గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుబావుడు బాలగంగాధర్ తిలక్
Bellampalle, Telangana:1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగ ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహాను బావుడు బాలగంగాధర్ తిలక్ అని ఎస్సీ మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో గుర్తించాలన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Samrat Choudhary: బీహార్‌లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి డిప్యూటీ సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
Lakshmapur, Telangana:Samrat Choudhary: బీహార్ గడ్డపై బీజేపీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా పొత్తుల మీదే ఆధారపడిన కమలపార్టీ.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతోంది. ఏప్రిల్ 15న బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతన్నట్లు వస్తున్న సమాచారంతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ షురూ అయ్యింది. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తే.. మరేందరికో ఆదర్శంగా నిలిచింది. అసలీ సామ్రాట్ చౌదరి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బీహార్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా పూర్తిగా మారిపోతోంది. దశాబ్దాలుగా జేడీయూ-ఆర్జేడీల చుట్టూ తిరిగిన అధికారం.. ఇప్పుడు కమలం గూటికి చేరుతోంది. ఈ చారిత్రాత్మక మార్పుకు కేంద్ర బిందువుగా మారారు సామ్రాట్ చౌదరి.
మూడు దశాబ్దాల రాజకీయ పోరాటం:
సామ్రాట్ చౌదరి.. 1968లో ముంగేర్ జిల్లాలోని ఒక రాజకీయ కుటుంబంలో జన్మించారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన ప్రస్థానం రాష్ట్రీయ జనతాదళ్ తో షురూ అయ్యింది. రబ్రీ దేవి హయాంలో అతిచిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం సామ్రాట్ కు ఉంది. అయితే..రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. 2018లో ఆయన ఆర్జేడీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. బీజేపీలో చౌదరి ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. ఆయన 2019లో రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్‌కి డిప్యూటీగా పనిచేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023లో బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
శపథం చేసిన చోటే సింహాసనం:
సామ్రాట్ చౌదరికి ఒక పట్టుదల ఉన్న నేతగా మంచి పేరుంది. గతంలో నితీశ్ కుమార్ మహాఘటబంధన్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో సామ్రాట్ చౌదరి ఒక సంచలన శపథం చేశారు. నితీష్ కుమార్ సీఎం పీఠం నుంచి దించిన వెంటనే నా తలపాగా తీస్తాను.. అని ప్రకటించారు. రాజకీయ సమీకరణాలు వల్ల మళ్లీ నితీశ్ కుమార్ తో పనిచేసినప్పటికీ.. నేడు అదే నితీశ్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టబోతుండటం విశేషమనే చెప్పాలి.
కులానికీ.. బలానికీ ప్రాధాన్యత:
బీహార్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి రాష్ట్రంలో సామ్రాట్ చౌదరి ఎంపిక వెనక బీజేపీ భారీ స్కెచే ఉంది. ఆయన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత. బీహార్ లో అత్యంత బలమైన లవ్ కుష్ ఓటు బ్యాంకును తమ వైపు తీప్పుకోవడానికి ఆయన సరైన నాయకుడని కమల పార్టీ అధిష్టానం భావించింది. నితీశ్ కుమార్ సామాజిక వర్గానికి పోటీగా మరో బలమైన బీసీ నేతను నిలబెడితే.. బీజేపీ అక్కడ తన పునాదులను పటిష్టం చేసుకోవాలన్న మాస్టర్ ప్లాన్ వేసింది.
మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు:
అయితే బీహార్‌లో బీజేపీ ఎప్పుడూ ఒక జూనియర్ పార్టనర్‌గానే ఉంటూ వచ్చింది. కానీ మొదటిసారిగా ఒక బీజేపీ నేత సీఎం కావడం అనేది ఆ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పాలి. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిన తెగువ నేడు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కారణమైందని చెప్పాలి.
సామ్రాట్ చౌదరి ఆస్తులు:
సామ్రాట్ చౌదరి నికర ఆస్తి మొత్తం రూ. 11 కోట్లకు పైగా ఉంది. ఇందులో నగదు, బంగారం, సెక్యూరిటీలు , ఆస్తులు ఉన్నాయి. తారాపూర్ నుండి నామినేషన్ కోసం తన పేరును సమర్పించేటప్పుడు, సామ్రాట్ చౌదరి తన రూ. 11 కోట్ల నికర ఆస్తి వివరాలను ఎన్నికల సంఘంతో పంచుకున్నారు.
వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా.. పదునైన వ్యూహాలతో, కంచుకోట లాంటి ప్రత్యర్థులను ఎదిరించి నిలబడటం సామ్రాట్ చౌదరి శైలి అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి బీహార్ రాజకీయాల్లో సామ్రాట్ యుగం మొదలుకాబోతోందని బీజేపీ కార్యకర్తలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bengal News: జై శ్రీరామ్ అంటే చాలు.. ఫీజులో రూ.500 కట్! కోల్‌కతా డాక్టర్ కీలక నిర్ణయం..
