icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Anil Kumar Yadav Politics: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్‌బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!

Nellore, Andhra Pradesh:

Anil Kumar Yadav Quits YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరుపక్షాలు 2029 సార్వత్రిక ఎన్నికలను సైతం లక్ష్యంగా చేసుకుని ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కూటమి ఏకగ్రీవం చేసుకుంటే, ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు భవిష్యత్ ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రకటన నెల్లూరు వైఎస్సార్సీపీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా..
రాబోయే ఎన్నికల్లో తాను బరిలో నిలవకపోవచ్చని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకంటూ ఒక పేజీ, చరిత్ర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాను ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ 2014, 2019లలో వరుసగా టికెట్లు ఇచ్చి, గుర్తించే స్థాయికి తీసుకువచ్చి మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ వచ్చినా, రాకపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన తృప్తి తనకు సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.

నెల్లూరు సిటీలో మారుతున్న సమీకరణాలు..
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్‌కు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ బాధ్యతలు దక్కాయి. అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా అనిల్ స్థానంలో జిల్లాకే చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనిల్‌ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించగా, ఆయన ఓటమి చెందారు.

అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని ఖలీల్ అహ్మద్‌కు కేటాయించగా, ప్రస్తుత మంత్రి పి.నారాయణ చేతిలో ఖలీల్ 72,489 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండటంతో, అక్కడ అనిల్ కు మళ్లీ సీటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనిల్ ముందస్తుగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో జగన్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!

Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Yerragondapalem Abortion: ఫోన్ సూచనలతో అబార్షన్.. వికటించిన వైద్యం..ఐదు నెలల గర్భిణి దుర్మరణం!

Erragondapalem, Andhra Pradesh:

Yerragondapalem Abortion News: స్థానికుల సమాచారం ప్రకారం.. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన గర్భిణి యర్రగొండపాలెం మండల పరిధిలోని మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) ఐదు నెలల గర్భిణి. ఆమెకు భర్త షేక్ చిన్నబాజీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న 'డాక్టర్స్ ప్రజా వైద్యశాల'కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. అయినప్పటికీ సిబ్బంది ఆమెను చేర్చుకుని చికిత్స అందించేందుకు సిద్ధపడ్డారు.

ఫోన్ సూచనల ఆధారంగా సిబ్బంది నిర్వాకం గురువారం ఉదయం సదరు ఆసుపత్రి సిబ్బంది ఓ వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించి, మాబున్నీకి అబార్షన్ చేయాలని నిర్ణయించారు. వైద్యుడు ఫోన్ ద్వారా అందించిన సూచనల మేరకు, ఎలాంటి శస్త్రచికిత్స అనుభవం లేని కాంపౌండర్ శ్యామ్, నర్సు కలిసి పిండాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించడంతో మాబున్నీ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది.

జాతీయ రహదారిపై బంధువుల ఆందోళన వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న సదరు ప్రైవేటు ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై దేవకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. భర్త చిన్నబాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనుమతులు లేకుండా దశాబ్ద కాలంగా నిర్వహణ ఈ ప్రైవేటు వైద్యశాలను దాదాపు పదేళ్ల క్రితం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో ఓ ప్రభుత్వ వైద్యుడు దీనిని నడిపించగా, ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఆయన బదిలీ కావడంతో అప్పటి నుంచి కాంపౌండర్, నర్సులే డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.

Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!

Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం, నింగిలో అద్భుతం..'బ్లడ్‌మూన్‌'గా కనువిందు చేయనున్న చంద్రుడు!

Hyderabad, Telangana:

Lunar Eclipse Blood Moon: ఖగోళ ప్రియులకు కనువిందు కలిగించే అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానుంది. నేడు ఆకాశంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఖగోళ ప్రక్రియలో దాదాపు 96 శాతం చంద్రుడిని భూఛాయ కమ్మేయనుంది. మిగిలిన కొద్ది భాగం మాత్రమే సూర్యకాంతితో వెలుగుతూ కనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పున్నమి చంద్రుడిని 'స్టర్జన్ మూన్' అని పిలుస్తారు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తూ 'రెడ్ మూన్'గా దర్శనమివ్వనున్నాడు.

భారత్‌లో కనిపించదు..
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని భారత్‌లో నేరుగా వీక్షించే అవకాశం లేదు. గ్రహణం ఏర్పడే సమయం మన దేశంలో పగటి వేళ కావడమే ఇందుకు ప్రధాన కారణం. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:03 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. ఉదయం 9:42 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో చంద్రుడి శోభ అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. అయితే ఆ సమయానికి భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లో సూర్యోదయం అయి ఉండటం వల్ల చంద్రుడు కనిపించడు.

కనిపించే ప్రాంతాలు..'బ్లడ్ మూన్' విశేషాలు..
ఈ పాక్షిక చంద్రగ్రహణం పశ్చిమ యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలతో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది పాక్షికంగా కనిపిస్తుంది. పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో గ్రహణ గరిష్ట సమయం సూర్యోదయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పశ్చిమ దిశగా ఆకాశంలో దాదాపు భూమికి సమాంతరంగా కనిపిస్తాడు.

ఉదయించే సూర్యుడి కాంతి చంద్రుడిపై పడినప్పుడు భూ వాతావరణం ఒక ఫిల్టర్‌లా పనిచేసి, ఎరుపు రంగు కాంతిని మాత్రమే ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రబింబం ఎరుపు-గోధుమ రంగుల కలయికలో ఆకర్షణీయంగా కనిపిస్తూ 'బ్లడ్ మూన్' అనుభూతిని కలిగిస్తుంది.

మళ్లీ 2029లోనే..
ఇటువంటి చంద్రగ్రహణం మళ్లీ 2029 వరకు కనిపించదు. ఆ ఏడాది జూన్‌లో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారే 'బ్లడ్ మూన్ ఎక్లిప్స్' సంభవించనుందని నాసా (NASA) పేర్కొంది. కాగా, ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also Read; నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Nepal Floods: నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

Namarjung, Gandaki Province:

Nepal Floods Death Toll: నేపాల్, పొరుగున ఉన్న టిబెట్‌లలో ఆకస్మిక వరదల బీభత్సానికి మృతుల సంఖ్య 392కు చేరింది. మొత్తం 1,468 మంది గల్లంతవగా, అందులో 290 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించగా, సహాయక చర్యల కోసం భారత్ 47.5 టన్నుల మానవతా సాయాన్ని పంపింది. హిమానీనదం కూలి లెండే నదికి అడ్డంకి ఏర్పడటంతో ఈ విపత్తు సంభవించింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన కృత్రిమ సరస్సుతో మరో ముప్పు పొంచి ఉంది.

290 మంది భారతీయుల ఆచూకీ కోసం గాలింపు..
ఈ విపత్తులో చిక్కుకున్న భారత పౌరులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా 290 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కాలేదని, ఇప్పటివరకు 84 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షించబడిన వారిలో నిర్మాణంలో ఉన్న త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు.

టిబెట్ వైపు చిక్కుకున్న మరో 200 మంది భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరగా.. నేపాల్, చైనా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపడుతున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అదనంగా, నేపాల్‌కు భారత్ 47.5 టన్నుల మందులు, ఆహార ప్యాకెట్లు, మానవతా సహాయాన్ని పంపించింది.

భారీగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు
నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో మంచు, రాళ్లతో కూడిన భారీ హిమపాతం సంభవించింది. ఇది లెండే నది ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకోగా, అనంతరం ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో నీరు, బురద, శిథిలాలు ఉధృతంగా దిగువకు పోటెత్తాయి. ఈ వరద ధాటికి రసువా జిల్లాతో పాటు తిమురే, రసువాగధి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
 
వరదల కారణంగా..
35 మోటారు వాహనాల వంతెనలు, 45 వేలాడే వంతెనలు ధ్వంసమయ్యాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు, జలవిద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సహాయక చర్యలు.. సిబ్బంది గల్లంతు
రహదారులు తెగిపోవడంతో రక్షణ చర్యలు క్లిష్టతరంగా మారాయి. అయినప్పటికీ నేపాల్ పోలీసులు హెలికాప్టర్ల ద్వారా 796 మందిని, భూమార్గం ద్వారా మరో 796 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రసువా నుంచి 11 మంది భారతీయులతో సహా 27 మంది విదేశీ పర్యాటకులను కాపాడి కాఠ్మండుకు చేర్చారు.

మరోవైపు విధుల్లో ఉన్న 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బంది, 28 మంది నేపాల్ పోలీస్ సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా గల్లంతయ్యారు. అలాగే జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 160 మంది ఆచూకీ తెలియరాలేదు.

కొత్తగా పొంచి ఉన్న ముప్పు
భోటే కోషి నదీ మూలం వద్ద కొత్తగా ఏర్పడిన ఒక ఆనకట్ట సరస్సు అధికారులను కలవరపెడుతోంది. ఈ సరస్సులో ఇప్పటికే దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరగా, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ ఈ ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు భోటే కోషి, త్రిశూలి నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

Also REad: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Raksha Bandhan Gift Ideas: రక్షా బంధన్ 2026.. తోబుట్టువులను ఆశ్చర్యపరిచే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్!

Hyderabad, Telangana:

Raksha Bandhan Gift Ideas 2026: తోబుట్టువుల మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, అమితమైన అనురాగాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్. ఈ రక్షా బంధన్ 2026 పండుగకు మీ తోబుట్టువుల కోసం బహుమతులు కొనడం ఆలస్యమైందా? చింతించకండి! చివరి నిమిషంలో కూడా మీ ప్రేమను మరియు ప్రయత్నాన్ని ప్రతిబింబించేలా, వారి హృదయాలను హత్తుకునే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. బహుమతి ఎంత ఖరీదైనది అనేదానికంటే, దాని వెనుక ఉన్న మీ భావమే ఇక్కడ ముఖ్యం.

1) వ్యక్తిగతీకరించిన ఫోటో ఫ్రేమ్: మీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు లేదా ఈ మధ్యకాలంలో దిగిన హృదయానికి దగ్గరైన ఏదైనా అందమైన ఫోటోను ఫ్రేమ్ చేసి బహుమతిగా ఇవ్వండి. ఇది మాటలు లేకుండానే మీ పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చి మీ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తుంది.

2) చేతితో రాసిన లేఖ లేదా జ్ఞాపకాల స్క్రాప్‌బుక్: హృదయపూర్వకంగా చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ మరే బహుమతికీ ఉండదు. మీ మధ్య ఉన్న సరదా ముచ్చట్లు, పాత జ్ఞాపకాలు, మీ తోబుట్టువుపై మీకున్న కృతజ్ఞతను ఈ లేఖ ద్వారా వ్యక్తపరచండి. ఇది చాలా సులువైనది కానీ అత్యంత అర్థవంతమైనది.

3) గిఫ్ట్ కార్డ్‌లు: వారికి ఏమి కొనాలో తెలియక సతమతమవుతుంటే, వారికి ఇష్టమైన బ్రాండ్ యొక్క గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం బెస్ట్. దీనివల్ల వారు తమకు నచ్చిన వస్తువును స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.

4) చాక్లెట్లు లేదా స్వీట్ హ్యాంపర్‌లు: చివరి నిమిషంలో ఎంపిక చేసుకోగలిగే మధురమైన గిఫ్ట్ ఇది. ఒక నోరూరించే చాక్లెట్ల పెట్టె లేదా పండుగ స్వీట్ హ్యాంపర్ మీ తోబుట్టువు ముఖంలో తక్షణమే చిరునవ్వును రప్పిస్తుంది.

5) చర్మ సంరక్షణ లేదా గ్రూమింగ్ కిట్: ఇది ఒక ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన బహుమతి. ఒక మంచి స్కిన్ కేర్ లేదా గ్రూమింగ్ కిట్ అందించడం ద్వారా, మీరు వారి రోజువారీ సంరక్షణపై ఎంతగా శ్రద్ధ చూపుతున్నారో తెలియజేసినట్లవుతుంది.

6) ప్రత్యేకంగా తయారు చేయించిన మగ్ లేదా కుషన్: ఒక కప్పు లేదా కుషన్ (దిండు)పై మీ తోబుట్టువుకు నచ్చేలా అందమైన సందేశాన్ని లేదా చిత్రాన్ని ముద్రించి (కస్టమైజ్ చేసి) ఇవ్వండి. ఇది చిన్న ప్రయత్నమే అయినా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

7) పుస్తకాలు లేదా జర్నల్స్: మీ తోబుట్టువుకు పుస్తకాలు చదవడం లేదా రాయడం అలవాటు ఉంటే, ఒక మంచి పుస్తకం లేదా అందమైన జర్నల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం చివరి నిమిషంలో చేయగలిగే చక్కటి ఎంపిక.

8) యాక్సెసరీలు (వాచ్, బ్రాస్‌లెట్, చెవిపోగులు): స్టైలిష్ వాచ్, అందమైన బ్రాస్‌లెట్ లేదా చెవిపోగుల జత వంటి చిన్న వస్తువులు కూడా వారి లుక్‌ను తక్షణమే మెరుగుపరుస్తాయి. తక్కువ శ్రమతో గొప్ప అనుభూతిని ఇచ్చే బహుమతి ఇది.

9) పెర్ఫ్యూమ్: ఒక మంచి సువాసన ఇచ్చే పెర్ఫ్యూమ్ ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఇది చాలా క్లాసిక్ బహుమతిగా నిలవడమే కాకుండా, చివరి నిమిషంలో కూడా చాలా సులభంగా లభిస్తుంది.

10) అనుభూతినిచ్చే బహుమతి (సినిమా, విందు లేదా విహారయాత్ర): కొన్నిసార్లు చేతికి ఇచ్చే వస్తువుల కన్నా మనసుకు ఇచ్చే అనుభూతులు మిన్న. వారితో కలిసి ఒక సినిమా చూడటం, హోటల్‌కు వెళ్లి విందు ఆస్వాదించడం లేదా ఒక చిన్న విహారయాత్రను ప్లాన్ చేయడం ద్వారా నాణ్యమైన సమయం గడపవచ్చు. ఎలాంటి భౌతిక బహుమతికైనా ఇది ఏమాత్రం తీసిపోదు.
 
అంతిమంగా రక్షా బంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడం మాత్రమే కాదు. అది జీవితాంతం నిలిచిపోయే ప్రేమ, ఆప్యాయతతో కూడిన తీపి జ్ఞాపకాల కలయిక. చివరి నిమిషంలో ఇచ్చే ఏ చిన్న బహుమతి అయినా మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. కాబట్టి, సమయం లేదని ఒత్తిడికి గురికాకుండా మీ తోబుట్టువులపై మీకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను వ్యక్తపరచండి.

Also Read: మీ సోదరులకు రాఖీ ఈ సమయంలో కడితే శ్రేష్టం అంటున్నారు పండితులు..!!

Also Read: తెలుగులో రాఖీ విషెష్‌, మధురమైన కొటేషన్లు, ఫోటోలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tomorrow Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఉద్యోగులకు కూడా

Wadgaon, Maharashtra:

School Holiday For Tomorrow: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు బ్యాంకులకు భారీ శుభవార్త. రేపు అంటే శుక్రవారం అందరికీ సెలవు లభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఈ సెలవు అన్నీ ప్రాంతాల్లో లేవు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సెలవు ఉంది. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్ల మధ్య ఆత్మీయత పంచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సెలవుల ప్రకటించారు. ఒక రోజు సెలవు పెడితే చాలు మొత్తం మూడు రోజుల సెలవులు లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిందూవులకు అత్యంత ప్రధానమైన పండుగ రాఖీ. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని ప్రజలు రాఖీ పండుగగా చేసుకుంటారు. ఈ పండుగను తోబుట్టువులు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటుండగా.. శ్రావణ పౌర్ణమి కొన్ని రోజుల్లో అత్యంత పర్వదినంగా భావిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారికంగా సెలవు ఉంది. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చేసుకునే రక్షా బంధన్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంది. అయితే తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు మాత్రం సెలవు లేదు. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు.. ఆయా విభాగాల్లో రేపు సెలవు లేదు. 

భారతదేశంలోని కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా అన్నీ విద్యాలయాలకు సెలవు ఉంది. ఈ రాష్ట్రాలలో రక్షా బంధన్‌ను అత్యంత వైభవంగా చేసుకుంటుండడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం సెలవు ఉంటుంది.

సెలవులు ఉన్న రాష్ట్రాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,లలో రక్షా బంధన్‌కు సంబంధించి ఎటువంటి సాధారణ ప్రభుత్వ పాఠశాల సెలవు ఉండదు.

ఇక్కడ సెలవు లేదు
రాఖీ పండుగను దేశంలోని పలు రాష్ట్రాల్లో చేసుకోరు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఉండదు. దీంతో ఆ రాష్ట్రాల్లో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయి. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో సెలవు లేదు. 

ప్రైవేటు విద్యాలయాలు
రాఖీ పండుగ సందర్భంగా ప్రైవేటు విద్యాలయాలకు కూడా సెలవు ఉంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత సెలవుల క్యాలెండర్‌లో కూడా సెలవు ఉంది. అయితే కొన్ని పాఠశాలలు ఆప్షనల్‌ హలీడేగా ప్రకటించాయి.

0
0
Report
Advertisement
Advertisement

Harish Rao Arrest: ఉద్రిక్తంగా మారిన టీఎన్జీవో ధర్నా.. బీఆర్ఎస్ హరీష్ రావు అరెస్ట్..హనుమకొండలో హైటెన్షన్!

Hyderabad, Telangana:Harish Rao Arrested in Hanamkonda: తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ పై కాంగ్రెస్ సర్కారును ఏకీపారేస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. దీనిలో భాగంగా హనుమకొండలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
0
0
Report

Pending DAs: దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల 6 పెండింగ్‌ డీఏలు ఒక రికార్డు

Warangal, Telangana:

Dearness Allowance Record: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చేపట్టగా వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోలు చేపట్టిన ఉద్యోగుల ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే' అని ప్రకటించారు.

'జీతాల్లో డబ్బులు కట్ చేస్తూ.. ఆసుపత్రులతో అగ్రిమెంట్ లేకుండా ఈహెచ్ఎస్ మోసం. మీరు నడుపుతున్నది సర్కారా? లేక సర్కస్సా రేవంత్‌ రెడ్డి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15 శాతం కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్యం ఉందని అసహనం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం.. నేడు సచివాలయంలోకి నో ఎంట్రీ ఉందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మారుస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు. ప్రభుత్వం నుంచి కనీస చలనం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం కేవలం 1 శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్ఎస్ ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 1.5 శాతానికి పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరికీ కట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇంట్లో రిటైర్డ్ తల్లిదండ్రులు ఉంటే వాళ్లకూ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవడం తప్ప వారికి ఒరిగేదేమీ లేదని చెప్పారు.

'రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? భారతదేశంలో ఎక్కడైనా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం ఉందా? ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం మీదే. ఇది అత్యంత సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కలిసి దండం పెట్టి అడిగినా ఈ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి ఉద్యోగులను, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే వారిని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు.. కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయి' అని విమర్శించారు.

'తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'జీపీఎఫ్ లోన్ కోసం వెళ్దామంటే కనీసం వినే నాథుడే లేడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి, అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడు' అని విమర్శించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, జీవో 97 కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 

'సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వరంగల్‌లో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పటిదాకా వారి సమస్యను పరిష్కరించలేదు. కనీసం సచివాలయంలోకి కూడా అనుమతించడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లేనని రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top