ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక కొరత వల్ల తమకు ఉపాధి కరువైందని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భవన నిర్మాణాలకు ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంట చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
DK Aruna: రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు మద్దతుగా ఎంపీ డీకే అరుణ
Baddipadaga, Telangana:DK Arun Demands Revanth Reddy Apology: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చీరలు లాగడం.. జుట్టు పట్టుకోవడం.. దాడికి పాల్పడడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసుల వ్యవహరించిన తీరును ఖండించారు. పోలీసుల తీరు చాలా హేయమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
'నిన్న అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైంది' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహిళ శాసనసభ్యులపై పోలీసులు అనుచితంగా ఎవరు ఆదేశాల ప్రకారం ప్రవర్తించారు? రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఏ హోదాలో పోలీసులను ఆదేశించారా? సిగ్గు అనిపించడం లేదా?' అని మండిపడ్డారు. మహిళ శాసనసభ్యులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై చర్చ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
'స్పీకర్‌పై ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుగా ఉందని భావించి క్షమాపణలు కోరాలని చెప్పడం, చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు. దానితోపాటు బీఆర్ఎస్ పార్టీ మహిళ శాసనసభ్యులపై వ్యవహరించిన తీరుపై చర్చ పెట్టాలి' అని ఎంపీ డీకే అరుణ సూచించారు. 'ఎందుకు మహిళ శాసన సభ్యులను అవమానించాల్సి వచ్చింది? మహిళల మెడ, వెంట్రుకలు పట్టుకొని గుంజడం, చీర లాగడంపై నోరు విప్పకపోవడం కన్నా దారుణం ఏమైనా ఉంటుందా?' అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. మహిళ ఎమ్మెల్యేల పరిస్తితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్తితి తెలంగాణలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పాలనపై అసహనం వ్యక్తం చేశారు. మహిళ ఎమ్మెల్యేలకు ఎంత అగౌరవం ఇస్తున్నారో ఇది సాక్ష్యం అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 'ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేసిన వారు. పార్టీలు వేరైనా సాటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంటుంది' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యురాళ్లు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారిపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు ఇంత అనుచితంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగినది. బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు… pic.twitter.com/6NaST1jxUZ
— D K Aruna (@Aruna_DK) September 8, 2026
'ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం సరైంది కాదు. మహిళ పట్ల మరింత గౌరవం ఉండాలి' అని రేవంత్ రెడ్డికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. అసెంబ్లీలోని మహిళ ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇది పార్టీలకు సంబంధం లేని అంశం అని స్పష్టం చేశారు. ఒక మహిళగా, పార్లమెంట్ సభ్యురాలిగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హరీశ్ రావు సంచలన డిమాండ్.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన
Baddipadaga, Telangana:President Rule In Telangana: తెలంగాణలో ఎమ్మెల్యేలు.. మహిళా శాసనసభ్యులను బట్టలు విప్పి దాడి చేయడం.. తొక్కేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చంపేందుకు కాంగ్రెస్ గూండాలు, రౌడీలు కుట్ర పన్నుతుండడంతో మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. తెలంగాణలో రాష్ట్రపతి విధించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Party: రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్.. 'మగాడివే అయితే కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కో'
Baddipadaga, Telangana:Telangana Assembly Session: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ మాట్లాడిన వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. 'కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ పరిసర ప్రాంతాల్లో మకాం వేశారు. కేసీఆర్‌పై దాడి చేయాలని పక్కా ప్రణాళికతో కొందరు ఎమ్మెల్యేలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గరే ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివే అయితే రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కో' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని.. గుండాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తానంటే నడవదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'కేసీఆర్ చావు గురించి ఇద్దరి ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డే అనిపించాడు' అని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. 'రేవంత్ రెడ్డి మా నాయకుడు కేసీఆర్ చావు గురించి అనేక సార్లు మాట్లాడాడు. కేసీఆర్‌పై దాడి చేసేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ చేస్తుంది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుకున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై వేముల వీరేశం దాడి చేస్తానన్నాడు. వీర్లపల్లి శంకర్ అన్నమాట కాదు రేవంత్ రెడ్డి అన్నమాట' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పోలీసులు కేసు పెట్టీ అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 'అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంస్కృతం మాట్లాడుతున్నాడు. శాసనసభలో, బయట సభలో రేవంత్ రెడ్డి ఒకేలా మాట్లాడుతాడు. వెయ్యి డప్పులతో కేసీఆర్ చావు కోరుకుంతమని వారిపై కేసు పెట్టాలి' అని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం సంస్కారమా! అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడికి కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేసేందుకు ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇష్యూను దృష్టి మరల్చి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ తెరపైకి తెచ్చారు. ఈరోజు స్పీకర్‌ను ముందు పెట్టీ దృష్టి మరల్చుతున్నారు' అని తెలిపారు.
'ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఏం అనలేదు. ఒకవేళ అదే జరిగితే తాత మధు విచారం వ్యక్తం చేశాడు. ప్రజల్లో నుంచి వచ్చే తిగుబాటు నుంచి తప్పించుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి నీచబుద్ధిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వివరించారు. తోటి మహిళలను అవమానించేలా సీతక్క మాట్లాడారని మండిపడ్డారు. 'మహిళ ఎమ్మెల్యేలు ఉంటే మగ పోలీసులను ముందు పెడుతున్నారు. పురుష ఎమ్మెల్యేల ముందు ఆడ పోలీసులను పెడుతున్నారు' అని తెలిపారు. 'రాహుల్ గాంధీపై హేమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏకైక సీఎం కేసీఆర్. మహిళలకు జరిగిన అవమానంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి' అని బీఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. 'బీఆర్ఎస్ పార్టీ మహిళ శాసనసభ్యులపై పదే పదే దాడి జరుగుతుంది' అని తెలిపారు.
KCR House: కేసీఆర్‌ను చంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి.. గుండాల, రౌడీల రాజ్యం: జగదీశ్ రెడ్డి
Baddipadaga, Telangana:Congress Goons Attack On KCR House: 'స్వయానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంపై దాడికి పంపాడు. గుండాలు, రౌడీలను పంపిస్తున్నాడు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ గూండా రాజ్యాన్ని నడుపుతోందని విమర్శించారు. 'శాంతిభద్రతలు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఆయనే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తొక్కి పడేయండి అని రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ముట్టడించారు' బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు రెండో రోజు మంగళవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అసలు ఏమి జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి? ప్రజలకి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్‌ను ప్రజలే కాపాడుకుంటారు. వీళ్ల పోలీసుల ఏమి చేయలేరు. కొంతమంది యువకులు కేసీఆర్‌ని కాపాడుకోవాలని కేసీఆర్ నివాసానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు.
'దుర్మార్గంగా పిరికితనంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేము అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు. శాసనసభకు వస్తే అనేక విషయాలు బయటకొస్తాయని రానివ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ నడపటం ఇష్టం లేదు. వారి చేతగానితనం బయటపడుతుంది' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. 'రేవంత్ రెడ్డి స్వయానా కాంగ్రెస్ శ్రేణులను కేసీఆర్ నివాసంపై దాడికి పంపాడు. గుండాలు, రౌడీలను పంపిస్తున్నాడు. శాంతిభద్రతలు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఆయనే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తొక్కి పడేయండి అని రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ముట్టడించారు. ఇక్కడి నుంచే కేసీఆర్ నివాసంపై దాడి చేయడానికి ఆదేశాలు ఇస్తున్నాడు. కేసీఆర్‌ని చంపడానికే వచ్చామని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
పాలన చేతగాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ.. 'మేము మహిళా ఎమ్మెల్యేలం వెనుక ఉన్నాం. సీతక్క అబద్దాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు దగ్గర ఏం జరిగిందో విచారణ చేయండి' అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. పోలీసులు బారికేడ్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కింద పడ్డారని తెలిపారు. మహిళా పోలీసులను దగ్గర పెట్టి ఇబ్బందులు సృష్టించారని చెప్పారు. 'అసెంబ్లీకి వస్తే మాపై దాడులు చేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు లోపలికి పంపలేదు?' అని ప్రశ్నించారు.
'అసెంబ్లీకి వచ్చి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి బూతు పురాణాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నారా?' అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిలదీశారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి అని సవాల్ చేశారు. కేసీఆర్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. 'మాకు ఎమ్మెల్యేలుగా సభలోకి వచ్చే హక్కు ఉంది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?' అని నిలదీశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై కేసు పెట్టి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు.
Wife: విస్తుపోయే ఘటన.. వీడియో కాల్లో మాట్లాడనందుకు భార్య ఆత్మహత్య
Mahabubabad, Telangana:Wife Video Call: విలువైన ప్రాణాలను అతి చిన్న కారణాలతో బలి తీసుకుంటున్నారు. క్షణికావేశానికి లోనయి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈక్రమంలోనే తెలంగాణలో ఒక విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. తన భర్త వీడియో కాల్‌కు సమాధానం ఇవ్వలేదని అలిగిన భార్య క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలు తీసింది. ఎలుకల మందు తిని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ఆమె ప్రాణం దక్కలేదు. ఈ సంఘటన తెలంగాణలో మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండకు గ్రామానికి చెందిన అఖిల (20)కు అదే గ్రామానికి చెందిన బానోత్ హుస్సేన్‌తో వివాహమైంది. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో భర్త హుస్సేన్ పని చేస్తున్నాడు. వారం రోజుల కిందట అఖిల పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2వ తేదీన అఖిల పాప ఏడుస్తుండగా భర్తకు వీడియో కాల్ చేసింది. అయితే విధుల్లో ఉన్న హుస్సేన్ వీడియో కాల్‌కు స్పందించకుండా సమాధానం ఇవ్వలేదు. దీంతో అఖిల తీవ్ర అసంతృప్తికి లోనయ్యింది. అదేరోజు మహబూబాబాద్‌లోని హస్తినాపురం కాలనీలోని తాము నివసిస్తున్న ఇంటికి వెళ్లి అక్కడ ఇంట్లో ఉన్న ఎలుకల మందు తినేసి ఆత్మహత్యాయత్నం చేసింది.
అయితే అఖిల వెంట తల్లి శారద కూడా మహబూబాబాద్‌కు వచ్చింది. పాప రోదిస్తున్నా కూడా పాలు ఇవ్వకుండా అఖిల ఉండడంతో తల్లి మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా పాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి అఖిలను గట్టిగా నిలదీశారు. దీంతో తాను ఇంట్లో ఉన్న ఎలుకల మందును తిన్నానని అఖిల చెప్పింది. వెంటనే అల్లుడు హుస్సేన్‌కు ఫోన్ చేయగా అతడు ఇంటికి వచ్చి అఖిలను మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో నాలుగు రోజుల చికిత్స పొందిన అఖిల పరిస్థితి మరింత విషమంగా మారడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అఖిల మృతి చెందింది. మృతురాలి తల్లి శారద ఫిర్యాదుతో మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షణికావేశంలో తీసుకున్న అఖిల నిండు ప్రాణం పోవడమే కాకుండా పసిపాపకు కన్నతల్లి ప్రేమ దూరమైంది.
Gaddam Prasad: నీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారు.. అసెంబ్లీలో హరీష్ రావుపై స్పీకర్ గరం గరం.. వీడియో ..
Hyderabad, Telangana:Gaddam prasad angry on harish rao: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దాడులు, అంతే కాకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడిన మాటలపై రచ్చ రాజుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ తాత మధును, మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండంచింది.
Speaker Prasad's mother remark sparks Assembly clash
During a heated moment in the Telangana Assembly, Speaker Gaddam Prasad got angry with BRS Deputy Floor Leader Harish Rao and said, “It wasn't your mother he referred to, Harish Rao, it was my mother”.
The Speaker, clearly… pic.twitter.com/ly3M0L1zFO
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 8, 2026
ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభంకాగానే హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పీకర్ దీనిపై తమకు ఆదేశాలు ఇచ్చారని చెప్పాు. ఈ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళా నేతలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అదే సమయంలో తాతా మధు తన తల్లిపై చేసిన వ్యాఖ్యల సంగతేంటనీ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more: పోలీసుల దిగ్బంధనంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు.. కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం..
ముందు దీనికి సమాధానం చెప్పాలన్నారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్, హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక దీనిలో మంత్రి సీతక్క ఎంట్రీ ఇచ్చారు. స్పీకర్ తల్లిని అవమానిస్తే ప్రధాన ప్రతిపక్షం కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం లేదని సిగ్గుచేటని అన్నారు. దీంతో ఈ విషయంపై అసెంబ్లీలో మరోసారి రచ్చ రాజుకుంది.
