Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500030

అత్తాపూర్ ఈశ్వర్ ధియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

Jun 27, 2024 08:52:21
Hyderabad, Telangana

రాజేంద్రనగర్‌లోని ఈశ్వర్‌ థియేటర్‌లో ప్రభాస్‌ అభిమానుల సందడి నెలకొంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలైంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు గుమిగూడడంతో సినిమా హాలులో సందడి వాతావరణం నెలకొంది. టపాసులు తింటుండగా అభిమానులు జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే షో ఉన్నప్పటికీ అభిమానులు భారీగా తరలిరావడం గమనార్హం.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
IPInamdar Paresh
Dec 10, 2025 08:28:19
Hyderabad, Telangana:

Actress Madhavi latha shocking comments on Samantha raj nidimoru second marriage:  సమంతా రాజ్ నిడిమోరులు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తురులోని ఈషా ఫౌండేషన్ లో డిసెంబర్ 1న భూతశుద్ది క్రతువుతో ఒక్కటయ్యారు.  వీరి పెళ్లి వేడుక కొద్ది మంత్రి స్నేహితులు, దగ్గరి బంధువుల మధ్యలో సింపుల్గా జరిగింది. గతంలో జరిగిన కర్మలు మరల బాధించకుండా భూతశుద్ది క్రతువులో వీరు పెళ్లి చేసుకున్నారు.  అయితే.. పెళ్లిజరిగిన నాలుగు రోజులకే సామ్ మరల షూటింగ్ కు వెళ్లారు. దీంతో సమంత డెడికేషన్ ను ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. సమంతకు అత్తింటి వారి నుంచి గ్రాండ్ గా వెల్ కమ్ లభించింది. తమకు ఇలాంటి కోడలు రావడం ఎంతో ఆనందంగా ఉందని రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పాపం.. సమంత రెండోపెళ్లి చేసుకున్న ఆనంద కొద్ది కాలం కూడా ఉండనీయకుండా కొంతమంది పనిగట్టుకుని ఆమెను ట్రోల్స్ చేసేపనిలో పడ్డారు. సమంత రాజ్ నిడిమోరును వల్లో వేసుకుందని, శ్యామిలీడేకు డైవర్స్ ఇచ్చేలా సామ్ ఒత్తిడి తీసుకొచ్చిందని కోంత మంది ట్రోల్స్ చేశారు. వారి కాపురంలో నిప్పులు పోసి రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుందని ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టమున్నట్లు సమంత రెండో పెళ్లిపై ట్రోల్స్ చేస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా.. దీనిపై నటి, బీజేపీ మహిళ నేత మాధవీలత ఫైర్ అయ్యారు.

సమంత రెండోపెళ్లిపై ట్రోల్స్..

సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ?.. ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒకరి జీవితాలు చెడగొట్టేవాళ్లు, విడాకులు ఇవ్వకుండానే మరోకరితో రొమాన్స్ లకు దిగే వాళ్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తుందన్నారు. ట్రోల్స్ చేస్తున్న వారు ఎవరు కూడా పవిత్రతలుకాదు కదా.. అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు.

 అదే విధంగా.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే  ఎవ్వరైన సరే విడిపోతారని మాధవీలత వ్యాఖ్యానించారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా?.. అంటూ మాధవీలత సెటైర్ లు వేశారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని తెల్చిచెప్పారు.

Read more: Prabhas: ప్రభాస్ హైట్‌తో ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డా.!. బాంబు పేల్చిన బాలీవుడ్ బ్యూటీ ..

జేసీ ప్రభాకర్ రెడ్డితో గతేడాది ఫైటింగ్..

మరోవైపు మాధవీలత గతంలో తాడిపత్రిలో న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో గతేడాది జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా కొన్నిరోజులు రచ్చ నడిచింది. మాధవీలతపై తాడిపత్రిలో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత రెండో పెళ్లి వ్యాఖ్యలతో మాధవీలత మరోసారి హాట్ టాపిక్  గా మారారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

158
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 09, 2025 17:27:50
Tirupati, Andhra Pradesh:

Tirupati To Shirdi Train: భారతదేశంలో అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలు తిరుపతి, షిర్డీ. ఆదాయంలోనూ.. భక్తిభావనలోనూ.. భక్తుల రాకలోనూ ఈ రెండూ ఆలయాలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఈ రెండు ఆలయాల మరింత రాకపోకలు పెరగనున్నాయి. ఇరు క్షేత్రాలను దర్శించుకోవడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే అందుబాటులో రైల్వే సదుపాయం మరింత సులభం కానుంది. మరో కొత్త రైలును రైల్వే శాఖ ప్రకటించింది.

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుపతి - షిర్డి మధ్య భక్తుల రాకపోకలకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త రైలును ప్రకటించడంతో భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి - సాయినగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి వారం ఈ రైలు సర్వీస్ ఉంటుంది.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

ఈ నూతన రైలు సేవను కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న వర్చువల్‌గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండో వీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ షిర్డి చేరుకుంటుంది.

Also Read: School Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసా?

ఈ మార్గమధ్యంలో ఉన్న భక్తులకు కూడా షిర్డి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరతాయని, ముఖ్యంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

222
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 09, 2025 17:27:27
Hyderabad, Telangana:

Harish Rao: తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్ష చేస్తున్న కేసీఆర్‌ ప్రాణం పోతున్నా తనకు ఏమీ కాదని చెప్పారని.. అయితే శవయాత్ర.. లేకుంటే జైత్రయాత్ర అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేసుకున్నారు. ఉద్యమంలో ఆమరణ దీక్ష, పోరాటంతో తెలంగాణ వచ్చిందని ప్రకటించారు. దేవుని దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్‌ చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆమరణ దీక్ష సమయాన్ని నెమరువేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విజయ్ దివస్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రసంగించారు. 'ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారు. సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నారు యాదిరెడ్డి. యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్‌కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది' కాంగ్రెస్‌ ఘోరాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ అంటేనే త్యాగాలు. బహుశా దేశంలో ఒక డిమాండ్‌ కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్. పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

'నిమ్స్‌లో కేసీఆర్‌కు సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. మనిషి చనిపోతాడని డాక్టర్లు  మాకు చెప్పారు. నేను పోయి కేసీఆర్‌కు దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకు నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని కేసీఆర్‌ చెప్పాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ తేల్చి చెప్పారని తెలిపారు.

Also Read: School Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసా?

'నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని చెప్పిన గొప్ప నాయకుడు. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష, పోరాటంతో వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది. దేవుని దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో చాలా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ ఇప్పుడు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ​ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ సార్ చెప్పేవారని తెలిపారు.

Also Read: Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!

'కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రావడంతోనే నేడు 24 గంటల విద్యుత్‌, ఇంటింటికి నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో.. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని ఆగ్రహం వ్యకతం చేశారు. ప్రజల పక్షాన కేసీఆర్ మళ్లీ పోరాటం చేస్తారని.. కచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

139
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 09, 2025 17:26:50
Hyderabad, Telangana:

Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులను ఆకర్షించింది. గతంలో దావోస్‌ పెట్టుబడులు లక్షల కోట్లు ఆకర్షించగా.. ఈ సదస్సుతో మరిన్ని పెట్టుబడులను పొందింది. ప్రఖ్యాత కంపెనీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారు. ఐటీ, విద్యుత్‌, డేటా సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడుల విలువ రూ.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.

Also Read: Railway Good News: భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. తిరుపతి - షిర్డీ మధ్య కొత్త రైలు ప్రారంభం

రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి.

==> ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి

==> జెసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాల కల్పన

==> ఏజీపీ గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ ఏర్పాటు.

==> బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి. 3 వేలకు పైగా ఉద్యోగాలు

==> ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం-వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు. మరో రూ.200 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

==> వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్–డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు. వెయ్యి మంది వరకు  ఉద్యోగావకాశాలు

==> రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడి. వెయ్యి మందికి  ఉద్యోగావకాశాలు

==> కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి

==> ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడి, 1,600కి పైగా ఉద్యోగాలు

==> పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన గ్లోబల్ కెపాసిటీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు.

==> అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ, 3 వేలకి పైగా ఉద్యోగాల కల్పన

==> హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి, 9 వేలకి పైగా ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగాల కల్పన

==> గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉపాధి కల్పన

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

==> భారత్ బయోటెక్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు.
==> కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు. 1,551 మందికి ఉపాధి కల్పన
==> గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడి. ఈ యూనిట్‌తో 300 మందికి ఉద్యోగావకాశాలు
==> ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

151
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 09, 2025 17:26:23
Hyderabad, Telangana:

Global Summit: పదేళ్లలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ది లేకుండా పేదరికం, వెనుకబాటుతనం, అమాయకత్వంతో ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ది దిశలో పయనిస్తోంది. అభివృద్ది చెందుతున్న  రాష్ట్రంగా ఎదుగుతోంది' అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. ఈ సందర్భంగా గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ పాలనను మాజీ గవర్నర్‌ ప్రశంసించారు.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

