Telangana Assembly Budget Session: 'ఇది సర్కార్ కాదు.. సర్కస్. అధికార యంత్రాంగం నియంత్రణ తప్పింది. కుక్క తోకను ఆడించటం కాదు, తోక కుక్కను ఆడించినట్టు వ్యవహారం జరుగుతోంది' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. 'భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోంది. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారు' అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఎస్‌టీపీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వడ్డీలేని రుణాలు రూ.57 వేల కోట్లు అసెంబ్లీలో చెప్పిన భట్టి, సీతక్క ఎవరూ రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పాలని కోరారు.
Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్.. కనీస పింఛన్ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూసీ ప్రాజెక్ట్, వడ్డీలేని రుణాలు, గవర్నర్ ప్రసంగం, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ప్రజలకు ఇచ్చే గ్యారంటీలకు వినియోగిస్తే మేలని సూచించారు.
Also Read: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్ తెలంగాణ పోలీస్!
'ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డీపీఆర్ ఇచ్చామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి డీపీఆర్ సమర్పించకపోవడంతోనే ఏడీబీ రుణం మంజూరు కాలేదు. పైసా ఇచ్చినోడు లేడు.. డీపీఆర్ లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు. ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినది. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి' అని కేటీఆర్ హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ప్రకటించారు.
Also Read: School Holiday: విద్యార్థులకు 'పండుగే'.. వరుసగా నాలుగు రోజులు స్కూల్స్‌కు హలీడే
'మూసీ ప్రాజెక్ట్‌కు మేం వ్యతిరేకం కాదు. కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి మాత్రమే వ్యతిరేకం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ.. వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. '3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1,400 ఇళ్లు మాత్రమే అంటున్నారు. ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ' అని మండిపడ్డారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెబుతున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.
'గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయి. రూ.57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజంగా ఆ రుణాలు ఇచ్చినట్టు ఆధారాలు చూపిస్తే తాను కచ్చితంగా రాజీనామా చేస్తా' అని మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నాయకుల ఇళ్లు కూడా అదే జోన్‌లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని.. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పించుకుంటోందని పేర్కొన్నారు. 'బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మమ్మల్ని తిడితే కూడా ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మాకే ప్రభుత్వం తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు?' అని కేటీఆర్ తెలిపారు.
'పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని చూపుతుంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోంది. ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Jyeshtabhishekam at Tirumala 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం కొన్ని వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే అక్కడ ప్రతిరోజూ శ్రీవారి భక్తలతో, గోవిందనామస్మరణాలతో మర్మోగుతుంది. ఇక రేపు ఉగాది సందర్భంగా తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ తరువాత శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం కూడా ఆస్థానాలు మొత్తంగా మార్చి నెలలో మూడు జరుగుతాయి. ఆస్థానం అంటే 'దర్బారు' అని అర్థం. అయితే తిరుమలలో శ్రీవారికి జ్యేష్టమాసంలో జ్యేష్టాభిషేకాలు కూడా నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.. ఇది స్వామివారి నిజరూప దర్శన ఉత్సవం. భక్తులు కూడా ఈ వేడుకను కనులారా తిలకించవచ్చు. ఏడాదికి ఒకసారి కలిగే అరుదైన దర్శన భాగ్యాన్ని మీరు తిలకించాలనుకుంటున్నారా?
ఈ జ్యేష్టాభిషేకం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. 2026 జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు . ఈ నేపథ్యంలో 2026 మార్చి 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి జ్యేష్టాభిషేకం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్లో https://ttdevasthanams.ap.gov.in/ లో తిరుమల శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవచ్చు.
ప్రతిఏటా శ్రీమలయప్పస్వామికి ఈ జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రధానంగా స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా.. కళాకాంతులు తరిగిపోకుండా ఈ అభిషేకం నిర్వహించడం ఉత్తమం. అందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు సంపంగి ప్రాకారం కళ్యాణమండపంలో మూడో రోజులపాటు నిర్వహిస్తారు.
మొదటి రోజు స్వామివారికి ఉన్న సువర్ణకవచాన్ని తొలగించి.. వజ్ర కవచాలు తొడుగుతారు. శ్రీవారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇక రెండో రోజు ముత్యాల కవచాన్ని అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహించి, మూడో రోజు తిరుమంజనం తర్వాత బంగారు కవచాలని మళ్లీ అలంకరిస్తారు. దీన్నే జష్టాభిషేకమని పిలుస్తారు. ప్రతి ఏడాది జేష్ట మాసంలో జేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులు పాలు, పెరుగు, తేనె పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు.
Read more: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూన్‌నెల దర్శన, గదుల కోటా విడుదల..!
