Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Sept 13, 2024 07:18:03
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా సజ్న షఫీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కే.సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్ కే.సుభాన్ పాష ,కోశాధికారిగా కే.నవీన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలిసి మెలసి పనిచేసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Jan 13, 2026 05:16:16
Lakshmapur, Telangana:

EPFO  Pension Calculation: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఈ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్ కు క్రమం తప్పకుండా చందా చెల్లించాలి. PFలో జమ అయ్యే మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తే.. మరో భాగాన్ని యజమాని చెల్లిస్తారు. యజమాని చెల్లించే మొత్తంలో ఒక భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కు వెళ్తుంది. ఈ EPSలో జమ అయ్యే మొత్తమే భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే పెన్షన్‌ను నిర్ణయిస్తుంది.

అయితే ప్రస్తుతం EPFO వేతన పరిమితి రూ. 15,000గా ఉంది. అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పీఎఫ్, ఈపీఎస్ లెక్కింపు గరిష్టంగా రూ. 15,000 ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ గా కట్ అవుతుంది. వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల EPSలో చేరే చందా కూడా పరిమితమవుతోంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటోంది. ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, EPFOకు ఆదేశాలు ఇవ్వడంతో వేతన పరిమితిని రూ. 30,000కి పెంచే అవకాశంపై చర్చ జరుగుతోంది.

Also Read: Switzerland VS Indian Rupee: మన బడాబాబులు డబ్బులు దాచుకునే దేశంలో.. భారత కరెన్సీ విలువ ఎంతో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు..!!

ప్రస్తుతం EPS కింద ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 1,000గా ఉండగా, గరిష్టంగా నెలకు రూ. 7,500 వరకు అందుతోంది. అయితే వేతన పరిమితిని రూ. 30,000కు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది. పెన్షన్ లెక్కింపు కోసం EPFO ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది.

పెన్షన్ లెక్కింపు సూత్రం:
పెన్షన్ పొందదగిన జీతం × పెన్షన్ పొందదగిన సేవా కాలం / 70

ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఉద్యోగి చివరి 60 నెలల ప్రాథమిక జీతం, డీఏ సగటు. ప్రస్తుతం ఇది రూ. 15,000కే పరిమితం అవుతుంది. పెన్షన్ పొందదగిన సర్వీసు కాలం అంటే ఉద్యోగి ఎంత సంవత్సరాలు EPSకు చందా చెల్లించాడన్నది. గరిష్టంగా 35 సంవత్సరాల వరకు పరిగణిస్తారు.

Also Read:  Gold Reserves: ఈ 4 జిల్లాల్లో బంగారు నిధి.. అక్కడికి వెళ్తే మీ పంట పండినట్లే..కావల్సినంత తవ్వుకోవచ్చు..!!

అయితే వేతన పరిమితి రూ. 30,000కు పెరిగితే, ఈ సూత్రం ప్రకారం పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అంచనాల ప్రకారం, అప్పుడు గరిష్ట పెన్షన్ రూ. 15,000 వరకు చేరే అవకాశం ఉండగా, కనీస పెన్షన్ కూడా సుమారు రూ. 4,285 వరకు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మరింత బలోపేతం చేయనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 13, 2026 04:22:31
Dhamsalapuram, Telangana:

France Groom Weds Khammam Bride: ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు.. రెండు మనస్సులు. స్వచ్ఛమైన ప్రేమయితే ఎల్లలు ఏమిటి? ఖండాంతరాలు కూడా దాటుతుందని ఈ రెండు మనస్సులు నిరూపించాయి. మనస్సులు కలిసిన అక్కడ అబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను కూడా ఖండాంతరాలు దాటేలా చేసి అంగీకరించి పెళ్లిగా ఒక్కటై తమ స్వచ్ఛమైన ప్రేమను చాటారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై భారీ షాక్‌.. బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌ పేమెంట్

ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లోని ఓ కల్యాణ మండపంలో ప్రాన్స్ దేశానికి చెందిన అబ్బాయికి భారతదేశానికి చెందిన అమ్మాయికి భారత క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం జరిగింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పెళ్లికుమారుడి కుటుంబసభ్యులతో తెలుగు పెళ్లి మండపం నిండిపోయింది. తెలంగాణ జానపద డీజే పాటలకు మన వాళ్లతో కలిసి ఫ్రాన్స్‌ చుట్టాలు స్టెప్పులేశారు. పెళ్లి ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఈ వేడుక చూడముచ్చటగా కొనసాగింది.

Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జినక వెంకన్న, ఎల్లమ్మ కుమార్తె ప్రశాంతి ఉన్నత చదువుల కోసం ప్రాన్స్ దేశానికి వెళ్లింది. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రాన్స్ దేశానికి కాపిటల్ సిటీ అయిన పారిస్ పట్టణానికి దగ్గరలో గల నాథన్ అనే ప్రాంతానికి చెందిన నాథన్ క్రిస్టోఫ్ జూబర్ అనే ప్రాన్స్ అబ్బాయితో స్నేహం కుదిరింది. కాలక్రమేణ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రెండు దేశాల సంప్రదాయాలు, అభిరుచులు వేరైనప్పటికీ వారిద్దరినీ ప్రేమ పెళ్లితో ఒక్కటి చేసింది. ఇక్కడమ్మాయి, అక్కడబ్బాయి పెద్దలను ఒప్పించి ఖండాంతరాలు దాటించి పెళ్లి చేసుకున్న తీరు ఇరు కుటుంబాలతోపాటు పెళ్లికి వచ్చిన వారందరినీ సంతోష పరిచింది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు చూసి ఫ్రాన్స్‌ కుటుంబాలు అవాక్కయ్యారు. ఈ వార్త వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 13, 2026 04:16:01
Lingoji Guda, Telangana:

Panthangi Toll Plaza: సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారి వాహనాలతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే శని, ఆదివారాలు పెద్ద సంఖ్యలో వెళ్లగా సోమవారం కూడా వాహనదారులు పెద్ద ఎత్తున వెళ్లారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. సంక్రాంతి పండగ సందర్బంగా విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున స్వగ్రామాల బాట పట్టడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పంతంగి టోల్ ప్లాజాల వద్ద తెల్లవారుజామున నుంచి ఒక్కసారిగా ఎక్కువ వాహనాలు రావడంతో 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read: Telangana Sankranti Gift: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు.. పండుగకు ఏం ప్రకటించిందో తెలుసా?

పంతంగి టోల్ ప్లాజా వద్ద   మొత్తం 16 టోల్ బూత్‌లలో విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల కోసం 11 టోల్ బూత్‌లను అధికారులు తెరిచారు. దీంతో వెంటనే టోల్‌ ఫీజు చెల్లించి వాహనదారులు వెళ్తున్నారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ఆరు బూత్‌లను తెరచిన అధికారులు విజయవాడ వైపు త్వరగా వాహనాలు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తూ వాహనాలు త్వరగా వెళ్లేందుకు చేస్తున్నారు.

Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల

వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో పంతంగి కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది హ్యాండ్ స్కానర్ల సహాయంతో వేగంగా టోల్ వసూలు చేస్తూ వాహనాలను పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఐదు రోజులుగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సుమారు ఆరు లక్షల యాభై వేల వాహనాలు రాకపోకలు జరిగినట్లు సమాచారం. అంటే లక్షల సంఖ్యలో ప్రజలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే ధోరణి మంగళవారం కూడా పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుండడంతో టోల్‌ సిబ్బందిని పెంచి వేగంగా వాహనాలు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Also Read: Cyber Fraud: మారుమూల పల్లెలో రూ.547 కోట్ల సైబర్‌ క్రైమ్‌.. ఏం జరిగిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 13, 2026 03:58:02
Lakshmapur, Telangana:

Gold Rate Today: జనవరి 13వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,30,700కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగి, కిలో వెండి రూ.2,66,903గా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి చరిత్రాత్మక రికార్డులను నమోదు చేశాయి. తొలిసారిగా బంగారం ఒక ఔన్స్ ధర 4,600 డాలర్లను దాటి ముందుకు సాగింది. అలాగే వెండి ధర కూడా ఒక ఔన్స్‌కు 85 డాలర్ల స్థాయిని దాటి ఆల్‌టైమ్ హైని తాకింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోం పావెల్‌పై క్రిమినల్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం వల్ల ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూఎస్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. డౌజోన్స్ సూచీ ఒక దశలో భారీ నష్టాలను చవిచూసినా, చివరకు పెట్టుబడిదారుల కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Also Read: Switzerland VS Indian Rupee: మన బడాబాబులు డబ్బులు దాచుకునే దేశంలో.. భారత కరెన్సీ విలువ ఎంతో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు..!!

అయితే ఈ పరిస్థితులన్నీ బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచాయి. జనవరి మొదటి తేదీ నుంచి ఇప్పటివరకు బంగారం ధర దాదాపు రూ.15 వేల వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు ఇంతగా పెరగడంతో బంగారు ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. అత్యవసరం ఉన్నప్పుడు తప్ప సాధారణ వినియోగదారులు నగలు కొనుగోలు చేయడం లేదని జువెలరీ వ్యాపారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా, ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు చేపట్టే అవకాశాలపై సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే బంగారం, వెండిపై డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా ఎగబాకే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

Also Read:  Gold Reserves: ఈ 4 జిల్లాల్లో బంగారు నిధి.. అక్కడికి వెళ్తే మీ పంట పండినట్లే..కావల్సినంత తవ్వుకోవచ్చు..!!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 12, 2026 16:40:12
Amaravati, Andhra Pradesh:

Govt Employees Sankranti Gift: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ వరాలు ప్రకటిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులతోపాటు కాంట్రాక్టర్లకు కూడా శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రకటనలు చేయగా.. తాజాగా కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ బిల్లులను క్లియర్‌ చేసేసింది. కరువు భత్యం, డీఆర్‌తోపాటు అనేక పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులను కూడా విడుదల చేసి వారి కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Telangana Sankranti Gift: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు.. పండుగకు ఏం ప్రకటించిందో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా డీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీఏకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. డీఏ, డీఆర్‌ ఏరియర్స్‌ విడుదల చేయాల్సి ఉండగా కొన్ని నెలలుగా బకాయి పడ్డాయి. తాజాగా డీఏ, డీఆర్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.1,100 కోట్ల నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల కుటుంబాల్లో పండుగ ఆనందం వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వివిధ రకాల బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లపై భారీ షాక్‌.. బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌ పేమెంట్‌

ఇక ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన బిల్లులకు రూ.2,653 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్‌ లీవులకు రూ.110 కోట్ల నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈఏపీ, నాబార్డ్‌, సాస్కీ, సీఆర్‌ఐఎఫ్‌ పనులకు రూ.1,243 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకంఉది. ప్రభుత్వంలో ఎవరిరెవరికి బకాయి పడిందో వారందరికీ ఏపీ ప్రభుత్వం చెల్లింపులు చేసేసి వారందరికీ పండుగ గిఫ్ట్‌ అందించింది. ఈ బిల్లుల చెల్లింపుతో ఏపీలో మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరనుండడం విశేషం 

Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల

నిధుల మంజూరు ఇలా..

డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,100 కోట్లు

పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు

ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ.1,243 కోట్లు

కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు రూ.2,653 కోట్లు

బిల్లుల చెల్లింపుతో లబ్ధి పొందే కుటుంబాలు: 5.7 లక్షల మంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 12, 2026 16:00:53
Hyderabad, Telangana:

Traffic Challan Auto Debit: ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు పేరుకుపోతుండడంతో ఇకపై వాటి పరిష్కారానికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెండింగ్‌ చలాన్లు ఇక ఉండకూడదని.. వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించారు. చలాన్‌ పడితే ఆటోమేటిక్‌గా వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రకటన వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: Telangana Sankranti Gift: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు.. పండుగకు ఏం ప్రకటించిందో తెలుసా?

హైదరాబాద్‌లో జరిగిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్ల చెల్లింపులు ఆటోమేటిక్‌గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు అయ్యేలా చర్యలు తీసుకోవాలి' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'ట్రాఫిక్ వ్యవస్థ ఆరో వేలుగా తయారైంది.. ఈ విధానాన్ని మార్చాలీ . సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి' అని సూచించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల

ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని తెలంగాణ సీఎం చెప్పారు. 'దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం. ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వివరించారు.

Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు

'డ్రగ్స్ మహమ్మారి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. డ్రగ్స్, గంజాయిని నియంత్రణలో తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కింది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు హైడ్రా ను ఏర్పాటు చేసుకున్నాం. చెరువులను పునరుద్ధరించుకుని పతంగుల పండుగ జరుపుకుంటున్నాం' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 12, 2026 11:04:14
Salat, Uttar Pradesh:

School Holiday Tomorrow: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15, 2026న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది.

గతంలో ఈ పండుగను జనవరి 14న జరుపుకుంటారా లేక 15న జరుపుకుంటారా అనే దానిపై గందరగోళం నెలకొంది. కానీ కొత్త ఉత్తర్వు ఇప్పుడు తేదీని ధృవీకరించింది. ఈ ప్రకటనతో, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 15న మూసివేత కానున్నాయి.

గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో మకర సంక్రాంతిని ఆప్షనల్ హాలీడేగా పరిగణించేవారు. అంటే ఉద్యోగులు ఆ రోజు సెలవు తీసుకోవాలా వద్దా అని ఎంచుకోవచ్చు. ఇప్పుడు, దీనిని ప్రభుత్వ సెలవుదినంగా మార్పు చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులకు పూర్తి విశ్రాంతి దినాన్ని అందిస్తుంది.

సచివాలయం, కలెక్టరేట్, విద్యా సంస్థల వంటి ప్రభుత్వ విభాగాలకు కూడా సెలవు ఉండనుంది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో కలిసి పండుగను జరుపుకోవడానికి అవకాశం లభిస్తుంది.

పండుగలో భాగంగా, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్పూర్, మీరట్, ఉన్నావ్, బిజ్నోర్ వంటి ప్రధాన నగరాల్లోని గంగా ఘాట్లను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారని భావిస్తున్నారు. ప్రజలు గంగా, సరయూ వంటి నదులలో పవిత్ర స్నానాలు చేసి, దానధర్మాలు, ప్రార్థనలు చేస్తారు. రిషికేశ్, హరిద్వార్‌లలో కూడా ఇలాంటి జనసమూహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రజలు పవిత్ర జలాల్లో స్నానం చేసి ఆశీస్సులు పొందుతారు.

మకర సంక్రాంతి ప్రాముఖ్యత
మకర సంక్రాంతి ఒక ముఖ్యమైన హిందూ పండుగ, ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఉత్తరాయణం అని పిలువబడే ఈ మార్పు, పగటి సమయం ఎక్కువ ఉండే, ప్రకాశవంతమైన రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ ఖర్మాసాల ముగింపును కూడా సూచిస్తుంది. ఆ తర్వాత వివాహాలు, కొత్త వ్యాపారాలు వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.

ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేయడం, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం, స్వచ్ఛత మరియు మంచి ఆరోగ్యానికి ప్రతీకలైన నువ్వులు, బెల్లం వంటకాలను తినడం ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు.

ఉత్తర భారతదేశంలో ఈ పండుగను మకర సంక్రాంతి అని పిలిచినప్పటికీ, ఇతర రాష్ట్రాలలో దీనికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. తమిళనాడులో దీనిని పొంగల్ గా, పంజాబ్‌లో లోహ్రీగా, అస్సాంలో మాఘ్ బిహుగా జరుపుకుంటారు.

Also Read: 1 Rupee Recharge Plan: సంక్రాంతి ధమాకా ఆఫర్..కేవలం రూ.1కే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచితంగా ఇంటర్నెట్..కొన్ని రోజులు మాత్రమే!

Also Read: EPF ATM Withdrawal: ఉద్యోగులకు శుభవార్త..UPI, ATM ద్వారా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా..ఆ రోజు నుంచే అందుబాటులోకి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
HDHarish Darla
Jan 12, 2026 09:54:15
Hyderabad, Telangana:

Washington Sundar Ruled Out Of ODI Series: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన వన్డే సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా ధృవీకరించింది.

అసలేం జరిగింది?
వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ ఎడమ పక్కటెముకల భాగంలో తీవ్రమైన నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలో మరిన్ని స్కాన్‌లు నిర్వహించి నిపుణుల సలహా తీసుకోనున్నారు.

జట్టులోకి కొత్త కుర్రాడు..
వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆయుష్ బదోనీకి తొలిసారిగా భారత వన్డే జట్టులో చోటు లభించింది. బుధవారం రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే నాటికి బదోనీ జట్టుతో చేరనున్నారు. యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా టాప్ ఆర్డర్ తడబడినా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కింగ్ కోహ్లీ కేవలం 91 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గట్టి పునాది వేశారు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందన
మ్యాచ్ అనంతరం కెప్టెన్ గిల్ బ్యాటర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. "ముఖ్యంగా ఛేజింగ్‌లో జట్టుకు సహకారం అందించడం గొప్పగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ ఈ పిచ్‌పై బ్యాటింగ్ ప్రారంభించడం కొంచెం కష్టమే. కోహ్లీ ఇలాగే పరుగులు సాధిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను" అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నారు.

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో, ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే అందరికీ అవకాశం కల్పించేందుకు జట్టులో మార్పులు (రొటేషన్) చేస్తున్నామని గిల్ స్పష్టం చేశారు. అందుకే సిరాజ్, అర్ష్‌దీప్ వంటి బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: EPF ATM Withdrawal: ఉద్యోగులకు శుభవార్త..UPI, ATM ద్వారా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా..ఆ రోజు నుంచే అందుబాటులోకి!

Also Read: 1 Rupee Recharge Plan: సంక్రాంతి ధమాకా ఆఫర్..కేవలం రూ.1కే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచితంగా ఇంటర్నెట్..కొన్ని రోజులు మాత్రమే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top