icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Free Sewing Machine Scheme: ఉచితంగా కుట్టు మిషన్‌ ఎలా పొందాలి? దరఖాస్తు ఎలానో తెలుసా?

Baddipadaga, Telangana:

Telangana Sewing Machine Scheme: తెలంగాణ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరో పథకం ప్రారంభించింది. మహిళలు సొంత కాళ్లపై సంపాదించుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. అనంతరం ఈ పథకానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. కుట్టుమిషన్ల పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

'బీసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోంది . బీసీ మహిళలకు ఆటో మెటిక్ కుట్టు మిషన్‌ల పంపిణీ పథకం దరఖాస్తులు ఎల్లుండి ప్రారంభం అవుతాయి' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆర్థికంగా సాధికారత సాధించేలా చేయడం పథకం ప్రధాన లక్ష్యం అని ప్రకటించారు. ఈ పథకానికి మహిళలు అందరూ కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15 వరకు మహిళలు కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఎన్ని మిషన్లు?
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కుట్టు మిషన్లు అందిస్తారు. మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.12,000 విలువైన కుట్టు మిషన్‌ను ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందించనుంది. ఈ పథకం ఇప్పుడే కాకుండా నిరంతరం కొనసాగుతుంది. ఒక కుటుంబం నుంచి ఒక్కరే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఒక్కో లబ్ధిదారుకు రూ.12 వేల విలువైన కుట్టు మిషన్ అందించనుండగా.. కుట్టు మిషన్ ఖర్చులో 100 శాతం ప్రభుత్వమే భరించనుంది.

అర్హతలు.. ఎవరు అర్హులు
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న బీసీ మహిళలు అర్హులు
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటకూడదు.
దరఖాస్తుదారులకు టైలరింగ్/కుట్టు శిక్షణకు సంబంధించిన అర్హతకు ప్రాధాన్యం
ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే కుట్టు మిషన్ అందిస్తారు.

దరఖాస్తు ఎలా?
లబ్ధిదారుల ఎంపిక కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. TGOBMMS వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ నిర్వహణ చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం నిబంధనలు ప్రభుత్వం రూపొందించింది. 

ఎంపిక ఎలా?
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి. ఎంపికైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహం. పథకం అమలులో అర్హత, ఆదాయం, శిక్షణ తదితర వివరాల పరిశీలన తప్పనిసరి. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.

0
0
Report

Python Video: నీటి గుంతలో 13 అడుగుల కొండచిలువ.. గుండెలు దడదడలాడించే రెస్క్యూ వీడియో!

Hyderabad, Telangana:

Giant Python Viral Video: సాధారణంగా పాము పేరు చెబితేనే.. చాలా మంది ఆమడదూరం పరుగులు తీస్తూ బయపడి పోతూ ఉంటారు.. ఇక అది భారీ కొండచిలువ (Python) అయితే.. చూసిన వెంటనే గుండె ఆగినంత పనవ్వడం ఖాయం.. సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే, తాజాగా ఓ నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో ఏకంగా 13 అడుగుల పొడవాటి ఓ భారీ కొండచిలువను ఒక యువకుడు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ వీడియోనే కనిపిస్తూ ఉంది..

నీటిలో భారీ కొండచిలువ.. 
చాలా రోజుల నుంచి అడవులు అంతరించిపోతుండటంతో వన్యప్రాణులు తరచుగా జనాలు నివసించే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ పెద్ద నీటి గుంతలో భారీ కొండచిలువ పడిపోయింది. ఆ నీటిలోంచి బయటకు రాలేక ప్రాణాపాయ స్థితిలో, ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండటాన్ని స్థానికులు గమనించారు.. ఆ భారీ పామును చూసి జనాలు భయంతో వణిపోకుండా... వెంటనే స్నేక్ క్యాచర్‌కు (Snake Catcher) సమాచారం అందించారు. అయితే, వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్  పవన్ సర్పమిత్ర (Pavan Sarpmitra) బృందం అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు.

ఆ కొండచిలువ ఏకంగా 13 అడుగుల పొడవు ఉన్నట్లు గమనించిన స్నేక్‌ క్యాచర్స్‌ సైతం ఆశ్చర్యపోయారు. పైగా కొండచిలువలకు విషం లేకపోయినా.. వాటికి ఉండే విపరీతమైన బలంతో మనుషులను సైతం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి పామును నీటిలోంచి బయటకు తీయడం చాలా కష్టమని వారు భావించారు. అయినా సరే.. ఓ యువకుడు ఏ మాత్రం భయం లేకుండా నిచ్చెన సాయంతో ఆ నీటి గుంతలోకి దిగాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. 

