ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Thattupalle, Telangana:ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపాథ్యంలో మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసితండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాసాకితండా మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగుచేయడానికి అవకాశం లేకుండా పోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని.. తల్లిదండ్రుల వద్దకు చేర్చిన MLA నవీన్ యాదవ్..
Hyderabad, Telangana:Mla Naveen Yadav: ప్రజాసేవే పరమావధిగా భావించే ప్రజాప్రతినిధులు సమాజంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ మంచి మనుసును చాటుకుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డుపక్కన దిక్కుతోచక ఏడుస్తున్న ఓ చిన్నారిని చూసి.. చలించిపోయిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్.. తక్షణమే స్పందించి ఆ బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. తన ఉదారతను చాటుకున్నారు.
అసలు ఏం జరిగింది?
మంగళవారం రాత్రి షేక్‌పేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. కార్యక్రమం ముగించుకుని తన కాన్వాయ్‌లో తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో రోడ్డు పక్కన సుమారు ఆరేళ్ల వయస్సున్న ఓ చిన్నారి ఒంటరిగా నిలబడి భయంతో ఏడుస్తూ ఉండటాన్ని ఆయన గమనించారు. వాహనాలు వేగంగా వెళ్తున్న ఆ రద్దీ రోడ్డుపై చిన్నారి ఏడుస్తుండటంతో ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని పక్కకు ఆపేశారు..
వాహనం దిగి స్వయంగా బాలుడి వద్దకు వెళ్లిన నవీన్ యాదవ్.. అతడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చారు. బాలుడికి ధైర్యం చెప్పి ఆరా తీయగా.. తాను ఇంటి దారి మరిచిపోయి తప్పిపోయినట్లు ఆ చిన్నారి అమాయకంగా తెలిపాడు. బాలుడి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే, ఆలస్యం చేయకుండా వెంటనే టోలిచౌకి పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిందిగా కోరారు.
రంగంలోకి దిగిన టోలిచౌకి పోలీసులు..
ఎమ్మెల్యే సమాచారం అందించిన కొద్దిసేపటికే టోలిచౌకి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాలుడి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలతో పాటు అంతకుముందే నమోదైన మిస్సింగ్ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. కొద్ది సమయంలోనే బాలుడి నివాసాన్ని.. అతడి తల్లిదండ్రుల వివరాలను గుర్తించారు.
కంటికి రెప్పలా చూసుకునే.. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు.. పోలీసులు బాలుడిని సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమ ఒడికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు.. స్పీడ్‌గా స్పందించిన టోలిచౌకి పోలీసులకు బాలుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7,000 కేసులు నమోదు.. ఇకపై ప్రతీ విద్యార్థికి HIV పరీక్షలు..
Hyderabad, Telangana:Karnataka Mandates HIV Screening In Colleges: యువత భవిష్యత్తును కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా హెచ్ఐవీ (HIV) నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహనతో పాటు కౌన్సెలింగ్‌లను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇటీవలే 7000లకు పైగా కేసులు నమోదు కాగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యువతలోనే ఎక్కువ కేసులు..
ఇటీవలి కాలంలో నిర్వహించిన సర్వేల్లో 15 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ, యువకుల్లో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నివేదికలు వైద్య ఆరోగ్య శాఖను తీవ్ర కలవరానికి గురిచేశాయి. ముందస్తు అవగాహన లేకపోవడంతో పాటు సరైన సమాచారం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు.. నేరుగా కాలేజీల స్థాయిలోనే దీనిపై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది.
ప్రభుత్వం సూచిస్తుంది ఇదే..
హెచ్ఐవీని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. సకాలంలో సరైన చికిత్స అందించి.. బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు. మంచి జీవనశైలితో పాటు హెచ్ఐవీ సంక్రమించే విధానాలపై విద్యార్థులకు ఉన్న అపోహలను తొలగించడం ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపింది.. బాధితులకు మానసికంగా కొండంత అండగా నిలుస్తూ.. భవిష్యత్తుపై ధైర్యాన్ని నింపడం ప్రభుత్వ పని అని వెల్లడించింది.. హెచ్ఐవీ బాధితులను సమాజం చూసే కోణంలో మార్పు తీసుకురావడంతో పాటు వివక్షను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..
వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం వల్ల ఆధునిక వైద్య విధానాల ద్వారా బాధితులు సుదీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో జీవించవచ్చు. అంతేకాకుండా, ఇది ఇతరులకు వ్యాపించకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.. కాలేజీల్లో నిర్వహించే ఈ స్క్రీనింగ్ టెస్టుల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల ఫలితాలు, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను అత్యంత సిక్రెట్గా(Strict Confidentiality) ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.
ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. వారికి ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స, మందులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయంపై సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే ఇలాంటి విప్లవాత్మక అడుగులు వేయడం వల్ల రాబోయే తరాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Rains: హైదరాబాద్‌తో సహా తెలంగాణలో దంచికొట్టిన వర్షాలు.. ఎక్కడ ఎంత పడిందంటే?
Baddipadaga, Telangana:Hyderabad Raifall: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్లో తొలిసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆ పరిస్థితులు పోయి మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో తెలంగాణ నేల తడిచి ముద్దవుతోంది. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మండకొడిగా సాగిన వ్యవసయ పనులు ఇక జోరందుకోనున్నాయి. 24 గంటల్లో హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందో చూద్దాం.
Also Read: Heavy Rains: ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రాబోయే 36 గంటలు అత్యంత కీలకం
ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. అటవీ ప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 5.8 సెం.మీ వాన పడగా.. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
==> వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 4 సెం.మీ
==> వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8
==> కామారెడ్డి జిల్లా మొహమ్మద్‌నగర్ మండలం మొగ్దంపూర్‌లో 3.4 సెం.మీ
==> మెదక్ జిల్లా పాపన్నపేటలో 8.4 సెం.మీ
Also Read: Hyderabad Police: హైదరాబాద్‌లో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీ
రాగల కొన్ని గంటల్లో..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం వరకు పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రభుత్వం అప్రమత్తం
వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు పొంచి ఉన్న జిల్లాలకు అప్రమత్తం ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై సమీక్ష చేశారు. వివిధ శాఖలతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వర్షాలకు సంబంధించి జీ తెలుగు న్యూస్ లైవ్ చూడండి
కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణలో తెలంగాణ మంత్రుల బృందం..
Hyderabad, Telangana:Giri Pradakshina Kondagattu: తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం బుధవారం భక్తులతో కిటకిలాడిపోయింది.. స్వామివారి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే గిరి ప్రదక్షిణ మహోత్సవం అద్భుతంగా సాగింది. ఈ వేడుకలో రాష్ట్ర రవాణాతో పాటు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రజాప్రతినిధులతో పాటు నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో మంత్రులు, ప్రజాప్రతినిధులు భక్తులతో కలిసి నడిచారు. స్వామివారి నామస్మరణలతో కొండగట్టు గిరులు ప్రతిధ్వనించాయి.
రాష్ట్ర సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు..
గిరి ప్రదక్షిణ అనంతరం మంత్రుల బృందం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులు, జలాశయాలు జలకళతో ఉప్పొంగాలని ఆకాంక్షించారు. రైతన్నల పొలాలు పచ్చని పైర్లతో, పాడిపంటలతో వర్ధిల్లాలని.. ప్రతి ఒక్క కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని అంజన్నను వేడుకున్నట్లు తెలిపారు.
వేదాశీర్వచనం ..
ఆలయానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అర్చకులతో పాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేద పండితులు శ్లోకాలతో మంత్రులకు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలతో పాటు పవిత్ర తీర్థప్రసాదాలను ప్రధాన అర్చకులు ప్రజాప్రతినిధులకు బహూకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ఈవో, సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
ప్రతి పౌర్ణమికి ఈ గిరి ప్రదక్షిణ..
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఎంతో ఘనంగా సాగుతోంది. చాలా మంది భక్తులు భక్తిశ్రద్దలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ సమయంలో కొండల్లో కోతుల ఆహారం కోసం పండ్ల చెట్లను కూడా నాటుతున్నారు. అలాగే మరికొంతమంది ఈ సమయంలో సీడ్స్ బాల్స్‌ను కూడా చల్లుతున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టినవారికి బిగ్ షాక్!
Hyderabad, Telangana:NEET Controversy: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశ రాజధానిలో విద్యార్థులు తీవ్ర నిరసనలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. కొంతమంది తీవ్ర వ్యాఖ్యలతో పాటు అసభ్యకర పోస్టులు చేశారు. దీంతో పలువురు X ఖాతాదారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు జంతర్ మంతర్‌లో నిర్వహించిన సంసద్ చలో ఆందోళనల సమయంలో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున పోస్టులతో పాటు వీడియోలు పోస్ట్ చేశారు.. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని.. అనుచిత పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసిన పోస్టులను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ నిరంతరం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలిస్తోంది.. ఐటీ చట్టం (IT Act)తో పాటు కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను గుర్తించిన అధికారులు X యాజమాన్యానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.
ఆయా వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో పాటు, ఆ ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలు (పేరు, చిరునామాతో పాటు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, లాగిన్-లాగౌట్ ఐపీ వివరాలు) అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అభ్యంతరకర పోస్టులను ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు..
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
సామాజిక మాధ్యమాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ.. అసభ్యకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. నోటీసులకు ఖాతాదారులు ఇచ్చే సమాధానాలతో పాటు దర్యాప్తులో వచ్చే ఆధారాల ఆధారంగా న్యాయపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆగస్టు 12న అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం!
Hyderabad, Telangana:Total Solar Eclipse August 12: 2026 సంవత్సరంలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) ఈ ఏడాది ఆగస్టు 12న సంభవించనుంది. భారత సమయం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12న రాత్రి 11:17 గంటలకు మొదలు కాబోతోంది. ఆగస్టు 13న తెల్లవారుజామున 4:25 గంటల వరకు కొనసాగుతుందని ఖగోళ నిపుణులు తెలుపుతున్నారు.. ఇది ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో సూర్యగ్రహణం కావడం విశేషం..
భారత్‌లో కనిపిస్తుందా?
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్‌తో పాటు గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, ఉత్తర రష్యా, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో స్పష్టంగా కనిపించబోతోందని ఖగోళ నిపుణులు తెలుపుతున్నారు.. అయితే, ఆ సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల ఈ గ్రహణం భారత్‌లో కనిపించదని నిపుణులు తెలిపారు..
దేశంలో గ్రహణం కనిపించకపోవడం వల్ల భారత్‌లో ఎలాంటి సూతక్ కాలం (Sutak Kaal) వర్తించదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. కాబట్టి సూర్యగ్రహణ సమయంలో పాటించే నియమాలు, పూజా పునస్కారాల నియంత్రణలు లేదా ఇతర ఆధ్యాత్మిక ఆంక్షలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశిలో గ్రహణం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో సంభవిస్తోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భారత్‌లో కనిపించకపోయినా.. దీని ప్రభావం తప్పకుండా రాబోయే 15 రోజుల పాటు అన్ని ద్వాదశ రాశులపైనా కొద్దిపాటి మార్పులను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 3 రాశుల వారికి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది.. మరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు..
ఈ 3 రాశుల వారికి అదృష్టం..
మిథున రాశి:
సంపూర్ణ సూర్యగ్రహణం మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థికపరంగా ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది.. ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే, మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండడం చాలా మంచిది.
కన్యా రాశి:
ఈ పవర్ఫుల్ సంపూర్ణ సూర్యగ్రహణం ఎఫెక్ట్‌తో కన్యా రాశివారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు లేదా నూతన బాధ్యతలు మొదలుపెట్టేందుకు ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొత్త సంపాదన అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి:
పవర్ఫుల్ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో మీన రాశివారికి ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గొప్ప పురోగతి లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు వ్యాపారులకు లాభాలు మెండుగా లభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు కూడా వింటారు.
ఈ రాశుల వారు కాస్త జాగ్రత్త ఉండాల్సి ఉండాల్సి ఉంటుంది..
వృషభం, వృశ్చికంతో పాటు కుంభ రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఎన్నో రకాల మిశ్రమ లాభాలను అందిస్తుంది.. వీరికి కొన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నిపుణులు తెలుపుతున్నారు. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ఉగ్రరూపం దాల్చిన వాగులు.. జగిత్యాల - మంచిర్యాల మార్గంలో రాకపోకల బంద్!
Hyderabad, Telangana:Jagtial Mancherial Highway Traffic: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి.. వర్షపు నీరు రహదారులపైకి చేరడంతో జగిత్యాల నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారిపై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేసిన్నట్లు సమాచారం..
జగిత్యాల రూరల్ మండలం అనంతరం వద్ద ఉన్న ప్రధాన బ్రిడ్జితో పాటు, ధర్మపురి మండలం నెరేళ్ల సమీపంలో ఉన్న వంతెనపైకి భారీగా వరద నీరు చేరిన్నట్లు తెలుస్తోంది.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో ఈ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి మట్టం వంతెనలను ముంచెత్తడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..
ప్రధాన రహదారిపై నీటి ఉధృతి పెరగడంతో జగిత్యాల నుంచి మంచిర్యాల మార్గంలో ప్రయాణించే బస్సులు, లారీలతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనితో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి.. తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు.. నిత్యం విధులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరద నీరు తగ్గుముఖం పట్టే.. వరకు ఈ మార్గంలో ప్రయాణాలు చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదకర రీతిలో ఉన్న వంతెనలు లేదా కాజ్‌వేలు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని.. లేదా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జగిత్యాల పోలీసులతో పాటు జిల్లా యంత్రాంగం సూచించింది.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్‌డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Heavy Rains: ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రాబోయే 36 గంటలు అత్యంత కీలకం
Baddipadaga, Telangana:Heavy To Heavy Rains: ఎల్‌నిన్ ప్రభావంతో ఇన్నాళ్లు వర్షాభావంతో తల్లడిల్లిన తెలంగాణకు వరుణుడు భారీ ఊరట ఇస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలో కుంభవృష్టి పడుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 36 గంటలు అత్యంత కీలకమని ప్రకటించింది.
==> ఉత్తర తెలంగాణకు కుండపోత వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదవుతోంది. దీంతో వరద పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. నిన్న అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు పలు చోట్ల తీవ్రరూపం దాల్చాయి.
==> నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా నిరంతర వర్షపాతం నమోదవుతోంది. రాబోయే 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. అధికారులు స్థానికులకు సూచనలు చేశారు.
7 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు
సారంగాపూర్ (జగిత్యాల) – 140.8 మి.మీ
బుగ్గారం (జగిత్యాల) – 138 మి.మీ
నిర్మల్ – 128.3 మి.మీ
కడెం పెద్దూర్ (నిర్మల్) – 127.5 మి.మీ
వెల్గటూర్ (జగిత్యాల) – 123 మి.మీ
మామడ (నిర్మల్) – 118 మి.మీ
మల్లాపూర్ (జగిత్యాల) – 112.5 మి.మీ
ఎండపల్లి (జగిత్యాల) – 111.5 మి.మీ
సోన్ (నిర్మల్) – 108.3 మి.మీ
మక్లూర్ (నిజామాబాద్) – 108 మి.మీ
పాలిమెల (భూపాలపల్లి) – 101.8 మి.మీ
జుక్కల్ (కామారెడ్డి) – 100.3 మి.మీ
వాజేడు (ములుగు) – 98 మి.మీ
రామగుండం (పెద్దపల్లి) – 84.5 మి.మీ
పలుచోట్ల ఇప్పటికే 100 నుంచి 140 మి.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నాటికి జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో మొత్తం వర్షపాతం 180 నుంచి 200 మి.మీ.లకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 36 గంటల్లో ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయిలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
London Bonalu: అంగరంగ వైభవంగా లండన్‌లో బోనాల జాతర
England:Telangana NRIs Celebrates Bonalu At London And Get Together Watch Pride VideoSimhachalam Temple: సింహాచలం గిరిప్రదక్షిణ డ్రోన్ వీడియో
Visakhapatnam, Andhra Pradesh:Watch Drone Visuals Of Simhachalam Varaha Narasimha Swamy Giri PradakshinaSimhachalam: అత్యంత వైభవంగా సింహాచలం గిరిప్రదక్షిణ
Visakhapatnam, Andhra Pradesh:Devotees Heavy Rush For Simhachalam Giri Pradakshina Traffic Jam In Vizag Watch VisualsLondon Bonalu: లండన్‌లో బోనాల జాతర.. తెలంగాణ సంస్కృతి చాటిన ఎన్నారైలు
England:Telangana NRIs Celebrates Bonalu: విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని చాటి చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా బ్రిటన్‌లో బోనాల పండుగ చేసుకున్నారు. తెలంగాణవాసులంతా ఒక్క చోటకు చేరి బోనాల జాతరలో పాల్గొన్నారు. దీంతో బ్రిటీష్ గడ్డపై తెలంగాణ ప్రజలు బోనాలు చేసుకుని ప్రత్యేకత చాటారు. పెద్ద ఎత్తున జరిగిన లండన్ బోనాలకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను తెలంగాణ ఎన్నారైలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బ్రిటన్‌లో స్థిరపడిన తెలంగాణవాసులు నలుమూలల నుంచి సుమారు 2,500కి పైగా ప్రవాస కుటుంబసభ్యులు బోనాల వేడుకలో పాల్గొన్నారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎన్నారైలు సందడి చేశారు. ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ బోనాల జాతరకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణలో చేసుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి.. తొట్టెల ఊరేగింపు చేయగా.. అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబసమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో బోనాల పండుగ చేసుకున్నారు. బ్రిటన్‌లో కూడా అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశంగా నిలిచిందని.. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సూచించారు.
'ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తమయ్యేలా కృషి చేస్తున్నారు. దీనికి కారణం మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడమే. అన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుండి నాయకత్వం వహించిన ఉద్యమశిఖరం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాలి' అని టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి తెలిపారు. టాక్ సంస్థ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించిన టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల.. తెలంగాణ ఎన్నారైలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలందరూ బోనాలతో తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని టాక్ సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి తెలిపారు.
బోనాల సంబరం ఇక్కడ చూడండి
బోనాల వేడుకల్లో శ్రీకాంత్ జెల్లా, గణేష్ కుప్పాల, సుప్రజ పులుసు, సురేష్ బుడగం, మట్టా రెడ్డి, క్రాంతి రేతినేని, పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగిళి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి , శ్రీవిద్య , దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్ , లత , పావని, కార్తీక్ ,స్నేహ, అమరేశ్వరి, సాయి రావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా తదితరులు ఉన్నారు.
