూనగా భావించిన అమెరికా జట్టు భారత బ్యాటర్లను బాగా వణికించింది. అమెరికా బౌలర్ షాడ్లీ అద్భుత స్పెల్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీయగా, అలీ ఖాన్, మొహ్సిన్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.

Also Read: Vaibhav Suryavanshi 175: వైభవ్‌ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి! ఆ దేశ క్రికెట్ బోర్డు సంచలన ట్వీట్!

Also Read: Pakistan Vs Netherlands: పాకిస్థాన్‌ను వణికించిన నెదర్లాండ్..పరమచెత్తగా ఆడిన పాక్ చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 07, 2026 13:18:33
Hyderabad, Telangana:

Imanvi In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సురేందర్ రెడ్డి సిద్ధం చేయగా, ఈ సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2026 ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ రేసులో ఒక కొత్త పేరు బలంగా వినిపిస్తోంది.

రష్మిక కాదు.. ఇమాన్వీ?
మొదట్లో ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఒక కొత్త బ్యూటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji) సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. తన క్లాసిక్ లుక్స్ మరియు సోషల్ మీడియా క్రేజ్ దృష్ట్యా, పవన్ సరసన ఈమె అయితే ఫ్రెష్‌గా ఉంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ తన రాజకీయ, ఇతర సినిమా కమిట్‌మెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించనున్నారు. 2026 మార్చిలో (ఉగాదికి) ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ యాక్షన్, పవన్ కల్యాణ్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇప్పటికే కథా చర్చలు ముగియగా, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది.

ఇమాన్వీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ నుండి గానీ, సురేందర్ రెడ్డి నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇమాన్వీ కన్ఫర్మ్ అయితే, ప్రభాస్ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్‌తో ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మలుపు తిప్పే 'బంపర్ ఆఫర్' అనే చెప్పాలి.

Also Read: Student Attacks Teacher: నడిరోడ్డుపై దారుణం..టీచర్‌పై స్టూడెంట్ అఘాయిత్యం..ప్రేమించలేదని పెదవి కొరికి..!

Also Read: Vaibhav Suryavanshi 175: వైభవ్‌ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి! ఆ దేశ క్రికెట్ బోర్డు సంచలన ట్వీట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top