పామును అతను ఎంతో సులభంగా పట్టుకునేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. పాము బరువు ఎక్కువగా ఉండటంతో పాటు అది విపరీతంగా గింజుకోవడంతో.. పైనున్న మరికొంత మంది యువకులు అతనికి సహాయంగా ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. అందరూ ఎంతో కష్టపడి పామును నీటిలో నుంచి బయటికి లాగడం కూడా మీరు చూడొచ్చు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఆ భారీ కొండచిలువను నీటిలో నుంచి పైకి తీస్తున్న దృశ్యాలు చూసి చాలా మంది భయపడిపోయిన్నట్లు తెలుస్తోంది. పామును సురక్షితంగా బయటకు తీసిన తర్వాత దాన్ని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టిన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షార్ట్ వీడియోను ఏకంగా 25 కోట్ల మందికి పైగా (250 Million Views) వీక్షించగా, 24 లక్షలకు పైగా లైక్స్ చేయడం విశేషం.. ఈ వీడియోను  చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Hyderabad, Telangana:

Independence Day 2026 Flag Rules: ఆగస్టు 15 పండుగ వాతావరణం ముగిసిన తర్వాత ప్రతిచోటా కనిపించే త్రివర్ణ పతాకాలతో మనం ఎలా వ్యవహరించాలి? జెండాను సరిగ్గా ఎలా దించాలి, మడవాలి, ఎక్కడ భద్రపరచాలి, పాడైతే ఎలా నాశనం చేయాలనే విషయాలపై ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (భారత పతాక నియమావళి) స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది.

1) జెండాను జాగ్రత్తగా దించాలి..
త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా నెమ్మదిగా దించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా నేలను లేదా నీటిని తాకనివ్వకూడదు. ఎప్పుడూ దానిని నేలపై ఈడ్చుకుపోకూడదు.

2) శుభ్రపరచడం, భద్రపరచడం
జెండాను మడతపెట్టే ముందు అది పూర్తిగా పొడిగా, శుభ్రంగా ఉందో లేదో పరిశీలించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో తడిగా ఉన్న జెండాకు బూజు పట్టే అవకాశం ఉంది. జెండాను చక్కగా మడిచి, తేమ, కీటకాలు సోకని శుభ్రమైన, పొడి ప్రదేశంలో (ఒక రక్షిత కవరు లేదా పెట్టెలో) భద్రపరచాలి.

3) త్రివర్ణ పతాకాన్ని ఎలా మడవాలి?
జెండాను చదునైన ప్రదేశంలో పరిచి, దాని పట్టీలు లోపలికి వెళ్లేలా చక్కగా మడవాలి. మడిచిన తర్వాత పైభాగంలో అశోక చక్రం కనిపించేలా చూసుకోవాలి. ఆ తర్వాత కాషాయ రంగు పట్టీ పైకి ఉండేలా అమర్చి జాగ్రత్తగా డ్రాయర్ లేదా సురక్షిత స్థలంలో ఉంచాలి.

4) జెండా పాడైపోతే లేదా చిరిగిపోతే ఏం చేయాలి?
జెండా చిరిగిపోయినా, మరకలు పడినా లేదా తీవ్రంగా దెబ్బతిన్నా దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్టలో వేయకూడదు. రోడ్డు పక్కన వదలడం లేదా నేలపై పడేయడం చట్టరీత్యా నేరం. నిబంధనల ప్రకారం, పాడైన జెండాను పూర్తిగా ఏకాంతంగా (ప్రైవేటుగా), గౌరవప్రదంగా కాల్చడం ద్వారా లేదా జెండా గౌరవానికి భంగం కలగని ఇతర పద్ధతిలో నాశనం చేయాలి.

5) ఆగస్టు 15 తర్వాత జెండాను వాడుకోవచ్చా?
స్వాతంత్ర్య దినోత్సవం ముగిసినంత మాత్రాన జెండాను తీసేయాలనే నిబంధన ఏమీ లేదు. ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు లోబడి పౌరులు అన్ని రోజులలోనూ జాతీయ జెండాను ప్రదర్శించవచ్చు. రాత్రివేళల్లో తగిన కాంతిని ఏర్పాటు చేసి జెండాను ఎగరేయవచ్చు. అయితే, జెండాను తోరణాలుగా, సాధారణ అలంకరణ వస్తువులుగా, దుస్తులు లేదా నాప్కిన్‌లపై ముద్రించడం వంటివి చేయడానికి చట్టం ఒప్పుకోదు.

