అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో రాస్తారోకో
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని, లేబర్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్లైన్ సైట్ పనిచేయక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చాలా మంది కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana SIR Last Date: తెలంగాణలో 60 లక్షల ఓట్లు తొలగింపు..ఈ పార్టీకి చెమటలు పట్టే కొత్త టెన్షన్!
Hyderabad, Telangana:Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మెదక్, సూర్యాపేట జిల్లాల వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు, హైదరాబాద్ జిల్లా కేవలం 58.58 శాతంతో చివరి స్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ శాతంతో వెనుకబడి ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా ప్రకటన వెలువడిన తర్వాత జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాతే ఓట్ల తొలగింపుపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయ పార్టీల్లో కొత్త టెన్షన్‌కు కారణమవుతోంది. ఈ ప్రక్రియను మొదటి నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి నేతలను అప్రమత్తం చేశాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆగస్టు 17న ముసాయిదా జాబితా వెలువడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటర్ల జాబితా వివరాలు, నమోదు ప్రక్రియ, ఇతర అధికారిక సమాచారం కొరకు ఓటర్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ), ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లను కూడా సందర్శించవచ్చు. అలాగే ఓటర్ల జాబితాలో పేరును పరిశీలించడానికి ఎలక్ట్రోరల్ సెర్చ్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.
Also Read: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు..వైన్స్ బంద్, ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు.. పోస్టులను బట్టి రూ 55,000 వరకు జీతం.. పూర్తి వివరాలివే
Lakshmapur, Telangana:Bharat Electronics Limited Recruitment 2026: రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11, 2026న జరిగే నియామక ప్రక్రియకు హాజరయ్యే ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఖాళీలను రాజస్థాన్, గుజరాత్‌లోని BEL ప్రాజెక్ట్ సైట్ల కోసం రిక్రూట్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జోధ్‌పూర్, జైసల్మేర్, జామ్‌నగర్, భుజ్ లేదా నలియాలో నియమించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, జీత భత్యాలు వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నాలుగేళ్ల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అర్హత గల విభాగాలలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్నాయి.
అనుభవం:
దరఖాస్తుదారులు జూలై 1, 2026 నాటికి కనీసం 2 సంవత్సరాల సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు సడలింపు లభిస్తుంది.
జీతభత్యం:
జీతం నియామక సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-I నెలకు రూ. 40,000 అందుకుంటారు. అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్-II, III, IV వరుసగా రూ. 45,000, రూ. 50,000 రూ. 55,000 అందుకుంటారు. అభ్యర్థులు వారి పోస్టింగ్‌ను బట్టి ఏరియా అలవెన్స్ కూడా పొందవచ్చు. రూ. 12,000 బీమా ప్రయోజనం, ఇతర వర్తించే అలవెన్సుల గురించి కూడా BEL పేర్కొంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. జనరల్, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 35 శాతం మార్కులు అవసరం కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన బీడీ (PwBD) అభ్యర్థులకు అర్హత మార్కు 30 శాతంగా ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు ఫారం, ఫోటోగ్రాఫ్‌లు, విద్యా ధృవపత్రాలు, అనుభవ పత్రాలు, రెజ్యూమె, ఫీజు చెల్లింపు రసీదు ఇతర అవసరమైన పత్రాలను తీసుకురావాలి. వాక్-ఇన్ సెలక్షన్ ఆగష్టు 11న ఉదయం 8 గంటలకు జరగనుంది. అభ్యర్థులు హాజరయ్యే ముందు పూర్తి వివరాల కోసం అధికారిక BEL నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: 10 పాసైతే చాలు.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 2,615 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Also Read: 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. నెలకు
Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ట్రాయ్‌లో ఎలాంటి అనుభవం లేకుండానే ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేల జీతం! అప్లై చేసుకోండిలా!
Hyderabad, Telangana:TRAI Recruitment 2026: భారతదేశం అంతటా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ నెట్వర్క్ , డిటిహెచ్ (DTH), ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తున్న టెలికాం రంగంలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ నియామక ప్రక్రియను ప్రకటించింది. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ పోస్టులకు ఎంపిక కావడానికి ఎటువంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. అభ్యర్థులు 'అసోసియేట్ కన్సల్టెంట్' పదవికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పదవిలో ఎంపికైన వారికి రూ.80 వేలు నుండి ఆకర్షణీయమైన జీతం అందుతుంది.
ట్రాయ్ (TRAI) న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, అందులోని 'Vacancies' పోస్ట్‌ను ఎంపిక చేసుకుని, ఆపై 'Associate Consultant' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ ఈసీఈ పదవికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్ కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడింది. దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 27వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఎంపికైన అభ్యర్థులను మొదట ఏడాది కాలం పాటు నియమించుకోనున్నారు, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఆ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
ట్రాయ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలను నిశితంగా తనిఖీ చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా కొనసాగుతుంది, కాబట్టి ఇంటర్వ్యూ కోసం తప్పనిసరిగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలో అభ్యర్థుల అర్హతలు, అనుభవం గురించి చర్చించిన తర్వాత, వారిని తుది ఎంపిక చేస్తారు.
Also Read: ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లకుండానే.. మీ DL, RC పై మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండిలా!
Also Read: ఓనమ్ రద్దీకి రైల్వే మాస్టర్ ప్లాన్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి పుట్టిన తేదీ ఇతర వ్యక్తిగత వివరాలు పత్రాలతో సరిపోలేలా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అనంతరం అధికారిక వెబ్సైట్ https://trai.gov.in/vacancies ను ఓపెన్ చేసి, రిక్రూట్మెంట్ ఫారమ్‌ను నింపి సమర్పించాలి.
దరఖాస్తు విధానం కోసం:
మొదటగా అధికారిక వెబ్సైట్ https://trai.gov.in/vacancies ను ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉన్న 'Recruitment' విభాగంపై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. మీ వ్యక్తిగత విద్యా వివరాలను క్షుణ్ణంగా పూరించి, సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. చివరి దశలో, మీరు నింపిన అన్ని వివరాలను ఒకసారి జాగ్రత్తగా సరిచూసుకుని, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. దరఖాస్తు పూర్తయిన తర్వాత, భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ప్రింట్ అవుట్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medico Priyanka: మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల సహాయం
Nuzendla, Andhra Pradesh:Chandrababu Naidu: సినిమా థియేటర్‌కు వెళ్లి చిన్న వివాదంలో కారుతో ఢీకొట్టడంతో రాజమండ్రలిలో మెడికో ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలిని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ముందుకురాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా సీఎం చంద్రబాబు స్పందించారు.
రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సంతాప ప్రకటన చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
ప్రియాంక ఘటనపై ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని సీఎం అండగా నిలిచారు.
రేపు రాజమండ్రిలో బంద్
మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రియాంకను ప్రమాదానికి గురి చేసిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రి అనిత ఎవరూ కూడా కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు. వైద్య చికిత్స ఖర్చులకు కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయలేదు. నిందితులను కాపాడేందుకు ఎన్ని సూట్‌కేసులు తీసుకున్నారు? పోలీసుల వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ప్రియాంకకు న్యాయం జరగాలి' అని డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి నిరసనగా రేపు రాజమండ్రిలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలి మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు.
Medico Priyanka: మృత్యువుతో పోరాడి రాజమండ్రి హిట్ అండ్ రన్ మెడికో ప్రియాంక మృతి..
Hyderabad, Telangana:Medico Priyanka Dies: సినిమా థియేటర్ వద్ద చెలరేగిన చిన్న వివాదం ఓ మెడికో విద్యార్థి ప్రాణానికి తీసుకుంది. ఏపీలోని రాజమండ్రిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణం కోల్పోయారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్ వద్ద ప్రియాంకపై కారు ఎక్కించి యువకులు దుష్యంత్, ఆండ్రూ దారుణానికి పాల్పడ్డారు.
రాజమండ్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకను చేర్పించారు. ప్రాణాలతో పోరాడి ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్ టైర్ మెడపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురయిన తర్వాత మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉండడంతో రాజమండ్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అప్నియా టెస్ట్ కు ప్రియాంక శరీరం సహకరించపోవడంతో సోడియం లెవల్స్ 16 కన్నా తక్కువగా ఉండడంతో ఆమె మరణించారు.
మృతురాలి తండ్రి కన్నీరు మున్నీరు
యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మీకు ఆడపిల్లలు లేరా! అని ప్రశ్నించారు. ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా... మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? అని నిలదీశారు. తన కుమార్తె గురించి ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. 'ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరి అయిపోయాయి. సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కారుతో రెండుసార్లు గుద్ది మూడోసారి తొక్కించి స్పందించకుండా వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నా నిందితుల మీద కేసు పెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు? ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తన కుమార్తెపై నమోదైన కేసులో సెక్షన్లు తక్కువ శిక్షకు సంబంధించనివి ఉన్నాయని.. శిక్షలు పడేలా విచారణ జరుగుతుందా అనే దానిపై మృతురాలి తండ్రి వెంకటేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే అని ప్రకటించారు. తప్పతాగి ఇలాంటి ప్రమాదాలు చేసేవారిని వదిలిపెట్టకూడదని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తెలిపారు. 'కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి, ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తెలిపారు.
రాజమండ్రి పోలీసుల స్పందన
ఆమెకు జరిగింది ప్రమాదం కాదని, ఓ మాల్లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతో ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని పోలీసుల ప్రకటించారు. ప్రియాంకను ప్రమాదానికి గురిచేసిన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిశోర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా నిందితులు ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్యకేసుగా మారుస్తామని వివరణ ఇచ్చారు.
Vijayashanthi Bonalu: బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ విజయశాంతి.. ప్రత్యేక పూజలు
Hyderabad, Telangana:Hyderabad Bonalu: బోనాల వేడుకల్లో దద్దరిల్లిన మంగ్లీ పాటలు
Hyderabad, Telangana:Singer Mangli Singing At Lal Darwaza Bonalu 2026 Watch VideoChandrababu: ప్రకాశం బ్యారేజ్‌లో జల పరవళ్లు.. సీఎం చంద్రబాబు హర్షం
Tadepalle, Andhra Pradesh:AP CM Chandrababu Visits Prakasam Barrage Water Level Watch VideoDK Aruna Bonam: మైసమ్మకు బోనమెత్తిన ఎంపీ డీకే అరుణ
Mahbubnagar, Telangana:MP DK Aruna Offers Bonam To Maisamma In Mahabubnagar Watch VideoBonalu 2026: హైదరాబాద్‌లో ఆషాఢ బోనమెత్తిన విజయశాంతి
Hyderabad, Telangana:Cine Actress Vijayashanthi In Hyderabad Bonalu 2026 Watch VideoChhattisgarh: వామ్మో.. ఏకంగా హైకోర్టు జడ్జీ మీదనే చాతబడి.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్.!.
Hyderabad, Telangana:Man black magic rituals with chief justice photo in Chhattisgarh: ప్రస్తుతం మనం ఏఐ జనరేషన్ లో ఉన్నాం. రోజు రోజుకు ఏఐతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం. అందరు దీన్ని ఉపయోగించుకొవాలని, అడాప్ట్ చేసుకొవాలని నిపుణులు చెబుతున్నారు . ఇప్పటికి కూడా అనేక చోట్ల మూఢనమ్మకాలు, చాతబడి, బాణామతి, మంత్రాలు,బాబాలను నమ్ముతూ చాలా మంది తమ డబ్బుల్ని పొగొట్టుకుంటున్నారు. దీనిలో ఎక్కువగా చదువుకున్న వారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కత్తిపోటు కేసులో నిందితులకు బెయిల్ వచ్చేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా ఫోటో పెట్టుకుని కొంత మంది రాత్రి శ్మశానవాటికలోచేతబడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రచ్చగా మారింది. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్డర్ కేసులో బెయిల్ కోసం నలుగురు వ్యక్తులు అర్దరాత్రి.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోతో తాంత్రిక పూజల్ని నిర్వహించారు.
శనివారం మధ్యరాత్రి ఈ వింత సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని గ్రామస్తులు గమనించారు. ఆతర్వాత అక్కడకు వెళ్లి చూశారు. అక్కడి ఫోటోల్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిలో ముగ్గురు పారిపోగా, రిషికేష్ కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిరు. ఘటనా స్థలం నుంచి చేప, నిమ్మకాయలు, కుంకుమతో పాటు ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా, మరో ఇద్దరి ఫోటోలతో సహా క్షుద్రపూజలకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prakasam Barrage: కృష్ణా డెల్టాలో గోదావరి నది వరద చూసి సంబరపడ్డ సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Prakasam Barrage Water Levels: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్న కృష్ణా నదిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌లో కలిసిన గోదారమ్మ నీటి పరవళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటి లెక్కల వివరాలు ఆరా తీశారు. తన పర్యటనలో ఆకస్మికంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం చంద్రబాబు నిలవడం ఆసక్తికరంగా మారింది.
విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్‌పై సీఎం చంద్రబాబు కొద్దిసేపు తన వాహన కాన్వాయ్‌ను ఆపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు.
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన కాన్వాయ్ ఆపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్ లో… pic.twitter.com/vGsBV98iT1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 9, 2026
డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్ నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Varuna Yagam: రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు
Nandikonda, Telangana:Tomorrow Varuna Yagam: వర్షాభావం ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వర్షాలు భారీగా కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో రేపు నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవిహార్‌లో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
యాగం కోసం విజయవిహార్‌లో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరుణ యాగం జరిగే ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో రేపు జరగనున్న వరుణ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Lal Darwaza Bonalu: అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు
Hyderabad, Telangana:Lal Darwaza Temple: ఆషాఢమాసంలో హైదరాబాద్‌లో జగన్మాత స్మరణలో మునిగింది. గల్లీ గల్లీ.. వాడా వాడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక హైదరాబాద్ మొత్తం కోలాహలంగా మారింది. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోంది. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. తెలంగాణవాసుల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సహా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి' అని వివరించారు.
'వందల సంవత్సరాలుగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి..గతంలో నిజాం రాజు హయాంలో కూడా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
'బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి వైభవానికి ప్రతీక. హైదరాబాద్ మహానగరంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలను భక్తులు కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకోవాలని కోరుతున్నా' మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆలయాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
డెంగీ బారినపడి ఐసీయూకి దగ్గరగా బాలీవుడ్ భామ.. వర్షాకాలంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న 5 లక్షణాలు ఇవే!
Hyderabad, Telangana:Dengue Symptoms: వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల నటి స్వర భాస్కర్ కూడా డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం పెరగడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ క్రింది ఐదు లక్షణాలు కనిపిస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. గత ఐదేళ్లలో 968 కేసులు నమోదైనప్పటికీ, 2023లో రికార్డు స్థాయిలో 2,89,235 కేసులు నమోదై 485 మంది మరణించారు.
డెంగీ లక్షణాలు ప్రధానంగా జ్వరంతో మొదలవుతాయి. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ళ నొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం రావడం, కడుపు నొప్పి, ప్రతి 24 గంటల్లో మూడు కంటే ఎక్కువసార్లు వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం లేదా రక్త వాంతులు కావడం కూడా ముఖ్యమైన లక్షణాలే.
డెంగీ నివారణ మార్గాలు..
డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నివారించుకోవడం మంచిది. ఇది నిల్వ ఉన్న నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
ప్రతి వారం చేయాల్సిన జాగ్రత్తలు..
ఇంటి బాల్కనీలలోని మొక్కల పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని మార్చాలి. ఎయిర్ కూలర్ ట్యాంకులు, బకెట్లు, డ్రమ్ములలోని నీటిని ప్రతి వారం మార్చాలి. అలాగే వాటర్ బాటిల్స్, రెఫ్రిజిరేటర్ ట్రేలు, పాత టైర్లు, ఖాళీ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రూఫ్ గట్టర్లు, బాల్కనీ డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి డ్రమ్ములు, ట్యాంకులు, వాటర్ బాటిళ్లకు మూతలు గట్టిగా ఉండేలా చూసుకోండి. బకెట్లలో కూడా నీరు నిల్వ ఉండనివ్వకండి. డ్యామేజ్ అయిన మూతలు వెంటనే రిపేర్ చేయండి.
Also Read: బయట ఫుడ్ తిని కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ 5 వంటింటి చిట్కాలతో నిమిషాల్లో ఉపశమనం!
Also Read: మహిళకు తరచూ వచ్చే నడుమునొప్పి.. అడ్వాన్స్డ్ క్యాన్సర్‌కు సంకేతమా? హెల్త్ నిపుణుల హెచ్చరిక!
దోమలు రాకుండా ఉండటానికి ఇంటికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. దోమల నుండి రక్షణ కోసం మస్కిటో రిపెల్లెంట్లు వాడండి. శరీరం అంతా కవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. సాక్సులు, ఫుట్‌వేర్ వంటివి ఉపయోగించండి. కిటికీలకు మెష్ ఇన్స్టాల్ చేసుకోవడం, తలుపులకు గ్యాప్స్ లేకుండా చూడటం మంచిది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో ఉదయం సమయంలో నిద్రపోయే వారు తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించడం ద్వారా జాగ్రత్త వహించాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
