మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడలో పేకాట స్థావరంపై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసిన సంఘటన శనివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రియా కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ పై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి రెండు లక్షల నగదు, పది మొబైల్ ఫోన్లు, ప్లే కార్డులు లాక్కొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.