Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

కూరగాయల మార్కెట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

Sept 28, 2024 11:23:20
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మెన్ జక్కుల శ్వేత కమిషనర్ శ్రీనివాస్ రావు లకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు చిలుక రాజనర్సు మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా అంబేద్కర్ విగ్రహ పరిసరాలలో కూరగాయల వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారని కాబట్టి నూతన మార్కెట్ కు అంబేద్కర్ నామకరణం చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:28:20
Tadepalli, Andhra Pradesh:

Ambati Rambabu vs TDP Goons: దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా చంద్రబాబు? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు  ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?' అని ప్రశ్నించారు. 'చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చట్టం, న్యాయం అనే పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని చంద్రబాబు సృష్టించారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. 

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేసిన వీడియోను పోస్టు చేసి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు' అని మండిపడ్డారు. 'చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. భక్తుల మనోభావాలను గాయపరచడంతో ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేయించడమే చంద్రబాబు నియంత స్వభావానికి, దుర్మార్గానికి   నిదర్శనం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కరుడుగట్టిన గూండాగా.. ఓ నియంతగా చంద్రబాబు తయారయ్యారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఈ వైఖరి అత్యంత ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులపై జరుగుతున్న దాడులు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను కూడా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:06:38
Guntur, Andhra Pradesh:

TDP Goons vs Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి తీవ్ర సంచలనం రేపగా.. ఈ దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ కోరింది. డీజీపీకి ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి.. దాడికి పాల్పడిన వారితోపాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

Also Read: Daughter In Law: డామిట్‌ కథ అడ్డ తిరిగింది.. అత్తారింటికే కన్నం వేసిన కోడలు

ఏపీ డీజీపీకి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్‌ ఆఫీస్ ఇంఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. 'అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టి గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి కుట్ర పన్నారు' అని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇది యాదృచ్ఛిక ఘటన కాదు… రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట అని స్పష్టం చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకే భద్రత లేకుండా పోయిన పరిస్థితి రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన కొనసాగుతుందో స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. గుండాలు, రౌడీలను రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహిస్తున్న శక్తుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది.

'టీడీపీ గూండాలు దాడి చేస్తున్న సమయంలో పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్వీర్యతకు, పాలన వైఫల్యానికి అద్దం పడుతోంది' అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని.. దాడికి పాల్పడిన వారితో పాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. హింస, బెదిరింపులు, దాడులతో వైఎస్సార్సీపీని అణచివేయడం ఎవరి వల్లా కాదని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను నొక్కివేయాలనే ఈ అరాచక ప్రయత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. చట్ట వ్యవస్థను ధ్వంసం చేసిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:44:02
Guntur, Andhra Pradesh:

YS Jagan Phone Call: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై తెలుగుదేశం పార్టీ గూండాల దాడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతుండగా.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. తమ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మూకలు, గూండాలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. అంబటి నివాసంపై దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించి ఫోన్‌ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబుని ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయి' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉద్దేశపూక్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు దిగారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు మొత్తం చూస్తున్నారని.. ఈ అరాచక పాలనను ప్రజలు సహించబోరని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ మొత్తం అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులకు వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబుకు అండగా నిలబడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబు నివాసానికి భద్రత కల్పించాలని.. అంబటికి ప్రాణహానీ పొంచి ఉందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా డీజీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెయిల్‌ చేశారు. అంబటి రాంబాబుకు తక్షణమే కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ గూండాల నుంచి అంబటి రాంబాబుకు ప్రాణహాని పొంచి ఉందని మెయిల్‌లో తెలిపారు. కాగా ఫోన్‌కాల్‌లో ప్రయత్నించగా స్పందన లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:24:46
Domakonda, Telangana:

