Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

శ్రీనాథ్ మహర్షి జ్ఞాపకార్ధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

Oct 09, 2024 06:20:06
Bellampalle, Telangana

మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కూలీలు,బాటసారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం కుమారుడు శ్రీనాథ్ మహర్షి జయంతి సందర్భంగా అయన జ్ఞాపకార్ధం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు బాటసారులు, నిరుపేదలు సుమారు 200 మంది పాల్గొని అల్పాహారం స్వీకరించారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
IPInamdar Paresh
Jan 03, 2026 17:39:47
Hyderabad, Telangana:

Sreeleela behaviour in tirumala que line video: తిరుమలల ఇటీవల వైకుంఠఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనాలను టీటీడీ కల్పించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు లక్కీడీప్ లో టొకెన్లు వచ్చిన వారికి టీటీడీ దర్శనాలు కల్పించింది. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయా నాయకులు, సెలబ్రీటీలు భారీగా తిరుమలకు తరలివచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నటి శ్రీలీల కూడా వచ్చింది. అయితే.. తిరుమల క్యూలైన్ లో శ్రీలీల స్వామివారిదర్శనం కోసం వెళ్తుంది.ఇంతలో ఆమె వెనకాల ఒక యువకుడు సైతం శ్రీలీలను వెనుకనుంచి ఫాలో అవుతున్నారు. బయట నుంచి కొంత మంది వీరి ఫోటోలను తీసుకుంటున్నారు.

 

అయితే.. శ్రీలీల పవిత్రమైన తిరుమల ఆలయంలో అది కూడా క్యూలైన్ లో ఉన్న విషయం మర్చిపోయి పలు మార్లు ఆ కుర్రాడి వంక నవ్వుతూ చూడటం, అతను సైతం నటిని చూడటం జరిగింది. అతను కూడా శ్రీలీల వంక నవ్వుతూ అదేదో బైట మూవీథియేటర్లో లేదా షాపింగ్ మాల్స్ లో ఉన్న విధంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు సీరియస్అవుతున్నారు. స్వామివారి దర్శనాలకు వచ్చి ఇదెక్కడి పనులు అంటూ మండిపడుతున్నారు.

ఇలాంటి వారి వల్లే మిగతా భక్తులు కూడా వెకిలిగాప్రవర్తిస్తున్నారని సీరియస్ అవుతున్నారు. అసలైతే..ఎంత సెలబ్రీటీలు అయితే ఇతరుల్నిచూడాల్సిన అవసరం ఏంటని, శ్రీవారిని దర్శించుకొవడంపై వారి కాన్సన్ ట్రెషన్ ఉంటే  ఇలాంటివి జరగవని మరికొంత మంది అంటున్నారు. మొత్తంగా క్యూలైన్ లో శ్రీలీల ప్రవర్తనపై నెట్టింట దుమారం రాజుకుంది. ఇలాంటి పనులు చేయోద్దని టీటీడీ ఇప్పటికే పలుమార్లు సెలబ్రీటీల్ని అందరిని హెచ్చరించింది.

Read more: Naa Anveshana: నా అన్వేషణ యూట్యూబర్ కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫెమస్ నటి..

అయిన కూడా కొంత మంది టీటీడీ హెచ్చరికలను బేఖాతరుచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ప్రవర్తనపై కొంత మంది భక్తులు మండిపడుతుండగా, మరికొంత మంది ఏదో అభిమాని అని నార్మల్గా నవ్వారో ఏమో.. ప్రతి దాన్ని కాంట్రవర్సీ కోణంలో చూడటం ఏంటని కిస్సిక్ పాపకు మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా శ్రీలీల ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 03, 2026 12:12:14
Hyderabad, Telangana:

Nothing Phone 3A Price Drop In Flipkart: ఎప్పటినుంచో మీరు నథింగ్ ఫోన్ (3a)స్మార్ట్ ఫోన్ (Nothing Phone (3a)) కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారా? అయితే మీకు సమయం రానే వచ్చింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు జరుగుతున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా  ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ మొబైల్ పై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఎంత తగ్గింపు దరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

నథింగ్ ఫోన్ (3a) (128 GB) స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మార్కెట్లోకి 6.77 అంగుళాల Full HD+ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 nits గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 (Qualcomm Snapdragon 7s Gen 3) ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన వెనక భాగంలోకి వెళ్తే.. బ్యాక్ సెటప్‌లో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన 50MP మెయిన్ కెమెరా (OIS)తో పాటు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది.

దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 5000 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.1 ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్‌కు దాదాపు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందిస్తోంది. అలాగే ఈ మొబైల్కు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: Google Pixel 9A మొబైల్‌పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

ఈ నథింగ్ ఫోన్ (3a) (Nothing Phone (3a)) స్మార్ట్ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్‌లో ఈ మొబైల్‌ను కంపెనీ ధర MRP రూ.27,999తో విక్రయిస్తోంది.. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 11 శాతం తగ్గింపుతో కేవలం రూ.24, 999కే అందుబాటులో ఉంది. ఇక అదనంగా తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసే వారికి రూ.3000 తగ్గింపు లభిస్తుంది. 

అలాగే నథింగ్ ఫోన్ (3a) స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు దీనిని వినియోగించాలనుకునే వారు తప్పకుండా ఫ్లిప్‌కార్ట్‌కి ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన మంచి కండిషన్‌తో కూడిన పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.22 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.2,999 లోపే పొందవచ్చు.

Also Read: Google Pixel 9A మొబైల్‌పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 03, 2026 11:42:57
Hyderabad, Telangana:

Moto X70 Air Pro Launch News: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా మార్కెట్లోకి త్వరలోనే కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అత్యంత సుల్లింగ్ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దీనిని మోటరోలా మొట్టమొదటిసారిగా పెరిస్కోప్ కెమెరాతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే, మోటరోలా సిగ్నేచర్‌నే భారత మార్కెట్‌లోకి కంపెనీ మోటార్ల ఎడ్జ్ 70 అల్ట్రాగా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కంపెనీ వరల్డ్ వైడ్‌గా ప్రీమియం ఫీచర్స్‌తో  Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే వస్తున్న వార్తల ప్రకారం.. Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్ చైనాకు సంబంధించిన సర్టిఫికేషన్ ఏజెన్సీ డేటాబేస్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది XT2603-1 మోడల్ నెంబర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్త వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది చాలా పెద్దదైన 6.78-అంగుళాల OLED డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ మొబైల్ ను కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని చివరి వేరియంట్ 16 జిబి ర్యామ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా  లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 5,100 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇది 90 W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో లాంచ్ కాబోతోంది. అలాగే దీనికి ప్రత్యేకమైన వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. త్వరలోనే కంపెనీ అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Google Pixel 9A మొబైల్‌పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

ఇక ఇటీవల భారత దేశంలో  మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయింది. ఇది అద్భుతమైన 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు చాలా ప్రత్యేకమైన 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1,600 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ 68W టర్బోపవర్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.

Also Read: Google Pixel 9A మొబైల్‌పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 03, 2026 10:27:12
Hyderabad, Telangana:

Cucumber With Curd Side Effects: మనం సాధారణంగా భోజనంలో పెరుగు లేదా దోసకాయ రైతాను ఇష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అని అంతా అనుకుంటుంటాం. కానీ, ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదట. దీన్నే బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ అంటారు. ఈ జాబితాలో పెరుగు, దోసకాయ కలయిక కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు మంచిది కాదు?
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి ఆహారానికి ఒక నిర్దిష్టమైన స్వభావం (గుణం), శక్తి, జీర్ణ ప్రభావం ఉంటాయి. దోసకాయ, పెరుగు లక్షణాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

పెరుగు బరువైనది, వేడిని తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. దోసకాయ చల్లని స్వభావం కలిగి ఉండి, నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో 'చల్లని శక్తి' విపరీతంగా పెరిగి జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న ఆహారం అరగడానికి శరీరంలో 'అగ్ని' (Metabolic heat) అవసరం. ఈ రెండు పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన వేడి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపులో కిణ్వ ప్రక్రియ మొదలవుతుంది.

దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
పెరుగు, దోసకాయ కలిపి తీసుకోవడం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయట. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట. 

తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం వల్ల గుండెల్లో మంట లేదా ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఈ విరుద్ధ కలయిక వల్ల చర్మ సమస్యలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ చల్లని స్వభావం కలిగి ఉండటం వల్ల శరీరంలో కఫ దోషం పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ప్రత్యామ్నాయం ఏమిటి?
మీరు రైతా తినాలనుకుంటే, పెరుగులో దోసకాయకు బదులుగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి లేదా సైంధవ లవణం వంటి జీర్ణక్రియను వేగవంతం చేసే పదార్థాలను చేర్చుకోవచ్చు. అలాగే దోసకాయను విడిగా సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 5 వరకు స్కూళ్లకు సెలవులు..భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 03, 2026 09:59:01
Patna, Bihar:

School Holidays Extension: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న శీతల గాలుల ప్రభావం బీహార్‌ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజధాని పాట్నా సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థల నిర్వహణపై కొత్త ఆంక్షలు విధించారు.

పాట్నాలో పాఠశాలల పరిస్థితి
పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (DM) డాక్టర్ త్యాగరాజన్ ఎస్ఎం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రీ-స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు జనవరి 5 వరకు సెలవులను ప్రకటించారు. 

అయితే 6వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాల సమయాన్ని సవరించారు. ఇకపై తరగతులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రీ-బోర్డు పరీక్షలు లేదా ప్రత్యేక కోచింగ్ తరగతులకు ఈ సమయ నియంత్రణ నుండి మినహాయింపు ఉంటుంది.

పాట్నా మాత్రమే కాకుండా బీహార్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బాంకా, ముజఫర్‌పూర్ జిల్లాల్లో 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జనవరి 5 వరకు సెలవులు ప్రకటించారు. గతంలో జనవరి 2 వరకు ఉన్న సెలవులను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జనవరి 5 వరకు పొడిగించారు.

వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు
రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బీహార్‌లోని ఏడు జిల్లాలైన.. గోపాల్‌గంజ్, సివాన్, ముజఫర్‌పూర్, దర్భంగా, సహర్సా, మధేపురా, పూర్నియా జిల్లాల్లో శీతల గాలులు (Cold Waves) వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఉత్తర బీహార్‌లోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చివరిగా.. పిల్లలు చలి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!

Also Read: Tanya Mittal Bodyguards: బిగ్‌బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?! అంబానీని మించిన సెక్యూరిటీ..అసలు నిజం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AKAshok Krindinti
Jan 03, 2026 07:40:28
Hyderabad, Telangana:

Eye Care Clinics in Telangana: రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్‌’ (Eye Care Clinics) ఏర్పాటు చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లు ప్రారంభించామని, కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్, కీమోథెరపీ వంటి సేవలు ఈ క్లినిక్‌లలో అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కేన్సర్ పేషెంట్లు కీమో థెరపీ కోసం హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం లేకుండా, జిల్లా కేంద్రాల్లోని డే కేర్ కేన్సర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు.దీంతో ఎంఎన్‌జే హాస్పిటల్‌ మీద పేషెంట్ లోడ్ కూడా తగ్గిందని మంత్రి తెలిపారు. కేన్సర్ కేర్ సెంటర్ల తరహాలోనే, ప్రజలకు నిరంతర కంటి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఐ కేర్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు:

‘ఐ కేర్ క్లినిక్స్‌’ - నూతన విధానం:

ప్రస్తుత జీవనశైలి, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కంటి సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు తరహాలో తాత్కాలిక శిబిరాలకు పరిమితం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన వైద్యం అందించేలా ‘ఐ కేర్ క్లినిక్స్‌’ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’ (Hub)గా వ్యవహరిస్తుంది. హబ్, క్లినిక్‌ల మధ్య సమన్వయం కోసం, స్క్రీనింగ్, సర్జరీలను పర్యవేక్షించడానికి ఒక ఆప్తాల్మాలజీ నిపుణుడిని ‘నోడల్ ఆఫీసర్‌’గా నియమించాము. రాష్ట్రంలో కంటి వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి, సరైన చికిత్సా విధానాలను సిఫార్సు చేయడానికి ఇప్పటికే ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఐ కేర్ సెంటర్ల పనితీరుపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటాం.

గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రి సభ ముందుంచారు. 2018లో తొలి విడత, 2023లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారని మంత్రి వెల్లడించారు. స్క్రీనింగ్, కండ్లద్దాల పంపిణీకే కార్యక్రమాన్ని పరిమితం చేశారని మంత్రి గుర్తు చేశారు. 9.3 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అని డాక్టర్లు గుర్తించినప్పటికీ, ఆపరేషన్లు చేయించకుండానే కార్యక్రమాన్ని ముగించారని మంత్రి తెలిపారు.