గ్లోబల్‌ సమ్మిట్‌లో వక్తగా హాజరైన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణను రాబోయే ఇరవై ఏళ్లలో దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా లక్ష్యాలను ఏర్పరచుకొని కృషి చేయాలను ఆశయం మహా ఉన్నతమైనది. నేను తెలంగాణలో పనిచేశా. ఉమ్మడి ఏపీలో ఉన్నత ఆర్థిక కార్యదర్శిగా, ఖమ్మం కలెక్టర్‌గా పనిచేశా. అప్పుడు బహూశా రేవంత్ రెడ్డి స్కూల్లో ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు హైదరాబాద్ వాడిని. నాది తెలంగాణ రాష్ట్రం అని చెబుతా' అని దువ్వూరి సుబ్బారావు తెలిపారు.

Also Read: Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు

'హైదరాబాద్ నగరం ఓ అద్బుతమైన ఆణిముత్యం. జాతీయ, అంతర్జాతీయ నగరాలు తిరిగాం. కానీ హైదరాబాద్ నగర ప్రత్యేకతే వేరు. హైదరాబాద్‌ భిన్న జాతులను ప్రజలను అక్కున చేర్చుకున్న నగరం. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతి ఉన్న గొప్ప నగరం హైదరాబాద్‌. ఉత్తమ సంప్రదాయం, ఉన్నత విలువలు కలిగి ఉన్నది' అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. 'ఐకానిక్‌గా ఉన్న హైదరాబాద్‌ను తమ తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటూ.. ఇక్కడ ఇష్టంగా స్థిరపడుతున్నారంటే హైదరాబాద్, తెలంగాణ గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది. పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ల నాటికి 3 ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 8 నుంచి 9 శాతం అభివృద్ది సాధించాలి అది కూడ ఎంతో వేగంగా చేయవలసి ఉంటుంది. అది ఒక చాలెంజ్ గోల్ అని చెప్పవచ్చు. కొంచెం కష్టమే అయినా సాధ్యమే అంటా' ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తెలిపారు.

Also Read: KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి నిర్ణయాలు, ఆలోచన ధోరణిని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తప్పుబట్టారు. ' చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి మోడల్ తీసుకుని ముందుకువెళతామని చెప్పారు. అది మార్గదర్శకమైనది కాకున్నా శీఘ్రగతిన అభివృద్ది సాధించిందే' అని చెప్పారు. 'చైనాలోని గ్వాంగ్ డాంగ్ మోడల్ కాకుండా  రాబోయే పదేళ్లలో ప్రపంచంలో తెలంగాణ మోడల్‌గా కావాలని ఉదహరిస్తారు' అని రేవంత్‌ రెడ్డికి కొంత ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అన్‌స్టాపబుల్, తెలంగాణ అన్ బీటబుల్ అని తెలిపారు.

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

'హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అప్రతిహత అభివృద్దిని సాధిస్తూ ఎంతో ప్రఖ్యాతి చెందింది. అయితే తెలంగాణ తయారీ రంగం, వ్యవసాయ రంగం ఇతర  ఉపాధి రంగాల వైపు దృష్టి సారించి ఉద్యోగాలు కల్పించాలి. మౌళిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఏఐ రంగంలో తెలంగాణను దేశంలోనే గొప్ప ఇన్నోవేషన్ సెంటర్ చేయాలన్న తపన చాలా అవసరం. దీంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్, ప్రాథమిక విద్య, ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి' అని మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రైవేటు వాళ్లు  కలిసి చేస్తే ఫలితాలుంటాయని ప్రకటించారు. 'సమాజంలో రెండు వేలకు చొక్కా కొన్న వ్యక్తికి మరునాడు రూ.200 ఎక్కువైనా లెక్కచేయడు. అదే మధ్యతరగతి వ్యకి రూ.4 బస్ టికెట్ పెరిగితే  తమ వర్గాల్లో ధరలు పెరిగిన ధ్యాస అదే ఉంటుంది. ప్రభుత్వాలు అది గుర్తెరిగి పాలన సాగించాలి' అని రేవంత్‌ రెడ్డికి మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

131
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 09, 2025 17:26:07
Patna, Bihar:

Govt Employees DA Hike: ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఆర్థికయేతర ప్రయోజనాలు దక్కకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీవనం భారంగా మారుతోంది. ఉద్యోగులకు సంబంధించి కీలకమైనది కరువు భత్యం (డీఏ). వేతనంలో భారీగా మార్పు చేసే డీఏపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆశల్లో ఉంటాయి. అలాంటి ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా ఐదు శాతం డీఏ పెంపునకు ఆమోద ముద్ర వేసింది. అయితే డీఏ పెంపు ప్రకటించింనది తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కాదు. బిహార్‌ ప్రభుత్వం ఉద్యోగులకు గిఫ్ట్‌ ఇచ్చింది.

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి పదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు ఐదు శాతం డీఏ పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా డీఆర్‌ అదే స్థాయిలో ప్రభుత్వం పెంచుతూ అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు

పాట్నాలో మంగళవారం నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 అంశాలపై కీలక చర్చ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి కీలక నిర్ణయం ఉంది. అదే కరువు భత్యం పెంపు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం (డీఏ)ని 5 శాతం పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యంలో 5 శాతం పెంపును మంత్రివర్గం ఆమోదించింది. పెంచిన కరువు భత్యం జూలై 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

డీఏ పెంపు ఇలా..
ఆరో కేంద్ర వేతన స్కేల్ కింద జీతం, పెన్షన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 252 శాతానికి బదులుగా 257 శాతం డీఏ పొందుతారు. 
ఐదో కేంద్ర వేతన స్కేల్ కింద జీతం, పెన్షన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 466 శాతానికి బదులుగా 474 శాతం డీఏ లభిస్తుంది.

అత్యధిక పెండింగ్ లు ఇక్కడే!
ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశం కరువు భత్యం. అయితే దేశంలోనే అత్యధికంగా డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డీఏలు ప్రకటించాయి. ఇటీవల దసరా, దీపావళికి కరువు భత్యం ప్రకటించగా.. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దేశంలో అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. డీఏలు విడుదల కాక ఉద్యోగ వర్గాలు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే భారీ ఉద్యమం చేపట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు సిద్ధమవుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

140
comment0
Report
VVishnupriya
Dec 08, 2025 14:28:54
Baddipadaga, Telangana:

Telangana 2026 Holidays List Released: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సాధారణ సెలవులు.. ఆప్షనల్ సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనను సాధారణ పరిపాలనా శాఖ (General Administration Department) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలకు వర్తించే సెలవులు ఖరారు చేయబడ్డాయి.

2026 సంవత్సరానికి మొత్తం 27 సాధారణ సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ముఖ్యమైన పండుగలు, జాతీయ పండుగలు కూడా ఉన్నాయి. జనవరి 1న న్యూయర్ డే, జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం ముఖ్యమైన సెలవులుగా ఉన్నాయి. అలాగే మహా శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ ఈద్, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, గాంధీ జయంతి, దసరా పండుగలు, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగలకు కూడా సెలవులు ఇచ్చారు.

ఇవే కాకుండా ఆప్షనల్ సెలవులు (Optional Holidays) కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఉద్యోగుల ఇష్టానుసారం తీసుకునే సెలవులు. ఈ జాబితాలో బర్త్‌డే ఆఫ్ హజ్రత్ అలీ, శ్రీ పంచమి, మిలాద్ ఉన్ నబీ, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, రథయాత్ర, పర్షియన్ న్యూ ఇయర్, గురునానక్ జయంతి, నరక చతుర్దశి, క్రిస్మస్ ఈవ్ వంటి రోజులు ఉన్నాయి. ఉద్యోగులు ఈ ఆప్షనల్ సెలవులలో.. గరిష్టంగా ఐదు రోజులు మాత్రమే వినియోగించుకోవచ్చు.

ఈ సెలవుల జాబితా వల్ల ఉద్యోగులు తమ సెలవులను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చదువు, పండుగలు.. కుటుంబ కార్యక్రమాలకు సమయం కేటాయించుకోవడం సులభమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఈ సెలవుల ప్రకారం పనిచేస్తాయి.

మొత్తానికి 2026 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ సెలవుల జాబితా ఉద్యోగులు, విద్యార్థులు.. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు తమ వ్యక్తిగత మరియు కుటుంబ కార్యక్రమాలను ముందుగానే సక్రమంగా ప్రణాళిక చేసుకోవచ్చు.

Also Read: Govt Employees Leaves: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. 12 సెలవులు పొడగింపు

Also Read: New Labour Codes: కొత్త లేబర్ కోడ్‌లపై కేటీఆర్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

149
comment0
Report
Advertisement
Back to top