6) చిన్న కాగితపు / ప్లాస్టిక్ జెండాల పట్ల జాగ్రత్త
వేడుకల్లో వాడే చిన్న జెండాలను మురుగు కాలువల్లో, రోడ్లపై లేదా చెత్తాచెదారంలో పారవేయకూడదు. వాటిని కూడా బాధ్యతాయుతంగా సేకరించి భద్రపరచాలి లేదా గౌరవప్రదంగా తొలగించాలి.

చట్టపరమైన హెచ్చరిక..
1971 నాటి 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం' సెక్షన్ 2 ప్రకారం జాతీయ జెండాను అగౌరవపరచడం, బహిరంగంగా కాల్చడం, తొక్కడం లేదా వికృతం చేయడం శిక్షార్హమైన నేరం. దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు.

Also Read: ఉద్యోగులకు రూ.45,000 కనీస పెన్షన్..ఏడాదికి నాలుగుసార్లు డీఏ పెంపునకు డిమాండ్!

Also Read: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bigg Boss 10 Agnipariksha: "బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష' అంతా బోగస్" శ్రీముఖిని పొగడలేదని షో నుంచి బయటకు పంపించేశారట!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Agnipariksha Season 2: తెలుగు బుల్లితెరపై అత్యంత క్రేజీ రియాలిటీ షో అయిన 'బిగ్ బాస్' సీజన్ 10 త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే, ప్రధాన షో కంటే ముందే నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష' సెలక్షన్ ప్రాసెస్ తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ వేదికపై అర్హత పరీక్షల్లో పాల్గొని రిజెక్ట్ అయిన కంటెస్టెంట్లు సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కంటెస్టెంట్ల ప్రధాన ఆరోపణలు..
1) శ్రీముఖిని పొగడలేదనే కోపమా?: అగ్నిపరీక్షలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ మాట్లాడుతూ.. జడ్జీలుగా వ్యవహరిస్తున్న నవదీప్, బిందు మాధవి, అభిజిత్ సీజన్లను తాను చూశానని చెప్పినట్లు తెలిపారు. కానీ, హోస్ట్‌గా ఉన్న శ్రీముఖి సీజన్‌ను తాను చూడలేదని నిజం చెప్పడమే తాను చేసిన పెద్ద తప్పిదమని ఆవేదన వ్యక్తం చేశారు.

2) హైజాక్ చేసిన రెడ్ సిగ్నల్: నిజం చెప్పడంతో శ్రీముఖి కోపంతో ఊగిపోయి స్టేజ్ దిగిపోయిందని, నవదీప్ తనకు 'గ్రీన్' ఇచ్చేందుకు ప్రయత్నించినా శ్రీముఖి దానిని హైజాక్ చేసి మరీ తనకు 'రెడ్ కార్డ్' ఇచ్చి రిజెక్ట్ చేశారని ఆరోపించారు.

3) భజన చేసేవారికే చోటా?: బిగ్‌బాస్‌లో ఉండాల్సింది డేరింగ్ అండ్ ముక్కుసూటితనం అని, అంతే కానీ జడ్జీలను పొగడడం, భజన చేయడం కాదని కంటెస్టెంట్లు మండిపడుతున్నారు.

జపాన్ భాష మాట్లాడితేనే సెలెక్టా?
మరో కంటెస్టెంట్ నిఖిల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఉప్పల్ బాలు లాంటివారిని షోకి పిలిచి అవమానించి పంపించారని మండిపడ్డారు. జపాన్ నుంచి వచ్చిన 'ఫుటూ' అనే వ్యక్తి జపనీస్ మాట్లాడాడనే కారణంతో అతనికి సెలెక్షన్ ఇచ్చారని, అలాంటప్పుడు తాను కూడా 'కిలికిలి' భాష మాట్లాడగలనంటూ ఎద్దేవా చేశారు. 

ఉద్యోగాలు వదిలేసి, సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వస్తే.. అగ్నిపరీక్ష పేరుతో బోగస్ డ్రామా నడిపిస్తున్నారని కంటెస్టెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే కొందరిని ఫిక్స్ చేసుకుని ఈ సెలెక్షన్ డ్రామాలు ఏంటని నిలదీస్తూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

Also Read; బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్‌కు రంగం సిద్ధం..ఎంపికైన టాప్ 15 కంటెస్టెంట్లు వీళ్లే!

Also Read: హీరో ఎన్టీఆర్‌ హెల్త్ బులెటిన్ విడుదల..ఆరోగ్య పరిస్థితిని ప్రకటించిన కిమ్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sravana Masam 2026: శ్రావణ మాసంలో అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారికి బంపర్ లక్!

