మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి సందర్బంగా నివాళులు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదలకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి గుండా మల్లేష్ అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
IND Vs BAN Asia Cup: నేడు భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్..ఆసియా కప్ ట్రోఫీకి చేరువలో టీమ్ఇండియా..
Dubai, Dubai:IND Vs BAN Asia Cup Semi Final: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అత్యంత ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు, నిగర్ సుల్తానా నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో భారత్ వరుస విజయాలతో అత్యంత బలంగా కనిపిస్తుండగా, బంగ్లాదేశ్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ 10న రాత్రి 8:00 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, SonyLIV యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
గ్రూప్ దశలో టీమ్ఇండియా విజయవిహారం
గ్రూప్ దశలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేసింది. తమ గ్రూప్ మ్యాచ్‌లలో థాయిలాండ్, హాంకాంగ్, సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌లను భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానమైన ప్రతిభను కనబరిచిన భారత్, మరో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
బంగ్లాదేశ్ ప్రదర్శన, హెడ్-టు-హెడ్ రికార్డు
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ప్రదర్శన అంత గొప్పగా లేదు. గ్రూప్-బిలో శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. గత గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫార్మాట్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు 24 సార్లు ముఖాముఖి తలపడగా, భారత్ ఏకంగా 21 మ్యాచ్‌లలో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్ సమయం..
ఈ కీలకమైన సెమీ-ఫైనల్ మ్యాచ్ గురువారం, సెప్టెంబర్ 10న యూఏఈ (UAE)లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం టీవీలో Sony Sports Network ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూడాలనుకునే వారు SonyLIV యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు.
జట్ల వివరాలు (స్క్వాడ్స్)
భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందిని శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, ప్రతీకా రావల్, రాధా యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు: దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), షర్మిన్ అక్తర్, షోర్నా అక్టర్, ఫహిమా ఖాతున్, నహిదా అక్తర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మరుఫా అక్టర్, ఫర్జానా ఈస్మిన్, శంజిదా అక్టర్ మేఘ్లా.
Also Read: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!
Also Read: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Devotees Insurance: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..దేశంలోనే తొలిసారి భక్తుల కోసం కీలక నిర్ణయం!
Tirupati, Andhra Pradesh:TTD Devotees Insurance News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా భక్తులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు జీవిత బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.Employees PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 2026లో పీఆర్సీ రాదు..రిపోర్ట్ మాత్రమే!
Hyderabad, Telangana:Employees PRC Report: ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ (PRC)తో పాటు ఇతర పలు అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడమే కాకుండా, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు విషయంలోనూ పూర్తి స్పష్టత ఇచ్చింది. అయితే ఈ ఏడాది 2026లో పీఆర్సీ రాదని..కేవలం రిపోర్ట్ మాత్రమే అని అంటున్నారు. డీఎన్ఏ విత్ భరత్‌లో ఇదే అంశంపై కీలక చర్చ జరిగింది.Ishan Kishan 350 Runs: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!
Hyderabad, Telangana:Ishan Kishan 350 Runs Duleep Trophy: చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరిగిన 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ - బ్యాటర్ మొదటి ఇన్నింగ్స్‌లో 344 బంతుల్లో 270 పరుగులు చేసి, తన జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం సౌత్ జోన్ జట్టును 336 పరుగులకే ఆలౌట్ చేసిన ఈస్ట్ జోన్, 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని పొందింది. రెండవ ఇన్నింగ్స్‌లోనూ తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగించిన కిషన్, వేగంగా ఆడుతూ 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.
2023లో భారత జట్టుకు దూరమై, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అనంతరం, తన మనస్తత్వాన్ని మార్చుకుని దేశవాళీ క్రికెట్లో కష్టపడి తిరిగి వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించాడు. అతిగా ఆలోచించడం మాని, కేవలం పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టడమే ఈ ఘనతకు కారణమని కిషన్ వెల్లడించాడు.
ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 350 పరుగులు సాధించడం ద్వారా, దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కిషన్ ఘనత వహించాడు. దీనితో పాటు 1987 అక్టోబర్‌లో భిలాయిలో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున రమణ్ లాంబా నెలకొల్పిన 320 పరుగుల సుదీర్ఘ రికార్డును కూడా అతను అధిగమించాడు.
