icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Amazon Sale: రూ.20 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు!

Hyderabad, Telangana:

Best Smartphones Under Rs 20k: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) ఘనంగా మొదలైంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌ బంపర్ డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.20,000 లోపు బడ్జెట్‌లో సరికొత్త ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ వివరాలు..
ఈ ప్రైమ్ డే సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు ఎస్‌బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగించి పేమెంట్‌ చేసేవారికి 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.. అంతేకాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగించే వారికి 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ పే లేటర్ (Amazon Pay Later)ను వినియోగించి పేమెంట్ చేసేవారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

ఇప్పుడు రూ.20 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్‌ఫోన్స్‌ వివరాలు..
ఐకూ Z10 లైట్ 5G (iQOO Z10 Lite 5G)
గేమింగ్‌తో పాటు పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా భావించే ఐకూకి సంబంధించిన Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ రూ. 14,999 ధరకే అందుబాటులో ఉంది.. దీనిపై రూ.509 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లభిస్తుండటంతో నెట్ ప్రైస్ కేవలం రూ.14,490కే అవుతుంది..     అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.14,249 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు..

సాంసంగ్‌ గెలాక్సీ M36 5G (Samsung Galaxy M36 5G)
ఈ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన 6GBర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,999 ధరతో లభిస్తోంది.. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పేమెంట్ చేస్తే.. రూ.569 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీనితో ఈ ఫోన్ ధర రూ.18,430కి తగ్గుతుంది. ఇక పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌ చేస్తే.. రూ. 17,900 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. 

రియల్‌మి నార్జో 90x 5G (Realme Narzo 90x 5G)
బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం రియల్‌మి నార్జో 90x 5G మోడల్ చాలా బెస్ట్.. మార్కెట్‌లో ఇది రూ.16,998కే అందుబాటులో ఉంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.509 క్యాష్‌బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. దీంతో ధర రూ.16,489కే పొందవచ్చు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 16,100 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.

రెడ్‌మి 15 5G (Redmi 15 5G)
రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ 6G ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి వేరియంట్‌ ధర రూ.20,498తో అందుబాటులో ఉంది.. అయితే, సేల్ సందర్భంగా లభిస్తున్న ప్రత్యేక కూపన్ ఆఫర్ వినియోగదారులు రూ.1,000 వరకు స్పెషల్ తగ్గింపు పొందవచ్చు.. దీనితో ఈ ఫోన్‌ను రూ.19,498కే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ కార్డ్ ద్వారా అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

లావా బోల్డ్ N2 5G (Lava Bold N2 5G)
దేశీ బ్రాండ్ అయిన లావా నుంచి వచ్చిన బోల్డ్ N2 5G స్మార్ట్‌ఫోన్ రూ. 11,999కే  లభిస్తోంది. దీనిపై రూ.359 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.11,640కే పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ చేస్తే దాదాపు గరిష్టంగా రూ.11,300 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

8100mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాతో Vivo Y500 లాంచ్.. ధర ఎంతంటే?

PPINEWZ1h ago
Hyderabad, Telangana:

Vivo Y500 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన Y సిరీస్‌లో భాగంగా వివో Y500 (Vivo Y500) మోడల్‌ను పాకిస్తాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. ప్రీమియం ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది.. ముఖ్యంగా ఇందులో 8100mAh భారీ బ్యాటరీతో విడుదల కావడం విశేషం..

కళ్లు చెదిరే డిస్‌ప్లే, అల్ట్రా స్లిమ్ డిజైన్..
ఈ వివో Y500 స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 8.19 mm మందంతో ఎంతో స్లిమ్‌గా.. పట్టుకోవడానికి వీలుగా ఉండడం విశేషం.. ఇందులో 6.83 అంగుళాల 1.5K ఐకేర్ (Eyecare) అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది..

8100mAh బ్లూవోల్ట్ బ్యాటరీ.. 
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్‌గా భావించవ్చు.. వివో ఇందులో 8100mAh గల బ్లూవోల్ట్ (BlueVolt) బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. అంతేకాకుండా బైపాస్ ఛార్జింగ్ (Bypass Charging) ఫీచర్ ఉండడం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా నేరుగా మదర్‌బోర్డుకు పవర్ అందుతుందని కంపెనీ తెలిపింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ ఫోన్‌ను పవర్‌బ్యాంక్‌లా వాడుతూ ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

50MP సోనీ కెమెరా.. 
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వివో Y500 (Vivo Y500) వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ (MP) సోనీ మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు.. ఈ ఫోన్‌కు IP68తో పాటు IP69 రేటింగ్స్ సపోర్ట్‌లను కలిగి ఉంటుంది.. దీని వల్ల దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. 

పవర్‌ఫుల్ ప్రాసెసర్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్..
ఈ స్మార్ట్‌ఫోన్ 6nm ఆర్కిటెక్చర్‌పై పనిచేసే Unisoc T7300 అక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది..

ధరల వివరాలు..
వివో Y500 స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు అద్భుతమైన కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఇది పాకిస్తాన్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీని ధర 8GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్  ధరరూ. 99,999 PKRతో, రెండవ వేరియంట్ 8GB రామ్ + 256GB స్టోరేజ్‌తో ధర 109,999 PKRతో అందుబాటులో ఉంది. ఇది భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేతో పాటు అండర్ వాటర్ కెమెరా ఫీచర్లను కోరుకునే వారికి ఈ సరికొత్త వివో Y500 ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

భూమిపై మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్..సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే ప్రాంతం.. అక్కడి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

BBhoomi2h ago
Secunderabad, Telangana:

Mount Chimborazo: భూమిపై సూర్యునికి, అంతరిక్షానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రదేశం ఏదో మీకు తెలుసా? అందరికి మొదట గుర్తుకు వచ్చేది ఎవరెస్ట్ శిఖరం. కానీ మీరు పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఎవరెస్టు కంటే ఆకాశాన్ని దగ్గరగా చూసే ప్రాంతం ఒకటి ఉంది. భౌగోళిక, శాస్త్రీయ ద్రుక్కోణం నుంచి చూస్తే భూమిపై అంతరిక్షంలోకి అత్యంత దూరంగా విస్తరించిన ఉన్న ప్రదేశం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ లో ఉన్న చింబోరాజో పర్వతం. 

ఎవరెస్ట్ సముద్ర మట్టానికి కంటే అత్యంత ఎత్తైన ప్రదేశంఇ ఇది..  కానీ మన భూమి భూమధ్యరేఖకు సమీపంలో మధ్యలో కొద్దిగా ఉబ్బి ఉంటుంది. ఈ ఉబ్బుపై ఉన్న చింబొరాజో శిఖరం, భూమి కేంద్రం నుండి కొలిచినప్పుడు అంతరిక్షానికి అత్యంత సమీపంగా ఉంటుంది. చల్లని.. గాలిలేని ఈ పర్వత వాలులపై ఒక యావత్ ప్రపంచం కొలువై ఉంది.

చింబొరాజో శిఖరం :
చింబొరాజో శిఖరం సముద్ర మట్టానికి 6,268 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పర్వతానికి దూరంగా లేనప్పటికీ, ప్రమాదకరమైన హిమానీనదాలకు కూడా దూరంగా లేదు. కానీ దాని దిగువన, 3,500 నుండి 4,200 మీటర్ల ఎత్తులో, విశాలమైన గడ్డి మైదానాలు ఉన్నాయి. ఈ చల్లని ప్రాంతం, క్వెచువా.. పురుహా ఆదివాసీ వర్గాలకు చెందిన కొన్ని వేల మంది ప్రజలు నివసించే చిన్న గ్రామాలకు నిలయం. శతాబ్దాల క్రితం వీరి పూర్వీకులు ఈ కఠినమైన పర్వతాన్ని తమ నివాసంగా ఎంచుకున్నారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ వీరు  కొనసాగిస్తున్నారు.

 ప్రకృతి తమకు అందించిన ప్రసాదం:
ఒకవేళ మనం అంత ఎత్తుకు వెళితే.. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవల్స్ జీరోకి చేరుతాయి. అలాంటి వాతావరణంలోకి వెళ్తే మన తలలు పగిలిపోతాయి. కళ్లు గిర్రున తిరుగతాయి. అక్కడ నివసించే ప్రజలకు ఇదంతా సర్వసాధారణం. అక్కడ నివసించే ప్రజలు మాత్రం  ప్రకృతి తమకు అందించిన ప్రసాదం అని చెబుతారు. తరతరాలుగా ఇక్కడ నివసించడం వల్ల, వారి శరీరాలు ఈ తక్కువ ఆక్సిజన్ వాతావరణానికి అలవాటుపడ్డాయి. ఇక్కడ రాత్రులు అత్యంత చల్లగా.. ఉష్ణోగ్రత తరచుగా సున్నా కంటే తక్కువకు పడిపోతుంది. చల్లని, వణుకు పుట్టించే గాలులు నిరంతరం వీస్తూ ఉంటాయి.

రాత్రిపూట నిప్పు కొలిమిలా వేడి:
ఈ గాలులు, చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి, ప్రజలు చోజాలు అని పిలిచే మందపాటి మట్టి గోడల ఇళ్లను నిర్మించుకుంటారు. ఈ ఇళ్ల పైకప్పులపై ఎండిన గడ్డిని మందంగా పరుస్తారు. ఇది పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రిపూట కొలిమిలా వేడిగా ఉంటుంది. ప్రజలు వేడి మూలికా టీలతో పాటు, బంగాళా దుంపలు, జున్ను, అవకాడోలతో చేసిన సూప్‌లను కూడా తాగుతారు. వారి ఆహారంలో మాంసం ఒక ముఖ్యమైన భాగం. వారి జీవనోపాధి వ్యవసాయం కంటే పశుపోషణపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

అత్యంత నమ్మకమైన తోడు లామాలు:
ఈ ప్రాంతం లామాలు, అల్పాకాలు,  విక్యూనాల వంటి ఉన్నిని ఇచ్చే జంతువులకు నిలయం. వాటి ఉన్నిని సాంప్రదాయ మందపాటి దుస్తులు, పొంచోలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి వారిని గడ్డకట్టే చలి నుండి కాపాడతాయి. పురుషుల సాంప్రదాయ దుస్తులను పొంచో అంటారు. మహిళలు పొడవాటి ఉన్ని స్కర్టులు..  శాలువాలు ధరిస్తారు. వారి దుస్తువులు ఎక్కువగా ఎరుపు, నీలం,  ఆకుపచ్చ రంగులు బూడిదరంగులో మంచుతో నిండిన ప్రకృతి దృశ్యంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. నిటారుగా ఉండే వాలు ప్రదేశాలలో వస్తువులను మోసుకెళ్లడానికి లామాలు వారికి అత్యంత నమ్మకమైన తోడుగా ఉంటాయి. 

Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!

చింబొరాజో ఆశీర్వాదం తీసుకున్నాకే పనులు షురూ:
చింబొరాజో ప్రజలు ఈ పర్వతాన్ని కేవలం రాళ్ళు, మంచుతో కూడినదిగా మాత్రమే భావించరు. అది తమ రక్షకుడని నమ్ముతూ, దానిని  తండ్రి చింబొరాజో  అని పిలుస్తారు. పర్వతం ఆగ్రహం వలనే తుఫానులు వస్తాయని వారు నమ్ముతారు.అందుకే వ్యవసాయం లేదా మరేదైనా శుభకార్యం చేసే ముందు ఆ పర్వతానికి ప్రత్యేక పూజలు నిర్వహించి  ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే పనులు మొదలు పెట్టడం అక్కడి ప్రజల నమ్మకం. 

హీలెరోస్..పోరాటం,  దృఢ సంకల్పం కథ:

ఈ పర్వతంతో ముడిపడి ఉన్న  పురాతనమైన.. విశిష్టమైన సంప్రదాయం ఉంది. అదే  హీలెరోస్. హీలెరోస్ అంటే  మంచును సేకరించేవారు. శతాబ్దాలుగా, ఇక్కడి ప్రజలు పర్వతం మీదున్న ప్రమాదకరమైన హిమానీనదాల వద్దకు ప్రయాణించి.. పెద్ద పెద్ద మంచు దిమ్మలను కోసి, వాటిని గడ్డిలో చుట్టి, కింద ఉన్న పట్టణాలలో అమ్మేవారు. ఆధునిక యుగంలో ఈ సంప్రదాయం చాలా వరకు కనుమరుగైంది. కానీ మంచుతో ఆ పర్వత ప్రాంత ప్రజలకున్న సంబంధం వారి పోరాటం,  దృఢ సంకల్పం కథను చెబుతుంది.

ప్రపంచపు పైకప్పు మారుతోంది:
నేడు సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి మార్పు గాలులు వీచాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా చింబొరాజోలోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇది భవిష్యత్తులో ఈ నివాస ప్రాంతాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని కలిగించవచ్చు. మెరుగైన భవిష్యత్తు కోసం చాలా మంది యువకులు నగరాలకు వలస వెళ్తున్నారు. మరోవైపు, పర్వతంపైనే ఉండిపోయిన వారు సామూహిక పర్యాటకాన్ని స్వీకరించారు. వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెక్కర్లు, పర్వతారోహకులకు గైడ్‌లుగా పనిచేస్తున్నారు. మహిళలు తాము చేతితో అల్లిన ఉన్ని దుస్తులను పర్యాటకులకు అమ్మి జీవనోపాధి పొందుతున్నారు.

సౌకర్యాలు ఎంత పరిమితంగా ఉన్నా..ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా.. దృఢ సంకల్పం ఉంటే సూర్యుని అత్యంత కఠినమైన వైఖరిని కూడా తమ పొరుగువాడిగా మార్చుకోవచ్చని చింబొరాజోలోని ఈ నివాసులు మనకు నేర్పుతున్నారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ  సూర్యునికి అత్యంత సమీప పొరుగువాడు  అని పిలిచే గౌరవం అంత ఈజీగా లభించదు కదా. 

 

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

https:

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు

Kuppam, Andhra Pradesh:

Chandrababu Chit Chat: 'రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గానికి రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కనెక్టివిటీ పెంచుతున్నాం. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని  ఇలాగే తీర్చిదిద్దుతాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన.. ప్రతిపక్షాల విమర్శలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చిట్‌చాట్‌లో స్పందించారు. 'అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలూ ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో క్వాంటమ్‌, సెమీ కండక్టర్ల విభాగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి' అని వెల్లడించారు. 'ఇంధన రంగంలోనూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాలు అందుబాటులోకి తెస్తాం. ఏపీలో ప్రముఖ స్టీల్ పరిశ్రమలు ఆర్సెలార్ మిట్టల్, జేఎస్ డబ్ల్యూ కంపెనీలు తమ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయి' అని వివరించారు.

'రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. సంక్షేమం, అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కొందరు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారు. ఒక వ్యక్తి లబ్దికోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యింది' అని వైఎస్‌ జగన్‌ పాలనపై చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు.

ఓబుళాపురంతో పాటు ఆన్ రాక్ కూడా ఈ తరహాలోనే ఇబ్బందుల్లో పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. కంపెనీలను తరిమేయడం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయటమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పని అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతీ ప్రాజెక్టునూ తామే తెచ్చామని చెప్పుకుంటారని చెప్పారు. వాస్తవం లేకపోయినా అదే పనిగా అసత్యాలు చెబితే ఎవరేం చేయగలమని పేర్కొన్నారు.

'గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చింది. ఇప్పుడు కేంద్రం కూడా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించింది' అని చిట్‌చాట్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమల ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిని వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌పై మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నాపై, పవన్ కల్యాణ్‌పైన విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు ఫండింగ్ ఇస్తున్నారు. హింస, బూతులనే గొడ్డలి పార్టీ నమ్ముకుంది. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని ప్రొత్సహిస్తోంది' అని వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం వరకూ నీరు తెచ్చామని.. త్వరలో గాలేరు నగరిని కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

0
0
Report

OnePlus ఆఫర్ల జాతర.. రూ.18,000 తక్కువకే వన్‌ప్లస్ 13, 15R మోడల్స్‌..

Hyderabad, Telangana:

OnePlus Amazon Prime Day Sale: మీరు కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన అవకాశం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale)లో ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్‌ఫోన్‌లపై దిమ్మతిరిగే ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు అదనంగా భారీ బ్యాంక్‌ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్స్ అయిన వన్‌ప్లస్ 15R, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13sతో పాటు నార్డ్ CE 6 వంటి ఫోన్‌లపై కంపెనీ ఏకంగా రూ.18,000 వరకు తగ్గింపు లభిస్తోంది.

ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన కార్డులను (SBI, Axis Bank) వినియోగించి ఈఎంఐ (EMI) లేదా ఫుల్ పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే.. 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.. వీటితో పాటు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం విశేషం. అంతేకాకుండా కొన్ని మోడల్స్‌పై దిమ్మతిరిగే ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

వన్‌ప్లస్ 15R (OnePlus 15R)పై భారీ బంపర్ ఆఫర్‌..
OnePlus కంపెనీకి చెందిన ప్రీమియం మోడల్  వన్‌ప్లస్ 15R అసలు ధర (MRP) రూ.68,999 కాగా.. ఈ అమెజాన్ సేల్‌లో ఏకంగా రూ.58,999కే అందుబాటులో ఉండడం విశేషం.. దీనికి తోడు బ్యాంక్ కార్డు ఆఫర్స్‌తో పాటు EMI ట్రాన్సాక్షన్‌పై అదనంగా రూ.3,300 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే మొత్తంగా ఈ ఫోన్‌పై దాదాపు రూ.13,000 వరకు ఆదా అవుతుంది. ఇది 16GB ర్యామ్‌తో పాటు గరిష్టంగా 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఏకంగా 7,400mAh భారీ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది..

వన్‌ప్లస్ 13 పై రూ.18,000 డిస్కౌంట్..
ఈ సేల్‌లో అత్యధిక తగ్గింపు లభిస్తున్న ఫోన్ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌.. దీని అసలు MRP ధర రూ.72,999 కాగా.. అమెజాన్ సేల్‌లో కేవలం రూ.54,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేస్తే.. మరో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను MRP కంటే రూ.18,000 తక్కువ ధరకే పొందవచ్చు. 

రూ.50 వేల లోపు ధరలో వన్‌ప్లస్ 13s..
రూ.57,999 MRP కలిగిన  వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో రూ.49,999 ధరకే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో EMIలో కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్‌లో 12GB ర్యామ్, 5,850mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ నార్డ్ CE 6..
మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేందుకు వన్‌ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ 22 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.40,999 MRP ధరతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను సేల్‌లో కేవలం రూ.31,998కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 8,000mAh బ్యాటరీతో లభిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

iPhone Air 2 లీక్స్.. 5.6mm అల్ట్రా స్లిమ్ డిజైన్, A20 ప్రో చిప్‌సెట్‌తో అరాచకం!

Hyderabad, Telangana:

iPhone Air 2 Leaks News Telugu: యాపిల్ సంస్థకు చెందిన ప్రతి ఫోన్‌పై ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా కంపెనీ తీసుకురాబోయే సరికొత్త స్లిమ్ మోడల్స్ గురించి ఎప్పుడు విపరీతమైన చర్చలు సోషల్ మీడియాలో సాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో, రాబోయే ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎయిర్ 2 (iPhone Air 2)కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు, డిజైన్ రెండర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మునుపటి మోడల్ కంటే ఎంతో ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్లతో ఇది అందుబాటులోకి రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యావెండర్ కలర్‌లో ఐఫోన్..
ప్రముఖ యూట్యూబర్ జాన్ ప్రోసెర్ (John Prosser) లీక్‌ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఐఫోన్ ఎయిర్ 2 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఈసారి యాపిల్ ఒక ప్రత్యేకమైన రంగును పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది స్పేస్ బ్లాక్ (Space Black), క్లౌడ్ వైట్ (Cloud White), లైట్ గోల్డ్ (Light Gold) రంగులతో పాటు సరికొత్తగా  లావెండర్ (Lavender) కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లీక్ అయిన్నట్లు తెలస్తోంది. ఈ కొత్త కలర్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్..
కెమెరా విభాగంలో యాపిల్ ఈసారి పెద్ద మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఇందులో కంపెనీ రెండు కెమెరాలను అందించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా.. దీనికి తోడుగా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను సెకండరీ కెమెరాగా ఇచ్చే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. దీనివల్ల ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు సంచారం.

అల్ట్రా స్లిమ్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్..
ఐఫోన్ ఎయిర్ 2 కేవలం డిజైన్ పరంగానే కాకుండా బిల్డ్ క్వాలిటీ పరంగానూ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం 5.6 మిమీ (mm) మందంతో అత్యంత స్లిమ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని బాడీని టైటానియం అలాయ్‌తో తయారు చేసే అవకాశం ఉంది. ఈ స్లిమ్ ఫోన్‌లో మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం యాపిల్ తన సరికొత్త A20 ప్రో (A20 Pro) చిప్‌సెట్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నాయి.

డైనమిక్ ఐలాండ్, ఫేస్ ఐడీ..
డిస్‌ప్లే పరంగా చూస్తే.. ఈ ఫోన్ బెజెల్స్ మునుపటి కంటే చాలా సన్నగా (Thin Bezels) ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ (Face ID) ఫీచర్‌తో రాబోతున్న ఈ ఫోన్‌లో స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ (Dynamic Island) పరిమాణాన్ని ఈసారి మరింత తగ్గించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రత్యేకంగా స్లిమ్ మోడల్స్‌ను మెయిన్ సిరీస్‌లోనే అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఈ ఐఫోన్ ఎయిర్ 2 మోడల్ 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కంపెనీ ఐఫోన్ 18ఇ (iPhone 18e)ని కూడా మార్కెట్లోకి తీసుకురావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. సీఎం చంద్రబాబు హై అలర్ట్‌

Visakhapatnam, Andhra Pradesh:

Navy Officers: చేపల కోసం వేటకు వెళ్లిన మత్య్సకారులు దురదృష్టవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతై 24 గంటలు దాటినా ఇంకా వారి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తమైంది. మత్య్సకారుల ఆచూకీ కోసం స్థానిక అధికార యంత్రాంగంతోపాటు నౌకాయాన అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 1వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్య్సకారులతో IND-AP-MM-V5-83 బోటు వేట కోసం వెళ్లింది. ఆ సమయంలో బోటులో మొత్తం 7 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మత్స్యకారులు సాయంత్రం వరకు వస్తాయని చెప్పారు. అయితే తుఫాన్ కారణంగా మరో గంటలో  విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పిన వారు తర్వాత ఆచూకీ కనిపించలేదు. సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్‌కు చేరుకోలేదు. బోటులోని మత్స్యకారుల వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్‌ అయ్యాయి. వారితో ఎలాంటి సంబంధం లేకపోవడం కుటుంబసభ్యుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది. 

గల్లంతైన వారు వీరే..
గల్లంతైన వారి  కుటుంబసభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం గ్రామానికి చెందిన వారు. మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగమయ్య పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు.

బోటు బోల్తా
సముద్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడిందని తెలుస్తోంది. సముద్రంలో అలల తాటికి బోటు బోల్తాపడడంతో మత్స్యకారులు  గల్లంతైనట్టు సమాచారం. ఈ బోటులో ప్రయాణిస్తున్న మత్య్సకారుడు కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. 

విశాఖపట్టణంలోని సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారనే విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు ఏడుగురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్‌కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాలతో బోటు తిరిగి రాలేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మత్య్సకారుల కోసం ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

హోంమంత్రి సమీక్ష
విశాఖపట్టణంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్య శాఖ అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్టుగార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లి  7 మంది మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

0
0
Report

అరుదైన కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Mars-venus Square Conjunction July 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, వాటి కలయికలు అన్ని రాశులవారి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. జూలై నెలలో ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. ప్రేమ, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు, ధైర్య సాహసాలు, పరాక్రమానికి కారకుడైన అంగారకుడు కలిసి ఒక అద్భుతమైన యోగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం.. జూలై 29, బుధవారం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు శుక్ర, కుజ గ్రహాలు ఒకదానికొకటి.. 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని వల్ల అత్యంత పవిత్రమైన కేంద్ర దృష్టి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ శుభ యోగం కారణంగా ప్రధానంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. వీరికి అపారమైన ధనలాభాలు, ఆస్తి కలిసిరావడంతో పాటు జీవితంలో ఊహించని సంతోషం లభిస్తుంది. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి (Aries)
ఈ కేంద్ర దృష్టి యోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి.. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం తప్పకుండా లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్న తండ్రి తరపున ఆస్తులు లభిస్తాయి.. ఇక వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలు చాలా మధురంగా ఉంటుంది.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ యోగం ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి బంపర్ పురోగతి లభిస్తుంది.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. జీవితంలో కొత్త ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి.. ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. కొత్త ఆస్తులను సొంతం చేసుకుంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు, ప్రశాంతత నెలకొంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కన్యా రాశి (Virgo)
శుక్ర, మంగళ గ్రహాల కేంద్ర దృష్టి యోగం ప్రభావంతో కన్యా రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు గతంలో పడిన కష్టానికి, శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయాల్లో పైఅధికారుల ప్రశంసలు అందుతాయి. సహోద్యోగుల నుంచి సపోర్ట్‌ కూడా విపరీతంగా లభిస్తుంది. ఆర్థిక వృద్ధి బలంగా ఉంటుంది. దీనివల్ల డబ్బులు భారీగా లభించే అవకాశాలు ఉన్నాయి.. చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు కూడా పరిష్కారమవుతాయి..

తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది.. ఉద్యోగంలో మీ స్థానం మరింత స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు వ్యాపార ప్రణాళికలు కూడా మెరుగుపడతాయి. జీవితంలో నెలకొన్న అన్ని రకాల గొడవలు, అశాంతి తొలగిపోతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఊహించని ధనలాభాలు కూడా విపరీతంగా కలుగుతాయి.. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి..

నోట్: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర అంచనాలతో పాటు నమ్మకాలను ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

England Viagra World Cup: ఫీఫా వరల్డ్ ‌కప్‌లో విచిత్ర సంఘటన..ఇంగ్లాండ్ ప్లేయర్లకు వయాగ్రా ఇచ్చారు! ఎందుకంటే?

Burtinle, Nugaal:

England Viagra Mexico: ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం (జూలై 6న) మెక్సికోతో జరగబోయే కీలకమైన 'రౌండ్ ఆఫ్ 16' మ్యాచ్‌లో గెలవడానికి ఇంగ్లాండ్ జట్టు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. మెక్సికో సిటీలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే శారీరక శ్రమను తట్టుకునేందుకు వీలుగా ఇంగ్లాండ్ జట్టుకు 'వయాగ్రా' మాత్రలను వినియోగించేందుకు అనుమతి లభించింది. ఫీఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఇలాంటి విన్నూత్న అనుమతి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అసలు సమస్య ఏమిటి?
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సముద్ర మట్టానికి ఏకంగా 2,200 మీటర్ల ఎత్తులో ఉన్న 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియంలో జరగనుంది. పర్వత ప్రాంతాలు, పలుచని గాలి ఉండే ఇటువంటి చోట్ల ఆడటం అలవాటు లేని ఆటగాళ్లకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇంగ్లాండ్ తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను, రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌ను అమెరికాలో ఆడింది. అక్కడ డీఆర్ కాంగోపై 2-1తో గెలిచిన తర్వాత, మెక్సికోతో మ్యాచ్‌కు వారికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే దొరికింది.

"మేము మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇక్కడికి చేరుకుంటున్నాం. కేవలం మూడు రోజుల్లో శరీరం ఇలాంటి ఎత్తైన వాతావరణానికి అలవాటుపడటం అసాధ్యం. ఇందుకు కనీసం 12 నుండి 14 రోజుల సమయం పడుతుంది. తక్కువ సమయం ఉండటం మాకు పెద్ద ప్రతికూలత, మెక్సికోకు అది కలిసొచ్చే అంశం" అని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ థామస్ టూచెల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎత్తైన ప్రదేశాలలో 'వయాగ్రా' ఎలా?
సాధారణంగా అంగస్తంభన సమస్యకు వాడే ఈ మందుకు ప్రత్యేకమైన హృదయ సంబంధ ప్రయోజనాలు ఉన్నాయి. వైద్య పరిశోధనల ప్రకారం.. ఇది ఊపిరితిత్తులలోని రక్తనాళాలను విస్తరింపజేసి, రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల గుండె శరీరాంతటా ఆక్సిజన్‌ను మరింత వేగంగా, సమర్థవంతంగా పంప్ చేస్తుంది.

తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాలలో అథ్లెట్లకు ఎదురయ్యే అలసట, తల తిరగడం, ఆయాసం వంటి సమస్యలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

ఇది డోపింగ్ పరిధిలోకి రాదా?
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (WADA) నిబంధనల ప్రకారం, వయాగ్రా నిషేధిత పదార్థాల జాబితాలో లేదు. ఇది ఇతర డ్రగ్స్ లాగా క్రీడా సామర్థ్యాన్ని కృత్రిమంగా, అక్రమంగా పెంచేది కాదని WADA సంస్థ చేసిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి దీని వాడకం పూర్తిగా చట్టబద్ధంగా నిర్ధారించారు. అయితే మ్యాచ్ రోజున ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిజంగా ఈ మాత్రలు వేసుకుంటారా లేదా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కానప్పటికీ, వైద్యపరంగా వారికి ఈ వెసులుబాటు ఉంది.

మ్యాచ్ వివరాలు, లైవ్ స్ట్రీమింగ్..
మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా భారత కాలమాన ప్రకారం.. సోమవారం జూలై 6న ఉదయం 5:30 గంటలకు (IST) మ్యాచ్ ప్రారంభం కానుంది. 

లైవ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లను Zee5 యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. అలాగే టీవీల్లో Unite8 Sports 1, Unite8 Sports 1 HD, Unite8 Sports 2, Unite8 Sports 2 HD ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

Also Read: గ్రౌండ్‌లో కంటతడి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ..క్యాప్ అందుకున్న తర్వాత భావోద్వేగం!

Also Read: IND Vs ENG Match: భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20కి వరుణ గండం..ఇది కూడా రద్దైనట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

బుధ, కుజ గ్రహాల కలయికతో దశాంశ రాజయోగం.. ఈ 5 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం!

Hyderabad, Telangana:

Dashank Rajyog 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలతో పాటు వాటి కలయికలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాలు నిర్దిష్ట కాలంలో ఒకదానితో ఒకటి కలిసినప్పుడు లేదా ప్రత్యేక కోణాల్లో వచ్చిన్నప్పుడు అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు నెలలో ఒక అద్భుతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. బుధ, కుజ  గ్రహాల కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన దశాంశ రాజయోగం (Dashank Rajyog) ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఊహించని రీతిలో ధనలాభం కలగబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

దశాంశ రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2026 ఆగస్టు 14వ తేదీన బుధుడు కుజ  గ్రహాలు ఒకదానికొకటి 36 డిగ్రీల ప్రత్యేక కోణంలో రాబోతున్నాయి. ఈ గ్రహాల అరుదైన గ్రహాల కలయితో అత్యంత శక్తివంతమైనదిగా భావించే దశాంశ యోగం ఏర్పడుతుంది. దీనిని ఎంతో పవిత్రమైనదిగా, శుభ ఫలితాలను ఇచ్చేదిగా చెప్పకుంటారు. ఈ యోగ ప్రభావంతో ఆగస్టు నెల నుంచి ప్రధానంగా ఐదు రాశుల వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

భారీగా అదృష్టాన్ని పొందే 5 రాశులు:
మేష రాశి (Aries)

మేష రాశివారికి ఈ దశాంశ యోగం వల్ల వృత్తిపరంగా సరికొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కలుగుతాయి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఆరోగ్యం పరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. అయితే, ఈ సమయంలో శారీరక వ్యాయామంపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి (Leo)
సింహ రాశికి కూడా వ్యాపారాల పరంగా ఈ సమయం ఒక అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. కొత్త భాగస్వాములు లేదా సహచరులతో కుదుర్చుకునే ఒప్పందాల వల్ల వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి తగినంత సమయం దొరుకుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా వేధిస్తున్న శారీరక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ కాలంలో ఉపశమనం లభిస్తుంది.

కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి పని వాతావరణంలో గణనీయమైన సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో ఒత్తిడి తగ్గి.. మీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి తగినంత సమయం కేటాయించగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పరంగా చూస్తే.. కంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈ కాలంలో రుచికరమైన విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు (Business Deals) కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ప్రణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో ఉన్న విభేదాలు, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. భాగస్వామితో సంబంధాలు మళ్లీ మధురంగా మారుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం

Gadwal, Telangana:

Bus Accident In Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డుపై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన ఒక లారీ ఆ బస్సును బలంగా ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపైన పల్టీలు కొట్టి బోల్తా పడింది. 

10 మందికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు 
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కేకలతో ప్రాంతం మారుమోగిపోయింది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. తోటి వాహనదారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారందిని చికిత్స నిమిత్తం సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురయ్యారు. తాము నిబంధనల ప్రకారం ప్రయాణిస్తున్నప్పటికీ.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఇలా బలంగా ఢీకొడితే ప్రాణాలు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజు రోజుకు రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణాలు చేయాలంటేనే సామాన్లు వణికి పోతున్నారు. ప్రాణాలను ఎలాంటి గ్యారెంటీ లేని పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Also Read: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sai Krishna Case: "నా కొడుకుని మేకులు కొట్టి చంపారు..బూడిదైనా ఇవ్వండి!" సాయికృష్ణ తల్లి ఆవేదన!

Vijayawada, Andhra Pradesh:

Sai Krishna Case Update: విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విషయంలో ఆయన తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన కొడుకును పోలీసులు అత్యంత అమానుషంగా హింసించి చంపేశారని ఆమె ఆరోపించారు. "నా కొడుకు కాళ్లు, చేతుల్లో మేకులు కొట్టి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు మమ్మల్ని (కుటుంబ సభ్యులను) కూడా చంపాలని చూస్తున్నారు" అంటూ ఆమె భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఈ లాకప్ డెత్ వెనుక పెద్దల హస్తం ఉందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. పోలీసులు కేవలం నలుగురైదుగురు చిన్న ఉద్యోగులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. "నా కొడుకును థర్డ్ డిగ్రీతో విచక్షణారహితంగా హింసించిన అసలు నిందితులు, ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలు ఇంకా బయటే తిరుగుతున్నారు.వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు, సూత్రధారులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు.

బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం!
తన కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకునే భాగ్యం కూడా కల్పించలేదని, కనీసం అంత్యక్రియల తర్వాత మిగిలిన సాయికృష్ణ బూడిదను (అస్థికలను) కూడా తమకు అప్పగించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నా కొడుకు బూడిదైనా మాకు ఇవ్వండి.. లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా" అంటూ ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు.

బాధిత తల్లి విజయలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. లాకప్ డెత్ కేసులో పోలీసుల వైఫల్యాలను, వైఖరిని ఎండగడుతూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అసలైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ALso Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Also Read: ఇథనాల్ పెట్రోల్‌తో మీ కారు, బైక్‌కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

తులంపై 35వేలు తక్కువ పలుకుతున్న బంగారం ధర.. జులై 5వ తేదీ ధరలివే..!!

PPINEWZ7h ago
Secunderabad, Telangana:

Gold Rate Today: ఈరోజు.. ఆదివారం.. జూలై 5వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,490 ఉండగా.. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర  రూ. 1,36,790 పలుకుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 2,36,665 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం బంగారం ధరలు తీవ్రంగా పడిపోయి, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ బలహీనపడటమే.. మనం యూఎస్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతం  4,165 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదల అని కూడా చెప్పాలి. యూఎస్ డాలర్ విలువ బలపడితే, బంగారం ధరలు తగ్గుతాయి. యూఎస్ డాలర్ విలువ బలహీనపడితే, బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండింటి మధ్య బలమైన సంబంధం ఉంది.

బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి. పెట్టుబడిదారులు తమ లాభాలను కోల్పోకుండా తరచుగా దీనిలో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా, యూఎస్ బాండ్ మార్కెట్‌లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బాండ్ రాబడులు కూడా తగ్గుతాయి. అయినప్పటికీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడానికి సుముఖంగా ఉన్నారు. గత వారం బంగారం ధరలు భారీగా పడిపోవడంతో, బంగార ప్రియులకు కొంత ఊరట లభించింది. నగల దుకాణాల్లో కొంత సందడి కనిపించింది. కానీ ఇప్పుడు, ధరలు మళ్లీ పెరుగుతుండటంతో, ప్రజలు బంగారు ఆభరణాలు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని దుకాణ యజమానులు చెబుతున్నారు.

బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి, సగటు బంగార ప్రియుడు తన కొనుగోళ్లను తగ్గించుకున్నాడని బంగారు నగల వ్యాపారులు చెబుతున్నారు. అనేక ఆఫర్లు ఉన్నప్పటికీ బేస్ ధర తగ్గకపోవడంతో బంగార ప్రియులు వెనకడుగు వేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అయితే, తేలికపాటి బంగారు ఆభరణాల డిజైన్లకు డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం, మార్కెట్‌లో 10 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారు ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే దానిపై చాలా అనిశ్చితి నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే, బంగారం ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో దీనిని అంచనా వేయడం కష్టమని నిపుణులు అంటున్నారు.

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: తిరుమల ఆలయానికి వెళ్తున్న భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రెండు రోజుల పాటు తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే రెండు వేడుకల సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఎందుకు? ఎప్పుడు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై 14వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రెండు రోజులు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జూలై 13, 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించలేమని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఆణివారం ఆస్థానం రోజు నిత్యం జరిగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. జూలై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

0
0
Report

Renault Kwid 2026: రూ.4.53 లక్షలకే సూపర్ గ్రేడ్ కారు..బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్ ఏంటో తెలుసా?

Hyderabad, Telangana:

Renault Kwid 2026 Price: భారతదేశంలోని బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రెనాల్ట్ ఇండియా కొత్త 2026 రెనాల్ట్ క్విడ్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.53 లక్షలు నుంచి అందుబాటులో ఉండడం విశేషం. ఇది కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, సవరించిన వేరియంట్లతో వస్తుంది.  

కొత్త రెనాల్ట్ క్విడ్‌ను ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేశారు. ఈ రెండు వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ మునుపటి ఆథెంటిక్, టెక్నో వేరియంట్లను నిలిపివేసి, మోడల్‌ను సరళీకరించింది.  

డిజైన్ పరంగా చూస్తే, కొత్త క్విడ్ బయట 3D రెనాల్ట్ లోగో, కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్‌గేట్‌పై కొత్త స్టైల్ "క్విడ్" బ్యాడ్జ్‌ను పొందుతుంది. ఇంటీరియర్‌లో కొత్త కైగర్-స్టైల్ స్టీరింగ్ వీల్, సవరించిన క్యాబిన్, ఆధునిక డిజైన్ ఉన్నాయి.  

ఫీచర్ల పరంగా కూడా రెనాల్ట్ అనేక అప్‌గ్రేడ్‌లను చేసింది. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ ఉన్నాయి. టాప్ క్లైంబర్ వేరియంట్‌లో భద్రతా ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ (AMT మోడళ్లలో), కీలెస్‌ ఎంట్రీ, EBDతో కూడిన ABS లభిస్తాయి.  

ఇంజన్ విభాగంలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారుకు మునుపటిలాగే అదే 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది సుమారు 69 hp పవర్, 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర వినియోగానికి ఈ ఇంజన్ తగినంత పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మాన్యువల్ వేరియంట్‌ల కోసం అదనపు ఖర్చుతో రెట్రోఫిట్ CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.  

ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మరియు మాన్యువల్ ఏసీ ఉన్నాయి.

దాని ధర, ఫీచర్ల దృష్ట్యా, కొత్త రెనాల్ట్ క్విడ్ మారుతి ఆల్టో కె10, మారుతి ఎస్-ప్రెస్సో, టాటా టియాగో వంటి బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లతో నేరుగా పోటీపడుతుంది. రెనాల్ట్ కొత్త డిజైన్, భద్రతా అప్‌గ్రేడ్‌లు, ఆకర్షణీయమైన ధరలతో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిని ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.  

Also Read; రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

ALso Read: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top