విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు, భయందోళనలో భక్తులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆలయంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి నిత్యం మంటలు వస్తున్నాయని, అనేక సార్లు విద్యుత్ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లిన పట్టించికోవడం లేదన్నారు. అధికారులు స్పందించి ఆలయం లోపలి నుండి ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
జూలై 15న iQOO Z11 గ్రాండ్ లాంచ్.. 9,020 mAh భారీ బ్యాటరీతో అరాచకం!
Hyderabad, Telangana:Iqoo Z11 Launching In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారతీయ మొబైల్ ప్రియులకు మరో అదిరిపోయే వార్త అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11ను త్వరలోనే భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇటీవలే అందిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే జూలై 15వ తేదీ నాటికి భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించని ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ట్రెండింగ్‌లో iQOO Z11..
ఇటీవలే iQOO ఇండియా CEO నిపుణ్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తమ పాపులర్ Z సిరీస్‌లో ఒక పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌కు తీసుకువస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. అధికారికంగా మోడల్ పేరును ప్రకటించనప్పటికీ.. ఇది ఖచ్చితంగా iQOO Z11 మోడలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే.. భారత్‌లో విడుదల కాబోయే వేరియంట్ కొన్ని ప్రత్యేకమైన మార్పులతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కొన్ని స్పెషల్ ప్రీమియం ఫీచర్స్‌ను కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్సెట్..
ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ (Geekbench AI)పై ఈ స్మార్ట్‌ఫోన్ ప్రొటోటైప్ ఇటీవల లిస్ట్ అయిన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదలైన ఈ సిరీస్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. మలేషియాతో పాటు ఇతర అంతర్జాతీయ వేరియంట్లలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 (Snapdragon 7s Gen 4) చిప్‌సెట్‌ను అందించిన్నట్లు కంపెనీ గతంలోనే వెల్లడించింది.. భారతదేశంలో కూడా ఇదే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.. అంతేకాకుండా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ రన్ అవుతుందని సమాచారం.. ఇది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన వివో S60e (Vivo S60e)కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా భారత్‌లో పరిచయమయ్యే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి.
భారీ డిస్ప్లే, అద్భుతమైన బ్యాటరీ లైఫ్..
లీకైన వివరాల ప్రకారం.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు భారీ బ్యాటరీ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 6.83 ఇంచుల భారీ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఏకంగా మోస్ట్ పవర్ఫుల్ 9,020 mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్చి నెలలో లాంచ్ అయిన మోడల్ iQOO Z11x 5G ఇప్పటికే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాట 50MP కెమెరా, 7,200 mAh బ్యాటరీతో అదరగొట్టగా.. రాబోయే సరికొత్త Z11 మోడల్ అంతకు మించిన అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. ఒకవేళ మీరు సరికొత్త టెక్నాలజీతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, గేమింగ్‌కు అనుకూలమైన ప్రాసెసర్ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే.. మరికొద్ది రోజులు ఓపిక పడితే చాలు.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అందుబాటులోకి రాబోతోంది. దీని ధరతో పాటు సేల్ వివరాలు లాంచ్ రోజున అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Varanasi Teaser: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్‌న్యూస్..'వారణాసి' సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Varanasi Mahesh Babu Birthday Teaser: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, 'సంచారి' సాంగ్, ‘రణకుంభ’ థీమ్ సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఒక పవర్ఫుల్ టీజర్ లేదా అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
శ్రీరాముడి లుక్‌లో మహేశ్ బాబు?
గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ పుట్టినరోజులకు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసిన సెంటిమెంట్‌ను రాజమౌళి ఇక్కడ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మహేశ్ బాబు 'శ్రీరాముడి' లుక్‌లో ఉన్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. గతంలో ఒక ఈవెంట్లో రాజమౌళి సైతం తాను శ్రీరాముడి గెటప్ పోస్టర్‌ను పరిశీలనలో ఉంచానని హింట్ ఇచ్చారు. దీంతో మహేశ్ బర్త్‌డే నాడు ఈ లుక్‌ను అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది.
భారీ తారాగణం.. విడుదల ఎప్పుడంటే?
