భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలను అధికారులు అరికట్టాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, ఆక్రమణదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్మకాలు చేసి నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి కబ్జాలు,అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని లేనిపక్షంలో ఎన్‌సిపి తరఫున కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఒకదానిపై ఒకటి కాటేసుకుంటున్న రెండు కోబ్రాలు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Cobras Bite Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ స్నేక్ రెస్క్యూయర్ మురళీవాలే హౌసలా (Murliwale Hausla) ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకే జాతికి సంబంధించిన రెండు అత్యంత ప్రమాదకరమైన కోబ్రాలు ఒకదానికొకటి దాడి చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు రెండు పాములు ఎందుకు దాడి చేసుకుంటున్నాయి? ఈ వీడియోలో ఉన్న నిజం ఎంత? ఇది ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఈ ఘటనలో రెండు అత్యంత ప్రమాదకరమైన కోబ్రాలు ఎదురుపడి తీవ్ర ఆగ్రహంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు. సాధారణంగా పాములు ఇతర జీవులపై లేదా తమను తాము కాపాడుకోవడానికి దాడి చేయడం లేదా వేటాడడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఇక్కడ ఒక కోబ్రా మరో కోబ్రా శరీర భాగాన్ని నోటితో బలంగా కాటేసి.. ఒకదానికొకటి దాడి చేసుకుంటున్న దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
ఈ వింతను అక్కడున్న స్థానికులతో పాటు పిల్లలు చూసి భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే సమాచారం ప్రకారం.. పాములను పట్టుకుని స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. సాధారణంగా ఒక పాము మరో పాము పై దాడి చేయడం సోషల్ మీడియాలో చూడడం చాలా అరుదు.. అంతేకాకుండా ఇలా పాములు పాములు దాడి చేసుకోవడం ఎప్పుడూ ఎవరు చూసి ఉండరు. అయితే ఈ వీడియోని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. కుటుంబాల్లో లేదా సమాజంలో వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒకరితో ఒక్కరు గొడవ పడతారో.. సరిగ్గా ఇలాంటి విభేదాల కారణంగానే పాముల మధ్య కూడా ఇలాంటి గొడవలు వచ్చి దాడికి దిగుతూ ఉంటాయని స్నేక్ క్యాచర్ తెలుపుతున్నారు. పాములు తమ ఆధిపత్యం కోసం లేదా అవి నివసించే పరిస్థితి కోసం ఇలా దాడి చేసుకోవడం సర్వసాధారణమైన అని ఆయన చెబుతున్నాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Bites Video: కింగ్ కోబ్రాను కెలికిన సింహం.. కంటిపై కాటేయడంతో మృతి.. వీడియో!
Hyderabad, Telangana:King Cobra Attacks Lion Video: అడవికి రారాజైనా.. అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలతో తలపడితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నిరూపించే ఓ అరుదైన ఘటన ఇది.. బలానికి ప్రతిరూపమైన సింహం చేసిన ఒకే ఒక చిన్న తప్పు.. దాని ప్రాణాలను బలి తీసుకుంది.. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాపై దాడి చేయడమే మృగరాజు జీవితంలో అతిపెద్ద తప్పిదం అయిపోయింది.. అవును ఈ వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. మీరు కూడా అంతే అంటారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా అడవిలో ఏ జంతువైన సింహం గర్జనకు భయపడి పరుగులు తీస్తూ పారిపోతూ ఉంటాయి.. అయితే ఎదురుగా ఉన్నది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రా అన్న విషయాన్ని గ్రహించని ఓ సింహం.. ఎలాంటి ఆలోచన చేయకుండా ఒక్కసారిగా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. క్షణాల వ్యవధిలోని కింగ్ కోబ్రా ఎదురు దాడి చేసి సింహం కంటిపై నేరుగా కాటు వేసేసింది..
పాము కాటు వేసిన కొద్దిసేపట్లోనే సింహానికి ఆ ప్రమాదకరమైన నాగుపాము విషం తీవ్రత అర్థం కాలేకపోయినప్పటికీ.. కొద్ది క్షణాల్లోనే కింగ్ కోబ్రాకు సంబంధించిన తీవ్రమైన న్యూరోటాక్సిక్ విషం సింహం శరీరమంతట వేగంగా వ్యాప్తి చెందడం మొదలయ్యింది.. విష తీవ్రత పెరిగే కొద్దీ.. మృగరాజు పరిస్థితి విషమంగా మారింది. ఆ సింహం దిక్కుతోచని పరిస్థితులను నెమ్మదిగా అటు, ఇటు తిరగడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..
విషం నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపడంతో సింహం పిచ్చి దానిలా ప్రవర్తించడం ప్రారంభించింది.. అటు ఇటు పరుగులు పెడుతూ.. ఏ కారణం లేకపోయినా.. గట్టిగా గర్జిస్తూ.. చివరికి ఏమి చెయ్యాలో తెలియక గడ్డిని తినడం కూడా ప్రయత్నించింది.. ఆ తర్వాత నిలబడే శక్తి లేక ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
నేలపై పడిపోయిన సింహానికి శరీరం మొత్తం తీవ్రమైన వణుకుతో పాటు ఫిట్స్ లాంటి ఒక అరుదైన కుదుపు రావడం మీరు గమనించవచ్చు. శ్వాస వేగం సాధారణం కంటే ఎక్కువగా పెరిగిపోయి.. కళ్లు పూర్తిగా తెచ్చుకోలేకుండా పోయాయి.. ప్రత్యేకించి కింగ్ కోబ్రా కాటు వేసిన సింహం కన్ను విషం ప్రభావంతో నీలిరంగులోకి మారిపోవడం మీరు గమనించవచ్చు.. తీవ్రమైన నొప్పితో కొద్దిసేపు విలవిలలాడి.. చివరికి అడివికి రారాజైన సింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. అయితే, ఈ సంఘటన పాతదే అయినప్పటికీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Temper Vamsi Bigg Boss: బిగ్‌బాస్ 10 హంగామా షురూ.. ఈసారి హౌస్‌లోకి ఆ టాలీవుడ్ స్టార్ విలన్? కంటెస్టెంట్ల హాట్ లిస్ట్ ఇదే!
Hyderabad, Telangana:Temper Vamsi Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన పదో సీజన్ తో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచింగ్ ఎంతో వైభవంగా జరగనుంది.
ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (కామన్ పీపుల్) కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా గోల్డెన్ ఛాన్స్ కల్పించారు మేకర్స్. ఇందులో భాగంగానే 'అగ్నిపరీక్ష సీజన్ 2' పేరుతో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
హౌస్‌లోకి 'టెంపర్' విలన్ ఎంట్రీ!
మరోవైపు, ఈ ప్రతిష్టాత్మక సీజన్ కోసం హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఫైనలైజ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కన్ఫర్మ్డ్ జాబితాలో ఒక ఆసక్తికరమైన పేరు ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆయనే టాలీవుడ్ ప్రముఖ స్టార్ విలన్ టెంపర్ వంశీ.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టెంపర్'లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో, కరుడుగట్టిన విలన్‌గా వంశీ రౌద్రం కురిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. వంశీ నటించిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలు.. అత్తారింటికి దారేది, భరత్ అనే నేను, సాహో, భీష్మ, వకీల్ సాబ్, హిట్ 2, దేవర వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. అలాగే వరుణ్ తేజ్ రీసెంట్ సినిమా 'కొరియన్ కనకరాజు'ల్లో నటించాడు.
వెండితెరపై విలన్‌గా హడలెత్తించిన ఈ టాలెంటెడ్ యాక్టర్, నిజ జీవితంలో ఎలా ఉంటాడు? బిగ్‌బాస్ హౌస్ లో తన రియల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు? అనేది ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల క్రేజీ లిస్ట్ ఇదేనా?
ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్టాత్మక బిగ్‌బాస్ 10వ సీజన్లో పాల్గొనబోతున్నారంటూ మరికొంతమంది క్రేజీ సెలబ్రిటీల పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ప్రచారంలో ఉన్న ఆ సెలబ్రిటీల లిస్ట్‌లో ఉన్న వాళ్ల వివరాలు తెలుసుకుందాం.
1) పల్లవి గౌడ
2) తేజస్విని గౌడ
3) జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్
4) బుల్లితెర గ్లామర్ డాల్ వర్ష
5) పవిత్ర
6) గ్లామరస్ యాంకర్ వర్షిణి
7) యూట్యూబ్ సెన్సేషన్ నందూస్ వరల్డ్ నందు
8) యంగ్ హీరో చంద్రహాస్
9) సీనియర్ నటి జ్యోతి
10) రాయల్ ఎంసీ రమణ
11) ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్
ఇలా తమదైన నటన, టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రముఖులలో చివరకు ఎవరెవరు ఈ రంగుల హౌస్‌లోకి అడుగుపెట్టి రచ్చ చేస్తారో చూడాలంటే.. సెప్టెంబర్ మొదటి వారంలో జరగబోయే గ్రాండ్ లాంచ్ వరకు ఆగాల్సిందే!
Also Read: చిన్నప్పటి నుంచి నా హీరో, నా అన్నయ్య చిరంజీవే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Also Read: సామాన్యుడిగా మొదలుపెట్టి వేల కోట్లకు వరకు..మెగాస్టార్ చిరంజీవి సంపద వివరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: వామ్మె..రెండు కింగ్ కోబ్రాల పడగలపై కొడుతూ ఆడుకున్న కోతి.. వీడియో..
Hyderabad, Telangana:Monkey Plays With Cobras Video Watch: సోషల్ మీడియా లో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు, వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో చాలా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కంటికి కనిపించగానే ఎంతో భయం కలిగించే రెండు భారీ విష సర్పాలు, వాటి మధ్య ఒక కోతి ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రదేశంలో ఒక కోతిని గొలుసుతో కట్టించారు.. ఆ కోతికి అతి దగ్గరలోనే రెండు నాగుపాములు పడగవిప్పి వీకరంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు.. సాధారణంగా నాగుపాము ముసలి కొడితే ఎంత జీవి అయినా గజగజ వణుకుతూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గొలుసుతో కట్టి ఉంచిన కోతి ఏమాత్రం భయపడకుండా అదే పాములతో ఉండడం మీరు గమనించవచ్చు..
అయితే కోతికి ముందు భాగంలో ఉన్న నాగుపాము పడగవిప్పి కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. కోతి ఏమాత్రం బెదరకుండా తన చేతులతో పాములకు సంబంధించిన పడగలపై ప్రేమతో దాడి చేసిన దృశ్యాలు కూడా క్లియర్‌గా చూడొచ్చు.. మరోవైపు ఇంకో పాము కూడా పక్కనే చుట్టుకొని ఉండి పడగవిప్పి నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఏ క్షణంలో ఏ పాము కాటు వేస్తుందోనని చూసేవారికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు లైకులతో పాటు కామెంట్లు చేస్తున్నారు. చాలామంది ప్రమాదకరమైన విష సర్పాల మధ్య కూడా ఆ కోతి ఎంతో స్నేహపూర్వకంగా.. ధైర్యంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నానని కామెంట్లు పెడుతున్నారు.. మరి కొంతమంది కోతిని గొలుసుతో కట్టేసి ప్రమాదకరమైన పాముల మధ్య ఇలాంటి విన్యాసాలు చేయించడం అత్యంత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తెలంగాణలో శాతవాహనుల కాలంలో ఇసుక రేణువులతో వెలసిన శివలింగ ఎక్కడ ఉంది?
Hyderabad, Telangana:Kotilingala Siddeshwara Temple History: తెలంగాణ నేలపై వెలసిన పురాతన.. అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండలంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది.. గోదావరి నదితో పాటు పెద్ద వాగు పవిత్ర సంగమ తీరాన కొలువైన ఈ దివ్య క్షేత్రం చాలా ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా బాసిల్లుతూ వస్తోంది. అయితే, ఈ ఆలయం వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటో? పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..
శాతవాహనుల మొదటి రాజధానిగా కోటిలింగాల చరిత్రలో నిలిచిపోయింది.. శాతవాహన మూలపురుషుడు శిముకుడు పాలించిన ఆధారాలతో పాటు పురాతన నాణాలు ఇక్కడి పురావాస్తు శాఖలు తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం లోనే సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మట్టి కోటలతో పాటు ప్రత్యేకమైన బురుజులు ఉండేవట.. కోట ఈశాన్యం భాగంలో ఎత్తైన గడ్డపై శివలింగాన్ని ప్రతిష్టించడంతో.. దీనిని మొదటగా కోటిలింగం అని పిలుచుకునే వారట.. ఆ తర్వాత కారకరమైన కోటిలింగాల అని పిలిచారని చరిత్ర చెబుతోంది..
త్రేతా యుగంలోనే పెద్ద పెద్ద మునులంతా కలసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారట.. కాశీ నుంచి లింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆంజనేయస్వామిని కోరారట.. అయితే ప్రతిష్ట ముహూర్తం సమీపిస్తున్న సమయంలోనే.. మునుగు గోదావరి నది నుంచి ఇసుకను తెచ్చి కోటి ఇసుక రేణువులతో లింగాన్ని ప్రతిష్టించారట.. అందుకే ఇక్కడి స్వామిని కోటేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. అనంతరం కాశీ నుంచి వచ్చిన హనుమంతుడి ఆగ్రహాన్ని తగ్గించేందుకు.. ఆయన తెచ్చిన కాశీ విశ్వేశ్వర లింగాన్ని కూడా సమీపంలోనే ఆ మునులంతా ప్రతిష్టించారట.. భక్తులందరూ మొదటగా హనుమంతుడు తెచ్చిన లింగాన్ని దర్శించుకున్న తర్వాతే ప్రధాన కోటీశ్వరుడిని పూజించడం ఇక్కడి సాంప్రదాయంగా వస్తోందట.. ఆలయంలోని దక్షిణ దిశగా ఉత్తర ముఖంగా సిద్దేశ్వర స్వామి లింగం కూడా ఇక్కడ దర్శనం ఇవ్వడం విశేషం..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
పెద్దవాగుతో పాటు గోదావరి కలిసే పవిత్ర సంగమ ప్రాంతాన్ని మునేరుగా పిలుస్తారు.. ప్రాచీన కాలంలో మునులు ఇక్కడ స్నానాలు చేసేవారట.. ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ఆలయ తీరం వరకు రావడం వల్ల ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.. మహాశివరాత్రి తో పాటు కార్తీక మాసాలు, గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల రద్దీతో ఈ క్షేత్రం కిటకిట లాడిపోతుంది. ఈ క్షేత్రానికి జగిత్యాలతో పాటు కరీంనగర్ మంచిర్యాల ధర్మపురి నుంచి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. ఇది ధర్మపురి నుంచి 19 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 55 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala: తిరుమలలో వృద్ధులు, చిన్నారుల భద్రతపై అలర్ట్.. టీటీడీ కీలక సూచనలు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Police Instructions: తిరుమలకు భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొండ ప్రాంతం కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం వెళ్తుండగా తోపులాట.. గందరగోళం నెలకొంటున్నాయి. త్వరగా దర్శనం కావాలనే తొందరలో కుటుంబంతో వచ్చిన వారిలో కొందరు తప్పిపోతున్నారు. వారిలో వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుమలలో వారి భద్రతపై విజిలెన్స్, పోలీసులు ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. అయితే భక్తులకు కూడా కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు తప్పిపోతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల సూచనలు
చిన్నపిల్లలు, వయోవృద్ధుల జేబులో వారి పేరు, చిరునామా, కుటుంబసభ్యుల ఫోన్ నంబర్ వంటి వివరాలను కాగితంపై రాసి ఉంచాలి. లేదా ఈ వివరాలతో గుర్తింపు కార్డు తయారు చేసి చిన్నారులు, వృద్ధులకు ధరింపజేయాలి. అనుకోకుండా వారు తప్పిపోయిన సందర్భంలో ఈ వివరాల ద్వారా కుటుంబ సభ్యులను సులభంగా గుర్తించి, వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఈ సూచనలను పాటిస్తూ చిన్నపిల్లలు, వయోవృద్ధుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తిరుమల పోలీసులు కోరారు.
ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ యువ నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పటేల్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మతో పాటు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. నిన్న శుక్రవారం శ్రీవారిని 78,057 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 33,406 మంది భక్తులు సమర్పించరాఉ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు రాగా.. లడ్డూ విక్రయాలు 4.62 లక్షలు జరిగాయి. అన్నప్రసాదాలు 2.40 లక్షల భక్తులు స్వీకరించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనంలో భక్తులకు దర్శనం 12 గంటల సమయం పడుతోంది.
