ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలకు జననం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, బుదా కలన్ గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల అంజి అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు శనివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులోనే ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని అంజి తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని అతడు కోరారు. మేక పిల్లలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tirumala VIPs: తిరుమల శ్రీవారి సేవలో తమిళ స్టార్ నటుడు
Dharmavaram, Andhra Pradesh:Tamil Hero Soori And Music Director Mani Sharma Visits Tirumala Temple Watch Videoరేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఎవరి డబ్బులు ఖర్చు చేశారు? ఎంపీ ధర్మపురి అరవింద్
Nizamabad, Telangana:Revanth Reddy US Tour: అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక కారణాలేమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విదేశీ పర్యటన టికెట్లు బుక్ చేసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ ఎందుకు రాలేదో చెప్పాలని నిలదీారు. క్లియరెన్స్ రాకముందే టికెట్లు బుక్ చేయడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రతినిధి మొత్తం విదేశీ పర్యటన కొనసాగుతుంటే రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటన ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటనకు క్లియరెన్స్ రాకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని.. క్లియరెన్స్ ఎందుకు రాలేదో తెలపాలని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతున్న కారణాలు వాస్తవం కావని ధర్మపురి అరవింద్ కొట్టిపారేశారు. 'రేవంత్ రెడ్డి పాస్‌పోర్టును రెండు వారాల కిందటే సమర్పించారు. కోర్టు పరిధిలో ఉన్న పాస్‌పోర్టు తీసుకుని రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. విదేశీ పర్యటనలో ఫారిన్ హాస్పిటాలిటీ, ఎఫ్సీఆర్ఏ నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భోజనం, హోటల్ బిల్లులు, వాహనాల ఖర్చులు ఎవరూ భరిస్తున్నారో తేలాలని కోరారు. ఆ ఖర్చులు ఏ సంస్థలు భరిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'విదేశీ సంస్థలకు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా? పరిశీలించాలి. ఆక్స్‌ఫర్డ్‌లో రేవంత్ రెడ్డి వెళ్లనున్న సంస్థలు, కార్యక్రమాల వివరాలు నా వద్ద ఉన్నాయి. ఆయా సంస్థలకు జార్జ్ సోరోస్‌తో సంబంధాలపై ఆధారాలతో మాట్లాడా. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి రేవంత్ రెడ్డి హాజరుకావడంలో తప్పులేదు. వివాహానికి వెళ్లాలనుకుంటే ముందే ప్రణాళిక వేసుకుని క్లియరెన్స్ తీసుకోవాల్సింది' అని ధర్మపురి అరవింద్ సూచించారు. క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేయడం సరికాదని విమర్శించారు.
వివాహానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సొంత డబ్బుతో టికెట్ కొనాల్సి ఉందని ధర్మపురి అరవింద్ చెప్పారు. విదేశీ పర్యటనకు ప్రజాధనం ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విదేశీ పర్యటన పేరుతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పసుపు రైతులకు రూ.24 వేల హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'విదేశీ పర్యటనలో భారీ పెట్టుబడులు, విద్యాసంస్థల ఒప్పందాలు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అలాంటి పర్యటనలో రేవంత్ రెడ్డి ఒక్కరికే క్లియరెన్స్ ఎందుకు రాలేదు? ఇది చిన్న సమస్య కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం' అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయాలకు సంబంధించినది కాదని.. జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించినదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వ్యవహారం మొత్తం రాష్ట్రానికే ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.
ఓ ఎంపీ కొడుకు ప్రమాదంపై మాదాపూర్ పోలీసుల కీలక ప్రకటన.. 'అవసరమైతే అరెస్ట్ చేస్తాం'
Hyderabad, Telangana:Inorbit Mall Accident Case Update: హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద అత్యంత వేగంగా స్పోర్ట్స్ కారుతో ఢీకొట్టడంతో ఓ యువతి మరణించగా.. కారు నడిపిన నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అయితే నిందితుడి పేరు.. అతడి తండ్రి పేరు ప్రస్తావించకుండా కేవలం కేసు నంబర్ ప్రస్తావిస్తూ ప్రకటన చేయడం విస్మయానికి గురి చేస్తోంది. మాదాపూర్ పోలీసుల పూర్తి ప్రకటన ఇలా ఉంది.
మాదాపూర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ డీసీపీ రితిరాజ్ ప్రకటించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేవారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని డీసీపీ రితిరాజ్ ప్రకటన చేశారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 1238/2026 కేసులో నిందితుడి అరెస్ట్‌పై వస్తున్న ఆరోపణలకు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టత ఇచ్చారు.
'ఆగస్టు 16వ తేదీన బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశాం. కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మద్యం, డ్రగ్స్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించాం. ఆ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. అనంతరం నిందితుడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించాం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి ఎంవీఐ తనిఖీకి పంపించాం' అని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
ఎంవీఐ నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని డీసీపీ తెలిపారు. సెక్షన్ 106(1) కింద నమోదైన నేరానికి గరిష్ఠంగా ఐదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉండడంతో ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా? లేదా? అనే అంశాన్ని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని డీసీపీ వివరించారు. అరెస్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అర్నేశ్ కుమార్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణనలోకి తీసుకున్నారని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
'ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేసి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించాం' అని డీసీపీ రితిరాజ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారని వస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా డీసీపీ ఖండించారు.
'పోలీసుల నిర్ణయం పూర్తిగా చట్టపరమైన నిబంధనలు, కేసులో అప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే తీసుకున్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎంవీఐ నివేదికతో పాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం' అని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకుండా నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, చట్టపరంగా కూడా నిలబడవని డీసీపీ రితిరాజ్ తేల్చిచెప్పారు.
Konda Surekha: సీఎం రేవంత్ వచ్చాక అన్ని విషయాలు చెప్తా.!. సుష్మిత వివాదంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:konda surekha reacts on her daughter sushmita controversy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొండా ఫ్యామిలీ చుట్టు తిరుగుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూతురు వరంగల్ జిల్లా గీసు కొండలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టిని కలవరపెట్టేదిగా మారాయి. అంతే కాకుండా ఏకంగా సీఎంను సుష్మిత టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన ప్రతిష్టను అభాసుపాలు చేసేలా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సైతం సీరియస్ అయ్యింది. దీనిపై ఇప్పటికే క్రమశికణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ గా కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏంజరుగబోతుందని రచ్చ మొదలైంది. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనను కలిసి అన్ని విషయాలు బైటపెడతానని అన్నారు.
ఇప్పటికే క్రమశికణ కమిటీకి చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మా ఇంట్లో పూజలతో బిజీగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివాదంపై మాట్లాడేందుకు కొండా సురేఖ ఆసక్తిని చూపించలేదు.
Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం..
మరోవైపు కొండా సుష్మిత తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గౌరవమన్నారు. అసలు సీఎం రేవంత్ తన టార్గెట్ అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్ని మరో టర్న్ తీసుకునేలా చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం.. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై కేసు!
Hyderabad, Telangana:Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది..
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..
ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడట.. దీంతో గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం.
పంచాయితీలో తన తప్పును అంగీకరించి.. సారీ చెప్పాల్సింది పోయి.. నిందితుడు తన పరపతిని వినియోగించి.. కేసును తొక్కేసే ప్రయత్నం చేశాడట.. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలికి.. ఆమె భర్తకు బెదిరింపులకు గురిచేసినట్లు కూడా సమాచారం. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు.. కేసు పెట్టకుండా ఉంటే పరిహారంగా అర ఎకరం భూమి రాసిస్తానని గ్రామ పెద్దల ద్వారా రాయబారం నడిపాడట..
అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లంతా నాతో పడుకున్నారంటూ.. శంకర్ రెడ్డి పచ్చి బూతులతో పాటు నోటి దురుసు మాటలు మాట్లాడటం అతని అహంకారానికి.. శాడిజానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గని బాధితురాలు.. ధైర్యంగా ఆత్మకూరు (ఎం) పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jagtial: జగిత్యాలలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవమానం? తిండి దగ్గర ఆంక్షలు..
