రాజన్న సిరిసిల్ల: వర్షాలతో నిండిన చెరువులు, నిలిచిపోయిన రాకపోకలు
Thippapuram, Telangana:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండాయి. హనుమాజీపేట వద్ద నక్క వాగు ప్రవాహంతో వేములవాడ-హన్మాజీపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో మిడ్ మానేరుకి 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో ప్రస్తుతం 5.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Rural Business Ideas: పట్నం పోనక్కర్లేదు.. సొంత ఊరిలోనే కాలు కదపకుండా లక్షలు సంపాదించే TOP 5 Business Ideas.. ఎవరూ ఊహించలేనివి..!!
Lakshmapur, Telangana:Rural Business Ideas: మనలో చాలా మంది డబ్బు సంపాదించాలంటే పట్టణాలకు, నగరాలకు.. లేదంటే విదేశాలకు వలస వెళ్లాల్సిందే అనే భావనలో ఉంటారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి ఉంటుంది. సొంత ఊరిలో ఉంటూ డబ్బు సంపాదించలేమన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ పుట్టిన ఊరిలోనే ఉంటూ దర్జాగా డబ్బు సంపాదించుకునే ఐడియాల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. లక్షల రూపాయల ఆదాయం సంపాదించుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. కష్టపడి పనిచేసే తత్వం, సరైన ప్రణాళికతో గ్రామంలోనే కోటీశ్వరులు అవ్వొచ్చు.
పల్లెటూళ్లలో వ్యాపారం చేయడం సాధ్యం కాదని చాలా మంది అనుకుంటారు. మీరు కూడా ఇలాగే భావిస్తుంటే.. సులభంగా డబ్బు సంపాదించడానికి సహాయపడే కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించవచ్చు.
కుట్టు మిషన్: ఒక చిన్న కుట్టు మిషన్‌తో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 10,000-15,000 రూపాయల ఖరీదు చేసే మిషన్‌తో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి, నెలకు 20,000-30,000 రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. ఈ పనిని స్త్రీ, పురుషులు ఇద్దరూ చేయవచ్చు. మీకు కావలసిందల్లా కొంత కుట్టు నైపుణ్యం మాత్రమే. పల్లెటూర్లలో పెళ్లిళ్ల, పండుగల కోసం కొత్త బట్టలు కుట్టించుకుంటారు. మీరు బ్లౌజులు, కుర్తాలు, పిల్లల బట్టలు లేదా స్కూల్ యూనిఫామ్‌లు కుడితే.. సీజన్ ను బట్టి మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. పెళ్లిళ్ల సీజన్లో ఎక్కువగా లాభాలు వస్తాయి.
2. ఇంటింటికీ పాలు సరఫరా చేయడం: నగరాల్లో స్వచ్ఛమైన పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు గ్రామాల నుండి పాలు సేకరించి, సమీపంలోని పట్టణాలకు లేదా నగరాలకు సరఫరా చేస్తే మంచి ఆదాయం ఆర్జించవచ్చు. ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీకు కావలసిందల్లా సరైన సమయానికి పాలు సరఫరా చేయడానికి ఒక మంచి వ్యవస్థ కావాలి. దీని ద్వారా మీరు రోజుకు సుమారు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించవచ్చు. చాలా మంది యాదవులు ఇదే వ్యాపారాన్ని ఎంచుకుని కోటీశ్వరులు అయ్యారు.
Also Read: అరకు నుంచి అనంతగిరి వరకు.. టూరిస్ట్ స్పాట్స్‌లో కొత్త క్రేజ్
3. ట్రాక్టర్ అద్దె: మీ దగ్గర ట్రాక్టర్ లేకపోతే.. బ్యాంకులో లోన్ తీసుకుని ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయండి. గ్రామాల్లో ట్రాక్టర్లు ప్రతి చిన్నపనికి ఉపయోగపడతాయి. కాలం ఏదైనా సరే పంట వేయాలంటే ట్రాక్టర్ ఉండాల్సిందే. వర్షాకాలంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాపారం అవుతుంది. మీరు సొంతంగా ట్రాక్టర్ తీసుకుని నడిపించుకుంటే ప్రతినెలా ఈఎంఐ రూపంలో లోన్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే అద్దెకు తీసుకుని కూడా రోజుకు 1000 నుంచి 2000 వేల వరకు సంపాదించుకోవచ్చు. గంట దుక్కి దున్నితే 2000వేలు వసూలు చేస్తున్నారు. వరిపొలానికి అయితే ఇంకా ఎక్కువగా వసూలు చేస్తారు.
4. టెంట్లు, డెకరేషన్: మీరు టెంట్లు, కుర్చీలు, లైట్లు, పూల డెకరేషన్ కు సంబంధించిన సామాగ్రిని అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. గ్రామంలో పెళ్లిళ్లు, పుట్టినరోజులు లేదా మతపరమైన కార్యక్రమాల వంటి వివిధ సందర్భాలకు టెంట్లు అవసరం అవుతుంది. ప్రారంభంలో, మీరు సామాగ్రిని కొనుగోలు చేయడానికి 50,000-60,000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. తర్వాత ఒక్కో కార్యక్రమానికి 10,000-15,000 రూపాయలు సంపాదించవచ్చు. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
Also Read: కేవలం ఒక మిషిన్ కొనుక్కుంటే చాలు...ఆడుతూ పాడుతూ రోజు
5. వ్యవసాయ సామాగ్రిని అమ్మడం: దీని కోసం మీరు ప్రభుత్వ రాయితీలను కూడా పొందవచ్చు. మీరు ఒక చిన్న దుకాణాన్ని తెరిచి, మీ గ్రామంలోని రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అమ్మవచ్చు, ఎందుకంటే వారికి అవి ఎప్పుడూ అవసరం ఉంటుంది. ఈ దుకాణాన్ని కేవలం 20,000-30,000 రూపాయలతో ప్రారంభించి, మంచి నెలవారీ లాభాన్ని ఆర్జించవచ్చు.