ఈ చారిత్రాత్మక విజయం అనంతరం మాట్లాడిన కిషన్.. తన కెరీర్లో ఎదురైన క్లిష్ట సమయం గురించి పంచుకున్నాడు. 2023లో భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడినప్పటికీ, ఊహించని పరిణామాల వల్ల అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించిన కిషన్, 2025-26 రంజీ ట్రోఫీలో సెంచరీలు సాధించాడు.
అంతేకాకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు సెంచరీలతో కలిపి మొత్తం 517 పరుగులు చేసి జార్ఖండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ అద్భుతమైన దేశవాళీ ప్రదర్శనలతో అతడు తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను సాధించడమే కాకుండా, భారత వైట్-బాల్ (వన్డే, టీ20) జట్లలో కూడా చోటు దక్కించుకున్నాడు.
తనలో వచ్చిన ఈ మార్పు గురించి కిషన్ వివరిస్తూ.. "మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అతిగా ఆలోచించకపోవడం, అనవసరమైన అంచనాలను పక్కన పెట్టడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి" అని తెలిపాడు. కేవలం మైదానంలోకి దిగి పరుగులు చేయడం, జట్టును గెలిపించడంపైనే తన దృష్టి ఉందని అతడు స్పష్టం చేశాడు.
Also Read: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..
Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indian Railways: తత్కాల్ కొత్త రూల్స్ వచ్చినా దక్కని ప్రయాణం.. సెకన్లలోనే 'నో రూమ్'!
Hyderabad, Telangana:Tatkal Ticket Booking: రైల్వే ప్రయాణం ఎంతో సులభతరం. భారతీయరైల్వేలో టిక్కెట్ ధరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. దీంతో ఎక్కువశాతం మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా కూడా చాలా మంది సొంతూళ్లకు వెళ్లడానికి రైలు టిక్కెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దొరకని వారు తత్కాల్ ఉందిలే అనుకుంటున్నారు. కానీ, ఇది కూడా సెకన్లకే నో రూమ్ అని కనిపించడంతో ప్రయాణీకులు తలలు పట్టుకుంటున్నారు.
ఐఆర్సీటీటీ వెట్‌సైట్ లేదా యాప్ ద్వారా కూడా తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కష్టతరంగానే మారింది. ఇక రానున్న దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా ఆ డిమాండ్ మరింత పెరుగుతోంది. సాధారణంగా అయితే, రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 8వ తేదీ దీపావళి సందర్భంగా ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీరంతా ఉదయం 8 గంటలే బుక్ చేయాలి. ఇవి కూడా రెండు మూడు నిమిషాల్లోనే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. కనీసం అందుబాటులో ఉన్న టిక్కెట్లు కూడా కనిపించవు. ఇందులో టెక్నికల్ సమస్యలతో ఒక్కోసారి పేమెంట్ కూడా పూర్తవ్వదు.
ప్రధానంగా ఉదయం 8 గంటల సమయంలో టిక్కెట్లు బుక్ చేయాలంటే హెవీ ట్రాఫిక్ వల్ల బుకింగ్ కష్టతరంగా మారింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, బీటా వెర్షన్, రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లు కొద్దిసేపటికే వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు బుక్ చేసే తత్కాల్ కూడా ఇదే పరిస్థితి.
ఇక పండుగల సమయంలో అయితే, ఢిల్లీ, ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలకు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రూట్లో డిమాండ్ కూడా ఎక్కువ. దీంతో టిక్కెట్ బుకింగ్ కూడా త్వరగా ఫిల్ అవుతుంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ ఇలాంటి సమయంలో దొరకవు.
Also Read: విశాఖ వాసులకు రైల్వే అలర్ట్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు
Also Read: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా 20 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ మీదుగా ఎన్నంటే?
నాన్ ఏసీ తత్కాల్ బుకింగ్..
