లోటస్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు పాల ఉట్టిని కొట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు, నేటి యువతకు పండుగలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
TIMS Hospital: ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభిస్తాం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Hyderabad: 'మేం అధికారంలోకి వచ్చిన తరవాత విద్య, వైద్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు' అని తెలంగాణ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. '32 నెలలు పరిపాలనలో రూ.2,222 కోట్లు ఆరోగ్య శాఖకు ఖర్చు పెట్టాం. రూ.5,626 కోట్లు కేవలం వైద్యం కోసమే ఖర్చు చేశాం. రూ.21,800 కోట్లు ఈ శాఖలు ఖర్చు చేశాం. జాగ్రత్తగా రూపాయి రూపాయి కూడబెట్టి వైద్యానికి ఖర్చు పెడుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లకి వేరే దగ్గర ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన రాలేదు అని విమర్శించారు.
హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌కి టెంకాయ కొట్టి నిధులు కేటాయించలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ఆసుపత్రిని ప్రారంభిస్తాం. కార్పొరేట్ దీటుగా పరిశుభ్రంగా ఆసుపత్రిని నిర్వహణ చేస్తాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. వైద్యులను అదనపు సమయం చేయమని చెప్పాలని.. వారికి ప్రోత్సాహకాలు ఇద్దామని అధికారులకు చెప్పారు. తమకు కష్టం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని. ఆదుకోవడానికి తామున్నామనే నమ్మకం కలిగించాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.
'సనత్‌నగర్ ఎమ్మెల్యే (తలసాని శ్రీనివాస్ యాదవ్) కేటీఆర్‌ని తీసుకొచ్చి ఈ ఆసుపత్రిని మేమే కట్టాం అని చూపించారు. ఇక కేటీఆర్ టిమ్స్ నేనే కట్టిన అన్నారు. ఇక హైదరాబాద్ కట్టినది నేనే అన్నది. మీ నాయన ఫామ్‌హౌస్‌లు, మీ చెల్లులు, మీ బావ ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. మరి మా పేదలకు ఒక్క ఆసుపత్రి కట్టలేకపోయారు' అని విమర్శించారు. కరువు రావాలని అఘోర్ పూజలు చేయడం మానేసి నల్లమల పోయి పూజా చేస్తే మీ దోచుకున్న రూ.లక్ష కోట్లలో నియోజకవర్గానికో రూ.పది కోట్ల ఖర్చు పెడితే కొంత పాపం తగ్గుతుంది' అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
అంతకుముందు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి విభాగాలను మంత్రులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
చికిత్స కోసం వచ్చే వారి నమోదు, రిసెప్షన్లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరు, ఓపీ కౌంటర్ పనితీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి.. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా మంచి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Tirumala Reels: సోషల్ మీడియా రీల్స్‌కు అడ్డాగా మారిన తిరుమల.. మరోసారి రీల్స్ కలకలం
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple: పరమ పవిత్ర క్షేత్రం తిరుమల ఆలయం సోషల్ మీడియా పిచ్చి ఉన్న వారికి అడ్డాగా మారింది. రీల్స్‌కు కేరాఫ్‌గా తిరుమల ఆలయ పరిసరాలు మారాయి. తిరుమల కొండపై రీల్స్ చేస్తూ కొందరు హల్చల్ చేస్తున్నారు. పవిత్రంగా.. భక్తిప్రపత్తులతో తిరుమల కొండపై ఉండాల్సి ఉండగా తమ వ్యూస్ కోసం రీల్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరగ్గా తాజాగా తిరుమలలో మరోసారి రీల్స్ చేశారు. ఓ కుటుంబం తిరుమల కేంద్రంగా రీల్స్ చేయడం వివాదానికి దారి తీసింది.
శ్రీవారి దర్శనానికి వెళ్తూ దేవుడి పేరుతో ఓ జంట రీల్స్ చేసింది. సర్వదర్శనం క్యూలైన్లో రీల్స్ చేసినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా రాంబగీచా వద్ద కూడా ఆ కుటుంబం రీల్స్ చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల మధ్యే వీడియోల చిత్రీకరణ చేశారు. తిరుమలలో రీల్స్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీల్స్ చేసిన వారిని కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వస్తున్నారా..? పబ్లిసిటీ కోసం వస్తున్నారా..? అంటూ నిలదీస్తున్నారు.
భక్తి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం కోసం రీల్స్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. లైక్స్, వ్యూస్ కోసం తిరుమలలోనే రీల్స్ చేస్తున్నారంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలనే రీల్స్ చేసి వార్తల్లోకి వస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించవద్దంటూ భక్తులు వేడుకుంటున్నారు. దర్శన క్యూలైన్లలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్ చేస్తుండడంతో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమలలో రీల్స్ సంస్కృతిపై టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తి వాతావరణం పెంపొందించేలా టీటీటీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పుష్కరిణి వద్ద భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. పుష్కరిణి లోతు భక్తులకు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి మల్లారెడ్డి
Dharmavaram, Andhra Pradesh:Former Telangana Minister Malla Reddy And Other VIPs Tirumala Darshan Watch VideoScorpions Panchami: తేళ్ల పంచమి విశిష్టత ఏమిటో తెలుసా? భక్తుడి మాటలు వినండి
Narayanpet, Telangana:Know The History Of Thella Panchami Why Celebrate In Nagula Panchami Day Watch VideoThella Panchami: నాగుల పంచమి రోజు తేళ్లతో భక్తుల విన్యాసాలు
Narayanpet, Telangana:Nagula Panchami Kandukuru Villagers Celebrates As Thella Panchami With Scorpions Watch Viral VideoSIR Draft: తెలంగాణ 'సర్' ముసాయిదా విడుదల.. ఫామ్ నింపిన 78 శాతం తెలంగాణ ఓటర్లు
Baddipadaga, Telangana:Telangana SIR Draft: తెలంగాణలో ఓట్ల సవరణ కార్యక్రమం (సర్) ముగిసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఎంత మంది తమ ఓటు హక్కును అప్డేట్ చేసుకున్నారనే అంశాలను ఎన్నికల సంఘం (ఈసీ) వివరించింది. సర్ ప్రక్రియలో కీలకమైన ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో ఎంత మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు? ఎంత మంది ఓట్లు తొలగిపోతున్నాయనేది ఎన్నికల సంఘం సమగ్ర నివేదిక విడుదల చేసింది.
2,64,87,213 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించినట్లు ఈసీ ముసాయిదాలో తెలిపింది. అంటే 78.30 శాతం ఫారాలు సేకరణ జరిగింది. 9,22,229 మంది ఓటర్లు మృతిచెందిన వారిగా గుర్తించగా.. వారి ఓట్ల శాతం 2.73 గా ఉంది. 57,46,803 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, అందుబాటులో లేని లేదా ఇతర కేటగిరీల్లో ఉన్నట్లు గుర్తించగా వారి ఓట్ల శాతం 16.99 ఉంది. 6,70,203 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో నమోదైనట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. నిజమైన ఓటర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరేందుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల ప్రక్రియలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం చేపట్టిన సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్‌కు 25 జూన్ 2026 నుంచి 10 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇచ్చారు. సర్ ఎన్యుమరేషన్ ఫలితాల్లో ఎలక్టర్ల నుంచి సేకరించిన ఫారాలు 2,64,87,213. అంటే 78.30 శాతం. మరణించిన ఓటర్లు 9,22,229 మంది ఉండగా.. ఓట్ల శాతం 2.73. ఇక శాశ్వతంగా తరలిపోయారు/ కనిపించలేదు / ఇతరులు 57,46,803 మంది ఉన్నారు. వారి ఓట్ల శాతం 16.99. వీరిని బీఎల్ఓలు కలవలేకపోవడానికి కారణాలు ఈసీ వెల్లడించింది. వారంతా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం.. కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటర్లుగా మారారని.. ఉనికిలో లేరని.. ఆగస్టు 10 వరకు ఫారం సమర్పించలేదని.. ఏదో కారణంతో ఓటరుగా నమోదు చేయడానికి ఇష్టపడలేదు అని కారణాలుగా ఈసీ తెలిపింది. ఓటర్ జాబితాలో పలుచోట్ల నమోరైన వారి సంఖ్య 6,70,203. వీరి శాతం 1.98 ఉంది.
