ఖమ్మం: రైతు కుటుంబానికి న్యాయం చేయాలి
Dhamsalapuram, Telangana:చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ముజమ్మిల్‌ఖాన్, ఎమ్మెల్సీ మధు, జి ల్లా అధ్యక్షుడు కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట్ వీరయ్య తదితరులను కలిసిన నాయకులు వినతిపత్రం అందించారు. రైతు ఆత్మహత్యలకు కారణమైన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్ ను సన్మానించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Job Calendar: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. భారీ పోస్టులతో 'జాబ్ క్యాలెండర్' విడుదల
Nuzendla, Andhra Pradesh:AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. డీఎస్సీ, గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో తొలి దశలో 1,523 పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీన రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
రెండో దశలో గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్1కు సంబంధించి 149 పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయనుంది. ఇక పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్ఐ 182 పోస్టుల భర్తీ ఏపీ ప్రభుత్వం చేయనుంది. అక్టోబర్ 15వ తేదీన దసరా, దీపావళి కానుకగా నిరుద్యోగులకు మూడో దశలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 2,311 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మూడో దశలో గ్రూప్-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. వాటిలో డిప్యూటీ తహశీల్దార్ 200 పోస్టులు ఉన్నాయి. మూడో దశలో ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో 1,638 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే జాబ్ క్యాలెండర్లో స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే 2,991 పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదలతో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీపడుతున్న అభ్యర్థులు ఇక పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించనున్నారు.
Thalliki Vandanam 2026: ఏపీ విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ ఖరారు!
Vijayawada, Andhra Pradesh:Thalliki Vandanam 2026 Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల, ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థుల కుటుంబాలకు విద్యా పరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేయనున్నారు.
అర్హులు, లబ్ధిదారులు..
ఈ విద్యాసంవత్సరం నూతనంగా పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన చిన్నారులతో పాటు, జూనియర్ కళాశాలల్లో చేరిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. గత నెలలో లబ్ధి పొందలేకపోయిన అర్హులకు కూడా ఈ విడతలో నగదు జమ కానుంది. దాదాపు 2.78 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్లు సమాచారం.
విడుదల తేదీ, చివరి గడువు..
తాజా అధికారిక నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనుంది. అయితే, విభిన్న సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి, అలాగే ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్ ఉన్నవారికి ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. కొత్త దరఖాస్తుల సమర్పణకు, వివరాల సవరణకు ఆగస్టు 25వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది.
తల్లిదండ్రులు చేయాల్సిన పనులు
అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందని విద్యార్థుల తల్లులు వెంటనే తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ కొద్దిపాటి సాంకేతిక ప్రక్రియలను ఆగస్టు 25 లోపు పూర్తి చేసుకుంటే, ఆగస్టు 30న ఎటువంటి అంతరాయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.13,000 జమ అవుతాయి.
Also Read: AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..ఎన్నికలు ఎప్పుడంటే?
Also REad; Vizag School Tragedy: విశాఖలోని ప్రైవేట్ స్కూల్లో చిన్నారి మృతి..అసలు కారణం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyper Aadi Speech: 'అవును వాళ్లని చిరంజీవే తొక్కేశాడు'..హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్!
Hyderabad, Telangana:Hyper Aadi Speech Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవిపై సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్, విమర్శలపై నటుడు హైపర్ ఆది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అందర్ని తొక్కేశాడు అని వస్తున్న ప్రచారంపై బలంగా మాట్లాడాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో మాట్లాడిన హైపర్ ఆది విమర్శకులకు అదిరిపోయే రిప్లే ఇచ్చారు.Chiranjeevi Ram Charan: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు రామ్‌చరణ్ సడెన్ సర్ప్రైజ్..ఫ్యాన్స్ కోలాహలం!
Hyderabad, Telangana:Ram Charan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఎంతో సెలబ్రిటీలతో పాటు సగటు అభిమాని కూడా ఎదురుచూస్తున్నాడు. అయితే చిరంజీవి పుట్టినరోజు నాడు ఆయన్ను ప్రత్యక్ష్యంగా చూసి శుభాకాంక్షలు తెలియజేయాలని ఎంతో ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో చిరంజీవి లేకపోవడం వల్ల ఆయన కుమారుడు రామ్ చరణ్ బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.Autos Bandh: ప్రయాణికులకు అలర్ట్.. రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆటోలు బంద్
Baddipadaga, Telangana:Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్‌లో పాల్గొంటామని స్కూల్ వ్యాన్ల యజమానులు ప్రకటించారు.
ఈసీఐఎల్‌లో ర్యాలీ
తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 300 ఆటోలలో 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. ఆటో మోటారు రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈవీ వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేసి తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని విమర్శించారు. అన్ని కులాలకు చెందినవారు నేడు ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. రేపటి నుంచి చేపట్టనున్న సమ్మెకు ప్రభుత్వం దిగిరాక తప్పదని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్ల బంద్‌కు కవిత మద్దతు
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టిన బంద్‌కు మాజీ ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆటో కార్మికుల బంద్‌కు తాము మద్దతునిస్తున్నట్ఉల తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) సహా పలు ఆటో యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఆటో కార్మికులు బంద్ పోస్టర్ ఆవిష్కరించారు.
Train Fuel Consumption: రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో తెలుసా? నమ్మలేని నిజం!
Hyderabad, Telangana:Train Fuel Consumption Per KM: భారతీయ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. మనందరం ఎప్పుడో ఒకప్పుడు రైలు ప్రయాణం చేసే ఉంటాం కానీ, ఒక భారీ రైలు కేవలం ఒక కిలోమీటర్ దూరం సాగడానికి ఎంత డీజిల్ లేదా విద్యుత్ ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
రైలు మైలేజీ అనేది కారు లేదా బైక్ లాగా ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. రైలు రకం, బోగీల సంఖ్య, మొత్తం బరువు, ప్రయాణించే వేగం, మార్గంలో అది ఆగే స్టాపుల సంఖ్య వంటి అనేక అంశాలపై ఈ ఇంధన వినియోగం ఆధారపడి ఉంటుంది.
ప్యాసింజర్ రైళ్ల మైలేజీ, ఇంధన వినియోగం..
డీజిల్ ఇంజిన్‌తో నడిచే, సుమారు 12 బోగీలు కలిగిన ఒక సాధారణ ప్యాసింజర్ రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి దాదాపు 6 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. దీని ప్రకారం చూస్తే, కేవలం ఒక లీటర్ డీజిల్‌తో ఈ రైలు సుమారు 170 మీటర్ల దూరం మాత్రమే ముందుకు సాగగలదు. ప్యాసింజర్ రైళ్లు చిన్న, పెద్ద స్టేషన్లలో తరచుగా ఆగుతూ ఉంటాయి. ఇలా పదే పదే బ్రేకులు వేయడం, మళ్లీ రైలు వేగాన్ని పెంచడం వల్ల ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.
ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల పరిస్థితి ఏమిటి?
మరోవైపు 12 బోగీలు ఉండే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక కిలోమీటర్ దూరం వెళ్లడానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ సరిపోతుంది. అంటే ఒక లీటర్ డీజిల్‌తో ఇది దాదాపు 220 మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇంధన వినియోగం ప్యాసింజర్ రైళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. అయితే 24 బోగీలు ఉండే భారీ సూపర్‌ఫాస్ట్ రైలుకు మాత్రం కిలోమీటర్‌కు సుమారు 6 లీటర్ల డీజిల్ అవసరం కావచ్చు. బోగీల సంఖ్య పెరగడంతో రైలు మొత్తం బరువు కూడా పెరుగుతుంది, అదే ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుంది.
ఎలక్ట్రిక్ రైళ్లకు ఎంత ఖర్చవుతుంది?
ప్రస్తుతం భారత రైల్వేలో విద్యుదీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగం పెరుగుతోంది. ఒక ఎలక్ట్రిక్ రైలు కిలోమీటర్ ప్రయాణానికి సుమారు 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. గత ఏడాది ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6.50 గా ఉన్నప్పుడు, కిలోమీటర్‌కు విద్యుత్ ఖర్చు సుమారు రూ.130 గా ఉండేది. ప్రస్తుత ధరల ఆధారంగా చూస్తే, ఈ ఖర్చు దాదాపు రూ. 150 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఇందులో కేవలం విద్యుత్ ఖర్చు మాత్రమే లెక్కించినట్లు. నిర్వహణ, సిబ్బంది తదితర ఖర్చులు ఇందులో ఉండవు. చివరగా చెప్పాలంటే, రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం ఇంధనం లేదా విద్యుత్ వినియోగంతో మాత్రమే నిర్ణయించలేము. రైలు బరువు, బోగీల సంఖ్య, వేగం, స్టాపులు, మార్గ పరిస్థితులు వంటి అనేక అంశాలు దాని ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
Also Read: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!
ALso Read: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలకు మళ్లీ E10 పెట్రోల్ అందుబాటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: ఇదెందిరా సామి.. తాగుబోతులా తూలుతున్న నాగు పాము.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Cobra behaves like drunk man funny video: సోషల్ మీడియాలో ఇటీవల పాముల వీడియోలు ఎక్కువగా వైరల్‌గా మారుతున్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోబ్రాల వీడియోలకు ఇటీవల ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఎక్కడ పాములు కన్పించిన భయంతో పారిపోకుండా వాటితో స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది అయితే పాములను కొరికి తమప్రతాపం వాటి మీద చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పాములు కొన్నిసార్లు చాలా వెరైటీగా ప్రవర్తిస్తాయి. ప్రస్తుతం ఒక పాము చాలా తాగినట్లు ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
নেশায় চুর কিং কোবরা? কাদা-ঘাসে টলমল সাপের ভাইরাল ভিডিও দেখে তাজ্জব নেটপাড়া ! #KingCobra #Cobra #ViralVideo #SnakeVideo #DrunkSnake #WildlifeVideo #ViralSnakeVideo #CobraVideo #ShockingVideo #AnimalViral #SnakeLover #Nature #ViralNews #TrendingVideo #SnakeViral #WowVideo… pic.twitter.com/N3Uu9FdU7U
— Bangla Hunt Official (@BanglaHunt) August 22, 2026
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాము తప్పతాగిన వ్యక్తిలా ప్రవర్తించింది. తాగిన వ్యక్తి ఏవిధంగా అయితే తూలుతాడో అచ్చం నాగు పాము అదే విధంగా చేసింది. బ్యాలెన్స్ తప్పినట్లు ముందుకు, వెనక్కు తూలుతు రోడ్డుపక్కన పడగ విప్పింది. కోబ్రా ప్రవర్తన చూసి అందరు షాక్ అయ్యారు. ఇదెంటీ ఇలా చేస్తుందని అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
ఆ తర్వాత దాన్ని కాస్త నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ పాము మాత్రం అచ్చంతాగిన వాళ్లుఎలా బ్యాలెన్స్ తప్పి తూలుతారో అలా తూలుతూ రచ్చ చేసింది. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇలా చేస్తుందేంట్రా అంటూ షాక్ తో నోరెళ్ల బెడుతున్నారు. మరోవైపు పాములతో జాగ్రత్తగా ఉండాలని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాటు వేస్తాయని కొంత మంది చెబుతున్నారు. కానీ పాములను చంపడం చేయోద్దని, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వాలనిచెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ప్రభంజనం.. తొలిరోజే 'ఇరుముడి' ఆల్‌టైమ్ రికార్డ్!
Hyderabad, Telangana:Irumudi Collection Day 1: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిజమైన వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ..
ప్రపంచవ్యాప్త కలెక్షన్లు తొలిరోజే రూ.24.20 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. దేశీయ నికర (నెట్) వసూళ్లను పరిశీలిస్తే.. రూ.14.80 కోట్లు సాధించి రవితేజ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అలాగే దేశవ్యాప్తంగా రూ.17.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.
మరోవైపు విదేశీ మార్కెట్లో రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లతో 'ఇరుముడి' సంచలనం సృష్టించింది. థియేటర్ ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా 2,673 షోలలో సగటున 76.9% ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం..
ఈ భారీ కలెక్షన్ల సునామీలో 'ఇరుముడి' తెలుగు వెర్షన్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 2,591 షోల ద్వారా ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ.14.78 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సగటున 79% ఆక్యుపెన్సీ నమోదు కాగా, రాత్రి వేళల్లో ప్రదర్శించబడిన షోలలో ఏకంగా 88.08% అత్యున్నత ఆక్యుపెన్సీ లభించడం విశేషం. ప్రాంతాలవారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల గ్రాస్, కర్ణాటకలో రూ.1.50 కోట్లు, తమిళనాడులో రూ.34 లక్షల వసూళ్లు సాధించింది.
గుండెలను హత్తుకునే భావోద్వేగాలు..
ఈ సినిమాలో రవితేజ 'త్రినాథ్' అనే అయ్యప్ప స్వామి భక్తుడైన, మద్యం అలవాటు ఉన్న తండ్రి పాత్రలో తన కెరీర్లోనే అత్యుత్తమమైన భావోద్వేగ నటనను కనబరిచారు. ఆయన కుమార్తె 'మణికంఠ' (బేబీ నక్షత్ర) పాత్రతో సాగే ఎమోషనల్ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సీనియర్ నటుడు సాయికుమార్ పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తండ్రీ కూతుళ్ల బంధంతో పాటు సమాజానికి ఒక అద్భుతమైన సామాజిక సందేశాన్ని కూడా ఈ చిత్రం అందించింది. తొలిరోజే లభించిన అత్యంత అద్భుతమైన పాజిటివ్ టాక్, భారీ వీకెండ్ బుకింగ్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 'ఇరుముడి' మరిన్ని సంచలన రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: బిగ్‌బాస్ 10 హంగామా షురూ.. ఈసారి హౌస్‌లోకి ఆ టాలీవుడ్ స్టార్ విలన్?
Also Read: సామాన్యుడిగా మొదలుపెట్టి వేల కోట్లకు వరకు..మెగాస్టార్ చిరంజీవి సంపద వివరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఒకదానిపై ఒకటి కాటేసుకుంటున్న రెండు కోబ్రాలు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Cobras Bite Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ స్నేక్ రెస్క్యూయర్ మురళీవాలే హౌసలా (Murliwale Hausla) ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకే జాతికి సంబంధించిన రెండు అత్యంత ప్రమాదకరమైన కోబ్రాలు ఒకదానికొకటి దాడి చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు రెండు పాములు ఎందుకు దాడి చేసుకుంటున్నాయి? ఈ వీడియోలో ఉన్న నిజం ఎంత? ఇది ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఈ ఘటనలో రెండు అత్యంత ప్రమాదకరమైన కోబ్రాలు ఎదురుపడి తీవ్ర ఆగ్రహంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు. సాధారణంగా పాములు ఇతర జీవులపై లేదా తమను తాము కాపాడుకోవడానికి దాడి చేయడం లేదా వేటాడడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఇక్కడ ఒక కోబ్రా మరో కోబ్రా శరీర భాగాన్ని నోటితో బలంగా కాటేసి.. ఒకదానికొకటి దాడి చేసుకుంటున్న దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
ఈ వింతను అక్కడున్న స్థానికులతో పాటు పిల్లలు చూసి భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే సమాచారం ప్రకారం.. పాములను పట్టుకుని స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. సాధారణంగా ఒక పాము మరో పాము పై దాడి చేయడం సోషల్ మీడియాలో చూడడం చాలా అరుదు.. అంతేకాకుండా ఇలా పాములు పాములు దాడి చేసుకోవడం ఎప్పుడూ ఎవరు చూసి ఉండరు. అయితే ఈ వీడియోని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. కుటుంబాల్లో లేదా సమాజంలో వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒకరితో ఒక్కరు గొడవ పడతారో.. సరిగ్గా ఇలాంటి విభేదాల కారణంగానే పాముల మధ్య కూడా ఇలాంటి గొడవలు వచ్చి దాడికి దిగుతూ ఉంటాయని స్నేక్ క్యాచర్ తెలుపుతున్నారు. పాములు తమ ఆధిపత్యం కోసం లేదా అవి నివసించే పరిస్థితి కోసం ఇలా దాడి చేసుకోవడం సర్వసాధారణమైన అని ఆయన చెబుతున్నాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Bites Video: కింగ్ కోబ్రాను కెలికిన సింహం.. కంటిపై కాటేయడంతో మృతి.. వీడియో!
Hyderabad, Telangana:King Cobra Attacks Lion Video: అడవికి రారాజైనా.. అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలతో తలపడితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నిరూపించే ఓ అరుదైన ఘటన ఇది.. బలానికి ప్రతిరూపమైన సింహం చేసిన ఒకే ఒక చిన్న తప్పు.. దాని ప్రాణాలను బలి తీసుకుంది.. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాపై దాడి చేయడమే మృగరాజు జీవితంలో అతిపెద్ద తప్పిదం అయిపోయింది.. అవును ఈ వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. మీరు కూడా అంతే అంటారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా అడవిలో ఏ జంతువైన సింహం గర్జనకు భయపడి పరుగులు తీస్తూ పారిపోతూ ఉంటాయి.. అయితే ఎదురుగా ఉన్నది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రా అన్న విషయాన్ని గ్రహించని ఓ సింహం.. ఎలాంటి ఆలోచన చేయకుండా ఒక్కసారిగా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. క్షణాల వ్యవధిలోని కింగ్ కోబ్రా ఎదురు దాడి చేసి సింహం కంటిపై నేరుగా కాటు వేసేసింది..
పాము కాటు వేసిన కొద్దిసేపట్లోనే సింహానికి ఆ ప్రమాదకరమైన నాగుపాము విషం తీవ్రత అర్థం కాలేకపోయినప్పటికీ.. కొద్ది క్షణాల్లోనే కింగ్ కోబ్రాకు సంబంధించిన తీవ్రమైన న్యూరోటాక్సిక్ విషం సింహం శరీరమంతట వేగంగా వ్యాప్తి చెందడం మొదలయ్యింది.. విష తీవ్రత పెరిగే కొద్దీ.. మృగరాజు పరిస్థితి విషమంగా మారింది. ఆ సింహం దిక్కుతోచని పరిస్థితులను నెమ్మదిగా అటు, ఇటు తిరగడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..
విషం నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపడంతో సింహం పిచ్చి దానిలా ప్రవర్తించడం ప్రారంభించింది.. అటు ఇటు పరుగులు పెడుతూ.. ఏ కారణం లేకపోయినా.. గట్టిగా గర్జిస్తూ.. చివరికి ఏమి చెయ్యాలో తెలియక గడ్డిని తినడం కూడా ప్రయత్నించింది.. ఆ తర్వాత నిలబడే శక్తి లేక ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
నేలపై పడిపోయిన సింహానికి శరీరం మొత్తం తీవ్రమైన వణుకుతో పాటు ఫిట్స్ లాంటి ఒక అరుదైన కుదుపు రావడం మీరు గమనించవచ్చు. శ్వాస వేగం సాధారణం కంటే ఎక్కువగా పెరిగిపోయి.. కళ్లు పూర్తిగా తెచ్చుకోలేకుండా పోయాయి.. ప్రత్యేకించి కింగ్ కోబ్రా కాటు వేసిన సింహం కన్ను విషం ప్రభావంతో నీలిరంగులోకి మారిపోవడం మీరు గమనించవచ్చు.. తీవ్రమైన నొప్పితో కొద్దిసేపు విలవిలలాడి.. చివరికి అడివికి రారాజైన సింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. అయితే, ఈ సంఘటన పాతదే అయినప్పటికీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Temper Vamsi Bigg Boss: బిగ్‌బాస్ 10 హంగామా షురూ.. ఈసారి హౌస్‌లోకి ఆ టాలీవుడ్ స్టార్ విలన్? కంటెస్టెంట్ల హాట్ లిస్ట్ ఇదే!
Hyderabad, Telangana:Temper Vamsi Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన పదో సీజన్ తో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచింగ్ ఎంతో వైభవంగా జరగనుంది.
ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (కామన్ పీపుల్) కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా గోల్డెన్ ఛాన్స్ కల్పించారు మేకర్స్. ఇందులో భాగంగానే 'అగ్నిపరీక్ష సీజన్ 2' పేరుతో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
హౌస్‌లోకి 'టెంపర్' విలన్ ఎంట్రీ!
మరోవైపు, ఈ ప్రతిష్టాత్మక సీజన్ కోసం హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఫైనలైజ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కన్ఫర్మ్డ్ జాబితాలో ఒక ఆసక్తికరమైన పేరు ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆయనే టాలీవుడ్ ప్రముఖ స్టార్ విలన్ టెంపర్ వంశీ.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టెంపర్'లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో, కరుడుగట్టిన విలన్‌గా వంశీ రౌద్రం కురిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. వంశీ నటించిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలు.. అత్తారింటికి దారేది, భరత్ అనే నేను, సాహో, భీష్మ, వకీల్ సాబ్, హిట్ 2, దేవర వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. అలాగే వరుణ్ తేజ్ రీసెంట్ సినిమా 'కొరియన్ కనకరాజు'ల్లో నటించాడు.
వెండితెరపై విలన్‌గా హడలెత్తించిన ఈ టాలెంటెడ్ యాక్టర్, నిజ జీవితంలో ఎలా ఉంటాడు? బిగ్‌బాస్ హౌస్ లో తన రియల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు? అనేది ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల క్రేజీ లిస్ట్ ఇదేనా?
ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్టాత్మక బిగ్‌బాస్ 10వ సీజన్లో పాల్గొనబోతున్నారంటూ మరికొంతమంది క్రేజీ సెలబ్రిటీల పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ప్రచారంలో ఉన్న ఆ సెలబ్రిటీల లిస్ట్‌లో ఉన్న వాళ్ల వివరాలు తెలుసుకుందాం.
1) పల్లవి గౌడ
2) తేజస్విని గౌడ
3) జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్
4) బుల్లితెర గ్లామర్ డాల్ వర్ష
5) పవిత్ర
6) గ్లామరస్ యాంకర్ వర్షిణి
7) యూట్యూబ్ సెన్సేషన్ నందూస్ వరల్డ్ నందు
8) యంగ్ హీరో చంద్రహాస్
9) సీనియర్ నటి జ్యోతి
10) రాయల్ ఎంసీ రమణ
11) ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్
ఇలా తమదైన నటన, టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రముఖులలో చివరకు ఎవరెవరు ఈ రంగుల హౌస్‌లోకి అడుగుపెట్టి రచ్చ చేస్తారో చూడాలంటే.. సెప్టెంబర్ మొదటి వారంలో జరగబోయే గ్రాండ్ లాంచ్ వరకు ఆగాల్సిందే!
Also Read: చిన్నప్పటి నుంచి నా హీరో, నా అన్నయ్య చిరంజీవే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Also Read: సామాన్యుడిగా మొదలుపెట్టి వేల కోట్లకు వరకు..మెగాస్టార్ చిరంజీవి సంపద వివరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: వామ్మె..రెండు కింగ్ కోబ్రాల పడగలపై కొడుతూ ఆడుకున్న కోతి.. వీడియో..
Hyderabad, Telangana:Monkey Plays With Cobras Video Watch: సోషల్ మీడియా లో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు, వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో చాలా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కంటికి కనిపించగానే ఎంతో భయం కలిగించే రెండు భారీ విష సర్పాలు, వాటి మధ్య ఒక కోతి ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రదేశంలో ఒక కోతిని గొలుసుతో కట్టించారు.. ఆ కోతికి అతి దగ్గరలోనే రెండు నాగుపాములు పడగవిప్పి వీకరంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు.. సాధారణంగా నాగుపాము ముసలి కొడితే ఎంత జీవి అయినా గజగజ వణుకుతూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గొలుసుతో కట్టి ఉంచిన కోతి ఏమాత్రం భయపడకుండా అదే పాములతో ఉండడం మీరు గమనించవచ్చు..
అయితే కోతికి ముందు భాగంలో ఉన్న నాగుపాము పడగవిప్పి కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. కోతి ఏమాత్రం బెదరకుండా తన చేతులతో పాములకు సంబంధించిన పడగలపై ప్రేమతో దాడి చేసిన దృశ్యాలు కూడా క్లియర్‌గా చూడొచ్చు.. మరోవైపు ఇంకో పాము కూడా పక్కనే చుట్టుకొని ఉండి పడగవిప్పి నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఏ క్షణంలో ఏ పాము కాటు వేస్తుందోనని చూసేవారికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు లైకులతో పాటు కామెంట్లు చేస్తున్నారు. చాలామంది ప్రమాదకరమైన విష సర్పాల మధ్య కూడా ఆ కోతి ఎంతో స్నేహపూర్వకంగా.. ధైర్యంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నానని కామెంట్లు పెడుతున్నారు.. మరి కొంతమంది కోతిని గొలుసుతో కట్టేసి ప్రమాదకరమైన పాముల మధ్య ఇలాంటి విన్యాసాలు చేయించడం అత్యంత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తెలంగాణలో శాతవాహనుల కాలంలో ఇసుక రేణువులతో వెలసిన శివలింగ ఎక్కడ ఉంది?
Hyderabad, Telangana:Kotilingala Siddeshwara Temple History: తెలంగాణ నేలపై వెలసిన పురాతన.. అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండలంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది.. గోదావరి నదితో పాటు పెద్ద వాగు పవిత్ర సంగమ తీరాన కొలువైన ఈ దివ్య క్షేత్రం చాలా ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా బాసిల్లుతూ వస్తోంది. అయితే, ఈ ఆలయం వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటో? పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..
శాతవాహనుల మొదటి రాజధానిగా కోటిలింగాల చరిత్రలో నిలిచిపోయింది.. శాతవాహన మూలపురుషుడు శిముకుడు పాలించిన ఆధారాలతో పాటు పురాతన నాణాలు ఇక్కడి పురావాస్తు శాఖలు తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం లోనే సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మట్టి కోటలతో పాటు ప్రత్యేకమైన బురుజులు ఉండేవట.. కోట ఈశాన్యం భాగంలో ఎత్తైన గడ్డపై శివలింగాన్ని ప్రతిష్టించడంతో.. దీనిని మొదటగా కోటిలింగం అని పిలుచుకునే వారట.. ఆ తర్వాత కారకరమైన కోటిలింగాల అని పిలిచారని చరిత్ర చెబుతోంది..
త్రేతా యుగంలోనే పెద్ద పెద్ద మునులంతా కలసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారట.. కాశీ నుంచి లింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆంజనేయస్వామిని కోరారట.. అయితే ప్రతిష్ట ముహూర్తం సమీపిస్తున్న సమయంలోనే.. మునుగు గోదావరి నది నుంచి ఇసుకను తెచ్చి కోటి ఇసుక రేణువులతో లింగాన్ని ప్రతిష్టించారట.. అందుకే ఇక్కడి స్వామిని కోటేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. అనంతరం కాశీ నుంచి వచ్చిన హనుమంతుడి ఆగ్రహాన్ని తగ్గించేందుకు.. ఆయన తెచ్చిన కాశీ విశ్వేశ్వర లింగాన్ని కూడా సమీపంలోనే ఆ మునులంతా ప్రతిష్టించారట.. భక్తులందరూ మొదటగా హనుమంతుడు తెచ్చిన లింగాన్ని దర్శించుకున్న తర్వాతే ప్రధాన కోటీశ్వరుడిని పూజించడం ఇక్కడి సాంప్రదాయంగా వస్తోందట.. ఆలయంలోని దక్షిణ దిశగా ఉత్తర ముఖంగా సిద్దేశ్వర స్వామి లింగం కూడా ఇక్కడ దర్శనం ఇవ్వడం విశేషం..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
పెద్దవాగుతో పాటు గోదావరి కలిసే పవిత్ర సంగమ ప్రాంతాన్ని మునేరుగా పిలుస్తారు.. ప్రాచీన కాలంలో మునులు ఇక్కడ స్నానాలు చేసేవారట.. ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ఆలయ తీరం వరకు రావడం వల్ల ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.. మహాశివరాత్రి తో పాటు కార్తీక మాసాలు, గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల రద్దీతో ఈ క్షేత్రం కిటకిట లాడిపోతుంది. ఈ క్షేత్రానికి జగిత్యాలతో పాటు కరీంనగర్ మంచిర్యాల ధర్మపురి నుంచి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. ఇది ధర్మపురి నుంచి 19 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 55 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala: తిరుమలలో వృద్ధులు, చిన్నారుల భద్రతపై అలర్ట్.. టీటీడీ కీలక సూచనలు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Police Instructions: తిరుమలకు భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొండ ప్రాంతం కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం వెళ్తుండగా తోపులాట.. గందరగోళం నెలకొంటున్నాయి. త్వరగా దర్శనం కావాలనే తొందరలో కుటుంబంతో వచ్చిన వారిలో కొందరు తప్పిపోతున్నారు. వారిలో వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుమలలో వారి భద్రతపై విజిలెన్స్, పోలీసులు ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. అయితే భక్తులకు కూడా కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు తప్పిపోతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల సూచనలు
చిన్నపిల్లలు, వయోవృద్ధుల జేబులో వారి పేరు, చిరునామా, కుటుంబసభ్యుల ఫోన్ నంబర్ వంటి వివరాలను కాగితంపై రాసి ఉంచాలి. లేదా ఈ వివరాలతో గుర్తింపు కార్డు తయారు చేసి చిన్నారులు, వృద్ధులకు ధరింపజేయాలి. అనుకోకుండా వారు తప్పిపోయిన సందర్భంలో ఈ వివరాల ద్వారా కుటుంబ సభ్యులను సులభంగా గుర్తించి, వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఈ సూచనలను పాటిస్తూ చిన్నపిల్లలు, వయోవృద్ధుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తిరుమల పోలీసులు కోరారు.
ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ యువ నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పటేల్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మతో పాటు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. నిన్న శుక్రవారం శ్రీవారిని 78,057 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 33,406 మంది భక్తులు సమర్పించరాఉ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు రాగా.. లడ్డూ విక్రయాలు 4.62 లక్షలు జరిగాయి. అన్నప్రసాదాలు 2.40 లక్షల భక్తులు స్వీకరించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనంలో భక్తులకు దర్శనం 12 గంటల సమయం పడుతోంది.
Chiranjeevi Net Worth: సామాన్యుడిగా మొదలుపెట్టి వేల కోట్లకు వరకు..మెగాస్టార్ చిరంజీవి సంపద వివరాలు!
Hyderabad, Telangana:Chiranjeevi Assets Net Worth: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనా ప్రతిభ, గ్రేస్ ఫుల్ డాన్సులతో టాలీవుడ్లో 'మెగాస్టార్'గా ఎదిగిన చిరంజీవి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సంపద వివరాలను తెలుసుకుందాం.
సంపద, ఆదాయ వనరులు
వివిధ జాతీయ మీడియా నివేదికల అంచనాల ప్రకారం.. చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ.1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించి, భారత్‌లోనే అత్యధిక పారితోషికం అందుకునే అగ్రశ్రేణి నటుడిగా నిలిచారు.
సినిమాల ద్వారా వచ్చే భారీ రెమ్యునరేషన్‌తో పాటు, వాణిజ్య ప్రకటనలు, పలు వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన సంపద స్థిరంగా వృద్ధి చెందింది.
విలాసవంతమైన నివాసాలు, రియల్ ఎస్టేట్..
మెగాస్టార్ చిరంజీవి ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక, ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక అత్యంత విలాసవంతమైన విల్లా ఉంది. మార్కెట్ నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ.28 కోట్ల పైచిలుకు ఉంటుంది. దీనితో పాటు బెంగళూరు సహా దేశంలోని పలు ప్రధాన నగరాలలో విలువైన స్థిరాస్తులు, ఫాంహౌస్‌లు కలిగి ఉన్నారు.
రాయల్ గ్యారేజ్, లగ్జరీ జీవనశైలి..
మెగాస్టార్ చిరంజీవి కార్ల సేకరణ చాలా ప్రత్యేకమైనది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. అగ్రశ్రేణి కార్లలో ఒకలైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఆయన వద్ద ఉన్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం కూడా ఉంది.
'స్వయంకృషి'తో అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించిన చిరంజీవి జీవితం ఎప్పటికీ ఒక అద్భుతమైన మైలురాయే!
Also Read: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
