
వేములవాడలో ఏఐటీయూసీలో వలస కార్మికుల చేరిక
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వలస కార్మికులను ఏఐటీయూసీలో చేర్చుకున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన మార్బల్ టైల్స్ మేస్తిరి లేబర్లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల పోశెట్టి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, సర్జీత్ సింగ్, బన్వారి లాల్, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో వన మహోత్సవం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు
వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో జరిగిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అంతరించిపోతున్న అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
బోయినపల్లి మండలంలో బిజెపి నేతల సమావేశం
మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్న చైర్ పర్సన్ మాధవి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్వేష్‌తో కలిసి మున్సిపల్ వార్డు అధికారులు, జవాన్లు, నీటి సరఫరా సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా నీరు చేరకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, వార్డుల్లో డ్రైన్ల ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీరు పేరుకుపోని మార్గం.