మీరు ఈ బిజినెస్ లు చేస్తే మంచి లాభాలు సంపాదించి.. మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా గ్రామ అవసరాలను అర్థం చేసుకుని.. కష్టపడి, సరైన ప్రణాళికతో పనిచేయడమే. ఇది మీకు మంచి ఆదాయం సంపాదించడానికి సహాయపడుతుంది.
Also Read: రూ. 10 మ్యాగీ అమ్మి.. రోజుకు రూ. 24,000 సంపాదిస్తున్న యువకుడు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahanadu 2026: మహానాడులో సీఎం చంద్రబాబు స్పీచ్.."వాళ్ల కోసమే టీడీపీ పనిచేస్తుంది"!
Atmakur, Andhra Pradesh:Nara Chandrababu Naidu Speech: తెలుగుదేశం పార్టీ నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వేదికగా వర్చువల్ విధానంలో 'మహానాడు' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్వహించింది. 'మహానాడు' సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేవలం ఎన్నికల కోసం కాకుండా, భవిష్యత్ తరాల (జెన్ జీ, జెన్ ఆల్ఫా) ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ మహానాడును ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు అంకితం ఇస్తూ 'మహిళా మహానాడు'గా ప్రకటించారు.
గత విధ్వంసం - రెండేళ్ల సుపరిపాలన..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే గట్టెక్కించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించామని చెప్పారు. అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ భారాలు లేకుండా చూశామని తెలిపారు.
మహిళా సాధికారత, సంక్షేమం..
మహిళల ఆస్తి హక్కు నుండి నేటి 'తల్లికి వందనం' వరకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' బ్రాండింగ్ కల్పిస్తున్నామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో రూ.63 వేల కోట్లకు పైగా సామాజిక పింఛన్లు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించామని, 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు రూ.14 వేలు అందిస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నుండి 'సంజీవని' డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం తెస్తున్నట్లు ప్రకటించారు.
యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల వరద..
రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమం చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఏపీకి వస్తోందని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 పోస్టులు భర్తీ చేయడంతో పాటు, 10 వేల పోస్టులతో కూడిన '2026 జాబ్ క్యాలెండర్' విడుదల చేశామన్నారు.
ప్రాజెక్టుల పురోగతి..
గత పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను రూ.1,000 కోట్లతో నిర్మించామని, పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ సాధించామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాట పట్టించామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రతిపక్షంపై విమర్శలు, కేడర్‌కు పిలుపు..
వైసీపీని 'గొడ్డలి పార్టీ', 'ఫేక్ న్యూస్ బ్యాచ్'గా అభివర్ణించిన సీఎం చంద్రబాబు.. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను రాయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశంలోనే బలమైన కేడర్ టీడీపీ సొంతమన్న ఆయన, కార్యకర్తల ఆరోగ్యం కోసం 'మై హెల్త్ యాప్' తెచ్చామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ 2024 విజయాలను పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: విశాఖలో దారుణం.. చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా భార్తను చంపేసిన భార్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lucuma Benefits: మగాళ్లలో ఉత్సాహాన్ని తట్టిలేపే ఆయుధం..అంగట్లో దొరికే అసలు సిసలైన పండు రహస్యం తెలుసా?
Hyderabad, Telangana:Lucuma Fruit Benefits: నేటి ఆధునిక జీవనశైలిలో మనలో చాలామందికి అలసట, నీరసం సర్వసాధారణంగా మారాయి. మరీ ముఖ్యంగా పురుషుల్లో శారీరక బలం తగ్గిపోతూ ఎంతో మంది ఆస్పత్రుల బాట పడుతున్నారు. శక్తిని పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిసిన విషమే. కానీ, మగాళ్లలో ఉత్సహాన్ని తట్టిలేపే ఆయుధం పేరు శిలాజిత్. అయితే ఆ శిలాజిత్ కంటే ఎంతో శక్తివంతమైన 'లుకుమ' ఫలం గురించి మీలో ఎవరికైనా తెలుసా?
లూకుమా ఫ్రూట్ బెనిఫిట్స్..
ఇటీవలి కాలంలో పురుషుల ఆరోగ్యం, బలం, శక్తిని పెంచడానికి ప్రజలు సహజ ఆహారాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అదే విధంగా 'లూకుమా' అనే ఒక అరుదైన పండు ఆరోగ్య రంగంలో చాలా చర్చకు దారితీసింది. కొంతమంది ఆరోగ్య నిపుణులు దీనిని "సూపర్‌ఫుడ్" అని పిలుస్తున్నారు. పురుషుల బలం, శరీర శక్తిని పెంచడానికి ఇది శిలాజిత్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు.
దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో ప్రధానంగా లభించే లుకుమా పండు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి3, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి సహజమైన శక్తిని అందించి, నీరసాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పురుషులలో, ఓర్పును, శక్తిని పెంచే ఆహారంగా లుకుమాకు ఆధునిక కాలంలో ప్రజాదరణ పొందింది. జిమ్‌కు వెళ్లేవారు, ఫిట్నెస్ ప్రియులు దీనిని స్మూతీలు, పౌడర్లు, ఆరోగ్యకరమైన డెజర్ట్‌లలో తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇది శరీర జీవక్రియను మెరుగుపరచడానికి, ఎక్కువసేపు శక్తిని నిలుపుకోవడానికి సహాయపడవచ్చు.
లుకుమా పండుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. దానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. అందువల్ల, ఇది అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. ఇది మధుమేహ నియంత్రణ, బరువు నిర్వహణలో కూడా కొంతమేర సహాయపడుతుందని నిపుణులు నమ్ముతున్నారు.
అయితే, వైద్యుడిని సంప్రదించకుండా ఏ ఆహారాన్నీ ఔషధంలా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిలాజిత్ లేదా ఇతర సప్లిమెంట్లను ఆహారానికి ప్రత్యామ్నాయంగా వాడే ముందు మీ శరీర పరిస్థితిని, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి , సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు లూకుమా పండు వంటి పోషకమైన ఆహారాలను తినడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పండుపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.
(గమనిక: పైన అందించిన సమాచారం కేవలం జ్ఞానం కోసం మాత్రమే పొందుపరిచింది. నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా ఈ సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: విశాఖలో దారుణం.. చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా భార్తను చంపేసిన భార్య
Also Read: రాత్రికి రాత్రే అదృశ్యమైన మహేష్ హీరోయిన్..మాఫియా బెదిరింపులు, ఇప్పుడెలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sakshi Shivanand: రాత్రికి రాత్రే కనిపించకుండా పోయిన మహేష్ హీరోయిన్..మాఫియా బెదిరింపులు, ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Hyderabad, Telangana:Sakshi Shivanand News: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉండి ఓ వెలుగు వెలిగిన తారలు ఇప్పుడు కనుమరుగైపోయారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఎందరో నటీమణులు నేడు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. అటువంటి హీరోహీరోయిన్లలో సాక్షి శివానంద్ ఒక ఫేమస్ హీరోయిన్. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తళుక్కున మెరిసింది. తన నటనతోనే కాకుండా అందంతో మెప్పించిందీ ఈ బ్యూటీ. అయితే ఆమె ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమైంది. అయితే ఇంతకీ ఆ కథ ఏంటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
1977 ఏడాదిలో ముంబైలో జన్మించిన సాక్షి శివానంద్.. బాలీవుడ్లోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ నటి. 'అన్నా వదిన' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన సాక్షి శివానంద్.. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మాస్టర్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.
అప్పట్లో.. హీరోయిన్ సాక్షి శివానంద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అండర్‌వరల్డ్ మాఫియాకు సంబంధించిన షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. తాను నటించాల్సిన సినిమాకు అండర్‌వరల్డ్ సంబంధాలు ఉన్నాయని తెలిసి ఆయన తీవ్రంగా భయపడ్డారు. అంతేకాకుండా, మాఫియా సంబంధాలున్న నిర్మాతల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడం మొదలవడంతో, ప్రాణభయంతో ఆయన వెంటనే తన ఫోన్ నంబర్‌ను మార్చుకుని, రాత్రికి రాత్రే బాలీవుడ్‌కు వీడ్కోలు పలికి దక్షిణాదికి బయలుదేరారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాక్షి శివానంద్, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మాస్టర్' చిత్రంతో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత, ఆమె తెలుగులో మహేష్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్ వంటి స్టార్ నటులతో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. కన్నడలో ఉపేంద్రతో సహా పలువురు ప్రముఖ నటులతో కూడా ఆమె తెరను పంచుకున్నారు. అయితే, ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. సాగర్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఆమె చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు.
చాలా ఏళ్ల పాటు వార్తల్లో లేని సాక్షి శివానంద్ పేరు 2019లో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి ఏ సినిమా వల్ల కాదు.. ఆమె సొంత సోదరి, నటి శిల్పా ఆనంద్ (ఓహన్నా శివానంద్) చేసిన తీవ్రమైన ఆరోపణల కారణంగా వార్తల్లో నిలిచింది. బుల్లితెరపై 'దిల్ మిల్ గయే' టీవీ షోతో గుర్తింపు పొందిన శిల్పా ఆనంద్.. తన అక్క సాక్షి శివానంద్, ఆమె అత్త భావనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిద్దరూ కలిసి తనను చంపాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్పట్లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో హీరోయిన్ సాక్షి శివానంద్ గురించి వార్తల్లో చర్చ నడిచింది. మొత్తం మీద వెండితెరపై దేవతలా ప్రకాశించిన నటి సాక్షి శివానంద్ జీవితం అండర్‌వరల్డ్ భయం, హఠాత్ వివాహాలు, కుటుంబ కలహాలతో నిండిపోయింది. ఇవి ఇప్పటికీ ఆమె అభిమానులను తీవ్రంగా బాధిస్తున్నాయి.
Also Read: హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం.."నా ప్రపంచం ఇక శూన్యం" అంటూ ఎమోషనల్!
Also Read: నయనతార భర్తతో అఫైర్ పెట్టుకున్న స్టార్ నటి..ఏకంగా 4 ఏళ్ల పాటు సాగిన ప్రేమాయణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bheemili Murder Case: విశాఖలో దారుణం.. చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా భార్తను చంపేసిన భార్య
Bheemunipatnam, Andhra Pradesh:Bheemili Murder Case News: విశాఖపట్నం జిల్లా భీమిలిలో వివాహేతర సంబంధం కారణంగా ఒక పచ్చని సంసారం నడిరోడ్డుపై పడింది. ప్రియుడి మోజులో పడి, కట్టుకున్న భర్తను ఓ భార్య చున్నీతో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయాడంటూ డ్రామాలు ఆడింది. అయితే చివరకు కథ అడ్డం తిరిగి పోలీసుల విచారణలో దొరికిపోయి కటకటాలపాలైంది.
ఏం జరిగిందంటే?
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి అనే మహిళకు భీమిలి పరిధిలోని వలందపేటకు చెందిన బోర సూరితాతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. భర్త సూరితాత తాపీ మేస్త్రీగా పని చేస్తుండగా, నాగమణి స్థానికంగా ఉండే ఒక నూడిల్స్ దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో నాగమణికి వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని వారు చెప్పుకొచ్చారు.
అయితే ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం భవన నిర్మాణ పనుల నుంచి సూరితాత ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన నాగమణి.. తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి, శ్వాస ఆడకుండా చేసి ప్రాణాలు తీసింది.
హత్య చేసిన తర్వాత నాగమణి ఏమీ తెలియనట్లు నటిస్తూ కొత్త నాటకానికి తెరతీసింది. భర్తకు ఆరోగ్యం క్షీణించి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడంటూ బంధువులకు ఫోన్ చేసి నమ్మించింది. బంధువుల సహాయంతో సూరితాతను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, మృతుడి మెడపై ఉన్న నల్లటి గాయాలను చూసి బంధువులకు గట్టి అనుమానం వచ్చింది. వెంటనే వారు భీమిలి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరిశీలించగా.. అది ముమ్మాటికీ హత్యేనని ప్రాథమికంగా తేలింది. నాగమణిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఆమె ఆడిన నాటకానికి బ్రేక్ పడింది. తానే చున్నీతో మెడ బిగించి భర్తను హతమార్చినట్లు పోలీసుల ముందు నాగమణి నిజం అంగీకరించింది.
ఈ దారుణ హత్యలో నాగమణి ఒక్కరితే పాల్గొందా? లేక ఆమె ప్రియుడు లేదా మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. భర్తను పొట్టనబెట్టుకున్న నాగమణిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో అల్లకల్లోలంగా వాతావరణం!
Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్ ఎలిమినేటర్ పోరు..ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటికే! గెలుపు ఎవరిది?
New Chandigarh, Punjab:SRH Vs RR Preview 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూ చండీగఢ్ వేదికగా టోర్నీలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ చావో రేవో పోరులో గెలిచిన జట్టు ఫైనల్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా, ఆధిపత్యం స్పష్టంగా హైదరాబాద్ వైపే ఉంది. మొత్తం మ్యాచ్‌లు 23 సార్లు తలపడగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 సార్లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటికే రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ విజయం సాధించింది. అంతేకాకుండా, ఆర్ఆర్ పై వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచిన బలమైన రికార్డు ఎస్ఆర్హెచ్ సొంతం.
పిచ్ రిపోర్ట్..
ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని పిచ్ నెం.4 పై జరగనుంది. ఐపీఎల్ 2026 అంతటా ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడి సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 210 పరుగులు దాటింది. ఈ సీజన్లో ఈ పిచ్‌పై జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లు కొంతవరకు పరుగులు నియంత్రించగలుగుతున్నారు.
రాజస్థాన్‌పై ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్, భీకరమైన ఫామ్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కొద్దిగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, ఈ వేదికపై రాజస్థాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఒక హై-స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్ఆర్పై ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, హర్షల్ పటేల్/ప్రఫుల్ హింగే.
ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లో గాయాల సమస్యలు లేవు. రాజస్థాన్‌పై మంచి రికార్డు ఉన్నందున ప్రఫుల్ హింగే స్థానంలో హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 200+ స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్న అభిషేక్ శర్మ (560+ పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాక్‌బోన్ హెన్రిచ్ క్లాసెన్ (600+ పరుగులు)లపైనే భారం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు అంచనా..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దాసున్ షనక, శుభమ్ దుబే, రవీంద్ర జడేజా/రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.
కెప్టెన్ రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా చిన్నపాటి గాయాలతో బాధపడుతున్నారు. ఒకవేళ జడేజా ఫిట్నెస్ సాధించకపోతే రవి బిష్ణోయ్ జట్టులోకి వస్తాడు. ఈ సీజన్లో 583 పరుగులతో దుమ్మురేపుతున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, పవర్‌ప్లేలో వికెట్లు తీయగల స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్కు అత్యంత కీలకం కానున్నారు.
Also Read: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్ ఉన్నట్టే!
Also Read; ప్లేఆఫ్స్‌కు అడుగుదూరంలో పంజాబ్..రాజస్థాన్-కోల్‌కతా పరిస్థితి ఏంటి? అసలు కథ ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: వామ్మో.. నీటిలో దిగి ప్రమాదకరమైన పాముతో ఆడుకున్న చిన్నారి.. వీడియో..
Hyderabad, Telangana:Snake Video Viral: సోషల్ మీడియాలో రోజుకు ఒక వింతతో పాటు.. ఆశ్చర్యం కలిగించే ఘటన వెలుగులోకి నిత్యం ఎన్నో వస్తువుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలైతే సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి భయానక ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక చిన్నారి ఏకంగా ఒక ప్రమాదకరమైన పాముతో చిన్న చెరువులో ఆడుతున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న పాప నడుములోతు ఉన్న చిన్న చెరువుకి సంబంధించిన కాలువలు దిగింది. అక్కడ ఆమెకు ఒక పెద్ద పాము కనిపించింది.. సాధారణంగా పామును చూస్తేనే పెద్ద వాళ్లు అయితే అరుపులు కేకలు వేస్తూ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా పాము వైపుకు వెళ్లడం మీరు చూడొచ్చు.. అంతటితో ఆగకుండా.. ఆ ప్రమాదకరమైన పామును చేతుల్లోకి తీసుకొని.. ఏకంగా తన మెడలోకి వేసుకుంది. అనంతరం ఆ నీటిలోనే పాముతో ఎంతో అల్లారి ముద్దుగా ఆడుకుంటూ కనిపించింది..
ఈ వీడియోలో అందరినీ అత్యంత ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే.. ఆ చిన్నారి పామును అంతలా పట్టుకొని అటు ఇటు ఆడుకుంటున్నప్పటికీ.. ఆ పాము ఆమెపై ఏమాత్రం దాడి చేయకపోవడం.. సాధారణంగా మనుషుల అలికిడి తగిలితేనే పాములు బుసలు కొడుతూ కాటు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.. అలాంటిది ఈ వీడియోలో మాత్రం ఆ పాము కూడా చాలా ప్రశాంతంగా.. ఆ చిన్నారి తనకు స్నేహితురాలు అన్నట్లుగా ఉండిపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగించేలా చేస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఎక్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఆ చిన్నారి ధైర్యానికి ఆశ్చర్యపోతుంటే.. మరి కొంతమంది మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆట అని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు హెచ్చరిస్తున్నారు. పాములకు విషపు పళ్ళు పీకేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతుంటే.. ఎలాంటి సందర్భాల్లోనైనా వన్యప్రాణులతో ఇలాంటి సాహసం చేయడం ప్రాణాలకే ముప్పని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Cobra Video: ప్రాణాలను పణంగా పెట్టి.. 9 అడుగుల కింగ్ కోబ్రాతో యువకుడి ప్రమాదకర స్టంట్.. వీడియో..
Hyderabad, Telangana:9-Foot King Cobra Video Watch: సోషల్ మీడియాలో రోజుకు ఒక వింతైన.. ఆశ్చర్యం కలిగించే వీడియో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ.. అప్పుడప్పుడు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఒక అత్యంత ప్రమాదకరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనతో పాటు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే ఈరోజుల్లో. ఒక యువకుడు ఏకంగా కాలసర్పంగా భావించే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తో చెలగాటం ఆడాడు.. సుమారు 8 నుంచి 9 అడుగుల పొడవున్న.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను ఆ యువకుడు అత్యంత చాకచక్యంగా పట్టుకున్న దృశ్యాలు ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు.. సదరు యువకుడు ఆ భారీ పాము తోక భాగాన్ని తన ఎడమ చేతితో.. అలాగే దాని శరీర భాగాన్ని కుడి చేతితో పట్టుకొని గాల్లోకి లేపడం కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు..
ఆ సమయంలో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఏమాత్రం తగ్గకుండా తన భారీ పడగలను విప్పి.. గాల్లోనే బుసలు కొడుతూ కనిపించడం చూసే వారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. ఇలాంటి సాహసాలు ప్రాణాంతకం.. నిపుణుల పర్యవక్షణ లేకుండా, సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చట్టరీత్యా నేరం, అలాగే ప్రాణాలకే ప్రమాదమని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.. ఈ ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వీడియో అప్లోడ్ చేసిన కొద్ది రోజులకే లక్షలాది వ్యూస్ తో పాటు వేలాది లైక్స్ రావడం విశేషం..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తూ వస్తున్నారు.. కొంతమంది సోషల్ మీడియా దారులు ఆ యువకుడి ధైర్యంతో పాటు నైపుణ్యాన్ని చూసి నేర్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఇది ధైర్యం కాదు పిచ్చితనం.. ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అంటూ కామెంట్లు రాస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలాంటి ప్రాణాంతకమైన స్టన్స్ చేయడం సరికాదని.. వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Husband Sells Wife: భార్యను రూ.50 వేలకు అమ్మేసిన కిరాతక భర్త.. నరకయాతన అనుభవించిన బాధితురాలు!
Hyderabad, Telangana:Husband Sells Wife In Gujarat: కలకాలం తోడుండాల్సిన భార్యను తనకు నచ్చలేదనే రీజన్‌తో కేవలం 50 వేల రూపాయలకే స్నేహితులకు అమ్మేసిన ఘోరమైన ఘటన రాజస్థాన్‌లోని బనస్కాంత జిల్లాలో వెలుగు చూసింది.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తనే కామాంధులకు భార్యను ఎరగా వేసిన ఈ ఉదాంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టిస్తుంది. ఆ తర్వాత సదరు మహిళపై ఆ కిరాతకులు అమానుష్యంగా సామూహిక అత్యాచారానికి వడిగట్టారు. ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బనస్కాంత జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొన్ని ఏళ్ల క్రితం వివాహమైంది.. అయితే.. కొంతకాలంగా భార్య ప్రవర్తన నచ్చడం లేదంటూ ఆమెపై అతను ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని చూసి.. తన స్నేహితులతో భేరసారాలు సాగించాడు.. మే 11న పక్కా ప్లాన్ ప్రకారం భార్యను వాళ్లకు 50 వేలకు విక్రయించాడు..
మిస్సింగ్ కంప్లైంట్..
సమాజానికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ కిరాతకుడు అదే రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.. అయితే కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే సదరు భర్త కూడా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం ఏమిటనేది బయటపడింది. ఈ అసలు విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు..
స్నేహితులకు అమ్మేశాడు..
ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన భర్తనే తనను డ్రామా ఆడి స్నేహితులకు అమ్మేశాడని.. వాళ్లు ఆమెను బంధించి నగలు లాక్కొని పదేపదే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. పోలీసులు నిందితుల స్థావరాలపై దాడి చేసి బాధితురాలిని సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమె పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరవుతూ.. తన ఆవేదన పంచుకుంది. తనకు నచ్చలేదని కారణంతోనే తన భర్త క్రూరంగా తన స్నేహితులకు విక్రయించాడని.. కొనుగోలు చేసిన వ్యక్తులు తనను ఒకచోట బంధించి.. ఒంటిపై ఉన్న బంగారు నగలను బలవంతంగా లాక్కొని అమ్మేశారు అన్నారు.. అంతేకాకుండా పలుసార్లు తనపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులతో వాపోయింది..
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు..
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును ప్రారంభించారు. నిందితులపై కిడ్నాప్ తో పాటు సామూహిక అత్యాచారం, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతక భర్తతో పాటు అతనికి సహకరించిన, అత్యాచారానికి పాల్పడ్డ మరో ఆరు గురు స్నేహితులను మొత్తం ఏడు గురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ బాధ్యత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసును మరింత దగ్గరగా దర్యాప్తు చేస్తున్నారు..
Also Read: రాజీనామాకు సిద్దు సిద్ధమేనా..! డీకేను వరించనున్న కర్ణాటక సీఎం పదవి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Samsung: ఫ్లాట్ డిస్ప్లే, Exynos 2500 ప్రాసెసర్‌తో Samsung Galaxy S26 FE.. లాంచ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Samsung Galaxy S26 Fe Design Leaked News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung తన గెలాక్సీ లైన్ అప్‌లో సరికొత్త మోడల్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. గెలాక్సీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Samsung గ్యాలక్సీ s26 ఎఫ్ఈ (Samsung Galaxy S26 FE) స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కంటే ముందే ఈ మొబైల్‌కు సంబంధించిన డిజైన్‌తో పాటు కొన్ని కీలకమైన ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఒక ప్రముఖ థర్డ్ పార్టీ ప్రొటెక్టివ్ కేస్ తయారీ సంస్థ ద్వారా ఈ మొబైల్ డిజైన్ రెండర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ ఏంటో? దీనికి సంబంధించిన డిజైన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన వివరాల ప్రకారం.. సాంసంగ్ గాలక్సీ s26 ఎఫ్ఈ మోడల్ అద్భుతమైన ఫ్లాట్ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫోన్ చుట్టూ బెజెల్స్ చాలా స్లిమ్‌గా సమానంగా ఉండబోతున్నట్లు సమాచారం. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ పై భాగంలో సెంటర్ పంచ్ హోల్ కట్ అవుట్ ను అందిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ నాలుగు మూలలు రౌండ్‌గా ఉంటూ.. సైడ్ ఫ్రేమ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుంది. కుడివైపు పవర్ బటన్ తో పాటు వాల్యూం బటన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ ఫోన్ డిజైన్ మునిపటి మోడల్ ఆయన గెలాక్సీ ఎస్ 25 FE, ప్రీమియం గెలాక్సీ s26 సిరీస్ లను పోలి ఉంటుందని లీకైన డిజైన్ చూస్తే తెలుస్తోంది..
ఇక ఈ Samsung Galaxy S26 FE మొబైల్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇందులో నిలువుగా అమర్చిన మూడు ప్రత్యేకమైన కెమెరా సెటప్‌లను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ప్రత్యేకమైన పీల్ షేపులో ఉండి బ్యాక్ ప్యానెల్‌కు చక్కగా లుక్‌ను అందిస్తోంది. అంతేకాకుండా సాంసంగ్ తన మునుపటి డిజైన్ లాంగ్వేజ్‌కు పెద్దగా మార్చకుండా మరింత ప్రీమియం ఫినిషింగ్‌తో ఈ మొబైల్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ చూడడానికి గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇటీవలే ఈ Samsung Galaxy S26 FE స్మార్ట్‌ఫోన్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్ లో కూడా కనిపించింది.. ఇక ఇందులో పేర్కొన్న ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన ఎక్సినోస్ 2500 (Exynos 2500) ప్రాసెసర్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్లో కంపెనీ గరిష్టంగా 8GB ర్యామ్ లభించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్, శామ్సంగ్ వన్ యూఐతో రన్ అవుతుంది.. గతంలో సాంసంగ్ గ్యాలక్సీ s25 fe మోడల్ ను సెప్టెంబర్ 2025లో విడుదల చేశారు. కాబట్టి ఈ సరికొత్త గెలక్సీ ఎస్ 26 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi Turbo 5: వన్‌ప్లస్, వీవోలకు చెక్.. రూ.30 వేల బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ ఫీచర్లతో Redmi Turbo 5 ఫోన్!
Hyderabad, Telangana:Redmi Turbo 5 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి తన సబ్ బ్రాండ్ Redmi నుంచి భారత వినియోగదారుల కోసం మరో సరికొత్త మొబైల్‌ను పరిచయం చేయడానికి Redmi అయింది.. చైనా మార్కెట్లో ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంటున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్ లోకి విడుదల చేయనన్నట్లు కంపెనీ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. బడ్జెట్ ధరలు ఫ్లాగ్షిప్ స్థాయి పనితీరు కలిగిన ఈ మొబైల్ త్వరలో భారత్ మార్కెట్లోకి విడుదల కావడం విశేషం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ప్రత్యేకంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో ఉన్న ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ కెమెరా సిస్టం ద్వారా తక్కువ వెలుగులో కూడా అద్భుతమైన స్పష్టమైన ఫోటోలను, వీడియోలను రికార్డు చేయవచ్చు. అలాగే సెల్ఫీ కోసం ముందు భాగంలో చాలా ప్రత్యేకమైన 20-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
రెడ్మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59-ఇంచుల సూపర్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా (MediaTek Dimensity 8500 Ultra) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది శక్తివంతమైన 7,560mAh బ్యాటరీ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు ఈ బ్యాటరీని ఎంతో సులభంగా ఫుల్ ఛార్జ్ చేసేందుకు చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నారు. దీనివల్ల కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఫుల్ చార్జ్ అవుతుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS 3)తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌తో పాటు వైట్ మెంట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇక భారత మార్కెట్లో ఈ Redmi Turbo 5 మొబైల్ ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని Redmi కంపెనీ దాదాపు బేస్ వేరియంటును రూ.30 వేల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హై ఎండ్ వేరియంట్ రూ.40 వేల ధరతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త టర్బో సిరీస్ ఫోన్ మార్కెట్లోకి వస్తే వివోతో పాటు వన్ ప్లస్, ఐక్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల మిటరేంజ్ స్మార్ట్ఫోన్స్తో గట్టిగా పోటీ ఎదరడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలయితే amazonతో పాటు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో విక్రయించబోతున్నట్లు సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: అకాల వర్షం బీభత్సం.. నీట మునిగిన ధాన్యం.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు!
Hyderabad, Telangana:Karimnagar Market Yards News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి.. అమ్మకం కోసం ఆరబెట్టిన వేలాది క్వింటల ధాన్యం వర్షం నీటిలో పూర్తిగా తడిసి ముద్దయింది.. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ప్రాంగణంలో లోపాలు ఉండడం కారణంగా కొన్నిచోట్ల మార్కెట్ మొత్తం చెరువుల తలపించింది. వరద ఉధృతికి కొందరి రైతుల వడ్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.. మరికొందరి ధాన్యం నీట మునిగింది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్ళముందే వరద పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు..
మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి.. వారాలు గడుస్తున్నప్పటికీ.. అధికారులు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మిల్లుల కేటాయింపు తో పాటు తూకాల నిర్వహణ, గిడ్డంగుల కోరత వంటి సాకులు చెబుతూ రోజులు వెల్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. సకాలంలో కొనుగోలు జరిపి ఉంటే తమకు ఈ గతి పట్టేది కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డున పడాల్సి వచ్చిందని రైతులు ధ్వజమెత్తుతున్నారు.. మూడు వారాల నుంచి ఇక్కడే తిండితో పాటు తిప్పలు లేకుండా కాపలాగా ఉన్నామని.. తీరా తూకం వేసే సమయానికి వర్షం వచ్చి సర్వం తడిచిపోయిందని.. వారి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
కొన్నిచోట్ల ధాన్యం తడిసిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం మార్కెట్ యార్డుల కార్యాలయం ముందు ప్రత్యేకమైన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వర్షం వస్తుందని ముందే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ మార్కెట్ కమిటీ కనీసం కవర్లు కూడా సరఫరా చేయలేదని మండిపడుతున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
తడిసిన రంగు మారిన ధాన్యానికి ఎలాంటి నిబంధనలతో పాటు తరుగు విధించకుండా మద్దతు ధరకే పూర్తిగా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. అలాగే వరద పాలైన ధాన్యానికి ఎకరాకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అంటున్నారు. లేదంటే కుమ్మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని రైతాంగం స్పష్టం చేసింది. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana: గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. ఇకపై సొంత నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!
Hyderabad, Telangana:Cm Revanth Reddy Big Boost To Gram Panchayats: తెలంగాణలోని గ్రామపంచాయతీల బలోపేతానికి.. వాటి ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయంతో శుభవార్త చెప్పారు. గ్రామాల వికాసమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వాతంత్రం కల్పించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామపంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయితీల సొంత బ్యాంకు ఖాతాలోనే జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో తగిన మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
గతంలో గ్రామపంచాయతీలకు పన్నులతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది.. దీనివల్ల గ్రామంలో అత్యవసర పనులు చేపట్టాలన్న.. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్న.. వీధి దీపాల నిర్వహణ చూసుకోవాలన్న నిధుల విడుదల కోసం ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాలవల్ల నిధుల డ్రా చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది.. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడుతోందని భావించిన ముఖ్యమంత్రి.. ఈ ఈ వ్యవస్థకు గుడ్ బై పలకాలని నిర్ణయించుకున్నారు..
కొత్త విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లోని వసులయ్యే ఆస్తి పన్నులతో పాటు నాళాల ఫీజులు లేఅవుట్ ఫీజులు ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక బ్యాంకుల్లోనే ఉంటాయి. దీనివల్ల నిధుల వినియోగంలో సర్పంచులకు, పంచాయితీ పాలకవర్గానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని.. గ్రామాల తక్షణ అవసరాలకు ఈ నిధులు వెంటనే వాడుకునే వీలుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికార చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.. త్వరలో ఈ నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయబోతున్నారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలోని పల్లె ప్రగతి పథంలో దూసుకుపోతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.. అతి త్వరలోనే చట్ట సవరణ జరిగిన తర్వాత అమల్లోకి వస్తే.. గతంలో లాగా ట్రెజరీలకు సంబంధం లేకుండానే నేరుగా గ్రామపంచాయతీకి సంబంధించిన అకౌంట్ ద్వారా డబ్బులను గ్రామం పనులకు వినియోగించుకోవచ్చు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Saturn-Mars Effect: శని, కుజ గ్రహాల అద్భుత కలయిక.. అక్టోబర్ వరకు ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు!
Hyderabad, Telangana:Saturn-Mars Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజ, శని గ్రహాల ప్రభావం వల్ల అక్టోబర్ వరకు నాలుగు నాలుగు రాశుల వారి తలరాతలు మారబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో వృత్తి, వ్యాపారం, సామాజిక గౌరవం వంటి విషయాల్లో ఊహించని మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్ర హాన్ని బలంతో పాటు ధైర్యం, శ్రమ ఫలితాలకు సూచికగా భావిస్తారు. అలాగే శనిని కర్మ స్థిరత్వం, వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులకు సూచికగా చెప్పుకుంటాయి. ఇలాంటి రెండు గ్రహాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపితే.. జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అనుకోని అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలుంటాయి. అయితే అక్టోబర్ నెల వరకు ఏ రాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంఫర్ జాక్‌పాట్..
మేషరాశి
మేషరాశి వారికి శని కుజ గ్రహాల ప్రభావంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా పదోన్నతులు లభించి వ్యాపారాల పరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలలో కూడా మంచి విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలాకాలంగా ఉన్న పెయింటింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ఆనందం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఒక గౌరవం లభించి గుర్తింపు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా శుభ్రంగా ఉంటుంది.. ముఖ్యంగా కొత్త పెట్టుబడులో నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో ధనాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని, కుజ గ్రహాల ప్రభావంతో ఆర్థికంగా చాలా వరకు అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. లేదంటే వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజ శని గ్రహాల ప్రభావంతో కెరీర్లో పెద్దపెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. అంతే కాకుండా ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి కూడా సాధించగలుగుతారు. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలకు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా కఠోరంగా శ్రమ పడే వ్యక్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు లభించబోతున్నాయి. వీరికి తప్పకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది.. కుటుంబ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Navapanchami Rajayoga: శని, శుక్రుల అద్భుత కలయిక.. నవపంచమి రాజయోగంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!
Hyderabad, Telangana:Navapanchami Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ పంచమి రాజయోగాన్ని అత్యంత శుభప్రదమైన శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ యోగం ఏర్పడితే కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవించడమే కాకుండా.. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే జూన్ 25వ తేదీన శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ పంచమి రాజయోగం ఏర్పడింది. శుక్ర, శని రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్లే ఏర్పడిన ఈ పంచమి రాజయోగంతో నాలుగు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో అభివృద్ధి లభించడమే కాకుండా ఆయా రాశుల వారు ఊహించని ధన లాభాలు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే కష్టపడి పనులు చేసే వ్యక్తులకు దైవం తప్పకుండా తోడు ఉండబోతోంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
నవ పంచమి రాజయోగంతో మేషరాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కెరీర్‌తో పాటు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు చాలా కాలంగా ఉన్న కొన్ని రకాల కేసులు తప్పకుండా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.
మేష రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ కొన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న మారి ఎంతో కఠినమైన పనులు చేసి అద్భుతమైన విజయాలు సాధించి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు నవ పంచమి రాజయోగం ప్రభావంతో ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో ప్రేమ విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవితంలో అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా చిక్కులు తొలగిపోవడమే కాకుండా కష్టానికి తగిన గుర్తింపు లభించబోతోంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు నవ పంచమి రాజయోగం ప్రభావంతో కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకునే అవకాశాలున్నాయి. ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ఈ సమయంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఆందోళన తగ్గి, మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు జూన్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి శనీశుక్ర గ్రహాల ప్రభావంతో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలగబోతున్నాయి. వీరికి పదోన్నతులు లభించడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభించబోతోంది. అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