తత్కాల్ అన్నీ ఏసీ క్లాసులు ఉదయం 10 గంటలకు ప్రతిరోజూ టిక్కెట్ బుకింగ్ ఓపెన్ అవుతే.. ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ స్లీపర్ క్లాసులు ఓపెన్ అవుతాయి.
రైల్వే ప్రయాణీకులు ఉదయం 11 గంటలకు స్వీపర్ బుకింగ్ ఓపెన్ అవుతే, లాగిన్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. మరోవైపు పేమెంట్ చెల్లింపులు ఫెయిల్యూర్, టెక్కికల్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. 2025 జూలై 1 నుంచి తత్కాల్ ప్రీమియం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఆధార్ అథెంటికేషన్, ప్రోఫైల్ వెరిఫై, ఓటీపీ వయా అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. ఇక మొదటి అరగంట వరకు ఏజెంట్స్ బుకింగ్ కూడా నిలిపివేశారు. ఉదయం 10 నుంచి 10:30 గంటలు, నాన్ ఏసీ ఉదయం 11:00 నుంచి 11:30 వరకు రెగ్యులర్ ప్రయాణీకులు మాత్రమే బుకింగ్ చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free AC Bus Travel: మహిళలకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇకపై ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! సీఎం కీలక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:Free AC Bus Travel For Woman: మహిళలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనితో పాటు సూపర్ సిక్స్ హామీలు, పింఛన్ల పంపిణీ, దీపం పథకం మరియు మెగా డీఎస్సీ విజయవంతం కావడంపై సీఎం కీలక వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 'స్త్రీశక్తి' పథకం ద్వారా ఆర్టీసీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఇప్పటివరకు ఏసీ బస్సుల్లో లేదు. ఈ నేపథ్యంలో మహిళల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
మహిళలు చల్లటి ఏసీ బస్సులలో హాయిగా, సురక్షితంగా, గౌరవప్రదంగా ప్రయాణించాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో నూతన ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వాటిల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు, దైవ దర్శనాలు లేదా కుటుంబ అవసరాల కోసం పుట్టింటికి వెళ్లే మహిళలు ఈ ఏసీ బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఉచిత ప్రయాణ సదుపాయం దివ్యాంగులకు కూడా వర్తిస్తోందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి "సూపర్ సిక్స్" హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. పేదవాడి చేతికి నేరుగా లబ్ధి చేకూర్చడమే నిజమైన సంక్షేమం అని, ఈ విషయంలో తమ ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలోనే పేదలకు ఏకంగా రూ.73,000 కోట్లు అందించామని, ప్రతి నెలా ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే అద్భుతమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
అంతేకాకుండా, ఆడబిడ్డల వంటింటి కష్టాలను తీర్చడానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే 'దీపం' పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించామని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి తగినన్ని నిధులు రాబడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
గత పాలకులు మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి ఏకంగా 350 కేసులు వేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ, కోర్టులో తీవ్రంగా పోరాడి మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఎన్ని కుట్రలు, అడ్డంకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? సెప్టెంబరు 11న ఆంధ్ర, తెలంగాణల్లో పరిస్థితి ఇదే!
Also Read: స్కూల్ సెలవు కోసం తోటి విద్యార్థిని చంపబోయి..బాలుర గురుకుల పాఠశాలలో ఘోరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Trump Midterm Election: ఇరాన్‌తో భీకర యుద్ధం వేళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?
Pensacola, Florida:Trump Midterm Election 2026: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ఇరు రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల నేపథ్యంలో ఓ సంచలన ప్రకటన చేశారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం కూడా ముగిసిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వాషింగ్టన్ రాజకీయంలో మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఈ యుద్ధాన్ని సాగదీస్తోందని, అమెరికా ఓటర్లను గందరగోళానికి గురిచేసి అక్కడ బలహీనమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా క్షిపణి దాడులు చేయగా, జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.
డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు వైట్ హౌస్ వద్ద డోనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. వాషింగ్టన్లో రాజకీయ అధికార మార్పుపై ఆశలతో ఇరాన్ పోరాటాన్ని పొడిగిస్తోందని చెప్పారు. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అమెరికాలో బలహీనమైన పాలకులు ఉంటే సులువుగా అణుఆయుధాలు సమకూర్చుకోవచ్చని ఇరాన్ భావిస్తోందని విమర్శించారు. అయితే ఇరాన్ వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉంటే ప్రపంచానికే ప్రమాదమని, అలాంటి పరిస్థితిని రానివ్వనని స్పష్టం చేశారు.
