Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500076

రాచకొండ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు ఐపీఎస్

Jul 11, 2024 11:56:26
Hyderabad, Telangana
*రాచకొండ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సుదీర్ బాబు ఐపిఎస్* రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు ఐపిఎస్ నియమితులయ్యారు. ఈరోజు నేరేడ్మెట్ లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపిఎస్ రాచకొండ సిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 03, 2026 18:05:42
Rajamahendravaram, Andhra Pradesh:

 Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఒక పులి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి ఇప్పుడు రాజమండ్రి పట్టణ ప్రజలను వణికిస్తోంది. కొంత అటవీ ప్రాంతం కాకుండా జనారణ్యంలో పులి సంచరిస్తుండడంతో రాజమండ్రి తీవ్ర భయాందోళన నెలకొంది. పులి ఎటు వైపు వెళ్తుందో.. ఏం చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పులి సంచారంపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం ప్రకటించారు.

Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు

రాజమండ్రి పట్టణంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివా చెరువు హైవేపై కనిపించింది. ఎస్‌వీ పీసీ ఫంక్షన్ హాల్‌కి ఆనుకుని ఉన్న రోడ్డుపై తిరిగి.. పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు పెద్దపులి వెళ్లింది. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపుతోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ ప్రాంతానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆటో నగర్, దివాన్ చెరువు, కొంతమూరు, లాలా చెరువు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.

Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్‌ షర్మిల

ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో పులి సంచరించింది. ఉదయం గాడాల ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ పెద్దపులి పాదముద్రలు లభించాయి. గాడాల ప్రాంతం నుంచి దిశ మార్చుకొని రాజమండ్రి శివారులోని దివాన్ చెరువు ఆటోనగర్ ప్రాంతానికి పులి చేరుకుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్దపులి పది రోజుల కిందట తెలంగాణలోకి ప్రవేశించి..  కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బుట్టాయిగూడెం ప్రాంతంలోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ తొర్రేడు వద్దకు చేరుకుని జనావాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు వరి పొలాల వద్ద పులి సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాక మూడుచోట్ల పశువులను పులి చంపి తన ఆకలిని తీర్చుకుంది.

Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్‌ రాసలీలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్‌

 
 
 
 
 

కాగా రాజమండ్రి పట్టణ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో దానిని బందించేందుకు అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటుచేయగా.. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పులిని గాలిస్తున్నారు. కాగా రాజమండ్రి పట్టణంలో పులి సంచరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పులి సంచారంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 03, 2026 16:13:11
New Delhi, Delhi:

Yumnam Khemchand Singh: జాతుల మధ్య చెలరేగిన హింస మణిపుర్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో అక్కడ ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం తొలగిపోయి  రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తికానుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌కు కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకుంది.

Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు

దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైన బీజేపీ నాయకులు మణిపూర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్‌ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు మాజీ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ పక్ష నాయకుడిగా ఖేమ్‌చంద్‌ను ఎంచుకోగా.. మహిళా నాయకురాలు నెమ్చా కిప్‌జెన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మణిపుర్‌లో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వానికి పదవీకాలం 2027 వరకు ఉంది.

Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్‌ షర్మిల

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు 2023 మే నుంచి తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ఘర్షణలతో మణిపుర్‌ రాష్ట్రం అట్టుడుకిపోయింది. ఈ ఘర్షణలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించగా.. 250 మందికిపైగా మృతి చెందారని సమాచారం. ఇక ఈ ఘర్షణలతో మణిపూర్‌లో వేలాదిమంది నిరాశ్రయులు కాగా.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘర్షణలు, హింస చెలరేగడంతో నియంత్రించలేని బీజేపీ సీఎం బీరెన్‌ సింగ్‌ ఫిబ్రవరి 9, 2025లో తన పదవికి రాజీనామా చేశారు. అతడి రాజీనామాతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనతో కొంత ఘర్షణలు, హింసలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దుకుందని.. అంతేకాకుండా రాష్ట్రపతి పాలన ఏడాది ముగుస్తుండడంతో అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని నియమించారు.

Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్‌ రాసలీలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్‌

వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీన మణిపుర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. మణిపూర్‌ అసెంబ్లీలో బలాబలాలు పరిశీలిస్తే.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ ఉండగా.. అత్యధికంగా బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 6 మంది నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఐదుగురు, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ ఐదుగురు ఉన్నారు. ఇద్దరు కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ నుంచి ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీయూ 1, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ కన్నా అధికంగా సీట్లు ఉండడంతో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కొలుదీరబోతున్నది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 03, 2026 14:31:37
Amaravati, Andhra Pradesh:

Re Launch Nandi Awards: సినీ పరిశ్రమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులకు పేరు మార్చి అందిస్తుండగా.. ఏపీలో మాత్రం పుష్కర కాలంగా ఎలాంటి అవార్డులు లేదు. తాజాగా నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని సినీ పరిశ్రమకు తీపి కబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏప్రిల్ నుంచి అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్‌ షర్మిల

వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 పోటీల విజేతలను సత్కరించారు. అనంతరం మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారని మంత్రి దుర్గేశ్‌ తెలిపారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్‌ రాసలీలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్‌

ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. ఉత్తమ నటిగా సుజిత (మనం), ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా సాయి ప్రకర్ష (అబద్దం వర్సెస్ నిజం), ఉత్తమ నటుడు పవన్ శర్మ (మన్ను-మిన్ను), ఉత్తమ బాలనటి హర్షతున్నీసా, యంగ్ టాలెంట్ రిత్విక్ రెడ్డి (అస్త్ర), త్రివిక్రమ్ (డెబ్యూ డైరెక్టర్‌ ) విలన్ మీసాల భాస్కర్, తెలుగు స్క్రిప్ట్‌ పరిశీలకులు మంజులూరి లక్ష్మీపతి మాస్టర్, జగదీష్, ఉత్తమ దర్శకత్వం నరేష్ దోనె అవార్డులు పొందారు.

Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి

షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విజేతలు వీరే..
ప్రథమ బహుమతి: 'మహావృక్షం'. చంద్రశేఖర్ శకునాల (విశాఖపట్టణం)
ద్వితీయ బహుమతి: సింహాద్రి అప్పన్న, శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
తృతీయ బహుమతి: అబద్దం వర్సెస్ నిజం, నవీన్ కుమార్ (పాలకొల్లు)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
IPInamdar Paresh
Feb 03, 2026 12:12:12
Hyderabad, Telangana:

Pawan kalyan wife anna lezhneva visits Warangal Bhadrakali temple: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజీనోవా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయం సిబ్బంది ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అదే విధంగా సంప్రదాయ దుస్తుల్లో ప్రసిద్దమైన అమ్మవారి ఆలయంను అన్నా లెజీనోవా దర్శించుకున్నారు.  అక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు. ముఖ్య అర్చకులు వెంకట నాగరాజ శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మ వేదాశీర్వచనం అందించారు.

అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను పవన్ సతీమణికి అందజేశారు.  పవన్ సతీమణి భద్రకాళి అమ్మవారి ఆలయంకు  రావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పవన్ సతీమణితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల కరీంనగర్ లోని కొండగట్టు అంజన్నస్వామిని దర్శించుకున్నారు.

 ఇటీవల నాందేడ్ లోని గురుద్వారాను అన్నా లెజీనోవాతన భర్తతో పాటు కలిసి వెళ్లారు. అక్కడ తలపాగతో కలిసిదిగిన ఫోటోలు బాగా వైరల్గా మారాయి. తన కొడుకుకు గతంలో అగ్ని ప్రమాదంనుంచి బైటపడ్డాక అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి తరచుగా ఆలయాలను సందర్శిస్తు వార్తలలో ఉంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 09:47:59
Hyderabad, Telangana:

Shani Dev Effect On Zodiac Telugu: రాబోయే ఐదు నెలలు శని గ్రహం రెండుసార్లు సంచారం చేయడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని మొదటి నక్షత్ర సంచారంతో పాటు ఆ తర్వాత తిరోగమనం చేయబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏలినాటి శని తో పాటు ఇతర శని ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులపై ఊహించని ప్రభావం పడుతుంది. కాబట్టి వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఈ ఏడాది మే నెలలో శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. మే 17వ తేదీన ఈ గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ నక్షత్రానికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో శని బుధ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతుందని.. దీని కారణంగా ఆయారాశుల వారి జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవించే అవకాశాలున్నట్లు వారు తెలుపుతున్నారు.

ప్రస్తుతం శని సక్రమ మార్గంలో కొనసాగుతోంది. జూలై 2026 సంవత్సరంలో మీన రాశిలో ఉన్నప్పుడే శని తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం మొత్తం 138 రోజులపాటు తిరోగమన దిశలో తిరగబోతోంది. దీంతో డిసెంబర్ వరకు కొన్ని రాశుల వారిపై నేరుగా శని ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే..    మరికొన్ని రాశుల వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో? ఆరు నెలలపాటు ఎవరు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
కుంభరాశి 
కుంభ రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శని తిరోగమన ప్రభావంతో పాటు నక్షత్ర సంచార ప్రభావంతో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో భారీగా లాభాలను ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నిజాయితీగా వ్యాపారాలు చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే వీరు ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టడం కూడా చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

మీన రాశి 
మీన రాశి వారికి శని తిరోగమన ప్రభావం, నక్షత్ర సంచారం వల్ల ఉద్యోగాలపరంగా విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతోంది. అలాగే మీ జీవితంపై శని ప్రత్యేకమైన ప్రభావం పడి.. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వీరికి పెళ్లిళ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేషరాశి 
శని ప్రభావంతో మేషరాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఈ సమయంలో కొన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఖర్చులు భారీగా నియంత్రణలో ఉంటాయి. ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే అంతర్జాతీయ కంపెనీలో పనులు చేసే వ్యక్తులకు అద్భుతమైన బహుమతులు లభిస్తాయి. ప్రేమ జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా లావాదేవీలు చేసే క్రమంలో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 09:30:04
Hyderabad, Telangana:

Oppo K14x 5g Launch Date In India Telugu: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో వచ్చేవారం భారత మార్కెట్‌లోకి తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ఒప్పో k14 ఎక్స్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని వివరాలను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని రకాల ఫీచర్స్‌తో పాటు వేరియన్స్ వివరాలు లీకయ్యాయి. అవేంటో? ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఒప్పో K14x స్మార్ట్‌ఫోన్ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ డిస్ప్లే కంటే ప్రత్యేకమైన పెద్ద 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గతంలో విడుదల చేసిన ఒప్పో K13x 5G మొబైల్‌కి సక్సెస్‌గా విడుదల చేయబోతోంది.

ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ ఒప్పో k14 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గత మోడల్స్ కంటే అద్భుతమైన డిజైన్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కె సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది. 

ముఖ్యంగా ఈ మొబైల్ వెనక భాగంలో పిల్ ఆకారపు కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రత్యేకమైన కెమెరాలతో పాటు LED ఫ్లాష్ లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ColorOS 15 పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ కెమెరాలు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రెండు కెమెరాలు వివరాల్లోకి వెళితే.. ఇందులో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన కెమెరాలు ఉంటాయి. అలాగే 45 W ఛార్జింగ్‌ సపోర్టుతో ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీతో విడుదల కాబతునట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల వరకు నాన్ స్టాప్ వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను ఒప్పో కంపెనీ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కొత్త కలర్స్లో ఈ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 08:47:33
Hyderabad, Telangana:

Cobra Hood Video Watch Now: ఓ నగర శివారులో సాయంత్రం పూట నాగుపాము ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అయితే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వన్యప్రాణి సంరక్షకులు చేరుకొని ఆ పాముని రెస్క్యూ చేశాడు ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. మున్నా అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్న అత్యంత ప్రమాదకరమైన పామును ఓ డబ్బాలో బంధించాడు. ఇలా బంధించిన పామును వీడియో తీసి సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ తెల్లని ప్లాస్టిక్ డబ్బాలలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ను బంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. అలాగే ఆ డబ్బాలో పాము ఎంతో భయానకంగా పడగవిప్పి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం కూడా మీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము ఆకారం, దాని వెనక భాగంలో ఉండే పడగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆ పాము అలాగే పడక విప్పి ఉండిపోయింది.. స్నేక్ క్యాచర్ బృందం ఆ పాము ఎప్పుడైనా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వారు అక్కడే అది బయటికి రాకుండా కాపలాగా ఉండడం మీరు చూడొచ్చు 

సుమారు 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఆ కోబ్రా ఎంత ఉగ్రరూపం లో ఉందో మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ వీడియోలో ఆ పాము పదేపదే పడగలను అటు ఇటు కదుపుతూ.. తన రక్షణ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. స్నేక్ క్యాచర్స్ కూడా పాము కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డబ్బాలోనే బంధించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ పాము ఏమాత్రం బయటికి రాలేకపోయింది. 