Hyderabad, Telangana:Kolkata Doctor Latest News: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఒక వైద్యుడు తన పేషంట్స్ కోసం ప్రకటించిన వినూత్న డిస్కౌంట్ స్కీం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. సాధారణంగా ఆసుపత్రిలో పండగ ఆఫర్లతో పాటు హెల్త్ క్యాంపు ల సమయంలో రాయితీలు చూడడం సర్వసాధారణం.. కానీ ఈయన మాత్రం తన రాజకీయ అభిమానాన్ని, భక్తిని కలిపి సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తన వద్దకు వచ్చే పేషెంట్లు జైశ్రీరామ్ అని పలికితే చాలు.. కన్సల్టేషన్ ఫీజులో ఏకంగా రూ.500 తగ్గిస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు..
కోల్‌కతాకు చెందిన వైద్యుడు డాక్టర్ పీకే హిజ్రా ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. నగరంలోని పేరు ఉన్న కార్డియాలజిస్ట్‌లలో ఒకరైన ఆయన.. గత కొంతకాలంగా తన ఫీజు విషయంలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు తన కన్సల్టేషన్ కోసం దాదాపు రూ 2 వేల రూపాయలు వసూలు చేసేవారని.. అయితే, ఎన్నికల వాతావరణ నేపథ్యంలో దానిని రూ 1500 తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ ఫీజును మరింత సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జైశ్రీరామ్ డిస్కౌంట్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
డాక్టర్ హిజ్రా తన నిర్ణయం పై స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.. తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని.. ఆ పార్టీకి తన వంతు సపోర్టు తెలపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఫీజు తగ్గడం వల్ల పేద రోగులకు మేలు జరుగుతుందని.. అదే సమయంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించవచ్చని ఆయన పడ్డారు. కేవలం నినాదం పలికినంత మాత్రాన రూ.500 తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు..
Also Read: Jagtial News: జగిత్యాల కాంగ్రెస్‌లో సెగలు.. హైదరాబాద్‌కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
ఈ వార్త బయటకు వచ్చినప్పటికీ నుంచి బెంగాల్ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. ఒక వర్గం ప్రజలు డాక్టర్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు వైద్య సేవలను రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా ఒక వైద్యుడు బహిరంగంగా తన రాజకీయ పక్షపాతాన్ని ఇలా డిస్కౌంట్ రూపంలో ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా వీధుల్లో డాక్టర్ హిజ్రా క్లినిక్ ముందు రోగుల రద్దీ పెరిగినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్ అంటే కేవలం రూ.1000 కే స్పెషలిస్ట్ డాక్టర్ సలహాలు లభించడంతో చాలామంది ఈ క్లినిక్ వెళ్లేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Also Read: Jagtial News: జగిత్యాల కాంగ్రెస్‌లో సెగలు.. హైదరాబాద్‌కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial News: జగిత్యాల కాంగ్రెస్‌లో సెగలు.. హైదరాబాద్‌కు 71 మంది కీలక నేతలు.. అసలేం జరుగుతోంది?
Jagtial, Telangana:Jagtial Telugu News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు.. నామినేటెడ్ పదవుల కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జగిత్యాల నుంచి దాదాపు 71 మంది ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎందుకు హైదరాబాద్ కు తరలి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీ అంశంగా మారింది.
నిజానికి ఈ భేటీ సోమవారమే జరగాల్సి ఉంది.. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సమావేశం వాయిదా పడిందట.. దీంతో నాయకులంతా హైదరాబాదులోనే బస చేసి.. మంగళవారం సాయంత్రం బేటి కావాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలవబోతోంది. అంతేకాకుండా అందరి సమక్షంలోనే సీఎంతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది..
పర్యటన వెనక ప్రధానంగా నామినేట్ పదవుల అంశం ఉన్నట్లు సమాచారం. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. సుదీర్ఘకాలంగా జెండా మోసిన తమకు తగిన గుర్తింపు లభించడం లేదని సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు జిల్లా స్థాయిలో కీలక పదవులను జగిత్యాల నేతలకు కేటాయించాలని వీరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: CBSE 10th Results 2026 LIVE: CBSE 10th ఫలితాల అప్డేట్స్.. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే..!
అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు వీలుగా పదవుల పంపిణీ జరగాలని బార్ కోరుతున్నారు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో.. జగిత్యాల నేతలు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుందని భావించవచ్చు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడం. ముఖ్యమంత్రి నుంచి సానుకూల హామీ లభిస్తుందని నేతలు ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం..