విడుదల చేసిన ముసాయిదాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. 17 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలపై వినతులు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. నిజమైన ఓటర్లు ఫామ్ 6 + డిక్లరేషన్ ఫారంతో మళ్లీ ఓటర్ జాబితాలో పేరు చేర్పించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరున్న ఓటర్ల పేరు ఒకే చోట మాత్రమే ఉంచుతామని ఈసీ స్పష్టం చేసింది.
సర్ ప్రక్రియలో ఓటర్లు, రాజకీయ పార్టీలతోపాటు తమ సిబ్బంది భాగమయ్యారని ఈసీ తెలిపింది. తెలంగాణలో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అర్హులైన ఓటర్లు భాగస్వామ్యం కావడంతో పూర్తి పారదర్శకంగా చేసినట్లు ఈసీ వెల్లడించారు. 10 ఆగస్టు 2026 నాటికి మొత్తం 3,38,26,448 ఓటర్లలో 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారని ఈసీ తెలిపింది. ఈ పని కోసం 33 జిల్లాల డీఈఓలు, 119 ఈఆర్ఓలు, 892 ఏఈఆర్ఓలు, 3,590 బీఎల్ఓ సూపర్వైజర్లు, 35,985 పోలింగ్ స్టేషన్లలో 35,985 బీఎల్ఓలు పనిచేశారని ఈసీ వెల్లడించింది.
బీఆర్ఎస్ పార్టీ అత్యధికం
సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా కీలక భాగస్వామ్యం చేశాయి. ఎన్యుమరేషన్ సమయంలో రాజకీయ పార్టీలు మొత్తం 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) నియమించుకోగా.. అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మొత్తం 20,394 మంది బీఎల్ఏలను నియమించి సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని ఓటర్లను భాగస్వామ్యం చేసింది.
పార్టీల వారీగా బీఎల్ఏల సంఖ్య
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ): 20,394
భారత జాతీయ కాంగ్రెస్ :13,144
భారతీయ జనతా పార్టీ-బీజేపీ: 11,621
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం): 2,382
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)- సీపీఐ (ఎం): 608
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 569
తెలుగు దేశం పార్టీ : 300
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), ఆమ్ ఆద్మీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఒక్క బీఎల్ఏను కూడా నియమించలేదు. తెలంగాణ సర్ ప్రక్రియలో వాటి పాత్ర ఏమీ లేదు.
మొత్తం బీఎల్ఏల సంఖ్య: 49,018
Chandrababu: వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సవాల్.. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
Velgapudi, Andhra Pradesh:AP Assembly Session: 'మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వహిస్తాం. కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాలు విసురుతున్నా. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నా. పూర్తి పారదర్శకతతో బాధ్యతతో , పూర్తి జవాబుదారీ తనంతో నియామకాలు జరిగాయి' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
మెగా డీఎస్సీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. 'ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకువచ్చాం. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్య సంస్థల సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 10 నుంచి 12 లక్షల మంది విద్యార్ధులు పాఠశాలకు రావడం మానేయడంతోనే అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్ధికసాయం అందించేలా మేం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలు పెంచడంతో లక్ష మందికి పైగా విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారని ప్రకటించారు.
'మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశాం. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టాం. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో, ఫలితాలను కూడా పారదర్శకంగా చేపట్టాం. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టాం' అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడించరాఉ.
'జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను అమలు చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది?' అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
'ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 3 వందలకు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డీఎస్సీ టీచర్లే రోడ్డుపైకి వచ్చారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
'విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తాం. బురద జల్లితే జీరో టాలరెన్సు అని హెచ్చరిస్తున్నా. సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలి. చెప్పేది వాస్తవం అయితే సరిచేసుకుంటాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండున్నరేళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం తన జీవితంలో ఇదే తొలిసారి అని తెలిపారు. 'అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలి. భవిష్యత్తులో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం' అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Thella Panchami: తేళ్లతో ఆడుకున్న భక్తులు.. తేళ్ల పంచమి విశిష్టత ఏమిటో తెలుసా?
Narayanpet, Telangana:Nag Panchami: సాధారణంగా తేలు కనిపిస్తేనే భయపడే మనకు ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. కానీ తెలంగాణ సరిహద్దులోని కర్ణాటకలో ఉన్న ఓ గ్రామ ప్రజలకు మాత్రం తేళ్లంటే అస్సలు భయం లేదట. గ్రామస్తుల నమ్మకం ప్రకారం నాగుల పంచమి రోజున తేళ్లు ఎవరినీ కుట్టవని విశ్వసిస్తారు. సాధారణంగా నాగుల పంచమి రోజు పాముల పుట్టలో పాలు పోసి పూజలు చేయడం ఆనవాయితీ. కానీ ఆ గ్రామంలో మాత్రం దానికి భిన్నంగా తేళ్లకు పాలు పోసి పూజలు చేస్తారు.
కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామం. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో తేళ్లను చూస్తేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది.. అదే తేలు ఒంటి మీదకు ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు కానీ ఈ గ్రామంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. ఏటా నాగుల పంచమి రోజున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కందుకూరు గ్రామంలోని కొండమవ్వ గుట్ట ఈ వేడుకలకు ప్రత్యేక కేంద్రంగా మారుతుంది. గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తేళ్లకు పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు.తేళ్లను చేతులతో పట్టుకుంటారు.. ముఖంపై తలపై పెట్టుకుంటారు. చివరికి నాలుకపై కూడా పెట్టుకుని ఆడుకుంటారు.
ప్రతి ఏడాది నాగుల పంచమి రోజున ఇక్కడ ‘తేళ్ల పంచమి’ పేరుతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అసలు వింత దృశ్యాలు మొదలవుతాయి. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను గ్రామస్థులు చేతులతో పట్టుకుంటారు.చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా తేళ్లను చేతులపై పెట్టుకుంటారు.కొంతమంది ముఖంపై, తలపై పెట్టుకుని ఆడుకుంటే మరికొందరు ఏకంగా నాలుకపై కూడా తేళ్లను పెట్టుకుంటారు.
కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు పూజలు చేసి ఆ తర్వాత అక్కడి తేళ్లను పట్టుకుని ఒంటిపై వేసుకుని ఆడుకుంటారు. ఈ వింత వేడుకలను చూసేందుకు కర్ణాటకతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు కందుకూరుకు తరలివస్తారు. తేళ్లను చూస్తేనే భయపడే మనుషులు ఒకవైపు. తేళ్లను చేతులతో పట్టుకుని ఒంటిపై వేసుకుని ఆడుకునే కందుకూరు గ్రామస్థులు మరోవైపు.నాగుల పంచమి రోజున జరిగే ఈ ‘తేళ్ల పంచమి’ వేడుకలు ప్రతి ఏడాది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.అయితే తేళ్లను చేతులతో పట్టుకోవడం ప్రమాదకరం కావడంతో ఇలాంటి ఆచారాలను నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
Ayesha Gilani Death: ప్రముఖ టిక్‌టాకర్ అయేషా గిలానీ దారుణ హత్య..నడిరోడ్డుపై కాల్చి చంపారు!
Hyderabad, Telangana:Ayesha Gilani Murder News: పాకిస్తాన్‌కు చెందిన సోషల్ మీడియా స్టార్, 28 ఏళ్ల టిక్‌టాకర్ అయేషా గిలానీ (అసలు పేరు షమ్సు బీబీ) దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. టిక్‌టాక్‌లో దాదాపు 13 లక్షల (1.3 మిలియన్ల) మంది ఫాలోవర్లతో ఎంతో పాపులర్ అయిన ఆమె, పట్టపగలు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన పాకిస్తాన్‌తో పాటు సోషల్ మీడియా వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హత్య వెనుక అసలు ఏం జరిగిందంటే?
ఆగస్టు 14న అయేషా గిలానీకి ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తక్షణమే ఇంటి నుంచి బయటకు రావాలని ఆ వ్యక్తి కోరడంతో, ఆమె తన 15 ఏళ్ల సోదరి అసిమా, తమ్ముడు ఇమాతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు.
కొద్దిసేపటికే 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి వారి కారును అకస్మాత్తుగా అడ్డుకున్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ నేరుగా అయేషా మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె కారులోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయేషా సోదరి అసిమా తీవ్రంగా గాయపడగా, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డబ్బు లావాదేవీలు, ప్రాణ బెదిరింపులే కారణమా?
కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో తన కుమార్తెకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదాలు ఉన్నట్లు అయేషా తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇవ్వాల్సిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసినప్పటి నుంచి అయేషాకు నిరంతరం ప్రాణ బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయమై గతంలోనే ఇస్లామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఘటన స్థలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులు మోటార్‌సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మరియు సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఎవరీ అయేషా గిలానీ?
అయేషా గిలానీ పాకిస్తాన్‌లోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. షమ్సు బీబీ అసలు పేరుతో టిక్‌టాక్‌లో తెగ హల్ చల్ చేసిన ఆమెకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసే వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Irumudi Pre-Release Event: 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ స్పీచ్..
Also Read: Faria Abdullah Troll: సోషల్ మీడియాలో హీరోయిన్ ఫరియాపై ట్రోలింగ్..వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party Protest: 'కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్' రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర.. బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు
Baddipadaga, Telangana:Kalyana Lakshmi Scheme Ban: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తూట్లు పొడిచే కుట్ర జరుగుతోందని.. ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీ ఇవ్వలేక ఆ పథకాలను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించాలని.. ఆర్థిక సహాయంతోపాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న దానికి నిరసనగా ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి హబ్సిగూడ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. సోమా శేఖర్, సైజన్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
వికారాబాద్‌లో..
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టేను వెంటనే ఎత్తివేసి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే కొనసాగడంతో అనేక మంది అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి స్టేను ఎత్తివేసి.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని నాయకులు కోరారు.
సంగారెడ్డిలో
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరుతూ గులాబీ శ్రేణులు సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వెంటనే పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తీసుకువచ్చిన ఆ పథకాలను రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఆ పథకాలు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Irumudi Pre-Release Event: 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ స్పీచ్..
Hyderabad, Telangana:Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ కార్యక్రమంలో హీరో రవితేజ స్పీచ్ పై ఓ సారి లుక్కేయండి.AP MLC Governor Quota: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖరారు.. సీనియర్ నేతతో పాటు సాధారణ మహిళకు అవకాశం!
Velgapudi, Andhra Pradesh:AP MLC Governor Quota Candidates: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆసక్తికరంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. వైసీపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇద్దరి పేర్లను ఖరారు చేశారు.
వర్ల రామయ్యకు దక్కిన అవకాశం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన సీనియర్ నేత వర్ల రామయ్య ఎట్టకేలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. గడచిన కాలంలో రాజ్యసభ రేసులో పలుమార్లు ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అవకాశాలు చేజారాయి. తాజాగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారు కాగా, భవిష్యత్తులో శాసనమండలి ఛైర్మన్ పదవి కూడా దక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సాధారణ మహిళకు ఛాన్స్
ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎస్సీ నేత వర్ల రామయ్యకు ఒక స్థానం కేటాయించారు. అనూహ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ మహిళ, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును ఖరారు చేసి సంచలనం సృష్టించారు.
ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఒక సీనియర్ నేతతో పాటు క్రిందిస్థాయి నుంచి కష్టపడిన ఒక సాధారణ మహిళకు ప్రాధాన్యత కల్పించింది. ఎస్సీ, బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
Also Read: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
ALso Read: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bihar Stampede: బీహార్‌లో ఘోర ప్రమాదం..ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మహిళలు దుర్మరణం!
Balgudar, Bihar:Bihar Stampede Today: భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీతో బీహార్‌లోని ప్రసిద్ధ లఖిసరాయ్ అశోక్‌ధామ్ ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మహిళలు దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనకు అసలు కారణం ఇదే..
శ్రావణ మాసం కావడంతో సోమవారం తెల్లవారుజామున అశోక్‌ధామ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదే సమయంలో రెండు రైళ్లు లఖిసరాయ్ స్టేషన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు, భక్తుల రద్దీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. అశోక్‌ధామ్ స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో జనసమూహం నియంత్రణ దాటింది. అధిక ఒత్తిడి కారణంగా ఒక వైపు ఉన్న బారికేడింగ్ తెగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.
మరోవైపు, క్యూలైన్లలో వేలాది మంది నిలబడి ఉన్న సమయంలో అక్కడే ఉన్న ఒక విద్యుత్ స్తంభం కూలిపోయి దాని నుంచి విద్యుత్ ప్రవహించిందనే వదంతులు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ రూమర్ భక్తులలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రాణభయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.
అధికారుల స్పందన..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనపై లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "ఉదయం సమయంలో రెండు రైళ్లు రావడంతో జనసమూహం అసాధారణ రీతిలో పెరిగింది. బారికేడింగ్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు.
అలాగే ఎస్డిపిఓ శివం కుమార్ మాట్లాడుతూ.. విద్యుదాఘాత వదంతుల వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణంతో పాటు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పవిత్ర శ్రావణ వేళ జరిగిన ఈ పెను ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది.
Also Read: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Pre-Release Event: "బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది" ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ!
Hyderabad, Telangana:Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్
అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు.
పవర్ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్‌తో పాటను చాలా ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్‌తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్‌ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖుల మాటలు..
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది, ఒక డిఫరెంట్ రవితేజను థియేటర్లలో చూస్తారు" అని అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.."ఇది తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ఎమోషనల్ అనుభూతిని మిగుల్చుతుంది" అని వెల్లడించారు.
"అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్ ఇది. అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది." - నిర్మాత రవిశంకర్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. "రవితేజ కెరీర్లో ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ అందించాను. థియేటర్లలో ప్రేక్షకులు దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు..
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. తన భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనువిందు చేయనున్నారు. అలాగే సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలో పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిచగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
ALso Read: Prabhas Fauzi New Poster: 'ఫౌజీ' కొత్త పోస్టర్..ఒకవైపు గాంధీ, మరోవైపు ప్రభాస్ మాస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!
Delhi, Delhi:Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడకుండా అడ్డుకోవాలని సోనియా సూచించారని, కాంగ్రెస్‌కు జాతీయ చిహ్నాలపై కనీస గౌరవం లేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపాటు
రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయాన్ని ఆపేయాలని పార్టీ అధ్యక్షుడికి సోనియా గాంధీ చెప్పడం వారి సిగ్గుమాలిన చర్యలకు, దురహంకారానికి అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ వివరణ
మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. వందేమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఎలాంటి సైగలు చేయలేదని స్పష్టం చేశాయి. వేదికపై ఎక్కువసేపు నిలబడలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూర్చోవడానికి వెంటనే ఒక కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా కోరారని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.
Also Read; శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
ALso Read: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
