నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, గ్రూప్ 2-3 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీలో 25 వేల పోస్టుల భర్తీకి అశోక అకాడమీ అధ్యక్షుడు అశోక్ సర్ కొత్తపేటలోని తన నివాసంలో 10 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు నిరుద్యోగుల పోరాటం ఆగదన్నారు. అశోక్ సర్ ప్రజల్లోకి వెళ్లి నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. జులై 15న ప్రజాసంఘాలు సచివాలయాన్ని ముట్టడించి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.