Hyderabad, Telangana:Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్‌తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు.
సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా తెలుస్తోంది.. సభలకు జనాన్ని తరలించుకోవడానికే మేం పనికొస్తామా? మా కనీస సమస్యలు.. ప్రయాణ అవసరాలు మీకు పట్టవా? అంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాస్తా.. అధికారుల నిర్లక్ష్యంతో పాటు అధికారుల నిబంధనల వల్ల తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రులు పదేపదే చెబుతున్న సమయంలో.. క్షేత్రస్థాయిలో భోజనం విషయంలో సైతం ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి అస్తవ్యస్త ఏర్పాట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: వామ్మె.. పొలంలో ట్రాక్టర్‌కు అడ్డంగా భారీ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Massive King Cobra Video: పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు అప్పుడప్పుడు అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపించడం చాలా సాధారణం.. అయితే, ఒక్కోసారి ఊహించని విధంగా భారీ సైజులో ఉండే విష సర్పాలు ఎదురై రైతులను భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక భారీ నాగుపాము ట్రాక్టర్ అడ్డంగా నిలబడి పడగ విప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యవసాయ భూమిలో పనులు జరుగుతుండడం మీరు గమనించవచ్చు. ఓ రైతు తన ట్రాక్టర్‌ను నడుపుకుంటూ ముందుకు వెళ్లడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అంతా మామూలుగానే సాగుతున్న ఆ సమయంలో.. భారీ కోబ్రా ఆ ట్రాక్టర్ చక్రాల ముందుకు రావడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్ అద్భుతమైన టైమింగ్‌తో బ్రేకులు వేయడం కూడా మీరు చూడొచ్చు..ఈ సమయంలో ఏమాత్రం ముందుకు వెళ్లినా ఆ పాము ట్రాక్టర్ టైరు కింద నలిగిపోయి ఉండేది..
అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము టైరు ముందు నిలబడి బుసలు కొడుతూ పడగ విప్పిన దృశ్యం చూస్తుంటే ఎవరికైనా భయం కలగక తప్పదు.. ఈ పరిస్థితిని చూసిన వారు వెంటనే స్నేక్ క్యాచర్ సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను కోబ్రా రెప్టైల్స్ (Cobra Reptiles) అనే యూట్యూబ్ ఛానెల్‌కి వారు వీడియోగా చిత్రీకరించి పోస్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ వీడియోలో ఆ నాగుపామును పట్టుకునేందుకు.. ఒకరు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా.. కేవలం ఒక సాధారణ ప్లాస్టిక్ పీవీసీ పైపును చేతుల్లో పట్టుకుని అత్యంత సులభంగా ఆ పామును అందులోకి పంపే ప్రయత్నం చేశారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
పాము వెనుక భాగాన్ని నెమ్మదిగా చేత్తో పట్టుకుని.. దాని తల భాగాన్ని ఆ పైపులోకి దూర్చాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఏమాత్రం భయం లేకుండా.. ఎంతో నైపుణ్యంతో ఆ స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా రక్షించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది..సాధారణంగా ఇలాంటి పాములను చూసినప్పుడు భయంతో రైతులు పాములను కొట్టి చంపుతూ ఉంటారు. అయితే, ఇక్కడ మాత్రం ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తి.. స్నేక్ క్యాచర్ ఎక్పీరియన్స్ మూగ జీవి ప్రాణాలను కాపాడాయి. ప్రస్తుతం ఈ యూట్యూబ్ షార్ట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియో చూసిన కామెంట్లు కూడా పెడుతున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana BJP: రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దులో రాజకీయ కోణం లేదు: బీజేపీ
Baddipadaga, Telangana:Revanth Reddy US Tour Cancel: అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి టూర్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. అతడి అమెరికా పర్యటన రద్దు విషయమై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం.. వారితోపాటు వెళ్లేవారికి పనులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై రాంచందర్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి' అని వివరించారు. 'విదేశాలకు వెళ్లేవారికి క్లియరెన్స్ ఉంటుంది. కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తుల హోదాను కూడా చూశాకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఉంటుంది' అని వెల్లడించారు.