Also Read: CBSE 10th Results 2026 LIVE: CBSE 10th ఫలితాల అప్డేట్స్.. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nari Shakti Vandan: నారీ శక్తి వందనంపై జగన్, షర్మిలతో సహా అన్నీ పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు లేఖ!
Nuzendla, Andhra Pradesh:Chandrababu Letter To YS Jagan: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ బిల్లుకు పార్లమెంట్లో మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ షర్మిలా రెడ్డితోపాటు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరారు.
మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమని తెలిపారు. ‘నారీ శక్తీ వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని తాను నమ్ముతానని లేఖలో పేర్కొన్నారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం ఆయా పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు కోరారు.
'భారత ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మక, ఆనందకరమైన రోజుగా నిలుస్తుంది. మహిళా రిజర్వేషన్ అమలుకు బాటలువేసే నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుండడంతో దశాబ్దాల కల నిజమవుతోంది. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగు' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 'ఎక్కడ మహిళలను గౌరవిస్తారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారతీయ ధర్మం చెబుతోంది. దీనికి నిదర్శనమే నారీ శక్తి వందన్ అధినియం. చట్టసభల్లో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా చట్ట సవరణకు కేంద్రం సంకల్పించింది' అని చంద్రబాబు లేఖలో వివరించారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప ఆలోచనగా తాను భావిస్తున్నానని.. చట్టసభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించడం ప్రతీ భారతీయుడు గర్వించే సందర్భం అని చంద్రబాబు పేర్కొన్నారు. 'నేటి నిర్ణయం రేపటి నూతన రాజకీయ పంథాకు, సాధికారతకు నాంది పలుకుతోంది. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని మొదటి నుంచీ నేను బలంగా నమ్ముతా. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి. రాష్ట్ర, దేశ పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నది నా అభిప్రాయం' అని లేఖలో చంద్రబాబు వివరించారు.
కఠోర శ్రమ, కర్తవ్య దీక్షతో నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలనే ప్రధాని ఆకాంక్షకు అందరం మద్దతు పలుకుదామని పార్టీల అధ్యక్షులకు సూచించారు. మహిళా రిజర్వేషన్‌పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరఫున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలికే గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్దంగా ఉండాలని.. ఈ చట్టం రాజకీయాలకు అతీతం.. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం అని వివరించారు. నారీ శక్తీ వందన్ అధినియం మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని.. ఈ చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో ప్రతీ ఒక్కరూ సహకరించాలని వైఎస్ జగన్, షర్మిల, పవన్ కల్యాణ్ తదితరులను చంద్రబాబు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Oppo A6s Pro Launched: 7000mAh భారీ బ్యాటరీతో Oppo A6s Pro లాంచ్!
Hyderabad, Telangana:Oppo A6s Pro Launched Latest News Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి అద్భుతమైన మిడిల్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. చైనా మార్కెట్లో అత్యంత శక్తివంతమైన Oppo A6s Pro స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది చాలా ప్రీమియం లుక్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Oppo A6s Pro ఫీచర్స్, బ్యాటరీ వివరాలు..
ఈ Oppo A6s Pro స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ పెద్ద బ్యాటరీతో అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకుని దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో అదనంగా 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంను కూడా అందిస్తోంది.
Oppo A6s Pro కెమెరా, డిస్ప్లే..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమెరాను కూడా అందిస్తోంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో సెకండరీ లెన్స్ కెమెరాలను కూడా అందించారు. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన సెల్పీ కెమెరాను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. ఇది 50MP ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని ద్వారా హై-క్వాలిటీ వీడియో కాల్స్‌తో పాటు సోషల్ మీడియా రీల్స్ చేసేవారికి అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో కంపెనీ 6.57 ఇంచుల AMOLED డిస్ల్పేను కూడా అందిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.
దీని ప్రాసెసర్ ఏంటీ?
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G100 Max ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగించి మల్టీ టాస్కింగ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది 8GB ర్యామ్‌తో విడుదలైన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది IP69 రేటింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇంత చీప్ ధరలో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో లభించడం విశేషం..
Also Read: POCO C85x: కేవలం రూ.3,049కే POCO C85x ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
ధర వివరాలు ఇవే..
