ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక కొరత వల్ల తమకు ఉపాధి కరువైందని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భవన నిర్మాణాలకు ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంట చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో అకాల మరణం!
Warangal, Telangana:Narsampet Ex Mla Passes Away: తెలంగాణ ఉద్యమంలో, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తీవ్రమైన హార్ట్ స్ట్రోక్‌కు గురికావడంతో, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు.
ఈ వార్త వినగానే నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నిన్నటివరకు తమ మధ్యే తిరుగుతూ.. ప్రజల సమస్యలపై పోరాడుతూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నాయకుడు.. ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోతారని ఎవరూ ఊహించలేకపోయారు. వార్త తెలిసిన వెంటనే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. నర్సంపేట ప్రజలకు అత్యంత ఆప్తుడు.. కష్టాల్లో తోడుండే కొండంత అండ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో KCR అడుగుజాడల్లో నడుస్తూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుండి నడిపించినవారు.. శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో నర్సంపేట రూపురేఖలను మార్చేందుకు.. సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఆయన అహర్నిశలు కృషి చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే గడిపే నైజం ఆయనది.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
ఆయన అకాల మరణం బిఆర్ఎస్ (BRS) పార్టీకి.. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు పూడ్చలేని లోటు.. ఆయన మృతి పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతి తెలిపారు. తన మాటలతో, కార్యాచరణతో ఎందరో యువకులను రాజకీయాల్లోకి ప్రోత్సహించిన సుదర్శన్ రెడ్డి లేరనే సత్యాన్ని నర్సంపేట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆగస్టు 7న శక్తివంతమైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభం!
Hyderabad, Telangana:Navapanchama Rajayoga Effect On Zodiac: కొన్ని గ్రహాల కదలికలు మానవ జీవితాలపై చూపే ప్రభావం ఎంతో అద్భుతమైనదిగా భావిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహం కదలికలు చేయబోతోంది. గ్రహరాజు అయిన సూర్యుడు, న్యాయదేవుడైన శని భగవానుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన నవపంచమ దృష్టి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి.
రాబోయే ఆగస్టు 7 ఉదయం 8:11 గంటలకు సూర్య-శనులు పరస్పరం 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. ఈ సమయం 4 రాశుల వారి జీవితాల్లో వస్తున్న సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.. ఇన్నాళ్లూ పడ్డ కష్టాలకు, వేదనలకు ప్రతిఫలంగా... అపారమైన ధనయోగం, కొండంత ఆనందం రాబోతున్నాయి..
ఈ రాశులవారికి బంఫర్ లాభాలు..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ రాజయోగం చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందుతుంది.. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.. రాబడి గణనీయంగా పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది.. దాంపత్యం, ప్రేమ బంధాలు మెరుగుపడతాయి..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఇక తిరుగుండదు.. సుదీర్ఘకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఫలాలు అందే అద్భుత ఘట్టంగా భావించవచ్చు.. ఉద్యోగంలో పదోన్నతి.. జీతంలో ఊహించని పెరుగుదల మీ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయి. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అనుబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపవుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి పరిపూర్ణమైన మనశ్శాంతి సమకూరుతుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ యోగం అద్బుతమైన అవకాశాలను అందిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించి సమాజంలో మీ గౌరవం విపరీంతగా పెరుగుతుంది. నిర్ణయాత్మక శక్తి పెరిగి క్లిష్ట పరిస్థితులను సైతం సులభంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో నమ్మకం పెరిగి బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. కళాత్మక, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమికుల జీవితం ఒక అందమైన మలుపు తిరిగి కొత్త వెలుగులు నింపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి వయస్సు 21 ఏళ్లకు తగ్గిస్తాం.. జెన్‌జీ తరానికి తెలంగాణ సీఎం తీపి కబురు
Hyderabad, Telangana:Hyderabad: 'ఈ దేశం జెన్ జీది. దేశ భవిష్యత్తే యువతరం భవిష్యత్తు. దేశం భవిష్యత్తు బాగుంటే యువతరం భవిష్యత్తు బాగుంటుంది. ప్రజాస్వామిక వాదులంతా దిక్కులు పిక్కటిల్లేలా యువతకు మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ నుంచి జెన్‌జీ పార్లమెంటుకు వెళ్లాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు నుంచి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకి తగ్గించారు. 73,74 రాజ్యాంగ సవరణతో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి 21 ఏళ్లకు తగ్గించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతోపాటు నీట్ విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'జెన్ జీ యువత 56 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారు. కానీ ఇది సరిపోదు. నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. పోరాటంలో విద్యార్థులపైన పెట్టిన కేసులను ఎత్తివేయలేదు' అని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 'కేంద్ర ప్రభుత్వం పరీక్షా నిర్వహణలో విఫలం కావడంతో అనేక మంది విద్యార్థుల నష్టపోయారు. భారతదేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫలితం. పోరాటానికి నరేంద్ర మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాడు. ఈ విజయం మీది. రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సాయం కోసం ఈ ర్యాలీ చేపట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. 'ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే వయసు 21 ఏళ్లుగా ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని తెలిపారు. జెన్ జీ యువత విద్యాశాఖ , ఐటీ శాఖల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని… pic.twitter.com/oIudduC9PV
— Telangana CMO (@TelanganaCMO) July 25, 2026
'ప్రపంచానికి జెన్ జీ గళం వినిపించాలి.. ఆ దిశగా మేం పనిచేస్తాం. పార్లమెంటులో ఒక్క శాతంలోపే జెన్ జీ ప్రాతినిధ్యం ఉంది. 30 శాతం ఉన్న జెన్ జీలకు చట్టసభల్లో అవకాశం కల్పించాల్సి ఉంది. 21 ఏళ్ల వయసులో యువతీయువకులు చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలి' అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో అక్రమ కేసులు పెట్టి రాజకీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని యువతరంపై ప్రశంసలు కురిపించారు. ఈ సునామీ ఇంతటితో ఆగోద్దని యువతరానికి సూచించారు.
IMD Rain Alert: దేశంలో భారీ వర్షాల హెచ్చరిక.ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్'..ఐఎండీ సూటిగా వార్నింగ్!
Hyderabad, Telangana:IMD Heavy Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివిధ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత
మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్లో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు, పాటన్ జిల్లాలోని సంతల్పూర్ ప్రాంతంలో గత 24 గంటల్లో ఏకంగా 390 మింటీలటర్ల (390 mm) అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని రాధన్‌పూర్, డియోడార్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఛత్తీస్‌గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాల్లోనూ వర్షాల జోరు కొనసాగనుంది.
వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం-మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (గంగానది పరివాహక ప్రాంతం), హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు (నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర), ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్‌లలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులు, ఉరుములు
అండమాన్-నికోబార్ దీవులతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
భారీ వర్షాలకు అసలు కారణం ఏమిటి?
వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వివరించింది. ప్రస్తుతం నైరుతి రాజస్థాన్‌పై ఓ అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడన వ్యవస్థలను కలుపుతూ మధ్య భారతదేశం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర భారతదేశంపై పశ్చిమ విక్షోభం కూడా చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు జోరందుకున్నాయి.
ఆకస్మిక వరదల ముప్పు!
రాబోయే 24 గంటల్లో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే నేల పూర్తిగా తడిసిపోవడంతో, మరింత వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన అప్రమత్తతతో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also REad: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్షమార్గంలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి
Also Read: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shreyas Iyer: జింబాబ్వేపై భారీ విజయం.. టీ20 ప్రపంచకప్ తర్వాత తొలి సిరీస్ నెగ్గిన భారత్!
Harare, Harare Province:Team India Clinch T20 Series: టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లు కోల్పోయిన భారత జట్టు.. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండింటిలో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు తొలి టీ20 సిరీస్‌ను గెలవడం విశేషం. రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Game set and match ✅
A comprehensive and dominant 9⃣0⃣-run victory for #TeamIndia 🥳👏
With that they clinch the #ZIMvIND T20I series by 2⃣-0⃣ with one game to play 🏆
Scorecard ▶️ https://t.co/Z8UUziVx8d pic.twitter.com/0hfpuJ6aCx
— BCCI (@BCCI) July 25, 2026
CJP Protest Ends: విద్యార్థుల డిమాండ్లకు మోదీ సర్కార్ అంగీకారం..నిరసన విరమించిన సీజేపీ..కేంద్రం కీలక హామీ!
New Delhi, Delhi:CJP Protest Ends Today: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సహా విద్యార్థుల పలు డిమాండ్లను నెరవేర్చేందుకు మోదీ సర్కార్ అంగీకరించింది. దీంతో ఆందోళనలను విరమించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్ణయించింది. ఇదే విషయమై తాజాగా మంత్రులతో సమావేశమైన సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!
