Back
506381
ఖమ్మంలో ఆదివాసీ గిరిజనుల ర్యాలీ
Mannegudem, Telangana
ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవం ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈక్రమంలో నగరంలోని నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈనేపాథ్యంలో ఆదివాసీల తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కలెక్టర్ కూడా వారితో కలిసి కాసేపు నృత్యం చేసారు. తమ హక్కుల సాధనకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు కోరారు.
1
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తి 33 వార్డులో అనాధ శరణాలయమునకు పాత దుస్తులు దానం చేయాలంటూ ఆటోలో బస్తీలో తిరుగుతున్న మహిళతో పాటు యువకుడిని బస్తీ ప్రజలు పోలీసులకు పట్టించారు. బస్తీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం పాత దుస్తుల కోసం వచ్చిన యువకుడు బస్తీలో ఒంటరిగా ఉన్న మహిళతో దురుసుగా మాట్లాడి మహిళ వద్ద ఉన్న బంగారం దొంగతనం చేయడానికి ప్రయత్నించగా మహిళ కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని యువకుడిని బందించి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
0
Share
Report
Mahabubabad, Telangana:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేసారు. ఈ రైడ్ లో రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ రెడ్ హ్యాండెండ్ గా పట్టుపడ్డారు. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై.రమేష్ విచారణను కొనసాగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించి సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేయడం కోసం లంచం డిమాండ్ చేసాడు.
0
Share
Report
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతంగ సాయిధ పోరాట వారోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, అంకుశం గ్రామంలో సీనియర్ నాయకులు మూల శంకర్ గౌడ్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం రాచరిక పాలనకు, కరుడు గట్టిన భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వాస్తవ చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టాలనుకుంటున్న బీజేపీ ఆటలు సాగనీయమన్నారు.
2
Share
Report
Mahabubabad, Telangana:
ఖమ్మం ప్రకాశ్ నగర్ రైల్వే సమీపంలో ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. శరీర బాగాలు విడిపోయి మృతదేహం కనిపించగా రైల్వే పోలీసులు గుర్తించి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోలీసుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.
1
Share
Report
Mahabubabad, Telangana:
ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. బ్రహ్మణబజార్ శివాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన 32 అడుగుల మట్టి గణపతి నేలమట్టం అయ్యాడు. నిమజ్జనానికి క్రేన్ సహాయంతో వాహనం పైకి తరలిస్తుండగా ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఖమ్మంలోనే అతిపెద్ద మట్టి గణపతిగా ఈ విగ్రహం పేరుంది.
1
Share
Report
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
0
Share
Report
Kannal Rural, Telangana:
సెప్టెంబర్ 11 తేది నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 ఇంక్లైన్ రడగంబాల బస్తిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పట్టణ కార్యదర్శి రాజమౌళి ఆవిష్కరించారు. సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
0
Share
Report
Kannal Rural, Telangana:
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు
కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.
0
Share
Report
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా సజ్న షఫీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కే.సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్ కే.సుభాన్ పాష ,కోశాధికారిగా కే.నవీన్ ఎన్నికయ్యారు.
వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలిసి మెలసి పనిచేసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
0
Share
Report
Bellampalle, Telangana:
1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగ ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహాను బావుడు బాలగంగాధర్ తిలక్ అని ఎస్సీ మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో గుర్తించాలన్నారు.
2
Share
Report