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

గత కొద్ది రోజుల నుంచి ఇలా పాములు అడవుల్లో నుంచి జనాభాసాల మధ్యలోకి వస్తున్నాయి. ఇవి ప్రమాదమని భావించి కొంతమంది వీటిని చంపేస్తున్నారు.. నిజానికి ఇలా చేయడం వల్ల ప్రకృతికి ఎంతో హాని కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా వన్యప్రాణులను చంపే బదులు.. మీకు దగ్గరలో ఉన్న వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం మేలు. వాళ్లు ఇలాంటి పాములను పట్టికెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతారు. తద్వారా పర్యావరణ సమతుల్యత పెరుగుతుంది.

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 06:35:27
Jagtial, Telangana:

Jagtial Congress Telugu News: తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలవేళ అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా పగమన్నాయి.. టికెట్ల కేటాయింపులో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యతను ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

జగిత్యాలలో మున్సిపల్ వార్డుల వారిగా అభ్యర్థుల ఎంపికలు ఇప్పటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లకే అధిష్టానం టికెట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేకు అగ్ర పీఠం వెయ్యడం, గత కొన్ని ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన తమను కాదని ఎలా టికెట్లు ఇస్తారని సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తమను విస్మరించి టికెట్లు కేటాయించడం పెద్ద అన్యాయమని వారు అంటున్నారు.

అయితే టికెట్ల ప్రకటన నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టారు. గత కొన్నేళ్ల నుంచి కష్టపడుతూ వస్తున్న వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పెద్ద అన్యాయమని అంటూ కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటి ముందు నినాదాలు చేశారు.

మరోవై మొత్తం 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు కేటాయించారనే సమాచారం నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ-ఫామ్ల పంపిణీలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కార్యకర్తలు సంజయ్ నివాసం వద్ద నిరసన చేపట్టారు.

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో గత కొన్ని ఏళ్ల నుంచి క్రియాశీలకంగా కాంగ్రెస్కు పని చేస్తున్న జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, తన దగ్గరగా ఉన్న అనుచరులకు టికెట్లు దక్కకపోవడంతో అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ అంతర్గత రాజకీయ పోరు జగిత్యాల మున్సిపల్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్ లో పాత వర్సెస్ కొత్త అన్నట్లు పరిస్థితులు మారాయి. అయితే ఈ పరిస్థితిని తొందర్లోనే చక్కదిద్దే ఎందుకు రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 06:18:32
Hyderabad, Telangana:

Nara Lokesh Latest News Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహాయక సహకారాలు మరింత పొందేందుకు మంత్రి లోకేష్ ఈరోజు రాజధాని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. నేడు అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తర్వాత ఆయన తన పర్యటనను ప్రారంభించబోతున్నారు. మంత్రి లోకేష్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.. రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేసి.  బుధవారం ఉదయం నుంచి ఆయన కేంద్ర మంత్రులతో కలిసే అవకాశాలున్నాయి. 

రేపు ఉదయం లోకేష్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరస బేటీలు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీ రంగ విస్తరణతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై పలువురు మంత్రులతో చర్చించనున్నారు. అలాగే విద్యాసంష్కరణలతో పాటు నూతన విద్యాసంస్థల మంజూరుపై సంబంధిత మంత్రులతో మాట్లాడబోతున్నట్లు అధికారిక సమాచారం. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల మంజూరును కూడా కోరబోతున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రాయితీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసమే ఈ పర్యటన ప్రధాన అంశమని కొంతమంది రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ రేపు అర్ధరాత్రికి తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతేకాకుండా మంత్రి లోకేష్ జరిపిన చర్చల గురించి గురువారం లేదా శుక్రవారం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో చర్చించిన వివిధ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 05:31:38
Hyderabad, Telangana:

Realme p4 power 5g స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తగ్గింపు ధరికే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ లభించడమే కాకుండా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్‌ బోనస్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ఎక్స్చేంజ్‌ బోనస్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఇది చాలా చీప్ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో Real me P4 Power 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల 1.5K AMOLED HyperGlow 4D కర్వ్డ్ డిస్ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ భారత దేశంలో 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది.

అంతేకాకుండా ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లతో కూడా అందుబాటులో ఉంది. ఇక దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా (MediaTek Dimensity 7400 Ultra - 4nm) ప్రాసెసర్ తో విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో ఎంతో ప్రత్యేకతతో కూడిన 50MP Sony IMX882 (OIS) ప్రధాన కెమెరా ను కలిగి ఉంటుంది. దీనికి తోడు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతోపాటు 5 Android 16 ఆధారిత Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే IP66, IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను కూడా కలిగి ఉంది.

Real me P4 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జనవరి 29వ తేదీన భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో 128 Gb ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మొబైల్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీని అసలు ధర రూ.35,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి.. రూ.25, 999కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.3,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పేటీఎంతో పాటు కెనరా బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేసి దీనిని కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. దీనికోసం ఏదైనా ప్రీమియం బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.23 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. ఇది కేవలం రూ. 2,999కే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 05:15:11
Hyderabad, Telangana:

Aditya Mangal Yoga Effect On Zodiac 2026: ఫిబ్రవరి నెల గ్రహ సంచారాల పరంగా చాలా అద్భుతమైన భావించవచ్చు. ఎందుకంటే శతభిష నక్షత్రంలోకి కొన్ని ప్రత్యేకమైన గ్రహాల సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహ సంయోగం జరగబోతోంది. దీంతో ఈనెల మరింత కీలకం కాబోతో ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మార్చి మూడున కుజుడు ప్రవేశిస్తాడు దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. 

శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన మంగళదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మార్చి మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో ఈ సమయం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. ఎన్నో రకాల ఆర్థికమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
కుజుడు మేషరాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు.. కాబట్టి శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడు కలయిక జరపడం వల్ల మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కార్యాలయాల్లో క్రొత్త బాధ్యతలు లభిస్తాయి. అంతేకాకుండా ఈసారి అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి.

మిథున రాశి 
మంగళదిత్య రాజయోగంతో మిథున రాశి వారికి ఊహించని మేలు జరగబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన అన్ని రకాల పనులు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా సంపాదన అధికంగా ఉంటుంది. అలాగే పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు. విదేశీ పర్యటనలు చేయాలనుకుంటున వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. 

సింహరాశి 
మంగళదిత్య రాజయోగంతో సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ సమయంలో అత్యంత సానుకూలమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదురుచుకుంటారు. అంతేకాకుండా కార్యాలయాల్లో అనుకుంటున్న పనులు ఎంతో సులభంగా చేసి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పరిపాలన సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన ఒప్పందాలు కలుగుతాయి.

తులారాశి 
మంగళదిత్య యోగం ప్రభావంతో తులా రాశి వారికి కెరీర్ వరంగా పెద్దపెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రత్యర్ధుల నుంచి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఎంతో మేలు జరగబోతోంది. అలాగే సంబంధాలు ఇతరులతో మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 03, 2026 05:03:20
Hyderabad, Telangana:

Mercury And Rahu Transit Effect On Zodiac Telugu: 2026 సంవత్సరం రెండవ నెల ఫిబ్రవరి ప్రారంభంకానే అయింది. జనవరి నెల కంటే ఈ నెలకు మరింత ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే అనేక ప్రధాన గ్రహాలు ఈ నెలలోనే రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధానమైన గ్రహాలు సంచారం చేయడంతో ఆయా రాశుల వారికి ఆర్థికంగా చాలా మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.

ఫిబ్రవరి మూడవ తేదీన 9 గంటలకు బుధుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు. రాహువు ఇప్పటికే అక్కడ సంచారదశలో ఉన్నాడు.. దీని కారణంగా ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. బుధుడు రాహు గ్రహాలు దాదాపు ఒకే రాశిలో 25 రోజులపాటు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాల సంచార ప్రభావం దాదాపు 60 రోజులు పాటు ఉంటుంది.. అంటే ఏప్రిల్ 11 వరకు ఈ రెండు గ్రహాల ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగబోతోంది.. అయితే, ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి.

కర్కాటక రాశి 
ఎనిమిదవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. దీని కారణంగా వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధన తయారీ పరిశ్రమల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఇది మంచి సమయంగా భావించవచ్చు.. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్తమామలతో వివాదాలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకర రాశి 
మకర రాశి వారికి రెండవ స్థానంలో ఈ రెండు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి. కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి.. అలాగే ఏవైనా మాట్లాడేటప్పుడు కఠినంగా ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వీరి సంపాదన ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

తులారాశి 
తులా రాశి వారికి ఐదవ స్థానంలో బుధుడు రాహు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి దీని కారణంగా వీరికి సృజనాత్మకత ఊహించని స్థాయిలో పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, రచన, సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి పెద్దపెద్ద ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల చదువుల నుంచి కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఈ సమయంలో గందరగోళం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేషరాశి
రాహువు బుధుడు సంచారంతో మేష రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆదాయం పెరిగి సంపాదనలో మార్పులు కూడా సంభవిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. అలాగే ప్రేమ సంబంధాల్లో బాగోద్వేగా ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందగలుగుతారు సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top