Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500076

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండగ సాయన్న జయంతి

Jul 18, 2024 03:45:03
Hyderabad, Telangana

తెలంగాణ సాయుధ దళాల పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహోత్సవం సేవలను పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ డ్యాం పైన సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 24, 2026 18:10:25
Tirupati Urban, Andhra Pradesh:

Gold Man In Tirumala: అలంకార ప్రియుడైనా తిరుమల శ్రీవారినే మించినట్టు ఓ భక్తుడు స్వర్ణాభరణాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కిలోల కొద్దీ బంగారం.. కళ్లు చెదిరే.. ధగధగలాడే ఆభరణాలు ధరించిన గోల్డ్‌ మెన్‌ తిరుమల క్షేత్రంలో కనిపించాడు. ఆ వెంకటేశ్వరుడినే ఆభరణాలకు పోటీగా వచ్చినట్టు అతడు ఆ స్థాయిలో తన ఒంటిపై స్వర్ణాభరణాలు ధరించాడు. కంఠాభరణం.. ఉంగరాలు, కడియాలతో బంగారం మనిషిలా అతడు తిరుమల వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. తిరుమలలో సందడి చేసిన అతడు గురించి వివరాలు తెలుసుకుందాం.

Also Read: SBI Interest Rate: ఎస్‌బీఐ ఖాతాదారులకు పండుగే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోల్డ్ మెన్ సందడి చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్య గోల్డ్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లో ఎక్కడకు వెళ్లినా కిలోల కొద్దీ ఆభరణాలు ధరిస్తూ కనిపిస్తుంటాడు. అలాంటి వ్యక్తి తిరుమలలో కనిపించడంతో ప్రత్యేకంగా నిలిచింది. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల కొండపై అతడు కనిపించడంతో భక్తులు ఆసక్తిగా గమనించారు.

Also Read: Free Bus: మేనిఫెస్టోలో వరాల జల్లు.. 'మహిళలకు ఫ్రిడ్జ్‌లు ఫ్రీ, పురుషులకు ఉచిత బస్సు'

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించిన సూర్య అనంతరం దర్శన టికెట్ పొంది మంగళవారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెడలో భారీ బంగారు హారాలు, చేతికి ప్రత్యేకమైన 'గోవింద నామ కంకణం' ధరించి ఆలయం వెలుపలికి సూర్య వచ్చాడు. దీంతో అందరూ అతడిని చూసేందుకు అమితాసక్తి ప్రదర్శించారు. ఒళ్లంతా మెరిసిపోతున్న బంగారంతో కనిపిస్తున్న ఆయన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.

Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్‌

గోల్డ్‌ మెన్‌గా పిలుచుకుంటూ అతడితో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. దర్శనం అనంతరం సూర్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వర స్వామి దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భారత దేశంలో ఎవరూ ధరించని కడియం ఒక్కటి ధరించాలని గతంలో స్వామిని ప్రార్థించానని.. స్వామి ఆశీస్సులతో గోవింద నామం ఉన్న కడియం ధరించినట్లు సూర్య వివరించారు. గోవిందనామం కడియం ధరించడం తకు ఎంతో సంతృప్తినిచ్చిందని.. దీనికంతటికి స్వామి ఆశీర్వాదమే కారణమని గోల్డ్‌మెన్‌ సూర్య తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1050
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 17:20:05
Wadgaon, Maharashtra:

SBI Bulk Term Deposits Interest Rates Hike: ఎస్‌బీఐ బల్క్‌ టర్మ్‌ డిపాజిట్లు, ఎస్‌బీఐ అకౌంట్‌ హోల్డర్స్‌, వడ్డీ రేట్లు,బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఎస్‌బీఐ భరీ శుభవార్త వినిపించింది. తన బల్క్ టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ భారీగా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీ అందించనుంది. అయితే కొత్త, రెన్యువల్ డిపాజిట్లకు మాత్రమే ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఖాతాదారులకు అధిక రాబడి లభించనుంది. అయితే పెంచిన కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది.

Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు భారీ శుభవార్త అందించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ.3 కోట్ల కంటే ఎక్కువ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. కొత్త వడ్డీ రేట్ల ధరలను ఎస్‌బీఐ సవరించింది. కొత్త వడ్డీ రేట్‌ ధరల ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును ఎస్‌బీఐ 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ లభిస్తుంది. వృద్ధుల కోసం 180 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10 శాతం నుంచి 6.35 శాతానికి.. ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం నుంచి 7.00 శాతానికి వడ్డీ రేటు పెరగడం విశేషం.

Also Read: Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా

కొత్తగా చేసే డిపాజిట్లు, రెన్యువల్ చేసే డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు మాత్రమే వర్తిస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువు ముందే విత్‌డ్రా చేసుకుంటే మాత్రం ఒక శాతం పెనాల్టీ యథాతథంగా ఉంటుంది. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ఈ వడ్డీ రేట్ల పెంపు సీనియర్ సిటిజన్లకు లాభదాయకంగా మారనుంది.

Also Read: Shobha Yatra: శ్రీరామనవమి శోభాయాత్రపై పోలీస్‌ డేగ కన్ను.. ప్రశాంతంగా చేసుకుందాం

ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్‌ రంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్న క్రమంలో ఎస్‌బీఐ మాత్రం పెంచడం విశేషం. ఎస్‌బీఐ అకౌంట్‌ కలిగిన వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే ఇప్పుడు భారీగా లబ్ది పొందవచ్చు. వడ్డీ రేట్ల పెంపు వెనుక ఎస్‌బీఐ భారీ వ్యూహమే ఉందని అనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు దూరమవుతున్న వేళ వారిని పెంచుకునేందుకు.. ఆకర్షించుకునేందుకు ఎస్‌బీఐ ఈ వడ్డీ రేట్లు పెంచడం కారణంగా తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1087
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 16:25:08
Chennai, Tamil Nadu:

AIADMK Election Manifesto: తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు అన్నాడీఎంకే పార్టీ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఉచిత పథకాలు భారీగా ప్రకటించింది. వాటిలో మహిళలకు ఉచితంగా ఫ్రిడ్జ్‌ ఇస్తామని.. పురుషులకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఏఐడీఎంకే పార్టీ ప్రకటన చేసింది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో భారీగా మహిళలు ఇచ్చింది. ఓట్లు ఎలాగైనా పొందాలని ఇబ్బడిముబ్బడిగా అన్నాడీఎంకే హామీలు ఇచ్చేసింది.

Also Read: Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెన్నైలో అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి 297 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరగడంతో కుటుంబాలను ఆదుకునేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని ఏఐడీఎంకే మేనిఫెస్టోలో తెలిపింది.

Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్‌

మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

  • రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఉచితంగా ఫ్రిజ్‌లు అందిస్తాం.
  • ఐదు లక్షల మంది వర్కింగ్ మహిళలకు టూ వీలర్స్‌పై రూ.25,000 వరకు రాయితీ అందించడం
  • మహిళలతోపాటు పురుషులకు కూడా ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణం
  • రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా కిలో పప్పు, లీటర్ వంట నూనె అందిస్తాం.
  • ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు
  • సామాజిక పింఛన్లు రూ.2,000కు పెంపు
  • గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంపు
  • జల్లికట్టు బాధితులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం
  • ఈపీఎస్ మహిళల కోసం కుల విలక్కు పథకం

Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన

గెలుపే లక్ష్యం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. మే 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికారానికి దూరమైన అన్నాడీఎంకే తిరిగి దక్కించుకోవడానికి ప్రజలపై వరాల జల్లు కురిపించింది. జయలలిత తర్వాత ఏఐడీఎంకే తీవ్ర సంక్షోభంలో పడగా.. అగ్ర నాయకుడు పన్నీర్‌ సెల్వం డీఎంకేలో చేరడంతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1072
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 14:33:49
Balapur, Telangana:

