Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట నిరసన

Aug 31, 2024 17:34:21
Bellampalle, Kannal Rural, Telangana
గత 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంటాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. అధికారులకు, నాయకులకుు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీసీహెచ్ వైద్యులు డాక్టర్ కోటేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని 15 రోజుల క్రితం కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 24, 2025 13:57:06
Secunderabad, Telangana:

New Year 2026 Investment Plan: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ.. చాలా మంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఆరోగ్యం, కెరీర్‌తో పాటు భవిష్యత్తు ఆర్థిక భద్రత కూడా ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రధాన ఆలోచనగా మారింది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే, పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది. ఇలాంటి సందర్భంలో అటల్ పెన్షన్ యోజన (APY) ఒక నమ్మకమైన, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తోంది.

భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా అటల్ పెన్షన్ యోజనలో ఖాతాలు తెరిచి పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి నెలకు రూ.10,000 వరకు పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో.. దీని భద్రతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత జీవితాంతం హామీతో కూడిన పెన్షన్‌ను ఈ పథకం అందిస్తుంది.

ఈ పథకం కింద ప్రతి వ్యక్తి తనకు నచ్చిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. భార్యాభర్తలిద్దరూ ఒక్కొక్కరూ రూ.5,000 పెన్షన్ ఎంపిక చేసుకుంటే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి రూ.10,000 నెలవారీ ఆదాయం లభిస్తుంది. ఈ మొత్తం వృద్ధాప్యంలో రోజువారీ ఖర్చులు, వైద్య అవసరాలు వంటి వాటిని ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేకపోయే వయస్సులో ఈ పెన్షన్ ఒక పెద్ద భరోసాగా నిలుస్తుంది.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. పెట్టుబడి ప్రారంభించే వయస్సు తక్కువగా ఉంటే.. నెలవారీ విరాళం అంత తక్కువగా ఉంటుంది. అంటే.. యువత తొందరగా ఈ పథకంలో చేరితే, తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ భవిష్యత్తులో మంచి పెన్షన్ పొందవచ్చు. పెట్టుబడి మొత్తం మీరు ఎంచుకునే పెన్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండటంతో పాటు, ప్రభుత్వ హామీ ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. అందుకే భద్రత కోరుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపికగా చెప్పవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభంలో భార్యాభర్తలు కలిసి ఈ పథకం కింద ఖాతాలు తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రాబోయే సంవత్సరాల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించినట్లే అవుతుంది.

అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరవడం కూడా చాలా సులభం. మీ సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి.. అవసరమైన పత్రాలు సమర్పిస్తే, కొన్ని సులభమైన దశల్లోనే ఖాతా ప్రారంభించవచ్చు. హామీ ఉన్న రాబడి, దీర్ఘకాలిక భద్రత, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల కారణంగా అటల్ పెన్షన్ యోజన భార్యాభర్తలకు ఒక విశ్వసనీయమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 24, 2025 13:15:45
Hyderabad, Telangana:

Cobra Snakes Video Viral: ప్రమాదకరమైన పాములను రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలో కూడా వాటి కాటు బారిన పడి మరణిస్తున్నారు.. ఏది ఏమైనా పాములు పట్టేవారు ప్రకృతిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రకృతిని రక్షించేందుకు వారు చేసే ప్రయత్నాలు అంతో ఇంతో కాదు వర్ణనాతీతం.. అయితే, చాలామంది యువత కూడా పాములు పట్టే ట్రైనింగ్ తీసుకొని.. ప్రకృతిని రక్షించే కార్యక్రమంలో పడ్డారు. ఇటీవల కాలంలో అడవి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆహార కోరత కారణంగా.. పల్లె ప్రాంతాల్లోకి ప్రమాదకరమైన పాములు సంచారం చేయడంతో.. వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగమే జలీల్ బాయ్..

గత కొద్ది రోజుల నుంచి జలీల్ భాయ్ పాములను రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన అతను ఎక్కడ పాములు కనిపించిన అక్కడికి వెళ్లి రెస్క్యూ చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు అతను కొన్ని వందల పాములకు పైగా పట్టుకొని రెస్క్యూ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అతడు ఆ పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు పట్టుకునే క్రమంలో తీసిన కొన్ని వీడియోలైతే జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. 