Chiranjeevi Net Worth: సామాన్యుడిగా మొదలుపెట్టి వేల కోట్లకు వరకు..మెగాస్టార్ చిరంజీవి సంపద వివరాలు!
Hyderabad, Telangana:Chiranjeevi Assets Net Worth: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనా ప్రతిభ, గ్రేస్ ఫుల్ డాన్సులతో టాలీవుడ్లో 'మెగాస్టార్'గా ఎదిగిన చిరంజీవి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సంపద వివరాలను తెలుసుకుందాం.
సంపద, ఆదాయ వనరులు
వివిధ జాతీయ మీడియా నివేదికల అంచనాల ప్రకారం.. చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ.1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించి, భారత్‌లోనే అత్యధిక పారితోషికం అందుకునే అగ్రశ్రేణి నటుడిగా నిలిచారు.
సినిమాల ద్వారా వచ్చే భారీ రెమ్యునరేషన్‌తో పాటు, వాణిజ్య ప్రకటనలు, పలు వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన సంపద స్థిరంగా వృద్ధి చెందింది.
విలాసవంతమైన నివాసాలు, రియల్ ఎస్టేట్..
మెగాస్టార్ చిరంజీవి ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక, ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక అత్యంత విలాసవంతమైన విల్లా ఉంది. మార్కెట్ నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ.28 కోట్ల పైచిలుకు ఉంటుంది. దీనితో పాటు బెంగళూరు సహా దేశంలోని పలు ప్రధాన నగరాలలో విలువైన స్థిరాస్తులు, ఫాంహౌస్‌లు కలిగి ఉన్నారు.
రాయల్ గ్యారేజ్, లగ్జరీ జీవనశైలి..
మెగాస్టార్ చిరంజీవి కార్ల సేకరణ చాలా ప్రత్యేకమైనది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. అగ్రశ్రేణి కార్లలో ఒకలైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఆయన వద్ద ఉన్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం కూడా ఉంది.
'స్వయంకృషి'తో అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించిన చిరంజీవి జీవితం ఎప్పటికీ ఒక అద్భుతమైన మైలురాయే!
Also Read: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Chiranjeevi: చిన్నప్పటి నుంచి నా హీరో, నా అన్నయ్య చిరంజీవే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Hyderabad, Telangana:Pawan Kalyan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్న హృదయపూర్వక భావాలు పంచుకున్నారు. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా రంగంలో అడుగుపెట్టి హీరో కాకముందు నుంచే అన్నయ్యే తన జీవితానికి ఏకైక హీరో అని పవన్ కల్యాణ్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ తన స్కూలు రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం కూడా ఎంతో గర్వకారణంగా భావించేవారని, అప్పట్లో ఆయన ఇంకా కాలేజీ విద్యార్థి అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనుభూతి చెందేవారని పేర్కొన్నారు. చిన్నతనంలో చిరంజీవి కాలేజీ చదువు కోసం నర్సాపూర్ వెళ్లేవారని, వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం ఒక పెద్ద పండుగలా ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉండేదని, ఆయన తిరిగి వచ్చేంతవరకు ఇల్లంతా కళావిహీనంగా మారిపోయేదని పేర్కొన్నారు.
చిరంజీవి తన పొడవైన ఉంగరాల జుట్టుతో, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతితో, నాన్నగారి బుల్లెట్ బైక్ నడుపుతుంటే ఒక అభిమానిగా చూస్తూ ఆరాధించిన క్షణాలను పవన్ గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో మొదటిసారి సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడు పెద్ద నీలం రంగు బ్యాగులో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, సువాసనల యార్డ్లీ పౌడర్లు తేవడం ద్వారా చిన్న ఇల్లాంటి తమ నివాసంలో సంతోషాన్ని, చిరునవ్వులను నింపిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for… pic.twitter.com/oWMPairQY1
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2026
"అన్నయ్యకు పెళ్లయినప్పుడు తమకు దూరమవుతారేమోనని ఒక గదిలో కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తుంటే, అన్నయ్య తన భార్యను తీసుకువచ్చి "రా, ఈ రోజు నిన్ను ఒక పెద్ద మనిషికి పరిచయం చేస్తాను" అని నవ్వించిన మధుర క్షణాలను నెమరువేసుకున్నారు. ఆ తర్వాత తనను చెన్నై తీసుకువెళ్లి సొంత బిడ్డలా చూసుకున్నార"ని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.
చెన్నై ఉక్కపోతలో రోజుకు 18 గంటల పాటు కఠోరంగా శ్రమించి, నిలబడటానికి కూడా బలం లేక, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇళ్లకు చేరుకునే అన్నయ్య కష్టాన్ని చూసి పవన్ కల్యాణ్ ఎంతో అపరాధభావంతో బాధపడేవారట. అయినప్పటికీ, పవన్ చదువులో వైఫల్యాల గురించి చిరంజీవి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదట.
"తన ఉదారతతో కుటుంబాన్ని, బంధువులను సంతోషపెట్టిన చిరంజీవి.. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచారు. హిందీలో 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండా రాజ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా, పద్మవిభూషణ్ గ్రహీతగా అత్యున్నత స్థాయికి చేరినప్పటికీ చిరంజీవి ఏనాడూ విశ్రమించలేదు. ఇటీవల వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ, ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరిగి కోలుకుని మళ్లీ పనిలోకి వెళ్లడం ఆయన అసాధారణ పట్టుదలకు నిదర్శనం" అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
"నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే చిరంజీవి కూడా ఎప్పటికీ విశ్రమించరని, అందుకే ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిప్రదాత, తన ఏకైక హీరో" అని పవన్ కల్యాణ్ ఎంతో సగర్వంగా ముగించారు. "అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేవలం లాంఛనం కాదు, నాలాంటి ఎంతో మందికి ఒక సున్నితమైన జ్ఞాపిక అని, మనమందరం ఆరాధించే భరతభూమికి ఒక మంచి భవిష్యత్తును నిర్మించడానికి, బలమైన పునాదులు వేయడానికి, అతని జీవితం నాలాంటి లక్షలాది మందిని ఎలా ప్రభావితం చేసిందో గుర్తుచేయడమే ఈ సందర్భం" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలియజేశారు.
Also Read: బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు..షో జడ్జ్‌ల వైఖరిపై నెటిజన్ల ఆగ్రహం
Also REad: హీరో ప్రభాస్‌కు మరో సర్జరీ..సోషల్ మీడియాలో డాక్టర్ ఎమోషనల్ పోస్ట్..ఏం జరిగింది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వ్యక్తిగత వివాదాలతో జానపద రంగాన్ని దిగజార్చవద్దు: శేఖర్ వైరస్ ఫైర్..
Hyderabad, Telangana:Madhuri Rathod Controversy News: తెలంగాణ జానపద కళారంగానికి ఉన్న ఖ్యాతితో పాటు గౌరవాన్ని వ్యక్తిగత వివాదాలతో దిగజార్చ వద్దని.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వేములవాడలో చోటుచేసుకున్న వివాదాస్పద సంఘటనతో ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన వివిధ అంశాల గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది..
ఎన్నో ఏళ్లుగా రాత్రింబగళ్లు కష్టపడుతూ.. చెమటోడ్చి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని కళాకారులు ఉన్నత స్థాయికి చేర్చారని ఆయన ఈ సమయంలో గుర్తు చేశారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పాటు అనవసర వివాదాల వల్ల యావత్ పరిశ్రమకు చెడ్డ పేరు రావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.. అంతేకాకుండా ఎంతో కష్టంతో నిర్మించుకున్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు..
ఇలాంటి అనవసర వివాదాలతో పాటు ఆరోపణల వల్ల ఇండస్ట్రీలో కొత్తగా రావాలనుకునే వారికి ప్రోత్సాహం ఉండకుండా.. ఇప్పటికే ఉన్న కళాకారులు తీవ్ర ఇబ్బందులు గురై.. భయాందోళనలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఎదురవుతాయని ఆయన తెలిపారు. వేములవాడలో జరిగిన వ్యవహారానికి.. మొత్తం జానపద పరిశ్రమకు లంకె పెట్టడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
తెలంగాణ ఫోక్ రంగాన్ని కించపరిచేలా.. తప్పుదోవ పట్టించేలా.. మాట్లాడిన ఈశ్వర్ స్థాయి భార్య శరణ్య వైఖరిపై శేఖర్ వైరస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జానపద రంగాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని.. ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కలను.. కళాకారులను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. పరిశ్రమ సమగ్రతను దెబ్బ తీసే చర్యలను కళాకారులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Madhuri Rathod: ఈశ్వర్ సాయి భార్య శరణ్యపై కేసు పెట్టిన మాధురి రాథోడ్.. ఎందుకో తెలుసా?
Hyderabad, Telangana:Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు..
తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు..
వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. బాధితురాలి లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వేములవాడ పోలీసులు.. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట.. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులతో పాటు ఫోన్ చోరీ వెనక ఉన్న కారణాలు, సైబర్ క్రైమ్ కోణంలో వీడియోల వైరల్‌పై పోలీసులు ముమ్మరమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారట..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala VIPs: తిరుమల శ్రీవారి సేవలో తమిళ స్టార్ నటుడు
Dharmavaram, Andhra Pradesh:Tamil Hero Soori And Music Director Mani Sharma Visits Tirumala Temple Watch Videoరేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఎవరి డబ్బులు ఖర్చు చేశారు? ఎంపీ ధర్మపురి అరవింద్
Nizamabad, Telangana:Revanth Reddy US Tour: అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక కారణాలేమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విదేశీ పర్యటన టికెట్లు బుక్ చేసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ ఎందుకు రాలేదో చెప్పాలని నిలదీారు. క్లియరెన్స్ రాకముందే టికెట్లు బుక్ చేయడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రతినిధి మొత్తం విదేశీ పర్యటన కొనసాగుతుంటే రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటన ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటనకు క్లియరెన్స్ రాకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని.. క్లియరెన్స్ ఎందుకు రాలేదో తెలపాలని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతున్న కారణాలు వాస్తవం కావని ధర్మపురి అరవింద్ కొట్టిపారేశారు. 'రేవంత్ రెడ్డి పాస్‌పోర్టును రెండు వారాల కిందటే సమర్పించారు. కోర్టు పరిధిలో ఉన్న పాస్‌పోర్టు తీసుకుని రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. విదేశీ పర్యటనలో ఫారిన్ హాస్పిటాలిటీ, ఎఫ్సీఆర్ఏ నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భోజనం, హోటల్ బిల్లులు, వాహనాల ఖర్చులు ఎవరూ భరిస్తున్నారో తేలాలని కోరారు. ఆ ఖర్చులు ఏ సంస్థలు భరిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'విదేశీ సంస్థలకు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా? పరిశీలించాలి. ఆక్స్‌ఫర్డ్‌లో రేవంత్ రెడ్డి వెళ్లనున్న సంస్థలు, కార్యక్రమాల వివరాలు నా వద్ద ఉన్నాయి. ఆయా సంస్థలకు జార్జ్ సోరోస్‌తో సంబంధాలపై ఆధారాలతో మాట్లాడా. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి రేవంత్ రెడ్డి హాజరుకావడంలో తప్పులేదు. వివాహానికి వెళ్లాలనుకుంటే ముందే ప్రణాళిక వేసుకుని క్లియరెన్స్ తీసుకోవాల్సింది' అని ధర్మపురి అరవింద్ సూచించారు. క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేయడం సరికాదని విమర్శించారు.
వివాహానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సొంత డబ్బుతో టికెట్ కొనాల్సి ఉందని ధర్మపురి అరవింద్ చెప్పారు. విదేశీ పర్యటనకు ప్రజాధనం ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విదేశీ పర్యటన పేరుతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పసుపు రైతులకు రూ.24 వేల హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'విదేశీ పర్యటనలో భారీ పెట్టుబడులు, విద్యాసంస్థల ఒప్పందాలు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అలాంటి పర్యటనలో రేవంత్ రెడ్డి ఒక్కరికే క్లియరెన్స్ ఎందుకు రాలేదు? ఇది చిన్న సమస్య కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం' అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయాలకు సంబంధించినది కాదని.. జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించినదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వ్యవహారం మొత్తం రాష్ట్రానికే ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.
ఓ ఎంపీ కొడుకు ప్రమాదంపై మాదాపూర్ పోలీసుల కీలక ప్రకటన.. 'అవసరమైతే అరెస్ట్ చేస్తాం'
Hyderabad, Telangana:Inorbit Mall Accident Case Update: హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద అత్యంత వేగంగా స్పోర్ట్స్ కారుతో ఢీకొట్టడంతో ఓ యువతి మరణించగా.. కారు నడిపిన నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అయితే నిందితుడి పేరు.. అతడి తండ్రి పేరు ప్రస్తావించకుండా కేవలం కేసు నంబర్ ప్రస్తావిస్తూ ప్రకటన చేయడం విస్మయానికి గురి చేస్తోంది. మాదాపూర్ పోలీసుల పూర్తి ప్రకటన ఇలా ఉంది.
మాదాపూర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ డీసీపీ రితిరాజ్ ప్రకటించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేవారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని డీసీపీ రితిరాజ్ ప్రకటన చేశారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 1238/2026 కేసులో నిందితుడి అరెస్ట్‌పై వస్తున్న ఆరోపణలకు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టత ఇచ్చారు.
'ఆగస్టు 16వ తేదీన బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశాం. కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మద్యం, డ్రగ్స్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించాం. ఆ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. అనంతరం నిందితుడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించాం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి ఎంవీఐ తనిఖీకి పంపించాం' అని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
ఎంవీఐ నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని డీసీపీ తెలిపారు. సెక్షన్ 106(1) కింద నమోదైన నేరానికి గరిష్ఠంగా ఐదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉండడంతో ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా? లేదా? అనే అంశాన్ని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని డీసీపీ వివరించారు. అరెస్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అర్నేశ్ కుమార్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణనలోకి తీసుకున్నారని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
'ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేసి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించాం' అని డీసీపీ రితిరాజ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారని వస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా డీసీపీ ఖండించారు.
'పోలీసుల నిర్ణయం పూర్తిగా చట్టపరమైన నిబంధనలు, కేసులో అప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే తీసుకున్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎంవీఐ నివేదికతో పాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం' అని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకుండా నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, చట్టపరంగా కూడా నిలబడవని డీసీపీ రితిరాజ్ తేల్చిచెప్పారు.
Konda Surekha: సీఎం రేవంత్ వచ్చాక అన్ని విషయాలు చెప్తా.!. సుష్మిత వివాదంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:konda surekha reacts on her daughter sushmita controversy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొండా ఫ్యామిలీ చుట్టు తిరుగుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూతురు వరంగల్ జిల్లా గీసు కొండలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టిని కలవరపెట్టేదిగా మారాయి. అంతే కాకుండా ఏకంగా సీఎంను సుష్మిత టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన ప్రతిష్టను అభాసుపాలు చేసేలా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సైతం సీరియస్ అయ్యింది. దీనిపై ఇప్పటికే క్రమశికణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ గా కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏంజరుగబోతుందని రచ్చ మొదలైంది. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనను కలిసి అన్ని విషయాలు బైటపెడతానని అన్నారు.
ఇప్పటికే క్రమశికణ కమిటీకి చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మా ఇంట్లో పూజలతో బిజీగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివాదంపై మాట్లాడేందుకు కొండా సురేఖ ఆసక్తిని చూపించలేదు.
Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం..
మరోవైపు కొండా సుష్మిత తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గౌరవమన్నారు. అసలు సీఎం రేవంత్ తన టార్గెట్ అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్ని మరో టర్న్ తీసుకునేలా చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం.. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై కేసు!
Hyderabad, Telangana:Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది..
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..
ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడట.. దీంతో గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం.
పంచాయితీలో తన తప్పును అంగీకరించి.. సారీ చెప్పాల్సింది పోయి.. నిందితుడు తన పరపతిని వినియోగించి.. కేసును తొక్కేసే ప్రయత్నం చేశాడట.. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలికి.. ఆమె భర్తకు బెదిరింపులకు గురిచేసినట్లు కూడా సమాచారం. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు.. కేసు పెట్టకుండా ఉంటే పరిహారంగా అర ఎకరం భూమి రాసిస్తానని గ్రామ పెద్దల ద్వారా రాయబారం నడిపాడట..
అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లంతా నాతో పడుకున్నారంటూ.. శంకర్ రెడ్డి పచ్చి బూతులతో పాటు నోటి దురుసు మాటలు మాట్లాడటం అతని అహంకారానికి.. శాడిజానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గని బాధితురాలు.. ధైర్యంగా ఆత్మకూరు (ఎం) పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

)