Read more: Annamayya: 10వ తరగతి పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.34000 జీతం, ఎలా అప్లై చేయాలంటే?
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తేదీన తిరుప్పావడ, వసంతోత్సవం సేవలు జూన్ 21వ తేదీన నిజపాద దర్శనం, 22న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్‌సేవలు కూడా టీటీడీ రద్దు చేస్తుంది. ఇక ఈ ఉత్సవానికి సంబంధించిన టిక్కెట్ రూ.400 వరకు ఉంటుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ప్రజలకు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని వారు ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Python Snake Video Watch: సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది ఇలాంటి వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే, ఇలాంటి వీడియోలు విపరీతంగా ఇతరులకు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు పాములకు సంబంధించిన వీడియోలైతే కొంతమంది రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పిల్లలు వాటితో ఆడుకుంటున్న క్రమంలో వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఇదే ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి మెడలో అత్యంత ప్రమాదకరమైన పైథాన్ స్నేక్ పిల్ల ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ స్నేక్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. కానీ ఆ చిన్నారి ఏ మాత్రం భయపడకుండా తన మెడలో ఏకంగా ప్రమాదకరమైన పామును వేసుకొని ఆడుతూ ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ చిన్నారి తన రెండు చేతులతో పాములను పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..
ఈ వీడియోలో ఆ చిన్నారి మొదటగా ఒక చేతును వదిలిపెట్టడంతో పాము తలభాగం అటు ఇటు అనడం మీరు గమనించవచ్చు. అయితే, ఈ సమయంలో ఆ చిన్నారి కాస్త భయపడినప్పటికీ మళ్లీ తిరిగి రెండో చేతిలో కూడా ఆ పాముని పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాములను పిల్లల చేతికి ఇవ్వడం డేంజర్ అని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇవి పెంపుడు పాముల అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో.. దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వారు తెలుపుతున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే, ఈ వీడియోలో ఉన్న పాము పెంపుడుది కావడంతో ఆ చిన్నారిని ఏమీ అనలేకపోయింది. అంతేకాకుండా ఆ చిన్నారి దగ్గరే తల్లిదండ్రుల నుండి వీడియోలు చిత్రీకరించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vivo T5x 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత్ మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ T సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో బుధవారం కంపెనీ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో పాటు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ధర, ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo T5x 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన 7200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇటీవల వివో కంపెనీ కేవలం 5000mAh బ్యాటరీ మొబైల్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంత పెద్ద బ్యాటరీ మొబైల్ తీసుకురావడం ఇప్పుడు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది..
ఈ వివో T5x 5G మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) LED డిస్ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.. దీనివల్ల గేమింగ్‌తో పాటు వీడియోలు చూసేవారికి అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభవం లభిస్తుంది.
ఈ వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 (Snapdragon 6 Gen 1) ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.. అంతేకాకుండా ఇది అద్భుతమైన స్పీడ్ 5g కనెక్టివిటీ సపోర్టుతో లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం చాలా వరకు పెరుగుతుంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ (Funtouch OS) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఇందులో కంపెనీ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
వివో T5x 5G వేరియంట్ల వారీగా ధరల వివరాల్లోకి వెళ్తే.. మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో సుమారు రూ. 12,999 ధరతో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర సుమారు రూ.14,999తో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర సుమారు రూ. 15,999తో అందుబాటులో ఉంది. అయితే, ఆఫర్స్‌లో భాగంగా దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా Vivo ఇండియా ఈ స్టోర్‌లో కొనుగోలు చేసే వ్యక్తులకు కూడా అద్భుతమైన రూ.1000 వరకు బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. కాబట్టి అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy M17e 5g Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సాంసంగ్ భారత్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. దీనిని గెలాక్సీ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది గెలాక్సీ m17e పేరుతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక కెమెరా సెటప్‌తో కేవలం రూ. 12,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ సాంసంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే స్క్రోలింగ్ చేసే వారికి స్మూతీంగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6,000mAh భారీ బ్యాటరీతో విడుదలైంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 26 గంటల పాటు నిరంతరం వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదలైనట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (Dimensity 6300) 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు ఈ మొబైల్ వెనక భాగం అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్రంట్ భాగంలో ఎంతో ప్రత్యేకమైన 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో సాంసంగ్ కంపెనీ ఆరు ఏళ్లపాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్‌ని అందిస్తోంది. దీంతోపాటు సెక్యూరిటీ ప్రత్యేకమైన అప్డేట్లను కూడా అందిస్తున్నట్లు హామీ ఇస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా మొదటి స్టోరేజ్ వేరియెంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ. 12,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ స్టోరీ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ. 14,499తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం లాంచింగ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద రూ.1,250 వరకు తక్షణమైన డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు అమెజాన్‌తో పాటు ఇతర ఈ కామర్స్ వెబ్సైట్‌లో కొనుగోలు చేసే వారికి మరెన్నో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RRB Loco Pilot Recruitment 2026: భారతీయ రైల్వే రంగం దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడమే కాకుండా అందులో పనిచేసే ఉద్యోగులకు మంచి జీతాలు, ప్రయోజనాలు, శాశ్వత ఉద్యోగం వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయి. ఇదే కారణంగా రైల్వే ఉద్యోగాలకు యువత పోటీ పడుతుంటారు. కేవలం రైల్వే జాబుల కోసం ఉద్యోగార్థులు తమని తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో రైల్వే శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఏ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది? జీతం ఎంత మేర లభిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను ఈసారి భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 674 ఖాళీలను దక్షిణ మధ్య రైల్వేలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు కేవలం తెలుగు రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
విద్యార్హత
భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి (ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి) పూర్తిచేసి ఉండాలి. ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీజిల్ ఇంజన్ మొదలైన సంబంధిత రంగాలలో ఐటీఐ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
నెల జీతం ఎంతంటే?
