అక్రమ నిర్మాణాలపై డివిజన్ రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూడ గ్రామం ఇందిరమ్మ కాలనీ వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాలను మండల రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. కూల్చివేత సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేయడం చట్ట విరుద్ధమని, అక్రమంగా నిర్మించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు
Mahbubnagar, Telangana:BJP Leaders DK Aruna Bandi Sanjay And N Ramachander Rao Hosts National Flag And Starts Har Ghar TirangaNational Flag: హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
Hyderabad, Telangana:N Ramachander Rao Hosts National Flag In His Residence For Har Ghar TirangaYSRCP vs TDP: డీఎస్సీపై వైఎస్సార్సీపీ పోరాటం.. వేడెక్కిన ఏపీ రాజకీయం
Kanagumakulapalli, Andhra Pradesh:Political Heat In Andhra Prdesh On DSC Corruption YSRCP Protest ContinuesPeddi: డీసీఎం పైనుంచి కింద పడిపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి కాపాడాడు: హరీశ్ రావు భావోద్వేగం
Nallabelli, Telangana:Harish Rao Emotional Speech: నాడు ఉద్యమంలో నాకు దెబ్బ తగిలితే ఏ ఆసుపత్రిలో చేర్పించాడో.. అదే ఆసుపత్రిలో పెద్దిని విగతజీవిగా చూస్తానని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం, ముఖ్యంగా నర్సంపేటకు మెడికల్ కాలేజీ, దేవాదుల నీళ్లు సాధించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిదేనని ప్రకటించారు. ప్రాణాలు, ఆస్తులు లెక్కచేయకుండా సమైక్యవాదులను ఎదిరించిన నిస్వార్థ పోరాట యోధుడు, గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.
జ్ఞాపకాలు పదిలం
నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పెద్ది కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం భావోద్వేగ ప్రసంగం చేశారు. పెద్ది భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలం.. ఆయన కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో నాకు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఉపఎన్నికల్లో నేను పనిచేశాను.
భౌతికంగా సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య… pic.twitter.com/Rvy9eo8iMT
— Harish Rao Thanneeru (@BRSHarish) August 10, 2026
రెండున్నర దశాబ్దాల అనుబంధం
'పెద్ది సుదర్శన్ రెడ్డితో నాకు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఉప ఎన్నికల్లో నేను పనిచేశా. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు ఏవీ లెక్కచేయకుండా పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మానుకోట సంఘటన, పరకాల, స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికలు ప్రతి చోటా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాట స్ఫూర్తి, ఆయన కష్టం ముందుండేది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
అభివృద్ధి కోసం ఎంతో తపన
సమైక్యవాదులు తెలంగాణ గడ్డ మీద అడుగుపెడుతుంటే వారి బుల్లెట్లను, రాళ్లను కూడా లెక్కచేయకుండా ముందుండి అడ్డుకున్న పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు రాష్ట్ర సాధన కోసం పోరాడాడు.. రాష్ట్రం వచ్చాక నర్సంపేట అభివృద్ధి కోసం ఎంతో తపన పడ్డాడని తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించిన కేసీఆర్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లను అందించాలని కేసీఆర్‌ను కోరి మరి సాధించాడని మాజీ మంత్రి హరీశ్ రావు జ్ఞాపకం చేసుకున్నారు. పెద్ది అభ్యర్థన మేరకే కేసీఆర్ ఆనాడు దేవాదుల నీటిని విడుదల చేశారని చెప్పారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉద్యమ పోరాటాలు, ప్రజాసేవలు ఎప్పటికీ చిరస్మరణీయం.
తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లోని అమర వీరుల స్తూపం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో నాకు దెబ్బ తగిలినప్పుడు..
నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని, అదే ఆసుపత్రిలో చివరి చూపు చూస్తానని… pic.twitter.com/j7c3Xlx5DN
— BRS Party (@BRSparty) August 10, 2026
రాత్రింబవళ్లు తండ్లాడాడు
'చెరువులకు దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది ముమ్మాటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి కృషే. తన ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకోవాలని రాత్రింబవళ్లు తండ్లాడాడు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందించాడు. రాష్ట్రంలో జిల్లా కేంద్రం కాని చోట మెడికల్ కాలేజీ సాధించిన ఏకైక నియోజకవర్గం నర్సంపేట. కేసీఆర్ ఆలోచనతోపాటు ఈ ప్రాంతం మీద పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
అదే చివరి కార్యక్రమం
కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తే దానికి వ్యతిరేకంగా చేసిన నిరసనే నేను, పెద్ది కలిసి చేసిన చివరి కార్యక్రమం అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అదే మా ఇద్దరి కలయికలో చివరిది అవుతుందని తాను కలలో కూడా అనుకోలేదని గుర్తుచేసుకున్నారు. 'గతంలో మేమిద్దరం బియ్యాల జనార్దన్ సార్ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్లం. నేను, పెద్ది దాదాపు నెల 40 రోజుల పాటు ఆ ఇంట్లో కలిసి ఉన్నాం. పరకాల, ఘనపూర్ ఉపఎన్నికల సమయంలో బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని గెలిపించుకున్నాం. అప్పుడు ఆయనకు అన్నం, నిద్ర, ఆకలి అనేవే ఉండేవి కావు' అని పెద్దితో ఉన్న అనుబంధాన్ని హరీశ్ రావు వివరించారు.
ప్రతిక్షణం తపన
'మాకు తెలంగాణ కావాలి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవాలని ప్రతిక్షణం తపనపడ్డ గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి నాయకుడిని కోల్పోవడం కేవలం నర్సంపేటకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు' అని హరీశ్ రావు ఆవేదన చెందారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని మీటింగ్‌లో అది కూడా నర్సంపేట గడ్డ మీద నేను పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదని కంటతడి పెట్టారు.
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒక అమరవీరుడి అంతిమ యాత్రలో పాల్గొంటున్నప్పుడు పోలీసులతో జరిగిన తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కింద పడిపోయా. అప్పుడు నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ ఆసుపత్రిలో అయితే చేర్పించి ప్రాణాలు కాపాడాడో.. అదే ఆసుపత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు' అని హరీశ్ రావు కన్నీరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాల మీద అదే పాత ఉద్యమ స్ఫూర్తితో చివరి శ్వాస దాకా కొట్లాడాడని గుర్తుచేశారు.
అదే ఆసుపత్రిలో చివరిచూపు
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒక అమరవీరుడి అంతిమ యాత్రలో పాల్గొంటున్నప్పుడు పోలీసులతో జరిగిన తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కింద పడిపోయా. అప్పుడు నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ ఆసుపత్రిలో అయితే చేర్పించి ప్రాణాలు కాపాడాడో.. అదే ఆసుపత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు' అని హరీశ్ రావు కన్నీరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాల మీద అదే పాత ఉద్యమ స్ఫూర్తితో చివరి శ్వాస దాకా కొట్లాడాడని గుర్తుచేశారు.
రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం.. మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం: కేటీఆర్
Nallabelli, Telangana:Peddi Sudarshan Reddy Memorial Meeting: పెద్ద పదవులు చేపట్టకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలివచ్చింది. ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవమిది' అని తెలిపారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం.. పెద్ది ఆశయాల మేరకు నర్సంపేట మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నర్సంపేట వైద్య కళాశాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు.
నల్లబెల్లిలో సంస్మరణ సభ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ సందర్భంగా నల్లబెల్లిలో సంస్మరణ సభ నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్ అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 'పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోయినా.. తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజా నాయకుడు' అని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు ఓరుగల్లు గడ్డ మొత్తం కదిలివచ్చిందని.. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 12 గంటల పాటు లక్షలాది మంది ప్రజలు తరలిరావడం ఆయన వారి గుండెల్లో సంపాదించుకున్న అపారమైన స్థానానికి సజీవ సాక్ష్యమని ప్రకటించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డగా, ఆ ఉద్యమ గడ్డ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
అంతటి భారీ జనసందోహం
'పెద్ది సుదర్శన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లేదా మాజీ మంత్రి కాకపోయినా.. పదిసార్లు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన అంతిమయాత్రకు అంతటి భారీ జనసందోహం రావడం ఆయనలోని ఉద్యమ బలానికి, నిబద్ధతకు నిదర్శనం' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎంతకాలం బతికామన్నది కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యం అనే సూక్తికి పెద్ది జీవితమే ఉదాహరణ అని తెలిపారు. లక్షలాది మంది జనం మధ్య సాగిన ఆయన చివరి ప్రయాణమే ఆయన సార్థక జీవితానికి అసలైన కొలమానం అని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
ఉద్యమ గడ్డ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి,
ఒక తెలంగాణ ఉద్యమ గడ్డ ఇచ్చిన అసలైన గౌరవమిది!ఓరుగల్లు ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నర్సంపేట ప్రజలు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, చూపిన తెగువ ఎప్పటికీ అమరం!