చర్చలకు అమెరికా నిరాకరణ
ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపే ఆలోచన ప్రస్తుతం అమెరికాకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా జరిపిన సైనిక చర్యల ధాటికి ఇరాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలు పూర్తిగా అతలాకుతలమయ్యాయని, ఇప్పుడు ఆ దేశంలో మిగిలింది చాలా తక్కువేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో చర్చలు జరిగినా, అది కేవలం అణు ఒప్పందానికే కాకుండా గతంలో ఎన్నడూ లేని కఠిన నిబంధనలతో ఉంటుందని తేల్చి చెప్పారు.
పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా క్షిపణి దాడులు
గల్ఫ్ జలాల్లో ఇరాన్‌కు చెందిన చమురు రవాణా నౌకలు, ఇంధన నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన దాదాపు తొమ్మిది భారీ చమురు ట్యాంకర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందని ట్రంప్ ధృవీకరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, గత 48 గంటలుగా అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడటంతో ప్రతిచర్యగా ఈ దాడులు జరిగాయి.
ఓమన్ గల్ఫ్‌లోని నాలుగు ముడి చమురు నౌకలతో పాటు, ఖార్గ్ ఐలాండ్ సమీపంలో ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్‌తో సంబంధమున్న నౌకను ధ్వంసం చేశారు. దాడికి ముందే నౌకలోని సిబ్బందిని బయటకు పంపినట్లు, తమ దళాలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా ప్రకటించింది.
మరోవైపు అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ బలగాలు జోర్డాన్‌లోని 'మువఫ్ఫాక్ సాల్టీ' వైమానిక స్థావరంపై క్షిపణులతో దాడి చేశాయి. ఈ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలు తమ సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తుండటంతో దానిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధ ప్రభావం రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?
అమెరికాలో ప్రస్తుతం జరగబోయే మధ్యంతర ఎన్నికలు అధ్యక్ష పదివికి అని కొందరిలో అభిప్రాయం ఏర్పడింది. అమెరికాలో త్వరలోనే జరగబోయే ఎన్నికలు మన రాష్ట్రాల్లోని శాసన మండలి, పార్లమెంట్‌లోని రాజ్యసభను పోలి ఉంటాయి. ఈ మధ్యంతర ఎన్నికల ద్వారా అమెరికన్ కాంగ్రెస్‌లోని (పార్లమెంట్) ప్రతినిధుల సభలో అన్నీ స్థానాలకు, అలాగే సెనేట్ల సభలో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ అన్నీ స్థానాల్లో ఓడిపోయినా.. ట్రంప్ తన పదవిని కోల్పోయే అవకాశం లేదు. కానీ, చట్టసభల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ట్రంప్ ప్రభుత్వం పట్టు కోల్పోయి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందే అవకాశం లేదు. కాబట్టి, ఈ మధ్యంతర ఎన్నికల ద్వారా డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిని కోల్పోతాడనే అభిప్రాయాల్లో నిజం లేదు.
Also Read: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం..209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం
Also Read: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!
Apple iPhone 18 Launch: యాపిల్ ఐఫోన్ 18 సంచలనం..మడతబెట్టే ఐఫోన్ వచ్చేసింది..ఒక్కోటి రూ.3 లక్షలు మాత్రమే!
Hyderabad, Telangana:Apple iPhone 18 Duo Launch: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'తో పాటు ఐఫోన్ 18 శ్రేణిని ప్రపంచానికి పరిచయం చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరిగిన 'సర్ప్రైజ్ అండ్ షైన్' కార్యక్రమంలో కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఈ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఫోల్డబుల్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఏ20 ప్రో చిప్, అధునాతన కెమెరాలు, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఏఐ ఆధారిత ఫీచర్లు, నూతన వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడళ్లు ఈ ఆవిష్కరణలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ నూతన సీఈఓ జాన్ టెర్నస్ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ సహా సంస్థ తొలి ఫోల్డబుల్ వెర్షన్‌ను ప్రదర్శించారు.
