తహసీల్దార్ సుజాత ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమస్యలను పరిష్కరించాలన్నారు
Rudrangi, Telangana:తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాహిత కార్యక్రమాల్లో తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ డివిజన్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనహితకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
HYDRAA: కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి.. రూ.750 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..
Secunderabad, Telangana:HYDRAA Operation: జలాశయాల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడం ప్రాధాన్యంగా తీసుకున్న హైడ్రా మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజాధనాన్ని హైడ్రా కాపాడింది. అయితే పేదల ఇళ్లను కూల్చారని.. పేదలను నిరాశ్రయులను చేశారని కొందరు చేస్తున్న ప్రకటనలను హైడ్రా ఖండించింది. హైదరాబాద్‌లోని హస్మత్‌పేటలో కబ్జాకు గురయిన భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
వాస్తవం ఇదే
హస్మత్‌పేటలో పేదల ఇళ్లను కూల్చేసిందంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, రాజకీయ ప్రేరేపితం అని హైడ్రా ప్రకటన చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించి.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. విమర్శలు చేసే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో.. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా గుర్తుచేసింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలను హైడ్రా వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే?
హస్మత్‌పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి దశాబ్దాలుగా కబ్జాకోరల్లో చిక్కుకుపోయింద. ఆక్రమణల కారణంగా ఇప్పటికే ఆ భూమిలో 98 ఎకరాలు కబ్జాకోరుల పాలైంది. కబ్జాకు గురయిన భూమి కాకుండా ప్రభుత్వానికి 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ పది ఎకరాలను కాపాడి.. భవిష్యత్ తరాల ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
రెవెన్యూ శాఖ లేఖ ఆధారంగా
ఆ భూమి పరిరక్షణ కోసం హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఏ ఒక్క శాశ్వత ఇంటి జోలికి కూడా వెళ్లలేదు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) అయిన ఇళ్లను కూల్చేశారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. రెవెన్యూ శాఖ అధికారుల లేఖ ఆధారంగా.. వారి సమక్షంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించినట్లు హైడ్రా వెల్లడించింది. ప్రభుత్వ భూమిపై కొత్తగా వేసిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు హైడ్రా వివరించింది.
ఎలాంటి రాజకీయ కోణం లేదు
ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని.. రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ అని హైడ్రా తెలిపింది. తాము చేసిన ఆపరేషన్ చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని.. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జా చెర నుంచి విడిపించిన పదెకరాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది.
స్వార్థ రాజకీయ ప్రచారాలు
ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తి కూడా కబ్జాకు గురైతే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రోడ్ల వంటి ప్రజా అవసరాల కోసం భూమి ఎక్కడి నుంచి వస్తాయని హైడ్రా ప్రశ్నిస్తోంది. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని హైడ్రా వివరణ ఇచ్చింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దానిని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారి తీరును ఖండించింది. ప్రభుత్వ భూములు అంటే అవి ప్రతి పౌరుడి ఆస్తి అని గుర్తుచేసింది. హస్మత్‌పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదు.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ కబ్జాలకు చెక్ పెడుతూ రూ.750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని రక్షించిన సాహసోపేతమైన చర్య అని హైడ్రా వెల్లడించింది. దీనిపై కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలు ప్రజలెవరూ కూడా నమ్మకుండా, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా సూచించింది.
Hyderabad Twin Reservoirs: భారీ వర్షాల నడుమ నిండు కుండలా మారిన హైదరాబాద్ జంట రిజర్వాయర్లు..
Hyderabad, Telangana:Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..పెట్టుబడికి ఇదే సరైన సమయం?!
Hyderabad, Telangana:Gold Price Today News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో నేడు మరోసారి పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే నేడు అనగా జూన్ 29న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.Mumbai Hotel Raid: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు
Mumbai, Maharashtra:Mumbai Hotel Raid Actress Rescued: ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో నడుస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు ఛేదించారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించారు. ఈ ఘటన వినోద పరిశ్రమలో పెద్ద కలకలం రేపుతూ, తీవ్ర చర్చకు దారితీసింది.
దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించగా.. వీరిలో ఒక మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాగా.. మరొకరు బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి బాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించే నటిగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడీ వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబైలోని గిర్గావ్లో ఒక హోటల్లో ఉన్నత స్థాయి వ్యభిచార ముఠా పనిచేస్తోందని పోలీసులకు నిఘా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు హౌటల్‌పై దాడి చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో ఇద్దరు హీరోయిన్లను మొదటగా గుర్తించగా.. ఆ తర్వాత మరో హీరోయిన్ ఉందని గుర్తించారు. ఆ తర్వాత దాడిలో పట్టుబడ్డ మహిళలను, ఇతర వ్యక్తులను ఇప్పుడు ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జనవరిలో ఓసారి దొరికారు..
ఈ ఏడాది జనవరిలో నవీ ముంబైలోని తుర్బే నాకా ప్రాంతంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. తుర్బే నాకాలోని ఒక లాడ్జ్‌లో నడుస్తున్న వ్యభిచార ముఠాపై దాడి చేసి ఏడుగురు మహిళలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి, పోలీసులు ఒక నకిలీ కస్టమర్‌ను లాడ్జ్‌కు పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత, బృందం వెంటనే దాడి చేసింది. ఈ దాడిలో, ఏడుగురు మహిళలను వ్యభిచారం కోసం లాడ్జ్‌లోని వేర్వేరు గదుల్లో ఉంచినట్లు కనుగొన్నారు. గిర్గావ్లో జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: మరోసారి తండ్రి కాబోతున్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్అశ్విన్..సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్
Also REad: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Holiday July: జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?
Hyderabad, Telangana:Bank Holiday July 2026: ఎల్లుండి నుంచి కొత్త నెల జూలై ప్రారంభం కాబోతుంది. అయితే ఎప్పటిలాగే ఒకటో తారీఖు వస్తే అనేక మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో మనకు ప్రతినెలా తప్పక అవసరం ఉండే బ్యాంకుల సమాచారం తెలుసుకోవడమూ ముఖ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే జూలై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం ముందే తెలుసుకోవడం వల్ల సకాలంలో మన బ్యాంకు పనులను పూర్తి చేయగలుగుతాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం.. జూలైలో మొత్తం 12 బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ నగరాలు, రాష్ట్రాలలో సెలవులు ఎప్పుడు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాంకులు 12 రోజుల పాటు ఎందుకు మూసివేయబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జూలైలో బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి?
జూలై నెలలో 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు కావడం వల్ల ఆ నాలుగు రోజులు తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పండుగలు, ఇతర ఉత్సవాల వల్ల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జూలై 6వ తేదీ MHIP దినోత్సవం కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్ సెలవు రానుంది. జూలై 9వ తేదీ బెహ్దియెన్ఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు రానుంది. జూలై 11 తేదీన రెండో శనివారం.. అలాగే జూలై 25న నాలుగో శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఆ తర్వాత ఒడిశాలో ఘనంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర సందర్భంగా జూలై 16న ఆ రాష్ట్రంలో సెలవుగా ప్రకటించగా.. అదే రోజున కాంగ్, హరేలా ఉత్సవాల కారణంగా డెహ్రాడూన్, మణిపూర్ ప్రాంతాల్లో సెలవు ఉండనుంది. జూలై 17వ తేదీన తీరోత్ సింగ్ వర్ధంతి కారణంగా మేఘాలయలోని షిల్లాంగ్, జూలై 18వ తేదీ ద్రుక్పా త్షే జీ ఉత్సవం కారణంగా సిక్కింలోని గాంగ్టక్.. అలాగే జూలై 22న ఖర్చీ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే మీ నగరంలో బ్యాంకులు మూసివేసినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తూనే ఉంటుంది. మీరు UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు.
నగదు జమ చేయాల్సి వస్తే ఏమి చేయాలి?
బ్యాంకు మూసి ఉన్నప్పుడు మీరు మీ ఖాతాలో నగదు జమ చేయవలసి వస్తే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అటువంటి పరిస్థితిలో, మీరు బ్యాంకు బయట ఉన్న నగదు డిపాజిట్ మెషీన్‌ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీ ఖాతాలోకి నగదును సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?