Funny Incident At Telangana Assembly: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీరుపై అన్ని ప్రజా సంఘాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, ఆటో కార్మికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీరుతో నష్టపోతున్న వర్గాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసెంబ్లీ ముట్టడి చేపడుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన నవ్వులు పూయిస్తోంది. నిరసనకారులను కాకుండా కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ను అరెస్ట్‌ చేయగా.. ఆయన అబబబ్బా అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం మంగళవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. అసెంబ్లీ వైపు బీఆర్‌ఎస్‌వీ నాయకులు దూసుకురావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. ముట్టడించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అటువైపు మానకొండూరు నియోజకవర్గంలోని రేపాక గ్రామ సర్పంచ్‌ కాత మల్లేశం రాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

తనను అరెస్ట్‌ చేయడంతో కాత మల్లేశం లబోదిబోమన్నాడు. పోలీసులు తనను బలవంతంగా వ్యాన్‌ ఎక్కించడంతో ఇదెక్కడి లొల్లి అయ్యా అని అరుస్తూ మీడియాతో మాట్లాడాడు. 'మేం కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లం అయ్య. మమ్మల్ని రమ్మని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాస్‌లు ఇచ్చిండు. మేం కాంగ్రెస్‌ పార్టీ వాళ్లం..' అని మల్లేశం వివరించాడు. అయితే ఆ లొల్లిలో పోలీసులు అతడి బాధను వినిపించుకోలేదు. గట్టిగా అరుస్తూ.. నోరు కొట్టుకుంటూ 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసిండేంది.. మేం కాంగ్రెస్‌ పార్టీ నాయకులం రా అయా' అని మీడియాతో అతడు వాపోయాడు. 'ఏం పోలీసులే.. ఛీ ఛీ' అంటూ నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఇది తెలుసుకున్న పోలీస్‌ అధికారి అతడిని కిందకు దించాడు.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

ఆ సమయంలో మరో పోలీస్‌ అధికారి వచ్చి అతడిని మళ్లీ వ్యాన్‌ ఎక్కించే ప్రయత్నం చేయగా.. 'అయ్య నీకు దండం పెడతా మేం కాంగ్రెస్‌ పార్టీ నాయకులమే.. నీ దయనే' అంటూ విజ్ఞప్తి చేశాడు. కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసుడు ఏమిటి? వాపోవడంతో అతడిని పోలీసులు వదిలేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలో పోలీసులు ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న తీరు ఈ సంఘటనతో కళ్లకు కట్టినట్టు కనిపించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1097
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 14:25:15
Hyderabad, Telangana:

Hyderabad Rains: వేసవి ప్రారంభమైన తర్వాత వాతావరణం విచిత్రంగా మారింది. ఎండలు దంచికొట్టాల్సి ఉండగా ఈ కాలంలో గమ్మత్తుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అకాల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలపగా.. దానికి తగ్గట్టుగానే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కూడా వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. వర్షానికి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: KTR Reaction: 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లుపై దృష్టి మళ్లించడమే కుట్ర: కేటీఆర్‌

హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరమంతా కురుస్తున్న వర్షం...ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ,  హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్ బీ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్, తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎండ తీవ్రతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం నుండే ఆకాశం మేఘావృతమై  వాతావరణం చల్లబడడంతో ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వర్షం కురుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..
హైదరాబాద్‌ శివారులోని సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, జిన్నారం తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. నల్లటి మబ్బులతో అమీన్‌పూర్ కమ్ముకుపోవడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1071
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 13:26:57
Hyderabad, Telangana:

Telangana Assembly: 'ఆరు గ్యారెంటీల మీద ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. అవకాశం ఇవ్వాలని  స్పీకర్‌ను కోరాం. ప్రజల నుంచి దృష్టిని మరల్చటానికి ఛార్జిషీట్ వ్యవహారం ముందుకు తెచ్చారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు మాత్రమే అని పునరుద్ఘాటించారు. 'ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేస్తోంది. లేని కేసు ఉన్నట్టుగా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. మేము ఎవరికైతే లబ్ధి చేశామని ఆరోపణ చేశారో వారి పేరే ఛార్జీషీట్‌లో లేదు. ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ పేరు ఎందుకు పెట్టలేదు?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'దీని వెనుక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి. దావోస్ మంతనాలు ఏంటి..? తెరవెనుక బాగోతాలు ఏమిటి?' అని నిలదీశారు.

Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. 'ఈరోజు కూడా డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం తప్ప ఈ కేసులో ఏం లేదు. డబ్బులు బ్యాంక్ నుంచి బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ప్రభుత్వం ఎఫ్ఈఓ సంస్థ నుంచి రికవరీ చేయాలి. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. ఈ రేస్ ద్వారా 700 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వానికి వచ్చాయని నెల్సన్ అనే సంస్థ వెల్లడించింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె

'అందాల పోటీలతో రెండు రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు. అందాల పోటీకి వచ్చిన ఎల్లా మ్యాగీ అనే అమ్మాయి తనను వేశ్యగా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెలంగాణ పరువుపోయింది. మెస్సీతో రేవంత్‌ రెడ్డి ఫుట్‌బాల్ ఆటకు రూ.వంద కోట్ల ఖర్చు అయింది. రేవంత్‌ రెడ్డి నుంచి రికవరీ చేస్తారా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తమకు న్యాయ స్థానాల మీద విశ్వాసం ఉందని.. ఈ కేసు ఏ న్యాయస్థానంలో నిలవదని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. గిగ్‌ వర్కర్లకు భారీ శుభవార్త!

'ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నేనే మంత్రిగా విధానపర నిర్ణయం తీసుకున్నా. మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాదు.. ప్రజల వద్ద పెట్టండి. భయం ఉంటే వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని రండి' అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. 'టీడీఆర్ అతి పెద్ద కుంభకోణం. కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. టీడీఆర్‌లను రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు ఏటీఎమ్‌లా మార్చుకున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులే టీడీఆర్‌లు కొంటున్నారు. ఇదొక ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణం. మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మూసీ బాధితులకు టీడీఆర్‌లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1005
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 24, 2026 13:09:38
Hyderabad, Telangana:

Hyderabad Police: శ్రీరామనవమి హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే శోభయాత్రపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శోభయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని.. అందరూ సహకరిస్తే ఉత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి చేసుకుందామని నగర పోలీస్‌ కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్‌, వీసీ సజ్జనార్‌ సూచించారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం చేశారు.

Also Read: Telangana Assembly: 'నీ యవ్వ మమ్మల్ని అరెస్ట్‌ చేసుడేంది?' అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించిన సంఘటన

శోభయాత్రపై హైదరాబాద్‌ సీతారాం బాగ్‌లో నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని.. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం చేశారు. '2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందింది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో.. క్రమశిక్షణతో చేసుకోవాలి' అని సూచించారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని ప్రకటించారు.

Also Read: Maganti Gopinath Daughter: మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం.. కొన ఊపిరితో కుమార్తె

శోభయాత్రలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంటాయని జంట నగరాల కమిషనర్లు తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్‌తో యాత్ర నెమ్మదించిందని... ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శోభాయాత్రను మధ్యాహ్నం ఒకటికి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాలతో ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని నిర్వాహకులు, భక్తులకు పోలీస్‌ కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్‌, వీసీ సజ్జనార్‌ సూచించారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

శోభయాత్రకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని.. శోభయాత్రలో నిర్వాహకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శోభాయాత్ర వెళ్లే రూట్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి సీపీ పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్ శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1096
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 24, 2026 11:39:53
Hyderabad, Telangana:

 15-foot King Cobra Video Watch Now: ఇంటర్నెట్‌ పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియోలు మన ముందుకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఒక భారీ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో నెటిజన్ల ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక ఇరుకైన సందిలో దాక్కున్న 15 అడుగుల భారీ పామును, ప్రాణాలకు తెగించి ఒక స్నేక్ క్యాచర్ పట్టుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక జనావాసాల మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఈ భారీ నాగుపాము సంచారం చేసింది.. సుమారు 15 అడుగుల పొడవున్న ఆ పామును చూసి స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని సాహసోపేతమైన ఆపరేషన్ ప్రారంభించారు. ఆ సందు చాలా ఇరుకుగా ఉండటంతో పామును పట్టుకోవడం ఆ స్నేక్‌ క్యాచర్‌కి సవాలుగా మారింది.

స్నేక్ క్యాచర్ ఆ పాము తోకను పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. ఆ భీకర దృశ్యం చూస్తుంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ పాము తన పడగ విప్పి బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్‌ను భయపెట్టాలని చూడడం కూడా మీరు వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.. ఏమాత్రం పట్టు తప్పినా ఆ విష సర్పం కాటుకు అతను బలికాక తప్పని పరిస్థితి... కానీ, తన చాకచక్యంతో అతను పాము దాడుల నుంచి తప్పుకుంటూ.. దానిని చివరికి నియంత్రించేశారు.

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

సుదీర్ఘ రెష్యూ ఆఫరేషన్‌ తర్వాత.. ఆ భారీ కోబ్రాను ఎంతో సులభంగా ఒక సంచిలోకి బంధించారు.. ఆ పాము సంచిలోకి వెళ్లే వరకు ఆతను ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇది ధైర్యం కాదు.. సాక్షాత్తు మృత్యువుతో వేట.. అని కొందరు కామెంట్ చేస్తుంటే, పాములను పట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1002
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 24, 2026 11:07:44
Hyderabad, Telangana:

Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల మార్పులు మానవ జీవితంపై ఊహించని ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 11 బుధ గ్రహం కుంభ రాశిని వీడి గురుడి రాశి అయిన మీన రాశిలోకి  సంచారం చేయబోతోంది. ఏప్రిల్ 30 వరకు బుధుడు ఇదే రాశిలో సంచార దశలో ఉంటుంది. బుధుడు మీన రాశిలో ఉండడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బలహీనమైన స్థితిగా కూడా పరిగణిస్తారు. అయితే, ఈ సమయంలో బుధుడి శక్తి తగ్గి.. కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

బుధుడి ప్రభావంతో ఈ కింది రాశులవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశులవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక, కుటుంబ విషయాలంలో కూడా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి
మేష రాశివారు ఈ సమయం చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ శక్తి ఉన్నట్లు అనుభూతి కూడా చెందే ఛాన్స్‌లు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల కారణంగా మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల వల్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. 

సింహ రాశి
సూర్యుడి సంచారం వల్ల సింహరాశి వారికి అనేక రకాల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎటువంటి రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌ పరంగా పెద్ద అడ్డంకులు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా ఓపికతో ఉండడం చాలా మంచిది. 

తులా రాశి
తులా రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. పనుల్లో పదే పదే ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన సవాళ్లలో తీవ్ర ఇబ్బందులు కూడా వస్తాయి. కుటుంబంలో ప్రతికూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. క్రమశిక్షణతో కూడిన  జీవితాన్ని నడపడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మకర రాశి
మకర రాశివారు ప్రత్యర్థుల పట్ల ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేదంటే మీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా తగ్గిపోయి.. అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కష్టపడి పనులు చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

995
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 24, 2026 08:10:24
Hyderabad, Telangana:

 Venomous 10-foot King Cobra Video Watch: ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో కింగ్‌ కోబ్రా ఒకటి.. దాని ఒక్క కాటు భారీ ఏనుగును సైతం మరణించేలా చేస్తుంది. అలాంటి భీకరమైన పాము ఎదురైతే సామాన్యులు గజగజ వణుకుతూ పరుగులు పెడుతూ ఉంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు సుమారు 10 అడుగుల పొడవున్న భారీ కింగ్‌ కోబ్రాను ఒక వ్యక్తి ఎంతో చాకచక్యంగా పట్టుకుకోవడమే కాకుండా.. దానిని గాల్లోకి సింపుల్‌గా లేపాడు.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా పాములు తమను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్రిస్తే.. వెంటనే బుసలు కొడుతూ.. దాడికి దిగుతాయి. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం దీనికి చాలా భిన్నంగా ఉంది.. ఒక వక్తి ఆ భారీ పామును తోక భాగంలో పాటు దాడి నడుము భాగం పట్టుకుని.. చాలా నెమ్మది నెమ్మదిగా గాల్లోకి లేపడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి తన చేతులతో పామును ఎంతో సులభంగా కంట్రోల్‌ చేయడం మీరు వీడియోలో చూడొచ్చు.. ఆ వ్యక్తి ఏకంగా 5 మీటర్ల ఎత్తు వరకు నిటారుగా గాల్లోకి లేవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలా లేపిన పామును కొన్ని సెకండ్ల వ్యవధిలోనే చాలా నెమ్మదిగా కింది దింపాడు.. 

 
 
 
 
 

ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అది పామా లేక ఏమైనా మాయా?.. అని  కొందరు అంటుంటే, ఆ వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. కానీ ఇది చాలా ప్రమాదకరం అని కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అలాగే కింగ్ కోబ్రా తన శరీరంలో మూడో వంతు భాగాన్ని గాల్లోకి లేపగల సామర్థ్యం ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం పాము భారీగా పైకి లేవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఈ కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి.. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి సాహసాలు చేయడం ప్రాణాలకే ముప్పని కొంతమంది వణ్యప్రాణి సంరక్షకులు తెలుపుతున్నారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రస్తుతం ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ  వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోదారులు కామెంట్‌ చేస్తూ వస్తున్నారు. 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1095
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 23, 2026 11:01:01
Hyderabad, Telangana:

Maganti Gopinath Daughter Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నుంచి హ్యాట్రిక్‌గా గెలుస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గతేడాది తీవ్ర అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. మాగంటి గోపీనాథ్‌ కుమార్తెలు రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో పెద్ద కుమార్తె పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా.. చిన్న కుమార్తె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘటనతో మాగంటి గోపీనాథ్ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతుండగా.. ఆయన అభిమానులు భయాందోళన చెందుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

మాగంటి గోపీనాథ్‌కు ఓ కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అక్షర, దిశిర. వారు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తూ హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌)పై ప్రయాణిస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఫార్చూనర్‌ కారు ప్రమాదానికి గురయ్యింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు డీసీఎం వాహనాన్ని వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె అక్షర తీవ్ర గాయాలపాలవగా.. చిన్న కుమార్తె దిశిర ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడింది. ఈ సంఘటన నార్సింగ్‌లో పోలీస్ అకాడమీ సమీపంలో చోటుచేసుకుంది.

Also Read: Vahan Portal: వాహన పోర్టల్‌లో చేరిన తెలంగాణ.. రిజిస్ట్రేషన్‌ నుంచి ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే!

ప్రమాదం జరిగిన అనంతరం వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న అక్షరను బయటకు తీసుకురాగా.. దిశిర క్షేమంగా బయటపడింది. ఆ వెంటనే అంబులెన్స్‌లో ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్షరకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

