గల్లీ మైసమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
Vemulawada, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ గల్లీమైసమ్మ బోనాల మహోత్సవం, సాయి బాబా స్వామివార్లను ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని వేడుకున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Konda Surekha: కొండా సురేఖ, రేవంత్ రెడ్డి మధ్య తారస్థాయికి విభేదాలు.. డుమ్మా
Parkal, Telangana:Konda Surekha Skips Revanth Reddy Mulugu And Parakal Tour Watch Full DetailsAP Rains: రేపు ఆంధ్రప్రదేశ్‌కు అక్కడక్కడ భారీ వర్షాలు.. ఎక్కడెక్కడో తెలుసా?
Nuzendla, Andhra Pradesh:AP Rain Alert: ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు.
వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని సూచనలు చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో రేపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
అంతేకాకుండా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Konda Surekha: మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్ రెడ్డిపై ఇంకా చల్లారని అసంతృప్తి
Parkal, Telangana:Warangal Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా భేదాభిప్రాయాలు తారస్థాయిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న వారి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో లుకలుకలు ఉన్నాయి. పరకాల బహిరంగ సభతో అవి మరింత ముదిరాయని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హాజరైన సభకు కీలక శాఖకు మంత్రి అయిన కొండా సురేఖ డుమ్మా కొట్టారు. రేవంత్ రెడ్డిపై కొండా దంపతులు ఇంకా అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది.
ములుగురు జిల్లాలో రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది కొండా సురేఖ నియోజకవర్గం పక్కన ఉన్నదే. కానీ ఏ కార్యక్రమంలోనూ కొండా సురేఖ పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
దేవాదాయ శాఖకు చెందిన కార్యక్రమంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హాజరుకాలేదు. మేడారం జాతర పనుల పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధిత శాఖ మంత్రిగా కొండా సురేఖ డుమ్మా కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరతోపాటు మరికొన్ని అంశాలపై రేవంత్ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కొండా సురేఖకు విబేధాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి, పొంగులేటిపై కొండా సురేఖ కుమార్తె గతంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో ఉన్న మరో మంత్రి సీతక్కతో కూడా కొండా సురేఖకు విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
కొండా సురేఖకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా పర్యటనకు దూరమైన కొండా సురేఖ దంపతులకు బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి షాకిచ్చే ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో తమ కుమార్తె కొండా సుష్మితను పోటీ చేయాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తాడని.. తిరిగి గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో కొండా దంపతులకు కౌంటర్ ఇచ్చారు. తన కూతురు సుష్మితను పరకాలలో బరిలోకి దింపాలని కొండా సురేఖ పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనతో భేదాభిప్రాయాలు పెట్టుకున్న కొండా సురేఖకు రాజకీయంగా ఇలా రేవంత్ రెడ్డి దెబ్బతీశారని చర్చ జరుగుతోంది.
RK Roja: చంద్రబాబుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్.. డర్టీ పొలిటీషియన్ అని విమర్శలు
Tirupati, Andhra Pradesh:Former Minister RK Roja Fire On Chandrababu And Pawan Kalyan Watch VideoTirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Cine Actor RK Naidu And MLA Bollishetti Srinivas Visits Tirumala Temple Watch VideoKCR Assembly: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రావాలి.. సలహాలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి
Parkal, Telangana:Telangana Assembly Session: సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని.. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి సీఎం కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరుకావాలని మరోసారి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి.. తమకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 'రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్‌ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు' అని కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారని విమర్శించారు.
ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ.424 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారీగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రగతి నివేదన
'32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ రుణాలు అందించాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. 'మేం 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం' అని వెల్లడించారు.
'నిరుద్యోగులు రాజకీయ పట్టీలు మాయ మాటలకు మోసపోవద్దు. ప్రతీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది' అని పేర్కొన్నారు. రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. 'ఆనాడు అధికారం అనుభవించారు ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు' అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
'కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం. ప్రజా పాలనతో ప్రజలకు లాభం. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం అయిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2029లో రెట్టింపు మెజారిటీతో ఇక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం అని.. ఎంతైనా కష్టపడి సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏం చేయలేరని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , కడియం కావ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
KTR Call: కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర.. రేపు ధర్నాలకు కేటీఆర్ పిలుపు
Baddipadaga, Telangana:Kalyana Lakshmi And Shaadi Mubarak: కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ పథకాలు రద్దవుతాయనే ఆందోళనలు సర్వత్రా నెలకొంది. ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన అది ఇవ్వకుండా ఏకంగా ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేయాలని సూచించారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టు లో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రుల అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు లాయర్లను పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు కౌంటర్ వెయ్యలేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పేరుతో కల్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోందని తెలిపారు. ఆడబిడ్డల తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల రద్దు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించాల్సిన ఆందోళనలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ కుట్రను అడ్డుకోవడంతోపాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆడబిడ్డ పెళ్లి ఆర్థిక భారంగా గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని.. కరోనా వంటి సమయంలోనూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా.. కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
Nag Panchami 2026: నాగుల పంచమి.. పూజా విధానం, పొరపాటున కూడా రేపు చేయకూడని నాలుగు పనులు ఏంటో తెలుసా..?
Hyderabad, Telangana:Nag Panchami 2026 date puja Vidhi kaal sarp remedy: మనం శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన నాగుల పంచమిని రేపు అంటే సోమవారం రోజున ఆగస్టు 17న జరుపుకుంటున్నాం. శ్రావణ మాసం పంచమి తిథి రోజున నాగుల పంచమిగా చెప్తారు.ఈ మాసం శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైందని చెప్తారు. రేపుసోమవారం కూడా కలిసి రావడం మరో విశేషంగా చెప్తున్నారు. నాగుల పంచమి రోజున ముఖ్యంగా బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేవాలి.ఉతికిన వస్త్రాల్ని ధరించుకొవాలి.
ఆ తర్వాత దీపారాధన చేయాలి. దగ్గరలోని గుడిలోకి వెళ్లి జంటనాగుల్ని పూజించుకొవాలి. పుట్టకు పూజలు చేయాలి. సుబ్రహ్మణ్యుడ్ని ఆరాధించుకొవాలి. సోమవారం రోజున నాగపంచమి రావడంతో శివుడికి పంచామృత అభిషేకంచేయించుకొవాలి. దీని వల్ల కాలసర్పదోషాలుఅన్ని పోతాయి. నవ నాగుల స్తోత్రాలను చదవాలి.
నెయ్యితో దీపారాధన చేయాలి. యథాశక్తి షోడషోపచారాలతో పూజలు చేయించుకొవాలి. ఆతర్వాత పండ్లు లేదా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి.
నాగ పంచమి రోజున చేయకూడని నాలుగు పనులు..
నాగుల పంచమి రోజున పొరపాటున కూడా భూమిని తవ్వడం చేయకూడదు, అదే విధంగా కడయిలో వేయించడం వంటివి చేయకూడదు. కత్తిని, సూదిదారంను, కత్తెరను రేపు ఒక్కరోజు అస్సలు ఉపయోగించకూడదు. కేవలం చేతిలో కట్ చేసే కూరగాయలు. అంటే చిక్కుడు, గోరుచిక్కుడును వండుకొవాలి.
Read more: Nag Panchami 2026: నాగ పంచమివేళ మరో అద్భుతం.!. ఈ రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..?..
ఆవాలు, జీలకర్రల్ని ఉపయోగించకూడదు. ఇక నిజమైన పాము మీద అస్సలు పాలు పోయకూడదు. వాటిని పాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదని నిపుణులు చెప్తుంటారు. ఈ పనులు మాత్రం తప్పినిసరి అవాయిడ్ చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shocking Incident: ఫ్రెండ్స్‌తో బెడ్ షేర్ చేసుకోమంటున్నాడు.. ప్రముఖ డాక్టర్‌పై భార్య సంచలన ఆరోపణలు
Hyderabad, Telangana:Rajendranagar Police: కోటి ఆశలతో డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న ఆ యువతి కాపురం పెట్టాక అతడి నిజ స్వరూపం తెలిసి విస్తుపోయింది. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త తనను అతడి స్నేహితులతో పక్క పంచుకోవాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందింది. పెళ్లయిన ఏడు రోజులకే అతడ నరకం చూపించడంతో కాళ్ల పారాణి ఆరకముందే ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో కండ్రగుంట శ్రీనివాస రావు వైద్య నిపుణుడు. ఏడు రోజుల కిందట ఓ యువతితో వివాహమైంది. డాక్టర్ అయిన భర్త కావడంతో ఎన్నో ఆశలతో.. జీవితం బాగుంటుందని ఆశపడిన భార్యకు కాపురం పెట్టిన తర్వాత భర్తలోని నీచుడు బయటపడ్డాడు. అతడి స్నేహితుడితో తనను పడుకోవాలని కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా అతడిపై బెడ్ పంచుకోకుంటే విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక అంతేకాకుండా తనతోపాటు పని చేసే తోటి మహిళ ఉద్యోగులకు న్యూడ్ వీడియో కాల్స్, న్యూడ్ ఫొటోస్ పంపుతున్నట్లు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. తన భర్త డాక్టర్ శ్రీనివాస్ మానసికంగా , శారీరకంగా వేధించారని ఫిర్యాదులో ఆమె వాపోయారు. ఈ విషయాలు బయటకు చెప్పినా.. తల్లిదండ్రులకు చెపితే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించారు.
డాక్టర్ శ్రీనివాస్‌కి ఆయన తల్లిదండ్రులు, అతడి సోదరుడు కూడా వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని విచక్షణరహితంగా దాడి చేసినట్లు భాదితురాలు ఫిర్యాదు చేశారు. తమను ప్రశ్నిస్తే 100 మందిని తీసుకొచ్చి నీ అంతు, మీ తమ్ముడు అంతు చూస్తానని బెదిరించినట్లు శ్రీనివాస్ అన్న వెంకటేశ్‌పై బాధితురాలు ఆరోపణలు చేశారు. తనకు.. తన కుటుంబసభ్యులకు భర్త, వారి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు భయాందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని తాళలేక బాధితురాలు రాజేంద్రనగర్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 6 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణకు రావాలని పదుల సంఖ్యలో ఫోన్లు చేసినా నిందితుడు నుంచి స్పందన లేదని పోలీసులు చెబుతున్నారు.
RK Roja: దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరు: ఆర్కే రోజా
Tirupati, Andhra Pradesh:YSR Congress Party: 'దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేడని.. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే' మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వైస్రాయ్ హోటల్లో సొంత మామ ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదే అని గుర్తుచేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడు. మహిళలను చంద్రబాబు అవమానించారు, వారికి క్షమాపణ చెప్పాలి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
'చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేది. ఇప్పుడు రూ.లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చింది?' అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పారు. 'నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను. ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
'మద్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని.. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరించారు. కారు గ్యారేజీలో ఉండాలి.. ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా గుర్తుచేశారు.
'చంద్రబాబు కన్నా చిన్న వాడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చారు. అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ, దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు' అని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.
Cobra Video: శివలింగంపై పడగవిప్పిన భారీ నాగుపాము.. వీడియో!
Hyderabad, Telangana:Cobra Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి.. వాటిల్లో జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ.. సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. తాజాగా శివాలయంలోని శివలింగం వద్ద సర్పాలు సందడి చేసిన ఓ అరుదైన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ ను సైతం షేక్ చేస్తోంది. గర్భగుడిలో శివలింగంపై పాములు ప్రత్యక్షమై భక్తులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక పురాతన శివాలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగం వద్ద కొన్ని పాములు హల్చల్ చేయడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అందులో ఉన్న ఒక భారీ నాగుపాము శివలింగాన్ని చుట్టుముట్టి.. పడక విప్పి మరి చూడడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు.. అంతటితో ఆగకుండా.. శివలింగం వెనక భాగంలో మరో రెండు పాములు కదులుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది..
సాధారణంగా పాములను చూస్తేనే ఎవరైనా భయంతో పరుగులు తీస్తూ ఉంటారు.. కానీ ఈ ఆలయంలో శివలింగంపై పాములు ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. కొంతమంది వీడియోలు తీస్తూ ప్రశాంతంగా ఉండిపోవడం మనం ఈ వీడియో ద్వారా గమనించవచ్చు. అయితే ఈ వీడియో ఇప్పుడు instagram లో విపరీతంగా వైరల్ గా మారింది. ఇది అప్లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా చాలామంది లైకులు కూడా కొడుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని.. సాక్షాత్తు ఆ పరమశివుడి లీలే అంటూ కొంతమంది భక్తులు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కొందరు భక్తులు దీన్ని శుభసూచకంగా భావించి వీడియో తమ మిత్రులకు షేర్ చేస్తున్నారు.. సహజంగా కొన్ని పాములు ఆహారం కోసం ఇలా దేవాలయాలకు వస్తూ ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.. ఇలాంటి పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: బుసలు కొడుతున్న భారీ నాగుపామును ఒంటిచేత్తో లేపిన యువకుడు.. వీడియో!
Hyderabad, Telangana:Cobra Viral Video Watch: దట్టమైన అడవిలో అత్యంత ప్రమాదకరమైన విష సర్పంతో ఓ యువకుడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్‌గా మారింది. సాధారణంగా నాగుపాముల పేరు వింటేనే ఎవరికైనా తప్పకుండా భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది ఏకంగా పడగవిప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును ఓ కుర్రాడు అత్యంత చాకచక్యంగా.. కేవలం ఒంటి చేత్తో పైకి లేపిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్‌గా మారడం విశేషం.. ఇప్పుడు ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారుల సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు..
వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. దట్టమైన చెట్లతో పాటు పొదలతో నిండిన అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.. అక్కడ నేలపై ఉన్న ఒక భారీ నాగుపాము పడక విప్పి.. ఏ క్షణంలోనైనా కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీకు ఈ వీడియోలో అది కనిపిస్తుంది. అయితే, ఆ యువకుడు ఏ మాత్రం భయపడకుండా ఆ పాము దగ్గరగా వెనక భాగంలోకి వెళ్ళాడు. క్షణాల వ్యవధిలోనే అతనికున్న అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌తో ఎలాంటి.. స్నేక్ స్టిక్స్ లేకుండా కేవలం తన ఒంటి చేతితో ఆ నాగుపాముని పట్టుకొని పైకి లేపడం మీరు గమనించవచ్చు. ఆ సమయంలో ఆ విశ్వసం గాల్లో పడక విప్పి కదులుతున్నప్పటికీ.. కుర్రాడు ఏమాత్రం బెదరకుండా నిలబడటం వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు..
ఆశ్చర్యం కలిగించే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి.. ఇంతటి తెగింపు అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం ఆశ్చర్య పోతు.. ఇలా పిచ్చిపిచ్చి సాహసాలు ప్రమాదకరమైన పాములతో చేయడం మంచిది కాదని కామెంట్లు పెడుతున్నారు..
లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారని పలువురు తీవ్రంగా ఈ వీడియో చూసి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వన్యప్రాణి రక్షణ నిపుణులతో పాటు స్నేక్ క్యాచర్లు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. నాగుపాము అత్యంత ప్రమాదకరమైన న్యూరో టాక్సిక్ విషాన్ని కలిగి ఉందని.. దానికాటి క్షణాల వ్యవధిలోనే ప్రాణాలను గాల్లో కల్పిస్తాయని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా విషసర్పాలు ఇలా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదని స్పష్టం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TIMS Hospital: ఏర్పాట్లు పూర్తి.. రేపు ఎర్రగడ్డ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
Hyderabad, Telangana:Hyderabad: హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు మరో అత్యాధునిక ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో టిమ్స్ ఆస్పత్రి (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభమవగా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసింది. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించగా.. త్వరలో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల టిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం అధికారులు, వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిని నియమించింది. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టారు.
రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఇతర అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, ప్రజల రాకపోకలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులను మంత్రి దామోదర రాజననర్సింహ ఆదేశించారు. వాహనాల పార్కింగ్, అతిథులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, బందోబస్తు, క్రౌడ్ మేనేజ్మెంట్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని చెప్పారు.
ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి దామోదర రాజననర్సింహ ఆదేశించారు. టిమ్స్ ప్రారంభోత్సవం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంత్రి వెంట ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐ, పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Viral Video: మెట్రోలో రద్దీని అడ్డం పెట్టుకుని దొంగతనం.. మహిళా దొంగ ఏం చేసిందో చూడండి!
Hyderabad, Telangana:Metro Theft Caught On Camera Video Viral: రోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తూ.. రైల్లో మీరంతా చాలా సురక్షితంగా ఉన్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అయితే, ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా ఆలోచనలో పడాల్సిందే.. క్షణాల్లో పక్కనున్న వారి వస్తువులు, బ్యాగ్ లో ఉన్న పర్సును ఎలా మాయమవుతున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపే ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రాజీవ్ చౌక్ లో ఉన్న కాశ్మీరీ గేట్, నందిని చౌక్ వంటి నిత్యం రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది దొంగల ముఠా ఎలా రెచ్చిపోతున్నాయో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. మెట్రో రైలు ఆగగానే కొంతమంది ప్రయాణికులు దిగడంతో పాటు.. మరి కొంతమంది ప్రయాణికులు మెట్రోలోకి ఎక్కేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే విపరీతమైన రద్దీ నెలకొంటుంది. సరిగ్గా ఈ హడావిడి.. గందరగోళం ఉన్న సమయంలోనే.. ప్రొఫెషనల్ దొంగలు తమకు అనుకూలంగా మార్చుకొని చేతివాటం చూపెడుతూ ఉంటారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ మెట్రో ఎక్కుతున్నట్లు నటిస్తూ కనిపించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఆమె ముందు ఉన్న మరో మహిళ ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ లోకి ఎంతో సులభంగా చేయి పెట్టడం మీరు గమనించవచ్చు.. అందులో ఉన్న విలువైన వస్తువులు, నగలను దొంగిలించే ప్రయత్నం చేసింది.. అంతా తాను అనుకున్నట్లుగానే జరిగిపోతుందని ఆ మహిళ భావించింది..
అయితే సరిగ్గా అదే సమయంలో తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కెమెరాతో రికార్డు చేస్తున్న విషయాన్ని ఆ మహిళా దొంగ గమనించింది.. కెమెరా కంటికి చిక్కానని.. తెలియగానే ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు కూడా మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.. వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంది.. ఆపై ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తుంది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దీ సమయంలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు దొంగ ప్రవర్తనను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కామెంట్లలో పెడుతున్నారు.. కెమెరా లేకపోయి ఉంటే ఆ ప్రయాణికురాలు తమ విలువైన వస్తువులన్నింటిని పోగొట్టుకునేదని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. మెట్రో అధికారులతో పాటు భద్రత సిబ్బంది నిఘా పెంచాలని కోరుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