New Delhi, Delhi:New Education Minister: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
New Delhi, Delhi:New Education Minister Pralhad Joshi: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ప్రధానమంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీతో పాటు అలాగే నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా ఉన్న జోషికి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు.
64 ఏళ్ల జోషి 2004 నుండి కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 2019-2024 మధ్య కాలంలో బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం, ప్రధానమంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించారు. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు, క్యాబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు" అని ఆ ప్రకటన తెలిపింది.
ప్రధాన్ రాజీనామా తర్వాత జోషి 'X' (ట్విట్టర్) వేదికగా ఇలా స్పందించారు. "శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ దశాబ్దాల పాటు సాగిన అద్భుతమైన రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని జోషి పోస్ట్ చేశారు.
"ఆయన హయాంలో విద్యా రంగంలో 100కు పైగా చిన్న, పెద్ద సంస్కరణలతో పాటు NEP 2020 (జాతీయ విద్యా విధానం) విజయవంతంగా అమలు చేయడం జరిగింది. అన్నింటికంటే దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ శ్రీ ప్రధాన్ తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఏమాత్రం ఆపదు" అని పేర్కొన్న జోషి.. "దేశాభివృద్ధి క్రమంలో మా మార్గాలు మళ్లీ కలుస్తాయి" అని కామెంట్ చేశారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also Read: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
విద్యార్థుల అన్నీ డిమాండ్లకు కేంద్రం ఓకే.. పోరాటం ముగిసిందని కాక్రోచ్ పార్టీ ప్రకటన
New Delhi, Delhi:Jantar Mantar Turn To Silence: నీట్ పేపర్ లీక్ అంశంపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమానికి ముగింపు పలికింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. దీనికితోడు మిగిలిన డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో కాక్రోచ్ పార్టీ తన పోరాటాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read: జెన్‌జీ ఉద్యమంతో దేశం గర్విస్తోంది.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ హ్యాట్సఫ్
క్షేమంగా ఇళ్లకు..
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో తమ నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరిన కాక్రోచ్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
కేంద్ర మంత్రులతో చర్చలు పూర్తి..
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు ముగిశాయి. ఢిల్లీతో సహా దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ కేసుల పేరుతో విద్యార్థులను వేధించమని ప్రకటించింది. విద్యాశాఖలో సంస్కరణలు చేపడతామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ పార్టీ తెలిపింది.
Cockroach Janta Party withdraws its nationwide agitation with immediate effect
All demands of the Cockroach Janta Party have been accepted by the government:
1. Maximum possible compensation for families of NEET paper leak-related suicides
2. All FIRs by Central govt and…
— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
Also Read: Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
అన్నీంటికి కేంద్రం అంగీకారం
విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. నాలుగు రోజుల్లోగా కేసులు ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇక నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిన నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాక్రోచ్ పార్టీ ఆందోళన విరమణతో జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ మెట్రో స్టేషన్‌ను తిరిగి తెరవడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే ఈ మెట్రో స్టేషన్‌ను విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మూసివేశారు.
Rajasthan Doctor Case: డాక్టర్‌కి వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చిన లేడీ నర్సు..మత్తులో రూ.2 కోట్లు కాజేసిన మాయాలేడి!
Degana, Rajasthan:Rajasthan Doctor Extortion Case: సాటి మనిషిని నమ్మలేని ఈ రోజుల్లో, ఓ నర్సు చేసిన హైటెక్ క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని నర్సు బ్లాక్మెయిల్ చేసి, ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేపథ్యం, బ్లాక్మెయిల్ పర్వం
బార్మర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కమల (అలియాస్ కమలేష్) అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రికి చెందిన 65 ఏళ్ల వృద్ధ వైద్యుడిని టార్గెట్ చేసిన ఆమె, ఆయనకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను రహస్యంగా తన ఫోన్లోకి మార్చుకుంది. ఆపై ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అత్యాచారం కేసులో ఇరికిస్తానని, చివరికి ప్రాణాలు తీస్తానని బెదిరింపులకు దిగింది. పరువు పోతుందనే భయంతో ఆ డాక్టర్ ఆమె డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది.
హైటెక్ పంథాలో డిజిటల్ అరెస్ట్!
ఈ దందాను నర్సు కమల అత్యంత వ్యూహాత్మకంగా నడిపించింది. వృద్ధ వైద్యుడిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు, ఆయనకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మాత్రలను బలవంతంగా వేయించినట్లు విచారణలో తేలింది. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ డాక్టర్‌ను ఆమె నిరంతరం పర్యవేక్షించేది.
డాక్టర్ కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఒక చిన్న మొబైల్ ఫోన్, సిమ్ కార్డును ఇచ్చి.. దానిని రోజులో 24 గంటలూ ఆన్‌లోనే ఉంచాలని తీవ్రంగా బెదిరించేది. ఇలా భయభ్రాంతులకు గురిచేసి సదరు వైద్యుడి నుంచి విడతలవారీగా దాదాపు రూ.2 కోట్లను ఆమె కాజేసింది.
పోలీసుల ఎంట్రీ, అరెస్ట్
బాధిత వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి, నిందితురాలు కమలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా నర్సు బ్యాంక్ ఖాతాలు, అక్రమంగా వసూలు చేసిన నగదు, ఆస్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో నర్సు కమల మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. తనపై పోలీసులు మోపిన కేసులన్నీ బూటకమని, ఆ డాక్టర్ ఎలాంటివాడంటే.. వందలాది మంది మహిళా రోగులపై లైంగిక దాడికి పాల్పడిన ఘరానా నేరస్థుడని ఆరోపించింది. అయితే, నర్సు చేస్తున్న ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Pradhan: విద్యార్థులు గెలిచారు.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign To As Union Minister Its Cockroaches Victory Watch Full Videoబాధితుల వ్యక్తిగత ప్రైవసీ రక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad, Telangana:Victims Identity Privacy: లైంగిక దాడికి తీవ్ర మనో వేదనలో ఉన్న బాధితులకు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, డిజిటల్ కంటెంట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లైంగిక దాడికి గురైన బాధితుల వ్యక్తిగత గోప్యత.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలిని ముఖం బహిర్గతం చేస్తూ ఉన్న కంటెంట్‌ను తొలగించాలని పలు సంస్థలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాధితుల డిజిటల్ ప్రైవసీకి విఘాతం కలిగిస్తున్న 200 కంటే ఎక్కువ వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బాధితుల రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తూ జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
లైంగిక దాడికి గురయిన బాధితురాలి తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగుర్బాబు రిట్ పిటిషన్‌ను దాఖలు చేయగా హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బాధితుల గోప్యతకు భంగం కలిగించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమయ్యారని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఫొటోలు, వీడియోలు డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారమవుతుండడంతో బాధితురాలి ఆత్మగౌరవానికి, సమాజంలో జీవించేందుకు తీవ్ర భంగం వాటిల్లుతోందని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం జీవించే హక్కు, ప్రైవసీ హక్కులకు ఇది భంగమని అడ్వకేట్ నాగుర్బాబు వాదనలు వినిపించారు. ఐటీ చట్టం-2000, ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021తో పాటు లైంగిక దాడి బాధితుల గుర్తింపును ఏ సమయంలోనూ బయటపెట్టరాదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. ఈ కంటెంట్ తరచూ ప్రసారం చేస్తుండడంతో బాధితురాలు మానసిక వేదనకు గురవుతున్నారని న్యాయస్థానానికి అడ్వకేట్ నాగుర్బాబు వాదించారు.
పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా సంస్థలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యవసర మధ్యంతర ఉపశమనం కింద రిట్ పిటిషన్ అనుబంధం-ఏలో పేర్కొన్న 200కి పైగా వివాదాస్పద యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. లేదంటే బ్లాక్ చేయాలని చెప్పింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
AP Devotee Tragedy: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్ష మార్గం గుహలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి!
Tiruvannamalai, Tamil Nadu:Arunachalam Devotee Death: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఓ ఇరుకైన గుహలో ఇరుక్కుపోయి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
అసలు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 'ఇడుక్కు పిల్లయ్యార్' ఆలయానికి చేరుకున్నారు. తెలుగు భక్తులు దీనిని సాధారణంగా 'మోక్ష మార్గం' అని పిలుస్తారు.
ఈ గుహ ఆకారంలో ఉండే ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి ప్రవేశించి, అత్యంత ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం గుండా బయటకు రావాలి. మణికుమార్ శరీరాకృతి కాస్త లావుగా ఉండటంతో ఆయన గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, తోటి భక్తులు ఆయనను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు.
గాలి ఆడక ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ అకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
'ఇడుక్కు పిల్లయ్యార్' ప్రత్యేకత ఏమిటి?
గిరిప్రదక్షిణ మార్గంలో వెలసిన ఈ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ఒక చిన్న గుహలా ఉంటుంది. భక్తులు ఇరుకైన మార్గంలో పాకుతూ వెళ్లి బయటకు రావడం ఆచారంగా భావిస్తారు. బయటకు వచ్చిన తర్వాత నందిని, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ భక్తి ఆచారమే ఇపుడు ఒక ప్రాణాన్ని బలిగొనడంతో స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
Also REad: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా అప్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎలా ఉంటారు?
Hyderabad, Telangana:Shravana Masam: పవిత్రమైన శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివారాధనకు అత్యంత అనుకూలమైన ఈ మాసంలో జన్మించే పిల్లలపై పరమశివుని ప్రత్యేక అనుగ్రహంతో పాటు ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నారు. స్కంద పురాణంలోని మహేశ్వర ఖండం, కేదార ఖండంతో పాటు శ్రావణ మాహాత్మ్యం అధ్యాయాలలో శ్రావణ మాసంలో జన్మించిన పిల్లల లక్షణాలు, వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దృఢ సంకల్పంతో పాటు పట్టుదల..
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎంతో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఒక పనిని సాధించాలని మనస్సులో అనుకుంటే.. దానిని పూర్తి చేసే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఈ బలమైన పట్టుదలే కొన్నిసార్లు ఇతరులకు మొండితనంగా కనిపించినప్పటికీ.. వారి లక్ష్య సాధనకు ఇదే ప్రధాన కారణమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
శాంత స్వభావం..
శివుని శక్తితో ఉండే ఈ పిల్లలు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే, లోపల మాత్రం ఎంతో గంభీరమైన ఆలోచనాలను కలిగి ఉంటారని గ్రంథాలు చెబుతున్నాయి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వీరు ముందుంటారు. మాట తప్పని నిబద్ధత వీరి నైజం..
ఊహించని ఆత్మవిశ్వాసం..
ఈ మాసంలో పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి గందరగోళానికి గురికాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన సవాళ్లు ఎదురైనా బెదిరిపోకుండా ఎదుర్కొనే ధైర్యం వీరి సొంతం..
బంధాలకు ప్రాధాన్యత..
భౌతిక సుఖసంతోషాలు, విలాసాల కంటే మానవ సంబంధాలకు, ఆత్మీయతకే వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు ఇతరులు వీరి ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IShowSpeed రికార్డును తుడిచిపెట్టేసిన PM Modi.. 24 గంటల్లో 303 మిలియన్ల వ్యూస్!
Hyderabad, Telangana:PM Modi Breaks IShowSpeed Records: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం.. ప్రధాని స్వయంగా స్పందించడంతో ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాను ఊపేసింది. ఊహించని రీతిలో, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియో 303 మిలియన్ల (30.3 కోట్లు)కి పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించింది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ రికార్డు క్రాష్..
ఇటీవల ముగిసిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) సమయంలో ప్రపంచ ప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్, ప్రముఖ యూట్యూబర్ IShowSpeed (స్పీడ్) పేరిట ఉన్న 300 మిలియన్ల వ్యూస్ రికార్డును ప్రధాని మోదీ వీడియో తుడిచిపెట్టేసింది. ప్రపంచంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదా ఏ ఇతర కంటెంట్ క్రియేటర్‌కు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ రాకపోవడం విశేషం..
ఒక్క రాత్రిలోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు..
ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లు కూడా పెరిగారు. కేవలం ఒక్క రాత్రి వ్యవధిలోనే ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 10 లక్షల (1 Million) మంది కొత్త ఫాలోవర్లు చేరారు. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా ఉన్న మోదీ.. ఈ కొత్త మైలురాయితో డిజిటల్ ప్రపంచంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన అంతర్జాతీయ స్టార్లకు మాత్రమే సోషల్ మీడియాలో ఈ స్థాయి వ్యూస్.. ఫాలోయింగ్ లభిస్తుంటాయి. అయితే, ఒక దేశ ప్రధాని పరిపాలనాపరమైన, విద్యార్థులకు కీలకమైన సమస్యపై పోస్ట్ చేసిన వీడియో గ్లోబల్ డిజిటల్ రికార్డులను తిరగరాయడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
