కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి:బీఆర్ఎస్
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Rj mahvash mocking comments on smriti mandhana palash muchhal wedding: ప్రస్తుతం స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ల పెళ్లి వాయిదా అంశం నెట్టింట హట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు రూమర్స్ వైరల్ చేస్తున్నారు .మొత్తంగా కొంత మంది పలాష్ ముచ్చల్ కు మరో యువతితో ఎఫైర్ ఉందని, అది తెలిసి స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇటీవల తరచుగా పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ముంబైకి తీసుకెళ్లిమరీ ఆయనకు చికిత్స అందించారు.
పలాష్ సోదరి, తల్లి కూడా ఈ విషయంపై తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. అదే విధంగా స్మృతి మంధాన తండ్రి అంటే పలాష్ ముచ్చల్ కు చాలా గౌరవమని పలాష్ తల్లి చెప్పింది. ఈ క్రమంలో పలాష్ ముచ్చల్ మరో యువతితో చేసిన వాట్సాప్ చాట్స్, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. మరోవైపు స్మృతి మంధాన తన ఇన్ స్టాలోని నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్ కు చెందిన అన్ని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారు.ఈ రచ్చ నేపథ్యంలో
యుజ్వేంద్ర చాహల్ ప్రియురాలు అని గతంలో వార్తలలో ఎక్కిన కొరియోగ్రాఫర్ ఆర్జే మహ్వష్ తన ఇన్ స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. స్మృతి మంధాన,పలాష్ రచ్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో మహ్ వష్ మాట్లాడుతూ .. మగాళ్లు ఒట్టి మాయగాళ్లంటూ ఫైర్ అయ్యింది.
ఎవరిని నమ్మడానికి వీల్లేదని, ఒకవేళ అమ్మాయిలు పెళ్లి కుదిరితే సోషల్ మీడియాలో అతగాడి ఫోటోను పబ్లిక్ లో పెట్టాలని , అతను ఎవరితో అయిన డేటింగ్ లో ఉన్నాడో అని పూర్తిగా ఎంక్వైరీ చేసుకొవాలన్నారు. అంతేకాకుండా..ఈ విషయంలో మోహమాటం ఉంటే తనకు చెప్పాలని, తాను అలాంటి వారి సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంది.
కనీసం ఫస్ట్ నైట్ కు ముందు మీ పార్టనర్ గురించి పూర్తిగా తెలుసుకుని ప్రొసీడ్ అవ్వాలన్నారు. ఒక వేళ తనకు పెళ్లి సెట్ అయిన వారం ముందు సోషల్ మీడియాలో అతని ఫోటోను షేర్ చేస్తానని, అతను ఎవరితో అయిన డేటింగ్ చేశాడా.?.. ఒక వేళ చేస్తే వారు తనకు మెస్సెజ్ చేయాలని కూడా చెప్తానంటూ మహ్ వష్ వీడియోను రిలీజ్ చేసింది.
Read more: Palash Muchhal: మరో యువతితో పలాష్ రొమాన్స్.?... స్మృతి మంధాన పెళ్లి వాయిదా వెనుక షాకింగ్ నిజాలు.!.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు.. స్మృతి మంధాన, పలాష్ ల గురించే ఈ వీడియోపెట్టారు కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. దీనికి మాత్రం మహ్ వష్ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.