ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
House Mortgage: మెడికల్ కళాశాలలో వైద్య విద్య చదివేందుకు ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఓ విద్యార్థిని మాజీ మంత్రి హరీశ్ రావును కలవగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ విద్యార్థికి రుణం మంజూరు చేయించేందుకు హరీశ్ రావు ఏకంగా తన ఇంటినే తాకట్టుపెట్టారు. ఇంటిని తాకట్టు పెట్టడంతో వచ్చిన రుణం డబ్బులను ఆ విద్యార్థినికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందించారు. అంతేకాకుండా రూ.లక్ష హాస్టల్ ఫీజు చెల్లించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
Also Read: Aata Show Auditions: డ్యాన్సర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఆట 2.0 డ్యాన్స్ షో ఆడిషన్లు ఎప్పుడో తెలుసా?
సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె కొంక మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు పొందింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ ఫీజు చెల్లింపునకు ఈనెల 18వ తేదీ చివరి గడువు కావడంతో డబ్బు కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
Also Read: KT Rama Rao: యాదాద్రి నర్సన్న స్వామి ఆశీస్సులతో కేసీఆర్ సీఎం అవుతారు: కేటీఆర్
బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా అప్పటికే తమ ఇంటిపై లోన్ ఉండడంతో రామచంద్రం తన కుమార్తె వైద్య విద్యకు డబ్బు సమకూర్చలేకపోయాడు. అన్నీ ఆర్థిక మార్గాలు మూసుకుపోవడంతో అంత డబ్బు చెల్లించలేక తండ్రీ కుమార్తె మనోవేదనకు గురయ్యారు. ఏదైనా ఆస్తులు తాకట్టు పెడితే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో తమ గోడును సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు సహాయం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావును మరోసారి రామచంద్రం తన కుటుంబంతో వచ్చి కలిశారు. విషయం తెలియగానే వెంటనే హరీశ్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని తాకట్టు పెట్టి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ.20 లక్షల విద్యా రుణాన్ని కొంక మమతకు మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.
Also Read: BRS Party: సిరిసిల్ల గడ్డ.. గులాబీ అడ్డా! కేటీఆర్ దెబ్బకు కాంగ్రెస్ గిలగిల
మొదటి సంవత్సరం హాస్టల్‌కు సంబంధించి రూ.లక్ష ఫీజును కూడా మాజీ మంత్రి హరీశ్ రావు చెల్లించారు. హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని వచ్చే ఏడాది కూడా రూ.లక్ష సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో విద్యార్థిని కుటుంబసభ్యులు హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన ఇద్దరు కుమార్తెల ఎంబీబీఎస్ విద్యకు సహాయం చేసిన హరీశ్ రావు ఇప్పుడు పీజీకి కూడా సహాయం చేయడంతో మాజీ మంత్రి హరీశ్ రావుకు రామచంద్రం కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
1 Rupee Coin Under Pillow: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లోని అనేక దోషాలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా..
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతూ ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు.
సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా? వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. వాస్తు శాస్త్రంలో రూపాయి నాణెం రెమిడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఒక రూపాయి నాణెం తీసుకుని ప్రతి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకోండి. దీని వలన నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం దూరమై.. పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. అంతే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయట. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరమవుతాయని కొందరి విశ్వాసం.
ఈ పరిహారం ప్రతీ నెలా ఒక్కసారి చేయవచ్చు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించాలి. తరువాతి రోజు ఆ నాణెంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుందని అంటున్నారు పండితులు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మత విశ్వాసాలు, నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: School Holidays: ఏపీ, తెలంగాణల్లో 8 రోజులు సెలవులు..డిసెంబరు 21 నుంచి 28 వరకు స్కూళ్లకు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moong Sprouts vs Chicken Protein: ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేవి మాంసాహారంలో చికెన్, శాఖాహారంలో మొలకెత్తిన గింజలు. అయితే, ఈ రెండింటిలో దేని ద్వారా మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అందుతుందో మీకు తెలుసా? చికెన్, మొలకల మధ్య ఉన్న పోషక విలువల వ్యత్యాసాన్ని ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.
ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?
శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ అందితే కండరాలు బలంగా తయారవుతాయి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా, దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
100 గ్రాముల చికెన్ vs 100 గ్రాముల మొలకలు
మీరు తీసుకునే పరిమాణాన్ని బట్టి ప్రోటీన్ లభ్యత మారుతుంది. 100 గ్రాముల చికెన్, 100 గ్రాముల మొలకెత్తిన గింజలు మధ్య పోలిక ఇలా ఉంది.
| ఆహారం (100 గ్రాములు) | ప్రోటీన్ పరిమాణం | అదనపు ప్రయోజనం |
| చికెన్ | 31 గ్రాములు | కండరాల పుష్టికి |
| మొలకలు (పెసలు) | 7.02 గ్రాములు | ఫైబర్ (పీచు పదార్థం) |
చికెన్: మాంసాహారుల ఛాయిస్
మీరు గరిష్ట ప్రోటీన్ పొందాలనుకుంటే చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు, కండరాలు పెంచాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ మంచి ఆహారంగా మారింది.
మొలకలు: శాఖాహారుల సంజీవని
శాఖాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా మొలకెత్తిన పెసలు తింటారు. చికెన్ తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పటికీ, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.
మీరు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలనుకుంటే చికెన్ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలు, ఫైబర్ కూడా కావాలనుకుంటే మొలకలు తీసుకోవడం ఉత్తమం. శాఖాహారులు మొలకలతో పాటు సోయాబీన్స్, పనీర్ వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారంలో కొన్ని రోజులు చికెన్, మరికొన్ని రోజులు మొలకలు తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: School Holiday: స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..మళ్లీ రేపు స్కూళ్లకు సెలవు..పబ్లిక్ హాలీడే అంట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lamborghini Manufacturing Video: ప్రతి మిడిల్ క్లాస్ సూపర్‌కార్ కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ వీటి ధర కోట్లాది రూపాయలు ఉండడం వల్ల కొనడం సామాన్యులకు సాధ్యం కాదు.. ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఓ 26 ఏళ్ల యువకుడు బిబిన్ మాత్రం తన లగ్జరీ కారు కలను సాకారం చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఐరన్ స్క్రాప్‌తో ఏకంగా లంబోర్గిని హురాకాన్ వంటి మోస్ట్ పవర్ఫుల్ లగ్జరీ కారును తయారు చేశాడు. ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
రాత్రి పగలు కష్టపడి..
బిబిన్ వృత్తిరీత్యా చిన్న జాబ్ చేస్తూ.. తీరికగా ఉన్న సమయాల్లో కష్టపడి అద్భుతం సృష్టించాడు. గత మూడు సంవత్సరాల నుంచి రాత్రి సమయాల్లో ఎంతో శ్రమించి..కేవలం రూ. 1 లక్షల పెట్టుబడితో మాత్రమే.. ఏకంగా లంబోర్గిని హురాకాన్ కారును తయారు చేశాడు. ఈ కారు తయారీలో మారుతి ఆల్టో స్క్రాప్ ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆ యువకుడు వీడియోలో తెలిపారు.
మారుతి సుజుకి ఆల్టో కారుకు సంబంధించిన ఇంజన్‌తో కారుకు ప్రాణం పోశాడు.. అంతేకాకుండా ఈ ఆల్టోకు సంబంధించిన చక్రాలు, మరికొన్ని విడిభాగాలను కూడా వినియోగించారని తెలిపారు. మరికొన్ని విడిభాగాలను ఆ యువకుడే ఎంతో కష్టపడి తయారు చేశారని వెల్లడించాడు. అలాగే ఇందులో ప్రత్యేకమైన బటర్‌ఫ్లై డోర్స్ కోసం వైపర్ మోటార్‌ను కూడా వినియోగించినట్లు తెలిపారు. ఈ డోర్స్ కేవలం ఒకే బటన్ నొక్కితే.. తలుపులు తెరుచుకోవడం ఇప్పుడు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కారు 80 శాతం మాత్రమే పూర్తి చేశారని.. ఇంటీరియర్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అతను తెలిపారు.
బిబిన్‌కు ఉన్న నైపుణ్యాన్ని చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఆతని వీడియోల కింద.. మీరు ఇలాంటి కొనలేకపోతే.. "మీరే తయారు చేసుకోవచ్చు." అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. స్క్రాప్‌ను అద్భుతమైన పార్ట్స్‌గా మార్చుకుని.. "ఎంతో పట్టుదలతో ఇలా లగ్జరీ కారును తయారు చేసిన నువ్వు భవిష్యత్‌లో బాగా ఎదుగుతావ్" అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holiday Tomorrow: దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా చలిగాలుల తీవ్రత భారీగా పెరుగుతుంది. అదే విధంగా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న క్రమంలో అనేక రాష్ట్రాల్లోని స్కూళ్లకు ప్రభుత్వాలు సెలవును ప్రకటించాయి. అయితే డిసెంబరు 19న ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబరు 19న గోవా రాష్ట్రం విముక్తి దినోత్సవం జరుపుకోనున్న కారణంగా అక్కడ పబ్లిక్ హాలీడే కానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు రానుంది. 1961లో పోర్చుగీస్ పాలన ముగింపు సందర్భంగా విముక్తి దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఉత్తర భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కారణంగా చాలా వరకు స్కూళ్లకు సెలవును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని పాఠశాలలు మూసివేత కానున్నాయి. మరోవైపు జమ్మూ & కాశ్మీర్లో కూడా శీతాకాల సెలవులను పొడిగించారు. జనవరి 4 వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి.