'తరుణ్ గగోయ్ కూడా గతంలో అమెరికా పర్యటన కోసం అనుమతి ఇవ్వలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వమే ఉంది' అని రాంచందర్ రావు వివరించారు. రేవంత్ రెడ్డి గతంలో వెళ్లినప్పుడు ఆపలేదు కదా అని గుర్తుచేశారు. 'ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందులో భాగంగానే అనుమతి ఇవ్వలేదు. అంతేకానీ దీనిలో ఎటువంటి రాజకీయకోణం లేదు' అని స్పష్టం చేశారు. నీట్ విద్యార్థులు తనను కలవడంతో వారితో రాంచందర్ మాట్లాడారు.
ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి.… pic.twitter.com/fFlvPyI8nd
— BJP Telangana (@BJP4Telangana) August 21, 2026
'స్టూడెంట్స్ వద్ద అదనంగా ఫీజు వసూలు చేశారో వాళ్లకు తిరిగి ఇచ్చివేయాలని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అదనంగా ఫీజు వసూలు చేసిన కాలేజీల నుంచి పేరెంట్స్‌కు తిరిగి ఇప్పించాలని నన్ను కోరారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన నీట్ విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 'ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధన ప్రకారం నాలుగున్నరేళ్లకే ఫీజు తీసుకోవాలి. కానీ ప్రైవేట్ కాలేజీలు ఇంటర్న్‌షిప్ ఏడాదికి కూడా ఫీజు వసూలు చేస్తున్నాయి' అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
'ఫీజు కట్టని విద్యార్థులను క్లాసులకు రానివ్వకపోవడం, బయోమెట్రిక్ హాజరు బ్లాక్ చేయడం, హాల్ టికెట్లు ఆపడం చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వడం లేదు' అని విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజు వెనక్కి ఇవ్వాలని, స్టైపెండ్ నిబంధనల ప్రకారం ఇవ్వాలని, రూల్స్ ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. బాధిత విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని.. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చారు.
Shavukaru Janaki: సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి.. దిగ్గజ నటి షావుకారి జానకి కన్నుమూత
Chennai, Tamil Nadu:Shavukaru Janaki Passes Away: దక్షిణ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వందల సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె కొన్ని రోజుల కిందట చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా షావుకారు జానకి నటించారు. ఆమె మృతికి దక్షిణాది సీని పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు.
Irumudi Public Talk: 'ఇరుముడి' సినిమా హిట్టా..ఫట్టా..? పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూడండి!
Hyderabad, Telangana:Irumudi Movie Public Talk: మాస్ మహారాజ్ రవితేజ ప్రధానపాత్రలో ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఇరుముడి'. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలైంది. డివోషనల్ థ్రిల్లర్ జోనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది పబ్లిక్ టాక్ ద్వారా తెలుసుకుందాం.AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..ఎన్నికలు ఎప్పుడంటే?
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections Update: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయల చుట్టూ ఇప్పుడు ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. తాజాగా ఎన్నికల షెడ్యూల్ తేదీలు విడుదల అయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరుముడి మూవీ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే!
Hyderabad, Telangana:Irumudi Movie Review: ఈ రోజు విడుదలైన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. శబరిమల యాత్ర నేపథ్యంతో పాటు మంచి భావోద్వేగంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుందని టాక్ నడుస్తోంది. ప్రధాన పాత్రధారులు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. అయితే, ఈ సినిమా రివ్యూను ప్రేక్షకుల మాటాల్లోనే తెలుసుకుందాం..Irumudi Movie Review: అయ్యప్ప భక్తులను ఇరుముడి కట్టిపడేసిందా.. సినిమా ఎలా ఉందంటే?
Hyderabad, Telangana:Irumudi Movie Review: శబరిమల అయ్యప్ప దీక్ష వైభవాన్ని చెబుతూ తెరకెక్కిన ఇరుముడి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అద్భుతమైన కథతో సాగే ఈ సినిమా ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఈ మూవీ ఎలా ఉందో ప్రేక్షకుల ద్వారా తెలుసుకుందాం..థియేటర్లలో ఇరుముడి సందడి.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
Hyderabad, Telangana:Irumudi Movie Review: ఆధ్యాత్మిక భావనలతో కూడిన సరికొత్త కథనంతో ఇరుముడి ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తోంది.. కథలో అద్భుతమైన భక్తి, కుటుంబ బంధాలు, జీవిత సత్యాలను చక్కగా ప్రతిబింబించగా... కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటాల్లో తెలుకుందాం..
Agni Pariksha Trolls: బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు..షో జడ్జ్‌ల వైఖరిపై నెటిజన్ల ఆగ్రహం!
Hyderabad, Telangana:Agni Pariksha 2 Controversy: 'బిగ్‌బాస్' రియాలిటీ షోలోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రారంభమైన 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ షో ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ కార్యక్రమంలో నిర్ణేతలుగా (జడ్జీలుగా) వ్యవహరిస్తున్న నటులు నవదీప్, అభిజిత్, బిందు మాధవిల తీరుపై కోట్లాది మంది ప్రేక్షకులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్లను పరీక్షించే విధానం, జెండర్ ఆధారంగా వ్యత్యాసాలు చూపించడం, వ్యక్తిగత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ప్రధాన వివాదాలు, ప్రేక్షకుల ఆరోపణలు..
1) పక్షపాతం, జెండర్ వ్యత్యాసం: ఈ షో ఆడిషన్స్ కంటెస్టెంట్లకు ప్రతిభను నిరూపించుకునే 'అగ్నిపరీక్ష'లా కాకుండా ఒక 'స్వయంవరం'లా సాగుతోందని కొందరు విమర్శిస్తున్నారు. పురుష కంటెస్టెంట్లు వచ్చినప్పుడు వారు తమ విషయాలు పూర్తిస్థాయిలో చెప్పే అవకాశం ఇవ్వకుండానే త్వరితగతిన 'రెడ్ కార్డ్' ఇచ్చి పంపించేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మహిళా కంటెస్టెంట్లు వచ్చినప్పుడు మాత్రం జడ్జీలు ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఫ్రెండ్లీగా సంభాషిస్తున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు.
2) ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్‌పై ప్రవర్తన: ఆడిషన్స్‌కు వచ్చిన ప్రముఖ ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు పట్ల జడ్జీలు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దారితీసింది. ఆయనతో మాట్లాడిన విధానం, చేసిన కొన్ని వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కంటెస్టెంట్ ప్రతిభను, వ్యక్తిత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత జడ్జీలపై ఉందని హితవు పలుకుతున్నారు.
3) అభిజిత్ రెడ్ కార్డ్ వివాదం: ఒక కంటెస్టెంట్ సరదాగా బిగ్‌బాస్ విజేత అభిజిత్‌ను ఉద్దేశించి, "బిగ్‌బాస్ గెలిచిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎక్కడా కనిపించలేదు" అని కామెంట్ చేయగా, దాన్ని అభిజిత్ వ్యక్తిగతంగా తీసుకుని వెంటనే రెడ్ కార్డ్ ఇచ్చి పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరదా సంభాషణలకు కూడా అవకాశం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రేక్షకుల విజ్ఞప్తి..
మొత్తానికి, 'అగ్నిపరీక్ష 2' వేదికపై ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లింగ వివక్ష లేదా పక్షపాతం లేకుండా కంటెస్టెంట్లందరినీ సమానంగా చూడాలని నెటిజన్లు కోరుతున్నారు. షోను మరింత ప్రొఫెషనల్‌గా నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈ వరుస విమర్శలపై షో నిర్వాహకులు గానీ, జడ్జీలు గానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్ చేసిన ఉప్పల్ బాలు!
Also Read: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

)