పట్టణంలోని 11వ వార్డ్ లో వైద్య శిబిరం ఏర్పాటు.
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డ్ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మంగళవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ప్రతిఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సౌజన్య, అలేఖ్య , శిరీష,సీడీపీఓ స్వరూప అంగన్వాడీ సూపర్వైజర్ ,ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Ganesh Immersion: గణేశ్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం.. చెరువులో గణనాథుడితో మునిగి ఆరుగురు విద్యార్థుల జల సమాధి
Peddakanjerla, Telangana:Ganesh Immersion Turns To Tragedy: వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఒక్కసారిగా తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో రోజు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తూ విద్యార్థులు చెరువులో పడిపోయారు. చెరువు నీటిలో మునిగి విద్యార్థులు మృతి చెందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆరుగురు విద్యార్థులు చనిపోయారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామం నేరేడు చెరువులో నిమజ్జనానికి వినాయకుడిని శిరీష చారిబుల్ ట్రస్ట్ విద్యార్థులు తీసుకువచ్చారు. ఆరు మంది విద్యార్థుల మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి ప్రాచీన్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
Kavitha Lands: రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్.. 'గజం భూమి ఎక్కువ ఉన్నా నీకే ఇచ్చేస్తా!'
Baddipadaga, Telangana:Kavitha Lands: 'కవిత పేరు మీద మహబూబ్‌నగర్‌లో 14 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త అనిల్ కుమార్ పేరిట 23 ఎకరాలు ఉంది. వారిద్దరి పేరు మీద 37.26 ఎకరాల భూమి ఉంది' అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండించారు. తన కుటుంబానికి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని మాజీ ఎంపీ కవిత స్పష్టం చేశారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై 'ఎక్స్' వేదికగా కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల అఫిడవిట్లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తా' అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారని తెలిపారు. అసలు ఈ రేవంత్ రెడ్డిపైనే తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. 'గుంపు మేస్త్రీ ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి' అని మరోమారు కవిత డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి తనకు ఎక్కువగా ఉన్న.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కవిత మరోమారు స్పష్టం చేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు
అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు.. అసెంబ్లీలో ఈరోజు సీఎం… pic.twitter.com/0dimCUmKNT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2026
KCR Farm House: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములు దళితులకు పంచుతా!
Hyderabad, Telangana:KCR Farm House Lands: భూముల వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మొన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి పాల్పడగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ భూములను సర్వే చేస్తామని.. వాటిని దళితులకు పంచి పెడతామని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి అన్ని ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా 22ఏ భూముల వ్యవహారంపై కీలక ప్రసంగం చేశారు. 22ఏపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తున్నారని.. కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. 'కేసీఆర్ కుటుంబం పేరుతోనే 440 ఎకరాల భూమి ఉంది. ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో వివాదంలో ఉన్న భూమి 385 ఎకరాలు ఉంది. కేసీఆర్ ఆధీనంలో 700 ఎకరాలకు పైగా భూమి ఉందా.? లేదా.? రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా' అని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
కేసీఆర్ ఆధీనంలో ఉన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వం భూమి ఎక్కడ ఉందో ఎంత ఉందో తేల్చాలని అసెంబ్లీ నుంచి అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.లేదంటే అధికారులు, జిల్లా మంత్రుల మీద చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
'సిద్దిపేట మార్కూక్ మండలంలో కేసీఆర్‌కి 27 ఎకరాలు ఉండాలి. 67 ఎకరాలు ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరుపై 123 ఎకరాల భూమి ఉంది. కేటీఆర్ కుటుంబానికి 49 ఎకరాలు. కేటీఆర్ సతీమణి శైలిమ పేరుమీద 17 ఎకరాలు, వారి కుమారుడు హిమాన్షు పేరు మీద 43 ఎకరాల భూమి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'మాజీ మంత్రి హరీశ్ రావుకి 21 ఎకరాలు, ఆయన సతీమణి పేరు మీద 8.5 ఎకరాల భూమి ఉంది. సంతోశ్ రావు కుటుంబానికి 79 ఎకరాల భూమి ఉంది. సంతోశ్ పేరుపై 18.21 ఎకరాలు, ఆయన భార్యపై 7.2 ఎకరాలు ఉంది' అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వివరించారు.
'2010లో ఒడిశాలో ధరణి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ నేనే ధరణి తెచ్చానని చెప్పుకున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి తీసుకువచ్చిన కేసీఆర్ దందాలకు తెరలేపారని ఆరోపించారు. ధరణి చిట్టా చెప్పాలనే కేసీఆర్‌ను పదే పదే సభకు రావాలని అడిగినట్లు చెప్పారు. భూముల విషయాలు బయటపడతాయనే సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Clay Ganesh: 800 ఏళ్లు నిమజ్జనం కాని మట్టి వినాయకుడు.. ఎక్కడో తెలుసా?
Narayanpet, Telangana:800 Years Old Clay Ganesh Idol: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ గణనాథుడి సందడి కనిపిస్తుంది. వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేయడం సంప్రదాయం. కానీ ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనం చేయకుండా ఏకంగా 800 సంవత్సరాలకుపైగా నిత్య పూజలు అందుకుంటున్న మట్టి వినాయకుడు ఉన్నాడంటే నమ్ముతారా? తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఈ గణపతి విగ్రహనికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అరుదైన మట్టి వినాయకుడిపై ప్రత్యేక కథనం.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ల వీధి విద్యాధర్ దీక్షిత్ నివాసంలో కొలువై ఉన్న ఈ మట్టి గణపతి సాధారణ వినాయకుడు కాదు. సుమారు 800 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన ఈ గణనాథుడు నేటికీ నిమజ్జనం కాకుండా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ విగ్రహానికి సుమారు 12వ శతాబ్దం నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో కశ్మీర్ ప్రాంతం నుంచి ఓ బ్రాహ్మణ కుటుంబం ఇక్కడికి వలస వచ్చారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన లోకపల్లి సంస్థానం రాజు కోరిక మేరకు ఆ కుటుంబం ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికుల కథనం. వారు తమ వెంట తీసుకొచ్చిన మట్టి వినాయకుడిని అప్పటి నుంచి నిత్యం పూజిస్తూ వచ్చారట. కాలం మారినా.. తరాలు మారినా ఇక్కడ మట్టి గణపతికి మాత్రం పూజలు ఆగలేదు.
ఈ వినాయకుడి చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబం అభివృద్ధి చెందడం కొంతమందికి నచ్చక కొందరు దొంగల రూపంలో వచ్చి గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం దెబ్బతినడంతో దాన్ని నిమజ్జనం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారట. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ వ్యక్తి విటుడి రూపంలో వచ్చి ఓ సూచన చేశాడట. భిన్నమైన ఈ గణపతి విగ్రహాన్ని మట్టితో సహా పాలలో వేసి ఒక గదిలో ఉంచి 41 రోజుల పాటు పూజలు చేయాలని చెప్పాడట. ఆ వ్యక్తి చెప్పినట్లుగానే విగ్రహాన్ని పాలలో ఉంచి గది తలుపులు మూసి 41 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
41 రోజులు పూర్తయిన తర్వాత గది తలుపులు తెరిచి చూడగా గణపతి విగ్రహం తిరిగి తన రూపాన్ని ఏర్పరచుకోవడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఈ గణపతిని నిమజ్జనం చేయకుండా నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. ఒక్కసారి ప్రతిష్ఠించిన ఈ మట్టి గణపతికి మళ్లీ నిమజ్జనం అనే మాటే లేదు. వందల ఏళ్ల తరబడి తరతరాలుగా ఇదే గణపతికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా భక్తుల్లో విశ్వాసం ఉంది. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. స్థానికులకే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి.. ఇతర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
వినాయక చవితి సందర్భంగా ఈ పురాతన మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్పే ఈ మట్టి గణపతి నేటికీ అదే విశ్వాసంతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. నిమజ్జనం ఎరుగని 800 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ మట్టి గణపతిని మీరు కూడా సందర్శించండి.
Ganesh Mouse: గణేశ్ మండపంలో ఆశ్చర్యకర ఘటన.. కదలకుండా గణనాథుడి వద్ద ఎలుక
Andhra Pradesh:Mouse Pradakshina To Lord Ganesh: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమవగా.. రెండో రోజు కూడా గణనాథుడు భక్తుల పూజలందుకున్నాడు. విఘ్నాలు తొలగించే వినాయకుడికి భక్తులు పూజలు చేసి తమ కోరికలు విన్నవించుకున్నారు. రెండో పూజలు అందుకున్న వినాయకుడి వద్దకు ఆయన వాహనమైన మూషికం వచ్చింది. గణేశ్ మండపంలో ఎలుక ప్రత్యక్షమవడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మండపంలో కొన్ని నిమిషాల పాటు మూషికం అలాగే మండపంలో ఉంది. ఈ ఆసక్తికర సంఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
వినాయక చవితి వేడుకల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గణనాథుడి వాహనమైన మూషికం సాక్షాత్తు ఆ దేవుడి చెంత ఉండిపోయింది. ఎక్కడకు కదలకుండా అక్కడే ఎలుక ఉండిపోయింది. అల్లూరి జిల్లా సీలేరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్దకు ఒక మూషికం (ఎలుక) చేరింది.
మొదట గణనాథుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ మాదిరి ఎలుక చేసింది. అనంతరం గణేశుడి ఒడిలో ఎలుక కూర్చుంది. గంటల తరబడి అక్కడే కదలకుండా ఉండిపోయింది. పాఠశాలలో పిల్లలు చేసే భజనలు, పెద్ద శబ్దాలు వస్తున్నప్పటికీ ఆ మూషికం ఏమాత్రం బెదరకుండా అక్కడే ఉంది. వినాయక చవితి రోజు మొదలైన ఈ ప్రయాణం ఇప్పటికీ గణేశ్ విగ్రహం చుట్టూ సాగుతోంది. విద్యార్థులు బొట్టు పెడితే కూడా ఎలుక పారిపోకుండా నామం ధరించింది.
పాఠశాల విద్యార్థులు భక్తితో బొట్టు పెట్టి.. తినడానికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఆ ఎలుక ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఆహారం తింటూ గణపయ్య విగ్రహం దగ్గరే ఉంటోంది. దీన్ని దేవుని లీలగా స్థానికులు భావిస్తున్నారు. ఈ వింత దృశ్యాన్ని చూసిన పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగశకుంతల, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరింత భక్తిభావంతో పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడితో పాటు ఆయన వాహనమైన మూషికం కూడా ప్రత్యక్షంగా దర్శనమివ్వడంతో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడుతున్నారు.
Kavitha: మళ్లీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాడు.. అతడి మాటలు నమ్మితే అన్యాయమే: కవిత
Baddipadaga, Telangana:Kavitha vs Revanth Reddy: మళ్లీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాడని.. ఇంకా రెండేళ్లు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మాట తప్పడం, మడమ తిప్పడ మే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. 'సమస్యలు తీర్చాలని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తు పెట్టుకోండి' అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఈ నెల 18వ తేదీలోగా వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని ఆల్టిమేటం జారీ చేశారు. లేదంటే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉద్యోగుల పోరాటానికి అన్ని విధాలుగా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
'తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులంతా పోరాటం చేశారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రభుత్వమైన ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం అవసరం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ వారిని నిర్లక్ష్యం చేస్తోంది' అని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తుండడంతోనే పరిపాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు.
'ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని చేస్తామని మాటిచ్చారు. కానీ ఇప్పుడు వారిని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ సంతోషంగా లేడు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ ఎంపీ కవిత వివరించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. ప్రభుత్వ విద్య మానిటరింగ్ అనేదే లేకుండా పోయిందని వెల్లడించారు.
'గురుకులాలు, డిగ్రీ కాలేజ్ లలో 40 శాతం ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదు. ఉన్న టీచర్లను ఈ ప్రభుత్వం సరిగా చూసుకోవటం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా వారి కరువు భత్యాన్ని రేవంత్ రెడ్డి మింగేశాడు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఇవే సమస్యలపై గత ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఇష్టమొచ్చినట్లు తిట్టాడని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయడం లేదు రేవంత్ రెడ్డిపై కవిత మండిపడ్డారు.
'రాష్ట్రంలో లక్షా 20 వేల మంది టీచర్లే ఉంటారు. కానీ వాళ్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రాదు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 'ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. వాళ్లకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కనీసం ఈ విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియడం లేదు' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. తల్లి కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్లం.. ఈ పిల్ల కాంగ్రెస్‌కు భయపడాల్సిన అవసరం లేదని ఉద్యోగ సంఘాలకు మాజీ ఎమ్మెల్సీ కవిత సూచించారు.
Balapur Ganesh: పూరి జగన్నాథ ఆలయ రూపంలో బాలాపూర్ గణేశ్.. పోటెత్తిన భక్తులు
Balapur, Telangana:Puri Jagannath Temple Pandal: గణేశ్ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఖైరతాబాద్ తర్వాత అంతటి ఆకర్షణగా నిలిచేది బాలాపూర్ గణేశ్. లడ్డూ వేలంలో అత్యధిక ధర పలికే బాలాపూర్ గణేశ్ లడ్డూ.. ఈసారి మండపంలోనూ ప్రత్యేకత పొందింది. ప్రతి యేటా ప్రత్యేక రూపంలో మండపాన్ని తీర్చిదిద్దే నిర్వాహకులు ఈసారి పూరీ జగన్నాథ్ ఆలయ రూపంలో మండపం రూపొందించారు. పూరీ జగన్నాథ్ ఆలయంలో కొలువుదీరిన బాలాపూర్ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం నుంచి నగర నలుమూలల నుంచి భక్తులు బాలాపూర్‌కు తరలివస్తున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తుల రాకతో బాలాపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయాన్ని పోలిన భారీ సెట్టింగ్‌ను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు. సెట్టింగ్ నిర్మాణం, అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపాడు.
గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ జాన్‌తో కలిసి సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు చేశారు. పూజా కార్యక్రమాలను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు, సభ్యులకు, అన్ని గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 'హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భక్తులు, నిర్వాహకులు, ప్రభుత్వం సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి' అని సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి, పాడిపంటలు బాగా పండాలి, రైతులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Vinayaka Chavithi Tragedy: ఉత్సవాల్లో విషాదం.. వ్యక్తి ప్రాణాలు తీసిన గణేశ్ విగ్రహం కొనుగోలు
Secunderabad, Telangana:Ganesh Utsav Turns To Tragedy: వినాయక చవితి ఉత్సవాల వేళ పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. వర్గ విభేదాలు కొన్ని చోట్ల ఘర్షణకు దారి తీయగా.. మరికొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. ఒక చోట అయితే గణేశ్ ఉత్సవాల కోసం వినాయక విగ్రహం కొనుగోలుకు వెళ్లగా.. అక్కడ విగ్రహాల తయారీదారులతో గొడవ ఏర్పడింది. ఈ గొడవలో విగ్రహం కొనడానికి వచ్చిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని పోచారంలో చోటుచేసుకుంది.
Also Read: Ganesh Utsav: గణేశ్ ఉత్సవాల్లో తొలి రోజే రచ్చరచ్చ.. పూజలందుకోకుండానే వినాయకుడు నిమజ్జనం
హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో ఒకరు మృతి చెందాడు. విగ్రహాల విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య జరిగిన మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చౌదరిగూడకు చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితి పండుగ వేళ పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని జోడిమెట్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గణేష్ విగ్రహం కొనుగోలు చేసేందుకు వచ్చిన చౌదరిగూడకు చెందిన కిరణ్ అనే వ్యక్తికి, స్థానిక విగ్రహ విక్రేతలకు మధ్య నామమాత్రపు విషయమై వివాదం మొదలైంది. క్రమంగా ఈ తగవు మాటమాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు చౌదరిగూడకు చెందిన బాధితుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి పడిపోయిన అతడిని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సూర్య ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధితుడు కిరణ్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
Also Read: Ganesh Chaturthi: కొబ్బరికాయలతో.. విబూదితో విభిన్న రకాల గణనాథులు
మృతుడి వార్త తెలియడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలంటూ వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
దీపంతో అగ్నిప్రమాదం
గణేశ్ ఉత్సవాల సందర్భంగా దీపం వెలిగించగా అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 2లో శ్రీ సాయి దత్త ఉమెన్స్ లగ్జరీ పీజీ హాస్టల్లో వినాయక చవితిని పురస్కరించుకొని హాస్టల్ ఐదో అంతస్తులో ఓ అమ్మాయి దీపం వెలిగించారు. ఆ దీపం నుంచి వేరే దానికి మంటలు అంటుకుని అగ్ని ప్రమాదానికి దారి తీసింది. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. స్వల్ప అగ్నిప్రమాదమే కావడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు.
Ganesh Utsav: గణేశ్ ఉత్సవాల్లో తొలి రోజే రచ్చరచ్చ.. పూజలందుకోకుండానే వినాయకుడు నిమజ్జనం
Shadnagar, Telangana:Group Clash In Ganesh: అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సిన వినాయక చవితి వేడుకలు తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారి తీశాయి. ఒక వర్గానికి.. మరో వర్గానికి తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు మరింత వివాదానికి దారి తీసింది. గ్రామ రాజకీయాలు, వర్గ విభేదాలతో గణేశ్ ఉత్సవాలు ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. రెండు వర్గాలు గొడవకు దిగడంతో చివరకు వినాయకుడిని ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పీర్జాపూర్ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు కొందరు వినాయక విగ్రహం తీసుకువచ్చారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రులు నిర్వహించేందుకు శ్రీరాములు, తిరుపతి, సంగమేష్, కురువ మల్లయ్య తదితరుల బృందం ఒక విగ్రహాన్ని తీసుకురాగా మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సిములు ఆధ్వర్యంలోని మరో వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంజనేయ స్వామి ఆలయంలో కాకుండా వేరే చోట ఎక్కడైనా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని వారు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో వెంటనే సమాచారం అందుకున్న చౌదరిగూడ పోలీసులు గ్రామంలోకి రంగప్రవేశం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా వివాదాస్పదమైన ఆంజనేయ స్వామి ఆలయంలో ఏ వర్గం కూడా విగ్రహాన్ని ప్రతిష్టించకూడదని పోలీసులు ఆదేశించారు. పండుగ వేళ ఘర్షణలకు తావివ్వకుండా వేరేచోట మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల ఆదేశాలతో సర్పంచ్ వర్గం వేరే చోట వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజలు ప్రారంభించింది. అయితే విగ్రహాన్ని తీసుకువచ్చిన శ్రీరాములు వర్గం ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. దేవుడి వద్ద రాజకీయాలు, వర్గ విభేదాలు తగవని ఆవేదన వ్యక్తం చేస్తూ తాము తెచ్చిన గణేశుడికి ఎలాంటి పూజలు చేయకుండానే నేరుగా తీసుకెళ్లి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. దేవుడి వద్ద కూడా గ్రామ పెద్దలు ఇలా గ్రూపులు కట్టడంపై స్థానిక భక్తులు మండిపడుతున్నారు. దేవుడి వద్ద రాజకీయాలు చూపాడాన్ని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి... హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్!
Hyderabad, Telangana:Hyderabad Heavy Rainfall Alert Downpour: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ఆల్వాల్, బాలానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బేగంపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. నిన్న ఉదయం కూడా ఇలాగే వర్షం నమోదైన సంగతి తెలిసిందే. ఈరోజు వర్షం మరింత తీవ్రత సంత ఉంది. సెంట్రల్ హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల వర్షపాతం 70 మిల్లీమీటర్లు కూడా దాటిందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. ఎల్బీనగర్, మలక్ పేట్, నాంపల్లి, లక్డికాపూల్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ఉండటంతో బైకర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా వర్షంలోనే నీటిని తరలించే పనులు చేపట్టారు.
DANGEROUS DOWNPOURS ACROSS HYDERABAD CITY - WARNING 3 - 5.20 AM ⚠️
SEVERE DOWNPOURS and POWERFUL THUNDERSTORMS are happening in ENTIRE HYDERABAD CITY now. This is expected to continue till 6 or 6.15 AM later reduce to MODERATE RAINS.
Rainfall at few places can cross 60-70mm…
— Telangana Weatherman (@balaji25_t) September 13, 2026
హైదరాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున 5:20 గంటల నుండి వర్షం తీవ్రంగా ఉంది. ఉదయం 6:00 నుండి 6:15 గంటల మధ్య వర్షపాతం మరింత పెరిగింది. వర్ష తీవ్రత క్రమంగా తగ్గి, తేలికపాటి వర్షాలుగా మారవచ్చని వాతావరణ శాఖ సూచించింది, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ మధ్య, ఉత్తర ప్రాంతాల్లో 60 నుండి 70 మిల్లీమీటర్ల వరకు వర్షం నమోదైంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై వరద నీరు ప్రవహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, నిర్మాణంలో ఉన్న భవనాలకు సమీపంలో ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: ఆటోపైకి దూసుకెళ్లిన లారీ.. మితిమీరిన వేగానికి ముగ్గురు బలి! దత్తిరాజేరు వద్ద రోడ్డు ప్రమాదం!
Also Read: బంజారాహిల్స్, కూకట్పల్లి, మాదాపూర్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఇప్పటికీ నాన్‌స్టాప్!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఉరుములు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్ష ప్రభావం మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించింది. రాబోయే మూడు గంటల్లో యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల సమయానికి మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Konda Surekha: 'మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. ప్రజల్లోనే ఉంటాం': కొండా సురేఖ
Warangal, Telangana:Konda Surekha: 'పదవులు ఇవ్వాళ ఉంటాయి.. రేపు పోతాయి. పదవులు కాదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం' అని మాజీ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. పదవి అనేది అలంకారమే.. పదవీ లేకున్నా పనులు చేయొచ్చని పేర్కొన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తనకు బాధ లేదని.. అకారణంగా తొలగించడమే తనకు బాధ కలిగిస్తోందని మరోసారి చెప్పారు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోమని.. ప్రజల్లోనే ఉంటామని కొండా సురేఖ ప్రకటించారు.
మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం తొలిసారి వరంగల్‌లో తన అనుచరులు, కాంగ్రెస్ పార్టీలతో మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సమావేశమయ్యారు. నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు పెరిగాయని తెలిపారు. 'ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ నాయకులు అంతా ఇక్కడే పుట్టి.. పెరిగి ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను వరంగల్‌లో గెలవగానే కొన్ని రోజులకు ఆ సోకాల్డ్ నాయకుడు కడియం శ్రీహరి నా వెనుకాలే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి వచ్చాడు. అక్కడ ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల.. రెండు నెలలు కూడా ఆగకుండా అక్కడ ఆ జెండాతో గెలిచి ఇక్కడికొచ్చాడు' అని కడియం శ్రీహరిపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇప్పుడున్న కొంతమంది నిన్న మొన్న పదవి వచ్చినవాళ్లు కూడా ఆ రోజు గుండు సుధారాణి మీద అసమ్మతి పెట్టాలని ఆఓచించారు. కొండామురళి దగ్గరకు వచ్చి అసమ్మతి పెట్టొద్దు సహకరించాలని గుండు సుధారాణి దండం పెడితే ఆ రోజు అసమ్మతి పెట్టకుండా ఆపాడు' అని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. లేకపోతే ఆ రోజే గుండు సుధారాణి పదవి పోయి ఉండేదని చెప్పారు. 'మళ్లీ వచ్చి అన్నకేదో మంచి మాటలు చెప్పి కుడా చైర్మన్ వస్తే వస్తది లేకపోతే లేదు అన్న రాసి ఇయ్యు అని అడిగితే ఉదార స్వభావంతో కొండా మురళి రాసిచ్చాడు' అని వివరించారు. ఈ రోజు పదవి వచ్చాక గుండు సుధారాణి ఫోన్ కూడా చేయలేదని తెలిపారు.
తాను ఎంపీపీ నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చానని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొందరు ఉదయం ఒక పార్టీలో.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉంటున్నారని తన ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. తాను నమ్మిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశామని.. కొందరు వార్డు సభ్యుడిగా కూడా రాజీనామా చేయరని పేర్కొన్నారు. గతంలో కొందరు గుంటనక్కలు తమకు టికెట్ రాకుండా చేశారని.. కాంగ్రెస్ టికెట్ రాకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారని కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు.
మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం కొందరు అల్లర్లు చేయాలా అని ఫోన్లు చేసి అడిగితే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు మాజీ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్న కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కొండా దంపతులు ప్రకటించారు.
Chiranjeevi: అభిమానులకు 'చిరంజీవి' భరోసా.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్
Visakhapatnam, Andhra Pradesh:Chiranjeevi Life Insurance: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను తన సినిమాలతో వినోదం అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అభిమానులతో చక్కటి అనుబంధం పంచుకునే చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గొప్ప మానవతావాది అని, అభిమానులను కూడా సొంత మనుషులుగా ఆదరించే గొప్ప మనసున్న మనిషిగా మరోసారి చిరంజీవి నిరూపించుకున్నారు. తన అభిమానులకు బీమా కల్పించారు.
పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల బీమా పత్రాలను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి గొప్ప మానవతావాది అని, అభిమానులను కూడా సొంత మనుషులుగా ఆదరించే గొప్ప మనసున్న మహామనిషి అని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏ సినీ హీరో కూడా ఆలోచించని విధంగా అభిమానుల ఆరోగ్యం, ఆయా కుటుంబాల బాధ్యతను గుర్తించి సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల చొప్పున బీమా చేయించడం ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాద్యమైందని వెల్లడించారు. చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభిమానులకు చిరంజీవి నేరుగా బీమా పత్రాలను అందచేశారని తెలిపారు. అక్కడకు వెళ్లడానికి వీలు కాని వారికి ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రమేశ్ బాబు చెప్పారు. పెందుర్తి, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల అభిమానులకు ఈ బీమా పత్రాలు అందించే అరుదైన అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు.
'చిరంజీవి అభిమానిగా ఉన్న తనను రాజకీయ నాయకుడిని చేసిన నా ఆరాధ్య దైవం చిరంజీవి. ఆయన చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని ఎమ్మెల్యే రమేశ్ బాబు వివరించారు. రక్తం లభించని రోజుల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటుచేసి ఎందరో అభాగ్యులకు ప్రాణదానం చేసిన మహామనిషి చిరంజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కోయిలాడ శ్రీనివాసరావు, గల్లా కొండలరావు, పిఎస్ ఆనంద,పోలరౌతు వెంకటరమణ, మధు, బంటు కనకరాజు, దేముడు, వాసుపల్లి చల్లారావు, భార్గవ్, అయిత సింహాచలం, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, గొర్ల అప్పారావు, అయితే శ్రీనివాసరావు, ఆర్ఎస్ నాయుడు, సదరం భీమేశ్వరరావు, సేనాపతి సోమశేఖర్, ఉరిటి లక్కీ గోవింద్, ముక్కా సంతోష్, రాపర్తి కిశోర్, మడక బంరాజు, కోన మోహన్ కుమార్ నాయుడు, చీర రాజు తదితరులు పాల్గొన్నారు.
Dhee Raju Arrest: 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్..తెరపైకి మరో అమ్మాయి పేరు!
Hyderabad, Telangana:Dhee Dancer Raju Arrest: తెలుగు బుల్లితెరపై విశేష ప్రాచుర్యం పొందిన 'ఢీ-10' డ్యాన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచి, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే సంచలన ఆరోపణలతో అతడు కటకటాల పాలయ్యాడు. రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసులో మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బుల్లితెర, డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.Konda Surekha: వరంగల్ జిల్లా కార్యకర్తలతో కొండా సురేఖ దంపతుల కీలక భేటీ.. అసలు విషయం ఏమిటంటే..?..
Hyderabad, Telangana:Konda Surekha and Konda murali meeting with followers in warangal: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తాజాగా.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాజీమంత్రి కొండా సురేఖకు పిలుపు వచ్చింది. దీంతో మాజీమంత్రికి పెద్ద పదవిని ఇస్తారని టాక్ నడుస్తుంది. దీనిలో భాగంగా వరంగల్ లో కొండా సురేఖ, మురళి దంపతులు వరంగల్ జిల్లాలోని తమ పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. తొలుత హనుమ కొండలోని కొండా సురేఖ నివాసంలో భేటీని నిర్వహించాలని భావించారు.
కానీ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో వరంగల్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తొంది. దీనిలో తమ అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి వారితో సమాలోచనలు జరిపి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు బర్తరఫ్ తర్వాత కొండా సురేఖమీడియా సమావేశంలో అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖలను కూడా రాశాలు.
ఇక సుష్మిత సైతం తన తప్పుకు తన తల్లి మంత్రి పదవి నుంచి ఎలా బర్తరఫ్ చేస్తారని కన్నీళ్లను పెట్టుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖకు పిలుపు రావడం తీవ్ర ఉత్కంఠగా మారింది.
కొండా సురేఖ బీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారని వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. కానీ కొండా సురేఖ మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని, తన నియోజక వర్గం ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖకుకాంగ్రెస్ ఎలాంటి పదవి ఇస్తుందన్నదానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pawan Telangana Tour: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం..ఆ పార్టీ టార్గెట్ చేస్తూ జనసేనాని తెలంగాణ టూర్!
Hyderabad, Telangana:Pawan Kalyan Telangana Tour: తెలంగాణ రాజకీయ వేదికపై ప్రధాన పార్టీల మధ్య పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ కూడా తమ పట్టును పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే కంటెస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత మార్గాన్ని ఎంచుకున్నారు.
సామాజిక సమీకరణాల ఆధారంగా పవన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన తెలంగాణ నాయకులు ఇప్పటికే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ రాజకీయం సాగుతుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారని సమాచారం. అందులో భాగంగా మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక చర్యలు తీసుకోనున్నారు. అనంతరం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాల నిర్వహణకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పవన్ త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించనున్నారని జనసేన నాయకులు వెల్లడించారు.
గ్రేటర్ ఎన్నికలతో పాటు రాబోయే ప్రతీ ఎన్నికలోనూ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అయితే, పవన్ తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలు తెలంగాణలో జనసేనకు ఎంతవరకు కలిసివస్తాయి. రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: జనసేన కార్యకర్తల్ని టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
Also Read: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40% ఛార్జీల మోత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
