బెల్లంపల్లిలో సంతరించుకున్న వినాయక చవితి శోభ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుకాణాలు కొనుగోరుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి పూజ సామాగ్రి కేంద్రాలు ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేయడంతో రహదారులు రద్దీగా మారాయి. వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వినాయక విగ్రహాల కొనుగోలు జోరుగా సాగుతోంది. పూజ సామాగ్రి కోసం మండలాల నుండి పట్టణానికి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Independence Day: తెలంగాణలో ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేస్తారు? పూర్తి జాబితా ఇదే!
Baddipadaga, Telangana:Telangana Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో దేశభక్తిని చాటేలా అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. స్వాత్యంత్ర వేడుకల్లో ఏయే జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేయనున్నారనేది తెలంగాణ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా వందనం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జిల్లా.. జెండా ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ – ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హనుమకొండ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల – మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జనగామ – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జోగులాంబ గద్వాల – ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి
కామారెడ్డి – ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
కరీంనగర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమురంభీం ఆసిఫాబాద్ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్
మహబూబ్‌నగర్ – మంత్రి జూపల్లి కృష్ణారావు
మంచిర్యాల – ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
మెదక్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
మెద్చల్ – ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
ములుగు – మంత్రి దనసరి అనసూయ సీతక్క
నాగర్‌కర్నూల్ – ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి
నల్గొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నారాయణపేట – మంత్రి వాకిటి శ్రీహరి
నిర్మల్ – ప్రభుత్వ విప్ వెముల వీరేశం
నిజామాబాద్ – ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి – ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనర్సింహ
సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్యాపేట – మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్ – శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి – శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
వరంగల్ – మంత్రి కొండా సురేఖ
యాదాద్రి భువనగిరి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Independence Day: రేపు ఏపీలో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసే మంత్రులు వీరే..
Nuzendla, Andhra Pradesh:80th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గొందు గొందులో భారతదేశ గీతాలు వినిపించనున్నాయి. స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముస్తాబైంది. ప్రతి గల్లీలో.. ప్రతి ఊరిలో.. ప్రతి జిల్లాలో జరగనున్న వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రుల నియామకం చేపట్టింది. ఆగస్టు 15న అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా.. ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు.
జిల్లాల వారీగా మంత్రుల జెండావందనం
- ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేశ్
- శ్రీకాకుళంలో జెండా ఎగరేయనున్న మంత్రి అచ్చెన్నాయుడు
- కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
- పల్నాడులో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
- నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ
- అనకాపల్లిలో మంత్రి వంగలపూడి అనిత
- చిత్తూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్
- పశ్చిమగోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు
- విశాఖపట్నంలో మంత్రి అనగాని సత్యప్రసాద్
- తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్
- కర్నూలులో జెండా ఆవిష్కరించనున్న మంత్రి టీజీ భరత్
- కడపలో మంత్రి NMD మహమ్మద్ ఫరూక్
- ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి
- ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
- బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
- తూర్పుగోదావరిలో మంత్రి కందుల దుర్గేష్
- పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
- నంద్యాలలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
- శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్.సవిత
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్
- విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- అల్లూరి సీతారామరాజు, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో జాతీయ పతాకం ఆయా జిల్లాల కలెక్టర్లు ఆవిష్కరించనున్నారు.
Teacher Hair: టీచరమ్మకు పనోళ్లుగా విద్యార్థి.. జడ వేయించుకున్న టీచర్
Kesamudram, Telangana:Teacher Ties Her Hair Braided With A SSC Student In KGBV Hostel Watch Viral VideoIndependence Day: విద్యుద్దీపాల కాంతుల్లో ఏపీ అసెంబ్లీ జిగేల్ జిగేల్
Amaravati, Andhra Pradesh:AP Assembly Building Illuminated Visuals For 80th Independence Day Celebrations Watch VisualsIndependence Day: విద్యుద్దీపాల వెలుగుల్లో ఏపీ సెక్రటేరియట్ జిగేల్
Velgapudi, Andhra Pradesh:AP Secretariat Building Colorful Lightings For 80th Independence Day Celebrations Watch Visualsబెస్ట్ స్వాతంత్ర దినోత్సవ వీడియో విషెస్..
Hyderabad, Telangana:80వ స్వాతంత్య్ర దినోత్సవ గ్రీటింగ్స్..