ఆందోళనలో మాగంటి కుటుంబం
ఈ ప్రమాదంపై మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో భయాందోళన చెందుతోంది. తండ్రిని కోల్పోయి పెద్ద దిక్కు లేని ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తండ్రి చనిపోయి పది నెలలు కూడా గడవకముందే ఇప్పుడు అక్షర తీవ్ర గాయాలపాలవడంతో మాగంటి కుటుంబం షాక్‌కు గురయ్యింది. ఆయన చనిపోయి ఏడాది కాకముందే కుమార్తెలు అక్షర, దిశర ప్రమాదం బారినపడడంతో మాగంటి అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు వివరాలు తెలుసుకున్నారు. మాగంటి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అక్షర ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1091
comment0
Report
HDHarish Darla
Mar 23, 2026 10:55:32
Hyderabad, Telangana:

LPG Gas Booking Scam News: దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. మొబైల్స్‌లో గుర్తుతెలియని లింకులు లేదా యాప్‌లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు దేశీయంగా LPG గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి మరో కొత్త స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ స్కామ్ అనే కొత్త సైబర్ మోసానికి ఇప్పుడు ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు. అయితే ఇలాంటి మోసాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని.. అజాగ్రత్తగా ఉండరాదని పోలీసులు సూచించారు.  

మొబైల్ ఫోన్ల ద్వారా గ్యాస్ బుక్ చేసేవారు ఇలాంటి రకమైన మోసాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెట్టి.. వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మీ చిన్న నిర్లక్ష్యం మీ బ్యాంకు ఖాతాను పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంది. అందువల్ల, ఈ మోసం గురించి ప్రజలు ముందుగానే గ్రహించి..జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. 

మోసం ఎలా జరుగుతుంది?
సైబర్ నేరగాళ్లు ముందుగా మీ ఫోన్‌కు ఒక సందేశం పంపుతారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా 'గ్యాస్ బిల్ అప్‌డేట్ APK' అనే ఫైల్‌ను పంపుతారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, మీ గ్యాస్ బుకింగ్‌ను అప్‌డేట్ చేసుకోమని వారు మిమ్మల్ని అడుగుతారు. మీరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. సైబర్ మోసగాళ్లకు మీ ఫోన్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది. వారు మీ బ్యాంక్ వివరాలు.. UPI పిన్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు.

పోలీసులు ఏ సలహా ఇచ్చారు?
ఏ కారణం చేతనైనా గుర్తుతెలియని లింకులు లేదా యాప్‌లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్‌ను ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోండి. మీకు ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తే, వెంటనే వాటిని 1930 హెల్ప్‌లైన్‌కు తెలియజేయండి. మీరు దీనిని cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
మోసగాళ్లు సిలిండర్ల కొరతను ఆసరాగా తీసుకుని ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొద్దిపాటి జాగ్రత్తతో, మీరు ఇలాంటి సైబర్ మోసాలను నివారించవచ్చు.

ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఇవి పాటించండి...
1) తెలియని SMS లేదా WhatsApp లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
2) బయటి నుండి ఏ 'APK ఫైల్' లేదా ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకండి.
3) కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవడం ఉత్తమం.
4) మీ OTP, UPI PIN లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
5) ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగత వివరాలు చెప్పమని ఒత్తిడి చేస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.
6) మీ ఫోన్‌లో యాంటీవైరస్, సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.
7) అనుమానాస్పద సందేశాలు లేదా కాల్‌లను వెంటనే బ్లాక్ చేసేయండి.
8) మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి.
9) cybercrime.gov.inలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.
 
Also Read: 
OnePlus 15T launch Price: రేపే OnePlus 15T లాంఛింగ్.. 7500 బ్యాటరీతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే?