Hyderabad, Telangana:

Sravana Masam Zodiac: శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కోట్లాది మంది భక్తులు పరమేశ్వరుని పూజిస్తారు.. జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన, అతి అరుదైన మహాయోగం ఏర్పడబోతోంది.  ఈ శ్రావణ శివరాత్రి రోజున గ్రహాలన్నీ మార్పులు చేర్పులు చేయబోతున్నాయి.. కర్కాటక రాశిలో సూర్యుడు, చంద్రుడితో పాటు బుధుడు, బృహస్పతి గ్రహాలు కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రహీ యోగం ఏర్పడింది. ఇది ఆగస్టు 13వ తేదినే జరగడం చాలా విశేషమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఈ శ్రావణంలోనే గురు-ఆదిత్య యోగంతో పాటు బుధాదిత్య రాజయోగం, అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఒకే సమయంలో ఏర్పడడం విశేషం.. ఈ మహా గ్రహాల కలయిక 12 రాశులపై ప్రభావం చూపినప్పటికీ.. ప్రత్యేకంగా 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనేక మార్పులు రాబోతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అద్బుతమైన ఉపశమనం కలుగుతుంది.

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
మకర రాశి
మకర రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా, సామాజికంగా సరికొత్త పరిచయాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలతో పాటు అద్భుతమైన సపోర్ట్‌ లభిస్తాయి. మీరు చెప్పే ఆలోచనలకు ఊహించని స్థాయిలో విలువలు కూడా పెరుగుతాయి.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి..

తులా రాశి
మోస్ట్ పవర్‌ఫుల్ యోగాల కారణంగా కెరీర్‌లో ఆశించిన అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో మంచి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జీవితంలో పెద్ద కల ఈ సమయంలో నెరవేరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి..

మేష రాశి
ఈ పవిత్ర మాసంలో ఏర్పడే యోగాల ప్రభావంతో మేష రాశి వారికి భౌతిక జీవితాల్లో గొప్ప పురోగతి అద్భుతంగా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన మొండి బాకీలు కూడా సులభంగా వసూలు అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. శివుడి కృపతో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి..

సింహ రాశి 
లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల నూతన ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి ఊహించని భారీ లాభాలు అందుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.. కుటుంబంలో ఆనందోత్సవాలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి.

కర్కాటక రాశి 
చతుర్గ్రహీ యోగం ప్రభావంతో కర్కాటక రాశివారికి కూడా ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి.. రాజకీయాల్లో, సామాజిక రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన పదవులు, పేరుప్రతిష్ఠలు దక్కే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Mercury And Jupiter: ఆగస్టు 15న అరుదైన బుధ-గురు గ్రహాల ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఇక పండగే!

Hyderabad, Telangana:

Mercury And Jupiter Conjunction Telugu: జోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాల్లో బుధ గ్రహం ఒకటి.. దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. గురు గ్రహానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలిసిందే.. ఈ శ్రావణ మాసంలో సరిగ్గా ఆగస్టు 15 సాయంత్రం 4:51 గంటలకు బుధ, గురు గ్రహాలు సరిగ్గా 0 డిగ్రీల వద్దకు రాబోతున్నాయి. ఇలా రావడం చాలా అరుదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. దీని కారణంగా యుతి దృష్టి యోగం ఏర్పడబోతోంది. 

వ్యాపారంతో పాటు మేధస్సుకు సూచికగా భావించే బుధుడు.. జ్ఞానం, అదృష్టంతో పాటు ధర్మానికి అధిపతిగా భావించే గురుడు ఒకే స్థితిలోకి రావడం వల్ల ఏర్పడే ఈ శక్తివంతమైన యోగం కొన్ని రాశుల వారి భాగ్యరేఖలను మర్చేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ పవిత్ర కలయికతో నాలుగు రాశుల వారికి అష్టైశ్వర్యాలు లభించడమే కాకుండా.. అద్బుతమైన రోజులు మొదలవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఈ రాశులవారికి లాభాలే, లాభాలు..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ యోగం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు.. కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా.. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు కూడా రెట్టింపు అవుతాయి. ఆర్ధిక స్థితిగతులు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. డబ్బు పొదుపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకర రాశి (Capricorn)
మకర రాశి వారి కెరీర్‌లో బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు (Deals) కుదురుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో హోదాతో పాటు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గి.. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతాయి. ప్రతి పనిలో విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులన్నీ ఎంతో సులుభంగా తొలగిపోతాయి. విపరీతంగా ధన లాభాలు కూడా కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో విజయాలు కూడా సులభంగా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.. చేతినిండా డబ్బుతో సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.. అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా.. రాబడులు కూడా భారీగా తిరిగి పొందుతారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ధనం చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు విపరీతంగా పెరుగుతాయి.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విపరీతంగా పెరిగి అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Free Sewing Machine: తెలంగాణ మహిళలకు వరం.. రేపు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

Hyderabad, Telangana:

Telangana Govt Free Schemes: మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని నేడు ప్రారంభించనుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టనుంది. అయితే అందరూ మహిళలకు కాకుండా వెనుకబడిన వర్గాల (బీసీలు) మహిళలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నేడు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయనుండగా ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రేపు ఆగస్టు 13 గురువారం సచివాలయంలో  బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ మహిళలను ఎంపిక చేసి వారికి ప్రతీ నియోజకవర్గంలో అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందిస్తుండడం విశేషం. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతోపాటు వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా.. భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.

పథకం ప్రారంభం వివరాలు
ఎప్పుడు: ఆగస్టు 13, 2026 గురువారం
సయమం: మధ్యాహ్నం 12:00 గంటలకు 
ఎక్కడ: హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని జీ-29
అర్హులు: పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు.

0
0
Report

నీట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్రీగా లాంగ్ టర్మ్ కోచింగ్, అప్లై చేసుకోండి..!

BBhoomi19h ago
Lakshmapur, Telangana:

Telangana NEET Free Coaching: నీట్ 2027కు సిద్ధమవుతున్న తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశం పొందేందుకు ఒక గొప్ప అవకాశం లభించింది. వచ్చే ఏడాది జరిగే నీట్ యూజీ పరీక్ష కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థాన్ (టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌ను అందించనుంది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రత్యేక కోచింగ్ కార్యక్రమంలో మొత్తం 200 మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో 100 సీట్లు బాలురకు, 100 సీట్లు బాలికలకు కేటాయించబడ్డాయి. హైదరాబాద్‌లోని చిలకూరులో ఉన్న టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీఓఈ బాలురకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఓఈ బాలికలకు ఉచిత నీట్ కోచింగ్‌ను అందిస్తాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఏదైనా కళాశాల నుండి ఇంటర్మీడియట్ లేదా బీ.ఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే నీట్-2026 పరీక్ష రాసిన అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడమైనది.

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఐఎస్ (TGSREIIS) వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దానిని పూర్తిగా నింపి, అవసరమైన పత్రాలను జతచేసి, సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ (డీసీఓ) నిర్దేశించిన కేంద్రాలలో సమర్పించాలి. బాలుర దరఖాస్తులను చిలుకూరు కేంద్రంలో, బాలికల దరఖాస్తులను మహేంద్ర హిల్స్ కేంద్రంలో సమర్పించాలని అధికారులు సూచించారు.

ఈ ఉచిత నీట్ కోచింగ్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుండి ఎటువంటి దరఖాస్తు రుసుము వసూలు చేయడం లేదని వర్గాలు తెలిపాయి. ఎంపికైన 200 మంది అభ్యర్థులకు ఉచిత వసతి , నిపుణులైన ఉపాధ్యాయుల నుండి నాణ్యమైన కోచింగ్ లభిస్తుందని కూడా వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ ఉచిత నీట్ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 22వ తేదీ. గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Solar Eclipse 2026: మరికొద్ది గంటల్లో సూర్యగ్రహణం ప్రారంభం..ఈ రాశుల వారికి తస్మాత్ జాగ్రత్త!

Hyderabad, Telangana:

Solar Eclipse 2026 Zodiac Signs: ఈ ఏడాది (2026) రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, రాత్రి 11:16 గంటలకు గరిష్ట దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీనివల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, గ్రహాల గతులు, గోచారాల ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

రాశుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మేష రాశి

మేష రాశి వారు తమ వృత్తి, ఉద్యోగాలపై మరింత ఏకాగ్రత పెట్టాలి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ, ప్రతి విషయంలోనూ ఓపిక వహించాలి.

వృషభ రాశి
ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, వాటిని పెద్దవి చేయకుండా ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి.

సింహ రాశి
కోపాన్ని, తొందరపాటును పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆవేశానికి పోయి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

మకర రాశి
ఆరోగ్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదు. పనుల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు సమగ్ర సమాచారం సేకరించడం ముఖ్యం. ప్రయాణాలలోనూ తగు జాగ్రత్తలు అవసరం.

పాటించాల్సిన పరిహారాలు..
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, జ్యోతిష్య ప్రభావం దృష్ట్యా సంయమనం పాటించడం ప్రయోజనకరం. "ఓం సూర్యాయ నమః" లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Also Read: ఆగస్టు 11న అరుదైన రాజయోగం..ఈ నాలుగు రాశులకు రాజయోగాలతో అదృష్టం!