Hyderabad, Telangana:Happy 80th Independence Day: మత, భాష, సాంస్కృతులలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. భారతీయులమంతా ఒక్కటే అని ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విజయవంతంగా కొనసాగుతోందని ఈ వేడుకలే ప్రత్యక్ష నిదర్శనం.. కాబట్టి ఇలా స్వాతంత్ర వేడుకలు ఎల్లప్పుడూ కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ.. దేశభక్తిని పెంపొందించడానికి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ను పంపండి..
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
Hyderabad, Telangana:Happy 80th Independence Day Telugu: స్వేచ్ఛ వాయువుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను గుండెల్లో గుడిగా మలుచుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది.. 80 ఏళ్ల స్వేచ్ఛ ప్రస్థానంలో సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. నవభారత నిర్మాణానికి పునరంకితమవుదాం.. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున.. ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని నింపేందుకు ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పంపండి..Independence Day 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ఏర్పాట్లు..
Nunna, Vijayawada, Andhra Pradesh:80th Independence Day 2026: మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేశారు.Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాట బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట..ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం!
Karur, Tamil Nadu:Karur Stampede Govt Job News: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇటీవలే ఆ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమావేశం అయ్యారు. ఈ విషాదాన్ని మానని గాయంగా అభివర్ణించిన ఆయన..బాధితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను మద్రాసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఇదే విషయాన్ని దేశంలోని అత్యున్నత ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం పట్ల తప్పేమి లేదని అభిప్రాయపడింది.'డెడ్ డ్రాప్' కేసులో సంచలన విషయాలు.. అమ్మాయిలపై లైంగిక దాడి, సొంతంగా అబార్షన్
Hyderabad, Telangana:Dead Drop Marijuana Case: గంజాయి మత్తులో ఘోరాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. డెడ్ డ్రాప్ విధానంలో గంజాయి విక్రయిస్తూ.. పోలీసులు దాడి చేస్తే వారిపై ఓ కుక్కతోపాటు తుపాకీతో ఎదురుదాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలానగర్‌లో ఆన్లైన్ పద్ధతిలో ఆరేళ్ల నుంచి గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బొల్లా బ్రదర్స్ ఈ గంజాయి దందా చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బొల్లా కిరణ్ దారుణాలకు పాల్పడ్డాడని తెలిసింది. అమ్మాయిలతో కూడా అతడు వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రోజుకు డెడ్ డ్రాప్ ద్వారా 25 సార్లు గంజాయిని బొల్లా బ్రదర్స్ విక్రయిస్తున్నారు. గంజాయి ముఠా బొల్లా బ్రదర్స్‌తో ఐదు మంది కానిస్టేబుల్స్, ఎస్ఐతో ప్రయివేటు పార్టీలు ఈ ముఠా చేసుకుంది. కేసుల్లో నిందితులను పట్టుకొని రావడానికి కారును బొల్లా బ్రదర్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే పోలీసులతో కలిసి పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇక కృష్ణవేణి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఈ గంజాయి దందా చేస్తోందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా కృష్ణవేణికి అబార్షన్ అయ్యేలా బొల్లా కిరణ్ అనైతికంగా ప్రవర్తించాడు. ఈ కేసులో నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్సైను పోలీస్ శాఖ హెడ్ క్వాటర్స్‌కు అటాచ్ చేసింది. ఒరిస్సా నుంచి 31 మంది రోజు బొల్లా బ్రదర్స్‌కి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిసింది.
మొత్తం 203 కస్టమర్లకి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా బ్రదర్స్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గంజాయి విక్రయాలతో వచ్చిన డబ్బులతో అమ్మాయిలపై బొల్లా కిరణ్ పెట్టుబడి పెట్టాడు. వరంగల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి మైనర్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారు గర్భం దాలిస్తే సొంతంగా అబార్షన్ చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గర్భం దాల్చిన అమ్మాయిలపై బొల్లా కిరణ్ దాడులకు తెగబడ్డాడు. గర్భం దాల్చిన అమ్మాయి కడుపులపై దాడులు చేసి అబార్షన్ అయ్యేలా క్రూరంగా బొల్లా కిరణ్ వ్యవహరించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సొంతంగా అమ్మాయిలకు అబార్షన్ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. డబ్బులకు ఆశపడి కిరణ్ అఘాయిత్యాలను బాధిత అమ్మాయిలు బయటకు చెప్పలేదు. అమ్మాయిల పేరుతో సిమ్‌లు తీసుకుని ఆ నంబర్లతో గంజాయి దందాకు వాడుతున్నాడు.
ఒక మహిళ ఖాతాలో లక్షల రూపాయల లావాదేవీలు అధికారులు గుర్తించారు. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకోవడం గమనార్హం. పోలీసులపై దాడులు చేసేందుకు ఏకంగా రెండు కుక్కల్ని బొల్లా కిరణ్ పెంచాడు. పోలీసులను బెదిరించడానికి ఒక తుపాకీ కూడా ఉంది. ఆరు సంవత్సరాల నుంచి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా కిరణ్ గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. అతడికి కస్టమర్లుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. బొల్లా కిరణ్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Uber Rapido Merger: ఉబర్-ర్యాపిడో విలీన చర్చలపై అర్ధాంతర బ్రేక్..మేనేజ్మెంట్ విభేదాలే కారణమా?
Hyderabad, Telangana:Uber Rapido Deal: అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్, భారతీయ స్టార్టప్ రాపిడోతో కలిసి పనిచేసేందుకు జరిపిన చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దేశీయంగా తమ కార్యకలాపాలను విలీనం చేసుకునే దిశగా అడుగులు వేసినప్పటికీ, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది.
చర్చల వెనుక అసలు కథ
ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి ఈ ఏడాది మే నెలలో ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. దేశంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలపై ఆయన వరుస సమీక్షలు జరిపారు. ఈ క్రమంలోనే రాపిడోతో విలీనం అంశం తెరపైకి వచ్చింది.
ఉబర్ ప్రతిపాదన ఏమిటంటే?
క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలందిస్తున్న ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఉబర్ తొలుత ప్రతిపాదించింది. అంతేకాకుండా, దేశీయంగా తమ కార్యకలాపాలన్నింటినీ రాపిడో బృందమే నిర్వహించాలని సూచించింది.
అయితే, రాపిడో మాత్రం అందుకు భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఉబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్-స్టాక్ లావాదేవీ రూపంలో విక్రయించాలని, రాపిడోలో ఉబర్ కేవలం మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉండాలని కోరింది.
డీల్‌కు ఎందుకు బ్రేక్ పడింది?
భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా వేరే సంస్థకు విక్రయించడం ఇష్టం లేని ఉబర్.. రాపిడో ప్రతిపాదనను తిరస్కరించింది. మేనేజ్మెంట్ కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలని ఉబర్ భావించగా, రాపిడో పూర్తి స్థాయి యాజమాన్యాన్ని కోరడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎవరికి వారుగా స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రాపిడోకు గట్టి పోటీనిచ్చేందుకు ఉబర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన బైక్ ట్యాక్సీ సేవలను కొత్తగా మరో 100 నగరాలకు విస్తరించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 220 నగరాల్లో ఉబర్ బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది
Also Read: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teacher Hair: విద్యార్థితో దర్జాగా జడ వేయించుకున్న ఇంగ్లీష్ టీచరమ్మ.. వీడియో వైరల్
Kesamudram, Telangana:KGBV Teacher Hair Video: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు తమ సొంత పనులు చేపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ విద్యార్థులతో జుట్టు వేయించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని తో జడలు వేయించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా మిగతా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరు విద్యార్థులతో గుంజీలు తీయించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు అర్చన ఉన్నారు. ఆమె పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినితో జడలు వేయించుకున్నారు. ఆ దృశ్యాలు ఎవరో ఫోన్లో చిత్రీకరించారు. అంతేకాకుండా మరో విద్యార్థి కూర్చుని ఉండగా ఏమైంది? అంటూ దురుసుగా ప్రవర్తించారు. 20 గుంజీలు తీయించారు అని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె మాత్రం విద్యార్థినితో దురుసుగా మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.
టీచర్ చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఆమె ఇలా తన సొంత పనులు చేయించుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది ఇల్లా లేక ఆ పిల్లలు పనిమనుషులా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ఎప్పుడూ ఇలానే ఉంటుందని.. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇంగ్లీష్ టీచర్ అర్చనను సస్పెండ్ చేయాలని కేజీబీవీలోని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా కేజీబీవీలో మరికొందరు పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సరైన ఆహారం పెట్టడం లేదని.. తమ గురుకులంలో మౌలిక వసతులు కరువయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. కేజీబీవీపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ. వెంటనే కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Midnight Independence: భారతదేశానికి అర్ధరాత్రే స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 వెనుక దాగున్న జోతిష్య రహస్యం!
Hyderabad, Telangana:Midnight Independence Astrology: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆల్ ఇండియా రేడియో వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. 1948 జూన్ వరకు ఉన్న గడువును ముందుకు జరిపి, 1947 ఆగస్టు 15నే భారత్‌కు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశమంతా పండగలా భావించే ఈ వార్త మదనానంద్ను అపారమైన భయాందోళనలోకి నెట్టింది.
వెంటనే ఆయన తన జ్యోతిష్య పటాలను, గ్రహాల చక్రాలను పరిశీలించగా.. ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. "గ్రహాల స్థితి దారుణంగా ఉంది.. ఆ రోజు భారత్ జన్మించకూడదని" ఆయన అంతరాత్మ ఘోషించింది.
జ్యోతిష్కుల హెచ్చరికలు - అశుభ ముహూర్తం
మదనానంద్ ఒక్కరే కాదు.. కలకత్తా, బెనారస్, దక్షిణ భారతదేశంలోని దిగ్గజ జ్యోతిష్కులందరూ ఖగోళ చక్రాలను పరిశీలించగా అందరి లెక్కింపుల ముగింపు ఒక్కటే అయింది. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి నిర్ణయించిన 'ఆగస్టు 15' అత్యంత అశుభకరమైన రోజు!
ఆ రోజు శుక్రవారం కావడం, మకర లగ్నంలో శని, రాహువుల ప్రభావం ఉండటం, గురు, శుక్ర గ్రహాలు అత్యంత అపశకున స్థానాల్లో కొలువై ఉండటం దేశానికి పెను ముప్పు తెస్తుందని వారు నమ్మారు. ఈ తేదీని మార్చకపోతే వరదలు, కరువులు, దారుణమైన మారణకాండలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తూ మదనానంద్ స్వయంగా మౌంట్‌బాటన్‌కు లేఖ రాశారు. "భగవంతుడి మీదొట్టు.. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకండి" అని వేడుకున్నారు. మరోవైపు ప్రముఖ జ్యోతిష్కులు జవహర్లాల్ నెహ్రూతో సహా ప్రధాన నాయకులను కలసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మౌంట్‌బాటన్ పట్టుదల వెనుక కారణం
బ్రిటీష్ వారు వేలాది ఏళ్లుగా వస్తున్న జ్యోతిష్య సాంప్రదాయాన్ని, ఖగోళ నమ్మకాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకుండా ఈ తేదీని ప్రకటించారు. నిజానికి దీని వెనుక మౌంట్‌బాటన్ వ్యక్తిగత ఉద్దేశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మిత్రరాజ్యాలకు లొంగిపోయి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భం ఆగస్టు 15. తన అధికారానికి, విజయానికి గుర్తుగా ఆయన హఠాత్తుగా ఈ రోజును ఎంచుకున్నారు.
రాజకీయ వేగం పుంజుకున్న ఆ సమయంలో బ్రిటీష్ వారు ప్రకటించిన తేదీని మార్చడం అసాధ్యంగా మారింది. అలాగని కోట్ల మంది నమ్మకాలను, జ్యోతిష్కుల హెచ్చరికలను తోసిపుచ్చడం నాయకులకు ఇష్టం లేదు. దేశ విభజన, రాజకీయ ఉద్రిక్తతలతో రగిలిపోతున్న వేళ.. కొత్త దేశానికి అశుభ ముహూర్తం ఉందనే భయం ప్రజల్లో ఉండకూడదని భావించారు.
నెహ్రూ చతురత - అర్ధరాత్రి పరిష్కారం
సరిగ్గా ఇక్కడే జవహర్లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన, వినూత్నమైన పరిష్కారాన్ని ఆలోచించారు. పాశ్చాత్య కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు దాటగానే కొత్త రోజు (ఆగస్టు 15) ప్రారంభమవుతుంది. కానీ, హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు మొదలవుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం ఇంకా పాత రోజు (ఆగస్టు 14) కిందకే వస్తుంది.
జ్యోతిష్య బలం..
వైదిక జ్యోతిష్యం ప్రకారం పగలు, రాత్రి కలిసే సంధ్యా సమయం లేదా అభిజిత్ ముహూర్తం, రాజ్య స్థాపనకు అత్యంత అనుకూలమైన 'పుష్య నక్షత్రం' ప్రభావం ఆ అర్ధరాత్రి వేళ అందుబాటులో ఉన్నట్లు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త కేఎన్ రావు పేర్కొన్నారు.
ఈ చిక్కుముడిని విప్పడానికి నెహ్రూ ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నామే రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దానిని రాత్రి వరకు కొనసాగించారు. సరిగ్గా రాత్రి 12 గంటలు కొట్టే సమయానికి స్వాతంత్ర్య ప్రకటన చేశారు.
దీనివల్ల పాశ్చాత్యుల లెక్కల ప్రకారం ఆగస్టు 15 ప్రారంభమైనట్లూ అయింది, భారతీయ జ్యోతిష్య లెక్కింపుల ప్రకారం అశుభకరమైన ఆగస్టు 15 సూర్యోదయానికి ముందే అనుకూలమైన ముహూర్తంలో దేశం పురుడు పోసుకున్నట్లూ అయింది. ఈ తెలివైన పరిష్కారానికి మౌంట్‌బాటన్ కూడా అంగీకరించారు.
అలా జ్యోతిష్కుల హెచ్చరికలు, లార్డ్ మౌంట్‌బాటన్ పట్టుదల, నెహ్రూ చతురతల కలనేతగా భారత్ 'అర్ధరాత్రి' వేళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. "ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారత్ సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది" అంటూ నెహ్రూ ఇచ్చిన చారిత్రాత్మక పిలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఈ ఖగోళ, ముహూర్తాల విచిత్ర సంగ్రామమే!
Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవాల వేళ 1,057 మందికి సర్వీస్ మెడల్స్..ముగ్గురికి మరణాంతరం ప్రకటన!
Hyderabad, Telangana:Independence Day Medals 2026: 2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోమ్ గార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్ (జైలు శాఖ) విభాగాలకు చెందిన మొత్తం 1,057 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు దక్కినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బందికి మరణానంతరం శౌర్య పతకాలు లభించడం విశేషం.
మరణానంతరం శౌర్య పతకాలు పొందిన వారు
దివంగత నితేష్ ఎక్కా (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)
దివంగత రమేష్ కోరేటి (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)
దివంగత సునీల్ కుమార్ (ఇన్స్పెక్టర్, ఉత్తరప్రదేశ్ పోలీస్)
పతకాల వివరాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 1,057 పురస్కారాలను ప్రకటించగా.. ఏ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
శౌర్య పతకాలు (గ్యాలెంటరీ ఆఫ్ మెడల్ అవార్డ్స్) కోసం 301 మందిని ఎంపిక చేశారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకాలకు (ప్రెసిడెంట్ మెడల్స్) దాదాపుగా 92 మందిని ఎంపిక చేయగా.. ప్రశంసనీయ సేవలకు పతకాలు (మెడల్ ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్) విభాగంలో 664 మందికి పురస్కారాలను బహుకరించనున్నారు.
శౌర్య పతకాల కేటాయింపు విశేషాలు
ప్రకటించిన 301 శౌర్య పతకాలలో వివిధ ప్రాంతాల వారీగా ప్రాధాన్యత లభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి 197 మందిని.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి 51 మంది.. ఈశాన్య రాష్ట్రాల నుంచి 12 మందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి 41 మందిని ఎంపిక చేశారు.
ఈ శౌర్య పతకాలను పొందిన వారిలో 272 మంది పోలీసు సిబ్బంది, 29 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉన్నారు. ప్రాణాలు, ఆస్తుల రక్షణలో, నేరాల నివారణలో లేదా నేరస్తుల అరెస్టులో అత్యంత సాహసోపేతమైన చర్యలు చేపట్టిన సిబ్బందికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
సేవా పతకాల విభజన
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాల కోసం 92 మందిని ఎంపిక చేయగా.. అందులో పోలీసు శాఖ (83), అగ్నిమాపక శాఖ (4), పౌర రక్షణ, హోమ్ గార్డ్ (3), కరెక్షనల్ సర్వీస్/జైలు శాఖ (2)లో వారు ఉన్నారు. మెరిటోరియస్ సేవా పతకాల కోసం 664 మందికి ప్రదానం చేయనుండగా.. వారిలో పోలీసు శాఖ నుంచి 606 మంది.. అగ్నిమాపక శాఖలో 28 మంది, పౌర రక్షణ- హోమ్ గార్డ్ నుంచి 18 మంది, కరెక్షనల్ సర్వీస్ 12 మంది ఉన్నారు.
సేవలో అత్యుత్తమ విశిష్టతను కనబరిచిన వారికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని, అంకితభావంతో విలువైన సేవలు అందించిన వారికి మెరిటోరియస్ సేవా పతకాన్ని ప్రదానం చేస్తారు.
Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Also Read: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