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారుతూనే ఉంది. AQI 450 కంటే ఎక్కువగా చేరుకుంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం GRAP స్టేజ్ 4ని అమలు చేసింది. దీంతో తదుపరి నోటీసు వచ్చేంత వరకు స్కూళ్లు కార్యాలయాలు తెరవడానికి వీల్లేదంటూ కఠినమైన ఆర్డర్స్ జారీ చేసింది. నోయిడాలో కూడా ఇదే పరిస్థితి. కొన్ని స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో విద్యార్థులు తమ హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తున్నారు. ఇవి పూర్తి అవ్వగానే క్రిస్మస్, న్యూఇయర్‌తో కలిసి దాదాపుగా 12 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Actress Chaitra Kidnap: ప్రముఖ సీరియల్ నటి చైత్ర ఆర్. కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. తన ఏడాది కుమార్తె సంరక్షణను దక్కించుకోవడానికి ఆమె భర్త హర్షవర్ధన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక అందిన సమాచారం. అయితే ఇందులో నిజనిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కలహాలే కారణమా?
సీరియల్ నటి చైత్ర సోదరి లీలా ఆర్. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. చైత్ర, హర్షవర్ధన్‌లకు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే, గత ఏడెనిమిది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో వారు విడివిడిగా ఉంటున్నారు. చైత్ర తన ఏడాది కుమార్తెతో కలిసి బెంగళూరులోని మాగడి రోడ్డులో నివసిస్తుండగా, హర్షవర్ధన్ హాసన్‌లో ఉంటున్నాడు.
పక్కా ప్లాన్‌తో కిడ్నాప్?
డిసెంబర్ 7న షూటింగ్ పని మీద మైసూర్‌కు వెళ్తున్నానని చైత్ర తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ఈ కిడ్నాప్ ఆమె భర్త పన్నిన ముందస్తు వ్యూహమని పోలీసులు అనుమానిస్తున్నారు. హర్షవర్ధన్ తన సహచరుడు కౌశిక్‌కు రూ. 20,000 అడ్వాన్స్‌గా ఇచ్చి ఈ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద చైత్రను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని బిడది మార్గం గుండా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
బిడ్డను ఇస్తేనే విడుదల.. బెదిరింపు కాల్స్!
కిడ్నాప్ జరిగిన కొద్దిసేపటికే (ఉదయం 10:30 గంటలకు) చైత్ర ఎలాగోలా తన స్నేహితుడు గిరీష్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం హర్షవర్ధన్ నేరుగా చైత్ర తల్లికి ఫోన్ చేసి అసలు విషయం బయటపెట్టాడు. చైత్ర సురక్షితంగా ఉండాలంటే.. తన కుమార్తెను చెప్పిన ప్రదేశానికి తీసుకురావాలని హర్షవర్ధన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
లేదంటే చైత్రను వదిలిపెట్టేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు హర్షవర్ధన్, వర్ధన్ ఎంటర్ప్రైజెస్ యజమాని, ఒక సినీ నిర్మాత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Snake Dance Video: నాగిని పాటకు పాము డ్యాన్స్! ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యూస్..విపరీతంగా వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme Neo 8 Turbo 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme మీ తమ మరో కొత్త టర్బో సిరీస్ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ 2026 సంవత్సరం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ Realme Neo 8 Turbo పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Realme Neo 8 Turbo స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ లెన్స్‌తో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ హైయ్యండ్ మోడల్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 8000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ గ్లాస్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ కూడా లభిస్తోంది. Realme Neo 8 Turbo స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర కెమెరా వివరాల్లోకి వెళ్తే.. అదనంగా ఈ మొబైల్‌కి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది.. ఇక ఈ మొబైల్ ను కంపెనీ Realme UI 7.0తో Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
Realme నియో 8 టర్బో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన విడుదల, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ను మొదటగా చైనాలో 2026 సంవత్సరం రెండవ నెలలో లేదా మూడవ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేసిన తర్వాతే ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook