అవినీతి ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకోండి
Hyderabad, Telangana:జేఎన్టీయూ యూనివర్సిటీలో అవినీతికి పాల్పడుతున్న ప్రొఫెసర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు MSF నేతలు. ఈ సందర్భంగా జేఎన్టీయూ యూనివర్సిటీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు . నాణ్యమైన విద్య అందించాల్సిన యూనివర్సిటీ అవినీతికి పాల్పడుతున్నారని వెంటనే వారి పైన సమగ్ర విచారణ చేపట్టి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ వీసీ బుర్ర వెంకటేశంకి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Modi Instagram Usage: మంత్రులకు క్లాస్ పీకిన నరేంద్ర మోదీ.. ఇన్స్టాగ్రామ్ వాడాలని సూచన
New Delhi, Delhi:NEET Students Protest: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. యువత ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంటే కేంద్ర ప్రభుత్వ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని దేశ యువత కోరుతోంది. తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. అది కూడా ఇన్స్టాగ్రామ్ వినియోగంపై తీసుకోవడం గమనార్హం. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని సూచన చేయడం తీవ్ర వివాదం రాజుకుంది.
Also Read: NEET: నీట్ విద్యార్థులకు తలొగ్గని కేంద్రం.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఉండదే ఉండదు
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు, దేశ యువత ఉద్యమాలు చేపట్టడంతో శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రిమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వింత సలహాలు ఇచ్చారు. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని.. మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచన చేశారు. 'ప్రభుత్వ పథకాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కాదు. పథకాల గురించి అర్థమయ్యేలా వీడియోలు పోస్ట్ చేయాలి' అని కేంద్ర మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు.
Also Read: తగ్గేదేలే అంటున్న కాక్రోచ్ పార్టీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే!
కేంద్ర మంత్రులకు నరేంద్ర మోదీ చేసిన సూచన తీవ్ర వివాదంగా మారింది. జెన్‌జీ యువతరం ఇన్స్టాగ్రామ్ అత్యధికంగా వాడుతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో నరేంద్ర మోదీ స్పందించారు. యువత ఉద్యమ బాట పట్టకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారానే కేంద్ర మంత్రులు యువతను దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.
కాగా ప్రధాని ఇన్స్టాగ్రామ్ సూచనపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. మనకు చదువుకున్న ప్రధానమంత్రి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. 'పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోవాలని అడిగితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి మంత్రులకు చెబుతున్నాడు. మనకు చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉంటే బాగుండేది' అని అభిజిత్ తెలిపారు.
Tholi Ekadasi 2026: రేపే తొలి ఏకాదశి..శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్రమైన రోజు..ఉపవాసం నియమాలు ఇవే!
Hyderabad, Telangana:Tholi Ekadasi Fasting Rules: హిందూ సంప్రదాయంలో ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే తొలి ఏకాదశి, దేవశయన ఏకాదశి, హరిశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతారంభానికి సంకేతమైన ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఆచరించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.
తొలి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం?
ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. నాలుగు నెలల పాటు (చాతుర్మాస్యం) యోగనిద్రలో ఉండే స్వామివారు, కార్తీక శుక్ల ఏకాదశి (ఉత్తాన ఏకాదశి) నాడు మేల్కొంటారు. దక్షిణాయనం ప్రారంభమయ్యాక వచ్చే తొలి ప్రధాన ఏకాదశి కావడంతో దీనికి 'తొలి ఏకాదశి' అని పేరు వచ్చింది.
ఇంట్లో పూజా విధానం, నియమాలు
బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లు శుభ్రం చేసుకుని స్నానాంతరం పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనరసింహస్వామి లేదా శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటానికి గంధం, కుంకుమలతో తిలకం దిద్ది పూలతో అలంకరించాలి.
పచ్చకర్పూరం కలిపిన తీపి నైవేద్యాన్ని సమర్పించి దీపారాధన చేయాలి. తులసీదళాలతో (లేదా తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజి పూలతో) అరిచిస్తూ “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” అనే మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించాలి. పూజ ముగిశాక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూల (పాజిటివ్) శక్తి పెరుగుతుంది.
ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామం
ఇంటి పూజ అనంతరం సమీపంలోని విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసి మాల సమర్పించడం, ధ్వజస్తంభం వద్ద ఆవునెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదం. ఆలయం చుట్టూ 2, 4, 6 లేదా 8 (సరి సంఖ్యలో) ప్రదక్షిణలు చేయడం ద్వారా విష్ణువు కటాక్షం లభిస్తుంది. ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి.
ఏకాదశి ఉపవాస విధానం
భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి క్రింది విధానాల్లో ఉపవాసం ఆచరించవచ్చు. నిరాహారంగా ఉండడం, కేవలం నీరు మాత్రమే తీసుకోవడం, పాలు లేదా పండ్లతో ఉపవాసం చేయడం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం వంటి వాటిని ఆచరించవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కఠిన ఉపవాసాలు చేయకుండా తమ ఆరోగ్యానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది.
ఉపవాస విరమణ, దాన ధర్మాలు
ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజున 'ద్వాదశి' తిథిలో విరమించాలి. ఆహారం స్వీకరించే ముందు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం ఉత్తమమైన ఆచారం. శారీరక కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు నిరాశ చెందకుండా బియ్యం, పండ్లు, వస్త్రాలు లేదా ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా పుణ్యఫలాన్ని పొందవచ్చు.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి.)
Also Read: నాన్‌వెజ్ తిని ఆలయానికి వెళ్తున్నారా? హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోంది?
Also Read: ఈ రోజు నుంచి బుధ ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. ధన లాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ravneet Singh Resign: కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
New Delhi, Delhi:Ravneet Singh Resignation: కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతి ఈ రాజీనామాకు ఆమోదం తెలిపారు. రవ్నీత్ సింగ్ బిట్టు భారత ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీంత్ సింగ్ మనవడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవీకాలం జూన్ నెలలోనూ ముగిసింది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిట్టు పోటీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" బండి సంజయ్ కామెంట్స్!
ALso Read: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మోదీపై పోరాడితే రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు? కేటీఆర్
Hyderabad, Telangana:KTR Counter To Revanth Reddy In BRS Party Protest At Indira Park Over Delhi Student Crackdown CJPఇందిరమ్మ ఇండ్లపై హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏమిటో తెలుసా?
Hyderabad, Telangana:Indiramma Indlu 7680 Flats Will Allot To Hyderabad Public Know The Full DetailsKTR: తండ్రి కేసీఆర్, కుటుంబసభ్యులతో కేటీఆర్ పుట్టినరోజు
Erravalli, Siddipet, Telangana:KTR Birthday Celebration With KCR And Family Members Watch Videoమల్లారెడ్డి యూటర్న్.. పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు
Hyderabad, Telangana:Former Minister Malla Reddy Hot Comments And U Turn On BRS Party Changingతగ్గేదేలే అంటున్న కాక్రోచ్ పార్టీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రేపు మధ్యాహ్నం డెడ్‌లైన్
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign: నీట్ పేపర్ లీక్ అంశం యావత్ భారతదేశాన్ని పాకింది. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో నీట్ ఉద్యమం తార స్థాయికి చేరింది. దీంతో కాక్రోచ్ పార్టీ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. రేపటి మధ్యాహ్నం వరకు కాక్రోచ్ జనతా పార్టీ డెడ్‌లైన్ విధించింది. రాజీనామా చేయకపోతే ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది.
కొన్ని నెలలుగా సాగుతున్న నీట్ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. కొన్ని నిమిషాల పాటు సాగిన చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర, కాక్రోచ్ పార్టీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ పలు అంశాలపై గంటన్నరకు పైగా చర్చించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం డిమాండ్ చేసినట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఆందోళనకారులపై కేసులు కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. వీటిపై రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
చర్చల అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు జేపీ నడ్డా తెలిపారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని.. రేపు మధ్యాహ్నం చర్చలు తిరిగి కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని జేపీ నడ్డా ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ముందు కాక్రోచ్ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే
==> కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.
==> ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి.
==> విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరాం.
దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రం
కాగా దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన నగరాలతోపాటు ఏపీతో సహా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో నీట్ విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నీట్ విద్యార్థులకు మద్దతుగా విద్యా సంస్థల బంద్ విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలన్నీ మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యమం మరింత ఉధృతమయ్యేలా పరిస్థితులు ఉన్నాయి.
నీట్ విద్యార్థులకు తలొగ్గని కేంద్రం.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఉండదే ఉండదు
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign: నీట్ పేపర్ లీక్ వ్యవహారం జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా జెన్‌జీ యువతరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేస్తోంది. నూనుగు మీసాల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన వేళ.. కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళ్తోంది. విద్యార్థుల ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో అణచివేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు దాడులు చేస్తున్నారు. అయితే విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గబోనని స్పష్టం చేస్తోంది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై కేంద్రం దిగిరాదని స్పష్టమవతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), నీట్ విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా.. అతడి రాజీనామా మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని కాక్రోచ్ పార్టీ చెప్పగా.. ఆయన మాత్రం రాజీనామా చేయరని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రదాన్ రాజీనామా చేయకుండానే చర్చకు దిగుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
నీట్ విద్యార్థులు, కాక్రోచ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోరుతున్నాయి. రాజీనామా చేస్తేనే పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతున్నాయి. విద్యార్థుల పోరాటానికి దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన చర్చల్లో ధర్మేంద్ ప్రధాన్ రాజీనామాపై తగ్గేదే లేదని కాక్రోచ్ పార్టీ తేల్చిచెప్పింది. రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది.
చర్చలు ఎలా ఉన్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని.. దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం గుర్తించడం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదనే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని.. ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చే వ్యవస్థను మెరుగుపరుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా రాజీనామా డిమాండ్ వస్తున్నా బీజేపీ, ఎన్డీయే పక్షాలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా నిలుస్తున్నాయి. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వ్యవహరిస్తుండడంతో దేశం యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ ధర్మేంద ప్రదాన్ రాజీనామా చేయకుండా నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఏలోని లోపాలు, సమస్యలను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్టీఏ సమస్యలపై ఒక సమగ్ర జాబితా సిద్ధమవుతోందని.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Vizag Steel Plant Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!
Nadupuru, Andhra Pradesh:Vizag Steel Plant Accident News: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ విభాగంలో జరిగిన ఈ ఘటనలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన మరవకముందే మరో కార్మికుడు మృతి చెందడంతో ప్లాంట్ కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదం జరిగిన తీరు
స్టీల్ ప్లాంట్‌లోని కోక్ ఓవెన్-1 విభాగంలో అనంత్ విధుల్లో ఉండగా, పైనుంచి ఐరన్ ముక్క (ఇనుప ముక్క) ఆయనపై పడింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా నిబంధనల లోపాలపై విచారణ జరుపుతున్నారు.
ప్రశ్నార్థకంగా మారుతున్న భద్రతా ప్రమాణాలు
ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇటీవలే జూన్ నెలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో కార్మికుడు బలికావడం భద్రతా పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు కొత్తేమీ కాదని, గత కొన్ని దశాబ్దాలుగా గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజీలు, యంత్రాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు
ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను వెంటనే మరింత పెంచాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు నాణ్యమైన భద్రతా పరికరాలు, తగిన శిక్షణ, పర్యవేక్షణ అందించాలి. ప్రమాదాలకు కారణమవుతున్న సాంకేతిక, నిర్వహణ లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
Also Read: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" బండి సంజయ్ కామెంట్స్!
Also REad: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేళ బంపరాఫర్..చిన్న పనికి లక్ష రూపాయలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
అయ్యే.. టీచర్ మెడలోని బంగారు గొలుసు కొట్టేసిన దొంగలు..
Hyderabad, Telangana:Bhadradri Kothagudem Theft: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో అర్ధరాత్రి వేళ దొంగలు తీవ్ర కలకలం సృష్టించారు. సాధారణంగా రోడ్లపై ఒంటరిగా వెళ్లే.. మహిళల మెడల నుంచి గొలుసులు తెంచుకెళ్లడం లాంటి రొటీన్ నేరాలకు భిన్నంగా.. ఈసారి ఏకంగా ఇళ్లల్లోకే దూరి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నిద్రపోతున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించి.. పరారైన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది..
అనంతారం గ్రామానికి చెందిన బచ్చల సుకన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.. రోజూలాగే ఆమె తన భర్తతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది.. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వారి ఇంటి కిటికీలకు ఇంకా గ్రిల్స్ అమర్చకపోవడమే దొంగలకు శాపంగా మారకుండా పోయింది.. అర్ధరాత్రి సుమారు 2:30 గంటల ప్రాంతంలో కిటికీని ఆసరాగా చేసుకున్న ఒక దొంగ గ్రిల్స్ లేని అందులో నుంచి ఇంట్లోకి దూరిపోయాడు.
గాఢ నిద్రలో ఉన్న సుకన్య మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అత్యంత చాకచక్యంగా కత్తిరించాడు. మెడలో ఏదో కదులుతున్నట్లు అనిపించి బాధితులు తేరుకుని లేచే లోపే.. ఆ దొంగ క్షణాల్లో బయటకు వెళ్లిపోయాడు.. బయట అప్పటికే సిద్ధంగా ఉన్న మరో దొంగతో కలిసి బైక్‌పై చీకట్లోకి పరారయ్యాడు.