పటిష్టమైన వ్యవస్థాగత సేవలు: దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో కంటి వైద్యానికి సంబంధించిన సేవలు అందుబాటులోకి నాటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 1951లో ఏర్పాటైన సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఏడు దశాబ్దాలుగా సేవలు అందిస్తోందన్నారు.

ప్రస్తుతం 35 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), 64 ఏరియా ఆసుపత్రుల్లో కంటి వైద్య విభాగాలున్నాయి. ప్రతి జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు అందుబాటులో ఉండగా.. ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. అన్ని చోట్ల కంటి శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి.

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం (NPCB):
==> 1976 నుంచి అమలవుతున్న జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు కంటి వైద్య సేవలు అందిస్తున్నాం.
==> గత రెండేళ్లలో (2024 మరియు 2025లో కలిపి) రికార్డు స్థాయిలో 6,12,973 మందికి క్యాటరాక్ట్ (శుక్లాల) ఆపరేషన్లు విజయవంతంగా చేయించాం.
==> పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. గత రెండేళ్లలో 33,65,832 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన 76,176 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం.
==> కేవలం పరీక్షలే కాకుండా, కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికీ అవసరమైన శస్త్రచికిత్సలు కూడా అందించి సంపూర్ణ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

0
comment0
Report
HDHarish Darla
Jan 03, 2026 06:34:59
Hyderabad, Telangana:

TSRTC Recruitment 2025 Apply Online: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఖాళీల వివరాలు
మొత్తం 198 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ కోసం 84 పోస్టులు, అలాగే మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ కోసం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు & వయోపరిమితి
ఈ పోస్టులకు విద్యార్హతగా సంబంధిత విభాగంలో అభ్యర్థులు కనీసం డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూలై 1, 2025 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య వయోపరిమితిని నిర్ణయించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వాటిలో పదో తరగతి సర్టిఫికేట్ (డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణ కోసం),  1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్),  తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్‌తో పాటు ఏప్రిల్ 1, 2025 తర్వాత పొందిన నాన్-క్రీమీ లేయర్ (BC అభ్యర్థులకు) లేదా EWS సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

జీతం & ఎంపిక విధానం
ఎంపికైన వారికి నెలకు రూ. 27,080 నుండి రూ. 81,400 వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోస్టుల కోసం రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 20, 2026 వరకు సమయం ఉంది.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంది. అభ్యర్థులు TGRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!

Also Read: Dhoni IPL Retirement: సీఎస్‌కే అభిమానులకు బ్యాడ్‌న్యూస్..ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ..ఇక ఐపీఎల్‌కు 'తలా' సెలవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 03, 2026 05:39:01
Secunderabad, Telangana:

Saudi Arabia – UAE Conflict: మధ్యప్రాచ్య రాజకీయాల్లో సౌదీ అరేబియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..ఈ రెండు మిత్ర దేశాలుగా మంచి పేరు తెచ్చుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో సున్నీ శక్తిగా.. చమురు సంపదతో.. వ్యూహాత్మక ప్రాభవంతో ఈ రెండు దేశాలు దశాబ్దాల పాటు విడదీయరాని మిత్రులుగా కొనసాగాయి. సంక్షోభ సమయాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే విషయంలో ఈ రెండు దేశాలు కలిసి అడుగులు వేసాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఒకప్పుడు ఒకే శత్రువుపై కలిసి యుద్ధం చేసిన ఈ మిత్రదేశాలు.. ఇప్పుడు ఒకరి రక్తం మరొకరు చిందించే స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలకు యెమెన్ కీలక బింధువుగా మారింది. ఇప్పుడు యెమెన్ నేల మరోసారి రక్తంతో తడిసిపోయింది. ఈసారి హౌతీలు కాదు.. ఉగ్రవాదులు కాదు… గల్ఫ్‌లోని రెండు ప్రధాన మిత్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణే దీనికి కారణం. సౌదీ అరేబియా చేసిన వైమానిక దాడుల్లో UAE మద్దతుగల యోధులు మరణించడం మధ్యప్రాచ్య రాజకీయాలను పూర్తిగా కొత్త మలుపు తిప్పింది.

మిత్రత్వం విరిగిన యుద్ధభూమి:
యెమెన్ ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా అంతర్యుద్ధంతో అల్లాడుతోంది. 2015లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించడంతో ఈ యుద్ధం మొదలైంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఇవ్వడంతో..  సౌదీ అరేబియా దీనిని తన భద్రతకు ముప్పుగా భావించింది. అప్పట్లో UAE కూడా సౌదీతో చేతులు కలిపి యెమెన్‌లోకి దిగింది. ఈ రెండు దేశాల నేతృత్వంలో ఒక సైనిక సంకీర్ణం ఏర్పడింది. లక్ష్యం ఒక్కటే.. ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడం.. హౌతీలను నియంత్రించడం. ప్రారంభంలో సౌదీ, UAE దళాలు కలిసి వైమానిక దాడులు చేశాయి. భూభాగాన్ని నియంత్రించాయి. దక్షిణ యెమెన్‌లో కీలక ప్రాంతాలపై పట్టు సాధించాయి. అయితే కాలక్రమేణా ఈ రెండు దేశాల లక్ష్యాలు వేరు కావడం మొదలైంది. ఇక్కడే మిత్రత్వంలో పగుళ్లు ఏర్పడ్డాయి. 

విభేదాలకు కారణం.. యుద్ధం ఒకటే.. లక్ష్యాలే వేరు: 
సౌదీ అరేబియా యెమెన్‌ను ఒకే దేశంగా ఉంచాలని కోరుకుంది. కేంద్ర ప్రభుత్వం బలపడాలని భావించింది. అయితే UAE మాత్రం దక్షిణ యెమెన్‌ను ప్రత్యేక దేశంగా విడదీయాలన్న ఆలోచనకు దగ్గరైంది. ఈ దిశగా దక్షిణ యెమెన్ స్వాతంత్ర్యాన్ని కోరే సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (STC) అనే వేర్పాటువాద గ్రూప్‌కు UAE మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. STC యోధులకు ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందింది. దీంతో దక్షిణ యెమెన్‌లో UAE ప్రభావం వేగంగా పెరిగింది. ఇదే సౌదీ అరేబియాకు అసహనాన్ని కలిగించింది. ముఖ్యంగా చమురు సంపన్నమైన హద్రామౌత్, మహ్రా వంటి ప్రావిన్సులపై STC పట్టు సాధించడం సౌదీకి పెద్ద హెచ్చరికగా మారింది.

అసలు మంట రాజేసింది హద్రామౌత్‌నే  :
హద్రామౌత్ యెమెన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్. సౌదీ సరిహద్దుకు సమీపంలో ఉండటం, చమురు వనరులు ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది. STC ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడం సౌదీ అరేబియాకు నేరుగా సవాల్ చేసినట్టే. దీంతో UAEపై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచింది.  మీ దళాలను ఉపసంహరించుకోండి, STCకి మద్దతు ఆపండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. చివరకు 24 గంటల అల్టిమేటం కూడా ఇచ్చింది. అయితే UAE ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి.

వైమానిక దాడులు..మిత్రత్వానికి ముగింపు?
2026 జనవరి 2న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని హద్రామౌత్ ప్రావిన్స్‌లో STC శిబిరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 20 మందికి పైగా STC యోధులు మరణించారు. వీరు UAE మద్దతుగల దళాలేనన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంతకు ముందు, డిసెంబర్ చివర్లో ముకల్లా పోర్ట్‌పై సౌదీ దాడి చేసింది. అక్కడ UAE నుంచి ఆయుధాలను మోసుకొస్తున్న నౌకలు ఉన్నాయన్నదే సౌదీ వాదన. ఈ ఆయుధాలు STCకి చేరుతున్నాయని, ఇది సంకీర్ణ నియమాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఇదే రెండు దేశాల మధ్య బహిరంగ శత్రుత్వానికి బీజం వేసింది.

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

STC ప్రతిస్పందన అస్తిత్వ యుద్ధం:
సౌదీ దాడులను STC తీవ్రంగా ఖండించింది. ఇది యుద్ధ ప్రకటనగా అభివర్ణించింది. సౌదీ మద్దతుగల దళాలతో నిర్ణయాత్మక పోరాటం తప్పదని ప్రకటించింది. అంతేకాదు, సౌదీ అరేబియా ముస్లిం బ్రదర్‌హుడ్, అల్-ఖైదా వంటి గ్రూపులతో పరోక్షంగా కలిసి పనిచేస్తోందన్న ఆరోపణలు కూడా చేసింది.ఇక UAE మాత్రం బయటకు శాంతి సందేశాలే ఇస్తోంది. యెమెన్ నుంచి దళాలను ఉపసంహరిస్తున్నామని ప్రకటించినా..సౌదీ చర్యలను  మోసపూరిత దాడిగా విమర్శించింది.

ఈ శత్రుత్వం ఎవరికీ లాభం?
సౌదీ–UAE ఘర్షణ యెమెన్‌కే పరిమితం కాదు. ఇది మొత్తం మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తుంది. రెండు దేశాలు ప్రధాన చమురు ఉత్పత్తిదారులు కావడంతో, ఈ వివాదం చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్ర సముద్ర తీరంలో హౌతీలు తమ ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ విభేదాలను ఇరాన్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది. అసలు నష్టపోయేది మాత్రం యెమెన్ ప్రజలే. ఇప్పటికే ఆకలి, వ్యాధులు, యుద్ధంతో అల్లాడుతున్న కోట్లాది మంది ఇప్పుడు మరో ఘర్షణ భయంతో జీవిస్తున్నారు. ఒకప్పుడు యెమెన్‌ను  రక్షించడానికి  వచ్చిన మిత్రదేశాలే ఇప్పుడు ఆ దేశాన్ని మరోసారి యుద్ధభూమిగా మార్చేశాయి.

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

గల్ఫ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం:
సౌదీ అరేబియా, UAE మధ్య శత్రుత్వం గల్ఫ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆధిపత్యం, వ్యూహాత్మక నియంత్రణ, ప్రాంతీయ నాయకత్వం కోసం జరుగుతున్న ఈ పోరు ఎంత దూరం వెళ్తుందో ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… మిత్రత్వం అనే మాట ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య గతం అయిపోయింది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం ఒక కొత్త, ప్రమాదకరమైన రాజకీయ సమీకరణ వైపు అడుగులు వేస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 03, 2026 04:15:07
Secunderabad, Telangana:

 China Silver Market: బంగారం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన లోహంగా గుర్తింపు పొందింది. పసిడితో పాటు వెండి కూడా ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూ పోటీ పడుతోంది. గత ఒకటి, రెండు సంవత్సరాలుగా బంగారం.. వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరినీ షాక్ గురి చేస్తోంది. ఎందుకంటే… ఏకంగా 15 కిలోల బరువున్న వెండి కడ్డీలను కూరగాయల మాదిరిగా రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా పోసి  విక్రయిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అవుతున్న  ఈ వీడియోలో..  రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో వెండి కడ్డీలను కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట వీటిని చాలామంది ఇది నకిలీ వెండి అయి ఉంటుందేమోనని అనుమానించారు. కానీ వీడియోకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో అది పూర్తిగా స్వచ్ఛమైన వెండి అని తేలింది. అంతేకాదు.. ఆ వెండి అమ్మకానికి పెట్టిన ప్రాంతం కూడా చాలా ప్రత్యేకమైనదిగా తెలిసింది.

ఈ వైరల్ వీడియో చైనాకు చెందినదిగా ప్రూవ్ అయ్యింది. ఇది చైనాలోని అతిపెద్ద బంగారు, వెండి ఆభరణాల కేంద్రంగా పేరుగాంచిన షుయ్‌బీ (Shuibei) ప్రాంతంలో తీసిన వీడియో ఇది. షెన్‌జెన్ నగరంలోని లువోహు జిల్లాలో ఉన్న ఈ షుయ్‌బీ ప్రాంతాన్ని చైనా మొత్తం బంగారు వ్యాపారానికి గుండెకాయగా పరిగణిస్తుంటారు.  ఇక్కడ ప్రతిరోజూ టన్నుల కొద్దీ బంగారం, వెండి కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల తయారీదారులు, టోకు వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇక్కడికే వచ్చి భారీ లావాదేవీలు నిర్వహిస్తారు.

 

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

ఈ క్రమంలోనే షుయ్‌బీ పరిసరాల్లోని ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద 15 కిలోల బరువున్న వెండి స్లాబ్‌లను బహిరంగంగా విక్రయించడమే ఈ వీడియోకు కారణమైంది. భారీ బరువున్న వెండి కడ్డీలను రోడ్డుపై కూరగాయల మాదిరిగా అమ్మడం సాధారణ ప్రజలకు ఇది షాకింగ్గా అనిపిస్తోంది.  అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు కళ్లబైర్లు కమ్మినట్లుగా స్పందిస్తున్నారు.  ఇది నిజమేనా?  అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ విక్రయిస్తున్న వెండి SGE స్లాబ్‌లుగా గుర్తించారు. SGE అంటే షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్. ఇది చైనాలో అధికారికంగా నియంత్రిత వస్తువుల మార్పిడి సంస్థ. SGE ద్వారా విక్రయించే వెండి సాధారణంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఈ వెండిని పెట్టుబడుల కోసం మాత్రమే కాకుండా, ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగిస్తారు. అయితే ఈ 15 కిలోల వెండి స్లాబ్‌లు సాధారణ రిటైల్ కస్టమర్ల కోసం కాదని సమాచారం. పెద్ద ఆభరణాల తయారీ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, భారీ పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి భారీ పరిమాణాల వెండి ఇక్కడ విక్రయిస్తారు. అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అమ్మకాలు జరగడం అరుదైన విషయం కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారం, వెండి వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో చూపించే ఉదాహరణగా ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
BBhoomi
Jan 03, 2026 03:04:03
Secunderabad, Telangana:

Gold Price Today: గత ఏడాది చివర్లో ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ బలపడుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే వరుసగా రెండో రోజు ధరలు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వెండికి డిమాండ్ స్పష్టంగా పెరుగుతోంది.

జనవరి 3వ తేదీ శనివారం ఉదయం మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే సుమారు రూ.1,150 పెరిగి రూ.1,36,210 స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.1,060 పెరిగి రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది. ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలుదారులు కొంత ఆలోచనలో పడుతున్నా, పెట్టుబడిదారులు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు.

వెండి ధరలు మరింత వేగంగా ఎగబాకాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర దాదాపు రూ.4,100 పెరిగి రూ.2,42,100కు చేరింది. పరిశ్రమల అవసరాలు పెరగడం, అంతర్జాతీయంగా వెండికి ఉన్న డిమాండ్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు సుమారు 0.27 శాతం పెరిగి రూ.1,36,173కు చేరగా, మార్చి వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు దాదాపు రూ.9 వేల పెరుగుదలతో రూ.2,35,873 వద్ద ట్రేడైంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు బలంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ స్పాట్ ధర ఔన్స్‌కు 4,332 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 72 డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉండగా, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి నగరాల్లో దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటం లేదా స్వల్పంగా మరింత పెరగడం ఆశ్చర్యం కాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Jan 02, 2026 13:53:38
Secunderabad, Telangana:

Gold Investment: 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు ఎప్పటికీ మర్చిపోలేని ఏడాదిగా నిలిచింది. బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. ముఖ్యంగా బంగారం విషయానికి వస్తే.. దాదాపు 70 శాతం వరకు పెరిగి.. అనేక ప్రముఖ స్టాక్ మార్కెట్ షేర్లను కూడా వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో సహజంగానే పెట్టుబడిదారులందరి దృష్టి ఇప్పుడు ఒక్క ప్రశ్నపై కేంద్రీకృతమైంది. ఈ బంగారం ర్యాలీ 2026లో కూడా కొనసాగుతుందా? లేక ఇక్కడితో ఆగిపోతుందా?

2025లో వచ్చినట్లుగా భారీ రాబడులు మళ్లీ రావడం అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయినప్పటికీ.. 2026లో బంగారం పెట్టుబడిదారులకు 12 నుంచి 15 శాతం వరకు స్థిరమైన లాభాలను ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని  భావిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,35,000పలుకుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. 2026 చివరి నాటికి ఈ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల మధ్యకు చేరవచ్చని అంచనాలు వేస్తున్నారు. 

అయితే.. ఈ ప్రయాణం పూర్తిగా నేరుగా ఉండదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది భారీగా లాభాలు వచ్చిన నేపథ్యంలో.. కొందరు ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు దిగే అవకాశం ఉంది. అలా జరిగితే మధ్యలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.18 లక్షల వరకూ దిగివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ స్థాయి పతనం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: VB-G RAM G scheme latest Update:  కార్మికులకు ప్రతినెలా వేతనాలు.. ఆలస్యం అయితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కేంద్ర మంత్రి  ప్రామీస్‌..!!  

పెట్టుబడిదారులు వాస్తవంగా ఎంత లాభం పొందవచ్చనే అంశాన్ని ఒక ఉదాహరణతో చూస్తే స్పష్టత వస్తుంది. రాజు అనే ఒక వ్యక్తి  జనవరి 2026లో బంగారంలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. ఏడాది చివరికి 13 నుంచి 15 శాతం రాబడి వస్తే, ఆ పెట్టుబడి విలువ డిసెంబర్ 2026 నాటికి దాదాపు రూ.3.36 లక్షల నుంచి రూ.3.45 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడిగా చెప్పవచ్చు.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడితే లేదా రూపాయి బలహీనపడితే, భారత్‌లో బంగారం ధరలు పెరుగుతాయి. అదే విధంగా దిగుమతి సుంకాలు, జీఎస్టీ, ఇతర పన్నులు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్య భయాలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా చూస్తారు.

కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు బలాన్నిస్తుంది. ఇటీవల అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. ఇది బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతోంది. భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే మరో కీలక అంశం దాని సాంస్కృతిక ప్రాముఖ్యత. వివాహాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిన వేళ, విలువను కాపాడుకునే సాధనంగా బంగారాన్ని భారతీయులు విశ్వసిస్తారు.మొత్తానికి.. 2026లో బంగారం గత ఏడాది లాంటి అద్భుత ర్యాలీ ఇవ్వకపోయినా, స్థిరమైన, నమ్మదగిన పెట్టుబడిగా తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెట్టే వారికి బంగారం ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగనుంది.

Also Read: Most Stolen Items: బంగారం కాదు.. డబ్బు అంతకన్నా కాదు.. ప్రపంచంలో ఎక్కువగా చోరీకి గురయ్యేది ఇదే..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 12:35:26
Mumbai, Maharashtra:

Private Part Cut in Mumbai: న్యూఇయర్ వేడుకల వేళ ముంబైలో ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ, మాట వినలేదన్న కోపంతో ఒక వివాహిత తన ప్రియుడిపై కత్తితో దాడి చేసి, అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, నిందితురాలు పరారీలో ఉంది.

వివాహేతర సంబంధం
పోలీసుల దర్యాప్తులో ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు (44), నిందితురాలు (25) మధ్య బంధుత్వం ఉంది. ఆమె బాధితుడి సోదరి మరదలు. వీరిద్దరి మధ్య గత ఆరు నుండి ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని చెబుతున్నారు. తన భర్తను విడిచిపెడతానని.. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ బాధితుడిపై నిరంతరం ఒత్తిడి తెచ్చేదట. ఈ విషయంలో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు.

పక్కా ప్లాన్‌తో పిలిపించి..
ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు నవంబర్ 2025లో ముంబై వదిలి బీహార్‌కు వెళ్లిపోయాడు. అయినప్పటికీ ఆమె ఫోన్ ద్వారా బెదిరిస్తూనే ఉంది. డిసెంబర్ 19న బాధితుడు తిరిగి ముంబైకి వచ్చాడు. కానీ ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. 

అయితే ఈ క్రమంలో డిసెంబర్ 31 తెల్లవారుజామున, నూతన సంవత్సర స్వీట్లు ఇస్తానని నమ్మించి ఆమె అతడిని తన ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె పిల్లలు నిద్రపోతున్నారు. మాటల మధ్యలో వివాదం తలెత్తడంతో, ఆమె అకస్మాత్తుగా కత్తితో అతనిపై దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలను కోసి తీవ్రంగా గాయపరిచింది.

తీవ్ర రక్తస్రావం అవుతున్నా, బాధితుడు ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతని కుమారులు, స్నేహితులు వెంటనే అతడిని తొలుత విఎన్ దేశాయ్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం సియోన్ ఆసుపత్రికి తరలించారు. గాయాలు చాలా లోతుగా ఉన్నాయని, అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

పరారీలో నిందితురాలు
ఘటన జరిగినప్పటి నుండి నిందితురాలైన మహిళ పరారీలో ఉందని పోలీసులు చెప్పారు. శాంతాక్రూజ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం ఇంతటి హింసాత్మక ఘటనకు దారితీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Also Read: Dhoni IPL Retirement: సీఎస్‌కే అభిమానులకు బ్యాడ్‌న్యూస్..ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ..ఇక ఐపీఎల్‌కు 'తలా' సెలవు!

Also Read: ATMs Closing Down: దేశంలో భారీగా మూతపడుతోన్న ATMలు..భవిష్యత్తులో మొత్తం నిల్..ఆర్బీఐ కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top