icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow23 Aug 2024, 03:51 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Balapur Ganesh: పూరి జగన్నాథ ఆలయ రూపంలో బాలాపూర్‌ గణేశ్‌.. పోటెత్తిన భక్తులు

Balapur, Telangana:

Puri Jagannath Temple Pandal: గణేశ్‌ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ తర్వాత అంతటి ఆకర్షణగా నిలిచేది బాలాపూర్‌ గణేశ్‌. లడ్డూ వేలంలో అత్యధిక ధర పలికే బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ.. ఈసారి మండపంలోనూ ప్రత్యేకత పొందింది. ప్రతి యేటా ప్రత్యేక రూపంలో మండపాన్ని తీర్చిదిద్దే నిర్వాహకులు ఈసారి పూరీ జగన్నాథ్‌ ఆలయ రూపంలో మండపం రూపొందించారు. పూరీ జగన్నాథ్‌ ఆలయంలో కొలువుదీరిన బాలాపూర్‌ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం నుంచి నగర నలుమూలల నుంచి భక్తులు బాలాపూర్‌కు తరలివస్తున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి  భక్తుల రాకతో బాలాపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయాన్ని పోలిన భారీ సెట్టింగ్‌ను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు. సెట్టింగ్ నిర్మాణం, అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపాడు.

గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ జాన్‌తో కలిసి సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు చేశారు. పూజా కార్యక్రమాలను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు, సభ్యులకు, అన్ని గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 'హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భక్తులు, నిర్వాహకులు, ప్రభుత్వం సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి' అని సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి, పాడిపంటలు బాగా పండాలి, రైతులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

0
0
Report

Vinayaka Chavithi Tragedy: ఉత్సవాల్లో విషాదం.. వ్యక్తి ప్రాణాలు తీసిన గణేశ్‌ విగ్రహం కొనుగోలు

Secunderabad, Telangana:

Ganesh Utsav Turns To Tragedy: వినాయక చవితి ఉత్సవాల వేళ పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. వర్గ విభేదాలు కొన్ని చోట్ల ఘర్షణకు దారి తీయగా.. మరికొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. ఒక చోట అయితే గణేశ్‌ ఉత్సవాల కోసం వినాయక విగ్రహం కొనుగోలుకు వెళ్లగా.. అక్కడ విగ్రహాల తయారీదారులతో గొడవ ఏర్పడింది. ఈ గొడవలో విగ్రహం కొనడానికి వచ్చిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారులోని పోచారంలో చోటుచేసుకుంది.

Also Read: Ganesh Utsav: గణేశ్ ఉత్సవాల్లో తొలి రోజే రచ్చరచ్చ.. పూజలందుకోకుండానే వినాయకుడు నిమజ్జనం

హైదరాబాద్‌ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో ఒకరు మృతి చెందాడు. విగ్రహాల విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య జరిగిన మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చౌదరిగూడకు చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

వినాయక చవితి పండుగ వేళ పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని జోడిమెట్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గణేష్ విగ్రహం కొనుగోలు చేసేందుకు వచ్చిన చౌదరిగూడకు చెందిన కిరణ్ అనే వ్యక్తికి, స్థానిక విగ్రహ విక్రేతలకు మధ్య నామమాత్రపు విషయమై వివాదం మొదలైంది. క్రమంగా ఈ తగవు మాటమాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు చౌదరిగూడకు చెందిన బాధితుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి పడిపోయిన అతడిని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సూర్య ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధితుడు కిరణ్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Also Read: Ganesh Chaturthi: కొబ్బరికాయలతో.. విబూదితో విభిన్న రకాల గణనాథులు

మృతుడి వార్త తెలియడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలంటూ వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

దీపంతో అగ్నిప్రమాదం
గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా దీపం వెలిగించగా అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 2లో శ్రీ సాయి దత్త ఉమెన్స్ లగ్జరీ పీజీ హాస్టల్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని హాస్టల్ ఐదో అంతస్తులో ఓ అమ్మాయి దీపం వెలిగించారు. ఆ దీపం నుంచి వేరే దానికి మంటలు అంటుకుని అగ్ని ప్రమాదానికి దారి తీసింది. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. స్వల్ప అగ్నిప్రమాదమే కావడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు.

0
0
Report

Ganesh Utsav: గణేశ్ ఉత్సవాల్లో తొలి రోజే రచ్చరచ్చ.. పూజలందుకోకుండానే వినాయకుడు నిమజ్జనం

Shadnagar, Telangana:

Group Clash In Ganesh: అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సిన వినాయక చవితి వేడుకలు తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారి తీశాయి. ఒక వర్గానికి.. మరో వర్గానికి తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు మరింత వివాదానికి దారి తీసింది. గ్రామ రాజకీయాలు, వర్గ విభేదాలతో గణేశ్‌ ఉత్సవాలు ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. రెండు వర్గాలు గొడవకు దిగడంతో చివరకు వినాయకుడిని ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పీర్జాపూర్ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు కొందరు వినాయక విగ్రహం తీసుకువచ్చారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రులు నిర్వహించేందుకు శ్రీరాములు, తిరుపతి, సంగమేష్, కురువ మల్లయ్య తదితరుల బృందం ఒక విగ్రహాన్ని తీసుకురాగా మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సిములు ఆధ్వర్యంలోని మరో వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంజనేయ స్వామి ఆలయంలో కాకుండా వేరే చోట ఎక్కడైనా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని వారు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో వెంటనే సమాచారం అందుకున్న చౌదరిగూడ పోలీసులు గ్రామంలోకి రంగప్రవేశం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా వివాదాస్పదమైన ఆంజనేయ స్వామి ఆలయంలో ఏ వర్గం కూడా విగ్రహాన్ని ప్రతిష్టించకూడదని పోలీసులు ఆదేశించారు. పండుగ వేళ ఘర్షణలకు తావివ్వకుండా వేరేచోట మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల ఆదేశాలతో సర్పంచ్ వర్గం వేరే చోట వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజలు ప్రారంభించింది. అయితే విగ్రహాన్ని తీసుకువచ్చిన శ్రీరాములు వర్గం ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. దేవుడి వద్ద రాజకీయాలు, వర్గ విభేదాలు తగవని ఆవేదన వ్యక్తం చేస్తూ తాము తెచ్చిన గణేశుడికి ఎలాంటి పూజలు చేయకుండానే నేరుగా తీసుకెళ్లి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. దేవుడి వద్ద కూడా గ్రామ పెద్దలు ఇలా గ్రూపులు కట్టడంపై స్థానిక భక్తులు మండిపడుతున్నారు. దేవుడి వద్ద రాజకీయాలు చూపాడాన్ని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

0
0
Report
Advertisement

అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి... హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాలకు వెదర్ డిపార్ట్‌మెంట్ ఆరెంజ్ అలర్ట్!

Hyderabad, Telangana:

Hyderabad Heavy Rainfall Alert Downpour: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ఆల్వాల్, బాలానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బేగంపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. నిన్న ఉదయం కూడా ఇలాగే వర్షం నమోదైన సంగతి తెలిసిందే. ఈరోజు వర్షం మరింత తీవ్రత సంత ఉంది. సెంట్రల్ హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల వర్షపాతం 70 మిల్లీమీటర్లు కూడా దాటిందని తెలంగాణ వెదర్ మ్యాన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు. 

ఒక్కసారిగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. ఎల్బీనగర్, మలక్ పేట్, నాంపల్లి, లక్డికాపూల్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ఉండటంతో బైకర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా వర్షంలోనే నీటిని తరలించే పనులు చేపట్టారు.

 

 

హైదరాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున 5:20 గంటల నుండి వర్షం తీవ్రంగా ఉంది. ఉదయం 6:00 నుండి 6:15 గంటల మధ్య వర్షపాతం మరింత పెరిగింది. వర్ష తీవ్రత క్రమంగా తగ్గి, తేలికపాటి వర్షాలుగా మారవచ్చని వాతావరణ శాఖ సూచించింది, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ మధ్య, ఉత్తర ప్రాంతాల్లో 60 నుండి 70 మిల్లీమీటర్ల వరకు వర్షం నమోదైంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై వరద నీరు ప్రవహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, నిర్మాణంలో ఉన్న భవనాలకు సమీపంలో ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:  ఆటోపైకి దూసుకెళ్లిన లారీ.. మితిమీరిన వేగానికి ముగ్గురు బలి! దత్తిరాజేరు వద్ద రోడ్డు ప్రమాదం!

Also Read:  బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మాదాపూర్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఇప్పటికీ నాన్‌స్టాప్!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఉరుములు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్ష ప్రభావం మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించింది. రాబోయే మూడు గంటల్లో యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల సమయానికి మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

Konda Surekha: 'మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. ప్రజల్లోనే ఉంటాం': కొండా సురేఖ

Warangal, Telangana:

Konda Surekha: 'పదవులు ఇవ్వాళ ఉంటాయి.. రేపు పోతాయి. పదవులు కాదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం' అని మాజీ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. పదవి అనేది అలంకారమే.. పదవీ లేకున్నా పనులు చేయొచ్చని పేర్కొన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తనకు బాధ లేదని.. అకారణంగా తొలగించడమే తనకు బాధ కలిగిస్తోందని మరోసారి చెప్పారు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోమని.. ప్రజల్లోనే ఉంటామని కొండా సురేఖ ప్రకటించారు.

మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం తొలిసారి వరంగల్‌లో తన అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీలతో మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సమావేశమయ్యారు. నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు పెరిగాయని తెలిపారు. 'ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్‌ నాయకులు అంతా ఇక్కడే పుట్టి.. పెరిగి ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను వరంగల్‌లో గెలవగానే కొన్ని రోజులకు ఆ సోకాల్డ్‌ నాయకుడు కడియం శ్రీహరి నా వెనుకాలే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి వచ్చాడు. అక్కడ ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల.. రెండు నెలలు కూడా ఆగకుండా అక్కడ ఆ జెండాతో గెలిచి ఇక్కడికొచ్చాడు' అని కడియం శ్రీహరిపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇప్పుడున్న కొంతమంది నిన్న మొన్న పదవి వచ్చినవాళ్లు కూడా ఆ రోజు గుండు సుధారాణి మీద అసమ్మతి పెట్టాలని ఆఓచించారు. కొండామురళి దగ్గరకు వచ్చి అసమ్మతి పెట్టొద్దు సహకరించాలని గుండు సుధారాణి దండం పెడితే ఆ రోజు అసమ్మతి పెట్టకుండా ఆపాడు' అని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. లేకపోతే ఆ రోజే గుండు సుధారాణి పదవి పోయి ఉండేదని చెప్పారు. 'మళ్లీ వచ్చి అన్నకేదో మంచి మాటలు చెప్పి కుడా చైర్మన్ వస్తే వస్తది లేకపోతే లేదు అన్న రాసి ఇయ్యు అని అడిగితే ఉదార స్వభావంతో కొండా మురళి రాసిచ్చాడు' అని వివరించారు. ఈ రోజు పదవి వచ్చాక గుండు సుధారాణి ఫోన్ కూడా చేయలేదని తెలిపారు.

తాను ఎంపీపీ నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చానని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొందరు ఉదయం ఒక పార్టీలో.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉంటున్నారని తన ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. తాను నమ్మిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశామని.. కొందరు వార్డు సభ్యుడిగా కూడా రాజీనామా చేయరని పేర్కొన్నారు. గతంలో కొందరు గుంటనక్కలు తమకు టికెట్‌ రాకుండా చేశారని.. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలిచి వరంగల్‌ ఈస్ట్‌ టికెట్‌ ఇచ్చారని కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు.

మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం కొందరు అల్లర్లు చేయాలా అని ఫోన్లు చేసి అడిగితే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు మాజీ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్న కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని కొండా దంపతులు ప్రకటించారు.

0
0
Report

Chiranjeevi: అభిమానులకు 'చిరంజీవి' భరోసా.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్‌

Visakhapatnam, Andhra Pradesh:

Chiranjeevi Life Insurance: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను తన సినిమాలతో వినోదం అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అభిమానులతో చక్కటి అనుబంధం పంచుకునే చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గొప్ప మాన‌వ‌తావాది అని, అభిమానుల‌ను కూడా సొంత మ‌నుషులుగా ఆద‌రించే గొప్ప మ‌న‌సున్న మ‌నిషిగా మరోసారి చిరంజీవి నిరూపించుకున్నారు. తన అభిమానులకు బీమా కల్పించారు.

పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం సుజాత‌న‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో చిరంజీవి అభిమానుల‌కు రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌త్రాల‌ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘాల నాయ‌కుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. మెగాస్టార్ చిరంజీవి గొప్ప మాన‌వ‌తావాది అని, అభిమానుల‌ను కూడా సొంత మ‌నుషులుగా ఆద‌రించే గొప్ప మ‌న‌సున్న మ‌హామ‌నిషి అని కొనియాడారు.  

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల ర‌మేశ్ బాబు మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినీ హీరో కూడా ఆలోచించ‌ని విధంగా అభిమానుల ఆరోగ్యం, ఆయా కుటుంబాల బాధ్యత‌ను గుర్తించి సీనియ‌ర్ అభిమానుల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున బీమా చేయించ‌డం ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాద్య‌మైంద‌ని వెల్లడించారు. చిరంజీవి జ‌న్మ‌దిన వేడుకల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో అభిమానుల‌కు చిరంజీవి నేరుగా బీమా ప‌త్రాల‌ను అంద‌చేశార‌ని తెలిపారు. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి వీలు కాని వారికి ఆయా ప్రాంతాల్లోని నాయ‌కుల ద్వారా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌ బాబు చెప్పారు. పెందుర్తి, గాజువాక‌, అన‌కాప‌ల్లి ప్రాంతాల అభిమానుల‌కు ఈ బీమా ప‌త్రాలు అందించే అరుదైన అవ‌కాశం త‌న‌కు దక్కిందని పేర్కొన్నారు.

'చిరంజీవి అభిమానిగా ఉన్న త‌న‌ను రాజ‌కీయ నాయ‌కుడిని చేసిన నా ఆరాధ్య దైవం చిరంజీవి. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామిని కావ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని ఎమ్మెల్యే రమేశ్‌ బాబు వివరించారు. ర‌క్తం ల‌భించ‌ని రోజుల్లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌ను ఏర్పాటుచేసి ఎంద‌రో అభాగ్యుల‌కు ప్రాణ‌దానం చేసిన మ‌హామ‌నిషి చిరంజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కోయిలాడ శ్రీనివాసరావు, గల్లా కొండలరావు, పిఎస్ ఆనంద,పోలరౌతు వెంకటరమణ, మధు, బంటు కనకరాజు, దేముడు, వాసుపల్లి చల్లారావు, భార్గవ్, అయిత సింహాచలం, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, గొర్ల అప్పారావు, అయితే శ్రీనివాసరావు, ఆర్ఎస్ నాయుడు, సదరం భీమేశ్వరరావు, సేనాపతి సోమశేఖర్, ఉరిటి లక్కీ గోవింద్, ముక్కా సంతోష్, రాపర్తి కిశోర్‌, మడక బంరాజు, కోన మోహన్ కుమార్ నాయుడు, చీర రాజు  తదితరులు పాల్గొన్నారు.

0
0
Report
Advertisement

Konda Surekha: వరంగల్‌ జిల్లా కార్యకర్తలతో కొండా సురేఖ దంపతుల కీలక భేటీ.. అసలు విషయం ఏమిటంటే..?..

Hyderabad, Telangana:

Konda Surekha and Konda murali meeting with followers in warangal: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తాజాగా.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాజీమంత్రి కొండా సురేఖకు పిలుపు వచ్చింది. దీంతో మాజీమంత్రికి పెద్ద పదవిని ఇస్తారని టాక్ నడుస్తుంది. దీనిలో భాగంగా వరంగల్ లో కొండా సురేఖ, మురళి దంపతులు వరంగల్ జిల్లాలోని తమ పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. తొలుత హనుమ కొండలోని కొండా సురేఖ నివాసంలో భేటీని నిర్వహించాలని భావించారు.

