సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Sun Transit 2026 Effect On Zodiac: ఫిబ్రవరిలో అనేక గ్రహాలు రాశుల్లో మార్పులు చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఈ నెలలో రెండు నుంచి మూడు సార్లు కూడా సంచారం చేయబోతున్నాయి. సూర్యుడు ఈ సమయంలో మూడు సార్లు సంచారం చేయనుంది. మొదట ఫిబ్రవరి నెలలో 6వ తేదిన ధనిష్ఠ నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేస్తుంది. అలాగే ఫిబ్రవరి 13వ తేదిన శతభిష నక్షత్రంలో సూర్యుడు, ఫిబ్రవరి 19న మరో సారి మార్పు, ఇలా సూర్యుడు మొత్తం మూడు సార్లు సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఈ రాశులవారికి బంఫర్ లాభాలు:
సింహ రాశి
సూర్యుడు మూడు సార్లు కదలికలు జరపడం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని స్థాయిలో విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రాజకీయాలు, ఇతర సేవా రంగాల్లో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా పొందుతారు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశి
సూర్యుడి సంచారంతో ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా బలం కూడా రెట్టింపు అవుతుంది. ఏ చిన్న నిర్ణయాలు తీసుకున్న జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో తోబుట్టువులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మానిసికంగా బలంగా తయారవుతారు.
మేషరాశి
సూర్యుడి సంచారంతో మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అపారమైన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. దీంతో పాటు చాలా కాలంగా నిలిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. కొత్త కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో విలువ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
వృషభ రాశి
ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారికి కెరీర్ పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. వీరికి పనులకు తగ్గ ప్రశంసలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడి ప్రభావంతో అనుకున్న ధనలాభాలు కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
సూర్యుడి ప్రభావంతో శని పాలించే కుంభ రాశివారికి కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. వీరికి వ్యక్తుత్వం మరింత బలపడుతుంది. అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపార భాగస్వాములకు ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. భవిష్యత్తులో అనుకున్న పనులు కూడా ఇప్పుడే చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto G67 And Moto G77 Leak Features Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా అద్భుతమైన సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ G-సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది మోటో G77తో పాటు మోటో G67 పేర్లతో లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ మొబైల్స్ అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించబోతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Moto G67 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీక్ అయిన వివరాల ప్రకారం, ఇది 6.8-అంగుళాల ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సెక్యూరుటీ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల చేయబోతోంది.
ఈ Moto G67 స్మార్ట్‌ఫోన్ Android 16-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. అలాగే మోడల్‌ను బట్టి కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో హైబ్రిడ్ డ్యూయల్-సిమ్‌తో పాటు 5G, Wi-Fi, బ్లూటూత్, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇక దీని వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ LYT600 ప్రైమరీ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వీడియో కాలీంగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీతో 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానుంది. ఇక Moto G77 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.8-అంగుళాల ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ కాబోతోంది. అలాగే 5,000 నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో డాల్బీ అట్మోస్ మద్దతుతో స్టీరియో స్పీకర్లు కూడా లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 100-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా లభిస్తోంది. వీడియో కాలింగ్ కోసం ఇందులో 32-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇవేకాకుండా లీక్ అయిన వివరాల్లో ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కంపెనీ కూడా అతి త్వరలోనే ఈ రెండు మోడల్స్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy S26 Ultra Launch Date: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్ మార్కెట్లోకి త్వరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ మూడు మొబైల్స్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్ 26, గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌తో పాటు గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్స్ మోడల్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మొబైల్ ఏడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ సిరీస్‌ను కంపెనీ వైట్, స్కై బ్లూ, కోబాల్ట్ వైలెట్, పింక్ గోల్డ్, సిల్వర్ షాడోతో పాటు బ్లాక్ వంటి కలర్స్‌తో లాంచ్ చేయబోతోంది. Samsung వెబ్సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన మూడు కలర్స్‌ను ఇప్పటికే అందుబాటులో ఉంచింది.
ఈ Samsung Galaxy S26 సిరీస్‌ను కంపెనీ వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ Samsung Galaxy S26 సిరీస్ ఫిబ్రవరి 25న లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధరలను వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సిరీస్‌కి సంబంధించిన ధరలు కూడా లీక్ అయ్యాయి.
సాంసంగ్ కంపెనీ ఈ సిరీస్‌ను గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఈవెంట్ కూడా ఒక నెల ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్స్‌ను కంపెనీ దక్షిణ కొరియాతో సహా కొన్ని మార్కెట్లలో విడుదల చేయబోయే మొబైల్స్‌ను 2 nm Exynos 2600 చిప్సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర మార్కెట్లో విడుదల చేసే మోడల్స్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో లాంచ్ చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీనిని కంపెనీ భారతదేశ మార్కెట్లోకి కూడా త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kuwaiti Dinar: డాలర్, పౌండ్, యూరో వంటి ప్రపంచ ప్రఖ్యాత కరెన్సీలతో పోలిస్తే కువైట్ దినార్ (KWD) ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచ కరెన్సీ మార్కెట్ ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూనే ఉన్నా, కువైట్ దినార్ మాత్రం దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతోంది. భారతదేశంలో కేవలం 400 కువైట్ దినార్ల విలువ సుమారు రూ.1,18,000 ఉండటం దీని బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మరి ఈ స్థాయికి కువైట్ కరెన్సీ ఎలా చేరుకుంది? దినార్ ఎందుకు ఇంత శక్తివంతంగా నిలిచిందో తెలుసుకుందాం.
2026 జనవరి 20 నాటి మారకపు రేటు ప్రకారం, ఒక కువైట్ దినార్ విలువ దాదాపు రూ.295.84. అదే సమయంలో ఒక అమెరికన్ డాలర్ సుమారు 3.25 కువైట్ దినార్లకు సమానం. ప్రపంచంలో డాలర్‌కు ఉన్న ఆధిపత్యాన్ని చూసినప్పుడు, దానికంటే బలంగా కువైట్ దినార్ ఉండటం ఆశ్చర్యకరమే. భారత రూపాయి వంటి అనేక కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా, కువైట్ దినార్‌పై పెద్దగా ప్రభావం పడకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి.
1961లో కువైట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అదే ఏడాది దేశానికి సొంత కరెన్సీగా కువైట్ దినార్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు కువైట్ గల్ఫ్ రూపాయిని ఉపయోగించేది. చమురు వనరుల ఆవిష్కరణతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, బలమైన మరియు స్వతంత్ర కరెన్సీ అవసరమని కువైట్ నిర్ణయించింది. ముఖ్యంగా చమురు ఎగుమతుల వంటి విదేశీ వాణిజ్యానికి బలమైన పునాది కల్పించేందుకు దినార్ విలువను మొదటినుంచే అధికంగా ఉంచారు. కాలక్రమేణా ఇది ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన కరెన్సీగా మారింది.
కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ కావడానికి కారణాలు:
1. చమురు సంపదతో కూడిన బలమైన ఆర్థిక వ్యవస్థ:
కువైట్ ప్రపంచంలోని ప్రధాన చమురు ఎగుమతి దేశాల్లో ఒకటి. దేశ జీడీపీలో చమురు కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా తక్కువగా ఉండటంతో, తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వానికి భారీ విదేశీ మారక నిల్వలు ఉంటాయి. ఆర్థిక అస్థిరత అవకాశాలు తక్కువగా ఉండటంతో కరెన్సీ బలంగా నిలుస్తోంది.
2. నియంత్రిత మారకపు విధానం:
కువైట్ తన కరెన్సీ విలువను పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు వదలదు. దినార్‌ను బలమైన కరెన్సీల బాస్కెట్‌కు అనుసంధానించి నిర్వహిస్తారు. దీని వల్ల డాలర్ వంటి కరెన్సీల హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గుతుంది. ఈ విధానం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుంది.
3. తక్కువ జనాభా – అధిక తలసరి ఆదాయం:
కువైట్ జనాభా సుమారు 50 లక్షల లోపే ఉంటుంది. కానీ తలసరి జీడీపీ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉంది. తక్కువ జనాభాపై అధిక ఆర్థిక భారం లేకపోవడం కరెన్సీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా దినార్ స్థిరంగా బలంగా ఉంటుంది.
4. భారీ విదేశీ పెట్టుబడులు, సార్వభౌమ నిధులు:
కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (KIA) ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటి. ఈ నిధులు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభాల నుంచి రక్షిస్తాయి. ఆర్థిక భద్రతపై పెట్టుబడిదారులకు నమ్మకం ఉండటంతో కరెన్సీ విలువ మరింత బలపడుతుంది.
5. డాలర్‌పై పూర్తిగా ఆధారపడని వ్యూహం:
చాలా గల్ఫ్ దేశాలు తమ కరెన్సీలను పూర్తిగా డాలర్‌కు కట్టిపెడతాయి. కానీ కువైట్ మాత్రం బహుళ కరెన్సీ వ్యవస్థను అనుసరిస్తోంది. దీని వల్ల డాలర్ బలహీనపడినప్పటికీ దినార్‌పై పెద్దగా ప్రభావం ఉండదు. అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి.
కువైట్ దినార్ విలువ ఎలా పెరిగింది?
ప్రపంచ చమురు డిమాండ్, స్థిరమైన ఆర్థిక వృద్ధి, నియంత్రిత మారకపు విధానం.. ఈ మూడు ప్రధాన అంశాలు దినార్ విలువ పెరగడానికి కారణమయ్యాయి. ఆరంభం నుంచే కువైట్ అధిక కరెన్సీ విలువను కొనసాగిస్తూ వచ్చింది. దీని ఫలితంగా దినార్ కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా ఎదిగింది.
భవిష్యత్తులో కూడా దినార్ బలంగా ఉంటుందా?
కువైట్ వద్ద విస్తారమైన చమురు నిల్వలు ఉన్నాయి. అంతేకాదు, దేశం ఆర్థిక వైవిధ్యీకరణపై కూడా దృష్టి పెడుతోంది. చమురు మీద ప్రపంచం ఆధారపడటం క్రమంగా తగ్గినా, కువైట్ ముందస్తు ప్రణాళికలతో ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల రాబోయే కాలంలో కూడా కువైట్ దినార్ బలంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ రోజు కువైట్ దినార్ కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు, స్థిరమైన ఆర్థిక విధానాలకు ప్రతీకగా నిలుస్తోంది. చమురు సంపదతో పాటు స్మార్ట్ ఆర్థిక నిర్వహణ, నియంత్రిత మారకపు విధానం, భారీ పెట్టుబడులు మరియు తక్కువ జనాభా వంటి అంశాలు కలిసి దినార్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా మార్చాయి. అందుకే డాలర్ కూడా దినార్ ఆధిపత్యాన్ని అధిగమించలేకపోతుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీగా ఉండటం అంటే ఆ దేశం తప్పకుండా అత్యంత సంపన్న దేశమే అన్న అర్థం కాదు. కేవలం ఆ కరెన్సీ యూనిట్‌కు ఇతర కరెన్సీలతో పోలిస్తే మారకపు విలువ ఎక్కువగా ఉండటం మాత్రమే దానికి కారణం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Trump - Narendra Modi: గత కొన్నేళ్లు భారత్ పై టారిఫ్ లతో విరుచుకుపడుతున్న ట్రంప్.. తాజాగా మెత్తపడినట్టు కనిపిస్తుంది. ట్రంప్ ఎంత చేసినా మోడీ దిగిరాకపోవడంతో మళ్లీ నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. తాజాగా భారత్, అమెరికా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో మరింత బలోపేతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము భారత్‌తో ఒక అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామన్నారు. దీనిపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని కామెంట్ చేశారు.ప్రపంచ దేశాలతో వాణిజ్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్‌ను అమెరికా ఒక నమ్మకమైన, వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ కొత్త ఒప్పందం ఉండబోతోందన్నారు. గతంలో కొన్ని సుంకాల విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ, ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఆ అడ్డంకులు తొలగిపోయి, త్వరలోనే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Tirumala Ratha Saptami Mini Brahmothsavam: మాఘమాసం సప్తమిరోజున వేకువజామునుంచే స్వామివారి వాహనసేవలు ప్రారంభమవుతాయి. సూర్యప్రభవాహనంతో ప్రారంభమై శేషవాహనం, గరుడ వాహనం, హనుమంతవాహనం, చక్రస్నానం, కల్పవృక్షవాహనం, సర్వభూపాలవాహనం, చంద్రప్రభవాహన సేవల్లో శ్రీవారు విహరిస్తూ... భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ఆర్జిత సేవలను రద్దుచేశారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు పూర్తిగా రద్దు చేశారు. అలాగే VIP బ్రేక్ దర్శనాలు, NRI దర్శనం, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశారు. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను జనవరి 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతోపాటు బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తితిదే తెలిపింది. రథ సప్తమి సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని ఊరేగించే అన్ని రకాల సేవలుంటాయి. ఉదయం సూర్య ప్రభ వాహనం నుంచి రాత్రి చంద్ర ప్రభ వాహనం వరకు అన్ని రకాల సేవలను ఈ సందర్భంగా స్వామి వారిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ప్రారంభమై ఏడేళ్లు అవుతున్నా..ఏడాదికేడాది ఈ సంఖ్య భారీగా తగ్గుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల భార్య, భర్తలు, తండ్రీ కొడుకులు ఇద్దరూ వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి, ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే.. ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో ఆరు నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం తంటాలు పడుతున్నారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
మొత్తంగా ప్రధాన మంత్రి కార్యాలయం తీసుకుంటున్న ఈ చర్యలతో అక్రమార్కులకు చెక్ పడబోతుంది. కొంత మంది ఒకే ఇంటి నుంచి నలుగురైదుగురు లబ్ది పొందుతున్నారు. ఒక భూమిని భార్యా, భర్తలు.. విడివిడిగాలబ్ది పొందుతున్నారన్న సమాచారం ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్ లో కొంత మంది అనవసరంగా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Atal Pension Yojana: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. నెలవారీ పెన్షన్ అందించే ఉద్దేశంతో అమల్లో ఉన్న అటల్ పెన్షన్ యోజన (APY)ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నెలకు గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ అందించే ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటల్ పెన్షన్ యోజనకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల అంచుల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల వరకు ఈ పథకం చేరేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జనవరి 19 నాటికి ఈ పథకంలో మొత్తం 8.66 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఇంకా ఎక్కువ మందిని ఈ సామాజిక భద్రతా పథకంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే గడువును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందుతూ ఆర్థిక భద్రతతో జీవితం కొనసాగిస్తారు. అయితే అసంఘటిత రంగ కార్మికులకు అలాంటి భరోసా ఉండదు. ఈ లోటును తీర్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు దాటిన తర్వాత సభ్యులకు నెలకు కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ అందుతుంది.
18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారు తమకు కావాల్సిన పెన్షన్ మొత్తాన్ని ముందుగానే ఎంచుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) పర్యవేక్షిస్తుంది. అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే పోస్టాఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పరిధిలోకి వచ్చే వారు, అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు కారు. 18 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్‌లో చేరిన వారు నెలకు సుమారు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే, వచ్చే 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నెలవారీ చెల్లింపు రూ.291 నుంచి రూ.1,454 వరకు ఉండొచ్చు.
ఈ పథకంలో సభ్యులైన వారు తమ బ్యాంక్ ఖాతాను అటల్ పెన్షన్ యోజనకు లింక్ చేసి, ప్రతి నెలా ఆటో డెబిట్ అయ్యేలా బ్యాంకుకు అనుమతి ఇవ్వాలి. అందువల్ల ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఖాతాలో డబ్బు లేకపోతే పెనాల్టీ విధించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే దిశగా అటల్ పెన్షన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Counter Reaction on Kavitha: గత కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్నారు కవిత, కేటీఆర్. అంతేకాదు కవిత కూడా తన అన్న పై రెచ్చిపోయినా.. కేటీఆర్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. కానీ తన చెల్లి మాటలపై కల్వకుంట్ల తారక రామారావు తాజాగా స్పందించారు. గతంలో ఎవర్నీ కలవని కేటీఆర్.. ప్రస్తుతం సర్పంచ్ లను కూడా కలుస్తున్నారంటూ కవిత విమర్శలు గుప్పించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
సర్పంచులను కలవడం కొత్తేమీ కాదనీ.... తెలంగాణ భవన్ కు వచ్చిన అందరినీ గతంలో కలిశాం, ఇప్పుడూ కలుస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అంతే ఘాటుగా కౌంటర్ ఇవ్వాలని గులాబీ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
కవిత గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ కూడా చేయని తీవ్రాతి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ వంటి దేవుడు చుట్టూ కేటీఆర్, హరీష్ రావు వంటి దెయ్యాలు చేరాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు పార్టీని వాళ్లిద్దరే నియంత్రణలోకి తీసుకొని మిగతా వాళ్లను తొక్కేస్తున్నారంటూ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన లీడర్లను కూడా ఏదో కుంభకోణంతో లింకులు ఉన్నాయంటూ పలు ప్రెస్ మీట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక లిక్కర్ కుంభకోణంలో అప్పట్లో కవిత అరెస్ట్ సమయంలో పార్టీ తనకు అండగా నిలబడలేదనే కారణంగా కవిత.. ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది వీళ్లిద్దరు ఎవరు చెప్పేది నిజం అనేది ప్రజలే తేలుస్తారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Nandyal Bus Fire Accident: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని బస్సుల్లో ఇదే తరహా ఘటనలు గత కొన్ని రోజులుగా ఓ సిరీస్ లా తెలుగు రాష్ట్రాల ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించాలంటే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్ గా కర్నూలు, చేవేళ్ల విజయవాడ ఇలా చెప్పుకుంటూ కొండవీటి చాంతాడు అంత లిస్ట్ అవుతుంది. తాజాగా ప్రణాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అపుడు బస్సు దాదాపు 100 కిలోమీటర్ల స్పీడుతో ఉంది. దీంతో బస్సు కంట్రోల్ కోల్పోయి సమీపంలోని డివైడర్ మీదుగా దూసుకెళ్లి అవతలి రోడ్డు పై వస్తోన్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు అక్కడికక్కడే మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి 36 మంది ప్యాసింజర్స్ తో హైదరాబాద్ వెళుతున్న ఓ ARBCVR ప్రైవేట్ ట్రావెల్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాకా నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల మండలం శిరివెళ్ల మెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి రోడ్డు పైకి బస్సు దూసుకెళ్లింది. అదే సమయంలో అటువైపుగా వేగంగా వస్తోన్న లారీని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు లారీ డ్రైవర్ ముగ్గురు ఆన్ ది స్పాట్ చనిపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఆ రూట్లో వెళుతున్న ఓ డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు బతుకు జీవుడా అన్నట్టుగా సురక్షితంగా బయటపడ్డారు. కిటికీల్లోంచి కిందకు దూకడంతో కొంత మందికి స్పల్ప గాయాలయ్యాయి. మంటలు వ్యాపించడంతో బస్సును ఢీ కొట్టిన కంటెనర్ లారీ కూడా పూర్తిగా అగ్నికి ఆహూతి అయిపోయింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
మంటలు పూర్తిగా వ్యాపించడంతో బస్సు డ్రైవర్ తో పాటు.. ఎదురుగా వస్తోన్న లారీ డ్రైవర్.. బస్సు క్లీనర్ మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికుల లగేజి మొత్తంగా కాలి బూడిదైంది. మరోవైపు ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. మొత్తంగా ఈ ఘటన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. మరొకొందరిని వేరే వాహానాల్లో హైదరాబాద్ తరలించారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
RMZ Group Investment: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేయగా.. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీ ఆర్ఎంజెడ్ గ్రూపు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏపీలో పది బిలియన్ డార్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆర్ఎంజెడ్ గ్రూపు కీలక ఒప్పందం చేసుకుంది.
Also Read: YS Jagan: ఇక వైసీపీ కార్యకర్తలతో ఉంటా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసిపోతా: వైఎస్ జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్ఎంజెడ్ గ్రూప్ ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయి మిక్స్డ్-యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడంతో ఏపీలో వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ఆర్ఎంజెడ్ గ్రూపు ప్రకటించింది. నారా లోకేశ్, ఆర్ఎంజెడ్ గ్రూప్ చైర్మన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశాఖపట్టణాన్ని నెక్స్ట్-జనరేషన్ మిక్స్డ్-యూజ్, డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంతో రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్ ఆధారిత అభివృద్ధిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఈ అంశాలను ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులకు ప్రభుత్వ బృందం వివరించడంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకారం తెలిపింది.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర
విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తోంది. సుమారు 50 ఎకరాల్లో గరిష్టంగా 10 మిలియన్ చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసి, గ్లోబల్ సంస్థలను ఆకర్షించడంతో విశాఖలోని జీసీసీ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంది. విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా గరిష్టంగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్-జనరేషన్ డిజిటల్, ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతు లభిస్తుంది.
Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
రాయలసీమ ప్రాంతంలోని టెకులోడు వద్ద సుమారు 1,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతిపాదిస్తోంది. ఇది పరిశ్రమల తయారీ, గిడ్డంగుల నిర్వహణ, లాజిస్టిక్స్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలువనుంది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని ఆర్ఎంజెడ్ సంస్థ సూచిస్తోంది. ఈ పెట్టుబడులతో ఐటీ, డేటా సెంటర్లు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి