Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Medchal-Malkajgiri500013

ఎమర్జెన్సీ స్వేచ్ఛను దూరం చేసింది: బీజేపీ నేత లక్ష్మణ్

Jun 26, 2024 04:21:26
Hyderabad, Telangana

స్వేచ్ఛను హరించివేసిన ఎమర్జెన్సీ: భారతీయ జనతా OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు డా. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో లక్ష్మణ్ డా. ముఖ్యఅతిథిగా లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా డా. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఇందిరాగాంధీ నియంతలా, నిరంకుశలా వ్యవహరించి ఎమర్జెన్సీ విధించారని గౌతంరావు అన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 22, 2026 18:29:37
Wadgaon, Maharashtra:

Samvadini App: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా ఇప్పటివరకు విదేశీ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నారు. ఆ స్థానంలో దేశీ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వచ్చింది. వ్యక్తిగత భద్రత.. గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ.. ఫోన్‌ నంబర్‌ లేకుండానే అభివృద్ది చేశారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తత.. ఆర్థిక మోసాలు, స్పామ్‌, డిజిటల్‌ అరెస్ట్‌ వంటివి నేపథ్యంలో వాటిపై అప్రమత్తత వ్యక్తం చేసేలా దేశీయ ఏఐ ఆధారిత సాధనం తీసుకువచ్చారు. వాటి పేర్లే సంవధిని,  నిలబెట్టుకుంటారు.

Also Read: Revanth Reddy: సిద్దిపేట గడ్డపై రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్‌ రావును ఓడిస్తే మంత్రి పదవి ఆఫర్

సైబర్‌ నేరగాళ్లు మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుండడంతోపాటు దేశానికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. విదేశీ సర్వర్‌లలో వాటి వివరాలు నిక్షిప్తమవడంతో తర్వాత చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యక్తిగత భద్రత, జాతీయ భద్రతకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో విదేశీ ఏఐ ఆధారిత సంస్థలు ఏర్పాటయ్యాయి.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

సురక్షితమైన కమ్యూనికేషన్‌ కోసం అనువధిని ఏఐ రెండు యాప్‌లను పరిచయం చేసింది. అయితే దేశీ ఏఐ జెన్‌జీ కీబోర్డును ప్రోత్సహించింది. గృహపరంగా డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ లక్ష్యంగా గోప్యత, భద్రతపై దృష్టిపై సారించింది. దేశీ ఏఐ విషయమై అనువధిని ఏఐ సీఈఓ డాక్టర్‌ బుద్దా చంద్రశేఖర్‌ వివరిస్తూ.. 'విదేశం నుంచి దేశీయంగా సురక్షితంగా మన భాషలో.. మన దేశంలో కమ్యూనికేషన్‌ చేసుకోవచ్చు' అని వెల్లడించారు.

హైప్డ్‌ సంవదిని, దేశీ ఏఐ జెన్‌జీ కీ బోర్డును ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులంతా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. హైప్డ్ సంవాదిని వాట్సప్ తరహాలో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని పొందుపరచడంతో ఇది సైబర్ మోసాలను నియంత్రిస్తోందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

సంవధిని ఫీచర్లు ఇలా

  • మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండా సంవధిని పనిచేస్తుంది. బహు భాషల్లో సందేశాలు పంపడంలో రూపొందించారు.
  • ఈ ప్లాట్‌ఫామ్‌లో చాట్‌ ఐడీలు ఉంటాయి.
  • ఈ హైప్డ్ సంవాదినిలో వన్ టు వన్, గ్రూప్, బ్రాడ్ కాస్ట్ మెసేజ్‌లు భద్రంగా.. ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్‌కు అవకాశం ఉంది. 55కి పైగా భాషల్లో రియల్‌టైమ్ అనువాదం (ట్రాన్స్‌లేషన్) అందుబాటులో ఉండడం.
  • ఈ యాప్‌ 55 భాషల్లో అందుబాటులో ఉండగా.. రియల్‌ టైమ్‌ అనువాదం చేస్తుంది. వాయిస్‌ను టెక్స్ట్‌గా.. టెక్ట్స్‌ను వాయిస్‌గా మారుస్తుంది. స్టేటస్‌ అప్‌డేట్‌తోపాటు బహుభాషల్లో సహాయం అందించడం, గోప్యత కంట్రోల్‌ అనే మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
  • భద్రతాపరంగా చూస్తే వన్‌ టాప్‌ ఎస్‌ఓఎస్‌ సిస్టమ్‌ లైవ్‌ లొకేషన్‌తోపాటు అత్యవసర సమయంలో ఇతరులను అప్రమత్తత వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది.
    బహుభాషా సామర్థ్యాన్ని కలిగి ఉండడం
  • అనువాదిని ఏఐ అత్యాధునిక సాంకేతికతతో 22 భారతీయ, 37 విదేశీ భాషల్లో రియల్ టైమ్ టెక్ట్స్‌తోపాటు వాయిస్ అనువాదం.
  • ఏఐ ద్వారా అభివృద్ధి చేసిన ఈ రెండు యాప్‌లు పూర్తి స్వదేశీ డిజిటల్ పరిష్కారాలు అని అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1058
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 13:46:36
Siddipet, Telangana:

Siddipet MLA Harish Rao: ఓటమి ఎరుగకుండా దశాబ్దాలుగా సిద్దిపేట నుంచి గెలుస్తున్న హరీశ్‌ రావుకు ఓటమి రుచిచూపించేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించిన నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను మంత్రిగా చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Also Read: Garikapati On Anushka: 'దీని దుంపతెగ.. అన్నీ అవయవాలు అలా ఉన్నాయి'.. హీరోయిన్‌ అనుష్కపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం. ఎన్నికలు లేనప్పుడు ప్రాంతాల అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీకి సూచించారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చే నిధులపై వివక్ష చూపించే వ్యక్తి తాను కాదని.. హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

దశాబ్దాలుగా సిద్దిపేటలో ఒక కుటుంబాన్ని గెలిపిస్తున్నారని.. ఈసారి సిద్దిపేటలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 'గత పాలకులు విపక్ష నాయకుల నియోజకవర్గాలపై వివక్ష చూపించారు. నేను నాయకులతో వ్యతిరేకిస్తాను కానీ ప్రజలపై వివక్ష చూపను' అని స్పష్టం చేశారు. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చానని.. వివక్ష చూపేవాడినైతే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడినని తెలిపారు. 'వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తా' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: BC Budget: బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ మోసం.. రేవంత్‌ రెడ్డి బీసీ వ్యతిరేకి: ఆర్‌.కృష్ణయ్య

నర్మెట్ట సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సిద్దిపేటలో ఓటమి లేకుండా గెలుస్తున్న హరీశ్‌ రావును ఓడించేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచిస్తోందని అర్థమవుతోంది. ఓటమి కాదు కదా సిద్దిపేట నుంచి మెజార్టీలో రికార్డులు తిరగరాస్తున్న హరీశ్‌ రావును రాజకీయంగా దెబ్బతీయాలని కాంగ్రెస్‌ ఇప్పటికే కుయుక్తులు పన్నుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సిద్దిపేట నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ స్థానాలు సొంతం చేసుకోవడంతో హరీశ్‌ రావును దెబ్బతీసేందుకు రేవంత్‌ రెడ్డి నర్మెట్ట సభను ఉపయోగించుకున్నారు. అయితే ఎవరెన్ని వచ్చినా కూడా హరీశ్‌ రావును సిద్దిపేట నుంచి వేరు చేయలేరని రాజకీయ మేధావులు చెబుతున్నారు. వచ్చే పదేళ్లలో హరీశ్‌ రావును ఓడించడం అనేది కలగా పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1053
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 11:39:01
Hyderabad, Telangana:

EPF ATM Withdrawal News: దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) అతిత్వరలోనే ATM ఆధారిత నగదు ఉపసంహరణలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ద్వారా ఈపీఎఫ్‌లో పొదుపు చేసిన డబ్బును క్షణంలో పొందవచ్చు. ATM ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు సులభతం చేసినా.. ప్రస్తుత ఉపసంహరణ, పన్ను నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి. ఉద్యోగులు ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే చేసే నగదు ఉపసంహరణపై TDS విధించిన తర్వాత తుది చెల్లింపులు తగ్గుతాయి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ATM ఆధారిత విత్‌డ్రాయల్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల చందాదారులు విత్‌డ్రా చేసేందుకు ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పనిలేకుండా ఏటీఎం ద్వారా నగదు తక్షణమే పొందవచ్చు. యూజర్-ఫ్రెండ్లీ సేవలను అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో ఇది ఒక భాగం.

దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు తమ EPF బ్యాలెన్స్‌లో కొంత భాగాన్ని నేరుగా ATMలు లేదా UPI ద్వారా విత్‌డ్రా చేసుకోగలుగుతారు. దీనివల్ల వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. అర్హత షరతులను బట్టి, బ్యాలెన్స్‌లో 50–75 శాతం వరకు పొందవచ్చని ఈపీఎఫ్‌ నివేదిస్తుంది. అయితే ఈ ఏటీఎం విత్‌డ్రా నిబంధనను ఏప్రిల్ రెండో వారం లేదా ఏప్రిల్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

అయితే నగదు ఉపసంహరణకు మినహాయించి మిగిలిన వాటి నిబంధనలు ఏమాత్రం మారలేదు. సాధారణంగా పదవీ విరమణ లేదా నెలల తరబడి నిరుద్యోగం కారణంగా పూర్తి ఉపసంహరణకు వెసులుబాటు ఉంది. అయితే వైద్య అవసరాలు, విద్య లేదా గృహవసతి వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది.

ఇందులో అతిపెద్ద చిక్కు పన్నుల విధింపు. మీరు ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసును పూర్తి చేయకముందే EPF నుండి డబ్బు తీసుకుంటే, అది పన్ను పరిధిలోకి వస్తుంది. అలాంటి సందర్భాల్లో TDS కట్ చేస్తారు. దీంతో మీరు రిటైర్మెంట్ తర్వాత వచ్చే సెటిల్మెంట్‌లో నగదు వ్యత్యాసం రావొచ్చు.

ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే విత్‌డ్రాయల్ రూ.50,000 దాటితే, పాన్ (PAN) సమర్పించినట్లయితే 10 శాతం టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. పాన్ (PAN) లేకుండా నగదు డ్రా చేస్తే దాదాపుగా 20 శాతం పన్ను కింద కోత విధిస్తారు. దీనివల్ల మీరు అందుకునే మొత్తం మరింత తగ్గుతుంది. మీరు ఉద్యోగంలో కనీసం ఐదేళ్ల సర్వీసును పూర్తి చేస్తేనే EPF విత్‌డ్రాయల్స్ పన్ను రహితంగా ఉంటాయి. ముందుగా విత్‌డ్రాయల్స్ చేస్తే TDS వర్తించడమే కాకుండా, ఆ సంవత్సరానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కూడా అది జోడించే అవకాశం ఉంది.

అత్యవసరం అయితే తప్ప, గడువుకు ముందే ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దానికి బదులుగా.. మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీ EPFను బదిలీ చేసుకోవడం ద్వారా ఖాతాలో కొనసాగింపు ఉంటుంది. భవిష్యత్తులో పన్ను రహిత విత్‌డ్రాను కూడా పొందవచ్చు. అర్హత ఉన్నట్లయితే, ఫారం 15G లేదా 15H సమర్పించడం ద్వారా కూడా TDSను తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు.

Also Read: RGUKT Holiday News: తెలంగాణలో విద్యార్థులకు షాకింగ్ న్యూస్..రేపటి నుంచి నాన్‌స్టాప్ సెలవులు..ఎందుకంటే?

Also Read; LPG Gas Shortage: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్ ఉచితం..పంపిణీ అప్పుడే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

1098
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 22, 2026 11:20:48
Hyderabad, Telangana:

 Giant Python Meat Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని రోజు ఎన్నో వింతలతో పాటు ఆశ్చర్యం కలిగించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సాధారణంగా మాంసం దుకాణాల్లో కోళ్లతో పాటు మేకలు లేదా గొర్రెల మాంసాన్ని విక్రయించడం మనందరం రోజు చూస్తూ ఉంటాం. కానీ తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే.. అత్యంత భయంకరమైన భారీ పరిమాణంలో ఉన్న ఒక కొండచిలువను ముక్కలుగా కోసి బహిరంగ విక్రయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను బిత్తరపోయేలా చేస్తున్నాయి..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మాంసం దుకాణంలో యజమాని ఏమాత్రం భయపడకుండా భారీ కొండచిలువను టేబుల్ పై ఉంచి.. దానిని చిన్న చిన్న ముక్కలుగా నరకడం మీరు గమనించవచ్చు.. దుకాణానికి వచ్చిన కస్టమర్లు కూడా అదేదో మామూలు మాంసం అన్నట్లుగా చూస్తూ ఉండడం గమనార్హం.. అంతేకాకుండా ఆ షాప్ కి వచ్చిన కస్టమర్లు కూడా అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను ముట్టుకొని దాని మాంసాన్ని అటు ఇటు అనడం మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు..

అంతేకాకుండా ఆ దుకాణం ముందు భాగంలో ఆ కొండచిలువ తల నుంచి నడుము భాగం వరకు వేలాడదీయడం కూడా మీరు చూడొచ్చు. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం స్పష్టత లేకపోయినప్పటికీ.. ఆగ్నేయాసియాలోని దేశాల్లో ఏదో ఒక మార్కెట్ అయి ఉండవచ్చని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 
 
 
 
 

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో షేర్లతో పాటు లైకులు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వన్యప్రాణులను ఇలా బహిరంగంగా చంపి మాంసం గా అమ్మడం చెడ్డ విరుద్ధం కాదా అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో ప్రశ్నలు పెడుతుంటే.. ఇక మరి కొంతమంది ఇలాంటి అడవి జంతువుల మాంసం తినడం వల్ల కొత్త రకమైన వైరస్తులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక మరికొంతమంది ఆ తలను.. అలా వేలాడదీయడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.. కామెంట్లు పెడుతున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

భారతదేశంతో సహా మెజారిటీ దేశాల్లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కొండచిలువను చంపడం లేదా వాటి మాంసాన్ని అమ్మడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. విచ్చల వీడిక అడవి జంతువులను వేటాడి విక్రయించే ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వీడియోస్ స్పష్టంగా గమనించి చూస్తే.. భారతదేశంలో కాకుండా మరేదో దేశంలో జరిగినట్లు తెలుస్తోంది..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

1085
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 10:43:48
Hyderabad, Telangana:

Telangana RGUKT Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు ముఖ్యగమనిక. రేపటి నుంచి వరుస సెలవులను ప్రకటించింది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ అండ్ టెక్నాలజీస్ యాజమాన్యం. బాసరలోని ఈ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఇటీవలే అనుమానాస్పదంగా మృతి చెందిన కారణంగా నిరసనలు తెలియజేసేందుకు విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ కాలేజీ యాజమాన్యం మార్చి 23 నుంచి నిరవధిక సెలవులను ప్రకటించింది. క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదని విద్యార్థులు ఆరోపించడంతో పాటు, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మెదక్ జిల్లాకు చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మరణంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ మృతికి నిరసనగా విద్యార్థి చేస్తున్న ఆందోళనలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) మార్చి 23 నుంచి సెలవులను ప్రకటించింది.ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC) ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు.. అలాగే ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. 

విద్యార్థిని మృతి తర్వాత క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదని ఆరోపిస్తూ జరుగుతున్న నిరసనల నేపథ్యంలో, విద్యా క్యాలెండర్‌కు అంతరాయం కలగకుండా నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం జారీ చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. అయితే క్లాసులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని వారు అన్నారు. దీంతో విద్యార్థులు ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

మెదక్ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన 17 ఏళ్ల తేజస్విని, లుకేమియా వ్యాధితో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 16న మరణించింది. తేజస్విని మృతికి కారణం క్యాంపస్‌లో వైద్య సౌకర్యాలు సరిగా లేకపోవడమే అనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తేజస్విని మృతికి న్యాయంగా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మార్చి 17న నిరసనలు చేపట్టారు. 

యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసి, న్యాయం కోరుతూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, తేజస్విని తల్లిదండ్రులు ప్రభుత్వం న్యాయం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారు శుక్రవారం ఆర్‌జీయూకేటీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.

Also Read: LPG Gas Shortage: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్ ఉచితం..పంపిణీ అప్పుడే?

Also Read; Petrol Rate Today: ఇంధన ధరలపై యుద్ధ ప్రభావం..నిన్న భారీగా పెరిగిన పెట్రోల్ ధర..ఈరోజు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1084
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 10:02:55
Hyderabad, Telangana:

LPG Gas Shortage News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌తో చర్చలు జరిపి భారత్‌కు ముడిచమరు, గ్యాస్ తీసుకురావడంలో దౌత్యం ఫలించింది. తాజాగా అందుకు సంబంధించిన నౌకలు కూడా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఓ కీలక ప్రకటన చేసింది. గత మూడు వారాలుగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా ఇప్పుడు పరిశ్రమలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. 

ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక నిర్ణయాన్ని వెలువరించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను తక్షణమే 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు, హెటళ్లు, డాబాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యథావిధిగా హోటళ్లు తెరచుకోనున్నాయి. 

అయితే పెంచిన సరఫరాలో మొదటగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లకు కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని మోదీ సర్కార్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మరోవైపు వలస కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే నిర్ణయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖను రాసింది. అయితే వలస దారులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

అయితే గ్యాస్ వినియోగంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను జారీ చేసింది. వలస కూలీలు, కమర్షియల్ యూజర్లు  సంబంధిత యాప్‌ల ద్వారా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. కేవలం సరఫరాను క్రమబద్ధీకరించే వరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: LPG Gas Price Hike 2026: భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..ఇప్పుడే బుక్ చేసుకోండి! కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1045
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 09:11:07
Nuzendla, Andhra Pradesh:

Garikipati Narasimha Rao On Anushka Shetty: తెలుగులో అద్భుతమైన ప్రవచనాలు చేస్తూ గుర్తింపు పొందిన గరికిపాటి నరసింహా రావు ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో తన ప్రవచనాలతో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే గరికిపాటి నరసింహారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్‌ అనుష్క శెట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వీడియో చక్కర్లు తిరుగుతోంది. గతంలో ఓ సమావేశంలో పాల్గొన్న గరికిపాటి నరసింహారావు తన కొడుకుతో జరిగిన సంభాషణను వివరించారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఫొటోను తాను తన కుమారుడు చూశాడని గరికిపాటి చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య అనుష్క ఫొటో విషయమై జరిగిన సంఘటన వెల్లడించారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటో తనను.. తన కొడుకును ఆకర్షించింది.. దానిలో తప్పేం లేదని ప్రకటించారు.

Also Read: Cyber Crime: ఆర్‌టీఏ చలాన్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసం.. జనసేన ఎమ్మెల్యే రూ.12 లక్షలు నష్టం

'నేను ఒకసారి పేపర్‌ అలా చూస్తుంటే ఏమిటుంది కుర్రాళ్లు ఎందుకు ఇలా చూస్తున్నారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉన్న ఓ ఫోజు.. ఓ స్టిల్‌ ఇచ్చింది' అని గరికిపాటి నరసింహారావు తెలిపారు. 'మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. వాడేమిటో నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. స్నానం చేసిన వచ్చి నా కాళ్లకు దండం పెట్టడానికి కూర్చున్నాడని ఆశీర్వాదం చేద్దామనుకున్నా. లేదు కానీ వాడు అనుష్క ఫొటో చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడు ఉన్నాడు నా ధోరణిలో నేను ఉన్నాడు. దానికేముంది? ఇప్పుడు ఎవడికి కావాల్సినది వాడు చూసుకుంటున్నాడు' అని గరికిపాటి నరసింహారావు తెలిపాడు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

'ఏమిటి రా అంటే ఏమీ లేదని వెళ్లిపోయాడు. మన దృష్టి తిన్నగా ఉండదు కదా? నేను చూసేసరికి.. వీడు ఈ అమ్మాయిని చూశాడంటే తప్పేం లేదు మరి. నన్నే ఆకర్షిస్తుందంటే వాడిని ఆకర్షించదా?' గరికిపాటి నరసింహా రావు తెలిపారు. కానీ ఒక కవిని ఆకర్షించిందంటే వెంటనే ఒక పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి.. అందమైన అర్ధనగ్న స్థితి సుమారుగా అనుకోండి. మనకే అనిపించింది సరదాగా.. అంటూ హీరోయిన్ అనుష్కపై గరికిపాటి నరసింహారావు పద్యం అందుకున్నాడు.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

వదలనీదు చూపు
కదలనీదు చూపు
వదలనీదు మనసు
అంగమంగమoధు అతుకుకుని

దీని దుంపతెగ చూపు ఎక్కడ పడితే అక్కడే అతుకుపోతున్నది. కిందకు రావాట్లేదు.. పైకి వెళ్లట్లేదు. అన్నీ అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూశాడంటే తప్పేం ఉంది?' అని అనుష్కపై గరికిపాటి నరసింహా రావు నీచంగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ కదలనీదు చూపు అంటూ పద్యం అందుకున్నాడు. ఇలా అవయవాలు.. అర్ధనగ్నం అంటూ నీతి వాక్యాలు చెప్పే గరికిపాటి నరసింహారావు నోటి నుంచి రావడాన్ని సర్వత్రా తప్పుపడతారు. ప్రవచనాలు అంటే నీతి వాక్యాలు.. ఆదర్శనీయమైన పదాలు చెప్పాల్సి ఉండగా.. ఇలా చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. కొడుకు చూసేదే తప్పంటే అది తప్పు కాదని కొడుకును వెనకేసుకొచ్చాడు. మొన్న మధ్యాహ్న భోజనం.. ఇప్పుడు అనుష్కపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1027
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 22, 2026 08:54:31
Hyderabad, Telangana:

 Tata Nano Modification Video Watch Here: భారత ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా కలల ప్రాజెక్టు టాటా నానో ఒక గురించి ప్రత్యక్షంగా పరిచయం అక్కర్లేదు.. కేవలం లక్ష రూపాయలకే కారును సామాన్యుడికి చేరువ చేసిన ఈ చిన్న కారు.. అప్పట్లో ఒక సంచలనం.. కాలక్రమమైన అమ్మకాలు తగ్గి ఉత్పత్తులు నిలిచిపోయినప్పటికీ రోడ్లమీద ఇప్పటికీ నానో కార్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కొందరు యువకులు ఈ బుజ్జి కారును ఓ రేంజ్ లో రీ మోడలింగ్ చేసి ఏకంగా స్పోర్ట్స్ కారుగా మార్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది..

సాధారణంగా నానో కారు అంటేనే చాలా చిన్నదిగా.. సింపుల్ గా ఉంటుంది.. కానీ ఈ రీ మోడలింగ్ కారు చూస్తే ఎవరు అది నానో అని గుర్తుపట్ట లేకపోతూ ఉంటారు.. యువ ఇంజనీర్లు దీని బాడీని పూర్తిగా మార్చేసి.. చిన్న చక్రాలను తీసేసి పెద్ద చక్రాలను అమర్చారు. దీంతో డిజైన్ పూర్తిగా మారిపోయింది.. కారుకు వెడల్పాటి టైర్లతో పాటు మెరిసే అల్లాయ్ వీల్స్‌ను కూడా అమర్చినట్లు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ కారుకు ఆకర్షణీయమైన ఎల్లో కలర్ వేయడం అద్భుతమైన ప్రీమియం లుక్కునందించింది.. 

ఈ స్పోర్ట్స్ నానో కారు రోడ్లమీద వేగంగా దూసుకుపోతుంటే జనం కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తో పాటు ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష రూపాయల కారును 10 లక్షల కారుగా మార్చేశారు అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. కొందరైతే ఇది నానో లేక ఏదైనా పెద్ద కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ కారా అని ఫన్నీ కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలలను నిజం చేసిన నానో.. సేఫ్టీ రేటింగ్ తో పాటు మార్కెటింగ్ వ్యూహాల వల్ల వెనకబడిన మాట వాస్తవమే.. కానీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాల వల్ల నానో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.. కేవలం రవాణా కోసమే కాకుండా స్టైలిష్ గా మార్చుకోవచ్చని ఈ యువత నిరూపించారు.. క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే.. పాత నానోకు సరికొత్త జీవం పోసిన యువత ప్రతిభ మహా అద్భుతం అంటూ ఆటోమొబైల్ నిపుణులు సైతం ఈ వీడియో చూసి ప్రశంసిస్తున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

1042
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 07:59:01
Hyderabad, Telangana:

LPG Gas Price Hike News: భారతదేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్‌పై ఇటీవలే రూ.60 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దేశీయంగా గ్యాస్ సిలిండర్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అయితే మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కారణంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన ఖతార్ పారిశ్రామిక నగరంలోని రాస్ లఫాన్‌పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచానికి వినాశకరంగా మారే అవకాశం ఉంది. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల పశ్చిమాసియాలో సహజ వాయువు (LNG) ఎగుమతి సామర్థ్యానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ పేర్కొన్నారు.

ఈ దాడి ఎప్పుడు జరిగిందంటే?
మార్చి 18వ తేదీ రాత్రి ఖతార్‌లోని కొన్ని గ్యాస్ కర్మాగారాలపై ఇరాన్ దాడులు జరిపింది. సహజ వాయువును క్లీన్ డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ ఇంధనాలుగా మార్చే పెర్ల్ GTL ప్లాంట్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన కారణంగా ఎంతో నష్టం వాటిల్లింది. ఇరాన్ తాజా క్షిపణి లక్ష్యంగా చేసిన దాడితో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్, నిల్వ ట్యాంకుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.

అలాగే మార్చి 19న ఖతార్‌లోని అనేక LNG కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన రెండవ దాడి చేసింది. రాస్ లఫాన్‌లోని రెండు ప్లాంట్స్‌తో పాటు మొత్తం 14 LNG ట్రాన్స్-గ్యాస్ యూనిట్లు లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడ్డాయి. తమ సోదర భావంగా భావించే ముస్లిం దేశం రంజాన్ మాసంలో ఈ విధంగా దాడులకు తెగబడుతుందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ వెల్లడించారు.

అయితే ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్‌లోని LNG ఎగుమతి సామర్థ్యంలో 17% పూర్తిగా దెబ్బతిన్నదని అంచనా వేశారు. దీనివల్ల ఏటా సుమారు $20 బిలియన్ల ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఖతార్ ఎనర్జీ సీఈఓ కాబీ తెలిపారు. దాడుల తర్వాత ఈ ప్లాంట్ల మరమ్మతులు అవసరమని, దీనివల్ల రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు 12.8 మిలియన్ టన్నుల LNG ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభావితం అయ్యే దేశాలు ఇవే..
సుమారు 40-50 శాతాన్ని భారతదేశం తన LNG అవసరాల కోసం ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. సరఫరా తగ్గితే, దేశంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు నిస్సందేహంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎల్‌పీజీలో గణనీయమైన భాగం సహజ వాయువును శుద్ధి చేయడం ద్వారా వస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలతో పాటు దేశీయ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అదే విధంగా భారత్‌తో పాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ దేశాలు  ఇప్పటికే ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో సరఫరా కూడా తగ్గితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై భారీగా ప్రభావం పడనుంది.

మరికొన్ని ఆసియా దేశాలైన చైనా, దక్షిణ కొరియా, జపాన్ కూడా ఖతార్ నుండి పెద్ద ఎత్తున LNGని కొనుగోలు చేస్తాయి. 2025లో ఖతార్ నుంచి తెచ్చుకుంటున్నLNG దిగుమతుల్లో 90 శాతం వాటా వీటిదే. దీంతో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడితే పక్షంలో ఈ దేశాలు స్పాట్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐరోపా దేశాలు గ్యాస్ కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రాస్ లఫాన్‌పై ఇరాన్ దాడి ఐరోపాలో గ్యాస్ ధరలు 30-35% పెరిగేందుకు భారీగా ఛాన్స్ ఉంది.

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

Also Read; AP Weather Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక..రాబోయే 3 రోజులు అల్లకల్లోలం..బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1040
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 07:03:14
Polavaram, Andhra Pradesh:

MLA Chirri Balaraju Cyber Crime: కళ్ల ముందు కనిపిస్తున్నా.. మనకు తెలియకుండా సైబర్‌ నేరగాళ్లకు చిక్కుకుంటాం. చదువుకున్నవారు కూడా తెలియకుండా నష్టపోతుంటారు. దీనికి సామాన్య ప్రజలతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీసులు కూడా తేడాలేదు. అందరూ సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి డబ్బును అప్పగించేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే సైబర్‌ నేరగాళ్లకు చిక్కి రూ.12 లక్షలు నష్టపోయిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆర్‌టీఏ చలాన్‌ పేరిట ఓ లింక్‌ పంపి ఎమ్మెల్యే డబ్బులను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది. ఆర్టీఏ చలానా పేరుతో ఎమ్మెల్యే మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆయన వాహనానికి సంబంధించి ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉందని.. దాన్ని చెల్లించాలని కోరుతూ ఒక లింక్ పంపారు. అది నిజమైన చలానా అని నమ్మిన ఎమ్మెల్యే ఆ మెసేజ్‌లో పంపిన లింక్‌ను క్లిక్ చేశారు. అది ఒక మాల్వేర్ ఉన్న యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లేండ్ బ్యాంక్ లో ఉన్న ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలు మాయమయ్యాయి.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

తన ఫోన్ హ్యాక్ అయిందని, నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకుండాపోయింది. అతడి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.12 లక్షలు విత్‌ డ్రా అయ్యాయి. ఈ విషయంపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సైబర్ క్రిమినల్స్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం అన్ని విధాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్‌ అధినేత్రి మమతా టాప్‌ 10 హామీలు

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే, సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈఘటనలో అర్థం చేసుకోవచ్చు. చలానాలు, గిఫ్ట్ ఓచర్లు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింక్‌లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే చూడాలని తెలిపారు. ట్రాఫిక్ చలానాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ఈ చలాన్‌ లేదా అధికారిక యాప్స్ మాత్రమే వాడాలని సూచించారు. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది మీ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1032
comment0
Report
HDHarish Darla
Mar 22, 2026 05:45:16
Hyderabad, Telangana:

Petrol Price Today News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముడిచమురు రవాణాపై తీవ్ర ఆంక్షలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరపై భారీగా ప్రభావం పడింది. తాజాగా భారతదేశంలో పవర్/స్పీడ్ పెట్రోల్‌పై రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే నేడు అనగా 2026 మార్చి 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో మార్చి 22 అనగా ఆదివారం నాడు ఉదయం పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఇంధన ధరలపై స్థిరత్వం కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, లక్నో, నోయిడాతో సహా ప్రధాన నగరాల్లోనూ నిన్న ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం.

భారత రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77 విక్రయిస్తుండగా..ముంబైలో దీని ధర లీటరుకు రూ.103.54గా ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు ఉన్నా ఎంతో స్థిరమైన ధోరణి కొనసాగుతుంది. అయితే దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రస్తుత రిటైల్ ధరలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏ విధంగా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
1) ఢిల్లీ  Rs. 94.77
2) ముంబై  Rs. 103.54
3) చెన్నై  Rs. 100.80
4) కోల్‌కతా    Rs. 105.45
5) బెంగళూరు    Rs. 102.99
6) హైదరాబాద్    Rs. 107.46
7) పూణే     Rs. 103.99
8) అహ్మదాబాద్    Rs. 94.68
9) లక్నో    Rs. 94.72
10) జైపూర్    Rs. 105.11
11) నోయిడా    Rs. 94.90
12) గురుగ్రామ్    Rs. 95.51
13) ఘజియాబాద్    Rs. 94.58
14) శ్రీనగర్    Rs. 100.64
15) జోధ్‌పూర్    Rs. 104.43

పశ్చిమ ఆసియాలోని రాజకీయ పరిణామాలతో పాటు ముడిచమురు సరఫరాపై ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో ఉన్న పంప్ ధరలు స్థిరంగా కొనసాగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఇటీవల అస్థిరమైన శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, తుది వినియోగదారునికి తక్షణ ధరల పెరుగుదలను నివారించడానికి భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఈ హెచ్చుతగ్గులను చాలా వరకు తట్టుకున్నాయి. 

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలను లీటరుకు సుమారుగా రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచారు. ఎంపిక చేసిన నగరాల్లోని డీలర్ల సమాచారం ఆధారంగా.. ఇండియన్ ఆయిల్ వారి ఎక్స్‌పి95, హిందుస్థాన్ పెట్రోలియం వారి పవర్ పెట్రోల్ వంటి హై-ఆక్టేన్ ఇంధనాలకు ఈ పెంపు వర్తిస్తుంది. సవరించిన ధరలు నిన్నటి (మార్చి 21) నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read: Petrol Price Today: దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర..లీటరుకు రూ.2.09 పెంచిన కంపెనీలు..ఎక్కడెక్కడంటే?

Also Read: LPG ATM Gurugram: యుద్ధం వేళ సామాన్యులకు గుడ్‌న్యూస్..గ్యాస్ సిలిండర్లకు ATM..2 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ అయిపోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1061
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 22, 2026 01:30:09
Kothagudem, Telangana:

Bhadrachalam Temple: తెలంగాణలోని ప్రసిద్ధి సీతారామచంద్రుల ఆలయం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని.. గోదావరి పుష్కరాలకు కూడా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగమశాస్త్రం ప్రకారం అభివృద్ధి పనులు జరగాలని స్పష్టం చేశారు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమావేశంలో సమీక్ష చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా.. అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి.. దానికి సంబంధించిన  అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం ఆదేశించారు.

Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవానికి తాను వస్తున్నట్లు సీఎం చెప్పినట్లు సమాచారం. కల్యాణోత్సవ ఏర్పాట్లపై కూడా సమీక్ష చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

1039
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 14:18:36
Hyderabad, Telangana:

Telangana Budget: ఆర్భాటంగా.. గొప్పగా ప్రకటించిన తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు మోసం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య విమర్శించారు. రూ.3 లక్షల 24 వేల కోట్లల్లో బీసీలకు కేవలం 12.511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా బడ్జెట్‌లో అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన వాగ్ధానం ప్రకారం బడ్జెటు రూ.20 వేల కోట్లకు పెంచాలి.. బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని గుర్తుచేశారు.

Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు

హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన 14 సంఘాల సమావేశంలో ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్‌లో బీసీ వర్గాలకు దక్కిన ప్రయోజనాలు ఏమీ లేవని తెలిపారు. బీసీలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తీరని మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కొక్క బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు, 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు

ఎస్సీ/ ఎస్టీ/ మైనారటీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇస్తూ కేవలం బీసీ విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వైఖరిని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య తప్పుబట్టారు. 'మంత్రివర్గంలో కేవలం  ముగ్గురు బీసీలే. సమాచార కమిషన్ల 6 మందిని నియమిస్తే ఒకటి కూడా బీసీలకు ఇవ్వకుండా ఆన్యాయం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఒకటి కూడా బీసీలకు ఇవ్వలేదు. ప్రభుత్వం అడుగడుగునా బీసీ వ్యతిరేక ఆ చర్యలు పాల్పడుతోంది' అని విమర్శించారు.

సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్,  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీలం వెంకటేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జిల్లపల్లి అంజి - రాష్ట్ర అధ్యకులు రాష్ట్ర యువజన సంఘం, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, తెలంగాణా బి.సి సంఘం అధ్యక్షుడు రాజేందర్, తెలంగాణా బీసీ విద్యార్ధి సంఘం శివ కుమార్, తెలంగాణా బి.సి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి నిఖిల్‌, తెలంగాణా బీసీ యువజన సంఘం ఆశిష్ గౌడ్ తదితర కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.

బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం
ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు కానీ అది అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. ఇలా ప్రతీ అంశంలో బీసీలకు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లోనూ మోసం చేశాడని బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1077
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 12:58:08
Wadgaon, Maharashtra:

Commercial Gas Quota: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశంపై ఊహించని రీతిలో ప్రభావం పడడంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకపోయినా భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉండగా.. ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం మాత్రం కొనసాగుతోంది. మూడు దేశాలు ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ ఇబ్బంది ఏర్పడగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్‌ కోటా పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

దేశంలోని అన్ని రాష్ట్రాలకు గ్యాస్‌ సరఫరాపై తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య గ్యాస్ కోటాను 50 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 20 శాతం కేటాయింపులతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో మరో 10 శాతం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 20 శాతం అదనపు కమర్షియల్‌ గ్యాస్‌ కోటాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలియం శాఖ కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వ పెంపుతో రాష్ట్రాలకు అందే మొత్తం కమర్షియల్‌ గ్యాస్ సరఫరా అదనంగా 50 శాతానికి చేరుకోనుంది. అదనపు 20 శాతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, డెయిరీ రంగాలు, ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల ద్వారా నడపబడే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు కేటాయించిన అదనపు గ్యాస్‌ కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది.

అదనంగా కేటాయించిన 50 శాతం కోటాను పొందాలంటే వినియోగదారులకు పెట్రోలియం శాఖ కొన్ని నిబంధనలు విధించింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓంఎస్‌సీలు) వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్‌ తప్పుదారి పట్టకుండా.. దుర్వినియోగం కాకుండా కేంద్ర పెట్రోలియం శాఖ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. గ్యాస్ మళ్లింపు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఆ వాణిజ్య సిలిండర్లు రాష్ట్రాలకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాల్లోని కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1020
comment0
Report
Advertisement
Back to top