Yogi Adityanath: తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి, మాజీ మంత్రి రోజా
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple: తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా భక్తుల తాకిడి కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రద్దీ కొనసాగుతుండగా సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకోగా.. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చొల్ల బొజ్జి రెడ్డి దర్శించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందించి యోగి ఆదిత్యనాథ్‌ను సత్కరించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం యోగి ఆదిత్యనాథ్ తిరుమల నుంచి బయలుదేరారు.
స్వర్ణభారతి ట్రస్ట్ వేడుకలకు హాజరు
అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ 25 సంవత్సరాల వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్‌కు చేరుకోగా.. మంత్రి నారాయణ స్వాగతం పలికారు. మంత్రితోపాటు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందజేశారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 87,115 మంది భక్తులు తిరుమల స్వామిని దర్శించుకున్నారు. 35,053 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయి. 4.22 లక్షలు లడ్డూ విక్రయాలు జరగ్గా.. 2.96 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. శిలాతోరణం వరకు వెయిటింగ్ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సుమారు సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
Ganesh Utsav: వినాయక ఉత్సవాలపై తెలంగాణ డీజీపీ కీలక ప్రకటన.. పోలీస్ యంత్రాగానికి దిశానిర్దేశం
Hyderabad, Telangana:Telangana Police: దేశంలోనే అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో జరిగే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించినట్లు.. విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగానికి డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఎస్ఐలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25వ తేదీన గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు.
నిమజ్జనంపై ముందస్తు ప్రణాళిక
గణేష్ నిమజ్జనానికి సంబంధించి మార్గాలు, రహదారులు, వంతెనలను ముందుగానే గుర్తించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని.. భద్రతా చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్లను అవసరమైన చోట వినియోగించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్, తనిఖీల వివరాలను టీజీ-కాప్ ప్లాట్‌ఫాంలోనూ అప్లోడ్ చేయాల న్నారు.
సమన్వయం
గణేశ్ ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ముందుగానే పరిష్కరించాలని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా బ్రీఫింగ్ నిర్వహించాలని..సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు, ప్రజల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో డీజీ టెక్నికల్ సర్వీసెస్ వి.వి. శ్రీనివాసరావు, ఐజీ ఇంటెలిజెన్స్ కార్తికేయ, ఐజీ మల్టిజోన్-1 చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్ ఎస్పీ రూపేష్, ఏఐజీ రమణకుమార్, హైదరాబాద్ డీసీపీ అవినాష్‌కుమార్, డీసీపీ విక్రాంత్‌కుమార్ సింగ్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోలీసులకు ఆదేశాలు
==> గణేశ్ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
==> మండపం ఉన్న ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను నమోదు చేయాలి.
==> ఎస్హెచ్ఓలకు ప్రత్యేక లాగిన్లు ఇవ్వడంతో మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
==> మండపాల ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి భద్రతా ఏర్పాట్ల వివరాలను నమోదు చేయాలి.
==> సీపీలు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి పాయింట్ బుక్స్‌లో పరిశీలన వివరాలు నమోదు చేయాలి.
==> మండపాల వద్ద విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి.. విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలి
==> మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకునేలా చూడడంతోపాటు సీసీ కెమెరాలు, క్యూల నిర్వహణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
KT Rama Rao: మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Press Meet: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఒక్క రూల్, తమకు ఒక రూలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టక మీద మాట్లాడితే మొదటిగా కేసీఆర్ ఖండిచారని గుర్తుచేశారు.
Vijayasai Reddy: విజయసాయి రెడ్డి కీలక ప్రకటన.. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ
Vijayawada, Andhra Pradesh:Vijayawada: 'విజయదశమి' తర్వాతి రోజే పార్టీ వివరాలు ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తమది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు. యువతతో కలిసి పార్టీని స్థాపిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని.. తన శత్రువు కాదని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తానేమీ పార్టీని పెట్టడం లేదని స్పష్టం చేశారు.
విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీపై కీలక విషయాలు వెల్లడించారు. దసరా పండుగ తర్వాత రాజకీయ పార్టీ ప్రకటిస్తానని తెలిపారు. 'ఇంకా నాలుగు ప్రెస్మీట్లు నిర్వహిస్తా. తదుపరి అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో ప్రెస్మీట్లు ఉంటాయి. ప్రెస్మీట్ల అనంతరం కాంక్లేవ్ నిర్వహించి పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటిస్తా' అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.
'నేను ప్రజా సొమ్ము దోచుకుని ఉంటే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి నాపై విచారణ వేయండి.. దేనికైనా నేను సిద్ధం' అని కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి సవాల్ చేశారు. తన ఇమేజ్ ఏమిటో మూడు సంవత్సరాల్లో తెలుస్తుందని చెప్పారు. టీడీపీ, వైఎస్సార్సీపీ తనకు ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కాదని ప్రకటించారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని తెలిపారు. తనది మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు.
'గుంటూరులో జరిగింది కూడా కచ్చితంగా లవ్ జిహాద్. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. నేను ప్రారంభించబోయే పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్ తరహా ట్రీట్మెంట్ ఉంటుంది. నా మీద వచ్చే విమర్శలకు నేను కౌంటర్ ఇచ్చుకోగలను' అని విజయసాయి రెడ్డి తెలిపారు. తన పొలిటికల్ గాడ్ ఫాదర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలేనని చెప్పారు. ప్రతి ప్రభుత్వంలో బలవంతపు, ప్రలోభపు మత మార్పిడిలు ఉంటాయని పేర్కొన్నారు. తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని విజయసాయి రెడ్డి ప్రకటించారు. త్వరలో పాదయాత్ర చేస్తానని.. 660 మండలాల్లో ప్రజల మధ్య పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. అడవుల్లో, రోడ్ల మీద గిన్నీస్ బుక్ రికార్డు కోసం పాదయాత్ర చేయనని పరోక్షంగా వైఎస్ జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో తనకు ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 'మన శంకర వరప్రసాద్' నటి, ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్! లండన్ వీసాల పేరుతో భారీ ఫ్రాడ్!
Hyderabad, Telangana:YouTuber Nandus World Nandana Arrest: 'మన శంకర వరప్రసాద్' సినిమాలో నటించిన నటి రమా నందనను, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో మోసం చేశారని ఆమెపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈమె ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నందన. ఇప్పటికే ఆమెపై కేసు నమోదవ్వడమే కాకుండా, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
'నందుస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్ ద్వారా రమా నందన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కానీ ఆమె తన భర్త మధుకర్‌తో కలిసి యూకేలో ఉద్యోగాల కోసం వీసా స్పాన్సర్షిప్ పేరుతో భారీగా మోసం చేసినట్లు పలువురు మీడియా ముందుకు వచ్చి, ఛానల్ల వద్ద కూడా వాపోయారు. సుమారు 100 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 నుండి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తోటి యూట్యూబర్లు కూడా వీరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ కొత్తూరుకు చెందిన శివ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము మోసపోయామని చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు, అయితే రమా నందన, ఆమె లాయర్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు.
యూకేలో ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నందూస్ వరల్డ్ ఫ్యామిలీ ఫైనల్‌గా స్పందన! ఫుల్ స్టోరీ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ishan Kishan Double Century: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..
Hyderabad, Telangana:Ishan Kishan Double Century News: భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న డొమెస్టిల్ లీగ్ దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఈ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తుండగా.. ప్రత్యర్థి సౌత్ జోన్ టీమ్‌పై మొదటి రోజు అద్భుతంగా రాణించింది. మొదటి రోజు ఆట ముగిసేనాటికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల పటిష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకదాన్ని ప్రదర్శించిన కెప్టెన్ పుణ్యమా అని, ఈ ఆధిక్యం మరింత పెరిగింది.
ఈస్ట్ జోన్ టీమ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మొదటి రోజు క్రీజులోకి వచ్చి, రెండవ రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతను 301 బంతుల్లో 250 పరుగులు చేసి, దులీప్ ట్రోఫీ చరిత్రలో 12వ అత్యధిక పరుగుల ఇన్నింగ్స్‌గా నిలిచాడు. 1987 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున 320 పరుగులు చేసిన రామన్ లంబా ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు.