కానీ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో వరంగల్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తొంది. దీనిలో తమ అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి వారితో సమాలోచనలు జరిపి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు బర్తరఫ్ తర్వాత కొండా సురేఖమీడియా సమావేశంలో అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖలను కూడా రాశాలు.

ఇక సుష్మిత సైతం తన తప్పుకు తన తల్లి మంత్రి పదవి నుంచి ఎలా బర్తరఫ్ చేస్తారని కన్నీళ్లను పెట్టుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖకు పిలుపు రావడం తీవ్ర ఉత్కంఠగా మారింది.

Read more: CM Revanth reddy: గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం.. కీలక ఆదేశాలు..

కొండా సురేఖ బీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లేందుకు  రెడీగా ఉన్నారని వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. కానీ కొండా సురేఖ మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని, తన నియోజక వర్గం ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖకుకాంగ్రెస్ ఎలాంటి పదవి ఇస్తుందన్నదానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Pawan Telangana Tour: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం..ఆ పార్టీ టార్గెట్‌ చేస్తూ జనసేనాని తెలంగాణ టూర్!

Hyderabad, Telangana:

Pawan Kalyan Telangana Tour: తెలంగాణ రాజకీయ వేదికపై ప్రధాన పార్టీల మధ్య పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ కూడా తమ పట్టును పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే కంటెస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత మార్గాన్ని ఎంచుకున్నారు.

సామాజిక సమీకరణాల ఆధారంగా పవన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన తెలంగాణ నాయకులు ఇప్పటికే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ రాజకీయం సాగుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారని సమాచారం. అందులో భాగంగా మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక చర్యలు తీసుకోనున్నారు. అనంతరం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాల నిర్వహణకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పవన్ త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించనున్నారని జనసేన నాయకులు వెల్లడించారు.

గ్రేటర్ ఎన్నికలతో పాటు రాబోయే ప్రతీ ఎన్నికలోనూ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అయితే, పవన్ తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలు తెలంగాణలో జనసేనకు ఎంతవరకు కలిసివస్తాయి. రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: జనసేన కార్యకర్తల్ని టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

Also Read: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40% ఛార్జీల మోత!
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vishwambhara Vs Kaaka: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి..!

Hyderabad, Telangana:

Vishwambhara Vs Kaaka Sankranti Release: మెగాస్టార్ చిరంజీవి నటించిన వరుసగా రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్రమైన ఉత్సాహంలో ఉన్నారు. అయితే, ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో 'విశ్వంభర' (Vishwambhara), 'కాకా' (Kaaka) విడుదల తేదీల పైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల సమయాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఫిలింనగర్ సమాచారం ద్వారా తెలుస్తోంది.

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'కాకా' సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో, భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల వల్ల ఆలస్యమవుతూ వస్తున్న సోషియో - ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'ను దసరా రేస్ నుండి తప్పించి, 2027 జనవరి 9న సంక్రాంతి బరిలోకి దించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే కథానాయకుడు నటించిన రెండు భారీ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఏదో ఒక సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'విశ్వంభర' సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత భారీ గ్రాఫిక్స్ ఆధారంగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో దీనికి సోలో విడుదల విండో చాలా అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు, 'కాకా' చిత్రబృందం సంక్రాంతి సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతోంది. గతంలో బాబీ - చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతికి సాధించిన భారీ విజయం దృష్ట్యా, 'కాకా' మేకర్స్ ఈ సంక్రాంతి రేసును వదులుకోవడానికి అంత సులభంగా అంగీకరించేలా లేరు.

తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'కాకా' చిత్రాన్ని ముందే ప్రకటించినట్లుగా జనవరి 13, 2027న సంక్రాంతి బరిలోనే నిలిపి, 'విశ్వంభర' చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రెండు సినిమాల విడుదల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, 'విశ్వంభర' కొత్త విడుదల తేదీని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Also Read: 'ఆదర్శ కుటుంబం ఏకే 47' టీజర్ వచ్చేసింది! వెంకీ-త్రివిక్రమ్ కాంబో హిట్ కొడుతుందా?

Also REad: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

US Open Final 2026: యూఎస్ ఓపెన్‌లో సంచలనం..సబాలెంకాను ఓడించిన కజకిస్థాన్ రిబాకినా..

New York:

US Open Final Sebalenka vs Rybakina: యూఎస్ ఓపెన్ వేదికగా న్యూయార్క్‌లోని ఆర్థర్ అష్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే రిబాకినా వేగవంతమైన సర్వీస్‌లు, పవర్‌ఫుల్ గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. మూడు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 2026 సీజన్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో రిబాకినా డబ్ల్యూటీఏ (WTA) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుని ప్రపంచ నంబర్-1 స్థానాన్ని సొంతం చేసుకుంది.

తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 6-4తో సెట్‌ను గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో ప్రపంచ నంబర్-1 సబాలెంకా బలమైన పునరాగమనం చేసి 7-5తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్‌కు చేరింది. మూడో సెట్‌లో రిబాకినా తిరిగి తన జోరును ప్రదర్శించి, కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ 5-2 ఆధిక్యంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.

ప్రపంచ నంబర్-1 స్థానం.. 
ఈ విజయంతో ఎలెనా రిబాకినా ఒకే ఏడాదిలో సబాలెంకాపై రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు జనవరి 2026లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోనూ సబాలెంకాను ఓడించిన రిబాకినా, ఇప్పుడు యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ఆమెపై విజయం సాధించింది.

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ప్రపంచ నంబర్-1 క్రీడాకారిణిని రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించిన అరుదైన ఘనత సాధించి 1995 నాటి స్టెఫీ గ్రాఫ్ రికార్డును పునరావృతం చేసింది. అంతేకాకుండా, 2026లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఇది రిబాకినాకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.

పురుషుల ఫైనల్ పై ఆసక్తి
మరోవైపు ఆర్యనా సబాలెంకాకు యూఎస్ ఓపెన్ ఫైనల్లో వరుసగా మూడోసారి పరాజయం ఎదురైంది. ప్రపంచ నంబర్-1 హోదాలో బరిలోకి దిగినప్పటికీ రిబాకినా దూకుడు ముందు నిలవలేకపోయింది. కాగా, మహిళల ఫైనల్ ముగియడంతో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ ఫైనల్ పై పడింది. ఆర్థర్ అష్ స్టేడియంలో ప్రపంచ నంబర్-1 అలెగ్జాండర్ జ్వెరెవ్, 8వ ర్యాంకర్ బెన్ షెల్టన్ ల మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది.

Also Read: నేడు భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్..ఆసియా కప్‌ ట్రోఫీకి చేరువలో భారత్!

Also REad: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్..రికార్డు క్రియేట్ చేసిన యువ కెప్టెన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

చంద్ర-శని విషయోగ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు!

Hyderabad, Telangana:

Chandra Shani Vish Yog 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని చంద్రుల కలయిక చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. 2026 లో మీన రాశిలో శని చంద్రుల కలయిక విషయోగాన్ని సృష్టించబోతోంది. అయితే, ఈ యోగం అత్యంత అశుభ్రతమైందిగా భావిస్తూ ఉంటారు. జ్యోతిషం ప్రకారం.. ఈ యోగం ఫలితం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. 

శని చంద్రుల విషయోగం కారణంగా ఈ సమయంలో అన్ని రాశులు చెడు ఫలితాలను పొందబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఊహించని ఆత్మవిశ్వాసం లభించలేకపోవడం కారణంగా పనులన్నీ ఆగిపోతాయి. అలాగే చెడు ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సమస్యలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయోగం మూడు రాశుల వారి జీవితాల్లో సమస్యలను తీసుకువస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మకర రాశి 
విషయోగం కారణంగా మకర రాశి వారిపై కూడా ఊహించని ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ఎందుకంటే మకర రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు దానికి కారణంగా వీరిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడి జీవితంలో అనేకమైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ సమయంలో తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందగలుగుతారు. పనులు చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే అవి మళ్లీ తిరిగి ముందుకు ప్రారంభమవుతాయి. ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఓపికగా ఉండడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీనివల్ల భవిష్యత్తులో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత సంబంధాల్లో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులతో పాటు బంధువులతో సంబంధాలు మరింత బలపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. పాత అపార్థాలను పరిష్కరించుకోవడానికి కూడా చాలా రకాల అవకాశాలు రావచ్చు..

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి ఈ విషయం వల్ల పరిశోధనలతో పాటు చదువులు, భవిష్యత్తు వంటి అంశాల్లో అద్భుతమైన ఆలోచనలు కలిగి ముందుకు సాగుతారు.. ఎంతో కష్టమైన విషయాన్ని అధ్యయనం చేసుకున్న వారికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పరిశోధన పనుల్లో ఏకాగ్రత పెడితే అద్భుతమైన ఫలితాలు పంపుతారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. మీ తప్పుడు ఆలోచనల గురించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ముందుకు సాగడానికి ప్రణాళికలను రూపొందించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో మనతో ఉండడం అత్యంత ముఖ్యంగా భావించవచ్చు. మీరు పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసి.. బాగోద్వేగాల ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతేనే మంచిది. అంతేకాకుండా కష్టపడి పనులు చేసే వారికి తప్పకుండా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పొందినప్పటికీ ఎన్నో రకాల సమస్యల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా వ్యవహరించడం కారణంగా.. శని చంద్ర యోగం కారణంగా ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పనులపై మీరు నమ్మకం ఉంచడం చాలా మంచిది. ఏ బాధ్యతను అయినా ఆత్మవిశ్వాసంతో నిర్వర్తించడం వల్ల అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు.. కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి మానసిక బలం రెట్టింపు అవుతుంది.. దీని కారణంగా కష్టతరమైన పనుల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. సేవా కార్యక్రమాల పట్ల విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరంగా కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా.. పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడం చాలా మంచిది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

RTC Bus Fare Hike: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం ఛార్జీల మోత!

Hyderabad, Telangana:

TGSRTC Bus Fare Hike: వినాయక చవితి పండుగతో పాటు వీకెండ్ కూడా కలసి రావడంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల తీవ్ర రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులపై ఊహించని రీతిలో భారీగా ఛార్జీల భారం మోపడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

పండుగ రద్దీ సమయంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 40 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి తెరతీసింది. ఉదాహరణకు, హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్లే సాధారణ ఏసీ బస్సు టికెట్ ధర సాధారణ రోజుల్లో రూ. 420 ఉంటే, ఈ పండుగ ప్రత్యేక బస్సుల్లో అదే ప్రయాణానికి ఆర్టీసీ రూ. 570 వసూలు చేస్తోంది. అంటే ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ. 150 అదనపు భారం పడుతుండటంతో పండుగకు ఊరెళ్లే సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్లవుతున్నాయి.

మరోవైపు, రాజధాని బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతి పండుగ సమయంలోనూ ఇలా రద్దీని ఆసరాగా చేసుకుని ఛార్జీలు పెంచడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది. పండుగల వేళ ప్రయాణికులకు ఊరట కల్పించాల్సింది పోయి, ఈ తరహా బాదుడుకు దిగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

అంతేకాకుండా, పండుగ రోజుల్లో రాయితీ బస్ పాస్‌లు చెల్లుబాటు కావు అని అధికారులు చెప్పడంతో విద్యార్థులు, నిత్య ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పండుగ రద్దీ సమయంలో అదనపు ఛార్జీల బాదుడు లేకుండా సాధారణ ధరల్లోనే టికెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్..సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని మోసం?

Also Read: Eshwar Sai Bail: మాధురి రాథోడ్‌ ఎపిసోడ్‌లో ఈశ్వర్‌ సాయికి బిగ్ రిలీఫ్..ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Kavitha: '20న కొడంగల్‌లో నీ పాపాల చిట్టా బయటపెడతా'.. కాస్కో రేవంత్‌ రెడ్డి కవిత హెచ్చరిక!

Kodangal, Telangana:

Kavitha Warns To Revanth Reddy: కొడంగల్‌లోనే రేవంత్‌ రెడ్డి పాపాల చిట్టా బయటపెడతానని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. సీఎం పాపాల చిట్టా బయటపెట్టేందుకు ఈనెల 20వ తేదీన కొడంగల్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి తానేదో స్వాతిముత్యం అన్నట్లు అసెంబ్లీ ఏకాపాత్రాభినయం చేస్తూ కమల్ హాసన్‌లా నటించారని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తనకు కమీషన్లు ఎందుకంటూ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తానేదో గొప్ప వ్యక్తిని అని చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి తన అడ్వర్జైయిజ్‌మెంట్‌కు అసెంబ్లీని ఉపయోగించుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు అని సంచలన ప్రకటన చేశారు.

'అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారనుకుంటే... అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్షాలు బాహబాహీకి దిగి తిట్టుకున్నాయి. ఇది కాస్త స్పీకర్‌ను దుర్భాషలాడే వరకు వెళ్లడం మనం గమనించాం. ఈ సంఘటనలన్నీ చూస్తే మాజీ పార్లమెంటీరియన్ గా, మాజీ ఎమ్మెల్సీగా చాలా బాధగా ఉంది' అని కవిత తెలిపారు. అసెంబ్లీలో ఏ ఒక్కరూ కూడా ప్రజాసమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించారనే విధంగా కుట్ర చేశారని దుయ్యబట్టారు.

'తన పాపాలు కడుక్కోవడానికి, తన క్యారెక్టర్ గొప్పదని చెప్పడానికి తనకు కమీషన్లు ఎందుకు అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. తనకు భగవంతుడు అన్ని ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు. అవును ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఆయనకు ఓ మిత్రమండలిని, భయంకరమైన ఫ్యామిలీని, బోలెడంత మంది అవినీతి మినిస్టర్లను ఆయనకు భగవంతుడు ఇచ్చాడు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శల చేశారు.
 
'22ఏ పేరుతో పొంగులేటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇసుక ద్వారా సీతక్క కమీషన్లు తెచ్చి ఇచ్చేలా వాళ్లకు రాసిచ్చారు. ఒక అవినీతి సామ్రాట్‌గా రేవంత్‌ రెడ్డి ఉన్నారు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ తనకెందుకు కమీషన్లు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తప్పుబట్టారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను పెద్ద ఎత్తున బెదిరించిన వ్యక్తి మీరు కాదా? అని నిలదీశారు.

'తెలంగాణలో బ్లాక్ మెయిలర్స్ సంఘం పెడితే దానికి రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడు అవుతాడని ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఆంధ్రావాళ్లతో కలిసి క్యాష్ డీల్ చేసి దొరికిపోయింది మీరు కాదా?' అని రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అలాంటి రేవంత్‌ రెడ్డి తాను స్వాతిముత్యాన్ని, సాంప్రదాయానిని, సుద్దపూసను అంటే ఎవరు నమ్మరు అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని కవిత విమర్శించారు.

'విద్యా శాఖ, హోంశాఖ మంత్రిగా రేవంత్‌ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తన అవినీతి కోసం అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. మూసీ నుంచి ఇసుక వరకు పిన్ టు పిన్ రేవంత్‌ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు. ఆయనొక అవినీతి కింగ్, సామ్రాట్. ఆయన ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పాపాల అవినీతి చిట్టాను  కొడంగల్‌లోనే బయట పెడతామని ప్రకటించారు. ఈ నెల 20న పాంచజన్య సంకల్ప సభను కొడంగల్‌ నియోజకవర్గంలో నిర్వహించి రేవంత్‌ రెడ్డి అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని కవిత తెలిపారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top