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'..
అందరూ ఆసక్తిగా ఎదురుచూసినట్లుగానే యాపిల్ తన తొలి మడతబెట్టే ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను పరిచయం చేసింది. స్టార్ వైట్, నైట్ స్కై అనే రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. మడత విప్పినప్పుడు ఇది అత్యంత పల్చటి ఐఫోన్‌గా మారడమే కాకుండా 7.6 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను అందిస్తుంది.
ఇందుకు అనుగుణంగా ఐఓఎస్ 27 (iOS 27) ను ప్రత్యేకంగా రీడిజైన్ చేశారు. ఇందులో రెండు హోమ్ స్క్రీన్ పేజీలతో పాటు మెయిల్, మెసేజెస్ కంటెంట్‌ను చూసుకోవచ్చు, అలాగే రెండు యాప్‌లను ఒకేసారి పక్కపక్కన వినియోగించుకోవచ్చు. ఫోన్ మడతపెట్టినప్పుడు (5.4 అంగుళాలు) విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్‌తో కూడిన బెడ్‌సైడ్ క్లాక్లా పనిచేస్తుంది.
ఇది నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
256 GB: రూ. 2,99,900
512 GB: రూ. 3,24,900
1 TB: రూ. 3,74,900
2 TB: రూ. 4,49,900
అక్టోబర్ 16 సాయంత్రం 5:30 గంటల నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి, అలాగే అక్టోబర్ 23 నుండి అమ్మకాలు మొదలవుతాయని సదరు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 7,000 వరకు తక్షణ డిస్కౌంట్, రూ. 4,500 నుండి రూ. 81,500 వరకు ట్రేడ్-ఇన్ క్రెడిట్ మరియు నో-కాస్ట్ EMI సౌకర్యం ఉన్నాయి. అయితే ఈ ఐఫోన్ బాక్స్‌లో కేవలం USB-C కేబుల్ మాత్రమే ఉంటుంది. ఛార్జింగ్ అడాప్టర్ ఉండదు.
శక్తివంతమైన A20 ప్రో చిప్‌తో 2nm ప్రాసెస్ చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఇరువైపులా ఉన్న డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థ లోపలి స్క్రీన్‌పై 31 గంటలు, బయటి స్క్రీన్‌పై 44 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది. కేబుల్ ఛార్జింగ్‌తో 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది.
కెమెరా వ్యవస్థ, సాఫ్ట్వేర్ ఐఫోన్ డ్యూయోలో 48MP ఫ్యూజన్ మెయిన్, 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందరి భాగంలో 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, అంతర్గత డిస్ప్లే కింద అండర్-డిస్ప్లే ఫేస్‌టైమ్ కెమెరా కలవు. ఈ ఫోన్ డ్యూయల్ స్క్రీన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన iOS 27.1 పై నడుస్తుంది. ఇది రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించడానికి స్ప్లిట్ వ్యూ సౌకర్యాన్ని అందిస్తుంది. దీనితో పాటు సిరి AI బీటా రూపంలో అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ విశేషాలు..
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లు 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్ సామర్థ్యాల్లో డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూ, బర్గుండీ రంగుల్లో లభిస్తాయి. 6.3 అంగుళాల డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్లో కొత్త ఏ20 ప్రో చిప్ (7-కోర్ జీపీయూ, 6-కోర్ సీపీయూ) అమర్చారు.
ఏఐ ఆధారిత సిరి, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. 48 ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరాలో ఆస్ట్రోఫొటోగ్రఫీ, నైట్ మోడ్ మెరుగయ్యాయి. 4కే రిసొల్యూషన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో టైమ్ లాప్స్ సపోర్ట్ ఉంది.
ఇది ఒక ఛార్జింగ్‌తో 24 గంటల వినియోగం, 36 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. ఇక 6.9 అంగుళాల డిస్ప్లే కలిగిన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఒక ఛార్జింగ్‌తో 30 గంటల వినియోగం, 45 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది.
ఎయిర్‌పాడ్స్ 5, యాపిల్ వాచ్ సిరీస్..