ALso REad: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Idupu Kayitham Controversy: "హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి".. జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Mahidhar Idupu Kayitham Controversy: సోషల్ మీడియాలో ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్తగా మరో వివాదం రాజుకుంది. 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్ తో మొదలైన ఈ రచ్చ, ప్రస్తుతం పీక్స్‌కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, జబర్దస్త్ ఫేమ్ మహిధర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
"హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు తమ ఆస్తులు అమ్మేస్తే తెలంగాణ వాళ్లు కొనగలరా?" అంటూ మహీధర్ మాట్లాడిన ఒక పాత వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదంపై స్పందించిన యూట్యూబర్ మహిధర్.. తాజాగా మరో వీడియో విడుదల చేసి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తన మాటలు తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించినవి కావని.. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోవాలి అంటూ కామెంట్లు చేసే కొందరిని మాత్రమే ఉద్దేశించి అన్నానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు.
ఒకవేళ హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలి.. ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అనే గట్టిగా భావిస్తే.. సోషల్ మీడియాలో రచ్చ చేయడం మానేసి, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి నోటీసులు తెచ్చుకోవాలంటే ఆయన సూచించారు. కొందరి తప్పులను మొత్తం రాష్ట్రానికి ఆపాదించడం సరికాదని, ఇలాంటి వివాదాలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందని మహిధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత మహీధర్ తన వివాదాస్పద వీడియోను ప్రైవేట్ చేసినప్పటికీ.. దానికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. భావద్వేగాలకు లోనవ్వకుండా సమయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నటుడు నరేష్ స్పందన..
అదేవిధంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కూడా వివాదం పై స్పందించారు. తెలుగు మాండలికాలను గౌరవించాలని, అందరం తెలుగు వాళ్ళమేనని గొడవ సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. రాజకీయ నాయకుల ప్రమేయంతో వివాదం మరింత పెద్దదయిందని నరేష్ అన్నారు.
Also Read: సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ!
Also Read: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hair Fall Solution: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు రాలుతుందా? హెయిర్ ఆయిల్ కండిషనర్ లో ఏది బెస్ట్!
Hyderabad, Telangana:Monsoon Hair Fall Solution: వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో మెరిసిపోతుంది. కానీ, మన జుట్టు మాత్రం పొడిబారి, జీవం కోల్పోయినట్లు తయారవుతుంది. ఉదయం లేవగానే దిండు మీద తల దువ్వుకునేటప్పుడు చుట్టూ చూసి చాలా మంది బాధపడుతుంటారు. గాల్లో ఉండే తేమ, దుమ్ము, ధూళి వల్ల జుట్టు జిడ్డుగా మారి హెయిర్ ఫాల్ దారి తీస్తుంది.
ఇలాంటి సమయంలో జుట్టును కాపాడుకునేందుకు మార్కెట్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను ఏది వాడాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో వస్తున్న కొబ్బరి నూనె జుట్టుకు మేలు చేస్తుందా? లేదా మోడరన్ హెయిర్ కండిషన్ జుట్టు కాపాడుతుందా? అనే అయోమయానికి చాలామంది గురవుతున్నారు. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
వర్షాకాలంలో జుట్టు ఎందుకు ఎక్కువ రాలుతుంది?
1) ఈ మాన్సూన్ సీజన్లో గాల్లో ఫేమస్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్ ఎప్పుడు జిడ్డుగా మారి, జుట్టు కుదుళ్ళను బలహీన పరుస్తుంది.
2) తేమతో కూడిన వాతావరణం వల్ల తలలో ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, చుండ్రు వేగంగా విస్తరిస్తాయి.
3) వాతావరణంలోని కాలుష్యం, కెమికల్స్ వర్షపు నీటితో కలిసి ఉంటాయి. ఈ నీటిలో జుట్టు తడవడం వల్ల అది కాంతిహీనంగా మారి త్వరగా చిట్లిపోతుంది.
హెయిర్ ఆయిల్ Vs కండిషనర్
హెయిర్ ఆయిల్, కండిషనర్ అనే ఉత్పత్తులు దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అయితే వర్షాకాలంలో వీటిని వాడే పద్ధతి మార్చుకోవాలి.
హెయిర్ కండిషనర్
వర్షాకాలంలో గాలిలోని తేమను జుట్టు పీల్చుకోవడం వల్ల అది ఉబ్బిపోయి, చిక్కుబడి గడ్డిలా మారుతుంది. కండిషనర్ జుట్టుపై పొరను మృదువుగా చేసి తేమను లాక్ చేస్తుంది. జుట్టు చుట్టూ ఒక రక్షణ పొరను ఏర్పరిచి బాహ్య వాతావరణం వల్ల జుట్టు పాడవకుండా కాపాడుతుందని అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఈ సీజన్ లో జుట్టు చిక్కబడకుండా, చిట్లిపోకుండా ఉండాలంటే కండిషనర్ వాడటం చాలా ముఖ్యం.
హెయిర్ ఆయిల్
హెయిర్ ఆయిల్ జుట్టుకు మేలు చేస్తుందని మన తరాల నుంచి చెబుతున్న విషయం. అయితే వర్షాకాలంలో నూనె రాసి పద్ధతి మార్చుకోవాలి. తలకు నూనె రాసి గంటలు తరబడి లేదా రోజంతా అలానే వదిలేయకూడదు. అలా చేస్తే బయట ఉండే దుమ్ము, దూళి తలకు అంటుకుని చుండ్రు, ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. తలస్నానం చేయటానికి ఒకటి లేదా రెండు గంటలు ముందు గోరువెచ్చటి నూనెతో కుదుళ్ళను మసాజ్ చేసుకొని.. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
వర్షాకాలంలో జుట్టు రాలకుండా పాటించాల్సిన చిట్కాలు..
1) వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో తల స్నానం చేసి, జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
2) వర్షాకాలంలో తడి చుట్టూ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో దువ్వెనతో దువ్వితే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.
3) తలలో చెమట, తేమ లేకుండా ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకోవడమే ఈ రెయినీ సీజన్లో కాపాడుకునే అసలైన సీక్రెట్.
గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, నిపుణుల సూచన ఆధారంగా ఇది అందించాము. దీన్ని పాటించే ముందు మీ జుట్టు తత్వాన్ని బట్టి మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: రోజు 10 నిమిషాల యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Also REad: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP New Pension: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ..
Vijayawada, Andhra Pradesh:AP New Pension Release Date 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ క్రమంలో అర్హులైన పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన వారికి కూడా జులై ఒకటో తేదీనే పింఛన్లు అందించనున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఒకే రోజు రూ.2,711 కోట్లు పంపిణీ..
వచ్చేనెల ఒకటవ తేదీన అందించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,711 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,19,648 మంది పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే రికార్డు స్థాయిలో రూ.68,598.44 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
స్పౌజ్ పింఛన్ అంటే ఏమిటి?
ప్రభుత్వ నుంచి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు (భర్త) ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి బాధ మిగలకుండా ఆసరా నిలిచేందుకు ఈ పింఛన్లు ప్రవేశపెట్టారు. భర్త మరణం తర్వాత పింఛన్ ను అతని భార్యకు బదిలీ చేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ఈనెల కొత్తగా 7,792 మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.3.12 కోట్లను విడుదల చేసింది.
త్వరలోనే వితంతు పెన్షన్లు..
కొత్తగా వితంతు పెన్షన్ మంజూరు కోసం కూడా ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరీ కింద సుమారు 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు నెలల వ్యవధిలోని వీరందరికీ కూడా కొత్త వితంతు పెన్షన్లు అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట..ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్‌పై గడువు పొడిగింపు..
ALso REad: రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు..జూలైలో అత్యధికంగా 27 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Plane Crash Today: బిగ్ బ్రేకింగ్.. మరో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది దుర్మరణం..
La Celle-sous-Gouzon, Nouvelle-Aquitaine:France Plane Crash: ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మన దేశంలో గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందు ఎన్నో అనేక దేశాల్లో ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లోని ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది దుర్మరణం పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఈ పౌర విమానం కొందరు స్కై డైవర్లతో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఈ విమానం తూర్పు ఫ్రాన్స్‌లోని ఒక పారాచూటిస్ట్ (స్కై డైవింగ్ స్కూల్) పాఠశాలకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ విమాన ప్రమాదంలో పైలట్‌తో పాటు విమానంలోని 10 మంది ప్రయాణికులు - ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు శిక్షకులు మరణించినట్లు సమాచారం అందుతోంది.
స్థానిక కాలమానం (ఫ్రాన్స్) ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నాన్సీ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, స్థానికంగా ఉండే విలేకర్లు తెలియజేశారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది వెంటనే స్పందించారని, అధికారులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారని వార్తా సంగ్రాహకులు చెప్పారు.
అయితే మరణించిన వారిలో ఐదుగురు స్కై డైవింగ్ ట్రైనర్స్‌తో పాటు ఐదుగురు స్టూడెంట్స్.. ఒక పైలట్ ఉన్నారని స్పష్టం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో లేదా మృతుల్లో సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనకు గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. విమానాశ్రయం వద్ద ఉన్న బాధితుల బంధువుల సంరక్షణ కోసం వైద్య, మానసిక బృందాలను మోహరించారు. ఒక సాంకేతిక దర్యాప్తును ప్రారంభించినట్లు నాన్సీ నగర డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమౌరీ లాకోట్ తెలిపారు.
అత్యవసర సేవల రాకపోకలకు వీలు కల్పించేందుకు, విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే ప్రమాదం వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్, మధ్యాహ్నం తర్వాత ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారని ఆయన సిబ్బంది తెలిపారు.
Also REad: ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్..మరో 3 శాతం పెరగనున్న డీఏ..అకౌంట్లోకి అప్పటి నుండే?
Also Read: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? ఐర్లాండ్‌తో ఓటమి తర్వాత మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న!
Hyderabad, Telangana:Vaibhav Sooryavanshi Not Playing: రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆశిస్తున్నారు. ఐర్లాండ్‌పై జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున ఈ యువ ఆటగాడు అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ, కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను జట్టులో కొనసాగించాలని నిర్ణయించున్నాట్లు తెలిసింది. దీంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఆడేందుకు ఛాన్స్ రాలేదు. అయితే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు ఆడే ఛాన్స్ ఇస్తారని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఇటీవలే జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 700కు పైగా పరుగులు సాధించి ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేస్తారని అంతా భావించారు. కానీ, అతడిని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్మెంట్ ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గేలకు తొలి మ్యాచ్ ఆడే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరికొన్ని రోజులు వేచి చూడక తప్పడం లేదు.
టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరినప్పుడు వైభవ్ సూర్యవంశీకి తుదిజట్టులో అవకాశం వస్తుందని తాను భావించినట్లు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే అభిషేక్ శర్మ లేదా సంజు సాంసన్లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి సూర్యవంశీ ఓపెనర్‌గా అవకాశం సునీల్ అన్నారు. ఈ విధంగా చేస్తే వైభవ సూర్యవంశం రెండు మ్యాచ్‌లు ఆడించే అవకాశం దక్కేదని.. సీనియర్ ప్లేయర్లను ఒక్కో మ్యాచ్ ఆడించినట్లు ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఓపెనింగ్ జోడి నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో ఇలాంటి మార్పులు కారణంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశంకి ఓపెనర్ గా తప్పకుండా అవకాశం వస్తుందని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. వైభవ్ రాకతో ఓపెనర్‌లో ఒకరు బ్యాటింగ్ ఆర్డర్లో కింది స్థానానికి మారాల్సి రావచ్చని కూడా చెప్పారు.
"మనం ప్రపంచ ఛాంపియన్. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోతే అది ఊహించలేనంత పెద్ద వైఫల్యం అవుతుంది. ఐర్లాండ్ గతంలో కొన్ని పెద్ద చెట్లను ఓడించినప్పటికీ, టీ20లో వారి రికార్డు అంత బలంగా లేదు. అందుకే ఎలాంటి జరిగే రెండు టీ20 ఫలితం చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్‌లో సూర్యవంశీకి తప్పక తుదిజట్టులో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నా" అని సునీల్ గవాస్కర్ అన్నారు.