పోలీసుల రంగ ప్రవేశం..
బాధితులు తేరుకుని దొంగ దొంగ అని కేకలు వేస్తూ.. దుండగుల వెంట పడినప్పటికీ.. వేగంగా బైక్‌పై వెళ్లిన కేటుగాళ్లు దొరకకుండా ఉడాయించారు. బాధితులు లబోదిబోమంటూ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జూలూరుపాడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి సారించి దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బరువు తగ్గడానికి తేనె, గోరువెచ్చని నీరు నిజంగా పనిచేస్తుందా?
Hyderabad, Telangana:Warm Honey Water: ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగడం చాలా మంది భారతీయులకు అలవాటుగా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాతో కొందమంది స్టార్స్ కూడా ఈ నీటినితాగడం వల్ల ఈ అలవాటు మరింత పెరిగింది. ఉదయాన్నే ఈ నీటిని తాగితే శరీరంలో కొవ్వు కరిగిపోయి.. వేగంగా బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతున్నారు. అయితే, ఈ పాపులర్ మార్నింగ్ డ్రింక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో? నిజంగానే తేనె నీరు బరువును తగ్గిస్తుందా? అనే అంశంపై ఆరోగ్య నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొవ్వును నేరుగా కరిగిస్తుందా?
గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల నేరుగా బరువు తగ్గుతారనడానికి లేదా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను స్పీడ్ కరిగిపోతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవుట.. తేనె అనేది ఒక సహజసిద్ధమైన తీపి పదార్థం.. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ.. తేనెలోనూ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి దీనిని పరిమితికి మించి తీసుకుంటే.. శరీరంలో క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. అలాగే, తేనె నీరు జీవక్రియను (Metabolism) పెంచి క్యాలరీలను కరిగిస్తుందనే.. ప్రచారం కూడా నిజం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఈ అలవాటు పూర్తిగా వ్యర్థమని నిపుణులు చెప్పకపోయినప్పటికీ.. దీనివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఎక్కువ క్యాలరీలు, అధిక చక్కెర ఉండే టీ, కాఫీ లేదా ప్రాసెస్ చేసిన జ్యూసులకు బదులుగా గోరువెచ్చని తేనె నీరు తాగడం వల్ల రోజూ తీసుకునే రిఫైన్డ్ షుగర్ పరిమాణం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. రోజూ ఉదయాన్నే ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరం రీహైడ్రేట్‌గా మారుతుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రాసెస్ చేయని (Raw Honey) లేదా కోల్డ్-ఎక్స్ట్రాక్టెడ్ తేనెను వాడితే అందులోని సహజమైన ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మంచి పోషకాలను కూడా అందిస్తాయి.
Also Read: కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!
శరీర బరువు తగ్గడం అనేది ఏ ఒక్క డ్రింక్తోనో సాధ్యమయ్యేది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సమతుల్యమైన పోషకాహారం, వ్యాయామాలు, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్లే శాశ్వత బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని తేనె నీరు అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం (Complementary Practice) మాత్రమే తప్ప.. అదే పూర్తి పరిష్కారం కాదని నిపుణుల సూచిస్తున్నారు.
Also Read: కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chennai Love Story Review: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..మనోడు మరో హిట్ కొట్టాడోచ్!
Hyderabad, Telangana:Chennai Love Story Movie Review: 'కలర్ ఫోటో', 'బేబి' సినిమాలతో నేషనల్ లెవల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత మారి ఎస్కేఎన్తో కలిసి నిర్మించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఈ సినిమా ఎంత వరకు రీచ్ అయిందో మన మూవీ రివ్యూలో చూద్దాం.Bandi Sanjay On NEET: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్!
Hyderabad, Telangana:Bandi Sanjay On NEET Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, వారి తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన తెలిపారు. దీంతో పాటు నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం, ఢిల్లీ ఆందోళనలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందించారు.
ఇటీవలే నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ వేగంగా స్పందించి, ఇప్పటివరకు 11 మంది ఫ్యాకల్టీ సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. దోషులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పడమే కాకుండా, కేవలం 40 రోజుల్లోనే తిరిగీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని వివరించారు.