తాజాగా కూడా జలీల్ భాయ్ ఓ పామును పట్టుకుంటున్న క్రమంలో తీసి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఇంట్లోకి సంచారం చేసిన కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో కింగ్ కోబ్రా ఇంట్లోని వంట రూములో సిలిండర్ కింద సంచారం చేస్తుంది. అయితే, దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని వెంటనే జలీల్ బాయ్ కి సమాచారం అందించారు వెంటనే అతను అక్కడికి చేరుకొని సిలిండర్ కింద ఉన్న ఆ పాముని రెస్క్యూ చేశారు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం.

ఈ సమయంలో అతను సిలిండర్ కింద ఉన్న చిన్న నాగుపామును తన చేతితోనే బయటికి లాగి.. తోకను పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించడం మీరు చూడొచ్చు. ఇలా అతను ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఆ పామును బంధించి.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 13:05:32
Secunderabad, Telangana:

New Rules From January 2026: 2026 సంవత్సరం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా అనేక కొత్త నిబంధనలు, విధాన మార్పులు అమలుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి కొత్త సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలు, రైతాంగం, సోషల్ మీడియా, రవాణా వంటి అనేక రంగాల్లో మార్పులు సామాన్యుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించనున్నాయి. ఈ మార్పులు యువత నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ తాకనున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు:

2026 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ నిర్వహణలో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి అప్ డేట్ అయ్యే క్రెడిట్ డేటాను ఇకపై ప్రతి వారం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రుణాలపై వడ్డీ రేట్లు, లోన్ అర్హత మరింత పారదర్శకంగా మారనుంది. అదే సమయంలో SBI, PNB, HDFC వంటి ప్రధాన బ్యాంకులు రుణ వడ్డీ రేట్లలో కోత ప్రకటించాయి. ఈ తగ్గింపు ప్రభావం కొత్త సంవత్సరం నుంచి స్పష్టంగా కనిపించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో కూడా మార్పులు చేసి, జనవరి నుంచి కొత్త రేట్లు అమలు చేయనున్నారు.

UPI, ఇతర డిజిటల్ చెల్లింపుల విషయంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. PAN–Aadhaar లింకింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది లేకపోతే బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సేవలు నిలిపివేయబడే అవకాశం ఉంది. అలాగే WhatsApp, Telegram, Signal వంటి యాప్‌లలో సిమ్-లింక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు.

సోషల్ మీడియా, ట్రాఫిక్ నియమాల్లో మార్పులు:

సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠిన నియమాలు తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల మాదిరిగా వయస్సు పరిమితి, కంటెంట్ నియంత్రణలు అమలు చేసే అవకాశముంది.రవాణా రంగంలోనూ మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా కొన్ని నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాహనాల వాణిజ్య వినియోగంపై పరిమితులు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో డెలివరీ వాహనాలపై కొత్త నిబంధనలు అమలు కావచ్చు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మార్పులు:

డిసెంబర్ 31తో ఏడవ వేతన సంఘం కాలపరిమితి ముగియడంతో... ఎనిమిదవ వేతన సంఘంపై అంచనాలు పెరిగాయి. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీనితో పాటు కరువు భత్యం (DA) పెంపు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల కనిపించవచ్చు. హర్యానా వంటి రాష్ట్రాల్లో పార్ట్-టైమ్, రోజువారీ వేతన కార్మికులకు కనీస వేతనం పెంచే నిర్ణయాలు తీసుకున్నారు.

రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు:

రైతుల కోసం కూడా కీలక మార్పులు అమలవుతున్నాయి. ముఖ్యంగా PM కిసాన్ పథకం కింద రైతు ఐడీ తప్పనిసరి చేస్తున్నారు. ఇది లేకపోతే వాయిదాలు రైతు ఖాతాల్లో జమ కావు. పంట బీమా పథకంలో కూడా మార్పులు వచ్చాయి. అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా ఇప్పుడు బీమా కవరేజీ లభించనుంది. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

పన్నులు, గ్యాస్, విమాన టిక్కెట్లపై ప్రభావం:

2026 జనవరి నుంచి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్ విడుదల కానుంది. ఇందులో బ్యాంకింగ్ లావాదేవీలు, ఖర్చుల వివరాలు ముందుగానే పొందుపరిచే అవకాశం ఉంది. LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి సవరిస్తారు. అలాగే ఎయిర్ ఫ్యూయల్ ధరల్లో మార్పులతో విమాన టిక్కెట్ ధరలపై ప్రభావం పడవచ్చు.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

ఈ విధంగా 2026 సంవత్సరం అనేక మార్పులతో మొదలుకాబోతోంది. బ్యాంకింగ్ నుంచి వ్యవసాయం వరకు, ఉద్యోగాల నుంచి సోషల్ మీడియా వరకు ప్రతీ రంగంలో కొత్త నిబంధనలు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే కొత్త సంవత్సరం మనకు మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 24, 2025 13:04:45
Hyderabad, Telangana:

Rare Cobra Video Watch Now: ప్రకృతిలో పాములు అత్యంత కీలకమైన జీవులుగా చెప్పుకుంటారు.. ఇవి ఆహార గొలుసులో భాగంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవలే అడవుల్లో వనరుల కోరత తగ్గిపోయి.. ఎక్కువగా జనావాసాల మధ్యలోకి పాములు రావడం ప్రారంభమైంది. దీని కారణంగా కొన్ని అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఊళ్ళలోకి ఎక్కువగా విషపూరితమైన పాములు సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పాములు ఇళ్లలోని వంట గదిలో చేరి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే వారు వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

తాజాగా ప్రముఖ స్నేక్ రెస్క్యూయర్ జలీల్ భాయ్ ఓ అరుదైన 12 ఏళ్ల వయస్సు కలిగిన ఇండియన్ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతను అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఎలా పట్టుకుంటున్నాడనేది క్లియర్‌గా కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. 12 ఏళ్లు కలిగిన అత్యంత ప్రమాదకరమైన నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చాలామంది ఇలాంటి కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు చూసి అప్పుడప్పుడు భయపడుతూ కూడా ఉంటారు. అయితే ఈ వీడియో కూడా అదే కోవాకు చెందింది గా అనిపిస్తోంది.

వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఈ వీడియోలో ఆ స్నేక్ క్యాచర్ ఒక పెద్ద పాములు పట్టే కర్రను తీసుకొని.. ఆ ప్రమాదకరమైన నాగుపాము తలభాగాన్ని దానితో పట్టి ఉంచడం మీరు గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అది ఏ మాత్రం దాడి చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ రెస్క్యూట్ స్టిక్ తో పామును సులభంగా నియంత్రించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా 12 ఏళ్ల నాటి పాము కావడంతో దాని శరీరం మొత్తం పోలీసులు వదులుతున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. అలాగే దాని తలభాగం కూడా చాలా పెద్దదిగా ఉండడం గమనించవచ్చు. అయితే, జలీల్ భాయ్ ఆ పాముని పట్టుకొని ఓ సంచిలో బంధించాడు. 

ఈ వీడియోలో జలీల్ భాయ్ పామును రక్షించే సమయంలో ఆయన వ్యూయర్స్‌కి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. నాగుపాములు జెర్రిపోతులు సాధారణంగా గుడ్లు పెడతాయని.. రక్తపింజర జాతికి సంబంధించిన పాములు మాత్రం నేరుగా పిల్లలను జన్మనిస్తాయని అతను తెలిపాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదకరమైన పాములు కనిపించినప్పుడు తప్పకుండా రెస్క్యూ ఇబ్బందికి సమాచారం అందించాలని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో జలీల్ భాయ్ తన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 12:23:43
Secunderabad, Telangana:

8th pay commission expectations 7th pay commission impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో కీలక దశకు తెరలేవనుంది. డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం పదవీకాలం ముగుస్తుంది. గత 10ఏండ్ల కాలంలో అమలైన మార్పులు మరోసారి చర్చకు వస్తున్నాయి. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, పదవీ విరమణ ప్రయోజనాల వరకు 7వ వేతన సంఘం తీసుకొచ్చిన నిర్ణయాలు కోట్లాది కుటుంబాల ఆర్థిక జీవనంపై గణనీయమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపై కేంద్రీకృతమైంది. జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? పెన్షనర్లకు ఎంత ప్రయోజనం లభిస్తుంది? అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే ఇవి 50 లక్షలకుపైగా ఉద్యోగులు.. దాదాపు 69 లక్షల పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

7వ వేతన సంఘం అమలు.. ప్రధాన మార్పులు:

7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతాన్ని నెలకు రూ.18,000గా నిర్ణయించారు. అదే సమయంలో అపెక్స్ స్థాయి అధికారుల గరిష్ట జీతాన్ని రూ.2.25 లక్షలుగా, క్యాబినెట్ సెక్రటరీ వంటి అగ్రస్థాయి అధికారులకు రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. పాత పే బ్యాండ్.. గ్రేడ్ పే విధానాన్ని రద్దు చేసి, కొత్తగా పే మ్యాట్రిక్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని వల్ల ఉద్యోగుల స్థాయి, జీతాల పురోగతి స్పష్టంగా మారింది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్లు:

7వ వేతన సంఘంలో 2.57 యూనిఫాం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అన్ని ఉద్యోగులకు ప్రయోజనాలను అందించారు. దీని కారణంగా ప్రాథమిక జీతాలు గణనీయంగా పెరిగాయి. వార్షిక ఇంక్రిమెంట్ రేటును మాత్రం 3 శాతానికి పరిమితం చేశారు. దీంతో జీతాల పెరుగుదల స్థిరంగా కొనసాగింది.

MACP.. అలవెన్సుల మార్పులు:

MACP నిబంధనల్లో పనితీరు ప్రమాణాన్ని గుడ్ నుంచి వెరీ గుడ్ కు పెంచారు. అదే సమయంలో 52 అలవెన్సులను రద్దు చేసి, మిగిలినవాటిని విలీనం చేశారు. రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సుల కోసం ప్రత్యేకంగా 9-టైర్ మ్యాట్రిక్స్‌ను అమలు చేశారు. ఇంటి అద్దె భత్యం విషయంలో X, Y, Z నగరాలకు వరుసగా 24శాతం, 16శాతం, 8శాతంగా నిర్ణయించారు. డీఏ పెరిగే కొద్దీ HRAలోనూ మార్పులు చేశారు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

అడ్వాన్సులు, వైద్య సౌకర్యాలు, పెన్షన్:

వడ్డీ లేని అడ్వాన్సులను రద్దు చేసి.. గృహ నిర్మాణ అడ్వాన్సు (HBA) పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. CGEGIS కింద బీమా కవర్ పెరిగింది. వైద్య సదుపాయాల విషయంలో CGHS పరిధిని విస్తరించారు. 2016కి ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ పునఃలెక్కింపు అమలు చేశారు. గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పెద్ద ఉపశమనంగా మారింది.

8వ వేతన సంఘం.. ఆశలు, అంచనాలు:

8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలవుతుందా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వం ఇప్పటివరకు తేదీని ఖరారు చేయలేదని తెలిపింది. కమిషన్ నోటిఫికేషన్ తర్వాత నివేదిక రావడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెరుగుదల, పెన్షన్ సవరణలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 7వ వేతన సంఘం ముగింపుతో.. ఇప్పుడు 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 11:55:40
Secunderabad, Telangana:

Why Gold Rate Surge: 2025 ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు మాత్రమే కాదు.. సామాన్య వినియోగదారులకు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిరోజూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. మధ్య కొన్ని సందర్భాల్లో బంగారం ధరలు తగ్గినట్లుగా అనిపించినా.. 2025 ముగిసేలోపు మళ్లీ భారీగా ఊపందుకుంటున్నాయి. తాజాగా బుధవారం జరిగిన ట్రేడింగ్ లో బంగారం ధర మరోసారి దూసుకెళ్లింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధర దాదాపు రూ.2,500 పెరిగి 10 గ్రాములకు రూ.1.41 లక్షల స్థాయిని దాటింది. ఈ ఆకస్మిక ర్యాలీ వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు కారణాలకు అమెరికాతో నేరుగా సంబంధం ఉండటం గమనార్హం.

బుధవారం బంగారం ధరలు రాకెట్‌లా ఎగసిపడ్డాయి. MCXలో వరుసగా రెండో ట్రేడింగ్ రోజూ బంగారం బలమైన లాభాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 5 గడువు ఉన్న 24 క్యారెట్ బంగారం ధర ట్రేడింగ్ సమయంలో రూ.1,519 పెరిగి 10 గ్రాములకు రూ.1.38 లక్షలకు పైగా చేరింది. ఇది శాతంగా చూస్తే సుమారు 1.11 శాతం పెరుగుదల. అదే సమయంలో దేశీయ బులియన్ మార్కెట్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం, సోమవారం ముగింపు నాటికి 24 క్యారెట్ బంగారం ధర రూ.1,33,970గా ఉండగా, బుధవారం నాడు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంతోనే అది రూ.2,163 పెరిగి రూ.1,41,133కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం పరుగులు తీసింది. ఆసియా మార్కెట్లలో స్పాట్ బంగారం ధర ఔన్సుకు జీవితకాల గరిష్ట స్థాయి $4,445.69ను తాకింది. వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి. MCXలో వెండి ధరలు కిలోకు రూ.3,000కు పైగా పెరిగి సుమారు రూ.2,25,596కు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ వెండి ధర 0.19 శాతం పెరిగి ఔన్సుకు $69.15 వద్ద ట్రేడైంది.

డిసెంబర్ ప్రారంభంలో కొంతకాలం బంగారం ధరలు ఒత్తిడిలోకి వెళ్లాయి. అయితే నెల చివరి రోజుల్లో మళ్లీ పుంజుకున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 70 శాతం బలమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఈ నెలలో కొంత తగ్గిన తర్వాత కూడా దాదాపు 10 శాతం రికవరీ సాధించాయి. ఈ పునరుజ్జీవానికి ప్రధానంగా పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడమే కారణంగా చెప్పవచ్చు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

మొదటి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని చెప్పాలి. అమెరికా వెనిజులా చమురును రవాణా చేస్తున్న ట్యాంకర్లపై చర్యలు తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల ఇంధన సరఫరాలపై అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసి, బంగారాన్ని మరోసారి సేఫ్ హేవెన్ గా మార్చాయి.

రెండో కారణం ప్రపంచ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు చేయడం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కేంద్ర బ్యాంకుల నిల్వల్లో బంగారం వాటా అమెరికా ట్రెజరీ బాండ్ల కంటే ఎక్కువైంది. 2022 నుంచి కేంద్ర బ్యాంకులు ప్రతి ఏడాది సగటున వెయ్యి టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ధోరణి డాలర్ ఆధిపత్యానికి సవాల్‌గా మారడంతో పాటు బంగారం ధరలను మరింత పైకి నెట్టింది.

మూడో కారణం ఏంటంటే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చిన సంకేతాలు. ఇటీవల ఫెడ్ పాలసీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో, 2026లో కూడా రేటు కోతలు ఉండవచ్చని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు దిగుబడి లేని బంగారం వంటి ఆస్తులు ఆకర్షణీయంగా మారుతాయి. ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ వ్యాఖ్యలు కూడా ఈ భావనకు బలం చేకూర్చాయి. ఈ అన్ని అంశాలు కలిసి బంగారం ధరలను మరోసారి ఆకాశానికి ఎత్తేశాయి.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

ఇదే ధోరణి కొనసాగినట్లయితే వచ్చే ఏడాది చివరి నాటికి 10గ్రాముల బంగారం ధర రూ. 2లక్షలు, కిలో వెండి ధర రూ. 4లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దూకుడు దాదాపుగా కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారికి భారీ రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సామాన్యులకు మాత్రం ఈ లోహాలకు అందనంత ఎత్తుకు చేరుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 11:48:56
Hyderabad, Telangana:

EPFO 3.0 Withdrawal Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత వేగవంతం చేయడం సహా సభ్యులకు వెసులుబాటు కల్పించేందుకు EPFO 3.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. నిరుద్యోగం, పెన్షన్, వివాహం, విద్య వంటి అవసరాల కోసం పీఎఫ్ (PF) డబ్బును తీసుకునే నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఆ 7 ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఉన్నాయి.

1. నిరుద్యోగ సమయంలో ఉపసంహరణ..
పాత రూల్: ఒక నెల ఖాళీగా ఉంటే 75 శాతం, రెండు నెలల తర్వాత మిగిలిన 25 శాతం తీసుకోవచ్చు.
కొత్త నియమం (EPFO 3.0): ఉద్యోగం పోయిన వెంటనే 75 శాతం బ్యాలెన్స్‌ను తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, పూర్తి 100 శాతం నగదు కావాలంటే మాత్రం వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉన్నట్లు నిరూపించుకోవాలి.

2. పెన్షన్ విత్‌డ్రా..
పాత నియమం: రెండు నెలల పాటు ఉద్యోగం లేకపోతే పెన్షన్ డబ్బు తీసుకోవచ్చు.
కొత్త నియమం: ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలంటే కనీసం 36 నెలల పాటు (3 ఏళ్లు) నిరుద్యోగ కాలం పూర్తి కావాలి.

3. సంస్థ మూసివేత లేదా లాకౌట్
పాత నియమం: కంపెనీ మూతపడితే ఉద్యోగి వాటా లేదా 100 శాతం మొత్తం తీసుకునే వీలుండేది.
కొత్త నియమం: సభ్యులు పీఎఫ్ కార్పస్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని ఖాతాలో 'కనీస నిల్వ' గా ఉంచడం ఇప్పుడు తప్పనిసరి.

4. విద్య, వివాహం 
పీఎఫ్ సభ్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. పాత నియమం ప్రకారం.. ఏడేళ్ల సర్వీస్ తర్వాత విద్య కోసం 3 సార్లు, పెళ్లి కోసం 2 సార్లు మాత్రమే డబ్బు తీసుకునే అవకాశం ఉండేది.

కొత్త నియమం ప్రకారం.. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఉన్నత విద్య కోసం 10 సార్లు, వివాహ ఖర్చుల కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణలకు ప్రభుత్వం అనుమతించింది.

5. ప్రకృతి వైపరీత్యాలు
నిబంధన: వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పాక్షిక ఉపసంహరణ చేసుకోవాలంటే ఇప్పుడు కనీసం 12 నెలల సర్వీస్ ఉండటం ప్రామాణికం చేశారు.

6. అనారోగ్యం, వైద్య ఖర్చులు
నిబంధన: 6 నెలల బేసిక్ వేతనం + DA లేదా ఉద్యోగి వాటా మొత్తాన్ని మెడికల్ అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. దీనికి కూడా ఇప్పుడు ఏకరీతిగా 12 నెలల సర్వీస్ తప్పనిసరి నిబంధనను వర్తింపజేశారు.

7. 'ప్రత్యేక పరిస్థితుల' కింద క్లెయిమ్..
మార్పు: గతంలో అంటువ్యాధులు (Pandemic), సంస్థ మూసివేత వంటి ప్రత్యేక కారణాల కింద డబ్బు విత్‌డ్రా చేయాలంటే సరైన వివరణలు/ఆధారాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎటువంటి వివరణలు ఇవ్వకుండానే సభ్యులు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

EPFO 3.0 ద్వారా క్లెయిమ్‌ల సెటిల్మెంట్ సమయం తగ్గడమే కాకుండా, సభ్యులకు అత్యవసర సమయాల్లో నిధులు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Nidhhi Agerwal In Bigg Boss: లూలూ మాల్ ఘటన తర్వాత తొలిసారి బయటకొచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్! ఎలా మారిపోయిందంటే?

Also Read: Vijay Hazare Trophy 2026: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విధ్వంసం..సెంచరీలతో దుమ్ముదులిపిన మాజీ కెప్టెన్లు! సచిన్ రికార్డు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 11:21:29
Hyderabad, Telangana:

RoKo In Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజే టీమ్ ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాట్‌లతో మైదానంలో పరుగుల వరద పారించారు. ఒకవైపు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయి మైలురాయిని అధిగమించగా, మరోవైపు రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు.

16,000 పరుగుల క్లబ్‌లో కింగ్..
ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తీయడం ద్వారా విరాట్ లిస్ట్-ఎ (List-A) క్రికెట్‌లో 16,000 పరుగుల చారిత్రక రికార్డు మైలురాయిని చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. 

Also Read: TTD Senior Citizen Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..వారికి అరగంటలో దర్శనం..వెంటనే భోజనం సౌకర్యం?! టీటీడీ కీలక ప్రకటన!

ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న 9వ ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. 299 పరుగుల లక్ష్యఛేదనలో కోహ్లీ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. 110 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు కోహ్లీ. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సిక్కిం బౌలర్లపై 'హిట్‌మ్యాన్' దాడి
మరోవైపు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ, సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 61 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న రోహిత్, మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించి ఔట్ అయ్యారు. 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ తన ఒంటిచేత్తో ఛేదించి ముంబైకి ఘనవిజయాన్ని అందించారు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను చూడటానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

లిస్ట్-ఎ క్రికెట్ అంటే ఏమిటి?
దేశీయ 50 ఓవర్ల టోర్నమెంట్లు (విజయ్ హజారే వంటివి), అంతర్జాతీయ వన్డేలు (ODI) రెండింటినీ కలిపి 'లిస్ట్-ఎ' క్రికెట్‌గా పరిగణిస్తారు. ఇందులో అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ దిగ్గజం గ్రాహం గూచ్ (22,000 పైచిలుకు) పేరిట ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి తమ జట్ల కోసం ఇరువురు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఫామ్‌లోకి రావడం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద పండగ లాంటి వార్త.

Also REad: Smart Phone Ban: ఇకపై మహిళలు స్మార్ట్‌ఫోన్ వాడటానికి వీలులేదు..కళ్లు చెదిరిపోయే రూల్ పెట్టిన పంచాయితీ పెద్దలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 24, 2025 10:49:56
Hyderabad, Telangana:

Rajasthan Jalore Panchayat Smart Phone Ban: ప్రపంచం 5G, 6G వేగంతో దూసుకుపోతుంటే.. రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రం కాలం వెనక్కి వెళ్తోంది. జలోర్ జిల్లాలోని భిన్మల్ ప్రాంతానికి చెందిన సుమారు 15 గ్రామాల్లో మహిళలు, యువతులు స్మార్ట్‌ఫోన్లు వాడటంపై స్థానిక పంచాయతీ నిషేధం విధించింది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎక్కడ? ఎప్పటి నుంచి అమలు?
రాజస్థాన్‌లోని 'చౌదరి కమ్యూనిటీ'కి చెందిన సుంధమాత పట్టి పంచాయతీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26, 2026 నుండి ఈ కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఘాజీపూర్, రాజ్‌పూర్, ఖాన్‌పూర్ వంటి మొత్తం 15 గ్రామాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

Also REad: TTD Senior Citizen Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..వారికి అరగంటలో దర్శనం..వెంటనే భోజనం సౌకర్యం?! టీటీడీ కీలక ప్రకటన!

జలోర్ పంచాయతీ విధించిన కఠిన నిబంధనలు ప్రకారం.. మహిళలు కెమెరా ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకూడదు. కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుండే కీప్యాడ్ ఫోన్లను మాత్రమే వాడాలట. వివాహాలు, శుభకార్యాలు లేదా పొరుగువారి ఇళ్లకు వెళ్లేటప్పుడు మహిళలు మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకూడదు. అయితే చదువుకునే విద్యార్థినులకు మాత్రం కొన్ని పరిమితులను విధించారు. కళాశాల లేదా పాఠశాలకు వెళ్లే అమ్మాయిలు చదువు కోసం కేవలం ఇంటి లోపల మాత్రమే స్మార్ట్‌ఫోన్ వాడాలి. ఇంటి గడప దాటితే ఫోన్ చేతిలో ఉండకూడదు.

ఈ నిషేధానికి కారణాలు ఏంటి?
పంచాయతీ పెద్దల వాదన ప్రకారం స్మార్ట్‌ఫోన్ల వల్ల సమాజానికి ముప్పు పొంచి ఉందట. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల గ్రామస్తులు పట్టణ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక ఆచారాలను విస్మరిస్తున్నారని వారి అభిప్రాయం. మహిళలు తమ పని కోసం పిల్లలకు ఫోన్లు ఇచ్చి వెళ్లడం వల్ల వారి కళ్లు దెబ్బతింటున్నాయని, పిల్లలు తప్పుదోవ పడుతున్నారని వారు వాదిస్తున్నారు.

వెల్లువెత్తుతున్న నిరసనలు
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. "ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే" అని వారు ఆరోపిస్తున్నారు. డిజిటల్ ఇండియా కాలంలో మహిళలను సాంకేతికతకు దూరం చేయడం వారి అభివృద్ధిని కుంటుపరచడమేనని విమర్శిస్తున్నారు. ఈ మధ్యయుగపు ఆలోచనలపై ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేదా ఈ పంచాయతీ తీర్పు అలాగే కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Mobile Recharge Increase: న్యూఇయర్‌లో మొబైల్ యూజర్లకు భారీ షాక్..20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఎందుకో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
christmas
Advertisement
Back to top