Also Read: ఐర్లాండ్‌పై ఓటమితో భారత్ కోచ్ కీలక నిర్ణయం..రేపు జరిగే మ్యాచ్‌లో 3 మార్పులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND W Vs AUS W: టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమణ!
Hyderabad, Telangana:IND W Vs AUS W T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రస్థానం ముగిసింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో మహిళల టీ20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. అటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ లో భారీగా వైఫల్యం కారణంగా భారత్ జట్టు నిష్క్రమించగా.. గ్రూప్ 'ఏ' నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. అలాగే గ్రూప్ 'బీ' నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
భారత్ భారీ స్కోరు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. అంతకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన స్మృతి మంధాన (38 పరుగులు), షఫాలీ వర్మ (34 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (34 పరుగులు) తమదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత మహిళా బ్యాటర్లు ఆకట్టుకున్న వేళ ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
మ్యాచ్ మార్చేసిన గార్డ్నర్, పెర్రీ..
172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టును ఆరంభంలోనే భారత బౌలర్లు కట్టడి చేశారు. ఒకానొక దశలో మ్యాచ్ టీమ్ఇండియా చేతిలే ఉన్నట్లే అనిపించింది. కానీ, యాష్ గార్డ్నెర్ క్రీజ్‌లోకి వచ్చాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. యాష్ గార్డ్నర్ కేవలం 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు (నాటౌట్) చేసి మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పేసింది. అలాగే ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ వెటరన్ ప్లేయర్ ఎలిసా పెర్రీ 38 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు (నాటౌట్) చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించింది.
చేతులెత్తేసిన బౌలర్లు..
మ్యాచ్ కీలక సమయంలో టీమ్ఇండియా బౌలర్లు ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. నో బాల్స్ వేయడం సహా, వరుస మిస్ ఫీల్డ్స్ ఆస్ట్రేలియా గెలుపును సునాయాసం చేశాయి. ఇన్నింగ్స్‌లో మరో 6 బంతులు మిగిలుండగానే.. 19వ ఓవర్ నాటికి 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో భారత మహిళల ప్రపంచకప్ కల మరోసారి చెదిరిపోయింది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
Also Read: హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి అయిపోయిందా? నుదుటిన సిందూరంతో పాండ్యా గర్ల్‌ఫ్రెండ్!
Also Read: ఐర్లాండ్‌పై ఓటమితో భారత్ కోచ్ కీలక నిర్ణయం..రేపు జరిగే మ్యాచ్‌లో 3 మార్పులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Women Health: మహిళలు అలర్ట్.. పదే పదే కడుపునొప్పి వస్తుందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ భయంకర వ్యాధి కావచ్చు..!
Lakshmapur, Telangana:Women Health: చాలా మంది మహిళలు.. తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లేదా తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారం లేదంటే బలహీనమైన జీర్ణక్రియ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సంకేతం అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదొక తీవ్ర సమస్య. ఈ వ్యాధితో బాధపడేవారికి ప్రేగులు సరిగ్గా పనిచేయవు. కడుపు సంబంధిత సమస్యలు పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. శరీరంలో జరిగే కొన్ని సహాజ మార్పులు, ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో ఐబీఎస్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.
హార్మోన్ల మార్పులు:
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల శరీరంలో ఎప్పటికప్పుడు జరిగే హార్మోన్ల మార్పులు వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే మహిళల పేగులు సున్నితంగా మారుతాయి. ఇది కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నెలసరి సమయం:
అయితే చాలా మంది మహిళలు నెలసరి సమయంలో ఎక్కువ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో.. ఈ సమస్య గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాల్లో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఒత్తిడి :
మన మెదడుకు.. జీర్ణాశయానికి మధ్య సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి అధిక ఒత్తిడి, ఆందోళన లేదా మానసిక వత్తిడికి గురైనప్పుడు, అది జీర్ణాశయంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడి పెరిగినప్పుడు ఐ.బి.ఎస్ లక్షణాలు మరింత ఇబ్బందికరంగా మారతాయి.
