మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
Bellampalle, Kannal Rural, Telangana:ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వారం మహారాష్ట్ర కు చెందిన మహంత్ రామగిరి మహారాజ్ అనే వ్యక్తి ఇస్లాం మహమ్మద్ ప్రవక్త పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జామ మసీద్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో వారు మాట్లాడుతూ మహారాజ్ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతిసేవిధంగా, దేశ ఐక్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Giri Pradakshina: శ్రీశైలం క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో పౌర్ణమి 'గిరి ప్రదక్షిణ'
Srisailam, Andhra Pradesh:Giri Pradakshina At Srisailam Temple On The Ocassion Of Rakhi Pournami Watch VisualsMalla Reddy Rakhi: సోదరీమణులతో రాఖీ కట్టించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
Secunderabad, Telangana:Sisters Tie Rakhi To Former Minister Malla Reddy At Hyderabad Watch VideoBandi Sanjay: సోదరితో రాఖీ కట్టించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Karimnagar, Telangana:Konda Surekha: రేవంత్‌కు 'బంగారు రాఖీ' ఎందుకు కట్టిందో చెప్పిన మంత్రి కొండా సురేఖ
Hyderabad, Telangana:Pawan Kalyan: పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవనన్న రాఖీ గిఫ్ట్
Pithapuram, Andhra Pradesh:Pawan Kalyan Distributes Sarees To Women In Pithapuram For Rakhi FestivalChandrababu Rakhi: సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టిన మంత్రులు
Amaravathi, Andhra Pradesh:Ministers And Women Leaders Ties Rakhi To Chandrababu At Amaravati Watch Videoప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని..
Hyderabad, Telangana:Telugu Student Ties Rakhi To Pm Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ రక్షాబంధన్ వేడుకలతో సందడిగా మారింది.. శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఈ వేడుకల్లో ఢిల్లీలోని ఇంటర్మీడియట్ చదువుతున్న తెలుగు విద్యార్థిని సాయి మధుమిత పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణికట్టుకు రాఖీ కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..
రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాఖీలు కట్టగా.. ఆయన చిన్నారులను ఆశీర్వదించి ఆప్యాయంగా పలకరించారు.. ఎంతో సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.. అంతేకాకుండా పిల్లల చదువులతో పాటు వారి లక్ష్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.. చిన్నారులతో సరదాగా హై-ఫైవ్స్ ఇస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.
దేశ ప్రధానికి స్వయంగా రాఖీ కట్టే అరుదైన అవకాశం దక్కడంపై తెలుగు విద్యార్థిని సాయి మధుమిత హర్షం వ్యక్తం చేశారు.. ఇది తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.. ప్రధాని మోదీ ఎంతో ప్రేమాభిమానాలతో మాట్లాడి తమను ఎంతగానో ప్రోత్సహించారని.. ఆయన చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ విద్యార్థిని వెల్లడించారు..
Also Read: చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ పర్వదినాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలిపారు.. ఈ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలతో పాటు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు.. రక్షాబంధన్ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదని బంధాలను మరింత బలోపేతం చేసే పవిత్రమైన వేడుక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపడమే కాకుండా శ్రేయస్సును, అద్భుతమైన ఆనందాన్ని నింపాలని ఆయన కోరుకున్నారు..
Also Read: చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
వరదల్లో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహంపై ఉన్న బంగారం చోరీ.. ఇద్దరు అరెస్ట్!
Hyderabad, Telangana:Nepal Theft Video: తీవ్రమైన వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి ఒకవైపు నేపాల్ అతలాకుతలమవుతుంటే.. మరోవైపు కొందరు వ్యక్తుల అమానుష్య ప్రవర్తన యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. ప్రాణాలు కోల్పోయి వరద నీటిలో కొట్టుకు వచ్చిన ఓ అభాగ్యురాలి మృతదేహం నుంచి బంగారు చెవి కమ్మలు చోరీ చేసిన అత్యంత హీనమైన ఘటన నేపాల్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. నేపాల్ కు సంబంధించిన పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..
నేపాల్ లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించి వందలాదిమంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.. కాక వారితో దాటికి కొట్టుకొని వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒక చెక్కతో పాటు కర్రల సహాయంతో ఆ మృతదేహాన్ని ఒడ్డుకు లాగారు. అనంతరం ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చుకొని.. నిర్దాక్షినీయంగా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను లాగేసుకున్నారు.. చుట్టూ ఉన్నవారు వారిని అడ్డుకోలేక చూస్తూ.. ఆ ఘటనను స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరిస్తూ ఉండిపోయారు.. ఈ 41 సెకండ్ల విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో దుమారం లేపుతున్నాయి. మానవత్వం సిగ్గుపడేలా ప్రవర్తించిన ఆ దుండగులపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించారు.. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. వీరు నవల్ పరాసికి చెందిన మదన్ గురుంగు.. నున్సారీ కి చెందిన ఉమేష్ చౌదరిగా గుర్తించి వారిని భరత్ పురం లోని ఓ పార్కు సమీపంలో పట్టుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.. విపత్తు సమయంలో సహాయం చేయాల్సింది పోయి.. మృతదేహాల వద్ద ఇలా నీచమైన పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీస్ అధికారులు హెచ్చరించారు.. వరద సహాయక చర్యల ప్రాంతాల్లో నిఘ మరింత పెంచినట్లు స్పష్టం చేశారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
గత కొద్ది రోజులుగా నేపాల్‌తో పాటు టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు వరదల కారణంగా దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. సుమారు 1500 మందికి పైగా గల్లంతయినట్లు అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ ప్రకృతి విపత్తు వేళ మనుషుల్లో నైతిక విలువలు ఇంతలా దిగజారడంపై సర్వత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!
Hyderabad, Telangana:Jharkhand Tribals Tie Rakhi To Trees: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగకు జార్ఖండ్‌లోని ఆదివాసీ మహిళలు సరికొత్త అర్ధాన్ని ఇచ్చారు.. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న పచ్చని అడవులను కాపాడుకోవడమే నిజమైన రక్ష అని చాటి చెప్పారు.. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోని వందలాదిమంది గిరిజన మహిళలు అడవిలోని వృక్షానికి పవిత్రమైన రాఖీలు కట్టి.. ప్రకృతి రక్షణకు పునరంకితమయ్యారు.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
చాకులియా పరిధిలోని సున్సునియా అటవీ ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ పర్యావరణ ఉద్యకారిణి జమున టుడు నేతృత్వంలో మహిళలంతా సాంప్రదాయ వస్త్రాదరణతో అడవికి భారీ ఎత్తున తరలివచ్చారు.. చేతిలో రాఖీలు పట్టుకొని అడవి బాట పట్టడం చూసి మొదటగా అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ.. చెట్ల వద్దకు వచ్చి సాల్వృక్షాలకు సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం చూసి అందరూ మెచ్చుకున్నారు..
అంతేకాకుండా చెట్లను సోదరుల్లా పూజించి.. తమ తోబుట్టువులుగా భావించి రక్షా సూత్రాలు కట్టారు.. అడవులను కన్నబిడ్డల్లా సొంత సోదరులారా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని ప్రతిజ్ఞ చేశారు.. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా రక్షాబంధన్ చెట్లకు రాఖీలు కట్టడం ఒక ఆచారంగా ఉండేదట.. ఆదివాసుల జీవనశైలితో పాటు సాంస్కృతిని అటవీ సంరక్షణతో ముడిపెడుతూ జమునా టుడు ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
అంతేకాకుండా మహిళలందరూ ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. అటవీ మాఫియా తో పాటు కలప స్మగ్లర్ల నుంచి చెట్లను కాపాడడంతో పాటు అక్రమంగా నరికివేతను పూర్తిగా అడ్డుకోవడం క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. అంతేకాకుండా అడవిలోని జంతువులతో పాటు పక్షుల ఆవాసాలను పరిరక్షించి వైవిధ్యాన్ని కాపాడుతామని అన్నారు.. కానీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు సామాజిక వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ఈ రక్షాబంధన్ వేడుకల్లో మహిళలం ప్రతిజ్ఞ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Rakhi: తెలంగాణలో ఆత్మీయంగా 'రాఖీ'.. ప్రముఖులకు రాఖీలు కట్టిన మహిళలు
Baddipadaga, Telangana:Telangana Rakhi Celebration: 'రాఖీ పౌర్ణమి' పండుగను పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ వివాదాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేట్‌లోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థినిలు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి కానుకలు అందించారు.
కిటకిటలాడిన హరీశ్ రావు నివాసం
బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుకు రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీ పడ్డారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం మహిళలతో కిటకిటలాడింది. బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతోపాటు రాష్ట్ర నలుమూలలా నుంచి వచ్చిన మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థినులు హరీశ్ రావుకు రాఖీలు కట్టారు. అనంతరం వారి ఆశీర్వచనం పొందిన హరీశ్ రావు రాఖీలు కట్టిన వారికి కానుకలు అందించారు. మాజీ మంత్రి హరీశ్ రావుకు సత్యవతి రాథోడ్, తుల ఉమతోపాటు మరికొందరు ప్రముఖులు ప్రత్యేకంగా రాఖీ కట్టారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.#rakshabandhan #rakhi pic.twitter.com/AxCHL7mIWx
— Harish Rao Thanneeru (@BRSHarish) August 28, 2026
మల్లారెడ్డి రాఖీ పండుగ
రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మహిళలు రాఖీలు కట్టించారు. అనంతరం మిఠాయిలు తినిపించగా సోదరీమణులకు కానుకలు అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... 'రక్షాబంధన్ అన్నాచెల్లెలు, అక్క తమ్ముడు మధ్య ఉన్న గొప్ప వారధి. రక్షాబంధన్క అక్కాచెల్లెలు వచ్చి రాఖీ కట్టడం సాంప్రదాయంగా వస్తుంది. నాకు మా సోదరీమణులంటే ఎంతో ఇష్టం. ఈ రాఖీ బంధానికి ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలని మారుతున్న సమాజ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ చేసుకోవాలి' అని తెలిపారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్‌లోని రాంనగర్‌లోని తన నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు దత్తాత్రేయకు రాఖీ కట్టారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ నగర్ మాజీ మేయర్ బండారు కార్తిక రెడ్డి, మహిళా మోర్చా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కేతినేని సరళ తదితరులు ఉన్నారు.
రాఖీ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్థానిక మహిళలు, పారిశుద్ధ్య కార్మికులురాఖీ కట్టారు. అనంతరం ప్రతి ఆడబిడ్డకు ఎమ్మెల్యే చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పురుషుడు అమ్మాయికి అండగా ఉండాలని వారిని అన్నింట్లో ప్రోత్సహించి ముందుకు వెళ్లేలా చూడాలని సూచించారు.
మంత్రి అడ్లూరి
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు స్థానిక మహిళా కౌన్సిలర్లు, ఇతర సోదరీమణులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సోదరీమణుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
కరీంనగర్లో
రక్షా బంధన్ సందర్బంగా కరీంనగర్లో తన సోదరి శైలజతో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాఖీ కట్టించుకున్నారు. ఈ వేడుకల్లో బండి సంజయ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం
కార్మిక సోదరీమణులతో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆయనకు పారిశుద్ధ్య కార్మికులు రాఖీలు కట్టారు. అనంతరం రాఖీలు కట్టిన సోదరీమణులకు చీరలను అందజేశారు.
Sun Transit 2026: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్!
Hyderabad, Telangana:Sun Transit In Purva Phalguni Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వ ఫల్గుణి నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే ఈ నక్షత్రానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆగస్టు 31వ తేదీన సూర్యుడు ఈ నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో సూర్యుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆనందంతో పాటు ఊహించని శ్రేయస్సు లభిస్తుంది.. అంతేకాకుండా గౌరవం పెరిగి డబ్బు సంబంధిత కోరికలు కూడా నెరవేరుతాయి. అదృష్టం కూడా తోడుగా ఉండి ఉద్యోగాల్లో విజయాలు సాధించగలుగుతారు.. అయితే, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేయడం కారణంగా ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి లాభాలు:
మేషరాశి
పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సూర్యుడు సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి ఎక్కువగా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి అదృష్టం తోడు ఉండడమే కాకుండా పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే విజయాలు కూడా లభించి ఉద్యోగంలో గొప్ప గొప్ప మార్పులు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పురోగతి కూడా లభించి డబ్బులు కూడా భారీగా సొంతం చేసుకుంటారు. కష్టాల నుంచి విముక్తి లభించి మానసిక ప్రశాంతత లభించబోతోంది. అలాగే నిలిచిపోయిన పనులు తప్పకుండా ఈ సమయంలో పూర్తి కాబోతున్నాయి..