ఆందోళనల వెనుక కుట్రలు
విద్యార్థుల ఆందోళనల ముసుగులో కమ్యూనిస్టు, కమ్యూనల్ శక్తులు ఢిల్లీలో తీవ్ర అరాచకాలను సృష్టించాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నిరసనల పేరుతో పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నుతూ, దేశ వ్యతిరేక నినాదాలు చేశారని మండిపడ్డారు. అలాగే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసులు, మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
"నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి ఆర్టికల్ 370 రద్దుకు, ఆజాద్ కాశ్మీర్ నినాదాలకు, బంగ్లాదేశ్-పాకిస్తాన్ రాజకీయాలకు ఏం సంబంధం? చివరికి సనాతన ధర్మానికి, రాముడికి, సీతమ్మకు నీట్ వివాదానికి లింక్ ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తాన్ సోషల్ మీడియా కుట్ర
ఆందోళనకారులు జరిపిన హింసలో 118 మంది పోలీసుల తలలు పగిలినా, వారు ఎంతో నిగ్రహంతో వ్యవహరించి తుపాకీ కాల్పులు జరపలేదని గుర్తుచేశారు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోయే క్రమంలోనే అరాచక శక్తులపై తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు.
ఈ ఆందోళనలకు పాకిస్తాన్ నుండి సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని తెలిపారు. దీనిని అరికట్టేందుకు పాకిస్తాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేసిందని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
Also Read: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
లింక్ క్లిక్ చేయక్కర్లేదు.. జీరో-క్లిక్‌తో ఫోన్లు హ్యాక్ చేస్తున్న ఇజ్రాయెల్!
Hyderabad, Telangana:Graphite Spyware Telugu Latest News: సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేయాలంటే.. ఏదో ఒక లింక్‌ను క్లిక్ చేయడమో.. లేదా ఒక తెలియని ఫైల్‌ను డౌన్లోడ్ చేయడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటూ ఉంటాము.. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే మీ స్మార్ట్‌ఫోన్ ఇతరుల అధీనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం వచ్చేసింది.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ పరాగన్ సొల్యూషన్స్ (Paragon Solutions) తయారు చేసిన గ్రాఫైట్ (Graphite) అనే అత్యంత శక్తివంతమైన స్పైవేర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏంటి ఈ జీరో-క్లిక్ ఎటాక్?
సాధారణంగా వచ్చే సైబర్ దాడులకు భిన్నంగా.. గ్రాఫైట్ స్పైవేర్ జీరో-క్లిక్ (Zero-Click) సాంకేతికతతో పనిచేస్తుందని సమాచారం. అంటే స్మార్ట్‌ఫోన్స్‌ను వినియోగించేవారు ఏ రకమైన నోటిఫికేషన్‌పై క్లిక్ చేయకపోయినా.. ఎలాంటి ఫైల్ డౌన్లోడ్ చేయకపోయినా ఈ స్పైవేర్ సైలెంట్‌గా ఫోన్లోకి ప్రవేశిస్తుందట.. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని లొసుగులను (Vulnerabilities) ఆసరాగా చేసుకుని.. వినియోగదారుడికి కనీసం అనుమానం కూడా రాకుండా ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి ఇది ఫోన్లోకి ప్రవేశించిందంటే.. ఇక ఆ ఫోన్ మీ నియంత్రణలో లేనట్లే..
హ్యాకర్ల చేతుల్లోకి డేటా ..
గ్రాఫైట్ స్పైవేర్ ఒకసారి డివైజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఫోన్లోని దాదాపు ప్రతి విభాగాన్నీ యాక్సెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపిన్నట్లు సమాచారం.. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న యాప్‌ల మెసేజ్‌లను కూడా ఇది ఎంతో సులభంగా సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్యాలరీలో ఉన్న వ్యక్తిగత డేటాను కూడా ఎంతో సులభంగా సేకరిస్తుంది.. మీ ఫోన్ నెట్వర్క్, మీరు మాట్లాడే వ్యక్తుల వివరాలను నిఘా వర్గాలకు చేరవేస్తుందని కంపెనీ తెలిపిన్నట్లు సమాచారం.. మీరు ఎక్కడున్నారో నిమిషాల వ్యవధిలో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది.
ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు?
తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పైవేర్‌ను ప్రధానంగా రాజకీయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, విలేకరులు, ఉన్నతాధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రభుత్వాలు లేదా నిఘా సంస్థలు తమ ప్రత్యర్థులపై లేదా అనుమానితులపై నిఘా పెట్టేందుకు ఇటువంటి సాధనాలను ఉపయోగిస్తున్నాయని డిజిటల్ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి..
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