అయితే ఇప్పుడు 250 పరుగులతో ఇషాన్ కిషన్.. డబ్ల్యూవీ రామన్‌తో కలిసి 12వ స్థానాన్ని పంచుకున్నాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గేర్ మార్చాడు. అలసట కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించాడు.
ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో 34 బౌండరీలు సాధించగా, వాటిలో 27 ఫోర్లు ఉన్నాయి. అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడినప్పటికీ, బ్యాట్‌తో చరిత్ర సృష్టించడంలో విఫలమైనప్పటికీ, అతని జట్టు ఈస్ట్ జోన్‌కు ఇప్పుడు రికార్డుల పుస్తకాలను మార్చే అవకాశం లభించింది.
దులీప్ ట్రోఫీలో అత్యధిక జట్టు స్కోరు 868, దీనిని 1987లో నార్త్ జోన్ నమోదు చేసింది. ఈ వార్త రాసే సమయానికి, ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో 626 పరుగులు చేసింది. ఈ రికార్డుకు దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజ్‌లో లేకుండా.. ఇంతటి టార్గెట్‌ను సాధించడం ఇది సవాలుగా మారవచ్చు.
28 ఏళ్ల కిషన్ పేరిట కేవలం రెండు టెస్ట్ అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. అతని చివరి రెడ్ బాల్ (టెస్టు) మ్యాచ్ జూలై 2023లో వెస్టిండీస్‌తో జరిగింది అతన్ని ఎంపిక చేయని సెలెక్టర్లందరికీ అతని దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రదర్శన ఒక గట్టి సమాధానం కావచ్చు.
Also REad: India Vs Japan: జపాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్..భారత్‌కు ఇన్ని లాభాలా?
Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: 'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం': వేముల ప్రశాంత్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana Bhavan: 'తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న కేటీఆర్‌ను పోలీసులు కింద వేసి పోలీసులు తొక్కింది తెలంగాణ మొత్తం చూసింది. చిల్లర దౌర్జన్యకాండ రేవంత్ రెడ్డి చేశాడు' అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం అని తెలిపారు. 'రేవంత్ రెడ్డి బడువే మాటలు టీ షర్ట్స్పై లేదు. కింద పడేసి తొక్కుతాని రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషలేదు' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.
'రాహుల్, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మోడీ అదానీ టీషర్ట్స్ వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఒక న్యాయం కేటీఆర్, హరీశ్ రావుకు ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 'శాంతియుత మార్గంలో మేము నిరసన తెలిపాం. మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు పోలీసులు నొక్కారు. ఇదేనా ప్రజా పాలన అంటే?' అని నిలదీశారు. సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారని.. తోపులాటలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి సంజయ్ కిందపడ్డారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.
'భౌతికంగా కేటీఆర్‌పై దాడి చేశారు. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. బ్లాక్ టీషర్ట్స్ రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. పచ్చ టీ షర్ట్స్ వేసుకొని వస్తే రేవంత్ రెడ్డికి మంచిదేమో' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నాడని.. రేవంత్ రెడ్డి కంటే శిఖండి నయం విమర్శించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని అవమానించినట్టే కేసీఆర్‌ను అవమానించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి బండారం బయటపడుతుంది' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
'బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వడం లేదు. అసెంబ్లీ బయట రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. రెండు సార్లు నన్ను వాహనంలో ఎత్తేశారు. ఇంతటి గుండాగిరి ఎన్నడు చూడలేదు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తాము కేసీఆర్ సైనికులం.. భయపడేది లేదని ప్రకటించారు. బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే తమను అడ్డుకున్నారని.. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు.
'తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ములాఖాత్ ప్రజలకు అర్థమైంది. మేము బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు. రేవంత్ రెడ్డి పొద్దున కాంగ్రెస్ తో సాయంత్రం బిజెపితో ఉంటాడు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: కమ్యూస్టుల పోరాటం చేస్తే.. కాంగ్రెస్ పరిష్కారం చూపిస్తుంది: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Hyderabad: 'మనమంతా కలసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్త కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. సర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యం చేసుకున్నారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లోని రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటు' అని తెలిపారు. సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని చెప్పారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారని గుర్తుచేశారు.
'భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్సైక్లోపీడియా సారంపల్లి. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడారని.. కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దున్నేవాడికి భూమికోసం కమ్యూనిస్టులు పోరాడారని చెప్పారు.
'అసైన్డ్ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయి. ఇది కమ్యూస్టుల పోరాటానికి .. కాంగ్రెస్ పరిష్కారం. ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చింది. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించింది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా.. కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని చెప్పారు.
'గత ఎన్నికల్లో బూత్‌ల వారీగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. 'ఎన్నికలు వేరు.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరు. ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారు. ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా' అని రేవంత్ రెడ్డి చెప్పారు. 'దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేబినెట్ సహచరులతో చర్చించి.. సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు.
Bigg Boss Telugu 10 Salaries: బిగ్‌బాస్‌లో రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారానికి లక్షల్లో సంపాదన..ఆ ఇద్దరికే ఎక్కువ!
Hyderabad, Telangana:Bigg Boss Telugu 10 Contestants Salaries: బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం.. అక్కడ గెలవడం ఏమో కానీ.. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుందని చాలామంది అంటుంటారు. కేవలం షో నిర్వాహకులు ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ ద్వారా లభించే విపరీతమైన క్రేజ్, పర్సనల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్స్ వ్యూవర్ షిప్ పెరిగి చేతినిండా సంపాదనతో లైఫ్ స్థిరపడుతుందని నమ్ముతారు.
ఇప్పటివరకు ఓటీటీతో కలుపుకుని 11 సీజన్లు (దాదాపు 220 మంది కంటెస్టెంట్స్) పూర్తయినప్పటికీ, విజేతలతో సహా చాలామంది ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారనేది కూడా నిజం. అయినప్పటికీ, ఈ షో ఇచ్చే పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.
కంటెస్టెంట్ల భారీ పారితోషికాలు
ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10లో మొత్తం 16 మంది సభ్యులు అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. వీరి రెమ్యూనరేషన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్‌గా 'జబర్దస్త్' రాంప్రసాద్ నిలిచారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ప్రముఖ యాంకర్ వర్షిణి నిలిచారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న వర్షిణికి వారానికి రూ. 3.5 లక్షలు ఇస్తున్నారు. గత మూడు నాలుగు సీజన్ల నుండి బిగ్ బాస్ టీమ్ సంప్రదిస్తున్నా నో చెప్పిన వర్షిణి, ఈ సారి భారీ ఆఫర్‌తో అంగీకరించింది. 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముఖేష్ గౌడకు కూడా వారానికి రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు అందుతున్నట్లు సమాచారం.
ఇతర సెలబ్రిటీల పారితోషికాలు పరిశీలిస్తే, నటి దేబ్జానీ మోదక్ వారానికి రూ. 2.75 లక్షలు, నటుడు త్రిగుణ్ (ఆదిత్) రూ. 2.75 లక్షలు పొందుతున్నారు. 'జబర్దస్త్' నరేష్, నటి చైత్రా రాయ్‌లు వారానికి రూ.2.5 లక్షల చొప్పున అందుకుంటున్నారు. ఇక 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు, టెంపర్ వంశీలు వారానికి రూ. 2 లక్షల చొప్పున తీసుకోగా, యాంకర్ సుధీర్ రెడ్డికి వారానికి రూ. 1.25 లక్షలు చెల్లిస్తున్నారు.
సామాన్యులకు జాక్‌పాట్ ఆఫర్
ఈ సీజన్లో సామాన్యులకు (కామనర్స్) కూడా మంచి ఆఫర్ దక్కింది. గత సీజన్ 'అగ్నిపరీక్ష' సమయంలో ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి అగ్నిపరీక్షకు హాజరైన 15 మందికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెల్లించారు. అలాగే హౌస్‌లోకి ప్రవేశించిన ఆరుగురు సామాన్యులకు గత సీజన్ తరహాలోనే వారానికి రూ.70,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. సెలబ్రిటీలతో సమానంగా క్రేజ్ పొందేలా ఈ సారి సామాన్యులు కూడా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు.
Also Read: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్ప్రైజ్లతో 16 మంది కంటెస్టెంట్లు!
ALso REad; బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
