Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500058

మహేశ్వరం దేవాలయంలో బోనస్ కార్యక్రమంలో అనుమతి నిరసన వ్యక్తం

Jul 15, 2024 14:01:48
Badangpet, Telangana

మహేశ్వరం ఆర్‌కే పురంలో ఉన్న కిల మైసమ్మ ఆలయంలో బోనస్‌కు సంబంధించి దేవస్థానం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ బాగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వేదిక కింద కూర్చొని అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని వారిని వేదికపైకి ఆహ్వానించవద్దని, అలా చేస్తే అనుమతించబోమని బీఆర్‌ఎస్‌ నేతలను హెచ్చరిస్తూ నిరసన తెలిపారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AMAruna Maharaju
Jan 25, 2026 14:26:19
Hyderabad, Telangana:

Secunderabad Traffic Restrictions: భారతదేశం 77వ గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జనవరి 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కారణంగా ఆ రూ‌ట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రహదారులను మూసి వేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.

టివోలి ఎక్స్‌ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్స్ మధ్య రహదారి మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్‌ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్​బీఐ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్, బాలమ్రాయ్, రసూల్‌పురా, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు. బేగంపేట, కార్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్‌ రోడ్స్, టివోలి, బోయిన్​పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు డైవర్షన్​ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 8712662999 నెంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
 
Also Read: 
Padma Awards: 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45 మందికి పద్మశ్రీ, తెలంగాణ నుంచి ఇద్దరికి అవార్డు..!

Also Read: IPL 2026: ఐపీఎల్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 25, 2026 13:03:35
Hyderabad, Telangana:

BRS Party Joinings: 'వృద్ధులకు 4 వేల రూపాయల పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని సునీత లక్ష్మారెడ్డి అడిగారు. మోసం చేసిన వాళ్లకి ఎప్పుడైనా బుద్ధి చెప్పాలి. అందుకే గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ తెలంగాణకు చేసింది ఏం లేదు. బీజేపీ అంటేనే ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో పండే గోధుమలకు ధర పెంచారు. దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ధర పెంచడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. తెలంగాణలో బీజీపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటవడంతో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి రాజీనామా చేసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రసంగం చేశారు. 'బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు మంచి జరుగుతుంది. పదేండ్ల తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు. 200 పింఛన్లు 2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌ది. అనేక మంచి కార్యక్రమాలు కేసిఆర్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామనీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేశారు. బతుకమ్మ చీరలు ఇవ్వకుండానే పోయారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్‌కే సాగర్‌ కీలక ప్రకటన

'ప్రజలు చాలా తెలివైన వాళ్లు ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. బావుల దగ్గర కరెంట్ సరిగా ఇవ్వలేకపోతున్నారు. రైతుల ఇబ్బందులు పడుతున్నారు. నర్సాపూర్‌లో మంచి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పాలన తక్కువ ప్రతిపక్షాల నాయకులపై కేసులు ఎక్కువ. రైతులకు రైతుబంధు సకాలంలో ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలో నాట్లకు నాట్లు మధ్య రైతు బంధు పడేది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.

Also Read: Harish Rao: సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. అల్లుడు పాత్రధారి: హరీశ్‌ రావు 

'రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు ఓట్ల మధ్య రైతుబంధు అది కూడా సమయానికి ఇవ్వడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని.. కర్రు కాల్చివాత పెట్టారు అని రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. రైతుబంధు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. 'రెండేళ్లలో ఉపకార వేతనాలు ఒక్క రూపాయి ఇవ్వకుండా పిల్లలను ఆగం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి' అని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 25, 2026 13:01:42
Lahore, Punjab:

ICC Ultimatum To Pakistan: 2026 టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో ఇన్నాళ్లూ డ్రామా నడిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటామంటూ ఊదరగొట్టిన పాక్, ఇప్పుడు యూ-టర్న్ తీసుకుని ఏకంగా తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి వైదొలగడంతో పాక్ కూడా అదే దారిలో వెళ్తుందని భావించినప్పటికీ, ఐసీసీ నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాక్ తన వేటను ప్రారంభించనుంది.

1. పాత సామార్థ్యం.. కొత్త వ్యూహం..
జట్టులో అత్యంత కీలకమైన మార్పు బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిదిల పునరాగమనం జట్టుకు ఊరట కలిగించే విషయం. గత కొన్ని సిరీస్‌లకు దూరంగా ఉన్న బాబర్, బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికి మళ్లీ జట్టులోకి వచ్చారు. నసీమ్ షా, షహీన్ అఫ్రిదిలు పాక్ పేస్ అటాక్‌కు వెన్నెముకగా నిలవనున్నారు.

2. హారిస్ రవూఫ్‌కు భారీ షాక్..
పాక్ ఎక్స్‌ప్రెస్ పేసర్ హారిస్ రవూఫ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసియా కప్ 2025లో పేలవమైన ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతనికి జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మొహమ్మద్ రిజ్వాన్‌కు మాత్రం వికెట్ కీపర్ కోటాలో ఊరట లభించింది.

పాకిస్తాన్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్..
ఫిబ్రవరి 7 – పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (కొలంబో)

ఫిబ్రవరి 10 – పాకిస్తాన్ vs అమెరికా (కొలంబో)

ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)

ఫిబ్రవరి 18 – పాకిస్తాన్ vs నమీబియా (కొలంబో).

టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.

బంగ్లాదేశ్ తోడవ్వకపోయినా, భారత్‌లో జరిగే వరల్డ్ కప్ ఆడటానికి పాక్ మొగ్గు చూపడం వెనుక భారీ ఆర్థిక జరిమానాల భయం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాబర్, షహీన్ రాకతో పాక్ జట్టు కాగితంపై బలంగా కనిపిస్తోంది.

Also Read: Motorola Edge 50 Price: కేవలం రూ.668 లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్..ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్!

Also REad: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 25, 2026 12:28:56
Hyderabad, Telangana:

Giant Cobra Video Viral: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి సాధ్యము కాదు. అయితే, గత కొద్ది రోజుల నుంచి ప్రకృతిలో మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి ముఖ్యంగా కొన్నిచోట్ల అడవులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల అందులో జీవించే జీవరాశులకు ఆహార కొరత ఏర్పడుతూ వస్తోంది. దీని కారణంగా పాములతో పాటు కొన్ని జీవులు జనావాసాల్లోకి సంచారం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పాములయితే పెద్ద ఎత్తున జనాలుండే ప్రదేశాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా సంచారం చేసిన పాములు మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికైనా జరిగాయి.. తాజాగా కూడా ఇలాంటి వీడియో వైరల్ అవుతూ వస్తోంది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ గొర్రె పిల్లను పని ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. చుట్టేసి ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఆ పా ము గొర్రెపిల్లను కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చూడొచ్చు మీరు. ఇదే సమయంలో ఆమెని ఆ ప్రమాదం నుంచి తప్పించేందుకు ఓ స్నేక్ క్యాచర్ బైక్ పై వచ్చి ఆ గొర్రె పిల్లను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ వస్తుంది..

వీడియోలు స్నేక్ క్యాచర్ కొద్ది దూరం నుంచి బైక్‌పై రావడం కూడా మీరు చూడొచ్చు. వెంటనే అతను మోటార్ సైకిల్‌పై వచ్చి.. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ పైపుతో గొర్రె పిల్ల మెడకు చుట్టుకొని ఉన్న ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ సమయంలో ఆ పాము గొర్రె పిల్ల పై ఎలాంటి దాడి చేయకుండా.. స్నేక్ క్యాచర్‌కు కూడా లొంగిపోవడం మీరు చూడొచ్చు. వెంటనే దానిని అతను ప్లాస్టిక్ పైపు ద్వారా పట్టుకొని.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టాడు. దీంతో ఆ గొర్రె పిల్ల యజమాని ఊపిరి పీల్చుకున్నాడు..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

గత కొద్ది రోజుల నుంచి అడవుల్లో నుంచి వచ్చిన పాములు ఇలా జంతువులపై దాడి చేస్తున్నాయని.. అలాగే కొన్ని పాములు మనుషులపై దాడికి కూడా పాల్పడుతున్నాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నిదర్శనంగా నిలుస్తుంది.. ఈ వీడియోని ఎవరు తీశారో కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  చూసిన వారంతా కామెంట్‌లో స్పందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వారి మిత్రులకు షేర్ చేస్తున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 25, 2026 12:22:54
Hyderabad, Telangana:

Motorola Edge 50 Fusion Discount: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్ (Republic Day Sale) స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగ తీసుకువచ్చింది. ముఖ్యంగా మోటరోలా నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ Motorola Edge 50 Fusion పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మీరు రూ.20,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సరైన ఛాయిస్.

ధర, డిస్కౌంట్ వివరాలు..
అసలు ధర: రూ.25,999
ఫ్లాట్ డిస్కౌంట్: సేల్‌లో భాగంగా 26% తగ్గింపుతో ఈ ఫోన్ కేవలం రూ.18,999 కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.7,000 ఆదా అవుతుంది.

EMI ఆఫర్: ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారు కేవలం నెలకు రూ.668 సులభ వాయిదాల పద్ధతి (EMI) లో ఈ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుంటే, దానిని ఇచ్చి అదనంగా రూ.15,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫీచర్స్..
డిజైన్ & డిస్‌ప్లే: 6.7-అంగుళాల P-OLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్, వీడియోలకు సూపర్ స్మూత్ అనుభూతిని ఇస్తుంది. దీనికి IP68 రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుంచి రక్షణ ఉంటుంది.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్: ఇందులో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ఉంది. 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

కెమెరా క్వాలిటీ: వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా (Sony LYTIA 700C సెన్సార్), 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా కలదు.

బ్యాటరీ & ఛార్జింగ్: 5,000mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

స్టైలిష్ డిజైన్‌తో పాటు స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒక బెస్ట్ డీల్. రిపబ్లిక్ డే సేల్ ముగిసేలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?

Also REad: White Hair Remedy: తెల్ల జుట్టుకు చెక్..ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే 20 నిమిషాల్లో తెల్ల జుట్టు మాయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 25, 2026 11:52:06
Hyderabad, Telangana:

Singareni Scam: 'సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి. సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే  అనే సామెతను తలపించింది. కుంభకోణాన్ని సమర్థించుకునేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడు కాయ చేశారు' అని తప్పుబట్టారు. 'సైనిక్ స్కూల్‌లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చి రూ.వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

Also Read: Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి

సింగరేణి కుంభకోణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. 'జనవరిలో సైట్ విజిట్ లేకుండా 7 శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే మే నెలలో ఆ నిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారు?' అని ప్రశ్నించారు. 'సింగరేణికి వచ్చిన రూ.6,900 కోట్ల లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్‌లో కోత విధించారు. ఆ డబ్బును రేవంత్ రెడ్డి తన సోకులకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడుకుంటున్నారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు.

Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్‌కే సాగర్‌ కీలక ప్రకటన

'కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ.. రేవంత్ రెడ్డి కుంభకోణాల క్యాలెండర్ మాత్రం పక్కాగా అమలవుతోంది. ఈ మొత్తం కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. 'రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి బావమరిది ఈ కుంభకోణంలో మొదటి లబ్ధిదారుడు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి, పాత్రధారి అని మేం చెప్తుంటే... ఇంకా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం వస్తుంది?' అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం భట్టి విక్రమార్క చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండి వార్చారని తెలిపారు. 'సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నది. సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కనపెట్టి అవసరమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారని ఆరోపించారు.

Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!

'సింగరేణి కుంభకోణానికి ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి విక్రమార్క సమాధానం చెప్పకుండా దాటివేశారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. 'సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రేవంత్‌ రెడ్డి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా కాపాడే ప్రయత్నం భట్టి విక్రమార్క చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా విధానాలు మార్చారు' అని ఆరోపించారు.

'2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా.. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి. ఇంత స్పష్టంగా నేను బయటపెట్టినా కూడా కుంభకోణం జరగలేదని భట్టి గారు బుకాయించడం శోచనీయం. ఒక నైని గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌ చేశారు. 'సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనది. ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలి' అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హరీశ్ రావు సవాల్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 25, 2026 10:44:09
Hyderabad, Telangana:

Three-headed Cobra Video Watch Here: ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల వింత ఆకృతులతో  జంతువులు, వివిధ జీవులు జన్మిస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో జన్యు లోపం వల్ల జన్మించిన పాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు మూడు తలలు ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న పాముకు మూడు తలలు ఉన్నాయో లేదో కానీ.. వీడియోలో మాత్రం ఒకేచోట మూడు పాముల తలలు దగ్గర దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. 

మూడు తలల పాములు చాలా అరుదుగా కేవలం మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మూడు తలల నాగు ఓ గోడలోని చిన్న గూటిలో ఉండడం మీరు చూడొచ్చు. అసలు ఈ వీడియోలో ఏం జరిగింది? సాధారణంగా మనం పాముకు కేవలం ఒకతల మాత్రమే చూస్తూ ఉంటాం.. అరుదుగా అప్పుడప్పుడు రెండు తలలకు సంబంధించిన పాములు చూస్తుంటాం.. కానీ ఈ వీడియోలో ఏకంగా మూడు తలలు కలిగిన నాగుపాము కనిపించడం విశేషం. 

ఈ వీడియోను ఓ ఛానల్ నుంచి షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే.. ఏదో పాత కట్టడం లేదా పురాతన గోడల్లో ఓ చిన్న గూటిలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న పాము మూడు పడగలను విప్పి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ గోడ రంద్రం నుంచి మూడు తలలు కలిగిన పాము బయటికి వచ్చేందుకు ప్రయత్నించడం మీరు కళ్ల కట్టినట్లు చూడొచ్చు. ఈ దృశ్యాలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారుడు కంగు తింటున్నారు..

నిజమా? గ్రాఫిక్సా? 
ఈ వీడియో చూస్తుంటే ఇవి అత్యంత సహజంగా జరిగిన దృశ్యాలుగా అనిపిస్తుంది. పాము కదలిక, అది ముసలి కొట్టే విధానం ఆశ్చర్యపరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది నిజంగానే మూడు తలల పామా లేక.. ఓకే గూటిలో లేక మూడు తలలు ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఈ వీడియో టైటిల్ లో మాత్రం పోస్ట్ చేసే క్రమంలో మూడు తలలో పాము భూమి లోపల నుంచి వచ్చిందని క్యాప్షన్ పెట్టారు.. కానీ పర్టికులర్గా గమనించి చూస్తే.. గూటిలోనే మూడు పాములు ఉన్నాయని.. బయటికి మూడు తలల పాముల కనిపించడం మీరు చూడొచ్చు. 

ప్రస్తుతం చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుకొని ఇలానే మూడు తలలతో పాటు ఆరు, ఎనిమిది తలలు కలిగిన పాములను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే అనుకున్నారు. కానీ క్లియర్‌గా చూస్తే.. ఒకే గూటిలో మూడు పాములు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోను నిజమని కొంత నమ్మిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.  ఈ పాము నిజంగా అద్భుతంగా ఉందని.. ఇలాంటి మూడు తలలు కలిగిన పామును ఇప్పుడే చూస్తున్నట్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 25, 2026 10:28:55
Hyderabad, Telangana:

Giant King Cobras Vs Mongoose Video: ప్రకృతిలో జరిగే అత్యంత ఆసక్తి కలిగించే విషయాల్లో వన్యప్రాణులు దాడి చేసుకోవడం. ముఖ్యంగా పాము ముంగిసలు దాడి చేసుకోవడం సర్వసాధారణమే.. ఇవి ఒకదానికొకటి బద్ధ శత్రువులుగా చెప్పుకుంటారు. అందుకే ఎక్కడ కనిపించినా తప్పకుండా.. అవి దాడి చేసుకుంటూనే ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు దాడి చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. ఇలా పోస్ట్ చేసిన వీడియోలే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోలో ముందుగా రెండు కింగ్ కోబ్రాలు తమ పడగలను విప్పి ముంగిస వైపు చూస్తూ.. ఉండడం మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఆ రెండు పాములు దానిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. ముంగిస కూడా ఏమాత్రం బెదరకుండా.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. అలాగే రెండు ఒకదానికొకటి దాడికి ప్రయత్నించుకోవడం, అందులో రెండు కింకోబ్రాల పైకి ముంగిస కూడా దాడి చేయడం మీరు క్లియర్ గా చూడొచ్చు. 

ముంగిస ఆ కింగ్ కోబ్రాల దాడి నుంచి తనకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని ఎంతో సులభంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. ఈ ముంగిస వ్యూహాత్మకంగా ఆ రెండు పాముల పై దాడి చేస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే అది తనకున్న పళ్ళతో పాము తలభాగాన్ని పట్టుకొని కొరకడానికి కూడా ప్రయత్నిస్తోంది. వీటి రెండిటి మధ్య దాడి దాదాపు 33 సెకండ్లకు పైగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇలా కొద్దిసేపు ఆ ముంగిస పాములు ఎంతగానో దాడి చేసుకున్నాయి.

ఇందులో ముంగిస మాత్రం ఎంతో ధైర్యంగా పాముల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ నిలబడింది. ఈ రెండు పాములు దాడిలో కాస్త గాయాల పాలైనట్లు కూడా మీరు గమనించవచ్చు. నిజానికి ముంగిసలకు పాము విషం పట్ల కాస్త రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ రెండు పాములు దానిపై కాటేసినప్పటికీ ఏమాత్రం దాని శరీరం నిండా విషం చేరకుండా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇందులో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Jan 25, 2026 07:17:35
Hyderabad, Telangana:

Nampally Fire Accident Tragedy: కొన్ని గంటలుగా జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్స్ ఫలించలేదు. ఆ అయిదుగురి ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. నాంపల్లి ఫర్నిచర్ అగ్ని ప్రమాదం చివరికి శోకాన్నే మిగిల్చింది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది. నిన్నటి నుంచి దాదాపు 22 గంటలకు పైగా కొనసాగిన రిస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫలించలేదు. బిల్డింగ్ లో చిక్కుకున్న ఐదుగురు ప్రణీత్ (8), అఖిల్ (11),  ఇంతియాజ్ (28), హాబీబ్‌ (32), బేబీ (48) మరణించారు. వారి మృతదేహాలను రిస్క్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించే పనులు జరుగుతున్నాయి.

 కొన్ని గంటలుగా తమ కుటుంబీకులు ప్రాణాలతో బయటికి వస్తారని ఎదురుచూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. మొదటగా మూడు మృతదేహాలను వెలికి తీశారు. భవనం సెల్లార్ నుంచి మూడు శవాలను రిస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. ఇక పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారి కోసం ఆ తర్వాత కాస్త సహాయక చర్యలు మరింత శ్రమించి బయటకు తీశారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ కొన్ని గంటలుగా ఆపరేషన్ కొనసాగింది. ఇప్పటికీ భవనం సెల్లార్ నుంచి దట్టమైన పొగలు వస్తూనే ఉన్నాయి. ఇక డెడ్ బాడీలను చూసి కుటుంబాలు తీవ్ర రోదనలో మిగిలింది. ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదంతో మునిగిపోయింది.

 ఇక నిన్న నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ దట్టమైన పొగలు సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందిని ఏర్పరిచాయి. దీంతో ఆటంకం ఏర్పడింది. బిల్డింగ్ లో చిక్కుకున్న వారి కోసం సెల్లార్ నుంచి గుంత తవ్వుకుంటూ రిస్క్యూ టీమ్‌ వెళ్లింది. బిల్డింగ్ బయట ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబీకులు ఎదురు చూశారు. వారు ప్రాణాలతో బయటపడాలని రాత్రంతా నిద్రాహారాలు లేక గడిపారు. సమయం గడిచే కొద్ది ప్రాణాలపై ఆశలు కూడా సన్నగిల్లుతూనే ఉన్నాయి. చివరికి తమ వారి ప్రాణాలు మంటల్లో కాలిపోయాయని తెలిశాక వారి రోదనలు మిన్నంటాయి. ఇక నిన్న ప్రమాదా స్థలాన్ని సీపీ సజ్జనార్ తో పాటు కలెక్టర్ హరిచందన కూడా సందర్శించారు. వారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. 

 నిత్యం.. అగ్ని ప్రమాదం..
 నాంపల్లి అగ్నిప్రమాదం ప్రస్తుతం శవాలను వెలికి తీసి వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ చుట్టూ ఏదో ఒక మూల తరచూ ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది కూడా గుల్జార్‌హౌస్‌ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా దాదాపు 17 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. 22 గంటల పాటు జరిగిన ఈ రిస్క్యూలో చివరికి విషాదమే మిగిలింది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్రస్థాయిలో రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు ఆ తర్వాత చర్యలు మాత్రం ప్రశ్న గానే మిగులుతున్నాయి.

 బాలిక హాస్టల్లో అగ్నిప్రమాదం..
 ఇక మరోవైపు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వసతి గృహంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్వాల్ హై టెన్షన్ లైన్‌కు బాలికల వసతి గృహం వద్ద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఏసి పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కూడా ఆలుముకోవడంతో 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Also Read: తెలంగాణ యువతకు శుభవార్త.. ఈ పథకంతో రూ.4 లక్షల ప్రభుత్వ రుణం పక్కా..!

Also Read:  ఉద్యోగ సంఘాలతో చర్చలు ఫెయిల్‌.. నేటి నుంచి 4 రోజుల బ్యాంక్‌ బంద్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top