సింహరాశి
ఈ నక్షత్రం లోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా.. సింహరాశి వారికి కూడా ఎక్కువగా మేలు జరుగుతుంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ సమయంలో అకస్మాత్తుగా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా అంచలంచలుగా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో నాయకత్వ సామర్థ్యం కూడా పెరిగి కొన్ని రకాల విజయాలు తప్పకుండా సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరిగి కొత్త మార్గాలు పొందగలుగుతారు..
తులారాశి
తులారాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. వీరికి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే కాకుండా కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒప్పందాలను కుదుర్చుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పూర్వీకుల ఆస్తులు సులభంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమస్యలు కూడా పరిష్కారం అవ్వడంతో రుణాలు కూడా తిరిగి చెల్లిస్తారు..
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి లభించి విశేషమైన లాభాలు పొందగలుగుతారు. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఒత్తిడి తగ్గడం కారణంగా పనులపై దృష్టి పెట్టి అనుకోకుండా ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఫ్లైట్ సీట్లోనే మహిళ మలవిసర్జన.. ముక్కులు మూసుకుని 40 నిమిషాలు నరకం చూసిన ప్రయాణికులు!
Hyderabad, Telangana:Passenger Poops On Seat News: మలేషియా నుంచి చైనా బయలుదేరిన ఏరేషియా విమానంలో ప్రయాణికులకు తీవ్రమైన చేదు అనుభవం ఎదురయింది.. విమానం ల్యాండింగ్ కు మరికొద్ది నిమిషాల సమయం ఉండగా.. ఒక మహిళ ప్రయాణికురాలు తన సీట్లోనే బహిరంగంగా మలవిసర్జన చేయడంతో తోటి ప్రయాణికులకు సుమారు 45 నిమిషాల పాటు భరించరాని దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడ్డట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేం జరిగింది?
మలేషియాలోని కోటా కినాబలు నుంచి చైనాలోని షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఏకే1516 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. రాత్రి 10 గంటలకు బయలుదేరిన విమానం తెల్లవారి మూడు గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది.. అయితే, విమాన ల్యాండింగ్ కావడానికి దాదాపు 40 నిమిషాల ముందు ఒక్కసారిగా తీవ్రమైన దుర్వాసన వ్యాప్తి చెందింది.. ఆ దుర్వాసన తీవ్రతకు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు సైతం ఉలిక్కిపడి మేల్కొన్నారట..
జావో అనే ప్రయాణికుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తుందని.. వారిద్దరి మధ్య కూర్చున్న ఆమె ఉన్నట్టుండి సీట్లోనే మలవిసర్జన చేసిందని తెలిపారు.. విమానం మూసి ఉన్న క్యాబిన్ కావడంతో నిమిషాల వ్యవధిలోనే ఆ భరించడానికి విమానమంతా వ్యాపించి ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసేసింది..
పలువురు ప్రయాణికులు ముక్కులు మూసుకొని.. తీవ్రమైన అసహనంతో నలభై నిమిషాల పాటు ప్రయాణాన్ని బిక్కువిక్కుమంటూ గడిపారు.. ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా యాజమాన్యం అధికారికంగా స్పందించినట్లు తెలుస్తోంది.. విమానంలో ల్యాండింగ్ కు ముందు హైజిన్ కాంప్లికేషన్ తలెత్తిన మాట వాస్తవమేనని ధ్రువీకరించింది..
స్థితిగతులు గమనించిన క్యాబిన్ క్రూ సిబ్బంది వెంటనే ప్రాథమికంగా ఆ ప్రాంతాన్ని అంతా శుద్ధం చేసినట్లు తెలుస్తోంది.. విమానం షాంగై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ప్రయాణికురాలను దించి.. విమానం మొత్తాన్ని క్లీనింగ్ చేసినట్లు ఎయిర్ ఏషియా వెల్లడించింది.. ప్రయాణంలో ఎదురైన ఈ దారుణ అనుభవాన్ని ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాయి.. అంతర్జాతీయ విమానాల్లో ఇలాంటి ప్రవర్తన కలిగిన ప్రయాణికులపై నిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఎంత ఉంటే బెర్త్ పక్కాగా వస్తుంది? కొత్త IRCTC రూల్స్ ఇవే!
Hyderabad, Telangana:Train Waitlist: దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ వైపు వెళ్లే రూట్లలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు వెళ్లే వారికి టికెట్ కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం, పండుగ సీజన్లో అయితే వెయిటింగ్ లిస్ట్ 500 వరకు కూడా వెళ్తుంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుండటం వల్ల, డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట టికెట్ బుక్ అవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఆ సమయంలో వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కావడానికి భారతీయ రైల్వే కొన్ని ఫార్ములాలు చెప్పింది, దాని ద్వారా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు.
సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకున్న వారిలో 21 శాతం మంది ఏదో ఒక సమయంలో క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అదనంగా, మరో ఐదు శాతం మంది ప్రయాణించలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సీట్లు ఖాళీ అవుతాయి, వాటిని వెయిటింగ్ లిస్టు వారికి కేటాయిస్తారు. అంతేకాకుండా, భారతీయ రైల్వే కొన్ని ఎమర్జెన్సీ కోటాలను కూడా రిజర్వ్ చేస్తుంది.. అవి నిండకపోతే వాటిని కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు ఇస్తారు.
రైల్వేలో ఎన్ని సీట్ల వరకు ఉంటే కన్ఫర్మ్ అవుతుంది?
సాధారణంగా స్లీపర్ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఇందులో 21 శాతం మంది టికెట్ క్యాన్సిల్ చేస్తే.. ఐదు శాతం మంది ప్రయాణించకపోతే, ఒక కోచ్‌కు సుమారు 18 కన్ఫర్మ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం ట్రైన్ 10 స్లీపర్ కోచ్‌లలో దాదాపు 150 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇదే సూత్రం సెకండ్ క్లాస్‌కు కూడా వర్తిస్తుంది.
Also Read: Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఏ యాప్ వాడితే సీట్ గ్యారెంటీగా వస్తుంది?
Also Read: Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!
అయితే పండుగ సమయంలో టికెట్ క్యాన్సిలేషన్లు, ప్రయాణించలేని వారి వల్ల వెయిటింగ్ లిస్టులో కన్ఫర్మ్ అవ్వడం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి వెయిటింగ్ టికెట్లు రాకుండా ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ ప్రయాణానికి 60 రోజుల ముందు ఉదయం 8 గంటలకు రైల్వే టికెట్లు ఓపెన్ అవుతాయి. మీరు ప్రయాణించే రోజుకు 60 రోజుల ముందే బుక్ చేసుకుంటే, 99 శాతం మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఉదయం 8 గంటల నుండి మొదటి 15 నిమిషాల్లోనే టికెట్ బుక్ చేసుకోవాలి. మీరు ప్రయాణించే తేదీలు ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకుని, టికెట్లు ఓపెన్ కాగానే బుక్ చేసుకుంటే సరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party Protest: రేవంత్ రెడ్డి పాలనకు వెయ్యి రోజులు.. వారం పాటు బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు
Baddipadaga, Telangana:KTR Review: అడ్డగోలు హామీలు.. ఎన్నో ఆశలు ప్రజలకు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని.. కాంగ్రెస్ అధికారం చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే వారం పాటు నిర్వహించనున్న ఆందోళనలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష చేయగా.. మరోసారి పార్టీ కార్యక్రమాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాట చేయనుందని ప్రకటించారు. వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. 420 హామీల మోసంతో పాటు పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి రోజులైనా నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేద్దామని.. కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ ఒకటో తేదీన తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నారు. ఆ చార్జ్‌షీట్‌ను ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించనున్నారు.
సెప్టెంబర్ 2
ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
420 హామీల మోసాన్ని గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన
ప్రజలకు బాకీ ఉన్న హామీలతో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ
సెప్టెంబర్ 3
వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు
సాగునీరు, విద్యుత్, యూరియా, బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు
హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు
సెప్టెంబర్ 4
మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు
మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు
రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలపై నిలదీత
హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు
సెప్టెంబర్ 5
విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు
ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌పై పోరాటం
అదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు
సెప్టెంబర్ 6
హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ
తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీత
గ్రామాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 7
ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు
420 హామీల మోసంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు
సెప్టెంబర్ 8
వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు
అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు
సెప్టెంబర్ 10
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్ఎస్ సంఘీభావం