Also REad: Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..భారత్‌తో కనిపిస్తుందా? సూతక సమయం అప్పుడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. సెలవులపై సమగ్రశిక్ష SPD కీలక ఉత్తర్వులు..!!

BBhoomi21h ago
Lakshmapur, Telangana:

KGBV Staff Leave Rules: తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేజీబీవీ సిబ్బందికి ఏడాదికి 15 రోజుల క్యాజువల్ లీవ్ (CL) మంజూరు చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, IAS అధికారిక జీవో జారీ చేశారు. గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు నెలకు గరిష్ఠంగా 2 క్యాజువల్ లీవులు (2 CLs) మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. దీనివల్ల అత్యవసర సమయాల్లో లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, నెలకు గరిష్ఠంగా 2 సీఎల్‌లు మాత్రమే వాడాలనే నిబంధనను విద్యాశాఖ పూర్తిగా తొలగించింది. ఇకపై సంవత్సరానికి కేటాయించిన 15 రోజుల క్యాజువల్ లీవులను తమ అవసరాన్ని బట్టి వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. సమగ్రశిక్ష విడుదల చేసిన ఈ నూతన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీలలో తక్షణమే అమలులోకి రానున్నాయి. అయితే, హైదరాబాద్. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల కేజీబీవీలకు ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్‌టీ (CRT)లు కాంట్రాక్ట్ టీచర్లు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తు అనుమతి తప్పనిసరి: సాధారణ సెలవు అనేది హక్కుగా భావించరాదు. అత్యవసర పరిస్థితులు మినహా, సాధారణ రోజుల్లో సిబ్బంది తమ సెలవు దరఖాస్తును కేజీబీవీ ప్రత్యేక అధికారి (SO) లేదా సంబంధిత విభాగాధిపతికి సమర్పించి ముందస్తు అనుమతి పొందాలి. 

అర్ధ రోజు (Half Day) లీవ్: సిబ్బంది వ్యక్తిగత పనుల నిమిత్తం ఒంటిపూట సెలవు కూడా వాడుకోవచ్చు. ఉదయం సెషన్ (10:30 నుండి 01:30) లేదా మధ్యాహ్నం సెషన్ (02:00 నుండి 05:00) వరకు దీనిని పరిగణిస్తారు (G.O.Ms.No.112 Fin).

లేట్ అటెండెన్స్ పెనాల్టీ: నిబంధనల ప్రకారం ప్రతినెల ఆఫీస్/స్కూల్ టైమింగ్స్ కంటే 3 రోజులు ఆలస్యంగా హాజరైతే, వారి ఖాతా నుండి 1 సాధారణ సెలవు (CL) మినహాయించబడుతుంది.

క్యారీ ఫార్వర్డ్ ఉండదు: ఆయా సంవత్సరంలో మిగిలిపోయిన సాధారణ సెలవులు డిసెంబర్ 31 తో ముగుస్తాయి (Lapse). వీటిని తదుపరి సంవత్సరానికి బదిలీ చేయడం లేదా నగదు రూపంలోకి మార్చుకోవడం (Encashment) కుదరదు.

కేజీబీవీలలో వంద శాతం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో, ప్రభుత్వం వారికి కొన్ని ప్రత్యేక సెలవుల రక్షణలు కల్పించింది..

ప్రసూతి సెలవులు (Maternity Leave): సమగ్ర శిక్ష నిబంధనల ప్రకారం కేజీబీవీ కాంట్రాక్ట్ మహిళా సిబ్బందికి మొదటి ఇద్దరు పిల్లల ప్రసవానికి పూర్తి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను ప్రభుత్వం కల్పిస్తోంది.

ప్రత్యేక సాధారణ సెలవులు (Special CL): ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక సందర్భాలలో లేదా మహిళా ఉపాధ్యాయులకు కల్పించే ప్రత్యేక ఆకస్మిక సెలవుల మార్గదర్శకాలను కూడా స్థానిక నిబంధనల మేరకు వర్తింపజేస్తారు.

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Indiramma Indlu Towers: రేపే శంకుస్థాపన.. తీరనున్న హైదరాబాద్‌ ప్రజల సొంతింటి కల

Hyderabad, Telangana:

Hyderabad: హైదరాబాద్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో తొలి ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేయనుంది. రేపు శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. కేపీహెచ్‌బీలోని మలేషియన్ టౌన్‌షిప్ ఎదురుగా ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణం చేయనున్నారు. హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. అత్యంత ప్రైమ్ లొకేషన్ లో నిర్మిస్తున్న ఈ టవర్స్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీపీఎల్ కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్‌బీ 7, 9 ఫేజ్‌ మధ్య ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తోంది. ఈ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో హైదరాబాద్‌లో కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్‌వాసులకు ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణ పేరిట టవర్స్‌ను నిర్మిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

కేపీహెచ్‌బీ కాలనీలోని 9వ ఫేజ్ వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి టవర్స్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 528 ఎస్ఎఫ్టీలతో 480 ప్లాట్‌లకు సంబంధించి 16 నియోజకవర్గాలలో మొదటి విడత నిర్మాణం చేపట్టనున్నారు. రేపు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేశ్‌, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ ప్రీత్ సింగ్, హౌసింగ్ బోర్డ్ అధికారులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే స్థలాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఫేజ్-1లో 480 ఫేజ్-2లో 680 ఇండ్ల నిర్మాణం ఇక్కడ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన 5.87 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నాలుగు టవర్లు నిర్మించనుండగా.. ఒక్కో టవర్‌కు రూ.10 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. నాలుగు టవర్లకు రూ.43 కోట్లు అంచనా వేసి రెండు ఫేజ్‌లలో ప్రభుత్వం నిర్మాణం చేయనుంది.

0
0
Report
Advertisement

Bigg Boss Agnipareeksha: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్‌కు రంగం సిద్ధం..ఎంపికైన టాప్ 15 కంటెస్టెంట్లు వీళ్లే!

Hyderabad, Telangana:

Bigg Boss Agnipareeksha Contestants: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షో ప్రారంభం కాకముందే హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరివంటూ అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. త్వరలో అట్టహాసంగా ప్రారంభంకానున్న బిగ్ బాస్ సీజన్ 10 కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేశారు. ప్రధాన షో ప్రారంభానికి ముందే ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా 'అగ్నిపరీక్ష' రెండో సీజన్ సరికొత్త జోష్‌తో వచ్చేందుకు సిద్ధమైంది.

ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానుండగా, అప్పుడే కంటెస్టెంట్లకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి కామన్ పీపుల్‌కు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ వేడుకలో విపరీతమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా వచ్చిన వేలాది దరఖాస్తుల నుంచి మొదటగా దాదాపు 70 మందిని నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి కఠినమైన టాస్కులు, ఇంటర్వ్యూలు నిర్వహించి జల్లెడ పట్టారు.

ఈ 70 మంది 'అగ్ని వారియర్స్' నుంచి టాప్ 15 మంది కంటెస్టెంట్లను ముగ్గురు జడ్జీలు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ టాప్ 15 మంది నుంచి చివరికి కేవలం ఐదారు మందిని మాత్రమే అసలు బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు. అంటే హౌస్‌లోకి వెళ్లకముందే కంటెస్టెంట్లకు అసలైన పరీక్ష ఇక్కడే ప్రారంభమైందన్నమాట.

మరోవైపు ఈ షోకు సంబంధించిన జ్యూరీ ప్యానెల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. గెలిచిన అనుభవం ఉన్న ప్రముఖులు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ మరోసారి జడ్జీలుగా వ్యవహరిస్తూ కంటెస్టెంట్లను కఠినంగా పరీక్షిస్తున్నారు. మరోవైపు ప్రముఖ యాంకర్ శ్రీముఖి తనదైన ఎనర్జిటిక్ కామెంట్స్‌తో షోకు మరింత జోష్ తెస్తున్నారు. జడ్జీలు కొందరితో సరదాగా మాట్లాడుతూనే, తప్పులున్న చోట తీవ్రంగా స్పందిస్తున్న తీరు తాజాగా విడుదలైన ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తోంది.

బిగ్ బాస్ షో అనగానే లీకుల బెడద కామన్ అన్నట్లుగా, 'అగ్నిపరీక్ష' ప్రసారం కాకముందే టాప్ 15 మందికి సంబంధించిన పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజకుమారి డయానా, ఆర్జే చరణ్, షాలిని పటేల్, మిథిలేష్, అమన్, శ్రష్ఠి వ్యాకర్ని, హేమంత్, భాగీ తుళ్లూరి, నవరసాలు ఆర్కే, దీపక్, యాంకర్ ప్రియా, రోహిత్, సింగర్ ఝాన్సీ, మిస్ అపూర్వ, గాయత్రి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఎపిసోడ్స్ ద్వారా అసలు లక్కీ కంటెస్టెంట్లు ఎవరో తేలనుంది.

Also REad: 'కల్కి 2' సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన!

Also REad: హీరో ఎన్టీఆర్‌ హెల్త్ బులెటిన్ విడుదల..ఆరోగ్య పరిస్థితిని ప్రకటించిన కిమ్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

YS Sharmila: తప్పుడు లెక్కలతో చంద్రబాబు చెప్పేదంతా సొంత డబ్బా: వైఎస్‌ షర్మిల

Vijayawada, Andhra Pradesh:

YS Sharmila vs Chandrababu: వృద్ధి రేటుపై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై 'ఎక్స్‌' వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. వృద్ధి రేటు అంతా చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోవడమేనని విమర్శించారు. వృద్ధి రేటుపై అనుకూలంగా అన్ని మీడియాల్లో చాటింపు వేసుకున్న చంద్రబాబు వాస్తవాలను తొక్కిపెట్టారని.. వైఫల్యాలను దాచిపెట్టారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో కొట్టొచ్చినట్టు నిరాశ నిస్పృహలు కనపడుతున్నాయని.. రాష్ట్రాన్ని తప్పించుకొలేని కష్టనష్టాల్లోకి తోసేశారని కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

'వృద్ధి లేదు, అభివృద్ధి అంతకన్నా  లేదు. ఆర్థికంగా పరుగులు పెడుతున్నామని జాతీయ సగటు కంటే గొప్పోళ్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదంతా సొంత డబ్బా. వృద్ధి అధఃపాతాళం' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అభివృద్ధి కాదు అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఆరోపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధి రేటు ఉందని అన్ని మీడియాల్లో చాటింపు వేసుకున్న చంద్రబాబు వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. వైఫల్యాలను దాచిపెట్టారని వైఎస్‌ షర్మిల చెప్పారు. అన్ని రంగాల్లో కొట్టొచ్చినట్టు నిరాశ నిస్పృహలు కనపడుతుంటే తప్పటడుగులతో తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తప్పించుకొలేని కష్టనష్టాల్లోకి తోసేశారని చంద్రబాబుపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఎక్కడ వృద్ధి రేటు? ఎందులో వృద్ధి రేటు? దేశ సగటుకంటే హెచ్చుగా ఉన్న నిరుద్యోగంలోనా ఈ వృద్ధి రేటు? అరటి నుంచి మామిడి, టమాటా నుంచి కోకో, పత్తి నుంచి పొగాకు రెండేళ్లుగా ఒక్క పంటకు మద్దతు ధర లేక.. అటు ప్రభుత్వ మద్దతు లేక.. రైతు పంటను, బతుకులను రోడ్డుమీద నిలబెట్టి దైన్యంగా నించుంటే, రైతు కన్నీటిలో వృద్ధి రేటా?' అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. పట్టపగలే హత్యలు, మద్యం, గంజాయి మత్తులో మర్డర్లు, మహిళలపై దాడులు, చివరికి పోలీసులకే రక్షణలేని మీ పాలనలో నిర్లక్ష్యంలో వృద్ధి రేటా? అని నిలదీశారు.

'పోలవరం ప్రాజెక్టు పచ్చిమోసం. 41.5 మీటర్లకు కుదించి అదేదో పెద్ద ఘనకార్యంలా డబ్బాలు కొట్టుకుంటున్న మీకు రేపు ఈ ఎత్తుతో ఏమీ ఒరగదని తెలిసికూడా రైతులను ముంచడంలో వృద్ధి రేటా?' అని కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ డౌన్ చేసి విద్యుత్తు ధరలు తగ్గించామని చెప్పి.. మరొక వైపు నిర్లజ్జగా పాత చార్జీలను పేదల మీద రుద్దటంతో, మీ వెన్నుపోటు విధానాల్లో వృద్ధి రేటా?' అని ప్రశ్నించారు.

'రెండేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడి అంటూ ఇప్పటికి ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, వాటికి భూమి, నీరు, విద్యుత్తు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మీ విధి విధానాలేమిటో చెప్పకుండా, నిజాలను మరింత చీకటిలో నెడితే, పారదర్శకత లేమిలో వృద్ధి రేటా?' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సందేహం వ్యక్తం చేశారు. చివరాఖరిగా ఫాసిస్టు నరేంద్ర మోదీని రోజూ పొగడ్తల్లో ముంచేస్తూ విద్యార్థుల ఉద్యమాలు పట్టకుండా.. కనీసం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేని మీ పిరికితనానికి, చేతగానితనానికి ఇది వృద్ధి రేటా? అని నిలదీశారు. ఇవన్నీ మా విమర్శలు కాదు.. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు అని వివరించారు. అబద్ధాలను అందంగా వల్లించే కూటమి ప్రభుత్వం వృద్ధిరేటుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ షర్మిల హితవు పలికారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top