Also Read: EPF ATM Withdrawal 2026: ఉద్యోగులకు భారీ శుభవార్త..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా అప్పటి నుంచే..ఇలా చేస్తే 20 శాతం నష్టపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1079
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 23, 2026 09:56:44
Hyderabad, Telangana:

Telangana Joins Vahan Portal: 'షో రూమ్‌లలో పారదర్శకంగా వాహనాల రిజిస్టేషన్ అయ్యేలా చేశాం. తెలంగాణ రవాణా శాఖ చేస్తున్న సంస్కరణలు , రోడ్ సేఫ్టీపై కేంద్రంలో ప్రశంసలు వస్తున్నాయి. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ బ్రాండ్‌గా మారుతుంది' అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రవాణా శాఖ డిజిటల్ మార్పును ముందుకు తీసుకెళ్తోంది. మన రాష్ట్రంలో రోజుకు సుమారు 1,500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇలాంటి భారీ సంఖ్యలో వాహనాల సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి వాహన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది' అని వెల్లడించారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్‌ బేగంపేట వరుణ్ మోటార్స్‌ వద్ద వాహన్ పోర్టల్‌ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు ఏశారు. ఈరోజు వాహన్ పోర్టల్ ప్రారంభించుకోవడం  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం' అని తెలిపారు. 'ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాలు వాహన్ సారథిలో ఉండేవి.. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరాం' అని వెల్లడించారు. వాహన్ పోర్టల్‌లో చేరడంతో వాహన్ ద్వారా ఈరోజు నుంచి వాహన కొనుగోలు చేసే వారికి 2 శాతం అదనపు టాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్కు పోస్టులు ఎత్తివేశామని తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని.. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

'ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్‌లో సమీకరిస్తారు. దీంతో సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇప్పుడు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి' అని పొన్నం ప్రభాకర్‌ వివరించారు. ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుందని.. నేటి నుంచి రెండు, మరియు తదుపరి వ్యక్తిగత వాహనాలపై ఉన్న అదనపు 2 శాతం జీవితకాల పన్నును రద్దు చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. 'ఇది ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. వాహన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి కచ్చితమైన డేటా లభించి, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మరియు భవిష్యత్ ప్రణాళికల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది' అని పేర్కొన్నారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో మనమందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చార. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో జరిగేది దానిపై సంస్కరణలు తెచ్చి వాహనాలు కొనుగోలు చేసిన షో రూమ్‌లలోనే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేసే వాటికి ఈవి వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'హైదరాబాద్‌లో అన్ని డీజిల్ ఆటోలు రేటిరోఫిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేము పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు ,డీలర్ల తో కోఆర్డినేట్ చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నాం. 2016లో ప్రారంభమైన ఈ వాహన సారథి లో మనం ఈరోజు చేరాం' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'వాహన్ పోర్టల్‌లో చేరడంతో వాహనాలకు సంబంధించిన డేటా ఆన్‌లైన్‌లో ఉంటుంది. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది' అని చెప్పారు. 

ప్రభుత్వం తెస్తున్న పాలసీలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పొన్నం ప్రభాకర్‌ సూచించారు. 'ఈవీ డీలర్లను ప్రభుత్వం కోరుతుంది.. కన్లుమర్‌ మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేశాం. కన్స్యూమర్‌కి ఇబ్బందులు లేకుండా చూడాలి.పారదర్శకంగా సమర్థవంతంగా చేయాలి..వారికి త్వర తర్వగా పూర్తయ్యేలా చేయాలి' అని వాహన యాజమాన్యాలకు పొన్నం ప్రభాకర్‌ సూచించారు. 'రోడ్ సేఫ్టీలో జ్యూరీ భాగస్వామి కావాలి. మీరు వాహనాలు అమ్మినప్పుడు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించేలా కొనుగోలు చేసిన వారికి హెల్మెట్లు ఇవ్వడం, కాలుష్యాన్ని తగ్గించేలా వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ఒక మొక్కను అందించాలి' అని వాహనాల కంపెనీ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. 'ఏటీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నాం.. రవాణా శాఖకు కొత్త లోగో తెచ్చాం. రవాణా శాఖ తెస్తున్న సంస్కరణలు పై ప్రజలు సంతోషంగా ఉన్నారు. రవాణా శాఖ లో 100 శాతం ఆన్‌లైన్‌లో సేవలు కొనసాగిస్తున్నాం' అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

922
comment0
Report
Advertisement
Back to top