దమ్మాయిగూడలో పేకాట డెన్‌పై ఎస్ఓటీ దాడులు, పది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
Secunderabad, Telangana:మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడలో పేకాట స్థావరంపై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసిన సంఘటన శనివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రియా కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ పై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి రెండు లక్షల నగదు, పది మొబైల్ ఫోన్లు, ప్లే కార్డులు లాక్కొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Union Cabinet: భారీ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
Baddipadaga, Telangana:Telangana Railway Projects: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రైల్వేకు సంబంధించిన కీలక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్‌తోపాటు 5 మల్టీట్రాకింగ్ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు చేపట్టడంతో రైళ్ల ట్రాఫిక్ తగ్గడంతోపాటు రైళ్ల సమయపాలన మెరుగుపడనుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా రైళ్లు కూడా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఇంధనం ఆదా అవడంతోపాటు ఫ్రైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్‌తో సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకును అదనంగా రవాణా చేసే అవకాశం ఉంది. బొగ్గు, ఐరన్ ఓర్, ఆహార ధాన్యాలు ప్రస్తుతం చేస్తున్న దానికంటే అదనంగా రవాణా చేసుకునే అవకాశం లభించనుంది.
సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన అందుబాటులోకి రానున్న ఈ రైల్వే లైన్ ద్వారా విజయవాడ, ముంబయి మార్గాలలో మెరుగైన రైలు ప్రయాణాలు సాగించడానికి మార్గం సుగమం కానుంది. అంతేకాకుండా ఈ మార్గంలో ఉన్న యాదాద్రి, స్వర్ణగిరి, సురేంద్రగిరి ఆలయాలను సందర్శించే భక్తులకు, భువనగిరి కోటను సందర్శించే పర్యాటకులకు కూడా ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ అనుకూలంగా మారనుంది. దీంతో పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైల్వే బడ్జెట్ కేటాయింపులు 21 రెట్లు పెరిగాయి. 12 సంవత్సరాల కాలంలో రూ.36,286 కోట్లను తెలంగాణకు కేటాయించారు' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని.. మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు సర్వే జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రైల్వే లైన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 42 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 6 రైల్వేస్టేషన్లను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ ప్రాజెక్టుతో అదనంగా సరుకు రవాణా ఇలా..
==> బొగ్గు 7.06 మిలియన్ టన్నులు
==> ఐరన్ ఓర్ 0.73 మిలియన్ టన్నులు
==> ఆహారధాన్యాలు 0.65 మిలియన్ టన్నులు
Telangana Police Jobs: పోలీస్ జాబ్ కోసం ఎదురుచూసే వారికి తెలంగాణ సర్కార్ తీపి కబురు
Baddipadaga, Telangana:Telangana Police Job Notification: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నియామకంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పోస్టుల సంఖ్య పెంచడం.. వయో పరిమితిని పెంచడం వంటి డిమాండ్లు చేస్తుండగా నిరుద్యోగుల స్పందనకు ప్రభుత్వం స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోసం పోటీ పడే వారి వయో పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలిబుచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాల్లోని కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మరో 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ జీఓ 129ను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్ని మాపక దళం, జైళ్లశాఖల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి గత నెల 29వ తేదీన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్
లాంగ్‌జంప్‌పై కూడా నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్ వస్తోంది. 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనను 3.8 మీటర్లకి తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లాంగ్‌జంప్ ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉందని వివరిస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ క్వాలిఫై 3.8 మీటర్లుగానే పరిగణిస్తున్నారనే విషయం ఉద్యోగ అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల ఎంపికలో ఈవెంట్స్‌లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనతో చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోతున్నారని వాపోతున్నారు. దీంతో వయో పరిమితి మాదిరి లాంగ్‌జంప్ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి.. లాంగ్ జంప్ నిబంధనను 3.8మీటర్లకు తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
వయో పరిమితిపై ఎమ్మెల్సీ విజ్ఞప్తి
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యం, నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో చాలా మంది నిరుద్యోగులు వయో పరిమితి మించిపోయి, అవకాశం కోల్పోతున్నారని వివరించారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు.. ఎస్సై ఉద్యోగానికి వయో పరిమితి 37 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వరకు పెంచాలని వినతిపత్రంలో ఎమ్మెల్సీ వెంకట్ కోరారు.