చైనాలో దీని ప్రారంభ ధరను సుమారు 1,399 యువాన్లుగా విక్రయించబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే అధికారంగా వెల్లడించింది.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.16,500 నుంచి రూ.18,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని సోషల్ మీడియాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
Also Read: POCO C85x: కేవలం రూ.3,049కే POCO C85x ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
Hyderabad, Telangana:Noida Workers Violence Planned Conspiracy: నోయిడాలో సోమవారం కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కాస్త చేతి దాటడంతో అక్కడ కసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులు పోలీసుల వాహనం కూడా ధ్వంసం చేశారు. ప్రధానంగా జీతాల పెంపు కోరుతూ 42 వేల మంది కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు 50 పైగా వాహనాలను కూడా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక మొత్తానికి పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తంగా 350 మంది వరకు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సమాచారం. నోయిడా మీరట్‌లో ఇటీవల నలుగురు ఉగ్ర అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ అల్లర్లకు కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు 300 మందికి పైగా పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
మొత్తంగా నిరసన కారులు 80 కి పైగా ప్రదేశాలలో విధ్వంసం సృష్టించారు. అంతే కాదు స్థానికంగా ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్ల దాడి చేయడం వంటి కేసులు నమోదయ్యాయి. ఫ్యాక్టరీ వాహనాలు కూడా పూర్తిస్థాయిలో దగ్ధం చేశారు. ఒక ఫ్యాక్టరీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఇతర కంపెనీలకు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో పలు కంపెనీల వర్కర్లు కూడా గుంపులుగా గుమిగూడారు. పరిస్థితి అదుపుతప్పింది. కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇక పరిస్థితిని అదుపు చేయడానికి ఆర్ఏఎఫ్ దళాలు కూడా మోహరించాయి. సున్నితమైన ప్రాంతంలో అదనపు బలగాలు పెంచారు.
మొత్తం వాట్సాప్ గ్రూపుల ద్వారా వదంతులు సృష్టిస్తున్నట్లు సమాచారం. రెచ్చగొట్టే కంటెంట్ ను వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాకు ఖాతాలో హల్చల్ చేస్తున్నారు. దీంతో వాటిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కేసులో నమోదు చేశారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అసలు వర్కర్స్ డిమాండ్స్ ఏంటి?
వాళ్లంతా నోయిడాలోని అహుజా ఫ్యాక్టరీ కార్మికులు. కంపెనీ యాజమాన్యం అంగీకరించడం లేదని నిరసన చేపట్టారు. అంతేకాదు నైపుణ్యం లేని కార్మికులకు ఒక విధమైన అలవెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యం ఉన్న కార్మికులను పట్టించుకోవడంలేదని పెద్ద ఎత్తున నిరసన చేశారు. సమయంలో గంటకు 90 అలవెన్స్ ఇస్తారు. కానీ ఆ తర్వాత 50కి తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కూడా ఈ నిరసనలకు కారణమైన వారిని పోలీసులు చెక్ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం నోయిడాలో శాంతియుత పరిస్థితులే ఉన్న పోలీసుల భద్రత మొహరింపు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
IPL 2026: ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ..!!
Lakshmapur, Telangana:SRH vs RR: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో చెలరేగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిషాకిచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. డొనావన్ ఫెరీరా 69 బాల్స్ లో 7 ఫోర్లు 3 సిక్సులు తీయగా.. రవీంద్రా జడేజా 45 బంతుల్లో 5 ఫోర్లతో పోరాటం చేశారు. ప్రఫుల్ హింగే 4 వికెట్లు తీసుకుని 34 పరుగులు ఇచ్చాడు. సకీబ్ హుస్సేన్ 4 వికెట్ల కు 24 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా రాజస్థాన్ ఓటమి రాసారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సాక్షిగా సోమవారం ఆరెంజ్ ఆర్మీ శివాలెత్తిపోయింది. బౌండరీల మోత.. వికెట్ల వేటతో రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మట్టికరిపించింది. వేలాది మంది అభిమానులు ఆరేంజ్ కేరింతల మధ్య హైదరాబాద్ జట్టు పాత రాజస్థాన్ ను గుర్తు చేస్తూ రాయల్స్ గాలి తీసింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ నవాబులు.. ఈ విజయంతో పాయింట్ల పట్టికతో తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు.
మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ నిర్ణయం 100 శాతం కరెక్ట్ అని ప్రఫుల్ హింగే నిరూపించాడు. రూ. 30 లక్షల బేస్ ప్రైస్ కుర్రాడు.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నుముక విరిచేశాడు. తొలి ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 1/3 అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ప్లేయర్ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ప్రఫుల్ వేసిన దెబ్బ నుంచి రాజస్థాన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మిడిల్ ఓవర్లలో కమిన్స్ తన వ్యూహాలతో బ్యాటర్లను కట్టడి చేయగా.. స్పిన్నర్లు పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ బౌలర్లు వికెట్లు తీస్తూనే ఉన్నారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ ఒక గౌరవప్రదమైన స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.
లక్ష్యం పెద్దది కాకపోయినా.. అభిషేక్ శర్మ తొలి బంతికే డకౌట్ అవ్వడం ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెట్టింది. కానీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు క్లాస్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ట్రెంట్ బౌల్ట్, ఆర్చర్ వంటి దిగ్గజ బౌలర్లను కూడా లెక్కచేయకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి పంపుతూ రన్ రేట్‌ను ఎక్కడా తగ్గనివ్వలేదు.
మ్యాచ్ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఉప్పల్ స్టేడియం ఒక పండుగలా మారిపోయింది. గెలుపుకు చేరువవుతున్న కొద్దీ అభిమానుల నినాదాలతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది. చివరకు మరో కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
ఈ విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అటు బౌలింగ్‌లో ప్రఫుల్ హింగే సంచలనం, ఇటు బ్యాటింగ్‌లో సమిష్టి కృషి హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది ఒక పీడకల లాంటి మ్యాచ్ అయితే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది కన్నుల పండుగగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kcr Mega public Meeting: కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. ఇన్ చార్జీల ప్రకటించిన బీఆర్ఎస్..
Hyderabad, Telangana:Huge arrangements for jagtial kcr mega public meeting: తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరుతానని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జీవన్ రెడ్డి సైతం కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసిన తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో..జీవన్ రెడ్డి లాంటి నిజాయితీ, నిబద్దత గల నాయకులు పార్టీలో ఉంటే మరింత పట్టుదలతో ముందుకు వెళ్లవచ్చని బీఆర్ఎస్ యోచిస్తుంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పట్టు బిగించే విధంగా నేతలు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే ఏప్రిల్ 20న బీఆర్ఎస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులతో పాటు, జీవన్ రెడ్డి కూడా బహిరంగ సభఎక్కడ నిర్వహించాలో పలు ప్రదేశాలను సందర్శించారు . ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఇన్ చార్జీలను ప్రకటించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు:
జగిత్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ)
కోరుట్ల: ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బాల్కొండ)
ధర్మపురి: ఎల్. రవీందర్ రావు (ఎంఎల్సీ)
వేములవాడ: బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే)
చొప్పదండి: పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో జగిత్యాలలో నిర్వహించబోయే సభపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇదే సభ వేదికగా బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా ప్రకటిస్తారని తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్! ఏప్రిల్ 22 నుంచి బస్సులు బంద్? పోరాట గంట మోగించిన జేఏసీ చైర్మన్ వెంకన్న..!!
Lakshmapur, Telangana:RTC Strike Alert: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ సమ్మె సెగ రాజుకుంటోంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సమస్యలు విన్నవిస్తున్నా... పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలపై మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చామని.. నెల గడువు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలను తీర్చాల్సింది పోయి.. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి మమ్మల్ని సమ్మె చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు ఉందని వెంకన్న అసహనం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ విలీనం, యూనియన్లకు ఎన్నికల నిర్వహణపై కమిటీ వేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న మాటలపై జేఏసీ నేతలు నిలదీశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వెంటనే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని, కొత్తవేమీ కోరడం లేదని వారు గుర్తు చేశారు.
సమ్మెకు మద్దతుగా దాదాపు 40 వేల మంది కార్మికులు జేఏసీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు ప్రకటించారు.
ఏప్రిల్ 22 నుంచి: రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం.
డిమాండ్లు: ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
బదిలీలు: ఎక్కడి కార్మికులు అక్కడే ఉండాలని, అస్తవ్యస్త బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు.
21 అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపివేత:
ఏప్రిల్ 21 అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుంచే మా సమ్మె ప్రారంభం అవుతుంది. జేఏసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తే ఊరుకోం అని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులపై పడే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral News: "జీతం ఎంతిస్తే.. పనంతే చేస్తా".. ఆఫీసులో 5 గంటలు కునుకు తీసిన ఉద్యోగి.. నెట్టింట రచ్చ రేపుతున్న పోస్ట్..!!
Lakshmapur, Telangana:Low salary sleep at work viral: సాధారణంగా ఆఫీసుల్లో జీతం పెంచలేదని.. లేదంటే తక్కువ జీతం ఉందని ఏం చేస్తారు? బాస్ ను రిక్వెస్ట్ చేస్తారు.. లేదంటే.. గొడవపడుతుంటారు. లేదంటే ఇంక్రిమెంట్ అది కూడా కాదంటే రిజైన్ చేసి వేరే కంపెనీకి మారుతుంటారు. కానీ చైనాలోని హెనాన్ ప్రాంప్తం, షాంగ్ క్యూ నగరానికి చెందిన ఓ మహిళ ఉద్యోగిని మాత్రం చాలా వెరైటీగా ఆలోచించింది. "నువ్వు నాకు ఇచ్చే జీతానికి.. నేను చేసే పనంతే" అంటూ ఏకంగా ఆఫీసులోనే తన డెస్కులో కుర్చీలో 5గంటల పాటు మాంచిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆ తర్వాత జరిగిన డ్రామా చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.
సదరు మహిళా ఉద్యోగి నిద్రపోయిన విషయాన్ని గమనించిన బాస్.. ఏంటీ రోజంతా ఆఫీసులోనే నిద్రపోయావా? అని నిలదీశారు. ఆ అమ్మడు ఏమాత్రం తగ్గలేదు..పైగా ఓ కన్నీటి వీడియో పోస్ట్ చేస్తూ.."నువ్వు ఎంతిస్తే పనంతే చేస్తా (You get what you pay for)" అంటూ కొత్త లాజిక్ తీసింది. రోజుకు 8 గంటల డ్యూటీలో 5 గంటలు నిద్రపోతే.. ఇక లంచ్ బ్రేక్.. టీ బ్రేక్ పోను ఆమె పనిచేసేది కేవలం గంటన్నర మాత్రమేనని నెటిజన్లు లెక్కలు వేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఆమె నిరసన నిద్రతో అక్కడికే.. ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ.. 5 గంటల నిద్ర తర్వాత లేవగానే మన ఆవిడకు ఆకలి వేసింది. పక్కనే బాస్ టేబుల్ మీద ఉన్న ఒక చాక్లెట్ కనిపిస్తే టక్కున నోట్లో వేసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ బాస్ పాపం గ్లూకోజ్ ఇంటోలరెన్స్ తో బాధపడుతూ, షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆ చాక్లెట్లను దగ్గర పెట్టుకున్నాడు. తీరా టైమ్‌కు చాక్లెట్ లేకపోయేసరికి ఆయన నీరసించి దాదాపు కుప్పకూలిపోయారు.
దీంతో బాస్ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇస్తూ.. "నన్ను చంపేయాలనుకున్నావా అని బాస్ అరుస్తున్నాడు.. నన్ను ఆఫీసులో నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడు" అంటూ ఆ మహిళ వీడియోలో రచ్చ రచ్చ చేసింది.
ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. మన నెటిజన్లు ఊరుకుంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు పంచ్ లతో సెటైర్లతో ఉతికారేశారు.
"అలారం పెట్టుకోమ్మా..!"
సాధారణంగా సోషల్ మీడియాలో అందరూ బాస్‌లనే తిడుతుంటారు. కానీ ఈసారి మాత్రం నెటిజన్లు కూడా బాస్కే సపోర్ట్ చేస్తున్నారు.
"ఏ బాస్ అయినా ఇలాంటి ఉద్యోగిని భరిస్తాడా?" అని ఒకరు..
"ఓరి దేవుడో.. నా జీవితంలో ఒక బాస్‌కు సపోర్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు" అని మరొకరు సెటైర్లు వేశారు.
ఇంకో నెటిజన్ అయితే.. "అమ్మా.. వచ్చేసారి నిద్రపోయే ముందు అలారం పెట్టుకో.. లేదంటే ఆఫీసు టైమ్ అయిపోయినా అక్కడే నిద్రపోతావు" అంటూ చురకలు వేశాడు.
మొత్తానికి "తక్కువ జీతం ఇస్తే ఆఫీసులోనే నిద్రపోతా" అన్న ఈమె నిరసన ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కార్పొరేట్ లోకంలో నిద్ర కూడా ఒక నిరసన ఆయుధం అని ఈ చైనా వనిత నిరూపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Haemophilia In Pregnancy: తల్లి గర్భం నుంచే బిడ్డకు ప్రాణాంతక ప్రమాదం?! గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Hyderabad, Telangana:Haemophilia Testing In Pregnancy: గర్భం దాల్చడం అనేది మహిళల జీవితంలో ఓ కీలక దశ. కానీ, ఇది తల్లీబిడ్డలను ప్రభావితం చేసే అనారోగ్య సమస్యల సంక్రమించే సమయం. అనేక అనారోగ్య సమస్యలు గురించి ప్రతి తల్లీ కచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రోగ నిర్ధారణకు ఎటువంటి ప్రక్రియను ఫాలో అవ్వాలనే విశేషాలను ఫెర్నాండేజ్ ఆస్పత్రికి చెందిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ తారకేశ్వరి సూరపనేని మాటల్లో తెలుసుకుందాం.
గర్భవతులకు కచ్చితమైన అవగాహన అవసరమైన వ్యాధుల్లో హీమోఫిలియా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5,000 మంది మగ శిశువులలో ఒకరికి ఈ అరుదైన రక్తస్రావ వ్యాధి ఉంటుంది. ఇది అనేక కుటుంబాలలో వంశపారంపర్యంగా వస్తుంది. హీమోఫిలియా ఉన్నవారి రక్తం సరిగ్గా గడ్డకట్టదు. కాబట్టి, చిన్న గాయాలు లేదా చర్మంపై గీతలు పడినా కూడా వారికి సాధారణం కంటే ఎక్కువ సేపు రక్తస్రావం అవుతుంది.
ఈ వ్యాధి పురుషులలో ఎక్కువగా కనిపించినా.. మహిళలు కూడా దీనికి వాహకాలుగా (క్యారియర్లుగా) ఉండగలరు. ఒకవేళ మహిళ ఈ జన్యువును కలిగి ఉంటే, ప్రతి గర్భధారణ సమయంలో అది బిడ్డకు సంక్రమించే అవకాశం 50% ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న పురుషులకు హీమోఫిలియా ఉండవచ్చు. అయితే మహిళలు దీనికి వాహకాలుగా (క్యారియర్లుగా) ఉంటూ తమ బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని కలిగి ఉన్న కొందరు మహిళలకు అధిక రుతుస్రావం, సులభంగా కమిలిపోవడం లేదా గాయం లేదా శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం ఆగేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి లక్షణాలతో హీమోఫిలియా ఉంటుంది.
హీమోఫిలియా ఉన్నట్లు నిర్ధారణ అయిన మహిళలు గర్భం ధరించడానికి ముందే వైద్యుడిని సంప్రదించాలి. జన్యు పరీక్ష, ఒక సాధారణ రక్త పరీక్ష, ఎవరైనా క్యారియరా కాదా అని నిర్ధారించడానికి సహాయపడతాయి. కాబోయే దంపతులు తమ బిడ్డకు ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రసవానికి కొన్ని ముందస్తు టెస్ట్‌లు చేయించుకోవచ్చు. గర్భధారణ సమయంలో ముఖ్యంగా చివరి త్రైమాసికంలో.. రక్తం గడ్డకట్టే కారకాల (క్లాటింగ్ ఫ్యాక్టర్) స్థాయిలు మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యం.
ఇలాంటి పరిస్థితుల్లో క్యారియర్లుగా ఉన్న మహిళలకు గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. ఒకవేళ బిడ్డకు హీమోఫిలియా ఉంటే.. ముఖ్యంగా పుట్టినప్పుడు, బిడ్డకు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
చాలా మంది మహిళలు యోని మార్గం ద్వారా ప్రసవించగలరు. అయితే, వాక్యూమ్-సహాయక ప్రసవం వల్ల శిశువుకు మరింత సులభంగా రక్తస్రావం అవుతుంది. కాబట్టి, వైద్యులు ఆ ప్రక్రియను అరుదుగా ఎంచుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఏవైనా సాధారణ చికిత్సలు అందించే ముందు శిశువును క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ముందస్తు పరీక్షల ద్వారా నవజాత శిశువుకు హీమోఫిలియా ఉందో లేక క్యారియరా అని నిర్ధారించవచ్చు. ప్రసవం తర్వాత, తల్లులలో అధిక రక్తస్రావానికి సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం కూడా పర్యవేక్షిస్తారు.
వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం, ముందుగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మన జీవితాల్లో పెద్ద మార్పు తెస్తుంది. హీమోఫిలియా ఉన్న చాలా మంది వ్యక్తులు సరైన చికిత్స, వైద్య సహాయాన్ని సకాలంలో పొందినట్లయితే, ఆరోగ్యకరమైన పిల్లలను కనేందుకు అవకాశం ఉంది. అలాగే సురక్షితమైన గర్భధారణను కలిగి ఉంటారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యులు అందించ సలహ, సూచనల మేరకు పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Male Fertility: ఎండలో బైక్ సీటు, ఒడిలో ల్యాప్‌టాప్.. పురుషుల సంతానోత్పత్తికి పొంచి ఉన్న ముప్పు!
Also Read: Gastric: కడుపులో గడబిడ.. గ్యాస్.. ఉబ్బరానికి కారణమయ్యే 4 రోజువారీ ఆహారాలు, మీరు అస్సలు ఊహించరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Delimitation: తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రకంపనలు..ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ!
Hyderabad, Telangana:Telangana Delimitation Letter: దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు దీనిపై పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ నియోజకవర్గాల పునర్విభజనపై తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి ఓ లేఖ రూపంలో ప్రధాని మోదీకి పంపారు.Asha Bhosle Last Rites: ఆశా భోస్లే పార్థీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన సచిన్ టెండూల్కర్..
Hyderabad, Telangana:Sachin In Asha Bhosle Last Rites: దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నేడు సాయంత్రం 4 గంటలకు ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే తుదిసారి ఆమెను చూసిన సచిన్ టెండూల్కర్ కంటతడి పెట్టుకున్నారు.SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్..ఐపీఎల్లో ఈరోజు గెలుపు ఎవరిది? సూర్యవంశీ, అభిషేక్ శర్మ విధ్వంసానికి రెడీనా?
Hyderabad, Telangana:SRH Vs RR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అన్నీ గెలుపొంది టేబుల్ టాపర్‌గా నిలిచింది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్కటి గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 21 సార్లు తలపడగా.. సన్‌రైజర్స్ 12 సార్లు గెలుపొందగా.. రాజస్థాన్ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే హెడ్-టూ-హెడ్ కౌంట్ లో ఎస్ఆర్హెచ్దే హవా కనిపిస్తుంది.
కానీ, ప్రస్తుతం గడిచిన మ్యాచ్‌లో ఆధారంగా ఆతిథ్య జట్టుతో పోలిస్తే రాజస్థాన్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. అదే విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దళం కూడా ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఇదే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 286 అత్యధిక స్కోరు రికార్డును రాజస్థాన్‌పై నమోదు చేయడం విశేషం.
SRH జట్టు ప్రస్తుతం ఓ ఆసక్తికర పికింగ్ను ఎదుర్కొనే సమస్య వచ్చిపడింది. ప్రఫుల్ హింగే ఎట్టకేలకు తన IPL అరంగేట్రం చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు? పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే హింగే అరంగేట్రం చేస్తాడని ఇషాన్ కిషన్ ప్రకటించాడు, కానీ టాస్ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి వేరే ఎంపిక అవసరమని గ్రహించి, అతనికి బదులుగా జయదేవ్ ఉనద్కట్‌ను జట్టులోకి చేర్చుకున్నారు.
ఉప్పల్ స్టేడయంలో వేగవంతమైన పిచ్‌పై, హింగే అరంగేట్రం ఎట్టకేలకు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలో దిగింది. తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు అనికేత్ వర్మ తీసుకోలేని పక్షంలో బౌలింగ్ ప్రత్యామ్నాయంగా లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరింపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ దాదాపుగా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన బ్రిజేష్ శర్మ మిడిల్ ఓవర్లలో 37 పరుగులకు 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతను అదే స్థానంలో కొనసాగుతాడని భావిస్తున్నారు.
సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ లేదా లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషన్ మలింగ, ప్రఫుల్ హింగే(డెబ్యూ).
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 అంచనా: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్ హత్య!
Chilakaluripet, Andhra Pradesh:Palnadu Latest Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వరుసగా పోలీసులపై వస్తున్న అభియోగాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. చట్టంతో పాటు ప్రజలను కాపాడాల్సిన కొందరు పోలీసులు క్రిమినల్ చర్యలకు పాల్పడతుండడంతో జిల్లా వ్యాప్తంగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా పోలీసులే అలాంటి సంఘ విఘాత చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నిన్న మొన్న మాచర్లలో ఏఎస్సై ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో హత్య కేసులో పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిణామాలు కనిపిస్తున్నాయి.
తాజాగా చిలకలూరిపేట సమీపంలో 2 రోజులు క్రితం జరిగిన లాయర్ హత్య కేసులో ఇప్పుడు నిజం బయపడింది. ఈ హత్యను తొలుత ప్రమాదంగా చిత్రీకరించాలనే నిందితుల పన్నాగం బయటపడి.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు అరెస్టు చేయడం ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య తాజాగా చిలకలూరిపేటలో జరిగిన హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. మృతుడు లాయర్ భార్యతో సదరు నిందితుడు వివాహేతర సంబంధం ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మృతుడు తన భార్యను తరచూ గొడవ పడుతుండేవాడని.. దీంతో అతనిపై పగ పెంచుకున్న కానిస్టేబుల్, కాపుకాసి లాయర్ హత్యకు పాల్పడ్డాడని సమాచారం.
వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న లాయర్‌ను చంపాలని పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. అయితే లాయర్ హత్యకు వెంకట కోటయ్యకు సహకరించిన మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అందుకు గాను సదరు వ్యక్తి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో నిందితులుగా విచారణలో తేలడంతో ఇద్దర్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే పల్నాడు జిల్లాలో పోలీసులుపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే మాచర్లకు చెందిన ఓ మేజర్ యువతి హత్య కేసులో రూరల్ సీఐ సస్పెండ్ అవ్వగా.. వివాహేతర సంబంధం కారణంగా మరో సీఐ సస్పెండ్.. మహిళలను, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి ఆపై వీడియోలు చిత్రీకరించిన కేసులో మాచర్ల ఏఎస్సై సస్పెండ్‌కు గురవ్వగా..ఇప్పుడు చిలకలూరిపేటలో లాయర్ హత్యకు కేసులో మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. ఇలా పోలీస్ శాఖ నుంచి ఒక్కో ఘటనలు బయటపడుతున్న వేళ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిన పోలీసులే స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం మాయని మచ్చగా మారాయి. అయితే ఇలాంటి చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని..ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా ముందస్తు జిల్లా పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేపట్టి.. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వరుస ఘటనల దృష్ట్యా హోంమంత్రి అనిత కూడా జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. శాఖలో తప్పులను క్రమబద్ధీకరించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీలైతే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జిల్లాలో పోలీసు అధికారుల చర్యల పట్ల నిఘా పెట్టడమే కాకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లాలోని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