In Laws House: తన సంసారం సాఫీగా జరగడానికి బంగారం, ఆస్తి కావాలని కోరుకున్న కోడలు తన అత్త ఇంటిలో దొంగతనానికి ప్లాన్‌ వేసింది. అత్తగారింట్లో దొంగతనం చేయడానికి ప్లాన్‌ వేసి కొందరిని మాట్లాడించి పంపించింది. అయితే దొంగతనానికి వెళ్లిన సమయంలో ఆ దొంగలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో కోడలి గుట్టు బయటపడింది. అత్తారింట్లో గౌరవంగా బతకాల్సిన కోడలు ఇప్పుడు జైలుపాలైంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా దోమకొండలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీన రాత్రి దోమకొండలోని బీసు రుకుంబాయి-కిష్టయ్య ఇంట్లోకి చొరబడ్డారు. దొంగతనం చేస్తున్న క్రమంలో వారి అలజడికి ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు నిద్రలేచారు. దొంగలను చూసి ఆ కుటుంబసభ్యులు కేకలు, అరుపులు వేయడంతో వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్రమత్తమై కేకలు వేయడంతో దోపిడీకి వచ్చిన ఇద్దరు పారిపోయారు. స్థానికులు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

దొరికిపోయిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం వాసి గోనే రజినీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. రజనీకాంత్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని సీఐ సంపత్‌ కుమార్‌ తెలిపారు. రజినీకాంత్‌ను  ఈ నెల 28వ తేదీన అరెస్టు చేయగా.. దొంగతనానికి వచ్చిన ఇద్దరు అన్నారం గ్రామస్తులు కేసరి తిర్మల్, కేసరి రాజేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కోడలి బండారం బయటపడింది.

దొంగతనం జరిగిన రుకుంబాయి చిన్న కుమారుడు నవీన్‌ భార్య మమత. చిన్న కోడలు మమత కాపురంలో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతేడాది మమత మెడలోని బంగారు పుస్తెల తాడు పోవడంతో ఆమె భర్త నవీన్ ఆమెపైనే అనుమానపడ్డాడు. దీంతో వారి సంసారంలో గొడవలు జరిగి ప్రస్తుతం మమత తన పిల్లలతో పుట్టింటిలో ఉంటోంది. ఇటీవల కాపురానికి రావడానికి ప్రయత్నాలు చేయగా.. ఏదైనా ఆస్తి తీసుకురావాలని భర్త, అత్తమామలు తెగేసి చెప్పారు. డబ్బులు తీసుకురాలేక ఈ విషయంలో మమత తన అత్త ఇంట్లోనే దోపిడీ చేయాలని తనకు పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులకు డబ్బుల ఎర చూపించి ఉసిగొల్పింది. పథకం ప్రకారం వారు దోపిడీకి పాల్పడ్డారని. ఈ కేసులో మమతతో పాటు ఇద్దరు పరిచయస్థులు తిర్మల్, రాజేష్ లను అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 13:20:36
Karimnagar, Telangana:

Karimnagar Municipal Corporation Elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. కరీంనగర్‌ మేయర్‌తోపాటు 3 చైర్మన్‌ స్థానాలు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నామని.. గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే ప్రత్యామ్నాయ నాయకులకు టికెట్లు ఇస్తున్నట్లు వివరించారు. టికెట్ రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని సూచించారు. 

కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్‌ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ సమావేశమై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయ అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

కరీంనగర్ కార్పొరేషన్‌లో 80 శాతంపైగా పార్టీకి కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని.. నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

'కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలి' అని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ సూచించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేసే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. టికెకెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్‌లో గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి,  పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 12:46:53
Dhamsalapuram, Telangana:

CPI vs Congress Party: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. మిత్రపక్షం సీపీఐ బంధాన్ని తెంచేసుకుంది. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా.. మరికొన్ని చోట్ల ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సహకరిస్తున్నా కనీస గౌరవం ఇవ్వడం లేదని సీపీఐ కినుక వహించింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో సీపీఐని గుర్తించకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్‌ ఇచ్చింది.

మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి  పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్‌లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సీపీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు. ఇదే జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది.

ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్‌ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. కాగా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీలో దిగింది. అక్కడ గులాబీ, ఎర్రజెండాలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:40:26
Hyderabad, Telangana:

K Chandrashekar Rao: రాజకీయ కక్ష్యతోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌లో నోటీస్ ఇచ్చారని తెలిపారు. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ కొడంగల్  అయితే గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం అలా చేయక వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమని హెచ్చరించారు.

