ఇసుక సరఫరా లేక ఖాళీగా ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Prime Minister Narendra Modi Assets Value: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరిగింది. మోడీ ఆస్తుల విలువ రూ. 3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82శాతం మార్కెట్ ప్రకారం పెరిగనట్టు వెల్లడించింది. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ. 9.4 కోట్లు ఉండగా.. 2024 నాటికి రూ. 20.39 కోట్లకు చేరి 117శాతం వృద్ధి నమోదైంది.
వరుసగా 3సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110 శాతం పెరిగినట్లు ADR తెలిపింది. అలాగే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రూ. 124 కోట్ల సంపాదనతో టాప్ త్రీలో ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయానికొస్తే.. ఈయన ప్రభుత్వాధినేతగా 24 యేళ్లు కంప్లీట్ చేసుకొని 25వ యేట అడుగుపెట్టారు. 7 అక్టోబర్ 2001న గుజరాత్ సీఎంగా అయ్యారు. నరేంద్ర మోడీ స్వాతంత్య్రం వచ్చాకా పుట్టిన నేతగా రికార్డు క్రియేట్ చేశారు. స్వాతంత్రం తర్వాత మొదటి ప్రైమ్ మినిష్టర్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు.
2001 లో తొలిసారి గుజరాత్ సీఎం అయ్యారు. ఆ తర్వాత 2002, 2007, 2012లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి సంచలనం రేపారు. మొత్తంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే కాకముందే ఈయన ముఖ్యమంత్రిగా గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2001 నుంచి అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రపంచ లీడర్ బహుశా ప్రపంచంలో ఎవరు లేరనే చెప్పాలి. ప్రభుత్వాధినేతగా 24 యేళ్లు పూర్తి చేసుకొని 25వ యేట అడుగుపెట్టారు.
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
అంతేకాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి అయిన ఆరో నేతగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. ఈయన కంటే ముందు మొరార్జీ దేశాయ్ (బాంబే స్టేట్), చౌదరి చరణ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), పీవీ నరసింహారావు (ఆంధ్ర ప్రదేశ్), హెచ్ డీ దేవగౌడ (కర్ణాటక) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని అయ్యారు. అంతేకాదు వరుసగా మూడు సార్లు ఎలెక్ట్ అయిన ప్రధాన మంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
2014లో భారత ప్రైమ్ మినిష్టర్ అయ్యారు. ఈయనకు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో 106 మిలియన్లకు పైగా ఫాలోవర్స్స్ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు.ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 99.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రెండు మాధ్యమాల్లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న వరల్డ్ లీడర్ గా రికార్డు క్రియేట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా 26 మే 20214లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.నరేంద్ర మోడీ 2014, 2019,2024 వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించిన కాంగ్రెస్ యేతర ప్రధాని మంత్రిగా చరిత్ర తిరగరాసారు. అంతేకాదు వారణాసి లోక్ సభ నుంచి ఈయన వరుసగా హాట్రిక్ విజయాలు అందుకున్నారు. అంతేకాదు 29 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రపంచ నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు.
EPF Wage Ceiling Increase: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వేతన పరిమితి పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గత 74 ఏళ్లలో ఈ పరిమితి ఎలా మారుతూ వచ్చిందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఈపీఎఫ్ఓ (EPFO) భరోసా ఇస్తుంది. అయితే, ఈ పథకంలో చేరడానికి ప్రామాణికంగా తీసుకునే 'వేతన పరిమితి' కాలక్రమేణా మారుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.15,000 పరిమితిని సవరించాలని సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ప్రస్తుతం ఉన్న రూ.15,000 ప్రాథమిక వేతన పరిమితిని పెంచే విషయంపై నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరుగుతున్న జీతాలు, జీవన వ్యయం దృష్ట్యా ఈ పరిమితిని రూ.21,000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
1952 నుండి ఇప్పటివరకు..
ఈపీఎఫ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 9 సార్లు వేతన పరిమితిని సవరించారు. ఆ వివరాలు పట్టిక రూపంలో ఇక్కడ చూడవచ్చు.
| కాలం (అమలులోకి వచ్చిన తేదీ) | నెలకు వేతన పరిమితి (రూపాయల్లో) |
| 01.11.1952 నుంచి 31.05.1957 | Rs 300 |
| 01.06.1957 నుంచి 30.12.1962 | Rs 500 |
| 31.12.1962 నుంచి 10.12.1976 | Rs 1,000 |
| 11.12.1976 నుంచి 31.08.1985: | Rs 1,600 |
| 01.09.1985 నుంచి 31.10.1990: | Rs 2,500 |
| 01.11.1990 నుంచి 30.09.1994: | Rs 3,500 |
| 01.10.1994 నుంచి 31.05.2001: | Rs 5,000 |
| 01.06.2001 నుంచి 31.08.2014: | Rs 6,500 |
| 01.09.2014 నుంచి ప్రస్తుత రోజు వరకు | Rs 15,000 |
ప్రస్తుత నిబంధనలు ఏమిటి?
నెలకు రూ.15,000 వరకు ప్రాథమిక వేతనం (Basic + DA) ఉన్న ఉద్యోగులందరూ ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి అనే నిబంధన ఉంది. సెప్టెంబర్ 1, 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి, వారి వేతనం రూ.15,000 కంటే ఎక్కువగా ఉంటే, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఐచ్ఛికం (Optional). అంటే ఉద్యోగి నిర్ణయాన్ని బట్టి ఈపీఎఫ్ ఖాతా తెరుచుకునేందుకు వీలు కల్పించారు.
ఈ పరిమితిని పెంచడం వల్ల మరింత మంది తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు ఈ సామాజిక భద్రతా పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా (2014 నుండి) ఈ పరిమితిలో ఎటువంటి మార్పు రాలేదు. త్వరలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై లక్షలాది మంది వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Naveen Polishetty Anaganaga Oka Raju Trailer: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి వరుస విజయాల తర్వాత ఆయన నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది.
సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల హడావుడి. అయితే ఈసారి భారీ యాక్షన్ చిత్రాల మధ్య తనదైన శైలిలో వినోదాన్ని పంచేందుకు హీరో నవీన్ పోలిశెట్టి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' చిత్ర ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రైలర్ విశేషాలు..
తాజాగా 'అనగనగా ఒక రాజు' విడుదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నవీన్ పోలిశెట్టి తన మార్క్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో ఇరగదీశారు. పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి, ఈ సినిమాలో నవీన్ జోడిగా అలరించనుంది. ట్రైలర్లో ఆమె లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ పండుగ వాతావరణాన్ని ముందే తీసుకువచ్చింది.
సంక్రాంతి బరిలో పోరు..
జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి రేసులో 'రాజా సాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ.. నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
Also Read: Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anasuya Supports Shivaji Comments On Women: టాలీవుడ్లో గత కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన 'శివాజీ వర్సెస్ అనసూయ' వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయి నుండి, ఒకరి ఉద్దేశాన్ని మరొకరు గౌరవించుకునే స్థాయికి ఈ వ్యవహారం చేరుకోవడంతో సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే సడెన్‌గా యాంకర్ అనసూయ.. నటుడు శివాజీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏం జరిగిందంటే?
'దండోరా' ఈవెంట్లో నటీమణుల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన సూచించడాన్ని తప్పుబడుతూ అనసూయ, చిన్మయి వంటి వారు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అయితే, తాజాగా అనసూయ తన ధోరణిని మార్చుకుంటూ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
అసలు వివాదం ఏంటి?
శివాజీ ఒక బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. నిధి అగర్వాల్‌కు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రస్తావించి, ఆడపిల్లలు జాగ్రత్తగా, పద్ధతిగా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనిపై అనసూయ స్పందిస్తూ, "తప్పు చేసే మగాళ్లకు బుద్ధి చెప్పాల్సింది పోయి, మాకు నీతులు చెబుతారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా అనసూయకు మద్దతు తెలపడంతో టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది.
సడన్‌గా ఈ వివాదంపై తన రూట్ మార్చిన అనసూయ.. శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "శివాజీ గారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన మాటను ప్రజలు వినేంతగా ఎదిగారు" అని ఆమె ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఆడపిల్లల భద్రత పట్ల ఉన్న ఆరాటం, ఒక మంచి ఉద్దేశమే ఉందని అనసూయ అభిప్రాయపడ్డారు. శివాజీ గారు కేవలం అమ్మాయిలకే కాకుండా, అబ్బాయిలకు కూడా వారి బాధ్యతను గుర్తుచేసి ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదని ఆమె సున్నితంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అనసూయ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా సాగుతున్న మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. శివాజీపై వ్యక్తిగత ద్వేషం లేదని, కేవలం అభిప్రాయ భేదం మాత్రమేనని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read; Sharmila Joins To YCP: వైసీపీలో చేరనున్న వైఎస్ షర్మిళ..అన్న కోసం మరోసారి పార్టీ మారనున్న చెల్లెలు?!
Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila Into YCP Party: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో మళ్లీ సఖ్యత ఏర్పడుతోందన్న తాజా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్న-చెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిరినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణంగా ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలే అని వారు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.
జగన్-షర్మిల మధ్య సయోధ్య?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సమాచారం. ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిన కుటుంబ విభేదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి వైసీపీపై చేసిన తీవ్ర విమర్శలు జగన్‌కు రాజకీయంగా తీరని నష్టం చేకూర్చాయి. తెలంగాణలో వైఎస్సార్టీపి స్థాపించి పాదయాత్ర చేసిన షర్మిల, ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య పోరు వల్ల ఓట్ల చీలిక జరగడమే కాకుండా, వైఎస్సార్ అభిమానుల్లో కూడా గందరగోళం నెలకొంది. దీనివల్ల ఇద్దరూ రాజకీయంగా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు.
రంగంలోకి వైఎస్సార్ సన్నిహితులు..
విడిపోవడం వల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు భావిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు సన్నిహితులు నిరంతరం లోటస్ పాండ్ టు బెంగళూరు తిరుగుతూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. "కలిసి ఉంటేనే మేలు.. ఒకవేళ కలిసి రాజకీయాలు చేయకపోయినా, కనీసం బహిరంగంగా కలహించుకోవద్దు" అన్నదే ఈ రాయబారాల సారాంశంగా వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ రాజీ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజున షర్మిల విష్ చేయడం, దానికి జగన్ ఎంతో ఆప్యాయంగా 'థాంక్యూ షర్మిలమ్మా' అని బదులివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రిస్మస్ వేళ జగన్ మేనల్లుడు రాజారెడ్డి తన మామ ఇంటికి వచ్చి గడపడం సయోధ్య దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కడప నేత సతీష్ రెడ్డి వంటి వారు బహిరంగంగానే ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలు, పాదయాత్రలు చేసే ముందు.. ఇంటి నుండి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అధినాయకత్వం అంచనా వేస్తోంది.
అయితే.. ఈ ప్రచారంలో ఎంత నిజమున్నా, అన్నాచెల్లెళ్లు మళ్లీ ఒకటి కావడం అనేది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావచ్చు. అదే జరిగితే వైసీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
US 500 Percent Tariff On India: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో రూపొందించిన "గ్రాహం-బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు"కు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుండి చమురు, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కఠినమైన చర్యలు తీసుకోనుంది.
బిల్లులోని ప్రధానాంశాలు..
500% సుంకం: రష్యా నుంచి చమురు లేదా యురేనియం కొనుగోలు చేసే ఏ దేశంపై అయినా సరే, ఆ దేశం నుండి అమెరికాకు వచ్చే ఎగుమతులపై 500 శాతం వరకు సుంకాలను విధించే అధికారం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది.
