icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement

Hyderabad Police: హైదరాబాద్‌లో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ట్రాఫిక్‌ పోలీసులు

Hyderabad, Telangana:

  Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జోయల్ డేవిస విజ్ఞప్తి చేశారు. నగరంలోని లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్ సింగ్, రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో ఉండి లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, పీటీఐ మాసబ్ ట్యాంక్ వంటి నీటి నిల్వ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటి పరిస్థితిని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను సమగ్రంగా పరిశీలించి పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకున్నారు. ఆయనతోపాటు  నగరంలోని ఇతర ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతుండడంతో ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ వాహనాల రద్దీని నియంత్రణ చేశారు.

నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
==> అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
==> వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో ఉన్న వాహనదారులు తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా, వేగాన్ని నియంత్రిస్తూ, జాగ్రత్తగా నడపాలి. రహదారులపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
==> ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించాలి. అత్యవసర ప్రయాణాలు చేసే వారు సాధారణ సమయం కంటే కొంత అదనపు సమయాన్ని కేటాయించుకుని బయలుదేరడం శ్రేయస్కరం.
==> అధికారిక సమాచారం ప్రామాణికం. సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఎప్పటికప్పుడు అందించే అధికారిక సమాచారాన్ని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను గమనిస్తూ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలి.
==> వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

0
0
Report
Advertisement

Hyderabad Rains: భారీ వర్షంతో అతలాకుతలం.. హైదరాబాద్‌ ప్రజలకు పోలీసుల కీలక సూచనలు

Hyderabad, Telangana:

Hyderabad Police: ఎల్‌నినో ప్రభావంతో ఇన్నాళ్లు వర్షాలు లేకపోగా కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ను వరుణుడు ముంచెత్తుతున్నాడు. సాయంత్రం అయ్యిందంటే భారీ వర్షంతో హైదరాబాద్‌ తడిచి ముద్దవుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రిదాకా కొన్ని గంటలపాటు వర్షం పడింది. ఈ వర్షం కారణంగా హైదరాబాద్‌లో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ప్రైవేటు సంస్థలతోపాటు సాధారణ ప్రజలకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు చెప్పారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. 'వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని సజ్జనార్‌ ప్రకటన చేశారు.

పోలీస్‌ కమిషనర్‌ సూచనలు ఇవే..
==> ఒకవేళ ప్రయాణం తప్పనిసరైతే.. నీరు నిలిచిన రోడ్లపై వాహనాలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు
==> వాహనాలను చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పక పాటించాలి
==> ప్రయాణాలకు కొంత అదనపు సమయాన్ని కేటాయించుకోవడంతో పాటు, సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ విభాగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి
==> ఎలాంటి అత్యవసర సహాయానికైనా వెంటనే 'డయల్ 100'కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చు.
==> వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీస్‌ యంత్రాంగం 24 గంటలూ మీ రక్షణ కోసం అందుబాటులో ఉంటుంది.

0
0
Report
Advertisement

టాప్ 10 గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

Hyderabad, Telangana:

Happy Guru Purnima Wishes: ఈ గురు పౌర్ణమిని.. వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు. చతుర్వేదాలను విడదీసి లోకానికి అందించిన వేద వ్యాస మహర్షి జన్మించిన రోజు ఇది.. అంతేకాకుండా, ఆయన మహాభారతం, 18 పురాణాలతో పాటు బ్రహ్మసూత్రాలను రచించారు. అందుకే లోకంలో ఉన్న గురువులందరికీ వ్యాస భగవానుడే మొదటి గురువు అని భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆయన జన్మదినాన్ని గుర్తుంచుకుని.. మీ గురువులకు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను పంపండి..

శుభాకాంక్షలు..
అజ్ఞానమనే చీకటిని తరిమే వెలుగు దీపం గురువు..
అద్భుతమైన జ్ఞానపు అమృతాన్ని పంచే దివ్య కల్పతరువు గురువు..
మీ అడుగుజాడల్లో నడవడం మా పూర్వ జన్మ సృకృతం..
మీరు మాకు ఇంతటి జ్ఞానాన్ని అందించడం మహాభాగ్యం.. 
మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

అక్షరానికి ఊపిరి పోసి జీవితాన్ని మలచిన శిల్పి మీరు..
అంధకారంలో వెలుగు చూపే జ్ఞాన భాస్కరుడు మీరు..
మా జీవిత శిల్పానికి రూపాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు..
గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

సముద్రమంతా జ్ఞానాన్ని సులభంగా అందించే కరుణాకరులు..
నా కంటి పాపల నన్ను సరిదిద్ది.. నిలిపిన మార్గదర్శకాలు..
మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు..
మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

వ్యాసభగవానుని దివ్యకరుణ మీ రూపంలో మాకు లభించింది..
మా మనసులోని అజ్ఞానం అనే తపస్సు తొలగిపోయి..
మా బ్రతుకులకు వెలుగు దిశ చూపించిన గురుదేవతలకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

ఎండల్లో నీడనిచ్చే చెట్టులా.. కష్టాల్లో తోడుండే నీడలా..
విజయాల తీరానికి చేర్చే.. నావలా నిలిచిన మా గురువులందరికీ..
ఈ పవిత్ర పర్వదినాన ప్రత్యేకమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

తల్లిదండ్రులు జన్మనిస్తే.. రూపునిచ్చారు మీరు.. 
లోక జ్ఞానాన్ని నేర్పి.. ధైర్యాన్ని నింపారు మీరు.. 
మీ రుణం తీర్చుకోలేనిది.. మీ ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. 
మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

కోటి వెన్నెలల కాంతి ఈ గురుపౌర్ణమి శోభ..
మా జీవితాలలో నిండిన జ్ఞానమే మీ దివ్య కృప..
శాశ్వతమైన మార్గదర్శనాన్ని అందించే నా గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..
అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎదగడానికి కృషి చేసిన ప్రతి ఒక్క గురువుకి.. గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

Also Read: అజ్ఞానాన్ని పోగొట్టే.. గురువుల కోసం అద్భుతమైన గురుపౌర్ణమి శుభాకాంక్షలు!
నా విజ్ఞాన వృక్షానికి మీరు పోసిన నీరు అక్షరం..
నా భవిష్యత్ సౌధానికి మీ దీవెనలే మూలాధారం..
ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ..
గురుపౌర్ణమి శుభకాంక్షలు..

కంటికి కనిపించే దైవం మీరు..
సంస్కారాలు నేర్పిన ప్రత్యక్ష గురువు మీరు..
మీ సేవలో తరించే భాగ్యాన్ని ఎల్లవేళలా ప్రసాదించండి..
గురుపౌర్ణమి పర్వదిన శుభకాంక్షలు..

జ్ఞాన దీపమై వెలిగిస్తూ.. అజ్ఞానాన్ని తరిమేస్తూ..
శిష్యుల ప్రగతియే తన విజయంగా భావించే ప్రతి మహనీయునికి..
పాదాభివందనాలు తెలుపుకుంటూ..
గురుపౌర్ణమి శుభకాంక్షలు..

Also Read: అజ్ఞానాన్ని పోగొట్టే.. గురువుల కోసం అద్భుతమైన గురుపౌర్ణమి శుభాకాంక్షలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

KTR Press Meet: హైడ్రా రేవంత్‌ రెడ్డికి వేటకుక్కలా మారింది: కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

New Delhi, Delhi:

KTR vs Revanth Reddy: ప్రజలు ఇళ్లు కూలుస్తూ విధ్వంసం సృష్టిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతించారు. ఈ సందర్భంగా హైడ్రాతోపాటు రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రేవంత్ రెడ్డికి వేట కుక్కలా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్ల దగ్గర ఆర్‌ఆర్‌ టాక్స్ (రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ పన్ను) వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? నిలదీశారు. నిజంగానే హైడ్రా మంచి పనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌసులు ఎందుకు కూలగొట్టడం లేదు? మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు.

కేంద్ర మంత్రికి వినతులు
ఢిల్లీ పర్యటనకు వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్‌ఎస్‌ పార్టీ వినతిపత్రం అందించింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వర్కింట్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్‌ రెడ్డి ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుంది. అందుకే హైడ్రాను కూడా రేవంత్‌ వెనకేసుకొస్తున్నాడు. హైడ్రాకు దమ్ముంటే ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మంత్రుల ఇళ్లు కూలగొట్టాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి హైడ్రాను బ్లాక్‌మెయిల్‌ కోసం వాడుకుంటున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా హైడ్రాను ఎత్తివేసి బంగళాఖాతంలో పడేస్తామని కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. 

'హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 'రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరింది. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు చేశారు.

'హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్‌మెయిలింగ్.. ఎక్స్‌టార్షన్ సాధనంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రా రద్దు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top