రాజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ
Rudrangi, Telangana:దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం సెలవు దినం, గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
చంద్రబాబు సభలో పాల్గొన్న బాలిక బలవన్మరణం
Secunderabad, Telangana:SSC Students Ends Life Herself CM Chandrababu Express Condolence Watch VideoAV Ranganath: తెలంగాణ హైకోర్టు సంచలనం.. హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ తొలగింపు
Hyderabad, Telangana:HYDRAA Commissioner AV Ranganath: తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రజల ఆస్తులపై విధ్వసం సృష్టిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆస్తుల పరిరక్షించాల్సిన హైడ్రా విధ్వంసం సృష్టిస్తుండడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు హెచ్చరించినా హైడ్రా తీరు మారలేదు. పలుమార్లు కోర్టు ధిక్కరణ.. ఉల్లంఘనలకు పాల్పడడంతో ఎట్టకేలకు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింది.
శాంతా కన్స్ట్రక్షన్ భూముల అంశంలో దాఖలైన ధిక్కరణ పిటిషన్‌కు సంబంధించి రంగనాథ్ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆగ్రహించిన సంగతి తెలిసిందే. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలంగాణా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ కోరుతూ హైకోర్టులో రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. రంగనాథ్‌పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, ఇన్ని ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది.
లోతుకుంట భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్ 1,2లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని రంగనాథ్ వివరణ ఇచ్చారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని కోర్టుకు రంగనాథ్ విన్నవించారు. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఈ సందర్భంగా రంగనాథ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
వరుస కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండడంతో రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో హైడ్రా నుంచి రంగనాథ్‌ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్ట్ ఆదేశించింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని హైకోర్టు హితవు పలికింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో హైడ్రా కమిషనర్‌గా అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించిందిజ
Akividu Ramalayam News: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
Akividu, Andhra Pradesh:Akividu Ramalayam Supreme Court: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో తన పంతం నెగ్గించుకున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు రామాలయ నిర్మాణంపై తలెత్తిన వివాదంలో స్థానిక కోర్టు నుంచి హైకోర్టు, తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు పోరాడి ఊరట పొందారు. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తాజాగా తాను విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఆకివీడు రామాలయం వివాదంపై ఇరువర్గాల మధ్య బలమైన వాదోపవాదాలు జరిగిన అనంతరం, జడ శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు.
హైకోర్టులో వాస్తవాలను దాచిపెట్టి ప్రతివాదులు సుప్రీంకోర్టులో 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు మూడు బెంచ్‌లు తోసిపుచ్చిన వాదనలను సుప్రీంలో ప్రస్తావించకపోవడం వల్లే గతంలో స్టే వచ్చిందని, ఇప్పుడు ఆ విషయం స్పష్టమవడంతో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుయోధన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించిన ప్రేరణ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ నాకు… pic.twitter.com/RhEeloHRop
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 27, 2026
ఆకివీడులో సుమారు 90 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆలయాన్ని, తిరిగి అదే స్థలంలో నిర్మించుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
"నవంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తి"
కేవలం నాలుగు సెంట్ల స్థలమైనప్పటికీ, ఆకివీడులో రామాలయాన్ని అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మిస్తామని రఘురామ ప్రకటించారు. వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటికైనా గొడవలకు స్వస్తి పలికి రామాలయం నిర్మాణానికి అందరూ సహకరించాలి. మన మతాన్ని ప్రేమించుకుందాం, అన్యమతాలను గౌరవిద్దాం. నిబంధనల ప్రకారం ఎవరి మతానికి సంబంధించిన ఆలయాన్ని వారు నిర్మించుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు సృష్టించకూడదు. అనుమతులు లేకుండా కడితే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు" అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
Also Read: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP School Holidays: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
Vijayawada, Andhra Pradesh:AP School Holidays News: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. రాబోయే ఆగస్టు నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఆదివారాలు, రెండో శనివారంతో పాటు పలు జాతీయ, మతపరమైన పండుగలు కలిసి రావడంతో విద్యార్థులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు దక్కనున్నాయి.
ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు ఉండగా.. అందులో 10 రోజులు హాలిడేస్ పోను, కేవలం 21 రోజులు మాత్రమే స్కూల్స్, కాలేజీలు పనిచేయనున్నాయి.
ఆగస్టు నెలలో సెలవుల పూర్తి జాబితా..
ఆగస్టు 2: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 8: రెండో శనివారం సెలవు
ఆగస్టు 9: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 15: శనివారం - స్వాతంత్ర్య దినోత్సవం (జెండా వందనం అనంతరం పాఠశాలలు ముగుస్తాయి)
ఆగస్టు 16: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 21: శుక్రవారం - వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 23: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 25: మంగళవారం - మిలాద్-ఉన్-నబీ
ఆగస్టు 30: ఆదివారం (సాధారణ సెలవు)
ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేస్:
ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కొన్ని ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆగస్టు 4: ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలీడే)
ఆగస్టు 15: పార్సీ నూతన సంవత్సరం
ఆగస్టు 28: శ్రావణ పౌర్ణమి
సంబంధిత శాఖలు, విద్యా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఆప్షనల్ హాలిడేస్‌గా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యాశాఖ జారీ చేసే అధికారిక ఉత్తర్వుల ప్రకారం స్థానిక పండుగలు, వాతావరణ పరిస్థితులు లేదా పరిపాలనా కారణాలరీత్యా ఈ సెలవుల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
సింహాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక సెలవులు..
ఇదిలా ఉంటే, విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం ఆలయంలో జరిగే వార్షిక గిరిప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక సెలవులను ప్రకటించారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు సంబంధిత తేదీలలో (జూలై 28, 29) సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల జాబితాను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Also Read: బంగాళాఖాతంలో అలజడి..వాయుగుండంగా మారిన అల్పపీడనం! ఆ జిల్లాల్లో అలర్ట్!
Also Read: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dhanush Political Entry: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ! మరో కథానాయకుడు పొలిటికల్ పార్టీకి రంగం సిద్ధం?
Nagalapuram, Tamil Nadu:Dhanush Political Entry Video: కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆయన తన అభిమాన సంఘాలకు ఇచ్చిన పిలుపు.. ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానులకు ధనుష్ సూచనలు ఇవే..
అభిమానుల ఐక్యతకు గొప్ప శక్తి ఉంటుందని, దానిని కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకూడదని ధనుష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. తనను కలవడం కోసం లేదా ఆడియో ఫంక్షన్లలో హడావిడి చేయడం కోసం మాత్రమే అభిమానుల బలాన్ని ఉపయోగించొద్దని, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.
పేద కుటుంబాలకు చేతనైనంత సహాయం అందించాలని, సమాజ హితం కోసం తమతో పాటు మరింత మందిని ప్రోత్సహించేలా అడుగులు వేయాలని కోరారు.
Looks like we can expect Dhanush launching his new party sooner than expected.
Vijay had been doing many welfare activities for years through his Vijay Makkal Iyakkam before officially launching TVK in 2024. One of the big events that confirmed his entry sooner was the 2023… https://t.co/XDZOvVg3pa pic.twitter.com/rQkcdRFCn6— Raghu Rajaram (@RaghuTweetbook) July 26, 2026
విజయ్ బాటలోనే పయనిస్తున్నారా?
ధనుష్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడంతో పాటు, త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి విజయ్ కూడా తన పార్టీ 'టీవీకే' (TVK) స్థాపించడానికి ముందు సరిగ్గా ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి నేటి విజయ్ వరకు ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. ఇదే స్ఫూర్తితో ధనుష్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
'రాయన్' అవార్డు వివాదంపై నిజాయితీగా స్పందన
తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు రావడంపై వస్తున్న విమర్శలపైనా ధనుష్ ఎంతో హుందాగా స్పందించారు. "ఈ అవార్డు పొందడానికి రాయన్ కంటే మెరుగైన సినిమాలు ఎన్నో ఉన్నాయంటూ వస్తున్న విమర్శలను నేను స్వాగతిస్తున్నాను. అందులో వాస్తవం ఉందని నేను అంగీకరిస్తున్నాను. 2024లో నిజంగానే రాయన్ కన్నా అద్భుతమైన సినిమాలు విడుదలయ్యాయి" అని పేర్కొంటూ తనపై వచ్చిన ట్రోల్స్‌కు చెక్ పెట్టారు.
Also Read: బొద్దింకల పార్టీకి బాలీవుడ్ నటి పెద్ద సవాలు.."దమ్ముంటే ఆ మంత్రిని రాజీనామా చేయించండి
Also Read: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mirabai Chanu Gold: మీరాబాయి చానుకు బంగారు పతకం..కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత జెండా రెపరెపలు
Scotland:Mirabai Chanu Gold Medal: టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. బంగారు పతకాన్ని సాధించింది. ఆదివారం గ్లాస్గోలో జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో టైటిల్ గెలుచుకుని.. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
31 ఏళ్ల ఈ క్రీడాకారిణి స్నాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు స్థాయిలో 85 కేజీలు ఎత్తి, ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో గేమ్స్ రికార్డు స్థాయిలో 105 కేజీలు నమోదు చేశారు. మొత్తం 190 కేజీల బరువు ఎత్తి ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ విజయంతో మీరాబాయికి వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం లభించింది. ఆమె గతంలో 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్, 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో కూడా ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన ఈమె, అంతకుముందు గ్లాస్గోలోనే జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రజత పతకం సాధించారు. పోటీ ప్రారంభం నుండి ముగింపు వరకు మీరాబాయి పూర్తి నియంత్రణలో ఉన్నారు.
మొత్తం 168 కేజీల బరువు ఎత్తి రజత పతకం గెలుచుకున్న నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యోంగ్ కంటే ఆమె 22 కేజీల ఆధిక్యంతో ముగించారు. 82 కిలోల బరువుతో తన తొలి స్నాచ్ ప్రయత్నంలో విఫలమవడంతో ఆమె పతనం ప్రారంభమైంది. అయితే, ఆమె తన తదుపరి ప్రయత్నాలలో కోలుకుని, రికార్డు స్థాయిలో 85 కిలోల బరువును ఎత్తింది.
రికార్డు సృష్టించిన స్నాచ్ ఫలితంగా క్లీన్ అండ్ జర్క్‌లో ఎనిమిది కిలోల ఆధిక్యం సాధించిన ఈ మణిపురి లిఫ్టర్, తన మొదటి ప్రయత్నంలో బార్‌ను జారవిడిచింది. కానీ, ఒక ఛాంపియన్‌లా పుంజుకుని, తన రెండవ ప్రయత్నంలో 105 కిలోల బరువును ఎత్తి, పోటీ ముగియక ముందే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ లిఫ్ట్ స్వర్ణాన్ని అందించడమే కాకుండా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టి, మొత్తం లిఫ్ట్ మార్కును కూడా అధిగమించింది.
బంగారు పతకం ఖాయం ఇప్పటికే కావడంతో, రెండు నెలల కన్నా తక్కువ సమయంలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని మీరాబాయి తన మూడవ క్లీన్ అండ్ జర్క్ లిఫ్ట్‌ను ప్రయత్నించలేదు.
Also Read: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుంది
Also Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Revanth Reddy Resolution: "21 ఏళ్లకే అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసేలా చర్యలు" సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
Hyderabad, Telangana:CM Revanth Reddy 21-Age Resolution: 'కమిటీ కుర్రాళ్లు' సినిమాలో చూపించినట్లుగా, ప్రస్తుత జెన్-జీ (Gen-Z) యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఇదే కోవలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు యువతలో కొత్త జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయస్సు నిబంధనను 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన కోరారు. మరి రీల్లో మాదిరిగా రియల్‌గా ఇది సాధ్యమేనా? ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.Jai Yuva: జెన్‌జీ ఉద్యమం వేళ రేవంత్ రెడ్డి సరికొత్త నినాదం.. జై యువ అని జోడింపు
Hyderabad, Telangana:Jai Yuva Slogan: దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. శాసనసభలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలోనే జై జవాన్.. జై కిసాన్‌కు తోడు జై యువ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సీబీఎస్ఈ, నీట్, నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కోరారు. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను సమీక్షించడంతోపాటు నష్టపోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేటి యువత 21 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సేవలందిస్తోందని గుర్తుచేశారు.
స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా యంగ్ యువత బాధ్యతలు నిర్వహిస్తోందని.. ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనా, వ్యాపార రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్న యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు, 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 21 ఏళ్లకు సవరించిన విషయాన్ని తెలంగాణ సీఎం గుర్తుచేశారు.
అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ సీఎం సరికొత్త ప్రతిపాదన చేశారు. ఈ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ఆగస్టులో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం పోటీ వయోపరిమితి తగ్గింపును కోరుతూ అధికారిక తీర్మానాన్ని ఆమోదిస్తామని వెల్లడించారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్తుకు అవసరమని గుర్తుచేశారు.
Siddharamaiah Retirement: రాజకీయాలకు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్‌బై..రాజీనామాతో అసంతృప్తి!
Hyderabad, Telangana:Siddaramaiah Retirement News: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్ధరామయ్య ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వయసు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.IND vs ZIM: సొంతగడ్డపై జింబాబ్వే బోల్తా.. వైభవ్ పవర్ హిట్టింగ్తో టీమిండియా క్లీన్‌స్వీప్
Harare, Harare Province:India Whitewash: టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైటావాష్కు గురయిన భారత జట్టు జింబాబ్వేపై ఆ కసినంతా తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి జింబాబ్వేకు సొంత గడ్డపైనే పరువుపోయేలా చేసింది. వైభవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చివరి మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లను సొంతం చేసుకున్న భారత్ విమర్శకులకు వైట్‌వాష్‌తో సమాధానం ఇచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఐపీఎల్ తరహాలో ఆడి 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తనదైన శైలిలో ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకం నమోదు చేశాడు. 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన వైభవ్ కొంత దూకుడు తగ్గించి ఆడాడు. అభిషేక్ శర్మ (2) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ (29), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (27) పర్వాలేదనిపించారు. రింకూ సింగ్ (25) కొంత స్కోర్ చేయగా.. తిలక్ వర్మ 11 పరుగులు తీసి నాటౌట్‌గా నిలిచాడు.
PM Modi Nandan Nilekani: పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ!
New Delhi, Delhi:PM Modi Nandan Nilekani News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పరీక్షా విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక 'అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాని మోదీ ప్రకటన వెనుక నేపథ్యం
నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, నిరసనల పర్వం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ఆదివారం నాడు ప్రధాని మోదీ తన 'X' (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలతో వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను పంచుకున్నారు.
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా ఇప్పటికే ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని వెల్లడించారు. పరీక్షా విధానం మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మారేందుకు, టెక్నాలజీని గరిష్టంగా వినియోగించుకునే దిశగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ కమిటీలో ఇతర సభ్యులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాస్క్‌ఫోర్స్‌లోని ప్రముఖ సభ్యులు..
1) నందన్ నీలేకని - సాంకేతిక నిపుణుడు
2) ఎస్. సోమనాథ్ - మాజీ ఇస్రో చైర్మన్
3) తపన్ డేకా - మాజీ ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్
4) వి.కామకోటి - ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
5) అనితా కర్వాల్ - మాజీ విద్యాశాఖ కార్యదర్శి
6) అమృత్ లాల్ మీనా - లాజిస్టిక్స్ నిపుణుడు
'జెన్-Z' యువతతో ప్రధాని మోదీ మమేకం
నీట్ పేపర్ లీక్ వివాదం నడుమ యువతతో, ముఖ్యంగా 'జెన్-Z' (నేటి తరం యువత)తో కనెక్ట్ అయ్యేందుకు ప్రధాని మోదీ వరుస వీడియోలను విడుదల చేయడం గమనార్హం. జూలై 23న విడుదల చేసిన తొలి వీడియోలో పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు పడుతున్న వేదన తనకు తెలుసని పేర్కొంటూ, సోమవారం పార్లమెంటులో సరికొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు ప్రత్యేకతలు..
సోమవారం పార్లమెంటు ముందుకు రానున్న 'పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు' ప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయి. ప్రశ్నపత్రం లీక్ ఘటనలకు సంబంధించిన విచారణలను కేవలం రెండు నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా పరీక్షల్లో లీకేజీలు లేదా అక్రమాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇటువంటి ఘటనలు వ్యవస్థీకృత నేరాలుగా తేలితే.. కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
Also Read: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్‌పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!
Also Read: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fatty Liver Drink: లివర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే ఇంటి చిట్కా!
Hyderabad, Telangana:Fatty Liver Healthy Drink: మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దీని పనితీరు మందగిస్తే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే మారిన ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నేడు చాలా మందిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యను నివారించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో 'పచ్చి పసుపు' ఒక అద్భుతమైన సూపర్ హెర్బ్లా పనిచేస్తుంది. పసుపులో లభించే 'కర్కుమిన్' అనే బయోయాక్టివ్ సమ్మేళనం కాలేయానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
కాలేయానికి పచ్చి పసుపు కలిగించే ముఖ్యమైన ప్రయోజనాలు..
కొవ్వును కరిగిస్తుంది: పసుపులోని కర్కుమిన్ కాలేయంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును (ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్) కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను మెరుగుపరిచి, ఫ్యాటీ లివర్ లక్షణాలను తగ్గిస్తుంది.
వాపు, ఆక్సీకరణ ఒత్తిడి నివారణ: పసుపునకు సహజంగానే శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కాలేయ వాపును తగ్గించడంతో పాటు, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
కాలేయ ఎంజైమ్‌ల నియంత్రణ: కాలేయం దెబ్బతిన్నప్పుడు హెచ్చుతగ్గులకు గురయ్యే ALT, AST వంటి కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను పసుపు క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా లివర్ పనితీరు మెరుగవుతుంది.
నేచురల్ డిటాక్సిఫికేషన్: పచ్చి పసుపు రక్తంలోని విషతుల్యాలను తొలగించి, కాలేయాన్ని శుభ్రపరిచే నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.
పచ్చి పసుపును ఏ విధంగా తీసుకోవాలి?
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని, డిటాక్స్ చేయడానికి 'పచ్చి పసుపు నీరు' అత్యుత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..ముందుగా తాజా పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా కడిగి, మెత్తగా నూరాలి లేదా తురుముకోవాలి. ఈ పసుపు తురుమును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. రుచి కోసం ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కాలేయం పనితీరు మెరుగుపడటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ద్వారా పేర్కొన్నాము. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్‌గా బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?
Also Read: Gastric Home Remedies: ఏళ్ల తరబడి ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఇది చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
T Jeevan Reddy: ధర్మేంద్ర ప్రదాన్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది: జీవన్ రెడ్డి
Raikal, Jagtial, Telangana:Jeevan Reddy vs Revanth Reddy: రైతుల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు. వరి నాట్లు వేసే సమయం దాటిపోయాక ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎండగట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందిస్తే.. నేడు సాయంత్రం పూట కరెంట్ కోతలు మొదలయ్యాయని, బావుల్లో నీళ్లు అడుగంటి రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కేవలం రూ10 కోట్ల ఖర్చుతో కాపర్ డ్యామ్ నిర్మిస్తే 15 రోజుల్లో నీటి సమస్య తీరుతుందని సూచించారు.
జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని.. రేవంత్ రెడ్డి మార్క్ పాలన తెచ్చిన కృత్రిమ కరువు అని తెలిపారు. జగన్నాథ్‌పూర్ - బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ సమన్వయం లేదని చెప్పారు. స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.17.50 కోట్లతో తొలి సంతకం చేసి టెండర్లు కూడా పూర్తి చేస్తే.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మళ్లీ కేంద్ర గిరిజన శాఖకు ప్రతిపాదనలు పంపడం ఏమిటని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై నమ్మకం లేదా అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీశారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని, రామాజీపేట్, మైతాపూర్ వంతెనల అప్రోచ్ రోడ్ల విషయంలో డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
పోలవరం వద్ద నీ గురువు చంద్రబాబు కాపర్ డ్యామ్ కట్టలేదా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్తుచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ లేదని.. రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని చురకలు అంటించారు.
ధాన్యం సేకరణ, ఉచిత విద్యుత్, నీటి యాజమాన్యంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. పంజాబ్, హర్యానా రైతుల తరహాలోనే తెలంగాణ రైతులు కూడా ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.
Puri Jagannadh Mother: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్!
Hyderabad, Telangana:Puri Jagannadh Mother Passed Away: టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి (అమ్మాజీ) కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను పూరి కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
పవిత్ర ఎమోషనల్ పోస్ట్
శనివారం (జూలై 25) నాడు తన నానమ్మ మరణించినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పవిత్ర వెల్లడించారు. ఆ పోస్ట్ లో.. "ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ" అని పోస్ట్ పెట్టింది.
ఇలా ఆమె రాసుకొచ్చిన భావోద్వేగ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూరి కుటుంబానికి తమ ప్రగాష్ట సానుభూతి, సంఘీభావం తెలుపుతున్నారు.
పూరి జగన్నాథ్ సినిమాల ప్రస్థానం
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన పూరి జగన్నాథ్ కెరీర్ పరిశీలిస్తే.. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'బద్రి', 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి', 'పోకిరి', 'దేశముదురు', 'బిజినెస్ మెన్', 'టెంపర్' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన విజయాలు దక్కలేదు. 'ఇస్మార్ట్ శంకర్' మినహా మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ALso Read: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు మరోసారి సర్జరీ..కోయంబత్తూరుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ!
Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
E20 Fuel Protest: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్‌పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!
New Delhi, Delhi:Delhi E20 Petrol Protest: దేశంలో మారుతున్న ఇంధన విధానాలు, వినియోగదారుల ఎంపిక హక్కుల పరిరక్షణ కోసం 'టీమ్ భారత్' (Team Bharat) సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనెల 31న ఢిల్లీలో 'గాడీ మార్చ్, గాంధీ మార్చ్' పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది.
ఆందోళనలకు అసలు కారణం ఏమిటి?
దేశంలో విక్రయిస్తున్న E10, E20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల మైలేజీ భారీగా తగ్గిపోతోందని, ఇంజిన్ రిపేర్ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పౌరుల వేదిక అయిన 'టీమ్ భారత్' ఇంధన విధానంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల కోసం ఈ ఉద్యమానికి నడుం బిగించింది.
ఈ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు కాదని, ఇథనాల్ 20 (E20) విధానంపై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పౌరుల ఉద్యమమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మార్చ్ ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమై.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి నివాసాలు, కార్యాలయాల మీదుగా వెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ముగియనుంది.
టీమ్ భారత్ ప్రధాన డిమాండ్లు..
1) E10 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన పాత వాహనాల కోసం మార్కెట్లో E10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.
2) E20 పెట్రోల్ ధరపై 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలి. అలాగే ప్యూర్ పెట్రోల్ ధరలను తగ్గించాలి.
3) E20 ఇంధన విధానానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, సమాచారాన్ని దేశ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి.
4)2023కి ముందు తయారైన వాహనాలపై E20 పెట్రోల్ చూపుతున్న దుష్ప్రభావాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
5) చివరగా..ఇథనాల్ విధానం వల్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలి.
వాహనదారులకు పిలుపు
ఈ ర్యాలీలో కార్లు, బైక్ యజమానులు, కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీమ్ భారత్ పిలుపునిచ్చింది. "మేరీ గాడీ.. మేరా అధికార్", "మేరీ బైక్.. మేరీ చాయిస్", "అవర్ వెహికల్స్.. అవర్ చాయిస్.. అవర్ రైట్" వంటి నినాదాలతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా తమ నిరసన తెలపాలని కోరింది.
ఇథనాల్ విధానంపై వాదనలు..
దేశంలో ఇంధన దిగుమతులను తగ్గించడం, రైతులకు మద్దతునివ్వడం, ఇంధన భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే, 2023కి ముందు తయారైన వాహనాలపై దీని ప్రభావం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంపై వాహనదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదం నేపథ్యంలో జూలై 31న జరగనున్న 'గాడీ మార్చ్' దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also REad: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
Also REad: CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
