చంద్రబాబు-రేవంత్ భేటీ: ప్రజాభవన్‌లో సమావేశం
Hyderabad, Telangana:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ప్రజా భవన్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరువురు నేతల భేటీ.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల సమరం షురూ..అక్టోబరులోగా పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయం..సీట్ల సర్దుబాటు ఎలా?
Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections News: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. అక్టోబర్ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికలను ఎలాగైనా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు, కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సాయంత్రం జరగనుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరపనున్నారు.
మంత్రులకు లోకేష్ దిశా నిర్దేశం..
కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ మంత్రులతో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. తొలుత పురపాలికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకుని ఎన్నికలు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుండి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రులను ఆదేశించారు. విద్యా, వివిధ సంక్షేమ శాఖలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
విపక్షాల వ్యూహం..
మరోవైపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేశారు. అయితే, ఎన్నికల నిర్వహణను సదరు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆపాలని కోరుతూ వైఎస్సార్సీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతూ, అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మంత్రులకు బిగ్ టాస్క్ అప్పగించింది.
Also Read: రేపు మాంసం దుకాణాలు బంద్.. కృష్ణాష్టమి నాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు?
Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nitin Gadkari Bike Taxi: "రాష్ట్రాలు బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలి" కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..8 కోట్ల మందికి ఉపాధి!
Hyderabad, Telangana:Nitin Gadkari Bike Taxi News: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను ప్రయాణీకుల రవాణా కోసం (బైక్ ట్యాక్సీలుగా) నడపడానికి అనుమతించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీనివల్ల దేశంలో దాదాపు 8 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్ల క్షేమం కోసం 'సురక్ష' పథకాన్ని ప్రారంభించిన ఆయన, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు నెగటివ్ పాయింట్ల విధానాన్ని మోటార్ వాహనాల చట్టంలోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
రవాణా అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో, వారి ఆమోదం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవల విస్తరణ ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 8 కోట్ల మందికి జీవనోపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ వివరించారు.
డ్రైవర్లు, ప్రమాదకర వాతావరణంలో పనిచేసే కార్మికుల భద్రతను పెంపొందించడానికి కేంద్రం 'సురక్ష' అనే వినూత్న పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రహదారుల నిర్మాణం, మైనింగ్ పనులలో పాల్గొనే శ్రామికులకు ఉచిత వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందజేస్తారు.
తొలుత మహారాష్ట్రలోని నాగ్‌పూర్-కాంప్టీ ప్రాంతం (NH-44) నుండి చంద్రాపూర్ మైనింగ్ బెల్ట్ వరకు 150 కిలోమీటర్ల మేర దీనిని అమలు చేసి, 10,000 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. రహదారి భద్రతకు డ్రైవర్ల శారీరక, మానసిక శ్రేయస్సు ఎంతో కీలకమని, అందుకే వారి కంటి చూపు, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేయనుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు 'నెగటివ్ పాయింట్ల' విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. డ్రైవర్లు చేసే ప్రతి ఉల్లంఘనకు వారి ఖాతా నుండి పాయింట్లు తగ్గిస్తారు. పరిమితి మించితే డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేయడం లేదా పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఇది నిరంతర నిబంధనల ఉల్లంఘనదారులలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుందని ఆశిస్తున్నారు.
ఇక నాగ్‌పూర్‌లో జరిగిన 'ది ఎకనామిక్ టైమ్స్ - చేంజ్‌మేకర్స్ ఆఫ్ నాగ్‌పూర్ -2026' కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నైతిక విలువలు, విశ్వసనీయత ప్రాముఖ్యతను వివరించారు. వ్యాపార రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D) పై పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఒక వ్యాపారవేత్త తన కర్మాగారం తగలబడినప్పటికీ పట్టుదలతో శ్రమించి ప్రస్తుతం 90 దేశాలకు ఎగుమతి చేస్తున్న స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. "ఒక వ్యక్తి ఓడిపోయినంత మాత్రాన ముగిసిపోడు, పోరాటాన్ని వదిలేసినప్పుడే అంతమవుతాడు" అని మంత్రి స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
Also Read: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": Dr.సుభాష్ చంద్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతంలో ఈ చిన్న తప్పు చేసినా ఫలితం దక్కదు!
Hyderabad, Telangana:Krishna Janmashtami Pooja Rules: హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ఆ దేవదేవుడు శ్రీమహావిష్ణువు అష్టమవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన బాలకృష్ణుడిని పూజించి.. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాల్గవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే మీరు కూడా ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలు పాటిస్తూ ఉంటారా? ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.. ఎలాంటి తప్పులు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పవిత్రమైన రోజున వ్రతం చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించడంతోపాటు భక్తులకు అందరికీ కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే, జన్మాష్టమి ఉపవాస దీక్షలో కొన్ని కఠినమైన నియమాలు పాటించడం తప్పనిస.. ముఖ్యంగా సంతానంలో భాగంగా బాబును మాత్రమే కోరుకుంటున్న వారు తప్పకుండా ఈ సమయంలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కఠినమైన నియమాలతో శ్రీకృష్ణుడి పూజను చేయాల్సి ఉంటుంది..
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తులందరూ ప్రధానంగా రెండు రకాలుగా ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.. భారతదేశంలోని చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం పాటిస్తూ ఉంటారు.. ఇది అత్యంత కఠినమైన వ్రతముగా భావిస్తారు. ఇందులో భక్తులు పగలు రాత్రి అనే తేడా లేకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు ఉంటారు. అర్ధరాత్రి కృష్ణుడి జననం తర్వాత.. స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు.. ఇక మరికొంతమంది ఫలహార ఉపవాసం ఉంటారు. వృద్ధులతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా నిర్జీల దీక్ష చేయలేని వారు పలహార ఉపవాసం చేయొచ్చు. ఇందులో పండ్లు, పాలు నీరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు..
ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఇవి..
ఉపవాసాలు ఉన్నవారే కాదు.. ఇంట్లో వారందరూ ఈరోజు తప్పకుండా ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి, మాంసాహారం లాంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. కేవలం తాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతం ఆచరించేవారు వివాదాలతో పాటు అబద్ధాలకు, కఠినమైన మాటలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకొని రోజంతా శ్రీకృష్ణుడి నామస్మరణ చేయాలి. బ్రహ్మచర్యం పాటించడం కూడా అత్యంత మంచిదని పురాణాలు చెబుతూ వస్తున్నాయి..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి.. కాబట్టి జన్మాష్టమి రోజున నిశీధ కాలంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం.. ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11 గంటల 57 నిమిషాల నుంచి సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 43 నిమిషాలకు నిశీధ కాల ముహూర్తం ఉంది. ఈ సమయంలో శ్రీకృష్ణుడి బ్రహ్మోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలి. బాలకృష్ణుడికి ఇష్టమైన వెన్నతో పాటు పట్టిక బెల్లం, పంచమేవ, పండ్లు, రకరకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజా అనంతరం హారతిని ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక ఉపవాస విరమణ విషయానికొస్తే.. కొంతమంది తమ కుటుంబ ఆచారాల ప్రకారం అర్ధరాత్రి పూజ పూర్తయిన వెంటనే ఉపవాసాన్ని విడిచిపెడతారు. మరి కొంతమంది మరిసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bigg Boss 10 Telugu: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Highest Paid Contestant: గత 9 సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'. విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 సీజన్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. మరో 3 రోజుల్లో ఈ రియాలిటీ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ 'దశావతారం' కాన్సెప్ట్‌తో ప్రేక్షకులలో మరింత ఉత్కంఠను రేపింది.
హౌస్‌లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ మొదలైంది. 'బిగ్ బాస్' తెలుగు చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అయితే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రియాలిటీ షో తెలుగు వెర్షన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా టీవీ యాంకర్, నటి శ్రీముఖి నిలిచింది. ఆమె 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హౌస్‌లోకి ప్రవేశించి, ఆ సీజన్లో అత్యంత పాపులర్ అయిన పోటీదారుల్లో ఒకరిగా ఆమె నిలిచింది.