ఈ విజువల్ అడ్వెంచర్‌లో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో 'కుంభ' అనే పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్ బర్త్‌డే నాడు రాబోయే అప్డేట్తో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
Also REad: "అతడు సైకో..సిగరెట్లతో కాల్చి, ఎలా పడితే అలా కొట్టాడు" టాలీవుడ్ హీరోయిన్ కంటతడి!
Also Read; ఒక్క వెబ్‌సిరీస్‌తో లెవల్ మారిపోయింది..రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన మలయాళ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart సేల్‌లో రూ.10,449కే వివో 5G ఫోన్.. ఈ ఛాన్స్ అస్సలు వదలకండి!
Hyderabad, Telangana:Flipkart GOAT Sale: బడ్జెట్ ధరలో అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది అద్భుతమైన శుభవార్తగా భావించవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఆఫర్ల ఫెస్టివల్ ప్రారంభమైంది.. జూలై 4వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా.. ప్రముఖ బ్రాండ్‌కి సంబంధించిన వివో 5G మొబైల్‌పై దిమ్మతిరిగే ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న vivo T3 Lite 5G (6 GB ర్యామ్‌తో పాటు 128 GB స్టోరేజ్) వేరియంట్ మొబైల్ ఇప్పుడు అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉండడం విశేషం. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్..
మార్కెట్లో సాధారణంగా vivo T3 Lite 5G వేరియంట్ అసలు ధర (MRP) రూ.15,499లోపే లభిస్తోంది. అయితే, ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. ఈ బంపర్ ఆఫర్ వల్ల ఎటువంటి అదనపు నిబంధనలు లేకుండానే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ నేరుగా రూ.11,499 లోపే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ మరింత చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని కోసం తప్పకుండా కొన్ని రకాల ఆఫర్స్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ ఆఫర్లతో మరింత చౌకగా..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. వినియోగదారులు మరింత ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మీరు ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే.. మీకు అదనంగా మరో రూ.1,050 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే.. అసలు రూ.15,499 ధర కలిగిన ఈ వివో 5G స్మార్ట్‌ఫోన్‌ను మీరు కేవలం రూ.10,449 లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
vivo T3 Lite 5G ప్రత్యేకత ఇదే..
vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులో ఉండడం విశేషం. అంతేకాకుండా ఎంతో ఆకట్టుకునే Vibrant Green కలర్ వేరియంట్లో ఎంతో క్లాసీగా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ 5G సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. తక్కువ బడ్జెట్లోనే హై-స్పీడ్ 5G కనెక్టివిటీని అందిస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌పై Flipkart GOAT సేల్‌లో ఉన్న ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోకండి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart బంపర్ ఆఫర్.. రూ.45 వేల వివో 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,699కే!
Hyderabad, Telangana:Flipkart GOAT Sale: మీరు సరికొత్త ఫీచర్లతో కూడిన బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న Flipkart GOAT సేల్‌లో భాగంగా vivo Y11 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం లుక్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లతో లభిస్తున్న ఈ మొబైల్‌ను ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే సువర్ణావకాశం ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే లభిస్తోంది. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఊహించని ఫ్లాట్ డిస్కౌంట్..
మార్కెట్లో వివో Y11 5Gకి సంబంధించిన 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 4 GB ర్యామ్‌తో కూడిన వేరియంట్ అసలు ధర (MRP) రూ. 44,999తో అందుబాటులో ఉండగా.. అయితే, జూలై 4వ తేదీన ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.26,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.18,999 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా దాదాపు రూ.1,425 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.. అలాగే భారీ తగ్గింపు పొందాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు.
ఎక్చేంజ్ బోనస్‌తో బంపర్ ఆఫర్..
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేసుకునేవారికి ఇది ఒక బెస్ట్ డీల్‌గా భావించవచ్చు. ఈ సేల్‌లో పాత ఫోన్‌ను ఎక్చేంజ్ చేసే వారికి దాదాపు రూ.7,300 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.. ఒకవేళ ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్చేంజ్ వాల్యూ లభిస్తే.. అన్ని ఆఫర్లు కలుపుకుని ఈ vivo Y11 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.11,699 లోపే సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌తో పాటు మోడల్‌పై ఆధారపడి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్, ధర ఎంతో తెలిస్తే షాకే!
Hyderabad, Telangana:Google Pixel 11 Launch Date: ప్రముఖ సంస్థ గూగుల్ నుంచి పిక్సెల్ (Pixel) స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది నిర్వహించనున్న 'మేడ్ బై గూగుల్' అనే ఈవెంట్ ద్వారా గూగుల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఆగస్టు 12న నిర్వహించనున్న వేడుకలో గూగుల్ పిక్సెల్ 11ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్.. డిజైన్, పిక్సెల్ గ్లో
గూగుల్ ఇంకా Pixel 11 స్మార్ట్‌ఫోన్ గురించి అధికారికంగా సమాచారం రానప్పటికీ.. గత కొన్ని వారాలుగా ఆన్లైన్లో లీక్ అయిన సమాచారం ద్వారా టెక్ దిగ్గజం నుంచి ఏమి ఏమి ఆశించవచ్చో ఇప్పుడు ఓ అంచనాకు రావొచ్చు.
ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ వంటి మోడల్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం.. పిక్సెల్ 11 సిరీస్‌లో డిజైన్ వరకు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌లో మాత్రం రీడిజైన్ చేసిన కెమెరా బంప్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
పిక్సెల్ 11లో నథింక్, గ్లైప్ వంటి లైట్ల మాదిరిగా ఈసారి LED లైట్ల అమరికను తీసుకొచ్చే అవకాశం ఉంది. గూగుల్ తీసుకొచ్చే ఈ విధానంలో ఆర్జీబీ (రెడ్, గ్రీన్, బ్లూ) ఫార్మాట్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
డిస్ప్లే పరిమాణాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో మోడళ్లలో 6.3-అంగుళాల OLED ప్యానెల్స్, అలాగే పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్లో 6.8-అంగుళాల OLED డిస్ప్లే కొనసాగే అవకాశం ఉంది. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ 6.4-అంగుళాల కవర్ డిస్ప్లే, 8.0-అంగుళాల ఇన్నర్ స్క్రీన్ ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో టెన్సార్ జీ6 ప్రాసెసర్, 7-కోర్ చిప్సెట్, పిక్సెల్ 11 ఫోన్లలో శాంసంగ్ మోడెమ్ కు బదులుగా మీడియా టెక్ ఎమ్ 90 మోడమ్‌ను ఉపయోగించినట్లు సమాచారం.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ మోడళ్లు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. ఇందులో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 48-మెగా పిక్సెల్ 5x టెలిఫొటో కెమెరా ఉన్నాయి. మరోవైపు 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్, 10.5 మెగా పిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ 5x టెలిఫొటో లెన్స్ ఉంది. గూగుల్ తన పిక్సెల్ 11లో 'ఆన్-డివైస్ AI' ఫీచర్లను తీసుకురావచ్చని భావిస్తున్నారు. వీటిలో 'జెమిని ఇంటెలిజెన్స్'తో పాటు కొత్త 'ఏజెంటిక్ AI' సామర్థ్యాలు కూడా ఉండే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 11 ధర అంచనా..
మెమరీ చిప్స్ కొరత కారణంగా విడిభాగాల ధరలు పెరగడం వల్ల గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ధరలను పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. గతేడాది విడుదలైన పిక్సెల్ 10 భారతదేశంలో రూ.79,999 ధరకు విడుదల కాగా.. పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధరలు వరుసగా రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. ఇందులో అత్యుత్తమ శ్రేణి మోడల్ అయిన పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర రూ.1,72,999గా నిర్ణయించారు.
గూగుల్ పిక్సెల్ 11 విడుదల ఎలా ఉందంటే..
పిక్సెల్ 11 విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే.. గూగుల్, యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వీక్షించవచ్చు. 'మేడ్ బై గూగుల్ 2026' ఈవెంట్ ఆగస్టు 12న సాయంత్రం 6 గంటలకు (EST) ప్రారంభమవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం (IST) ఆగస్టు 13న తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలవుతుంది.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విడుదలైన సుమారు వారం రోజుల తర్వాత Pixel 11 స్మార్ట్‌ఫోన్స్ అమ్మాకానికి మార్కెట్లోకి రానున్నాయి. ఆగస్టు 20, 2025లో జరిగిన గూగుల్ పిక్సెల్ 10 విడుదల కార్యక్రమాన్ని అమెరికన్ కమెడియన్, టీవీ హోస్ట్ జిమ్మీ ఫాలన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. గతేడాది విడుదల చేసిన పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 29న అమ్మాకాకి వచ్చింది.
Also Read: వినియోగదారులకు కీలక అలర్ట్.. రూ.100 కరెన్సీ నోట్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన..
Also REad: రూ.4.53 లక్షలకే సూపర్ గ్రేడ్ కారు..బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఈ 5 రాశుల వారికి ఊహించని ధనలాభం.. బుధుడి సంచారంతో అదృష్టమే అదృష్టం!
Hyderabad, Telangana:Mercury Transit In Cancer 2026 Telugu: బుద్ధి, వివేకం, కమ్యూనికేషన్‌తో పాటు వ్యాపారానికి కారకుడిగా భావించే బుధ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. 2026 ఆగస్టు నెలలో జరగబోయే ఈ గ్రహ మార్పు కొన్ని రాశుల వారికి అమితమైన లాభాలను చేకూర్చబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆగస్టు 5న బుధుడు తన మిత్రుడైన చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ నేపథ్యంలో 5 ప్రత్యేక రాశుల వారికి అదృష్ట ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గ్రహాలకు రాజుగా భావించే బుధుడు 2026 జూలై 7న తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి సంచారం చేస్తాడు.. అక్కడ ఆగస్టు 5 వరకు సంచార దశలో ఉంటాడు.. అనంతరం 2026 ఆగస్టు 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించి.. ఆగస్టు 22 వరకు అంటే దాదాపు 18 రోజుల పాటు అక్కడే సంచార దశలో ఉంటాడు.. ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 18 రోజుల వ్యవధిలో 5 రాశుల వారు కెరీర్, వ్యాపారంతో పాటు ఆర్థిక రంగాలలో అద్భుతమైన విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి బుధుడి సంచారం ప్రభావం కుటుంబ జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.. చాలా కాలంగా నిలిచిపోయిన గృహ సంబంధిత పనులు ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడమే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఈ సంచారం ఎన్నో సానుకూల మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు, అభిప్రాయభేదాలు ఎంతో సులభంగా తొలగిపోతాయి.. భాగస్వామ్య (Partnership) వ్యాపారాలు చేసేవారికి ఈ 18 రోజులు భారీ లాభాలు కలుగుతాయి. వీరు తప్పకుండా లాభదాయకమైన వ్యాపార ఒప్పందం కూడా కుదుర్చుకుంటారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి పనిలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. మీ కష్టానికి తగిన పూర్తి ప్రతిఫలం కూడా లభించే ఛాన్స్ కూడా ఉంది. ఉన్నతాధికారులతో పాటు బాస్‌లు మీ పనితీరును అభినందించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్ద, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ బాధ్యతలు కూడా సులభంగా పొందుతారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
జగిత్యాల మునిసిపాలిటీలో భారీ కుంభకోణం.. ఏకంగా కమిషనర్ సంతకం ఫోర్జరీ!
Hyderabad, Telangana:Jagtial Municipal Scam Latest News: జగిత్యాల మున్సిపాలిటీలో మరో అక్రమ వ్యవహారం బట్టబయలైంది.. నిబంధనలను తుంగలో తొక్కి.. ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్లైన్ విధానం అమలులో ఉన్నప్పటికీ.. కావాలనే హార్డ్ కాపీల విధానాన్ని తెరపైకి తెచ్చి.. ఈ భారీ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్..
మున్సిపల్ పరిధిలోని 3-5-128 ఇంటి నంబర్‌పై సమిండ్ల మల్లయ్య పేరుతో రికార్డులు ఉన్నాయి. ఈ ఇంటికి 2011-12 నుంచి 2026-27 వరకు రూ.52,356 ఆస్తి పన్ను బకాయి ఉంది. అయితే, ఈ ఇంటిని మ్యూటేషన్ ద్వారా విభజించి.. మల్లయ్య వారసులైన రాజేష్, గంగరాజంల పేరిట గత జూన్ 25న పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆన్లైన్లో భారీగా పన్ను బకాయిలు చూపిస్తున్నప్పటికీ.. ఈ మ్యూటేషన్ ప్రక్రియ ఎలా పూర్తయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సదరు భవనం 40 ఏళ్ల నాటిదని పేర్కొంటూ.. పన్ను మినహాయింపు ఇచ్చినట్లు ఒక నకిలీ హార్డ్ కాపీని సృష్టించారు.
గుట్టురట్టు చేసిన కమిషనర్..
2019 నుంచి ఇండ్ల అసెస్మెంట్ రికార్డులను ఆన్లైన్లో పరిశీలించి.. ఆమోదించే స్మార్ట్ విధానం అమలవుతోంది. కానీ, ఇటీవల రిజిస్ట్రేషన్ల కోసం హార్డ్ కాపీలు కూడా సమర్పించాలనే కొత్త నిబంధనను అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే సదరు ఇంటి యజమానికి సంబంధించిన హార్డ్ కాపీని రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది మున్సిపల్ కమిషనర్‌కు చూపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కాపీపై ఉన్న సంతకం తనది కాదని కమిషనర్ గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆన్లైన్ విధానాన్ని పక్కనబెట్టి.. హార్డ్ కాపీల ప్రతిపాదన ఎందుకు తెచ్చారని జిల్లా ఉన్నతాధికారులు సైతం మున్సిపల్ యంత్రాంగాన్ని ప్రశ్నించినట్లు సమాచారం.
డాక్యుమెంట్ రైటర్ల హస్తం..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్ల పాత్రపై బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలకు అలవాటుపడి.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఇంటి యజమానులు ఒక ప్రముఖ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులు కావడంతో ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఇంటి విషయంలోనే కాకుండా.. మరికొన్ని ఇండ్ల విషయంలోనూ ఇలాగే ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు జరిగాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
పోలీసు ఫిర్యాదుకు సిద్ధమైన కమిషనర్..
తన సంతకాన్ని ఫోర్జరీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మున్సిపల్ కమిషనర్.. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్మార్ట్ సిస్టమ్‌ను కాదని.. అక్రమార్కులకు వరంగా మారిన హార్డ్ కాపీల విధానాన్ని తీసుకురావడం వల్లే ఈ అక్రమాలు జరిగాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో 4,098 టెక్నికల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Hyderabad, Telangana:Railway 4,908 Jobs Recruitment: చాలా కాలంగా రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల 21వ తేదీ ఎంతో కీలకమైనది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలోని 4908 సాంకేతిక ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్ మెటల్ అసిస్టెంట్ వంటి పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో పెర్మనెంట్ విభాగంలో 845, వర్క్స్ విభాగంలో 470, క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగంలో 450 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ఖాళీల వివరాలతో కూడిన సర్క్యులర్‌ను సంబంధిత రైల్వే జోన్లకు పంపింది. అంతర్గత హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆధారంగా ఈ పోస్టుల నియామక ప్రక్రియ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం, నోడల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
అంతేకాకుండా, బెంగళూరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌తో సంప్రదించిన కేంద్ర మంత్రిత్వ శాఖ, నియామకాల కాలపరిమితిని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం నోటిఫికేషన్‌కు సంబంధించిన అంతర్గత చర్యలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాను అంతర్గత వ్యవస్థలో అప్లోడ్ చేసే ముందు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. మరోవైపు, ఇటీవల 6,565 టెక్నీషియన్ పోస్టుల నియామకానికి కూడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 323 పోస్టులు సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్-1 కి, 6,242 పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్-3 కి సంబంధించినవి.
వివిధ రైల్వే యూనియన్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన విభాగాల్లో పోస్టుల భర్తీ చేయడం వల్ల ఆపరేషనల్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, ప్రస్తుత సిబ్బందిపై పని భారం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నారా? IBPS నుంచి 7400 పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్!
Also Read: బ్యాంక్ ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్, రూ.48,000 జీతంతో ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్!
ఈ సందర్భంగా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరల్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మాట్లాడుతూ, లక్షలాది మంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిన రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తాను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, 197 జూనియర్ ఇంజినీర్ (సిగ్నల్), 79 జూనియర్ ఇంజనీర్ (టెలి కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం 4908 సాంకేతిక పోస్టులు ప్రధాన రైల్వే జోన్ల పరిధిలోకి వస్తాయి.
ఈ ఉద్యోగాలకు పే లెవల్-6 వర్తిస్తుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ. 35,400 నుండి ప్రారంభమవుతుంది.. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. రైల్వే ఉద్యోగాల్లో లభించే సౌకర్యాలతో పాటు, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆర్ఆర్బీ (RRB) వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించి సమర్పించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. వరంగల్‌లో విషాదం!
Hyderabad, Telangana:Pawan Kalyan Fan Niranjan Passes Away: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీర అభిమాని నిరంజన్ (17) మృతి చెందడం అత్యంత బాధాకరం. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో కలిసి 'ఓజీ 2' సినిమా చూద్దామని కూడా ఇద్దరూ ముచ్చటించిన సంగతి తెలిసిందే. కానీ, ఈరోజు ఉదయం అనారోగ్యం మరింత ఎక్కువ కావడంతో ఆయన మరణించారు. వరంగల్‌కు చెందిన పవన్ అభిమాని నిరంజన్ అరుదైన జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆయనను కలిసి, బహుమతులు అందిస్తూ కాసేపు సమయం గడిపారు. ఎన్నో ఏళ్లుగా తన అభిమాన నటుడిని కలుసుకోవాలనే నిరంజన్ కలని, పవన్ కళ్యాణ్ స్వయంగా వరంగల్‌కు వెళ్లి నెరవేర్చారు. హనుమకొండలోని హనుమ నగర్లో నివసించే ఈ వీరాభిమానిని పవన్ పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన నిరంజన్ను పవన్ కలవడంతో ఆ ప్రాంతమంతా ఉత్సాహంగా మారింది. పవన్ కళ్యాణ్‌ను చూడటానికి స్థానిక ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి కేరింతలు కొట్టారు. అయితే, అంతలోనే అభిమాని మరణించాడనే వార్త తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురై విషాదంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు అందిస్తాం.
2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం: ఆయిల్ పామ్ రైతులతో కేటీఆర్
Bhupalpally, Telangana:2028 CM Is KCR: మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2028లో అవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని.. మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం ఫలితాలను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
రైతులతో సమావేశం జరిగిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దూరదృష్టితో రూపొందించిన లక్ష్యం. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్. ఈ పంటకు కేసీఆర్ హయాంలో ప్రోత్సాహాన్ని అందించాం' అని కేటీఆర్ వివరించారు.
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు ఉంది . ప్రస్తుతం దాదాపు 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కొనసాగితే అది ఏడు లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది' అని కేటీఆర్ వివరించారు. 'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్ పామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై అధిక రాయితీలు అందించి యాంత్రీకరణను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. పంట పూర్తిస్థాయిలో ఎదిగిన తర్వాత అవసరమయ్యే రెండో దశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
'ప్రపంచ స్థాయి ఆయిల్ పామ్ సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేలా మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలను నిర్వహిస్తాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 'కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తూ రైతుల పంటలను ఎండబెడుతున్నారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
'ఇంట్లో ఒక చోట చిన్న లీకేజీ వచ్చిందని మొత్తం ఇంటినే కూల్చేస్తారా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక భాగంలో సమస్య తలెత్తిందనే కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, నిలువ పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. '2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తాం' అని కేటీఆర్ తెలిపారు.
స్టూడెంట్ నోటిలో పెన్ను క్యాప్ తోసిన విద్యార్థినులు
Kagaznagar, Telangana:School Friends Throws Pen Cap Into Mouth In Kagaznagar Gurukul Watch Videoతెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
Secunderabad, Telangana:Balamrutham New Plant: 'ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. 3 కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నాం. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించాం. 2034లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.
హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగింది. ఇవాళ నూతన బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.
'ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు. గర్బిణీ ఆడబిడ్డలకు పౌష్టిక ఆహారం అందించాలనే బాలామృతం కొత్త ప్లాంటు ప్రారంభించుకున్నాం. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను తీసుకొచ్చామని.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామని వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓటు బ్యాంకు పథకాలు కాదు.. విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'పిల్లల భవిష్యత్తే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. పేద పిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకు నాణ్యమైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
'ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల్లో ఆనందం ఉంటుంది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు ఆరు సంవత్సరాల వరకు బలవర్థకమైన పోషకాహారం పేద పిల్లలకు ఇవ్వాలనే ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విధానం లేదు. పట్టణాల్లో వలస వచ్చిన వారి పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. పేదలు తాము సంపాదించిందంతా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి' అని ఆవేదన వ్యక్తం చేశారు.
'హైదరాబాద్ నగరంలో భూముల ధరలు వజ్రాల ధర పలుకుతున్న పరిస్థితుల్లో నిరుపేదల కోసం లక్ష ఇండ్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు' తెలంగాణ సీఎం ప్రకటించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు వ్యాపార రంగంలో విస్తరించడానికి అన్ని రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
Polavaram, Andhra Pradesh:Polavaram Project: మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు పోటెత్తుతోంది. ఈ ఏడాది సీజన్లోనే తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరింది. అటు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 26.80 మీటర్లుగా నమోదైంది.
వరద ఉధృతి క్షణక్షణానికి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వేలో ఉన్నటువంటి మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఒకేసారి 48 గేట్లను ఎత్తేయడం ఇదే తొలిసారి. స్పిల్ ఛానల్ మీదుగా ప్రవాహం అత్యంత భీకరంగా సాగుతుండగా.. ఈ ఉధృత ప్రవాహానికి కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతోపాటు నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూరలు, ఐరన్ పైపులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో స్పిల్ ఛానల్ కింద నుంచి పనుల కోసం వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతానికి కేవలం స్పిల్‌వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వరద ప్రభావం ఆ పనులపై పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లీకేజ్ లేదా సీపేజ్ నీటిని తోడేందుకు డీ-వాటరింగ్ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.
'పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో కూటమి ప్రభుత్వం సరికొత్త వేగాన్ని అందుకుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం' అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
'గొడ్డలి పార్టీ విధ్వంసకర పాలనలో సర్వనాశనమైన పోలవరాన్ని మళ్లీ తాము గాడిలో పెట్టాం' అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతం పనులు మాత్రమే చేస్తే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ రెండు ఏళ్లలోనే ఏకంగా రూ. 6,970 కోట్లు ఖర్చు చేసి 15 శాతం పనులు పూర్తి చేసిందని గణాంకాలతో సహా వివరించారు. ధ్వంసమైన పాత డయాఫ్రం వాల్ స్థానంలో కేవలం 440 రోజుల్లోనే రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించి రికార్డు సృష్టించామని వెల్లడించారు.
'ఏడాది కాలంలోనే మెయిన్ డ్యామ్ గ్యాప్-1 పనులు 48 శాతం, గ్యాప్-2 పనులు 29 శాతం పూర్తి చేశాం. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ, పలుమార్లు ఢిల్లీ పర్యటనలతోనే కేంద్రం నుంచి నిధులు త్వరితగతిన మంజూరవుతున్నాయి' అని మంత్రి రామనాయుడు వివరించారు. 2027లో పోలవరం పూర్తయ్యే నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ ప్రక్రియను కూడా వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఏపీ జీవనాడీ అయిన పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరంపై CBI విచారణ ఎందుకు ఆపారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బహిరంగ సవాల్..
Hyderabad, Telangana:Minister Adluri Laxman Kumar News: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ రెండు వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఒకటయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండాలో మంగళవారం నిర్వహించిన బంజారాల సాంప్రదాయ శీత్ల పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు..
కాళేశ్వరం తీర్మానంపై కేంద్రం మౌనం ఎందుకు?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాలని స్పష్టమైన నిర్ణయంతో ఉందని మంత్రి మీడియా ముందు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపి.. ఇన్ని రోజులవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని..? కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కేవలం ప్రగల్భాలు పలుకుతూ.. ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. నిజంగా అవినీతిని వెలికితీయాలనే.. చిత్తశుద్ధి వారికి లేదన్నారు.
కిషన్ రెడ్డికి దమ్ముంటే ఆ పని చేయాలి...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాళేశ్వరం సీబీఐ విచారణ ఫైలుపై వెంటనే సంతకం చేయించి విచారణకు ఆదేశించాలని.. మంత్రి సవాల్ విసిరారు. కేంద్రం తక్షణమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే.. బీజేపీ, BRS వేర్వేరు పార్టీలని తాము భావిస్తామని.. లేనిపక్షంలో ఆ రెండు పార్టీలు ఒకటేననే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చడానికే కేంద్రంలోని BJPప్రభుత్వం కాలేశ్వరం దర్యాప్తును తొక్కిపెడుతోందని మంత్రి ఆరోపించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
గిరిజన సంస్కృతికి పెద్దపీట..
రాజకీయ విమర్శల అనంతరం మంత్రి లంబాడి తండాలో జరిగిన శీత్ల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలంగాణకు గర్వకారణమని, తండాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
కుడాలో భారీ కుంభకోణం.. వరంగల్‌లో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడుతోంది: బీఆర్ఎస్ పార్టీ
Warangal, Telangana:KUDA Scam: 'తెలంగాణలోనే రెండో పెద్ద నగరం వరంగల్‌లో భారీ అవినీతి జరుగుతోందని.. కుడాకు చెందిన అత్యంత ఖరీదైన స్థలాలు అప్పనంగా విక్రయించుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు' అని మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.70 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటనే రేవంత్ రెడ్డి కుడా టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు అవినీతి పెరిగిపోయింది. కాంగ్రెస్ వాళ్లు హౌలే మాటలు మాట్లాడుతూ గలీజు పనులు చేస్తున్నారు. కుడా (కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ)లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది' అని మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తోడు దొంగలు రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
'కుడా స్థలాలను అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల అవినీతి కుడాలో జరిగింది. దేవుడి భూమి 5 ఎకరాల స్థలాన్ని స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుడా ఆధ్వర్యంలో కుంటలను కబ్జాలు చేసి బిల్డర్లకు కట్టబెడుతున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపణలు చేశారు. హెచ్‌సీయూలో మాదిరి వరంగల్‌లో అదే విధంగా చేస్తున్నారని తెలిపారు. 'వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారు. రాజేందర్ రెడ్డి నాలుగు ఫీట్లు ఉంటారు.ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుడా టెండర్లను రేవంత్ రెడ్డి రద్దు చేయాలి' అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో రాజేందర్ రెడ్డి గూండాలతో దాడి చేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ.. 'కుడా స్థలాలను వేలం పెట్టి విలువైన భూములను తమ వారికి ఇప్పించుకున్నారు. రెండున్నర ఎకరాల ప్రైమ్ ల్యాండ్ అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి కుడాకు అప్పగించారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ 8 ప్లాట్లుగా చేసి వేలం పెట్టారు. గజం రూ.65 వేలకు ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిండికేట్ ఏర్పాటు చేసి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు' అని ఆరోపించారు.
'6,697 గజాలను వేలంలో పెట్టారు.100 కోట్ల ఆదాయం కుడాకు రావాలి.కానీ 49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. నర్సంపేట రోడ్డులో కమర్షియల్ ఫ్లాట్ కు గజం రూ.85 వేలు నిర్ణయించారు. కుడాకు రూ.70 కోట్ల నష్టం చేశారు' అని కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి వివరించారు. కుడా చైర్మన్‌గా నేను ఉన్నప్పుడు ఒక్క గజం తక్కువ రేటుకు విక్రయించలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తోడేళ్లలా దోచుకుంటున్నారని ఆరోపించారు. కుడా వేలాన్ని రద్దు చేసి ఆన్ లైన్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలని మర్రి యాదవ రెడ్డి డిమాండ్ చేశారు.
''గజం రూ.70 వేలు ఇవ్వడానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎవరు? కుడా ఏమైనా రాజేందర్ రెడ్డి సొంత స్థలమా? కుడాపై రాజేందర్ రెడ్డికి ఏం అధికారం ఉంది?' అని కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వరంగల్ పశ్చిమలో ఒక్క ఇంచు అభివృద్ధి జరగలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన కుడా అభివృద్ధిపై చర్చకు సిద్దమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులకు సవాల్ చేశారు.