పేగుల సమతుల్యత:
మన ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే కొన్ని మంచి బాక్టీరియాలు ఉంటాయి. వాటి సమతుల్యతకు భంగం కలిగితే, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఈ మార్పు మహిళల్లో ఐబీఎస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
చికిత్స:
కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే.. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల సమస్యను నిర్ధారించి, సరైన చికిత్సను ప్రారంభిస్తారు. అంతేకాదు.. సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర.. క్రమం తప్పకుండా శారీరక శ్రమ ద్వారా ఐబిఎస్ లక్షణాలను చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకే పదేపదే వచ్చే కడుపు సమస్యలను తేలికగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.
Also Read: 4 నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో మరింత పతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM Revanth reddy: ఎవడు అడ్డుపడ్డా మూసీలో వేసి తొక్కుతా.!. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:CM Revanth reddy speech in Nalgonda public meeting: తెలంగాణ రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటించారు. ఈక్రమంలో నల్గొండలో సుమారు రూ. 13వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్ ను సైతం ఆవిష్కరించారు. నల్గొండ కార్పొరేషన్ లో తొలి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు , రూ. 83 కోట్లతో తొలిదశ తాగునటి శుద్ది కేంద్రంకు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రోజుల్ని గుర్తుచేసుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో మంత్రి పదవి త్యాగం చేశారని , ఆ తర్వాత మరల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవి త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇక బీఆర్ఎస్ కు గతమే కానీ భవిష్యత్తు లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనను, తమ రెండున్నరెళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడేందుకు తాము సిద్దమని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.
తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి మిగిలిడాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన్నుకూడా ఓడిస్తామని కొంతమంది యువకులు తనతో చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరీ మూసీ పనులు పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెల్చిచెప్పారు.
ఎస్ ఎల్ బీసీని 2028 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ క్రమంలో పదేళ్ల పాటు తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నారని ఒక్క మహిళకు కూడా మంత్రి పదవిలో చాన్స్ ఇవ్వలేదని సీఎం రేవంత్ ఏకీపారేశారు.
Director Nag Ashwin: మరోసారి తండ్రి కాబోతున్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్!
Hyderabad, Telangana:Director Nag Ashwin Became Father: 'మహానటి', 'కల్కి 2898 ఏడీ' వంటి మైండ్‌బ్లోయింగ్ సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా ఆయన ఓ శుభవార్త చెప్పారు. తాను త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వేదికగా ఆయన ప్రకటించారు. తన భార్య ప్రియాంకా దత్ ప్రస్తుతం గర్భంతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె, ప్రొడ్యూసర్ ప్రియాంక దత్తో ఆయన ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2015లో వివాహ బంధంతో ఒకటయ్యారు.
ఈ దంపతులకు 2017లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే దర్శకుడిగా తన తొలి చిత్రమైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు అయిన 'రిషి'ని, నాగ్ అశ్విన్ తన కుమారుడికి పెట్టడం విశేషం. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతుండడంతో అటు నందిని నర్సింగ్ హోమ్ (స్వప్న సినిమాలు/వైజయంతీ మూవీస్) ఫ్యామిలీలోనూ, ఇటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం ఉంది.
నాగ్ అశ్విన్ కెరీర్
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్.. తన తొలి సినిమాతోనే క్లాసిక్ హిట్ అందుకొని అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తర్వాత 'మహానటి' సావిత్రి బయోపిక్‌ను రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డుతో పాటు పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా 'కల్కి 2898 ఏడీ' సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.
కేవలం డైరెక్షనే కాకుండా 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‌బస్టర్‌ను ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇటీవల ఆయన నిర్మించిన 'సింగీతం' సినిమా థియేటర్లలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్ ప్రస్తుతం 'కల్కి' సినిమాకు సంబంధించిన భారీ సీక్వెల్ (కల్కి పార్ట్ 2) స్క్రిప్ట్ పనుల్లో, ప్రీ-ప్రొడక్షన్లో పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈ గ్యాప్‌లోనే తన పర్సనల్ లైఫ్‌లోని ఈ స్వీట్ న్యూస్‌ను షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
Also Read: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్..'ఓజీ యూనివర్స్' నుంచి మరో వీడియో రిలీజ్!
Also Read: 'వారణాసి' సినిమా స్టోరీ లీక్ చేసిన రాజమౌళి..రూ.3,000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