పుతిన్ యుద్ధానికి కావాల్సిన నిధులు రష్యా చమురు ఎగుమతుల ద్వారానే అందుతున్నాయని, ఆ నిధుల మూలాన్ని కత్తిరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. కేవలం సుంకాలే కాకుండా, సదరు దేశాలపై ఇతర ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది.
భారత్, చైనా, బ్రెజిల్‌లకు హెచ్చరిక?
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు ఈ బిల్లు నేరుగా హెచ్చరిక వంటిది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ రష్యా నుండి భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం రాయితీలు ఇస్తున్న తరుణంలో, పుతిన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచి యుద్ధాన్ని శాశ్వతంగా ఆపాలని ట్రంప్ పరిపాలన భావిస్తోంది.
తదుపరి అడుగులు ఎప్పుడు?
బుధవారం ట్రంప్‌తో సమావేశమైన అనంతరం సెనేటర్ గ్రాహం ఈ విషయాన్ని ధృవీకరించారు. వైట్ హౌస్ వర్గాలు కూడా ట్రంప్ మద్దతును ఖరారు చేశాయి. వచ్చే వారం ప్రారంభంలోనే సెనేట్‌లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. హౌస్, సెనేట్ రెండూ ఆమోదిస్తే ఇది చట్టంగా మారుతుంది.
ఒకవైపు ఈ కఠిన ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం రాయబారాలు నడుపుతున్నారు.
ఈ ఆంక్షల ప్యాకేజీ కేవలం రష్యానే కాకుండా, అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను భారత్ వంటి మిత్రదేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Capital Amaravati: రాజధాని అమరావతికి గుర్తింపు దక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా రాజధాని అమరావతిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాజధానికి చట్టబద్దత కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తించడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజీబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తే విశ్వవ్యాప్త గుర్తింపు లభిస్తుందని.. వెంటనే ఇది చేయాలని విన్నవించారు. రాజధానిగా గుర్తింపు ఇస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని హోంమంత్రికి వివరించారు.
Also Read: MANUU Lands: యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తావా? హరీశ్ రావు
ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని ప్రశంసించిన సీఎం చంద్రబాబు.. ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Amaravati Avakai: రేపటి నుంచి ఆవకాయ్ -అమరావతి ఉత్సవాలు.. ఏ రోజు ఏముంటాయంటే?
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలను అమిత్‌షాతో చంద్రబాబు పంచుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, ప్రాజెక్టుల అంశంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రాధాన్యాలు నెరవేరేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holiday: విద్యార్థులకు పండగ లాంటి వార్త..రిపబ్లిక్ డే స్కూళ్లకు 3 రోజులు సెలవులు..ఎప్పుడంటే?
School Holidays News: ఇటీవలే హాఫ్ ఇయర్లీ పరీక్షల తర్వాత విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 12 రోజుల సుదీర్ఘ విరామం ముగించుకుని ఇప్పుడే స్కూళ్లకు వెళ్తున్న ఇది శుభవార్తే అని చెప్పాలి. ఈ నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారీగా సెలవులను ప్రకటించింది.
సంక్రాంతికి 5 రోజులు సెలవులు..
జనవరి మధ్యలో వచ్చే పొంగల్ పండుగను పురస్కరించుకుని బుధవారం నుండి ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
జనవరి 14 (బుధవారం): భోగి పండుగ
జనవరి 15 (గురువారం): సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం): తిరువల్లువర్ దినోత్సవం / మట్టు పొంగల్
జనవరి 17 (శనివారం): ఉజ్వవర్ తిరునాళ్ (రైతుల పండుగ)
జనవరి 18 (ఆదివారం): వారపు సెలవు
రిపబ్లిక్ డే: 3 రోజుల వీకెండ్!
జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా మరో మూడు రోజుల విరామం లభించనుంది. సోమవారం సెలవు రావడంతో శని, ఆదివారాలు కలిపి లాంగ్ వీకెండ్ రాబోతోంది.
జనవరి 24 (శనివారం): వారాంతపు సెలవు
జనవరి 25 (ఆదివారం): వారాంతపు సెలవు
జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (ప్రభుత్వ సెలవు)
జనవరి 2026 - మొత్తం ప్రభుత్వ సెలవుల జాబితా:
తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన 2026 క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 5 ప్రధాన ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.
జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరం
జనవరి 15: పొంగల్
జనవరి 16: తిరువల్లువర్ దినోత్సవం
జనవరి 17: ఉజ్వవర్ తిరునాళ్
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
ఎవరికి వర్తిస్తాయి?
ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బ్యాంకులకు (RBI మార్గదర్శకాల ప్రకారం) వర్తిస్తాయి. వరుస సెలవులు ఉండటంతో తల్లిదండ్రులు తమ కుటుంబ ప్రయాణాలను లేదా ఊరికి వెళ్లే ప్లాన్లను ఇప్పుడే సిద్ధం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Virao Video: భయం లేదు.. బెరుకు లేదు.. సాహసమంటే ఎంతో ఇష్టపడే హీరోయిన్ సదా ఓ భారీ పామును ఒడిసిపట్టింది. జియోగ్రాఫిక్ చానల్లో చూసినట్టు అతి పేద్ద పామును హీరోయిన్ పట్టుకుంది. తనతోపాటు కొందరిని సహాయంగా తీసుకుని ఓ ఇంట్లో దూరిన పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. చూడగానే గగుర్పొడిచే 16 అడుగుల పామును హీరోయిన్ భయం లేకుండా సాహసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలను హీరోయిన్ సదా విడుదల చేశారు.
Also Read: KTR Counter: ఖమ్మం గడ్డపై ముగ్గురు మంత్రులకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
జయం సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సదా అనంతరం అనేక విజయవంతమైన సినిమాలు చేసిన విషయం తెలిసిందే. సినిమాల తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సదా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైల్డ్ లైఫ్‌ను ఇష్టపడుతున్న ఆమె తరచూ సాహస యాత్రలు చేస్తూ ప్రకృతి ఒడిలో జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్ని సినిమాలు చేయడమే కాకుండా పలు టీవీ షోలలో సదా పాల్గొంటున్నారు.
Also Read: Kavitha Congress: కాంగ్రెస్‌లోకి కేసీఆర్ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!
అలా ప్రేక్షకులకు దగ్గరైన సదా తన ప్రవృత్తి వైల్డ్ లైఫ్‌ను వదలలేదు. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఓ పామును రక్షించారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. విశాఖపట్టణం సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో సదా పర్యటించారు. పర్యటిస్తున్న సమయంలో ఓ చోట 16 అడుగుల పాము దాగి ఉందని తెలిసింది. వెంటనే ఆమె అక్కడకు వెళ్లారు. ఆ పాముపై స్థానికులు అప్రమత్తం చేశారు. అయితే తాను పామును ఎప్పుడూ నేరుగా చూడలేదని.. రెస్క్యూ ఆపరేషన్ కూడా చూడలేదని సదా అక్కడే ఉండి మొత్తం చూడడమే కాకుండా తన కెమెరాలో బంధించారు.
Also Read: KTR: ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉరి తీయాలి: కేటీఆర్
అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అతి పెద్ద పాము దూరింది. అక్కడ స్నేక్ క్యాచర్ వెంకట్‌ను పిలిపించి ఆ పామును పట్టించారు. అతి కష్టంగా 16 అడుగుల పామును వెంకట్ బృందం చాకచక్యంగా ఓ సంచిలోకి పంపించారు. అనంతరం దానిని తీసుకుని ఓ అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములను చంపరాదని.. వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని సదా విజ్ఞప్తి చేశారు. వాటిని హాని చేయకపోతే అవి కూడా మనుషులను హానీ కలిగించవని సదా తెలిపారు. సదా పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మంది చూడగా.. 14 వేల మంది ఆ వీడియోకు లైక్ కొట్టారు.
మీరు ఆ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి