Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

కసిరెడ్డిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది

Aug 21, 2024 10:10:44
Bellampalle, Kannal Rural, Telangana

మంచిర్యాల బెల్లంపల్లి మండలం కసిరెడ్డి గ్రామంలో నిన్న రాత్రి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18న కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, భర్త అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్ల గురిజాల పోలీసులు తెలిపారు. గత రెండు రోజులుగా భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 07:29:18
Hyderabad, Telangana:

60 Year Old Man Marries Video Watch Now: ప్రేమకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమలో పడుతున్న వైనం మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ కు చెందిన ఒక 60 ఏళ్ల వృద్ధుడు తనకంటే సగం వయస్సు తక్కువ ఉన్న యువతిని వివాహం చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి కేవలం 20 ఏళ్ల వయస్సు ఉండడమే కాకుండా.. అప్పటికే తన చదువు పూర్తి చేసుకుందట.. ఈ వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన హకీం బాబర్ ఒక ఆయుర్వేద వైద్యుడు.. ఆయనకు దాదాపు 60 ఏళ్లకు పైగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఆయన 26 ఏళ్ల తన భార్యకు డైవర్స్ ఇచ్చి.. 26 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 34 ఏళ్ళు ఉండడం విశేషం. అయితే మనుషులు కలిస్తే వయసు ఒక సంఖ్య మాత్రమే అని ఈ జంట ప్రపంచానికి చాటి చాటి చెప్పింది..

సాధారణంగా యువ పెళ్లి జంటలు చేసుకునే విధంగా.. ఆ వృద్ధ వరుడు కూడా ఇవ్వవధువుతో కలిసి గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. పెళ్లి వేడుకలు హాకీమ్ బాబర్ తన భార్య కోసం ప్రేమ పాటలను పాడి.. పెళ్లికి వచ్చిన అతిధులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. అంతేకాకుండా కుల పెద్దలతో పాటు స్థానికులు వీరి పెళ్లికి అతిథులుగా వచ్చి ఆశీర్వదించారు.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. 

Video of Bridal Photoshot has gone viral on SM pic.twitter.com/FGQHjMLfth

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

ఈ వివాహానికి సంబంధించిన వీడియో మేఘ్ అప్‌డేట్స్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అయితే, దీనిని పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నటిజెన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రేమకు హద్దులు లేవని.. వారు సంతోషంగా ఉంటే చాలని కొందరు వారికి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు ఇది కేవలం డబ్బుల కోసమే జరిగిన పెళ్లి అంటూ కామెంట్లలో విమర్శలు గుప్పిస్తున్నారు. వృద్ధుడి ఆరోగ్యం, వయస్సు పై మరికొందరు జోకులు వేస్తూ కామెంట్లలో సోషల్ మీడియా వినియోగదారులను నవ్విస్తున్నారు.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 05:36:43
Hyderabad, Telangana:

Sun Moon Saturn Venus Conjunction Effect On Zodiac: అతి త్వరలోనే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది ఈ నవరాత్రులు మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, ఈ నవరాత్రు లను దుర్గాదేవికి అంకితం చేశారు. ఈ సమయంలోనే కొన్ని అత్యంత అరుదైన గ్రహాల కలయిక కూడా జరుగుతోంది.. ముఖ్యంగా మొదటి రోజే సూర్యుడు, చంద్రుడు, శని, శుక్ర గ్రహాల కలయిక మీనరాశిలో జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏవైనా కొన్ని గ్రహాలు ఒక రాశిలో కలిసిన అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది ఈ నాలుగు గ్రహాలు ఒకే చోట కలవడం చాలా విశేషమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల ఈ క్రిందిరాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు..
మేషరాశి 
చైత్ర నవరాత్రుల సమయంలో మేష రాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాలు కలుగుతాయి. కెరీర్‌తో పాటు ఉద్యోగాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక డబ్బులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలాకాలంగా ఎలాంటి శుభవార్తలు లేని వారికి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల డబ్బుతో కూడిన శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని త్వరగా పూర్తవుతుంది. చట్టపరమైన కేసుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

కర్కాటక రాశి 
చైత్ర నవరాత్రుల సమయంలో కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతోపాటు వ్యాపారాలనుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. వ్యాపారాల విస్తరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయంలో ఖ్యాతితో పాటు సామాజిక స్థితిగతులు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా లభిస్తుంది. అలాగే పిల్లలనుంచి అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మకర రాశి 
మకర రాశి వారికి చరిత్ర నవరాత్రుల నుంచి అద్భుతమైన శుభ సమయం ప్రారంభమవుతుంది. వీరు కొత్త ప్రాజెక్టుల నుంచి విశేషమైన గుర్తింపు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే కుటుంబంలో శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. పూర్వికుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకం. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే వీరికి బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 05:26:33
Hyderabad, Telangana:

Trigrahi Rajayog Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలు మానవ జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. వీటి ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది. రాబోయే ఐదు రోజుల్లో ముఖ్యమైన గ్రహాలు కదలికలు జరిపి ప్రత్యేకమైన సంయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజుల తర్వాత బృహస్పతి రాష్ట్ర పరిగణించే మీనంలో సూర్యుడుతో పాటు శుక్రుడు శని గ్రహాలకు జరుగుతుంది. దీని కారణంగా త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. 

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని విశ్వాసంతో పాటు నాయకత్వానికి సూచికగా భావిస్తారు. శని చర్యతో పాటు న్యాయాన్ని సూచిస్తుంది. శుక్రుడు భౌతిక ఆనందంతో పాటు శ్రేయస్సు, సంపదకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ప్రభావాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. త్రిగ్రహి రాజయోగం కారణంగా ధనస్సు రాశి తో పాటు మీనా, వృషభరాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు లభించడమే కాకుండా.. ఈ  రాశుల్లో జన్మించిన వ్యక్తులకు కెరీర్, వ్యాపారాల పరంగా కూడా కలిసి వస్తుంది. జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మీన రాశి 
శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పనుల్లో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు లభించి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. అలాగే చాలా కాలంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా పదోన్నతులు లభించడమే.. ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యోగ ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన పదోన్నతులు లభిస్తాయి. అంతేకాకుండా వీరు కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చాలావరకు అద్భుతమైన అవకాశాలను తెచ్చి పెడతాయి. అలాగే భాగస్వామ్యుల నుంచి విశేషమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో కొన్ని రకాల పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

వృషభరాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ గ్రహ సంయోగం కారణంగా ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడితో పాటు శని శుక్ర గ్రహాల కలయిక వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా అద్భుతంగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు భారీ మొత్తంలో లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 10, 2026 16:51:01
Hyderabad, Telangana:

Amla Juice Benefits For Weight Loss: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధం ఉసిరికాయ. కేవలం ఒక గ్లాసు ఉసిరి నీటిని మీ రోజువారి జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ "పచ్చి ఉసిరి రసం" ఒక వరంలా పనిచేస్తుంది.

పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిల నియంత్రణ
ఉసిరి నీరు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఉసిరి నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇది సహజంగా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గుదల..
శరీర జీవక్రియను వేగవంతం చేయడంలో ఉసిరి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామంతో పాటు ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి మీ ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జీర్ణ సమస్యలకు పరిష్కారం
అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది.

ఉసిరి రసం ఎలా తీసుకోవాలి?
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉసిరి రసాన్ని కలుపుకుని తాగాలి. ఈ పానీయం కొంచెం వగరుగా అనిపిస్తే, రుచి కోసం కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు.

(గమనిక: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉసిరి రసం ఒక ఉత్తమ ఎంపిక. అయితే, ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు ఈ పానీయాన్ని ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: EPS 95 Pension Hike: పోరుబాట పట్టిన ఉద్యోగులు..ఈపీఎస్ పెన్షన్ 7 రెట్లు పెంపు?! ఫైనల్‌గా ఎంత రావొచ్చు?

Also Read: Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 10, 2026 16:03:00
Hyderabad, Telangana:

Telangana Assembly Deputy Speaker: 'లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మరి తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఎందుకు భర్తీ చేయడం లేదు' మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వేణుగోపాల్‌ తీరును ఖండించారు. 'రాష్ట్రంలో మాత్రం అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే' అని విమర్శించారు.

Also Read: Hotels Close: బ్యాచిలర్స్‌ అలర్ట్‌! హైదరాబాద్‌లో హోటల్స్‌, హాస్టల్స్‌ క్లోజ్‌?

'తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపట్టారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు.

Also Read: KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్‌ను కడిగి పారేస్తాం: కేటీఆర్‌

'కేసీ వేణుగోపాల్‌ చెప్పిన మాటలు నిజమే కావచ్చు. కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?

'రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమని తెలిపారు. ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. 'అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 10, 2026 15:46:05
Wadgaon, Maharashtra:

Hotels And Hostels Close: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు అక్కడెక్కడో కొన్ని దేశాలు యుద్ధం చేస్తుంటే దాని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం.. యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో భారత ప్రజల జీవనం అతలాకుతలమవుతోంది. దీంతో బ్యాచిలర్స్‌, ఉద్యోగులు, గృహిణులతోపాటు యావత్‌ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్‌ను కడిగి పారేస్తాం: కేటీఆర్‌

యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు దిగుమతులపై తీవ్ర ప్రతిబంధకం ఏర్పడింది. ఇంధనం, చమురు దిగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దేశంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ కొరత ఏర్పడుతుందనే వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఈ కారణంగా ఆతిథ్య రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. హోటల్‌ రంగం కుదేలవుతోంది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా కొరత ఏర్పడిందని.. సరిపడా గ్యాస్‌ లభించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నైలో హోటళ్లు సగానికి పైగా మూతపడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా మూతపడే అవకాశం ఉంది.

Also Read: Hotels Close: బెంగళూరు బంద్‌.. నగరంలో నేటి నుంచి అన్నీ హోటల్స్ క్లోజ్

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ప్రతిబంధకం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్‌ హోటళ్ల సంఘం సమావేశమైంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు.. దేశంలో ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా ఎలా ఉందని హోటల్‌ అసోసియేషన్‌ చర్చించింది. ప్రస్తుతానికి అయితే హోటళ్ల బంద్‌ను సంఘం ప్రకటించలేదు. అంతేకాకుండా హైదరాబాద్‌లో హాస్టల్స్‌ కూడా మూతపడుతాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. హాస్టల్స్‌లో కూడా పెద్ద ఎత్తున ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగం జరుగుతుంటుంది. కమర్షియల్‌ గ్యాస్‌లు వినియోగిస్తుండడంతో ఇప్పుడు కొరత ఉండే నేపథ్యంలో హాస్టల్స్‌ కూడా బంద్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హాస్టల్స్‌ సంఘం కూడా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం గ్యాస్‌ కొరత రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రస్తుతానికి అయితే తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో ఎల్పీజీ గ్యాస్‌ ప్రభావంతో హాస్టల్స్‌, హోటళ్లు మూసివేసే అవకాశాలు లేవు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూసివేయగా.. హాస్టల్స్‌పై కూడా ప్రభావం చూపింది. హోటళ్లు మూసివేయడంతో ఆయా నగరాల్లో బ్యాచిలర్స్‌, ఉద్యోగస్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. గ్యాస్‌ కొరత ఎప్పుడు తీరుతుందో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 10, 2026 13:38:40
Hyderabad, Telangana:

AI Boyfriends Telugu News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనాలో సరికొత్త రూపం దాల్చింది. తోడు కోసం మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన బాయ్ ఫ్రెండ్స్ వైపు అక్కడ యువతులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఒంటరితనం నుంచి విముక్తి పొందడానికి కోట్లాదిమంది అమ్మాయిలు ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాయ్ ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత పెరగడంతో చైనా ప్రభుత్వం కలవర పడుతోంది. నిజానికి ఇంతలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అమ్మాయిలను ఆకర్షించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఎప్పుడు తెలుసుకుందాం.

చైనాలో పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడి, సామాజిక ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతకు తమ రిలేషన్ షిప్ కొనసాగించడం పెద్ద భారం అవుతుందట.. పెళ్లి పట్ల విరక్తిగా ఉన్న యువతులు.. గొడవలు పడని, ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ బాట్లను తమ జీవిత భాగస్వాములుగా భావిస్తూ వస్తున్నారట.. మిన్మో తో పాటు తో పాటు గ్లో వంటి యాపుల ద్వారా తమకు నచ్చిన లవర్స్ ను డిజైన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా  వీరికి 24 గంటలు అందుబాటులో ఉంటూ.. బాధల్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఓదార్చడం వంటి పనులు చేయడంతో యువతులు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారట..

అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.. ఇప్పటికే దేశంలో జననాల రేటు విపరీతంగా పడిపోయి ఆందోళన కలిగిస్తుంటే.. యువతులు పెళ్లిళ్లు చేసుకోకుండా ఇలా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోనే కాలం గడిపితే భవిష్యత్తులో దేశ జనాభా మరింత తగ్గిపోతుందని అక్కడి ప్రభుత్వం ఊహించని స్థాయిలో భయపడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా ఊహించని ప్రభావం పడుతుందని కొంతమంది నిపుణులు చైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 

చైనా ప్రభుత్వం ఈ వర్చువల్ లవ్ ను అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వస్తుంది. చాట్ బాట్లతో గడిపే సమయం పై ప్రత్యేకమైన పరిమితి కూడా విధించినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లు సామాజిక విలువలను దెబ్బతీయకుండా.. అశ్లీలతకు తావు లేకుండా ఉండేలా కఠినమైన ఫిల్టర్లను అమర్చాలని కంపెనీలకు చైనా ప్రభుత్వం ఆదేశించింది. యువత మనస్తత్వాలను ప్రభావితం చేసే యాపులపై చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన నిఘాలు కూడా ఏర్పాటు చేసింది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Mar 10, 2026 13:36:11
Secunderabad, Telangana:

LPG, LNG, PNG Difference: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. దాని ప్రభావం భారతదేశంలో కూడా కనిపించడం ప్రారంభమైంది. గ్యాస్ ధరలు పెరగడం, కొంత ప్రాంతాల్లో సరఫరా అంతరాయం ఏర్పడడం వల్ల కొన్ని నగరాల్లోని చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రజలకు ఒక సందేహం వస్తోంది. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ ఏది? పైపుల ద్వారా వచ్చే గ్యాస్, సిలిండర్ గ్యాస్, LNG అన్నీ ఒకటేనా? వాస్తవానికి ఈ మూడు గ్యాస్ రకాల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవి ఏమిటి? భారత్‌లో అవి ఎలా సరఫరా అవుతున్నాయి? అనే విషయాలను సరళంగా తెలుసుకోవడం అవసరం. LPG, LNG, PNG మధ్య అసలు తేడా ఏంటీ? భారత్ ఈ గ్యాస్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందో తెలుసుకుందాం. 

PNG అంటే ఏమిటి?

PNG అంటే  పైప్డ్ నేచురల్ గ్యాస్ . ఇది సహజ వాయువు. ఇందులో ప్రధానంగా మీథేన్ గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్యాస్‌ను ప్రత్యేక పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగ్రామ్ వంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే లక్షలాది ఇళ్లకు ఈ విధంగా గ్యాస్ అందుతోంది. PNG ఉపయోగించే ఇళ్లలో గ్యాస్ వినియోగాన్ని కొలవడానికి మీటర్ అమర్చుతారు. విద్యుత్ బిల్లుల మాదిరిగానే ప్రతి నెల గ్యాస్ వినియోగానికి అనుగుణంగా బిల్లు చెల్లించాలి. ఈ గ్యాస్‌ను ప్రధానంగా వంటకు,  గీజర్‌లకు ఉపయోగిస్తారు. PNG తేలికపాటి వాయువు కావడంతో లీక్ అయినా అది గాల్లోకి పైకి వెళ్లిపోతుంది. అందువల్ల ఇది తక్కువ ప్రమాదకరమైన, శుభ్రమైన ఇంధనంగా పరిగణిస్తారు. 

LPG అంటే ఏమిటి?
LPG అంటే  లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే సిలిండర్ గ్యాస్. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ అనే వాయువుల మిశ్రమం ఉంటుంది. ఈ వాయువులను అధిక ఒత్తిడితో ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. సాధారణంగా భారతదేశంలో 14.2 కిలోల సిలిండర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు.  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అమలు తర్వాత దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు LPG కనెక్షన్లు అందాయి. ప్రస్తుతం భారతదేశంలో 32 కోట్లకు పైగా LPG కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. LPGలో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. అందువల్ల గ్యాస్ లీక్ అయితే అది నేల దగ్గర చేరి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే LPG వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Also Read: 8th pay commission Salary Increase 2026: కోటి మంది Central Government Employeesకి  తీపికబురు.. DA పెంపుపై క్లారిటీ.. మరో 10 రోజుల్లో కేంద్రం ప్రకటన చేసే అవకాశం..!!   

LNG అంటే ఏమిటి?
LNG అంటే  లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఇది కూడా సహజ వాయువే కానీ దీన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, సుమారు -162 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచి ద్రవ రూపంలోకి మార్చుతారు. ఇలా ద్రవ రూపంలోకి మారిన గ్యాస్‌ను పెద్ద ట్యాంకర్లలో ఒక దేశం నుంచి మరొక దేశానికి రవాణా చేస్తారు. భారతదేశంలో LNGను సాధారణ గృహాల్లో ఉపయోగించరు. ఇది ప్రధానంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పెద్ద వాణిజ్య రంగాల్లో ఉపయోగిస్తారు. భారత్‌కు LNG ప్రధానంగా ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది.

భారత్‌లో గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుంది?
భారతదేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను గృహాలకు సరఫరా చేసే పనిని గ్యాస్ పంపిణీ సంస్థలు నిర్వహిస్తాయి. నగరాల్లో పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇళ్లకు గ్యాస్ అందిస్తాయి. LPG సిలిండర్లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తాయి. LNG దిగుమతులు మాత్రం ప్రత్యేక టెర్మినల్స్ ద్వారా జరుగుతాయి. అక్కడికి చేరిన LNGను మళ్లీ వాయు రూపంలోకి మార్చి పరిశ్రమలకు లేదా గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌కు పంపిస్తారు.

ధరల పరంగా ఏది చౌక?
ధరల విషయానికి వస్తే నగరాల్లో పైప్డ్ గ్యాస్ సాధారణంగా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఉదాహరణకు కొన్ని నగరాల్లో PNG ధర యూనిట్‌కు సుమారు రూ. 30–రూ. 32 వరకు ఉంటుంది. మరోవైపు LPG సిలిండర్ ధర సాధారణంగా రూ. 800 నుండి రూ. 1100 మధ్య ఉంటుంది. LNG ప్రధానంగా పరిశ్రమల్లో ఉపయోగించే ఇంధనం కావడంతో దాని ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రపంచ మార్కెట్‌లో ఏర్పడే మార్పులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరిగే పరిణామాలు గ్యాస్ సరఫరా,  ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో PNG, LPG, LNG వంటి గ్యాస్ రకాల మధ్య తేడాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూడింటి మధ్య అసలు తేడా ఇదే…!

Also Read: PF Help Desk:  EPFO సభ్యులకు అలర్ట్.. PF విత్‌డ్రా, నామినీ, KYC సమస్యలకు ఇక్కడికి వెళ్తే వెంటనే పరిష్కారం..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 10, 2026 12:40:25
Gandipet, Telangana:

Congress 6 Guarantees: 'కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. 'రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలు, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది' అని విమర్శించారు. 'ఆరు గ్యారెంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టు చట్టబద్దత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతాం' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?

హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్ మూడోది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది. వారి హామీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని వెల్లడించారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?

'రెండన్నరేళ్ల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరఫున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ

'రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకంతో ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున.. మూసీ బాధితుల తరఫున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని కేటీఆర్‌ తెలిపారు. 'అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీపై రేవంత్‌ రెడ్డిని నిలదీస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 10, 2026 11:37:18
Hyderabad, Telangana:

EPS 95 Pension Hike Update: దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81 లక్షల మంది EPS-95 పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలక పరిణామం తెరపైకి వచ్చింది. తమ కనీస పెన్షన్‌ను ఏకంగా 7 రెట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం, పెన్షనర్ల ఆందోళనల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా నెలకు రూ.1,000 పెన్షన్ ఏమాత్రం సరిపోదని నిరసిస్తూ, పెన్షనర్లు తమ గొంతు వినిపిస్తున్నారు.

మార్చి 9 (నిన్న) నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు సాగే నిరసన కార్యక్రమాన్ని పెన్షనర్లు ప్రారంభించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థల మాజీ ఉద్యోగులు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు. 30-35 ఏళ్లు విరాళాలు అందించినప్పటికీ, ప్రస్తుతం సగటున కేవలం రూ.1,171 మాత్రమే పెన్షన్ వస్తోందని వారు వాపోతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఏమిటి?
EPS-95 జాతీయ పోరాట కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన కోరికలు ఇవే. ప్రస్తుతమున్న రూ.1,000 ని రూ.7,500 కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరువు భత్యం (DA), ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారందరికీ అధిక పెన్షన్ ప్రయోజనాలు అందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.

పెన్షన్ నిధిని నిర్వహించడంపై ప్రభుత్వం తన పరిమితులను వివరిస్తోంది. పెన్షన్ నిధిలో బీమా అకౌంటింగ్ లోటు ఉందని, అకస్మాత్తుగా పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచడం ఆర్థికంగా భారమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గరిష్ట జీత పరిమితి రూ.15,000పై లెక్కలు కడుతున్నారు. దీనిని పెంచితే తప్ప పెన్షన్ పెరగడం కష్టమని ప్రభుత్వం వాదిస్తోంది.

పెన్షన్ ఎంత పెరిగే అవకాశం ఉంది? 
ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, ఒత్తిడిని గమనిస్తే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ఒక మధ్యేమార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంది. ప్రస్తుత కనీస పెన్షన్ రూ.1,000 ఉండగా.. దాన్ని రూ.7,500 వరకు పెంచాలంటూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. కనీస పెన్షన్ రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

పెన్షనర్లు కోరుతున్నట్లుగా 7 రెట్లు పెంపు వెంటనే జరగడం కష్టమైనప్పటికీ, కనీస పెన్షన్‌ను రూ.3,000 వరకు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 11న ముగిసే ఈ నిరసనల తర్వాత ప్రభుత్వం నుండి ఏదైనా అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

Also Read: Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!

Also REad: Amit Mishra Case: ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన క్రికెటర్ భార్య! తాగి రోజూ కట్నం కోసం హింసిస్తున్నాడట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 10, 2026 11:27:39
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Currency Permission: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండపైకి భక్త కోటి భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం భక్తులకు కొత్త సందేహం వ్యక్తమవుతోంది. తిరుమల కొండపైకి వెళ్లే సమయంలో అలిపిరి చెక్‌ పోస్టు వద్ద భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి కారులో దాదాపు అర కోటికి పైగా డబ్బులు తీసుకెళ్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?

తిరుమల శ్రీవారికి భక్తులు తమకి తోచిన కానుకలు సమర్పిస్తుంటారు. తాజాగా తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త శ్రీవారికి రూ.65 లక్షలు హుండీలో వేయడానికి తన డ్రైవర్‌తో పంపించాడు. తిరుమల కొండ ఎక్కేందుకు కారు నిలవగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు, భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా డబ్బులు గుర్తించారు. రూ. 65 లక్షల డబ్బును విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి ప్రూఫ్ చూపించి డబ్బును తిరుమలకి తీసుకెళ్లాలని అధికారులు చెప్పారు. అయితే కారు డ్రైవర్‌ డబ్బుకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. విజిలెన్స్‌ అధికారుల సూచన మేరకు డ్రైవర్‌ తన యజమాని అయిన పారిశ్రామికవేత్తకు సమాచారం అందించాడు.

Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ

కొండపైకి డబ్బులు తీసుకెళ్లాలంటే తప్పక ఆధారాలు చూపించాల్సిందేనని చెప్పడంతో చెన్నై నుంచి పారిశ్రామికవేత్త తిరుమలకు బయల్దేరారు. ఆయన వచ్చాక డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే కొండపైకి డబ్బులు అనుమతి ఇస్తారు. ఆధారాలు చూపించకపోతే విజిలెన్స్‌ అధికారుల ఆధీనంలో ఆ డబ్బులు ఉంటాయి. తాజా సంఘటనతో తిరుమల కొండపైకి ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చనే సందేహం అందరిలో మెదలుతోంది. సాధారణంగా కోటి రూపాయల వరకు నగదును తిరుమలకు తీసుకెళ్లవచ్చు. అయితే ఆ నగదుకు సంబంధించి వివరాలు తప్పక ఉండాల్సిందే. లేదంటే మాత్రం తనిఖీల సమయంలో పట్టుబడితే విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటారు.

Also Read: Adulterated Wheat Flour: హైదరాబాద్‌ ప్రజల్లారా జరభద్రం! గోధుమ పిండి కూడా కల్తీ

మళ్లీ తిరుమల వచ్చిన బండ్ల గణేశ్‌
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మరోసారి సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తన కుటుంబంతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బండ్ల గణేశ్‌ వెలుపలకు వచ్చారు. కొన్ని వారాల కిందట హైదరాబాద్‌ నుంచి తిరుమలకు బండ్ల గణేశ్‌ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబు, నారా లోకేశ్‌ను బండ్ల గణేశ్‌ కలిశాడు. ఇప్పుడు మరోసారి తిరుమలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 10, 2026 11:11:56
Hyderabad, Telangana:

Washing Clothes At Night Vastu: నేటి బిజీ లైఫ్‌లో సమయం సరిపోక చాలామంది రాత్రి వేళల్లో బట్టలు ఉతుకుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు ఈ అలవాటు పట్ల హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల జీవితంలో ప్రతికూల మార్పులు వస్తాయని, కొన్ని వాస్తు దోషాలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. వాస్తు, శాస్త్రీయ దృక్కోణంలో రాత్రి వేళ బట్టలు ఉతకడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు, ఆధ్యాత్మిక కారణాలు
ప్రతికూల శక్తి:
వాస్తు శాస్త్రం ప్రకారం పగలు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. రాత్రి వేళలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల ఈ ప్రతికూలత దుస్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని నమ్ముతారు.

ఆర్థిక ఇబ్బందులు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అనవసరంగా రాత్రి వేళ నీటిని పారబోయడం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారితీయవచ్చు.

వాస్తు దోషాలు: సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా ఆరబెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరిగి, మానసిక అశాంతికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శాస్త్రీయ, ఆరోగ్య పరమైన సమస్యలు
కేవలం నమ్మకాలే కాదు, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సూర్యరశ్మి ఒక సహజ క్రిమిసంహారకంగా ఉంటారు. రాత్రిపూట ఆరబెట్టిన బట్టలకు సూర్యకాంతి తగలదు. దీనివల్ల బట్టల్లోని తేమ వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పూర్తిగా నశించవు. సరిగ్గా ఆరని, బ్యాక్టీరియా ఉన్న బట్టలు ధరించడం వల్ల చర్మ అలెర్జీలు, దురద వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.

ఏ సమయంలో ఉతకడం ఉత్తమం?
వీలైనంత వరకు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో బట్టలు ఉతకడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉతికిన బట్టలను సూర్యరశ్మి బాగా తగిలే చోట ఆరబెట్టడం వల్ల అవి పూర్తిగా క్రిమిరహితంగా మారుతాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపడమే కాకుండా, మీ దుస్తులకు తాజాగా ఉండేలా చేస్తుంది.

బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం కుదరకపోతే, బట్టలను రాత్రి ఉతికినప్పటికీ, ఆరబెట్టే ప్రక్రియను మాత్రం పగలు సూర్యకాంతిలో ఉండేలా చూసుకోండి. సరైన పద్ధతుల్లో బట్టలు ఉతకడం వల్ల మీ ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు రెండూ మెరుగుపడతాయి.

Also Read: Snake Viral Video: నల్లత్రాచు పాము మరణశాసనం..విషాన్ని చిమ్మి, అక్కడికక్కడే కుప్పకూలిపోయింది!

Also Read: Amit Mishra Case: ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన క్రికెటర్ భార్య! తాగి రోజూ కట్నం కోసం హింసిస్తున్నాడట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top