— BRS Party (@BRSparty) August 10, 2026
ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్
నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినా కరోనా మహమ్మారి, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని అమలుచేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, వ్యవసాయ మంత్రులను ఒప్పించి నర్సంపేట రైతుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును పట్టుబట్టి సాధించి అసాధారణ అభివృద్ధిని సాధించారని కేటీఆర్ వెల్లడించారు.
మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు
రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పెద్ది ఆశయాలకు అనుగుణంగా నర్సంపేటను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేటలో త్వరలోనే ఏర్పాటుచేయనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని ప్రకటన చేశారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట మట్టిలో.. పాకాల జలాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు నిలిచిపోతుందని కేటీఆర్ వెల్లడించారు.
pic.twitter.com/T586prwJZcనర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు పెడతాం.
— KTR News (@KTR_News) August 10, 2026
Jagga Reddy: గంజాయి తీసుకుంటే సంసారానికి పనికి రారు: జగ్గారెడ్డి
Sangareddy, Telangana:Jagga Reddy Call To Youth Far Away From Drugs And Mobile PhoneJagga Reddy: సంగారెడ్డి బోనాల వేడుకల్లో జగ్గారెడ్డి కుటుంబసభ్యులు
Sangareddy, Telangana:Former MLA Jagga Reddy Family Offers Bonalu To Gadi Maisamma In Sangareddy Watch VideoHar Ghar Tiranga: 'హర్ ఘర్ తిరంగా’లో ప్రతి ఇంటిపై జాతీయ జెంగా ఎగరాలి: డీకే అరుణ
Mahbubnagar, Telangana:Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాoచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని కోరారు.
ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ దగ్గర పెద్ద ఎత్తున ‘తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నట్లు రామ్‌చందర్ రావు వెల్లడించారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకో, రాజకీయాలకో సంబంధించింది కాదని మన భారతదేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి.. ‘వికసిత భారత్’ సంకల్పంతో చేపడుతున్న యాత్ర అని వివరించారు. హైదరాబాద్ ప్రజలందరూ కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి దేశం కోసం ఈ తిరంగా యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జాతీయ జెండా తన కార్యాలయంపై ఎగురవేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఏర్పాటుచేసిన అనంతరం కొందరి జాతీయ జెండాలని పంపిణీ చేశారు. ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ అనే గొప్ప నినాదంతో.. జాతీయ సమైక్యతను చాటడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని.. ఈ కార్యక్రమంతో కుల, మత, ప్రాంతీయ భేదాలను విస్మరించి భారతీయులంతా ఒక్కటే అనే భావనను చాటుతుందని పేర్కొన్నారు.
స్వాతంత్ర వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని దేశ భక్తి పెంపొందించాలని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఏర్పాటు అనంతరం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, మహబూబ్‌నగర్ కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, నందిపేట రాజేందర్, దర్పల్లి హరికృష్ణ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోవింద్ నాయక్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Jagga Reddy: యువతకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక సూచన.. 'అవి' తింటే సంసారానికి పనికి రారు
Sangareddy, Telangana:Sangareddy Bonalu: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ధూంధాంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగ్గారెడ్డి సందడి చేశారు. జగ్గారెడ్డి నివాసం నుంచి భవాని మందిర్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు నిర్వహించిన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగింది. జగ్గారెడ్డి కుమార్తె జయాచైతన్యరెడ్డి తన నివాసంలో బోనం ఎత్తగా, కుటుంబ సభ్యులు మైసమ్మ, భూలక్ష్మి, దుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. జోగిని నిషాక్రాంతి సంగారెడ్డిలో బోనమెత్తి ఆడిపాడారు. అనంతరం జరిగిన సభా వేదికలో జగ్గారెడ్డి కీలక ప్రసంగం చేశారు. గంజాయి తాగకండి.. చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి అని ప్రజలకు సూచనలు చేశారు. గంజాయికి యువత దూరంగా ఉండండి.. గంజాయితో సంసారానికి పనికిరాకుండా పోతారని హెచ్చరించారు.
'సిగరెట్లు, చాక్లెట్లలో మనకు తెలియకుండానే గంజాయి పెట్టీ బానిసలుగా మార్చుతున్నారు. బర్గర్లలో కూడా మత్తు పదార్థాలు కలుపుతున్నారు. చిన్నపిల్లలను సెల్ ఫోన్లకు బానిసలుగా మార్చకండి. ఫోన్లతో పిల్లల జ్ఞాపక శక్తి దెబ్బతింటున్నది' అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే.. మనల్ని మన పిల్లలు బాగా చూసుకుంటారని చెప్పారు. ప్రస్తుత సమాజంలో అందరూ సెల్ ఫోన్లకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్‌ఫోన్ వినియోగంతో యువతలో.. పిల్లల్లో జ్ఞాపకశక్తి దెబ్బతింటోందని జగ్గారెడ్డి తెలిపారు. తల్లులు టీవీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ చిన్నపిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారని, ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఒక డాక్టర్ దగ్గర 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడుతున్న మానసిక ఇబ్బందులను తాను స్వయంగా చూశానని వివరించారు. ఫోన్లను కేవలం సమాచారం కోసమే వాడాలని, అవసరానికి మించి వాడి జీవితాలు పాడుచేసుకోవద్దని హితవు పలికారు.
యువత గంజాయి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయి తాగినవాడు సంసారానికి పనికిరాడు, తల్లిదండ్రులకు వంశం లేకుండా పోతుంది అని హెచ్చరించారు. ఇప్పుడు సిగరెట్లు, చాక్లెట్లు, బర్గర్లలో కూడా మత్తు పదార్థాలు పెట్టి సరఫరా చేస్తున్నారని తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతున్నారని, మనం మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే, రేపు మన పిల్లలు మనల్ని చూసుకుంటారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
Kuppam: వైఎస్సార్సీపీ, టీడీపీ పోటాపోటీ ప్రదర్శనలు.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత
Kuppam, Andhra Pradesh:Kuppam High Tension: డీఎస్సీలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా వైఎస్సార్సీపీ ర్యాలీ తీసేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించడంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైఎస్సార్సీపీ ఆందోళన సందర్భంగా కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైఎస్సార్సీసీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు.
వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో భరత్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అవకతవకలకు కారణమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో రాష్ట్రమంతా నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన ర్యాలీకి వారం కిందట పోలీసుల అనుమతి కోరినా అనుమతి మంజూరు చేయలేదని చెప్పారు. మరి టీడీపీ చేపట్టిన విజయోత్సవ ర్యాలీకి పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవరించడం ఏమిటని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తాము వెనుకాడమని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ ర్యాలీకి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. డీఎస్సీపై చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దకు వెళ్లడానికి కూటమి నాయకులు ప్రయత్నించారు. డీఎస్సీ గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ భరత్‌పై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భరత్ ఇంటి వద్దకు టీడీపీ నాయకులు దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
AP EAPCET 2026: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు అవుతుంది!
Vijayawada, Andhra Pradesh:AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్‌లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్‌కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక AP EAPCET Website ద్వారా తమ అలాట్మెంట్ వివరాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. మెరిట్ ర్యాంక్, వెబ్ ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఈ సీట్లు కేటాయించబడ్డాయి.
సీట్లు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా తగిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కాలేజీలో నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి. ఈ రిపోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు AP SCHE Portal ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
1) ముందుగా అధికారిక AP EAPCET Website ఓపెన్ చేయాలి.
2) హోమ్‌పేజీలో ఉండే 'Candidate Login' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3) లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
4) స్క్రీన్‌పై కనిపించే సీట్ల కేటాయింపు ఫలితాన్ని పరిశీలించి, అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు, నిబంధనలు..
సీటు పొందిన అభ్యర్థులు ఆన్లైన్, ఫిజికల్ రిపోర్టింగ్‌లను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు Andhra Pradesh State Council of Higher Education సూచనలను పాటించవలసి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఈ రెండు విధానాలను పూర్తి చేయకపోతే కేటాయించిన సీటు రద్దు కానుంది. అంతేకాకుండా, తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోవాల్సి వస్తుంది.
తొలి దశలో సీట్లు సాధించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, ఇతర అధికారిక సమాచారం కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ AP EAPCET Official Portalను మాత్రమే సందర్శించాలి. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వదంతులను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Srisailam Dam Gates: కృష్ణానదికి పోటెత్తిన వరదనీరు..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత!
Also Read: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ITBP మెడికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం! అప్లై చేసుకోండిలా!
Hyderabad, Telangana:ITBP Medical Officer Recruitment 2026: డాక్టర్లకు ఇది ఒక గొప్ప అవకాశం. ITBPలో భారీగా ఉద్యోగాల ప్రక్రియ మొదలైంది. మొత్తం 282 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు.. ఇందులో నెలకు రెండు లక్షల వరకు జీతం లభించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మెడికల్ ఆఫీసర్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ , సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లను భర్తీ చేస్తారు. దరఖాస్తులు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 11:59 గంటల వరకు స్వీకరించనున్నారు.
ITBP మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు..
ఈ పోస్టులన్నీ గ్రూప్ 'ఏ' పరిధిలోకి వస్తాయి.
సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్: 5 పోస్టులు
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్: 162 పోస్టులు
మెడికల్ ఆఫీసర్: 115 పోస్టులు
ITBP రిక్రూట్మెంట్ ప్రక్రియ..
ITBP నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) పరిధిలోకి వస్తుంది. ఆగస్టు 10 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ లోపు దరఖాస్తులను పూర్తి చేయాలి. అయితే, ఫారమ్ ఫిల్ చేసే ముందు అధికారిక వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in/ లోని నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలి. మీ విద్యార్హత, వయస్సు, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ఫీజు, ఇతర నిబంధనలను సరిచూసుకోవాలి.
మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ముఖ్య వివరాలు..
ఈ పరీక్షను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నిర్వహిస్తోంది. ఇది హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. గ్రూప్ 'ఏ' పోస్ట్ కేటగిరీ కింద ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
ఈ పరీక్షకు జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి, అయితే SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. దీనిని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS లేదా మొబైల్ వాలెట్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే, మెడికల్ ఆఫీసర్లకు 30 ఏళ్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లకు 40 ఏళ్లు, స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లకు 50 ఏళ్ల వరకు ఉండాలి.
Also Read: ట్రాయ్‌లో ఎలాంటి అనుభవం లేకుండానే ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేల జీతం! అప్లై చేసుకోండిలా!
Also Read: ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లకుండానే.. మీ DL, RC పై మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండిలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana SIR Last Date: తెలంగాణలో 60 లక్షల ఓట్లు తొలగింపు..ఈ పార్టీకి చెమటలు పట్టే కొత్త టెన్షన్!
Hyderabad, Telangana:Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మెదక్, సూర్యాపేట జిల్లాల వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు, హైదరాబాద్ జిల్లా కేవలం 58.58 శాతంతో చివరి స్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ శాతంతో వెనుకబడి ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా ప్రకటన వెలువడిన తర్వాత జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాతే ఓట్ల తొలగింపుపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయ పార్టీల్లో కొత్త టెన్షన్‌కు కారణమవుతోంది. ఈ ప్రక్రియను మొదటి నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి నేతలను అప్రమత్తం చేశాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆగస్టు 17న ముసాయిదా జాబితా వెలువడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటర్ల జాబితా వివరాలు, నమోదు ప్రక్రియ, ఇతర అధికారిక సమాచారం కొరకు ఓటర్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ), ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లను కూడా సందర్శించవచ్చు. అలాగే ఓటర్ల జాబితాలో పేరును పరిశీలించడానికి ఎలక్ట్రోరల్ సెర్చ్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.
Also Read: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు..వైన్స్ బంద్, ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు.. పోస్టులను బట్టి రూ 55,000 వరకు జీతం.. పూర్తి వివరాలివే
Lakshmapur, Telangana:Bharat Electronics Limited Recruitment 2026: రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11, 2026న జరిగే నియామక ప్రక్రియకు హాజరయ్యే ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఖాళీలను రాజస్థాన్, గుజరాత్‌లోని BEL ప్రాజెక్ట్ సైట్ల కోసం రిక్రూట్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జోధ్‌పూర్, జైసల్మేర్, జామ్‌నగర్, భుజ్ లేదా నలియాలో నియమించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, జీత భత్యాలు వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నాలుగేళ్ల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అర్హత గల విభాగాలలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్నాయి.
అనుభవం:
దరఖాస్తుదారులు జూలై 1, 2026 నాటికి కనీసం 2 సంవత్సరాల సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు సడలింపు లభిస్తుంది.
జీతభత్యం:
జీతం నియామక సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-I నెలకు రూ. 40,000 అందుకుంటారు. అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్-II, III, IV వరుసగా రూ. 45,000, రూ. 50,000 రూ. 55,000 అందుకుంటారు. అభ్యర్థులు వారి పోస్టింగ్‌ను బట్టి ఏరియా అలవెన్స్ కూడా పొందవచ్చు. రూ. 12,000 బీమా ప్రయోజనం, ఇతర వర్తించే అలవెన్సుల గురించి కూడా BEL పేర్కొంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. జనరల్, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 35 శాతం మార్కులు అవసరం కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన బీడీ (PwBD) అభ్యర్థులకు అర్హత మార్కు 30 శాతంగా ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు ఫారం, ఫోటోగ్రాఫ్‌లు, విద్యా ధృవపత్రాలు, అనుభవ పత్రాలు, రెజ్యూమె, ఫీజు చెల్లింపు రసీదు ఇతర అవసరమైన పత్రాలను తీసుకురావాలి. వాక్-ఇన్ సెలక్షన్ ఆగష్టు 11న ఉదయం 8 గంటలకు జరగనుంది. అభ్యర్థులు హాజరయ్యే ముందు పూర్తి వివరాల కోసం అధికారిక BEL నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: 10 పాసైతే చాలు.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 2,615 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Also Read: 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. నెలకు
Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ట్రాయ్‌లో ఎలాంటి అనుభవం లేకుండానే ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేల జీతం! అప్లై చేసుకోండిలా!
Hyderabad, Telangana:TRAI Recruitment 2026: భారతదేశం అంతటా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ నెట్వర్క్ , డిటిహెచ్ (DTH), ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తున్న టెలికాం రంగంలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ నియామక ప్రక్రియను ప్రకటించింది. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ పోస్టులకు ఎంపిక కావడానికి ఎటువంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. అభ్యర్థులు 'అసోసియేట్ కన్సల్టెంట్' పదవికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పదవిలో ఎంపికైన వారికి రూ.80 వేలు నుండి ఆకర్షణీయమైన జీతం అందుతుంది.
ట్రాయ్ (TRAI) న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, అందులోని 'Vacancies' పోస్ట్‌ను ఎంపిక చేసుకుని, ఆపై 'Associate Consultant' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ ఈసీఈ పదవికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్ కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడింది. దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 27వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఎంపికైన అభ్యర్థులను మొదట ఏడాది కాలం పాటు నియమించుకోనున్నారు, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఆ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
ట్రాయ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలను నిశితంగా తనిఖీ చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా కొనసాగుతుంది, కాబట్టి ఇంటర్వ్యూ కోసం తప్పనిసరిగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలో అభ్యర్థుల అర్హతలు, అనుభవం గురించి చర్చించిన తర్వాత, వారిని తుది ఎంపిక చేస్తారు.
Also Read: ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లకుండానే.. మీ DL, RC పై మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండిలా!
Also Read: ఓనమ్ రద్దీకి రైల్వే మాస్టర్ ప్లాన్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి పుట్టిన తేదీ ఇతర వ్యక్తిగత వివరాలు పత్రాలతో సరిపోలేలా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అనంతరం అధికారిక వెబ్సైట్ https://trai.gov.in/vacancies ను ఓపెన్ చేసి, రిక్రూట్మెంట్ ఫారమ్‌ను నింపి సమర్పించాలి.
దరఖాస్తు విధానం కోసం:
మొదటగా అధికారిక వెబ్సైట్ https://trai.gov.in/vacancies ను ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉన్న 'Recruitment' విభాగంపై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. మీ వ్యక్తిగత విద్యా వివరాలను క్షుణ్ణంగా పూరించి, సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. చివరి దశలో, మీరు నింపిన అన్ని వివరాలను ఒకసారి జాగ్రత్తగా సరిచూసుకుని, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. దరఖాస్తు పూర్తయిన తర్వాత, భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ప్రింట్ అవుట్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