Also Read: BRS Party Protest: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విచారణ.. రేపు బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసనలు

సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.'టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్‌పై వేధింపులు, సీరియల్ తరహాలో రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే అలీబాబా 40 దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు' అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని తెలిపారు. 'ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హసనం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు' అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల పాలన కొనసాగిస్తోంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ వంటి అంశాలతో రెండున్నరేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ కోసం శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని.. నోటీసులతో భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

'సమ్మక్క–సారక్క అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఇచ్చారు. విచారణకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు రావాలని సూచించినప్పటికీ కక్షపూరితంగా నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పడం అన్యాయం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి సిట్ నోటీసులు గోడకు అతికించడం అవమానకరమని చెప్పారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా టీఆర్ఎస్ నాయకులు భయపడరని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 11:34:47
Hyderabad, Telangana:

Snakes Temple Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే చాలు.. చాలామంది ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక గుడిలో మాత్రం మొత్తం పాములే ఉంటాయి. ఎటు చూసినా పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు.. ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా వాటికి నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం తో పాటు గర్వాలయంలో లోపల కూడా పాములే దర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజు ఉదయాన్నే నాగుపాములు స్వయంగా గుడి లోపలికి వస్తాయట.. అంతేకాకుండా అక్కడి పూజారి ఆ పాములను భయపెట్టకుండా.. ఎంతో భక్తితో వాటికి కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ పాములన్ని పూజా సమయంలో చాలా ప్రశాంతంగా కూడా ఉంటాయని వారు అంటున్నారు. ఈ సమయంలో వచ్చే భక్తులకు కూడా ఆ ప్రమాదకరమైన పాములు ఎలాంటి హాని కలిగించమని వారు చెబుతున్నారు. 

అలాగే ఈ పాములన్ని గుడికి వచ్చే భక్తుల చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయట.. అవి ఎవరిని ఏమీ చేయవని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. పాములంటే భయం ఉన్నవారు ఈ గుడిలో కొంత జాగ్రత్తగా ఉండాలని అక్కడి స్థానికులు చెబుతారు. అలాగే ఈ గుడికి వచ్చిన కొంత మంది భక్తులు స్వయంగా పాములకు కుంకుమ తిలకం దిద్దుతారట. మరికొంతమంది అయితే, మరి కొంతమంది అయితే, వాటికి పాలు కూడా పోస్తారని సమాచారం. ఇలా ఆ పాములు ఎంతమంది భక్తులు వచ్చినా గుడిలో మాత్రం ప్రశాంతంగా ఉంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఆ గుడిలోకి వచ్చే భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారని.. అందువల్ల ఆ పాములు ఏమీ చేయమని సమాచారం. అలాగే అక్కడ పూజలు చేసే పూజలు కూడా వాటికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసి అందిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ని ఓ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ కొన్ని లక్షలమంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ కూడా చేశారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:16:06
Hyderabad, Telangana:

Ex CM KCR Probe: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు తీవ్రమవుతుండడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్‌ విచారణ సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. రేపు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కేటీఆర్‌ పార్టీ నాయకత్వానికి సూచించారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు వివేకానంద్‌, కృష్ణారావు, సీనియర్‌ నాయకులు బాలమల్లు, కర్నె ప్రభాకర్ తదితరులు కీలక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ని వేధిస్తోందని.. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకత్వం  మండిపడింది. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి.. ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించింది. రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని గులాబీ పార్టీ నాయకత్వం ఆదేశించింది. 

పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:00:16
Hyderabad, Telangana:

Hyderabad: 'విద్యార్థి సంఘ్ రాజకీయాలు లేకుండా విద్యార్థి ఎన్నికలు లేకున్న నేను ఈరోజు ఇక్కడ మాట్లాడేది కాదు. విద్యార్థి రాజకీయాల్లో 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నా. విద్యార్థి సంఘ్ ఎన్నికలు ఉండాలి. 1988లో విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయ్యాయి. చట్టసభలపై అవగాహన.. చర్చలు జరుగుతున్న విధానం, ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుని ఎలా పరిష్కారం చేయాలని ఈ యూత్ పార్లమెంట్‌తో అవగాహన కలుగుతుంది' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని బాబు జాగ్జీవన్ రామ్‌ భవన్‌లో ఐ విజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. 'విద్యార్థుల యూత్ పార్లమెంట్‌ భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఢిల్లీలాంటి రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదంలో పడింది. ఆ పరిస్థితుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? యువత ఆలోచించాలి. నీటి వనరుల వినియోగం, విద్యా వ్యవస్థలో సర్టిఫికెట్‌లకు పరిమితం కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించుకునేలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నో పోటీ పరీక్షలు రాసి వచ్చినవారు.. హైక్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటది' అని పొన్నం ప్రభాకర్‌ వివరించారు.

'పోటీలో ఉన్నామంటే పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంపై అవగాహన , ఎక్స్‌ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యం కల్పించాలి. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా మీరంతా కష్టపడాలి.. దేశ భవిషత్ మీ చేతిలో ఉంది' అని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.'భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.  ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టేది పార్లమెంట్. ఇక్కడ జరిగే చర్చలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి' అని వివరించారు. అలాంటి పార్లమెంట్ పనితీరును యువత విద్యార్థులు ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరమని తెలిపారు.

'యూత్ పార్లమెంట్‌తో చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో.. ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయో, భిన్న అభిప్రాయాలను ఎలా గౌరవించాలో, ఆరోగ్యకరమైన విమర్శలు ఎలా చేయాలో నేర్చుకుంటారు' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిపై  విమర్శలు కాకుండా స్పష్టమైన పరిష్కారాలను సూచించే బాధ్యత మన అందరిపై ఉంది' అని చెప్పారు.

'యూత్ పార్లమెంట్ ఆ బాధ్యతాయుత ఆలోచనలకు వేదిక అవుతోంది. యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు దేశ పార్లమెంట్‌లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరాలి. ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా, బాధ్యతాయుత నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నా' అని పొన్నం ప్రభాకర్‌ అభిలషించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డీఈవో రోహిణి, ఐ విజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి తదితరులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 10:58:04
Hyderabad, Telangana:

Moto G77 And Moto G67: మోటరోలా కంపెనీ మార్కెట్‌లోకి తమ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి అద్భుతమైన డిజైన్‌తో చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.. దీనిని కంపెనీ మోటో G77, మోటో G67 పేర్లతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేకమైన కలర్స్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి చూడడానికి చాలా అద్భుతమైన లుక్కుని కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు మొబైల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మోటో G67 కంపెనీ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇక మోటో G77 మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ప్రాసెసర్ తో లాంచ్ అయింది. ఇవి రెండు అద్భుతమైన  ఆండ్రాయిడ్ 16 పై నడుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Moto G77, Moto G67 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.25,400 లోపు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాకుండా వేరియంట్స్‌ను బట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా g77 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.31 వేల ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ రెండింటి స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ రెండు మొబైల్స్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

మోటరోలాలోని G67 మోడల్ 4GB ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక g77 మోడల్ 8gb ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌లోని మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన SD కార్డు సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోని మొదటి వేరియంట్ వెనక భాగంలో అద్భుతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో లభిస్తుంది. అలాగే G77 మోడల్ ఎంతో శక్తివంతమైన 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా తో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అతి త్వరలోనే భారత్ లో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 10:31:40
Kyathampally, Telangana:

CPI Supports To BRS Party: మున్సిపల్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ కాంగ్రెస్‌తో కాకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పరిణామంతో వివేక్ వెంకటస్వామికి భారీ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను వీడి బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదరలేదు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సీపీఐ మధ్య  సయోధ్య కుదరకపోవడంతో గందరగోళం ఏర్పడింది. మిత్రపక్షం సీపీఐకి తక్కువ స్థానాలు ఇచ్చి అవమానించడంతో కాంగ్రెస్‌ను వదిలేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది.

ఈ సందర్భంగా చెన్నూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్ కీలక ప్రకటన చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. స్థానిక నాయకుల మాటలు నమ్మి వివేక్ వెంకటస్వామి సీపీఐని చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గెలిచి వివేక్ వెంకటస్వామికి సీపీఐ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కానీ అది వివేక్‌ గ్రహించకుండా తమను ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామికి పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. వివేక్ వెంకటస్వామి వైఖరిపై ఇప్పటికే ఎర్రజెండా పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి నడిచేందుకు వెనుకంజ వేసింది. అయితే ఈ పొత్తు ఒక్క క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఉంటుందా? లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడుతుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top