KTR: ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?.. గవర్నర్ తో భేటీ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:Brs ktr fires on cm revanth reddy govt after met with telangana governorచేతులు.. మోకాళ్లు నల్లగా మారాయా? మీ వంటింట్లోని ఈ 3 వస్తువులతో నలుపు మాయం!
Hyderabad, Telangana:Dark Elbows And Knees Remedies: మన పూర్వీకుల కాలం నుండి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మానికి ఎంతో మేలు చేయడమే కాకుండా మంచి నిగారింపును అందిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని డ్రై సమస్య నుండి కూడా కాపాడతాయి. చాలామందిలో మోచేతులు, మోకాళ్లు నలుపుగా మారిపోవడం మనం చూస్తుంటాము. వంటగదిలో ఉండే కొన్ని సహజమైన వస్తువులతోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ మాస్కులు నల్లగా మారిన మోచేతులు, మోకాళ్లకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కఠినమైన చర్మానికి మంచి నిగారింపును, ఈవెన్ స్కిన్ టోన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అయితే, ముందుగా ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. డెర్మటాలజిస్ట్ సూచనలు లేకుండా ఈ రెమెడీస్ పాటిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.
శనగపిండి, పెరుగు..
శనగపిండిని మన పూర్వీకుల కాలం నుండి సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇండియన్ స్కిన్ కేర్ రొటీన్లో వీటిని చేర్చుకోవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మంచి ఈవెన్ టోన్‌ను అందిస్తుంది. నల్లగా ఉన్న మోచేతులు మోకాళ్ల కోసం, ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని నలుపుగా ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి మాయిశ్చరైజేషన్ లభించి నలుపుదనం తగ్గుతుంది.
ఓట్ మిల్, తేనె మాస్క్..
ఓట్ మిల్ చర్మానికి మంచి నిగారింపును అందిస్తుందని, ముఖంపై ఉన్న నలుపుదనాన్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. దీన్ని స్క్రబ్బర్‌లా కూడా వాడవచ్చు, ఇది ఫిజికల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఓట్ మిల్‌తో కలిపి నలుపుగా ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం త్వరగా వదిలిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మానికి మంచి హైడ్రేషన్, మాయిశ్చర్ లభిస్తాయి.
Also Read: హోల్ మిల్క్ vs స్కిమ్డ్ మిల్క్.. గుండె ఆరోగ్యానికి ఏ పాలు బెస్ట్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
Also Read: తెల్ల జుట్టు, గ్యాస్ ప్రాబ్లమ్‌కి కరివేపాకుతో చెక్.. రోజూ ఇలా తీసుకోండి!
కలబంద, పసుపు మాస్క్..
కలబంద, పసుపు కలిపిన పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది. పసుపును మన పూర్వీకుల కాలం నుండి బ్యూటీ రొటీన్లో వాడుతున్నారు. కలబంద, పసుపు కలిపి రాయడం వల్ల మోచేతులు, మోకాళ్ల వద్ద ఉన్న నలుపుదనం తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబందలో ఒక చిటికెడు పసుపు వేసి, అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం తగ్గి, చర్మం ఈవెన్ స్కిన్ టోన్‌ను పొందుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: కళ్లు మూసుకుంటే ఎన్నికలు.. కురుక్షేత్రంలో పోరాడాలి: మాజీ సీఎం వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:Former CM YS Jagan Slams To Chandrababu In Tadepalli YSRCP Meeting Watch His WordsCollectors Conference: రేపటి నుంచి 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
Velgapudi, Andhra Pradesh:AP District Collectors Conference: అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో హామీలు.. పథకాలు ప్రకటించడంతోపాటు పరిపాలనాపరమైన నిర్ణయాలు, విధానపరమైన అంశాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిపై నిత్యం సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే జిల్లాల కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరగనుండగా.. రేపు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభం కానుంది. 10, 11వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుండగా దీనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు.
