Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇండ్లలోకి వర్షం నీరు

Aug 25, 2024 13:18:06
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11,12 వార్డ్ ల లో రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రహరీ కూల్చడం వల్లే రైల్వే క్వార్టర్స్ ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నష్ట పోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా అన్నారు. ఆదివారం బాధితుల ఇండ్లను పరిశీలించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో వర్షపు నీటిని తొలగించారు. రైల్వే కాంట్రాక్టర్ వల్లే వర్షం నీరు ఇండ్లలోకి వచ్చిందని, కాంట్రాక్టర్ బాధ్యత వహించి బాధితులకు నష్టపరిహారం అందించాలని అన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 31, 2026 19:24:34
Hyderabad, Telangana:

BRS Party Protest: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క బీఆర్ఎస్‌ పార్టీకి మాత్రమే నాయకుడు కాదు యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడు అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ప్రకటించారు. కేసీఆర్‌కు సిట్ పేరిట నోటీసులు ఇచ్చి అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ జాతిని వీరోచిత జాతిగా మార్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరిచి చేతికిస్తే విధ్వంసం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ జాతిరత్నం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రేపు ప్రజలు ఎక్కడికక్కడే నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. 'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ కేసీఆర్‌కు సిట్ పేరిట నోటీసులు పంపారు. బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మున్సిపల్ ఎన్నికలపై ఉండకుండా చేసేందుకే కేసీఆర్‌కు సిట్ నోటీసులు. సిట్‌లో ఉన్నది పోలీసులా రేవంత్ ప్రైవేటు సైన్యమా అని అనుమానాలు కలుగుతున్నాయి' అని మధుసూదనాచారి సందేహం వ్యక్తం చేశారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు రేవంత్ చేసిన చిల్లరమల్లర యత్నమే సిట్ నోటీసులు అని మధుసూదనాచారి కొట్టిపారేశారు. 'తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అంటే కేసీఆర్ వల్లే అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కేసీఆర్‌తో అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఈ ప్రభుత్వం హుందాతో పరిణతితో వ్యవహరించడం లేదు. కేసీఆర్‌కు చట్టం అంటే అమితమైన గౌరవం. ఉద్యమాన్ని కేసీఆర్ శాంతియుతంగా గాంధేయవాదంతో నడిపారు' అని గుర్తుచేశారు.

'అందరి మనసులు గెలిచి కేసీఆర్ తెలంగాణ సాధించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా ఏనాడు ఎవరిపై కక్ష సాధించలేదు. కేసీఆర్‌కు నోటీసులను తెలంగాణ మేధావులు కళాకారులు కవులు తీవ్రంగా పరిగణించాలి' అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బొగ్గు స్కాం, జల వివాదాల నేపథ్యంలో రేవంత్ కేసీఆర్‌కు నోటీసులు పంపారని అందరికీ తెలుసని ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్ రావు వరసగా కుంభకోణాలు బయటపెడుతుండటంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తయారు చేసిన సైనికులు రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వారు తమ నాయకుడికి నోటీసులను సహించరు.. రేపు ఎక్కడికక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తారు' అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ప్రకటించారు. తన గురువు చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటానికి రేవంత్ తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ పార్టీని బలహీనం చేయాలనే కుట్రలు ఫలించవు అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:45:38
New Delhi, Delhi:

Union Budget Part B Speech: దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం యావత్‌ కేంద్ర బడ్జెట్‌పై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కోట్లాది ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. తమకు ఏమైనా ప్రయోజనకరమైన నిర్ణయాలు ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. పార్లమెంట్‌లో నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 2026-27 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండడంతో బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌తో 75 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనున్నట్లు సమాచారం. పార్ట్ బీ ద్వారా దేశ ఆర్థిక భవిష్యత్తుకు అవసరమైన దార్శనికతను ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కాగితరహిత బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్‌లో జీడీపీ లోటు, ఆర్థిక ఏకీకరణపై రోడ్‌మ్యాప్‌ను మార్కెట్లు ఆశిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:22:12
Parvathagiri, Telangana:

Women Constable Love Affair: పెళ్లి చేసుకుంటానని దూరపు చుట్టమైన యువకుడు నమ్మించి మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాడు. అయితే తరచూ వీడియో కాల్‌ చేయాలని.. ఎవరితో మాట్లాడవద్దని వేధించాడు. అతడి వైఖరి నచ్చకపోవడంతో సదరు యువతి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవగా.. అతడు పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడికి యువతి గురించి తప్పు సమాచారం ఇచ్చాడు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు కూడా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వేధింపులకు పాల్పడడంతో ఆ యువతి మానసిక వేధన భరించలేక ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహించేది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితో చనువుగా మాట్లాడవద్దని వేధింపులకు పాల్పడేవాడు. అతడి వైఖరి నచ్చకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు అనిత ససేమిరా అని తన స్నేహితుడు జబ్బార్‌ లాల్‌ అనే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.

ఈ క్రమంలో జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందని.. అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో రాజేందర్ అనిత గురించి చెడుగా చెప్పాడు. జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి అనిత గురించి తప్పుడు సమాచారమిచ్చాడు. ఆ యువతి ప్రవర్తన.. ఇతరులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో అనితను జబ్బార్‌ లాల్‌ వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని జబ్బార్ లాల్ వేధింపులకు దిగాడు. దీంతో అనిత తీవ్ర మానసిక క్షోభకు గురయ్యింది.

ఇద్దరి మధ్య మానసికంగా నరకం అనుభవించిన యువతి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో రాజేందర్‌కు ఫోన్ చేసి 'మీ ఇద్దరితో నా జీవితం నాశనమైంది. నాకు చావే దిక్కు' అని అతడితో అనిత కన్నీరు పెట్టుకుంది. దీంతో 'చస్తే చావు' అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించేలోగా ఆ యువతి ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:17:36
Hyderabad, Telangana:

AI Policy Symposium: రాజకీయ పాఠాలు నేర్చుకునేందుకు అమెరికాకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి అరుదైన గౌరవం పొందారు. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కార్యక్రమానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డిని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారత్​ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి  ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకున్నారు.

మార్చిలో జరిగే ఏఐ పాలసీ సింపోజియంలో హార్వర్డ్ కెన్నడీ స్కూల్​  డీన్ జెరెమీ వైన్‌స్టీన్‌తో కలిసి సింపోజియం ప్రారంభించాలని రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వాన లేఖను అందించారు. వివిధ రంగాల ప్రముఖులతో పాటు సాంకేతిక నిపుణులు ఈ సింపోజియం కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా ఈ వేదికపై ప్రసంగించే అవకాశాన్ని పరిశీలిస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో కార్యక్రమాల చివరి రోజున వివిధ ప్రతినిధి బృందాలు, పలు  స్కూల్ విద్యార్థులు, అలూమ్నీతో పాటు ఎంఐటీ, కొలంబియా యూనివర్సిటీల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో  రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వం, ఆర్థిక వృద్ధి, సుస్థిరాభివృద్ధి,  పర్యావరణం, రైతులు, మహిళలు, యువత సంక్షేమం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్​ విజన్​ 2047 లక్ష్యాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధికారత అభివృద్ధి దిశగా ఉన్న అవకాశాలను వివరించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

భవిష్యత్తు భారత పురోభివృద్ధిలో  తెలంగాణ, అందులో ప్రధానంగా హైదరాబాద్ ముందుండి దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపింది. వివిధ దేశాల్లో చదువుతున్న  విద్యార్థులు తెలంగాణ రైజింగ్  బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించినట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా శిక్షణ పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్‌ చేరుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ చేరుకున్న అనంతరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:05:50
Hyderabad, Telangana:

Excise Constable Sowmya: గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య వారు వాహనంతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన సౌమ్య చివరికి ప్రాణం విడిచింది. నిమ్స్‌ వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన కృషి విఫలమైంది. గంజాయి ముఠా బారిన పడిన ఓ పోలీస్‌ ఉద్యోగి చనిపోవడం తెలంగాణలో తీవ్రంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

గంజాయి బ్యాచ్‌ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణించినట్లు నిమ్స్‌ ఆస్పత్రి ప్రకటించింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇప్పటికే నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయగా.. విడుదల చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ప్రాణం విడిచింది. 

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య మరణంపై నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వివిధ విభాగాల నిపుణుల ద్వారా అవసరమైన అన్ని అత్యాధునిక వైద్య సేవలు, లైఫ్ సపోర్ట్ చికిత్సలు అందించినట్లు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. వైద్యులు అత్యంత శ్రద్ధతో నిరంతర వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, సౌమ్య ను కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె 31 జనవరి 2026 రాత్రి 9:41 గంటలకు  మృతిచెందారని నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఈ విషాద సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులకు నిమ్స్ యాజమాన్యం  సానుభూతి తెలిపింది. సౌమ్య శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ కిడ్నీ తొలగించామని ఇప్పటికే వైద్యులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ‌త శుక్ర‌వారం రాత్రి గంజాయి త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు తమ కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మ‌తిన్, స‌ఫియుద్దీన్, స‌య్య‌ద్ సోహైల్ ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 17:32:21
Thiruvananthapuram, Kerala:

India vs New Zealand: వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టు టీ20లో అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుని పొట్టి క్రికెట్‌లో తిరుగులేదని నిరూపించింది. హ్యాట్రిక్‌ విజయాల అనంతరం నాలుగో మ్యాచ్‌ కోల్పోయిన భారత్‌ ఐదో మ్యాచ్‌లో దుమ్ములేపింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన టీమిండియా బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు మంచి స్కోర్‌తో విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌కు ఉత్సాహంగా వెళ్లనుంది.

తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. మరోసారి సంజూ శాంసన్ తీవ్ర నిరాశపర్చి 6 పరుగులకే ఔటయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ బాదాడు. 43 బంతుల్లో 103 పరుగులు చేయగా.. 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. మూడో మ్యాచ్‌లో తృటిలో కోల్పోయిన సెంచరీని ఈ మ్యాచ్‌లో పూర్తి చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేసి మెరవగా.. హార్దిక్ పాండ్య (42) మెరిశాడు.. అభిషేక్ శర్మ 30 పరుగులకే పరిమితమయ్యాడు. సూర్యకుమార్, ఇషాన్ మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. 

రింకూ సింగ్ 8 బంతుల్లో 8 పరుగులు, శివం దూబే 2 బంతుల్లో 7 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించారు. భారత స్కోర్‌కు కళ్లెం వేయడంతో కివీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. లాకీ ఫెర్గూసన్‌ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించగా.. జాకబ్‌ డఫీ, కేల్‌ జేమిసన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ 225 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినా చివరి మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మరో ఓటమిని పొందింది. బ్యాటింగ్‌ చేసిన వారిలో ఫిన్‌ అలెన్‌ సెంచరీకి చేరువై ఔటయ్యాడు. 38 బంతుల్లో 80 పరుగులు చేయగా.. ఇష్‌ సోధి (33), రచిన్‌ రవీంద్ర (30) కొంత పోరాడారు. తర్వాతి బ్యాటర్లు అంత ప్రభావం చూపకపోవడంతో కివీస్‌ జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. భారత్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 5, అక్షర్ పటేల్ 3, వరుణ్‌, రింకు సింగ్‌ చెరో ఒక వికెట్ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 17:04:59
Mahbubnagar, Telangana:

Nitin Nabin Sinha Telangana Visit: 'బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మార్గదర్శనంలో తెలంగాణ బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం' మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. 'మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలి' అని సూచించారు. తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున పుంజుకుంటోందని.. యువత బీజేపీ వైపు చూస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేద్దామని పార్టీ శ్రేణులతో ఎంపీ డీకే అరుణ తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కోసం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హా రాబోతుండడంతో ఎంపీ అరుణ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఎంపీ అరుణ మాట్లాడుతూ.. 'పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను ఉద్దేశించి జాతీయ అధ్యక్షుడు సందేశం ఇస్తారు. ఒక యువ నాయకుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హా పార్టీ శ్రేణుల్లో ఈ సమావేశంతో స్పూర్తి నింపుతారు' అని తెలిపారు.

'ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఈ సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగే ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరవుతుండటం సంతోషకరం' అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. 'ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల పక్రియ తెలంగాణలో కొనసాగుతుంది. 3వ తేదీ నాటికి నామినేషన్ విత్ డ్రా గడువు ముగుస్తుంది. జిల్లా కార్యకర్తల సమావేశానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఏర్పాట్లు ప్లాన్ చేసేందుకు, సభ స్థలాన్ని పరిశీలించాం' అని వెల్లడించారు. 

జాతీయ అధ్యక్షుడు రానున్న సమావేశానికి ఉమ్మడి జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నలుమూల నుంచి బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, మోర్చ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై  విజయవంతం చేయాలి' అని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:51:30
Hyderabad, Telangana:

42 Percent BC Reservation: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుందో స్పష్టంగా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పించని పార్టీలు బీసీ ద్రోహులు అని ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు బీఫామ్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన ఓ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లింది. పార్టీలపరంగా బీసీలకు జనాభా దామషా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలి' అని డిమాండ్ చేశారు. జనరల్ స్థానాలలో ఇప్పటికే నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్‌లు ఇవ్వాలని కోరారు. జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని తెలిపారు. 

'బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో బీఫామ్‌లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయి. సర్వేల పేరుతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం' అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టమైన తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. లేకపోతే బీసీ ద్రోహుల పార్టీలుగా చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. కాగా రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిక్లరేషన్‌ ఇచ్చి... మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు బీసీలను ఘోరంగా మోసగించడాని రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:28:20
Tadepalli, Andhra Pradesh:

Ambati Rambabu vs TDP Goons: దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా చంద్రబాబు? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు  ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?' అని ప్రశ్నించారు. 'చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చట్టం, న్యాయం అనే పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని చంద్రబాబు సృష్టించారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. 

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేసిన వీడియోను పోస్టు చేసి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు' అని మండిపడ్డారు. 'చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. భక్తుల మనోభావాలను గాయపరచడంతో ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేయించడమే చంద్రబాబు నియంత స్వభావానికి, దుర్మార్గానికి   నిదర్శనం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కరుడుగట్టిన గూండాగా.. ఓ నియంతగా చంద్రబాబు తయారయ్యారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఈ వైఖరి అత్యంత ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులపై జరుగుతున్న దాడులు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను కూడా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:06:38
Guntur, Andhra Pradesh:

TDP Goons vs Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి తీవ్ర సంచలనం రేపగా.. ఈ దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ కోరింది. డీజీపీకి ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి.. దాడికి పాల్పడిన వారితోపాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

Also Read: Daughter In Law: డామిట్‌ కథ అడ్డ తిరిగింది.. అత్తారింటికే కన్నం వేసిన కోడలు

ఏపీ డీజీపీకి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్‌ ఆఫీస్ ఇంఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. 'అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టి గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి కుట్ర పన్నారు' అని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇది యాదృచ్ఛిక ఘటన కాదు… రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట అని స్పష్టం చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకే భద్రత లేకుండా పోయిన పరిస్థితి రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన కొనసాగుతుందో స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. గుండాలు, రౌడీలను రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహిస్తున్న శక్తుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది.

'టీడీపీ గూండాలు దాడి చేస్తున్న సమయంలో పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్వీర్యతకు, పాలన వైఫల్యానికి అద్దం పడుతోంది' అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని.. దాడికి పాల్పడిన వారితో పాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. హింస, బెదిరింపులు, దాడులతో వైఎస్సార్సీపీని అణచివేయడం ఎవరి వల్లా కాదని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను నొక్కివేయాలనే ఈ అరాచక ప్రయత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. చట్ట వ్యవస్థను ధ్వంసం చేసిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:44:02
Guntur, Andhra Pradesh:

YS Jagan Phone Call: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై తెలుగుదేశం పార్టీ గూండాల దాడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతుండగా.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. తమ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మూకలు, గూండాలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. అంబటి నివాసంపై దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించి ఫోన్‌ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబుని ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయి' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉద్దేశపూక్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు దిగారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు మొత్తం చూస్తున్నారని.. ఈ అరాచక పాలనను ప్రజలు సహించబోరని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ మొత్తం అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులకు వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబుకు అండగా నిలబడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబు నివాసానికి భద్రత కల్పించాలని.. అంబటికి ప్రాణహానీ పొంచి ఉందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా డీజీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెయిల్‌ చేశారు. అంబటి రాంబాబుకు తక్షణమే కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ గూండాల నుంచి అంబటి రాంబాబుకు ప్రాణహాని పొంచి ఉందని మెయిల్‌లో తెలిపారు. కాగా ఫోన్‌కాల్‌లో ప్రయత్నించగా స్పందన లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top