తనదైన శైలిలో సూటిగా మాట్లాడే స్వభావం, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, వినోదాన్ని పంచే గుణంతో శ్రీముఖి త్వరగానే ప్రేక్షకులకు ఇష్టమైన వ్యక్తిగా మారింది. ఆ మూడో సీజన్ మొత్తం ఆమెకు మరింత ప్రజాదరణ పెరుగుతూ వచ్చింది. చాలా మంది అభిమానులు ఆమె ట్రోఫీని గెలుచుకుంటుందని భావించారు. అయితే, చివరికి ఆమె రన్నరప్‌గా నిలవగా, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.
బిగ్‌బాస్ 3 విజేత కంటే ఎక్కువ సంపాదన?
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ సీజన్ విజేత కంటే శ్రీముఖి పారితోషికం ఎక్కువగా ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బిగ్‌బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ హౌస్‌లో గడిపిన సుమారు 100 రోజులకు గాను దాదాపు రూ. 20 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. సీజన్ విజేతగా గెలిచిన తర్వాత అతనికి రూ. 50 లక్షల ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నారు. దీంతో షో ద్వారా ఆయన మొత్తం సంపాదన సుమారు రూ. 70 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది.
మరోవైపు, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో యాంకర్ శ్రీముఖి రోజుకు సుమారు రూ. 80,000 సంపాదించినట్లు సమాచారం. ఆమె సుమారు 100 రోజుల ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రైజ్ మనీతో సంబంధం లేకుండా ఆమె పారితోషికం దాదాపు రూ. 80 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందుకున్న పారితోషికంతో పోలిస్తే.. యాంకర్ శ్రీముఖి ఎక్కువ మొత్తంగా డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ తెలుగులో ఓ సెలబ్రిటీకి ఇచ్చిన అత్యధిక పారితోషికం ఇదే కావడం విశేషం.
బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు సిద్ధం..
మరోవైపు బిగ్ బాస్ తెలుగు 10 కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. గత 9 సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకోని.. ఇప్పుడు 10వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 6న గ్రాండ్‌గా ఈ రియాలిటీ షో మొదలు కానుంది. ఈసారి పదో సీజన్ కావడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం. కొత్త ట్విస్ట్‌లు, టాస్క్‌లతో గేమ్ ఫార్మాట్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సీజన్లో పాల్గొనబోతున్న పోటీదారుల జాబితా ఇంకా అధికారికంగా బయటకు రాని క్రమంలో.. వారి పారితోషికాలు ఏంటనే విషయం కూడా ఇప్పట్లో క్లారిటీ రాదు. మరికొన్ని రోజుల్లో ఇదే విషయమై కొన్ని నివేదికలు వెలువడే అవకాశం ఉంది. అయితే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న యాంకర్ శ్రీముఖి రికార్డును ఈ సీజన్లో ఎవరైనా బద్దలు కొడతారా? లేదా అనేది చూడాలి.
Also Read: నటి మమితా బైజుకు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక..ఆస్ట్రేలియా పర్యటన రద్దు!
Also Read: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rohit Sharma 2027 World Cup: 2027 ప్రపంచకప్‌కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్? హిట్‌మ్యాన్ అంగీకారం..నేడు కీలక భేటీ!
Hyderabad, Telangana:Rohit Sharma 2027 World Cup News: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్, భవిష్యత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహాలు ప్రారంభం కానున్న తరుణంలో, రోహిత్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ముంబైలో గురువారం ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది.
ఈ ఉన్నత స్థాయి భేటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి వివిఎస్ లక్ష్మణ్ పాల్గొని జట్టు దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు. గతంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2027 ప్రపంచ కప్ దృష్ట్యా యువ జట్టును సిద్ధం చేయాలనే యోచనలో భాగంగా సెలెక్షన్ కమిటీ రోహిత్‌తో సంప్రదింపులు జరిపింది.
మొదట దీనిపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇంగ్లండ్ వన్డే సిరీస్ అనంతరం అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకునేందుకు అంగీకరించాడనే వార్తలు వచ్చాయి. అయితే, లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ 138 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నిరూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన తన రిటైర్మెంట్ ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా రోహిత్ వన్డే జట్టులో కొనసాగింపునకు మద్దతు పలికారు.
మరోవైపు, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూడా ప్రపంచకప్ లాంటి ఒత్తిడితో కూడిన మెగా టోర్నీల్లో రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన సీనియర్ల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. నాలుగు ప్రపంచ కప్‌ల అనుభవం, ఒత్తిడిని తట్టుకునే మానసిక దృఢత్వం ఉన్నందున రోహిత్ శర్మ టీమిండియాకు ఒక విలువైన ఆస్తిగా నిలుస్తాడని పేర్కొన్నారు.
ఈ గురువారం జరగబోయే సమీక్షా సమావేశంలో కేవలం రోహిత్ శర్మ భవిష్యత్తు మాత్రమే కాకుండా, జట్టు ప్రదర్శన, ఇతర సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన వైఫల్యాలు (సిరీస్ 2-1 నష్టం), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాలు, షెడ్యూల్స్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ కాలపరిమితి పొడిగింపు వంటి అంశాలు కూడా ఈ భేటీ ఎజెండాలో ఉన్నాయి.
Also Read: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గుడ్‌బై.. అర్జెంటీనా జట్టు నుంచి రిటైర్మెంట్!
Also Read: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janmashtami Non Veg Ban: రేపు మాంసం దుకాణాలు బంద్.. కృష్ణాష్టమి నాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు?
Hyderabad, Telangana:Janmashtami Non Veg Ban News: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 4న గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ విక్రయ దుకాణాలతో పాటు జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన అన్ని పశు వధ శాలలు (స్లాటర్ హౌసెస్) తప్పనిసరిగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రహస్యంగా విక్రయాలు జరిపితే వారి ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేయడంతో పాటు, కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి నగరంలోని 6 జోన్లలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. పండుగ వాతావరణం పవిత్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది.
'ది హిందూ' పత్రిక కథనం ప్రకారం, హైదరాబాద్‌లోని అన్ని సర్కిళ్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈ నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ జోనల్, డిప్యూటీ కమిషనర్లందరినీ ఉన్నతాధికారులు ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రహస్యంగా విక్రయాలు జరిపినా, లేదా చట్టవిరుద్ధంగా జంతువులను వధించినా వారి ట్రేడ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. 'డెక్కన్ క్రానికల్' తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 4న తెల్లవారుజాము నుంచే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికీ, ఎటువంటి అక్రమ పశువధా జరగకుండా చూసేందుకు GHMC పరిధిలోని 6 జోన్లలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ ప్రత్యేక వెటర్నరీ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడతాయి. ఎక్కడైనా అక్రమ విక్రయాలు గుర్తిస్తే వెంటనే ఆ దుకాణాలను సీజ్ చేసి యజమానులకు భారీ జరిమానా విధిస్తారు.
నగరంలో సాధారణంగా గాంధీ జయంతి, మహాశివరాత్రి, శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో కూడా ఇలాంటి మాంసం విక్రయాల నిషేధాన్ని అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలోనే ఇప్పుడు కృష్ణాష్టమికి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జన్మాష్టమి వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఈ నేపథ్యంలో ప్రజలు ఒక రోజు ముందుగానే తమకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలనీ, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ సూచించింది. పండుగ వాతావరణం పవిత్రంగా ఉండేందుకు వ్యాపారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026..జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 కృష్టుడి ఆలయాలు!
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
200 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ కోసం ఊరంతా సంబరాలు!
Hyderabad, Telangana:Maharashtra Baby Girl Birth Celebration: ఆడపిల్ల పుడితే కొందరు భారంగా భావించే ఈ రోజుల్లో.. ఓ కుటుంబం మాత్రం తమ ఇంటి మహాలక్ష్మి వచ్చిందంటూ ఊరంతా సంబరాలు చేసుకుంది.. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు తరాలు.. సుమారు 200 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో ఊర్లో ఎన్నో రకాల ప్రత్యేకమైన దానధర్మ కార్యక్రమాలు చేపట్టారు.
మహారాష్ట్రకు చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాలుగా మగ పిల్లలే పుడుతూ వస్తున్నారు.. తమ ఇంట్లో కూడా ఆడపిల్ల నవ్వులు వినిపించాలని.. ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా సందడి చేయాలని ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తోంది. ఎట్టకేలకు నాలుగు తరాల తర్వాత వారి కల నెరవేరింది.. కుటుంబంలోని పండంటి ఆడబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాల్లో మునిగిపోయారు.. ఆ పాపకు గార్గి అని నామకరణం చేసి.. తమ ఇంటిని వెలిగించడానికి వచ్చిన సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా భావించారు..
తమ ముద్దుల కూతురి రాకను చిరస్మరణీయంగా మార్చుకోవాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆస్పత్రి నుంచి తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయిన సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.. చిన్నారి, ఆమె తల్లిని సాధారణ వాహనంలో కాకుండా రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కూర్చోబెట్టారు.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు దారి పొడవున డప్పు జప్పులతో పాటు భార్యాభజంత్రీలు మోగిస్తూ బాణ సంచాలు కాలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
దారి పొడవునా గ్రామస్తులతో పాటు బంధువులు ఆ చిన్నారిపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.. నేటి ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లల పట్ల వివక్షత చూపే కొందరికి ఈ ఘటన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆడబిడ్డ పుట్టుకను ఒక మహా ఉత్సవంలా జరుపుకున్న దాహిఫలే కుటుంబ తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం ఊహించని స్థాయిలో వెల్లువిరిసింది. అంతేకాకుండా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కొత్తగా 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' సబ్జెక్ట్ చేరిక.. దరఖాస్తు చేసుకోండిలా!
Hyderabad, Telangana:GATE 2027 Registration: ఐఐటి గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 నుండి 2026 వరకు కొనసాగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE) 2027 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్లను సమర్పించవచ్చు. దరఖాస్తుల గడువు అక్టోబర్ 5 వరకు ఉంటుంది, అయితే లేట్ ఫీజు చెల్లించి కూడా అప్లికేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. అక్టోబర్ 21 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో కూడా అందుబాటులో ఉంటుంది.
గేట్ 2027 పరీక్షలను ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. సిటీ అలాట్మెంట్ నోటిఫికేషన్ జనవరి 4న విడుదలవుతుంది, అడ్మిట్ కార్డ్‌లు కూడా అంతకుముందే విడుదల చేస్తారు. 2027 పరీక్షల ఫలితాలను మార్చి 19, 2027లో ప్రకటించే అవకాశం ఉంది.
గేట్ 2027లో కొత్తగా రోబోటిక్స్, ఆటోమేషన్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీనితో పాటు పరీక్షను 30 టెస్ట్ పేపర్ల ఆధారంగా నిర్వహించనున్నారు. ఐఐటి మద్రాస్ 2027 గేట్ సిలబస్‌లో మార్పులు చేసింది, ప్రధానంగా బయోటెక్నాలజీ పేపర్లో అప్డేట్స్ చేసింది. సెక్షన్ పేపర్ కోడ్లు టెక్ స్టైల్ ఇంజినీరింగ్, ఫైబర్ సైన్స్ ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ ఆధారంగా ఉంటాయి. పరీక్షా అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది, అందులో ఒక కాంబినేషన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది.
గేట్ 2027 అర్హత..
హయ్యర్ డిగ్రీ చదువుతున్న వారు ఈ పరీక్షకు అర్హులు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీలలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్ లేదా హ్యుమానిటీస్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా గేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, భారతీయ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిజిలాకర్ తప్పనిసరి. ఐఐటి మద్రాస్ అభ్యర్థులు తమ డిజిలాకర్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలని, 2027 గేట్ అప్లికేషన్ ప్రక్రియకు ముందే ఈ పని పూర్తి చేయాలని సూచించింది.
Also Read: హైదరాబాద్ - మంగళూరు స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు పొడిగింపు..టైమింగ్స్, రూట్ వివరాలివే!
Also Read: కృష్ణాష్టమి హాలిడే.. రేపు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ISRO Rocket: శ్రీహరికోటలో సర్వం సిద్ధం.. రేపు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం
Shar Project, Andhra Pradesh:GSLV F17 EOS 05: భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక రాకెట్ ప్రయోగం జరగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో రారాజుగా చెప్పుకునే ఇస్రో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో కూడా వరుస విజయాలు సాధిస్తోంది. అధిక బరువు కలిగిన శాటిలైట్లను నింగిలోకి ఇస్రో జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపడుతుంది. ఇప్పటివరకు రాకెట్ ప్రయోగాల్లో వరుస విజయాలు సాధించిన ఇస్రో GSLV F 17 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం వేదికగా సర్వం సిద్ధం చేసింది.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో GSLV F-17/EOS-05 రాకెట్‌ను ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2:55 నిమిషాలకు ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ రాకెట్ ప్రయోగానికి బుధవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఈ కౌంట్‌డౌన్ 27.30 గంటల పాటు కొనసాగుతోంది. ఈ కౌంట్‌డౌన్ విజయవంతంగా కొనసాగిన అనంతరం తెల్లవారుజామున 2.55 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్- 17 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగం జీఎస్ఎల్ ప్రయోగాల్లో 19వ ప్రయోగం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్రయోజనిక్‌తో ప్రయోగించే ఈ ప్రయోగం ద్వారా ఈఓఎస్ (EOS) 05 శాటిలైట్‌ను కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. భూ ఉపరితల పరిస్థితులను అధునాతనంగా అధ్యయనం చేసేందుకు ఈ రాకెట్ ప్రయోగం ఉపయోగపడనుందని ఇస్రో శాస్త్రవేతలు తెలిపారు.
ప్రయోగం ప్రధాన లక్ష్యం
ఈఓఎస్-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది కేవలం మరో ఉపగ్రహ ప్రయోగం కాదు. భూకక్ష్య నుంచి భూమిని మరింత అధునాతనంగా పరిశీలించే భారత అంతరిక్ష సామర్థ్యానికి మరో కీలక ముందడుగుగా ఇస్రో భావిస్తోంది. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ చేయనున్న భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్‌గా EOS-05 ప్రత్యేకతను సంతరించుకుంది. భూమి పరిశీలన, భౌగోళిక మార్పుల అధ్యయనం, సహజ వనరుల పర్యవేక్షణ వంటి అనువర్తనాల్లో ఉపగ్రహ ఆధారిత పరిశీలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లే GSLV-F17, భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవబోతోంది. ఈ రాకేట్ ప్రయోగం దృష్ట్యా శ్రీహరికోట రాకెట్ కేంద్రం (షార్)లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Onion Price Hike: మండిపోతున్న ఉల్లి ధరలు..రెట్టింపైన రేట్లతో సామాన్యుడి కన్నీళ్లు!
Hyderabad, Telangana:Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు.
అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే..
హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి.
విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. ఇక్కడ ఇతర కూరగాయల ధరలు చూస్తే టమాట రూ. 30, వంకాయ రూ. 24, క్యారెట్ రూ. 45, కీరదోస రూ. 50, బీన్స్ అత్యధికంగా రూ. 94కు లభిస్తున్నాయి.
దేశవ్యాప్త సగటు, కారణాలు
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సగటు కిలో ఉల్లి ధర రూ. 49.59కి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో సగటు ఉల్లి ధర రూ. 28.48 ఉండగా, ఇప్పుడు అది 74 శాతానికి పైగా పెరిగింది.
అయితే, ఈ ధరల పెరుగుదలకు దేశంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం కారణం కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయింది. రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీయడం, తదుపరి నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు వచ్చేసింది!
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana: కల్యాణలక్ష్మి గోవింద.. స్కూటీలు గోవిందా
Secunderabad, Telangana:BRS Party Leaders Chants Govinda Govinda Against Congress 420 PromisesMalla Reddy: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్
Hyderabad, Telangana:Former Minister Malla Reddy Mass Dance In BRS Party Protest Watch Viral VideoBRS Party: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గాడిదలతో గులాబీ పార్టీ నిరసన
Hyderabad, Telangana:BRS Party Protest With Donkeys Against Revanth Reddy 1000 Days Rule Watch VideoACB Rides: టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Tirupati, Andhra Pradesh:ACB Officers Ride On TTD Deputy EO Lokanatham Residence At Tirupati Know The DetailsYSR: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది వైఎస్సార్ కోరిక: రేవంత్ రెడ్డి
New Delhi, Delhi:YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు.
'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'వ్యవసాయ చట్టం తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది. పీడీఎస్ విధానం తీసుకొచ్చి రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 'దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ' అని తెలిపారు. తామంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు.