7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగనుందో తెలుసుకుందాం.
మొదటి రోజు
జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌కు జిల్లాస్థాయి రోడ్‌మ్యాప్‌లపై సమీక్షిస్తారు. సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు.
రెండో రోజు
సదస్సులో ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీ ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలు
EPF Advance Withdrawal: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్త రూల్స్..ఎన్నిసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు?
Hyderabad, Telangana:EPF Advance Withdrawal Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ వివిధ రకాల ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ నిధులను ఉపసంహరించుకునేందుకు స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. అత్యవసరాలు, ఇంటి అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు ముఖ్యమైన కేటగిరీల కింద ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు ఉపసంహరించుకోవచ్చో పరిమితులను స్పష్టం చేసింది.
వైద్య చికిత్సల కోసం ఎలాంటి పరిమితి లేకుండా ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వగా చదువు, వివాహం, ఇంటి నిర్మాణం, ప్రత్యేక పరిస్థితులకు పరిమిత సంఖ్యలో క్లెయిమ్‌లు చేసుకోవచ్చని వెల్లడించింది.
కేటగిరీ-1
అత్యవసరాలు (Emergency Needs) చందాదారుల వ్యక్తిగత, కుటుంబ సభ్యుల అత్యవసరాల కోసం ఈ క్రింది విధంగా ఉపసంహరణలకు అవకాశం కల్పించారు:
అనారోగ్యం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం చందాదారుడు తన మొత్తం సర్వీసు కాలంలో ఎన్నిసార్లయినా నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. దీనికి ఈపీఎఫ్‌వో నిబంధనలు వర్తిస్తాయి.
విద్య: వ్యక్తిగత లేదా తన కుటుంబ సభ్యుల చదువుల ఖర్చుల కోసం మొత్తం సర్వీసులో పది (10) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు.
వివాహం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల కోసం మొత్తం సర్వీసు సమయంలో ఐదు (5) సార్లు క్లెయిమ్ చేయవచ్చు.
కేటగిరీ-2
ఇంటికి సంబంధించిన అవసరాలు సొంత ఇంటి అవసరాలు, నివాస సదుపాయాల కోసం నిధులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇల్లు, భూమి కొనుగోలు, నిర్మాణం: ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయడానికి, గృహ నిర్మాణం చేపట్టడానికి, గృహ రుణ (Home Loan) చెల్లింపులకు, అలాగే ఇంటి మరమ్మతుల కోసం మొత్తం సర్వీసు కాలంలో ఐదు (5) సార్లు నగదును అడ్వాన్స్‌గా పొందే అవకాశం ఉంది.
కేటగిరీ-3
ప్రత్యేక పరిస్థితులు అనుకోకుండా ఎదురయ్యే ప్రత్యేక ప్రతికూల పరిస్థితుల్లో చందాదారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని అందించారు.
ప్రత్యేక పరిస్థితులలో విత్‌డ్రా..
ప్రకృతి విపత్తులు రావడం, లాకౌట్ లేదా సంస్థ మూసివేత జరగడం, ఉద్యోగం కోల్పోవడం, తీవ్ర రోగాల వ్యాప్తి సంభవించిన సమయాల్లో చందాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు (2) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో అందించే ఈ అడ్వాన్స్ సదుపాయం ద్వారా చందాదారులు తమ విభిన్న అవసరాలకు అనుగుణంగా నిబంధనలను అనుసరించి నిధులను డ్రా చేసుకోవచ్చు.
Also Read: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: అసెంబ్లీ వద్ద దాడిలో ఫేస్ మార్ఫింగ్, ఏఐ ఫొటోలు.. డీజీపీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు
Baddipadaga, Telangana:Telangana DGP: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఆవరణ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై విడుదలైన ఫొటోలు అన్నీ మార్ఫింగ్.. ఏఐతో చేసినవని తెలుస్తోంది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఫేక్ మార్ఫింగ్ అని, ఏఐ ఫొటోలు అని పేర్కొంటూ.. వాటిపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు డీజేపీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఏఐ ఫొటోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్‌ను బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఇమేజ్‌లు, దుష్ప్రచార కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తెలిపింది. అలాంటి వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
'తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, దురుసు ప్రవర్తన ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేక్ లేదా ఏఐ జనరేటెడ్ చిత్రాలను నిజమైనవిగా చూపిస్తూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడమే కాకుండా.. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది' అని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఫిర్యాదులో పేర్కొంది.
ఫేక్, మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ చిత్రాలు, పోస్టులను సైబర్ క్రైమ్ విభాగం వెంటనే గుర్తించి దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు. ఫేక్, మార్ఫింగ్, ఏఐ కంటెంట్‌ను రూపొందించిన.. అప్లోడ్ చేసిన, ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలని, సంబంధిత చిత్రాలపై సాంకేతిక ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, యూఆర్ఎల్లు, టైమ్‌స్టాంప్‌లు, మెటాడేటాను భద్రపరచాలని వినతిపత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. సైబర్ క్రైమ్, పరువునష్టం, తప్పుడు సమాచార ప్రచారం తదితర వర్తించే చట్టాల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పోలీస్ యంత్రాంగానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం గుర్తుచేసింది. రాజకీయ భేదాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కల్పిత డిజిటల్ కంటెంట్‌ను తయారు చేసి ప్రచారం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రకటించింది. ఇక అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై కూడా సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎమ్మెల్యేలు కోరారు. మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా, అత్యవసరంగా దర్యాప్తు నిర్వహించి, ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేసిన వారితో పాటు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు.
Ganesh Utsav: వినాయక చవితి ఉత్సవాలపై నారా లోకేశ్ శుభవార్త.. ఏమిటో తెలుసా?
Nuzendla, Andhra Pradesh:Ganesh Chaturthi 2026: వారంలో ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం వినాయక ఉత్సవ కమిటీలకు గుడ్‌న్యూస్ వినిపించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి కీలక విషయం తెలుపుతూ 'ఎక్స్' వేదికగా నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 'ఈ గణేశ్ చతుర్థి సందర్భంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్న ప్రజలకు అండగా నిలవడానికి.. ఈ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చడానికి మా ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది' అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 'వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించి.. హిందూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి వినాయక చవితి మంటపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రజల విశ్వాసానికి, ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.…
— Lokesh Nara (@naralokesh) September 9, 2026
రేపో, మాపో మార్గదర్శకాలు
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్‌పై ఇంకా స్పష్టత రాలేదు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటనపై రేపో, మాపో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్‌కు సంబంధించి ముందస్తుగా గణేశ్ ఉత్సవ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మీ సేవ లేదా.. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచిత విద్యుత్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
https://t.co/b5qyZHqGP0ప్రతి సోమవారం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే…
గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.@naralokeshవినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించి, హిందూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ
— PVN Madhav (Modi Ka Parivar) (@MadhavBJP) September 9, 2026
YS Jagan Padayatra: పాదయాత్ర షెడ్యూల్‌పై వైఎస్ జగన్ కీలక ప్రకటన..వచ్చే దసరా నుంచి షురూ!
Nunna, Vijayawada, Andhra Pradesh:YS Jagan Padayatra 2.0 Announcement: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర షెడ్యూల్‌పై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిందని.. మరో ఆరు నెలల్లో మూడేళ్లు గడిచాక.. తన పాదయాత్రను మొదలుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అనగా 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నెల నుంచి తన పాదయాత్రను ప్రారంభించినున్నట్లు వైఎస్ జగన్ తాజాగా వెల్లడించారు.YS Jagan: పాదయాత్ర 2.0 ఎప్పుడో చెప్పిన మాజీ సీఎం వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YSRCP Chief YS Jagan Announces Padayatra On 2027 September Or October Watch VideoChandrababu: మూడేళ్ల కిందట అరెస్ట్.. జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:Chandrababu Jail: 'మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. తాను 48 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని.. 31 ఏళ్ల కిందట తొలిసారి సీఎం అయినట్లు చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలని.. పేదలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ జరిగిన ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నైజాన్ని.. అతడిపై మాజీ సీఎం రోశయ్య వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'చాలా మంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. నాపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయలేక పోయారు. అదే నా నిబద్ధత' అని ప్రకటించారు.
'రాజకీయంపై కుటుంబం ఆధారపడకూడదనే 36 ఏళ్ల కిందట ఫ్యామిలీ బిజినెస్ ప్రారంభించాం. అప్పట్లో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కుటుంబ వ్యాపారాన్ని నా భార్యకు అప్పగించా' అని సీఎం చంద్రబాబు తెలిపారు. తనకు ధన వ్యామోహం లేదని స్పష్టం చేశారు. కేవలం తెలుగు జాతి బాగుండాలనే నిరంతరం ఆలోచన చేస్తానని చెప్పారు. 'నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారు. నాపై ఆరోపణలు ఏమిటో చెప్పాలని అడిగితే అరెస్టు చేసిన తర్వాత చెబుతామని అన్నారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
50 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, విలువలకే ప్రాధాన్యం ఇచ్చాను. సెప్టెంబర్ 9న తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేశారు. ఆ కష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి అందించిన మద్దతు నా జీవితంలో మర్చిపోలేను. #NijamGelichindi#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/URjQhT19fB
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2026
'ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉన్న పళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నా జీవితంలో ఎన్నడూ అనుకోని సంఘటన ఓ దుర్మార్గమైన వ్యక్తి ఆలోచనలతో జరిగింది. నేను జైల్లో ఉన్న సమయంలో నాకేం జరుగుతుందోనని తెలుగు జాతి మొత్తం రోడ్లపైకి వచ్చింది' అని చంద్రబాబు వివరించారు. పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే అడ్డుకున్నారని చెప్పారు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తనకు ఆయన సంఘీభావం తెలిపారని తెలిపారు.
'గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయి. ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చింది. గతంలో అచ్చెన్నాయుడు లాంటి నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. వేధింపులు చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపేశారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిముషం చాలు అని.. కానీ తాను ఆ పని చేయలేదని చెప్పుకొచ్చారు.
'నేను చాలా సౌమ్యంగా ఉంటా. ఏం చేయలేకపోతున్నారని చాలా మంది అనేవారు. కానీ నాకు సహనం ఎక్కువ. నేను చేసే ఏ పని అయినా అది తెలుగు జాతికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'మాజీ సీఎం వైఎస్సార్‌కు ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆనాడే చెప్పా. గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని ఆయన తండ్రి వైఎస్సార్ చదువుకోవడానికి అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చేశాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు' అని చంద్రబాబు ఆసక్తికర విషయం తెలిపారు.
'కొడుకుతో బాధలు భరించలేక అతడిని వైఎస్సార్ బెంగళూరులోనే ఉంచారని తల్లి విజయమ్మ మాజీ సీఎం రోశయ్యకు చెప్పుకుని బాధపడ్డారు. రోశయ్యే స్వయంగా ఈ విషయం చెప్పారు. ఓ సీఎంగా ఉన్న వ్యక్తి తన కుమారుడిని బెంగుళూరులాంటి చోట పెట్టాడు. అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకును ఎప్పుడూ ఏపీకి రానీయలేదని గుర్తుచేశారు.
'బాబాయి వివేకాను గొడ్డలి వేటుతో కిరాతకంగా చంపేశారు. తెల్లవారితే సీఎంగా ఉన్న నాపై నింద వేసి తన పత్రికలో రాయించారు. తన చెల్లి సునీతను కూడా ఏమార్చారు. ఆ రోజే దోషులందరినీ అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా?. ఇప్పుడు తల్లిని, చెల్లినీ కూడా ఆస్తి కోసం మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చింది' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Hyderabad, Telangana:TGEJAC Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం TGEJAC ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ (PRTUTS)ల ఉమ్మడి ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 10, 2026) నిర్వహించనున్న 'చలో హైదరాబాద్ - ఉద్యోగుల హక్కుల సాధన సభ' తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తొలుత ఈ కార్యక్రమానికి వేలాదిగా ఉద్యోగులు, పెన్షనర్లు తరలి రావడానికి ప్లానింగ్ జరగ్గా..తాజాగా ఈ ఆందోళనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.Wife And Husband: భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయనందుకు భార్య ఆత్మహత్య
Mahabubabad, Telangana:Wife Ends Her Life After Husband Deny To Video Call In Warangal Watch VideoBank Holidays: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Hyderabad, Telangana:Bank Strike Holiday: వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య సెప్టెంబర్ 11న సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మెకు తోడు వరుసగా సెలవులు రావడం వల్ల బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 11న బ్యాంకు సమ్మె జరగనుండగా, సెప్టెంబర్ 12 రెండో శనివారం సెలవు, సెప్టెంబర్ 13 ఆదివారం వారపు సెలవు, సెప్టెంబర్ 14న గణేశ చతుర్థి ప్రభుత్వ సెలవుదినం ఉన్నాయి. ఈ విధంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండుగ సమయంలో బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే ప్రజలు ఈ అంతరాయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎంలు, నగదు లావాదేవీలపై ప్రభావం
బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూసివేసి ఉండటం వల్ల వివిధ బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తున్నప్పటికీ, నిరంతర సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు నింపే సేవల్లో ఆలస్యం జరగవచ్చు. దీని ఫలితంగా కొన్ని ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో నగదు వాడకం పెరుగుతుంది కాబట్టి ఏటీఎంల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎక్కువగా ప్రభావితమయ్యే వర్గాలు
ఈ నాలుగు రోజుల నిరంతర సెలవుల వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ నగదు లావాదేవీలు చేసే పారిశ్రామికవేత్తలు, పింఛనుదారులు, బ్యాంకింగ్ సేవలపై నేరుగా ఆధారపడేవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయాలనుకునేవారు ఆలస్యాన్ని నివారించడానికి ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఖాతాదారులకు ముందస్తు జాగ్రత్తలు
పండుగ పూట ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిపుణులు వినియోగదారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర ఖర్చుల కోసం అవసరమైన నగదును ముందే విత్‌డ్రా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
డిజిటల్ బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకుని ఉపయోగించుకోవాలి. ముందస్తు లావాదేవీలు అనగా.. పండుగకు ముందే ప్రధాన ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవాలి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లతో సహా బ్యాంకింగ్ సేవలను ముందుగానే ఉపయోగించుకోవడం మంచిది.
భవిష్యత్ సమ్మె హెచ్చరిక
సెప్టెంబర్ 11న జరగనున్న సమ్మె తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే, సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మరో మూడు రోజుల సమ్మెకు దిగుతామని బ్యాంక్ ఉద్యోగుల సంఘాల సమాఖ్య హెచ్చరించింది. ఈ ప్రకటన బ్యాంకు ఖాతాదారులలో మరింత ఆందోళన రేకెత్తించింది. కాబట్టి ప్రజలు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే చేసుకోవడం చాలా అవసరం.
Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Also REad: ఇళ్లు లేని వాళ్లకు గుడ్‌న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