ఓపెన్ ఇయర్ డిజైన్‌తో వచ్చిన ఎయిర్‌పాడ్స్ 5లో 50% మెరుగైన నాయిస్ రిడక్షన్, లైవ్ ట్రాన్స్లేషన్, హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో సిరి, కెమెరా రిమోట్, వాల్యూమ్ స్వైప్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4 మోడళ్లలో ఏఐ ఆడియో, 15 సెకన్ల లైవ్ రివైండ్, మెరుగైన ఈసీజీ, ఆప్టికల్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి ప్రతి 5 సెకన్లకు (60 రెట్లు ఎక్కువ) హృదయస్పందనను నమోదు చేస్తాయి, అలాగే నిద్ర, రక్త డేటాతో పాటు వాస్తవ వయసుతో ఆరోగ్య సంకేతాల పోలికను అందజేస్తాయి.
Also Read: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Gurukul Student Murder: స్కూల్ సెలవు కోసం తోటి విద్యార్థిని చంపబోయి..బాలుర గురుకుల పాఠశాలలో ఘోరం!
Kambhamvaripalle, Andhra Pradesh:AP Gurukul Student Murder News: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్యారంపల్లె గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, తమతో పాటే ఒకే గదిలో నివాసముంటున్న మరో విద్యార్థిపై ఘాతుకానికి ఒడిగట్టారు. వారం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న వేళ, పథకం ప్రకారం బాధిత విద్యార్థి ముఖంపై దిండు గట్టిగా నొక్కిపట్టారు. ఊపిరాడకుండా చేయడంతో పాటు గొంతు నులిమి ప్రాణాలు తీసేందుకు తీవ్రంగా యత్నించారు.
అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైన బాధిత విద్యార్థి తన ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా పెనుగులాడాడు. చివరకు నిందితుల పట్టు నుంచి చాకచక్యంగా తప్పించుకుని, కేకలు వేస్తూ గది బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు గోప్యంగా ఉంచినప్పటికీ, విషయం లీక్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి నిందితులైన ఇద్దరు విద్యార్థులకు టీసీలు (TCs) ఇచ్చి పంపించివేశారు.
గోప్యంగా ఉంచిన ఉపాధ్యాయులు..
తోటి విద్యార్థిని అంతమొందించేందుకు యత్నించిన ఈ తీవ్రమైన ఘటనను పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వకుండా వారం రోజుల పాటు గోప్యంగా ఉంచారు. అయితే, ఈ దారుణం స్థానికంగా లీక్ కావడంతో చివరకు విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) రెడ్డిబాషా బుధవారం పాఠశాలకు చేరుకుని ప్రత్యక్షంగా విచారణ చేపట్టారు.
పాత సంఘటనే ప్రేరణగా ఘాతుకం..
ఎంఈవో రెడ్డిబాషా పాఠశాల సిబ్బందిని, నిందితులైన విద్యార్థులను, బాధితుడిని వేర్వేరుగా విచారించడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. సుమారు రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మరణించగా, అప్పట్లో పాఠశాలకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. ఆ పాత సంఘటనను గుర్తుపెట్టుకున్న ఈ ఇద్దరు బాలురు, ఇప్పుడు కూడా ఎవరినైనా చంపేస్తే బడికి వరుసగా సెలవులు వస్తాయనే భావనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
తోటి విద్యార్థి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సదరు ఇద్దరు విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బదిలీ సర్టిఫికెట్లు (టీసీలు) జారీ చేసి హాస్టల్ నుంచి తొలగించి ఇంటికి పంపించివేసింది. ఈ ఉదంతంపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఎంఈవో తెలిపారు. పాఠశాలకు సెలవుల కోసం పసి మనస్సులు ఇంతటి దారుణమైన నేరానికి సిద్ధపడటం విద్యావర్గాలను, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హాస్టళ్లలో ఉండే పిల్లల మానసిక స్థితిపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: YS Jagan Padayatra: పాదయాత్ర షెడ్యూల్‌పై వైఎస్ జగన్ కీలక ప్రకటన..వచ్చే దసరా నుంచి షురూ!
Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Cabinet: భారీ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
Baddipadaga, Telangana:Telangana Railway Projects: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రైల్వేకు సంబంధించిన కీలక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్‌తోపాటు 5 మల్టీట్రాకింగ్ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు చేపట్టడంతో రైళ్ల ట్రాఫిక్ తగ్గడంతోపాటు రైళ్ల సమయపాలన మెరుగుపడనుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా రైళ్లు కూడా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఇంధనం ఆదా అవడంతోపాటు ఫ్రైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్‌తో సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకును అదనంగా రవాణా చేసే అవకాశం ఉంది. బొగ్గు, ఐరన్ ఓర్, ఆహార ధాన్యాలు ప్రస్తుతం చేస్తున్న దానికంటే అదనంగా రవాణా చేసుకునే అవకాశం లభించనుంది.
సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన అందుబాటులోకి రానున్న ఈ రైల్వే లైన్ ద్వారా విజయవాడ, ముంబయి మార్గాలలో మెరుగైన రైలు ప్రయాణాలు సాగించడానికి మార్గం సుగమం కానుంది. అంతేకాకుండా ఈ మార్గంలో ఉన్న యాదాద్రి, స్వర్ణగిరి, సురేంద్రగిరి ఆలయాలను సందర్శించే భక్తులకు, భువనగిరి కోటను సందర్శించే పర్యాటకులకు కూడా ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ అనుకూలంగా మారనుంది. దీంతో పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
సికింద్రాబాద్ - కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైల్వే బడ్జెట్ కేటాయింపులు 21 రెట్లు పెరిగాయి. 12 సంవత్సరాల కాలంలో రూ.36,286 కోట్లను తెలంగాణకు కేటాయించారు' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని.. మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు సర్వే జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రైల్వే లైన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 42 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.3 వేల కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 6 రైల్వేస్టేషన్లను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ ప్రాజెక్టుతో అదనంగా సరుకు రవాణా ఇలా..
==> బొగ్గు 7.06 మిలియన్ టన్నులు
==> ఐరన్ ఓర్ 0.73 మిలియన్ టన్నులు
==> ఆహారధాన్యాలు 0.65 మిలియన్ టన్నులు
Telangana Police Jobs: పోలీస్ జాబ్ కోసం ఎదురుచూసే వారికి తెలంగాణ సర్కార్ తీపి కబురు
Baddipadaga, Telangana:Telangana Police Job Notification: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నియామకంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పోస్టుల సంఖ్య పెంచడం.. వయో పరిమితిని పెంచడం వంటి డిమాండ్లు చేస్తుండగా నిరుద్యోగుల స్పందనకు ప్రభుత్వం స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోసం పోటీ పడే వారి వయో పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలిబుచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాల్లోని కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మరో 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ జీఓ 129ను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్ని మాపక దళం, జైళ్లశాఖల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి గత నెల 29వ తేదీన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్
లాంగ్‌జంప్‌పై కూడా నిరుద్యోగుల నుంచి మరో డిమాండ్ వస్తోంది. 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనను 3.8 మీటర్లకి తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లాంగ్‌జంప్ ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉందని వివరిస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ క్వాలిఫై 3.8 మీటర్లుగానే పరిగణిస్తున్నారనే విషయం ఉద్యోగ అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల ఎంపికలో ఈవెంట్స్‌లో 4 మీటర్ల లాంగ్ జంప్ నిబంధనతో చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేకపోతున్నారని వాపోతున్నారు. దీంతో వయో పరిమితి మాదిరి లాంగ్‌జంప్ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి.. లాంగ్ జంప్ నిబంధనను 3.8మీటర్లకు తగ్గించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
వయో పరిమితిపై ఎమ్మెల్సీ విజ్ఞప్తి
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యం, నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో చాలా మంది నిరుద్యోగులు వయో పరిమితి మించిపోయి, అవకాశం కోల్పోతున్నారని వివరించారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు.. ఎస్సై ఉద్యోగానికి వయో పరిమితి 37 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వరకు పెంచాలని వినతిపత్రంలో ఎమ్మెల్సీ వెంకట్ కోరారు.
KTR: ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?.. గవర్నర్ తో భేటీ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:Brs ktr fires on cm revanth reddy govt after met with telangana governorచేతులు.. మోకాళ్లు నల్లగా మారాయా? మీ వంటింట్లోని ఈ 3 వస్తువులతో నలుపు మాయం!
Hyderabad, Telangana:Dark Elbows And Knees Remedies: మన పూర్వీకుల కాలం నుండి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మానికి ఎంతో మేలు చేయడమే కాకుండా మంచి నిగారింపును అందిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని డ్రై సమస్య నుండి కూడా కాపాడతాయి. చాలామందిలో మోచేతులు, మోకాళ్లు నలుపుగా మారిపోవడం మనం చూస్తుంటాము. వంటగదిలో ఉండే కొన్ని సహజమైన వస్తువులతోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ మాస్కులు నల్లగా మారిన మోచేతులు, మోకాళ్లకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కఠినమైన చర్మానికి మంచి నిగారింపును, ఈవెన్ స్కిన్ టోన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అయితే, ముందుగా ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. డెర్మటాలజిస్ట్ సూచనలు లేకుండా ఈ రెమెడీస్ పాటిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.
శనగపిండి, పెరుగు..
శనగపిండిని మన పూర్వీకుల కాలం నుండి సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇండియన్ స్కిన్ కేర్ రొటీన్లో వీటిని చేర్చుకోవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మంచి ఈవెన్ టోన్‌ను అందిస్తుంది. నల్లగా ఉన్న మోచేతులు మోకాళ్ల కోసం, ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని నలుపుగా ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి మాయిశ్చరైజేషన్ లభించి నలుపుదనం తగ్గుతుంది.
ఓట్ మిల్, తేనె మాస్క్..
ఓట్ మిల్ చర్మానికి మంచి నిగారింపును అందిస్తుందని, ముఖంపై ఉన్న నలుపుదనాన్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. దీన్ని స్క్రబ్బర్‌లా కూడా వాడవచ్చు, ఇది ఫిజికల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఓట్ మిల్‌తో కలిపి నలుపుగా ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం త్వరగా వదిలిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మానికి మంచి హైడ్రేషన్, మాయిశ్చర్ లభిస్తాయి.
Also Read: హోల్ మిల్క్ vs స్కిమ్డ్ మిల్క్.. గుండె ఆరోగ్యానికి ఏ పాలు బెస్ట్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
Also Read: తెల్ల జుట్టు, గ్యాస్ ప్రాబ్లమ్‌కి కరివేపాకుతో చెక్.. రోజూ ఇలా తీసుకోండి!
కలబంద, పసుపు మాస్క్..
కలబంద, పసుపు కలిపిన పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది. పసుపును మన పూర్వీకుల కాలం నుండి బ్యూటీ రొటీన్లో వాడుతున్నారు. కలబంద, పసుపు కలిపి రాయడం వల్ల మోచేతులు, మోకాళ్ల వద్ద ఉన్న నలుపుదనం తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబందలో ఒక చిటికెడు పసుపు వేసి, అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం తగ్గి, చర్మం ఈవెన్ స్కిన్ టోన్‌ను పొందుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: కళ్లు మూసుకుంటే ఎన్నికలు.. కురుక్షేత్రంలో పోరాడాలి: మాజీ సీఎం వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:Former CM YS Jagan Slams To Chandrababu In Tadepalli YSRCP Meeting Watch His WordsCollectors Conference: రేపటి నుంచి 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
Velgapudi, Andhra Pradesh:AP District Collectors Conference: అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో హామీలు.. పథకాలు ప్రకటించడంతోపాటు పరిపాలనాపరమైన నిర్ణయాలు, విధానపరమైన అంశాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిపై నిత్యం సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే జిల్లాల కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరగనుండగా.. రేపు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభం కానుంది. 10, 11వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుండగా దీనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు.
7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగనుందో తెలుసుకుందాం.
మొదటి రోజు
జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌కు జిల్లాస్థాయి రోడ్‌మ్యాప్‌లపై సమీక్షిస్తారు. సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు.
రెండో రోజు
సదస్సులో ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీ ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలు