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక వర్గాల ఆధారంగా వయో సడలింపు ఉంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 5 ఏళ్లు, ఓబీసీ వర్గాలకు 3 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 ఏళ్లు వయో సడలింపు ఇస్తున్నారు. నెలసరి జీతం విషయానికొస్తే.. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం చెల్లించనున్నట్లు సమాచారం.
ఎంపిక ప్రక్రియ ఎలా?
భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులు మొదట CBT-1 పరీక్షకు హాజరు కావాలి. ఆ తర్వాత సాంకేతిక, సాధారణ సబ్జెక్టులను కవర్ చేస్తూ CBT-2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మూడవదిగా కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సైకలాజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష నిర్వహించి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు తేదీ
లోకో పైలట్ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు మే 15 నుండి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఈ ఉద్యోగం కోసం మీరు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు (ఓసీ అభ్యర్థులైన పురుషులు) రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత రూ.400 మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి చెల్లిస్తారు. అదే విధంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.250 దరఖాస్తు రుసుము చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
1. ముందుగా https://rrbsecunderabad.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. హోమ్ పేజీలో "అసిస్టెంట్ లోకల్ పైలట్ పే లెవల్-2 కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2. ఆ తర్వాత ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. అందులో యాప్ బటన్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి.
3. అందులో మీరు మీ పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.
4. అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న రైల్వే బోర్డులో పోస్టులను, జోన్‌ను ఎంచుకోవాలి.
5. ఆ తర్వాత దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. అందులో అడిగిన విద్యార్హత, అనుభవం మొదలైన వివరాలతో మీరు దానిని సరిగ్గా నింపాలి.
6. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న నియమాల ప్రకారం మీరు ఫోటోగ్రాఫ్, సంతకం మొదలైనవాటిని తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
7. అన్ని వివరాలను నింపిన తర్వాత, సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసి, తనిఖీ చేసిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
8. ఆ వెంటనే అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఈ రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
9. దీని తర్వాత, భవిష్యత్‌లో అవసరాల కోసం మీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందువల్ల, దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారు మే 15వ తేదీ నుండి అప్లై చేయోచ్చని తెలియజేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక! దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ఇచ్చే కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500లకు పెంచాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభ వేదికగా వెల్లడించారు.
ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నుంచి ఓ కీలక అప్‌డేట్ రానుంది. 1995 నాటి ఉద్యోగుల పెన్షన్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మార్చి 16న లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి ఈపీఎస్-95 పెన్షన్ పెంచే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం కింద పెన్షనర్లకు ప్రస్తుతం రూ.1,000 ఇస్తున్నారు.
అదే విధంగా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదించిన గ్రాంట్ల డిమాండ్లు (2026-27)పై 15వ నివేదికలో కూడా ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది EPS-95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పెన్షనర్లు పలు పిటిషన్లు దాఖలు చేశారు.
రూ.15,000 కంటే తక్కువ మూల వేతనం (బేసిక్ పే) ఉన్నవారు మాత్రమే పింఛను పథకం పరిధిలోకి వస్తారు. 1995 నాటి ఉద్యోగుల పింఛను పథకానికి భారత సర్కార్ ఇప్పటికే ఆర్థిక సహాయం అందిస్తోందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రభుత్వ వార్షిక వేతన వాటా అయిన 1.16 శాతానికి సమానం, దీనికి బడ్జెట్ మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్‌ను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిజానికి, ఈపీఎస్-95 ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ప్రస్తుతం రూ.1,000 నెలసరి ఇస్తున్న పింఛను సరిపోడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో కనీస పెన్షన్‌ను రూ.7,500లకు పెంచాలని పెన్షనర్లు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పెన్షనర్ల డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సుముఖత లేకపోవడం వల్ల ఇటీవలే పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalakshmi Rajayoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనాలు మానవ జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రస్తుతం విగ్రహ స్థితిగతుల్లో వస్తున్న మార్పులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను తెచ్చిపెట్టబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 16వ తేదీ సోమవారం సాయంత్రం కుంభరాశిలోకి సేనాధిపతిగా భావించే.. కుజుడు సంచారం చేశాడు. అలాగే అదే సమయంలో చంద్రుడితో కలయిక జరపడం విశేషం. అయితే, చంద్రుడు, కుజుడు కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కూడా ఏర్పడింది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా చెప్పుకుంటారు.
సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాజయోగ ప్రభావం ప్రారంభమైంది. మార్చి 18వ తేదీ రాత్రి 11 గంటల వరకు అంటే, దాదాపు రెండున్నర రోజులపాటు దీని ప్రభావం బలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత రోజుల్లో కూడా దీని ప్రభావం కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే, తక్కువ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల కనిపించబోతోంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది.
మేషరాశి
మేషరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం కొంత ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ.. ఈ మహాలక్ష్మి రాజయోగం కాస్త ఉపశమనం అందిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న ప్రతి పని వేగంగా పూర్తవుతుంది. అలాగే అకస్మాత్తుగా కూడా భారీ మొత్తంలో ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చంద్రుడి ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి అదృష్టం రెట్టింపు కాబోతోంది. దీంతోపాటు భూమి లేదా ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి. కోర్టు సంబంధిత కేసుల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. దీంతోపాటు గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు అధిపతి కుజుడుగా ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు, చంద్రుడి కలయిక అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి ఈ సమయంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన కష్టాలకు తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే అనుకూలమైన ధన లాభాలు సొంతం చేసుకోవడం వల్ల అన్నింట్లో విజయాలు సాధించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Mars Effect Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ కదలికలాన్ని మానవ జీవితాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా 2026 సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీన ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సుమారు 18 నెలల తర్వాత అంగారకుడు గురుగ్రహానికి చెందిన మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్కడ అప్పటికి సూర్యుడుతో పాటు శని శుక్ర గ్రహాలు సంచార దశలో ఉన్నాయి.. దీనివల్ల మీన రాశిలో అనేక గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. ముఖ్యంగా జ్యోతిష్య పరిభాషలో శని మంగళ సంయోగం కూడా ఏర్పడుతుంది. అయితే, ఈ సంయోగం అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకుంటారు..
ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడుతుందట. ముఖ్యంగా అన్ని దేశాల్లో అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదిరే ప్రమాదం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్రాన్ని గునులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మార్పులు ఐదు రాశుల వారిపై ఆర్థికంగాను.. ఆరోగ్యంగాను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిన రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రభావితం కాబోతున్న రాశులు ఇవే..
మేషరాశి
మేష రాశి వారికి 12వ స్థానంలో శని మంగళ గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేపట్టిన వీరు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు.. అంతేకాకుండా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమ్మిన వారు నుంచి మోసాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి సామర్థ్యాలు తగ్గినట్లు అనిపించినప్పటికీ.. కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లడం వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో శని మంగళ యోగం ఏర్పడటం వల్ల వైవాహిక జీవితంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని గొడవలు కూడా చోటు చేసుకోబోతున్నాయని వారు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా అనేక సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందడం ఖాయమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరిగింది.. దీని కారణంగా పిల్లల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే మరింత ఒడిదుడుకులకు దారి తీసే అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో మనస్పార్ధాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మాటపై నియంత్రణ కూడా చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు.
మకర రాశి
మూడవ స్థానంలో మకర రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.. అయితే, వీరికి ఈ సమయంలో ధైర్యం పెరిగినప్పటికీ మొండితనం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తోబుట్టులతో లేదా కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తరలితే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ.. మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా గ్రహాల గమనంలో మార్పులు మానవ జీవితంపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కర్మ ఫలాదాతగా భావించి శని దేవుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం వెళ్లడం వల్ల అత్యంత కీలక ఘట్టంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలోని శని దేవుడు భాద్రపద నక్షత్రంలో కదలికలు జరపబోతున్నాడు. ఈ మార్పుల కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కూడా చేకూరబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు చెబుతున్నారు..
ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉంది.. తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని కదలికలు జరపడం వల్ల శని ప్రభావం రెట్టింపు అవుతుంది. దీనివల్ల ఆయా రాశుల వారికి క్రమశిక్షణ విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కష్టపడే తత్వం పెరిగి.. అనుకూలమైన శక్తులు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి ఇది సువర్ణ కాలంగా భావించవచ్చు..
మేషరాశి
శని నక్షత్రంలో కదలికలు జరపడం వల్ల మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యాలయాల్లో పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి. ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడటమే కాకుండా పాత బాకీలు వసూళ్లయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కలిసి రాబోతున్నా. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కుటుంబంలో చిన్నపాటి కలహాలు సర్దుమనిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోయి.. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు శని దేవుడి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాపాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా మార్కెట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే, వ్యక్తులకు భారీ లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో మంచి లాభాలు కూడా పొందుతారు. విద్యార్థులు పోటీల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi A5 Price Specifications: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన సేల్‌లో రెడ్‌మీ A5 స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిసేంది. రెడ్‌మీ వర్షెన్‌లో ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. 5200mAh బ్యాటరీ కెపాసిటీతో కేవలం రూ.7,599 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ రెడ్‌మీ ఏ5 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. అందులో 3GB RAM + 64GBతో పాటు 4GB RAM + 64GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అయితే ఈ మోడల్ వేరియంట్లను రూ.8,999 ప్రారంభ ధరతో భారత విపణిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ జరుగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.7,999 కే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ కొనుగోలు సమయంలో మీరు అదనంగా రూ.400 తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది.
అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM, 128GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 10W USB టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎక్స్‌ట్రార్డినరీ ఫొటోల కోసం 32MP బ్యాక్ కెమెరాతో పాటు 8MP సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది డ్యూయల్ 4G సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Trisha Relationship Rumors: ప్రముఖ తమిళ నటుడు విజయ్ పేరు ఇప్పుడు తమిళ నాట రాజకీయాల్లోనే కాకుండా ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. సినిమాల్లో హీరోగా రాణించిన విజయ్.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. రాబోతున్న తమిళనాడు ఎలక్షన్ టార్గెట్ చేసుకోని తమిళ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీ పెట్టిన విజయ్.. విజయవంతంగా కొన్ని రోడ్ షోలు, సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు రాజకీయంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని చిక్కులు ఎదురుపడ్డాయి.
హీరో విజయ్ రాజకీయంగా కరూర్ తొక్కిసలాట ఘటన కారణంగా సీబీఐ కేసు విచారణ చేపట్టింది. అలాగే వ్యక్తిగతంలో ఆయన భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తన భర్త విజయ్ మరో హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని.. తనకు విడాకులు కావాలని ఆమె కోర్టుకు విన్నవించింది. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే హీరో విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఓ పెళ్లి ఈవెంట్‌కు హాజరయ్యారు. దీంతో ఆ హీరోయిన్ త్రిషానే అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ తన భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత త్రిష, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
హీరో విజయ్, త్రిష కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయ్ రాజకీయ పార్టీ టీవీకేలో త్రిష చేరనుందని..త్వరలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తమిళనాట కోడై కూస్తోంది. ఇటీవలే విజయ్, త్రిష ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారిన క్రమంలో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
ఇప్పుడు నెట్టింట ఈ వీడియోకు హీరోయిన్ త్రిష లైక్ కొట్టడమే ఇప్పుడు మరో ఆరోపణకి తెర లేపింది. అలాగే హీరో విజయ్, త్రిషలకు పెళ్లైనట్లు ఓ ఫ్యాన్స్ కృతిమ మేధా ఆధారంగా వీడియో క్రియేట్ చేశాడు. అందుకు హీరోయిన్ త్రిష లైక్ కొట్టింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు వారి పెళ్లికి వచ్చినట్లు వైరల్ చేశారు. దీంతో విజయ్‌తో ఆమెకు ఉన్న సంబంధం నిజమే అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇంటర్నెట్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోకు హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా లైక్ కొట్టడం వల్ల వీరిద్దరి పెళ్లి లాంఛనమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రిష పుట్టినరోజు 2026 మే 4 రోజునే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాబట్టి.. అదే రోజున సీఎంగా గెలిచి త్రిషకు గిఫ్ట్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో 'పుష్ప 2' మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు హీరో విజయ్‌కు వృత్తిపరంగానూ కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా.. అనేక చిక్కులు కారణంగా ఇప్పటికీ ఆ చిత్రం రిలీజ్ కు నోచుకోలేదు. తాజాగా ఓటీటీ సంస్థ కూడా సినిమాను కొనుగోలు చేయడం లేదని తేల్చి చెప్పడంతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read: LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook